సాక్షి, శ్రీహరికోట : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 5.43 గంటలకు నింగిలోకి ఎగరాల్సిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 ను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ప్రారంభించిన కౌంట్‌డౌన్ ప్రక్రియను నిలిపివేశామన్నారు. కాగా ప్రయోగాన్ని నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఇస్రో అధికారులు ట్విటర్‌లో ఈ విషయాన్ని దృవీకరించారు. జియోస్టేషనరీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను భారత్ ప్రయోగించడం ఇదే తొలిసారి. ఓ ప్రాంతానికి సంబంధించిన రియల్ టైమ్ ఇమేజ్‌లను ఈ ఉపగ్రహం అందిస్తుంది. ప్రకృతి విపత్తులను కూడా ఇది మానిటర్ చేస్తుంది. జీశాట్-1 బరువు 2275 కిలోలు. శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్‌ను నుంచి జీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగిస్తారు. 18 నిమిషాల తర్వాత జీశాట్-1 ఉపగ్రహం... జీటీవో కక్ష్యలోకి చేరుకుంటుంది. జియోస్టేషనరీ ఆర్బిట్ భూమికి సుమారు 36వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జీశాట్-1 ఉపగ్రహం ఏడేళ్ల పాటు పనిచేయనున్నది.
The launch of GISAT-1 onboard GSLV-F10, planned for March 05, 2020, is postponed due to technical reasons. Revised launch date will be informed in due course.
— ISRO (@isro) March 4, 2020
Comments
Please login to add a commentAdd a comment