
ముంబై: విమానయాన సంస్థ ‘గోఎయిర్’ తాజాగా ‘మాన్‌సూన్ సేల్’ పేరుతో పరిమితకాల ప్రత్యేకమైన టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ ఇందులో భాగంగా ఒకవైపు ప్రయాణానికి పన్నులు, ఫీజులు కలుపుకుని రూ.1,299 నుంచి విమాన టికెట్లను ఆఫర్ చేస్తుంది.
జూన్ 5 నుంచి 7 వరకు మూడు రోజులపాటు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు జూన్ 24 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. సాధారణంగా జూలై క్వార్టర్‌లో ట్రావెల్ బిజినెస్ డల్‌గా ఉంటుంది.
అందుకే దేశీ విమానయాన కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ ధరకే టికెట్లను అందిస్తుంటాయి. గోఎయిర్ నెట్‌వర్క్‌లోని అన్ని ఫ్లైట్స్‌కు మాన్‌సూన్ సేల్ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఆఫర్‌లో భాగంగా బుక్ చేసుకున్న టికెట్లు నాన్‌రిఫండబుల్ అని పేర్కొంది. రూట్, ఫ్లైట్, సమయం ఆధారంగా టికెట్ ధరల్లో మార్పు ఉంటుంది.