
బెంగళూరు: సమాచార ఉపగ్రహం జీశాట్–11 ప్రయోగం వాయిదా పడింది. మే 25న ఫ్రెంచ్ గయానాలోని కౌరు నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉండగా అది వాయిదా పడినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉపగ్రహానికి మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున ప్రయోగాన్ని వాయిదా వేశామనీ, అంతరిక్షంలోకి ఎప్పుడు పంపుతామో త్వరలోనే వెల్లడిస్తామని ఇస్రో డైరెక్టర్ కె.శివన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment