అమెరికా అంతరిక్ష పరిశోధనల ప్రైవేట్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌తో.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యింది. అత్యంత అధునాతన భారీ సమాచార ఉపగ్రహం జీశాట్20 (GSAT N2) అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సుమారు 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. అనంతరం హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఇస్రో చీఫ్ సోమనాథ్.. బృందానికి అభినందనలు తెలియజేశారు.
Liftoff of GSAT-N2! pic.twitter.com/4JqOrQINzE
— SpaceX (@SpaceX) November 18, 2024
స్పేస్‌ఎక్స్ ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ అనేది తెలిసిందే. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్‌ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం. జీశాట్20 బరువు సుమారు 4,700 కేజీలు. ఇస్రోకు అందుబాటులో ఉన్న లాంఛ్ వెహికల్స్ అంత బరువును మోసుకెళ్లే సామర్థ్యం లేదు. అందుకే స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. ఆ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ జీశాట్20ను నింగిలోకి మోసుకెళ్లింది.
Deployment of @NSIL_India GSAT-N2 confirmed pic.twitter.com/AHYjp9Zn6S
— SpaceX (@SpaceX) November 18, 2024
అడ్వాన్స్‌డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది. జీశాట్‌ఎన్2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. అంతేకాదు.. భారత్‌లోని మారుమూలు ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా ఈ జీశాట్20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది.
ఇదీ చదవండి: మన బాహుబలికి అంతబలం లేదంట!
Comments
Please login to add a commentAdd a comment