నేడు జంట శాటిలైట్ల ప్రయోగం
న్యూఢిల్లీ: అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధానత (డాకింగ్), విడదీత (అన్‌డాకింగ్) ప్రక్రియలను విజయవంతంగా పరీక్షించేందుకు ఇస్రో రంగం సిద్ధంచేస్తోంది. ఇందుకోసం ఉపయోగించే రెండు ఉపగ్రహాలను నేడు నింగిలోకి పంపనుంది. దీనికి శ్రీహరికోటలోని ప్రయోగవేదిక సిద్ధమైంది. సోమవారం రాత్రి ఎస్‌డీఎక్స్01, ఎస్‌డీఎక్స్02 శాటిలైట్లను పీఎస్‌ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించనుంది.
అంతరిక్షంలో 476 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో డాకింగ్, అన్‌డాకింగ్ ప్రక్రియలను జనవరి తొలివారంలో స్పేస్ డాకింగ్ ఎక్స్‌పర్‌మెంట్(స్పేడెక్స్)ను చేపడతామని ఇస్రో అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ సాంకేతికతను సాధించాయి. చంద్రమండలం నుంచి చంద్రశిలల సేకరణ, భారతీయ అంతరక్ష స్టేషన్ ఏర్పాటు, చందమామపై భారత వ్యోమగామిని దింపడం వంటి కీలక ఘట్టాలకు ఈ స్పేడెక్స్ మిషన్ తొలి సోపానంగా మారనుందని ఇస్రో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment