దొడ్డబళ్లాపురం: విమానం ఆలస్యమైందంటూ ఆగ్రహించిన ప్రయాణికులు రన్‌వేపైకి వచ్చి విమానాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగింది. బెంగళూరు నుంచి థాయ్‌ల్యాండ్‌లోని పుకెట్ నగరానికి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరాల్సిన గో ఎయిర్‌బస్ విమానం సాంకేతిక కారణాల వల్ల టేకాఫ్ కాలేదు. దీంతో విమానంలోని 120 మంది ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
పైలట్‌తోపాటు ఎయిర్‌హోస్టెస్‌లు తమ డ్యూటీ సమయం దాటిపోయిందంటూ వెళ్లిపోయారు. మరో మార్గం చూపుతామని అధికారులు చెప్పారు. అయితే ఉదయం 8 గంటలయినా మరో విమానం ఏర్పాటు చేయలేదు. అయిదారు గంటలపాటు విమానంలోనే కూర్చున్న ప్రయాణికులు చివరకు ఓపిక నశించి, రైన్‌వే పైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇతర విమానాలకు ఎదురెళ్లి ఆటంకం కలిగించడానికి యత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. పుకెట్‌కు మరో విమానం ఏర్పాటు చేయాలని భావించినా బీసీఏఎస్ నుంచి అనుమతి లభించలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో కొందరు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment