sriharikota
-
భారీ ప్రయోగాలే లక్ష్యం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతోమంది అంతరిక్ష పితామహుల కృషి ఫలితంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రాన్ని సొంతంగా నిర్మించుకొని, నేటికి వంద ప్రయోగాలు పూర్తిచేసి చరిత్రపుటల్లోకి ఎక్కిందని చైర్మన్ వి.నారాయణన్ అన్నారు. ఇకపై ఆకాశమే హద్దుగా భారీ ప్రయోగాలే లక్ష్యంగా పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆయన బుధవారం షార్‌లోని మీడియా సెంటర్లో మాట్లాడారు. ఇస్రో చేపట్టిన వంద ప్రయోగాల్లో పాలుపంచుకున్న అంతరిక్ష పరిశోధకులకు అభినందనలు తెలియజేశారు. రాకెట్ ప్రయోగాలకు సంబంధించి ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటున్నాని తెలిపారు. ఇకపై నెలకు రెండు ప్రయోగాలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. షార్ నుంచి సెంచరీ ప్రయోగాలు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. వందో ప్రయోగానికి తాను ఛైర్మన్‌గా ఉండడం తన అదృష్టమన్నారు. ఈ ఏడాది ప్రైవేట్‌గా పీఎస్ఎల్వీ–ఎన్1 పేరుతో నూతన ప్రయోగాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. జీఎస్ఎల్వీ–ఎఫ్16 రాకెట్ ద్వారా ఇస్రో, నాసా సంయుక్తంగా నిస్సార్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయని తెలిఆపరు. ఎల్వీఎం–3 రాకెట్ ద్వారా వాణిజ్యపరమైన ప్రయోగం ఉంటుందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి గగన్‌యాన్–1 క్రూమాడ్యూల్ ప్రయోగాన్ని హ్యూమన్ రిలేటెడ్ లాంచింగ్ వెహికల్ (హెచ్ఆర్ఎల్వీ) ద్వారా చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టంచేశారు. షార్ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను ప్రపంచస్థాయి ప్రయోగవేదికగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబోతున్నామని వి.నారాయణన్ ప్రకటించారు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ద్వారా 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపిస్తామని వెల్లడించారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి తమిళనాడులోని కులశేఖరపట్నం స్పేస్‌పోర్టు కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. డాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం కూడా చేయనున్నామని తెలిపారు. -
ఇస్రో సెంచరీ.. ఏపీకి గర్వకారణం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: శ్రీహరికోట నుంచి వందో రాకెట్ ప్రయోగం విజయవంతమైన వేళ.. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు అభినందనలు తెలియజేశారు. శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ ప్రయోగాన్ని సక్సెస్ చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరెన్నో విజయవంతమైన ప్రయోగాలు చేపట్టాలని ఆకాంక్షించారు.భారత అంతరిక్ష పరిశోధనలకు ముఖద్వారంగా మారిన శ్రీహరికోట ఏపీలో ఉండడం ఎంతో గర్వకారణమన్నారు. అంతరిక్ష సాంకేతికతలో ఇస్రో అత్యున్నతమైందని కొనియాడారు. అంతరిక్ష పరిశోధనల్లో ఈ ప్రయోగంతో భారతదేశ ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారాయన. భవిష్యత్తులోనూ ఇస్రో చేపట్టే ప్రయోగాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారాయన. Congratulations to ISRO on its 100th launch from Sriharikota! Wishing continued success in serving the nation and achieving many more such milestones. Kudos to Team ISRO!#100thLaunch— YS Jagan Mohan Reddy (@ysjagan) January 29, 2025శ్రీహరికోట నుంచి ఈ ఉదయం ఇస్రో చేపట్టిన చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్.. ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఆపై ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివెరిసింది. -
జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ ప్రయోగం విజయవంతం
-
శ్రీహరికోట నుంచి ఇస్రో వందో ప్రయోగం సక్సెస్
తిరుపతి, సాక్షి: భారత అంతరి ప్రయోగ సంస్థ ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం విజయవంతమైంది. సూళ్లురుపేట శ్రీహరికోట నుంచి బుధవారం వేకువఝామున జీఎస్ఎల్వీ ఎఫ్-15 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సుమారు 2,250 కిలోల బరువున్న ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని అది విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో శాస్త్రవేత్తలు సంబురాల్లో మునిగితేలారు. కొత్త రకం నేవిగేషన్ ఉపగ్రహాల్లో ఎన్వీఎస్-02 రెండోది. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250కిలోలు. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లోకేషన్ ఆధారిత సేవలందించనుంది. పదేళ్లపాటు ఈ నేవీగేషన్ శాటిలైట్ తన సేవలందిస్తుందని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. ఇస్రో వందో ప్రయోగం సక్సెస్‌పై ఆయన ఇస్రో సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ‘‘ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ అయ్యింది. నేవీగేషన్ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. ఇస్రో వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది’’ అని అన్నారు. కాగా, ఇస్రో చైర్మన్ నారాయణన్ నేతృత్వంలో జరిగిన తొలి ప్రయోగం ఇదే. ISRO successfully carries out 100th launch; GSLV-F15 carries NVS-02 into its planned orbitRead @ANI Story | https://t.co/halyAIg3eL#ISRO #launch #NVS02 pic.twitter.com/0pAkfafrp4— ANI Digital (@ani_digital) January 29, 2025#WATCH | Tirupati, Andhra Pradesh: ISRO launchs its 100th mission, the NVS-02 navigation satellite aboard the launch vehicle GSLV-F15 from Sriharikota in Andhra Pradesh at 6.23 am today.(Source: ISRO) pic.twitter.com/n5iY9N8N0p— ANI (@ANI) January 29, 2025కాగా, ఇస్రో శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని స్థాపించిన తర్వాత ఇప్పటివరకు 99 ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో కేవలం పది ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి. ఈ వందో ప్రయోగం విజయవంతం కావడంతో.. మెరుగైన GPS తరహా నేవిగేషన్ సిస్టం అందుబాటులోకి రానుంది. భారత భూభాగంతో పాటు భారత భూభాగంలోని తీరం నుంచి దాదాపు 1,500 కిలోమీటర్ల వరకు ఈ నేవిగేషన్ సిస్టం పని చేయనుంది. -
‘సెంచరీ’కి షార్ సిద్ధం
సూళ్లూరుపేట/తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లోని తిరు పతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 6.23 గంటలకు ప్రతిష్టాత్మక వందో ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ ప్రయోగానికి మంగళవారం తెల్లవారుజామున 2.53 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించింది. జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ ద్వారా 2,250 కిలోల బరువు కలిగిన నావిక్–02 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. కాగా, ఇస్రో శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని స్థాపించిన తర్వాత ఇప్పటివరకు 99 ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో కేవలం పది ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి.మిగిలిన 89 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. బుధవారం నాటి ప్రయోగంతో సెంచరీ మైలురాయిని దాటేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. 50.9 మీటర్ల పొడవున్న జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ భూమి నుంచి నింగికి ఎగసే సమయంలో 420.7 టన్నులు బరువు కలిగి ఉంటుంది. ఈ ప్రయోగాన్ని 19.17 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. 2,250 కిలోలు బరువు కలిగిన నావిక్–02 ఉపగ్రహాన్ని 170 కిలో మీటర్లు పెరిజీ(భూమికి అతి దగ్గరగా), 36,577 కిలో మీటర్లు అపోజి(భూమికి దూరంగా) జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీవో)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ వారు తమ ఆ«దీనంలోకి తీసుకుని, ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే పనిని పూర్తిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్ చేశారు.జీఎస్ఎల్వీ–ఎఫ్15 నమూనాకు ప్రత్యేక పూజలుఇస్రో చైర్మన్ వి.నారాయణన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ–ఎఫ్15 నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ అంతరిక్షంలో భారత్ మరో మైలురాయిని చేరుకోవడానికి సర్వం సిద్ధం చేశామని తెలిపారు. బుధవారం ఉదయం 6:23 నిమిషాలకు శ్రీహరికోట నుంచి వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్‌ను రోదసిలోకి పంపనున్నామని చెప్పారు.2025లో ఇదే మొదటి శాటిలైట్ ప్రయోగమని తెలిపారు. శ్రీహరికోట నుంచి ఇప్పటికి 6 జనరేషన్ల రాకెట్లను విజయవంతంగా వినియోగించామని వివరించారు. మొత్తం 433 విదేశీ శాటిలైట్లను గగనతలంలోని కక్ష్యల్లో ప్రవేశపెట్టామన్నారు. నెక్ట్స్ జనరేషన్ లాంచింగ్ వెహికల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారని చెప్పారు. లో ఎర్త్ ఆర్బిట్‌లో 30 వేల కేజీల సామర్థ్యం కలిగి 1,000 టన్నుల బరువు ఉన్న లాంచింగ్ వెహికల్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీహరికోటలో రూ.4,000 కోట్లతో మూడో లాంచ్ ప్యాడ్‌ను నిర్మిస్తున్నామని, నాలుగు నెలల్లో ఇది పూర్తవుతుందని వి.నారాయణన్ వెల్లడించారు. -
29న షార్ నుంచి వందో ప్రయోగం
సూళ్లూరుపేట: జీఎస్ఎల్వీ– ఎఫ్ 15తో ఎన్వీఎస్–02 ఉపగ్రహాన్ని అనుసంధానించడం పూర్తయిందని ఆదివారం షార్ డైరెక్టర్ రాజరాజన్ చెప్పారు. దేశీయంగా రూపుదిద్దుకున్న క్రయోజనిక్ జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ ఎన్వీఎస్–02ను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. శ్రీహరి కోటలోని షార్ నుంచి ఇది 100వ మిషన్ కానుందన్నారు. రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి చేపట్టే ప్రయోగంలో ఎన్వీఎస్–02ను జియో సిక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆదివారం ఆయన మీడియాకు వివరించారు. జీఎస్ల్వీఎల్ ఎప్15 రాకెట్ ప్రయోగానికి 27 గంటల ముందు అంటే 28వ తేదీ తెల్లవారు జామున 3.23 గంటలకు కౌంట్‌డౌన్ మొదలయ్యే అవకాశం ఉందన్నారు. 29న ఉదయం 6.23 గంటలకు ప్రయోగం ఉంటుందని చెప్పారు. అయితే, కౌంట్‌డౌన్ సమయాన్ని సోమవారం అధికారికంగా ఫ్రకటిస్తామని చెప్పారు. మూడో లాంచ్‌ప్యాడ్‌కు నెలలో శంకుస్థాపన సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్)లో మరో ప్రయోగ వేదిక నిర్మాణానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూ.3,984 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని రాజరాజన్ గుర్తు చేశారు. ఇందుకు అవసరమైన స్థలం ఎంపిక పూర్తయిందని, నెల రోజుల్లోనే భూమిపూజ ఉంటుందని వివరించారు. దీనికి అనుసంధానంగానే న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్‌ను రూపొందించనున్నామన్నారు. భవిష్యత్తులో దీనిద్వారానే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి తిరిగి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టనున్నామని తెలిపారు. కొత్త తరం లాంచింగ్ వెహికల్తో 20 నుంచి 25 టన్నుల ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి పంపించొచ్చని చెప్పారు. తమిళనాడులోని కులశేఖర్‌పట్నంలో నిర్మిస్తున్న రాకెట్ ఫ్రయోగ వేదిక డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందన్నారు. -
శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అంతరిక్ష మౌలిక సదు పాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించే కీలక నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో మూడో లాంఛ్ ప్యాడ్‌ను నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. శ్రీహరికోటలో రూ.3,984.86 కోట్లతో నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీ తీర్మానించింది. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న రెండో లాంచ్ ప్యాడ్‌కు కీలకమైన బ్యాకప్‌గా నిలవనుంది. కొత్త లాంచ్ ప్యాండ్ ప్రస్తుతమున్న రెండింటికి మించి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ప్రోగ్రామ్ సహా ఇస్రో యొక్క ప్రతిష్టాత్మక భవిష్యత్తు మిషన్లకు ఎంతో సహాయకారి కానుంది. 2035కల్లా భారతీయ అంతరిక్ష కేంద్రం(బీఏఎస్)ను నెలకొల్పడంతోపాటు 2040కల్లా చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేపట్టాలనే బృహత్ లక్ష్యాలు ఇస్రో ముందున్నాయి. అందుకే, వచ్చే 25, 30 ఏళ్ల అవసరా లను తీర్చేలా ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటోంది.రెండు ప్యాడ్లపైనే ఆధారంభారతీయ అంతరిక్ష రవాణా వ్యవస్థలు పూర్తిగా రెండు లాంచ్ పాడ్లపై ఆధారపడి ఉన్నాయి. పీఎస్ఎల్వీ మిషన్ల కోసం 30 ఏళ్ల క్రితం మొదటి లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) కోసం సైతం వాడుతున్నారు. క్రయోజెనిక్ దశ కారణంగా జీఎస్ఎల్వీ మిషన్ల అవసరాలను ఇది తీర్చలేకపోతోంది. అదేవిధంగా, 20 ఏళ్ల క్రితం ఏర్పాటైన రెండో లాంచ్ ప్యాడ్ జీఎస్ఎల్వీ, ఎల్వీఎం–3 మిషన్ల సేవలందిస్తోంది. చంద్రయాన్–3, గగన్‌యాన్ మిషన్ల కోసం దీనినే వాడుతున్నారు.రెండో లాంఛ్ ప్యాడ్‌కు బ్యాకప్‌గా..ఇస్రో తదుపరి జనరేషన్ లాంచ్ వెహికల్స్ (ఎన్జీఎల్వీ) ప్రయోగాల కోసం శ్రీహరికోటలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, రెండో లాంచ్ ప్యాడ్‌కు బ్యాకప్‌ను అందుబాటులోకి తేవడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు. కొత్త లాంచ్ ప్యాడ్ భవిష్యత్తులో ఇస్రో చేపట్టే మానవ సహిత అంతరిక్ష యాత్రలకు దన్నుగా నిలువనుంది. నాలుగేళ్లలో ఇది పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. మూడో లాంఛ్ ప్యాడ్ కేవలం నెక్ట్స్ జనరేషన్ వెహికల్స్ మాత్రమే కాకుండా సెమీ క్రయోజనిక్ స్టేజ్‌తో లాంఛ్ వెహికల్ మార్క్–3(ఎల్వీఎం3)వాహనాలకు, అలాగే ఎన్జీఎల్వీ యొక్క అధునాతన అంతరిక్ష యాత్రలను సపోర్ట్ చేసేలా ప్యాడ్‌ను డిజైన్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో పరిశ్రమల విస్తృత భాగస్వామ్యానికి వీలు కల్పించనున్నారు. లాంఛ్ ప్యాడ్లను ఏర్పాటు చేయడంలో ఇస్రో మునుపటి అనుభవాన్ని ఉపయోగించడం, ఇప్పటికే ఉన్న లాంచ్ కాంప్లెక్స్ సౌకర్యాలను గరిష్టంగా ఉపయోగించడం కూడా దీనిలో ఒక భాగమే. మరిన్ని విశేషాలువిస్తరణ: రెండో లాంచ్ ప్యాడ్‌లో సమ స్యలు తలెత్తిన సందర్భాల్లో జీఎస్ఎల్వీ ప్రయోగా లు అంతరాయం లేకుండా బ్యాకప్‌గా పనిచేస్తుంది. ఎన్జీఎల్వీ సామర్థ్యాలకు తగ్గ ఏర్పాట్లు: నూతన తరం లాంచ్ వెహికల్స్ (ఎన్జీఎల్వీ) కుతుబ్ మినార్‌కు మించి అంటే 72 మీటర్ల కంటే ఎక్కువగా అంటే 91 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అదేవిధంగా, ఎన్జీఎల్వీ అత్యధిక పేలోడ్‌ను అంటే 70 టన్నుల పేలోడ్‌ను సైతం భూమికి దిగువ కక్ష్యలోకి తీసుకెళ్లే విధంగా దీనికి రూపకల్పన చేస్తారు. -
‘అంతరిక్ష అనుసంధానత’ను పరీక్షించనున్న ఇస్రో
న్యూఢిల్లీ: అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధానత (డాకింగ్), విడదీత (అన్‌డాకింగ్) ప్రక్రియలను విజయవంతంగా పరీక్షించేందుకు ఇస్రో రంగం సిద్ధంచేస్తోంది. ఇందుకోసం ఉపయోగించే రెండు ఉపగ్రహాలను నేడు నింగిలోకి పంపనుంది. దీనికి శ్రీహరికోటలోని ప్రయోగవేదిక సిద్ధమైంది. సోమవారం రాత్రి ఎస్‌డీఎక్స్01, ఎస్‌డీఎక్స్02 శాటిలైట్లను పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించనుంది. అంతరిక్షంలో 476 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో డాకింగ్, అన్‌డాకింగ్ ప్రక్రియలను జనవరి తొలివారంలో స్పేస్ డాకింగ్ ఎక్స్పర్మెంట్(స్పేడెక్స్)ను చేపడతామని ఇస్రో అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ సాంకేతికతను సాధించాయి. చంద్రమండలం నుంచి చంద్రశిలల సేకరణ, భారతీయ అంతరక్ష స్టేషన్ ఏర్పాటు, చందమామపై భారత వ్యోమగామిని దింపడం వంటి కీలక ఘట్టాలకు ఈ స్పేడెక్స్ మిషన్ తొలి సోపానంగా మారనుందని ఇస్రో పేర్కొంది. -
పీఎస్ఎల్వీ–సీ59 ప్రయోగం సక్సెస్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ–సీ59 రాకెట్ ప్రయోగం విజయంతమైంది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్–షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి గురువారం సాయంత్రం 4.04 గంటలకు రాకెట్‌ను ప్రయోగించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన 550 కిలోల బరువైన ప్రాజెక్ట్ ఫర్ ఆన్‌బోర్డు అటానమీ(ప్రోబా)–3 మిషన్‌ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చారు. ఇందులో రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. భూమి దూరంగా 60,530 వేల కిలోమీటర్లు, దగ్గరగా 600 కిలోమీటర్ల ఎత్తులోని జియో ఎలిప్టికల్ ఆర్బిట్‌లోకి ప్రోబా–3 చేరుకుంది. వాస్తవానికి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు చేపట్టాల్సిన ఈ ప్రయోగాన్ని 25.30 గంటల ముందు.. అంటే మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. బుధవారం ప్రయోగం నిర్వహించబోయే 48 నిమిషాలకు ముందు ప్రోబా–3 నుంచి సిగ్నల్స్ అందలేదు. సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని యూరోపియన్ శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు కలిసి సరిచేశారు. 24 గంటల్లోపే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రశంసలందుకున్నారు. గురువారం ఉదయం 8.04 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 8 గంటల అనంతరం సాయంత్రం 4.04 గంటలకు రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లింది. సరిగ్గా 18.39 నిమిషాలకు ప్రోబా–3ని కక్ష్యలోకి విడిచిపెట్టింది. షార్ నుంచి ఇది 95వ ప్రయోగం కాగా, పీఎస్ఎల్వీ సిరీస్‌లో 61వ ప్రయోగం. సూర్యుడిపై పరిశోధనల కోసమే యూరోపియన్ స్పేస్ ఏజెన్నీ రూపొందించిన 550 కిలోల బరువైన ప్రోబా–3లో రెండు వేర్వేరు ఉపగ్రహాలను అమర్చి పంపారు. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. యూరోపియన్ స్పేస్ ఏజెన్నీ వారు ఈ తరహా పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ప్రోబా–3 కూడా ఆదిత్య ఎల్1 ఉపగ్రహంతో అనుసంధానమై పని చేస్తుంది. ఇందులో కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్, ఆకల్టర్ అనే మరో స్పేస్‌క్రాఫ్ట్‌లను అమర్చి పంపించారు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా వలయంలో పరిశోధనలు చేయడం వీటి ముఖ్య ఉద్దేశం. ప్రోబా–3లో అమర్చిన రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయంతో ఒక క్రమ పద్ధతిలో భూకక్ష్యలో పరిభ్రమిస్తూ పని చేస్తాయి. ఈ తరహా ప్రయోగం చేపట్టడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. ప్రోబా–3 నుంచి ఆ్రస్టేలియాలోని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ స్టేషన్‌కు సంకేతాలు అందడం మొదలైనట్లు సైంటిస్టులు తెలిపారు. రాకెట్ ప్రయాణమిలా... → 44.5 మీటర్లు ఎత్తు కలిగిన పీఎస్ఎల్వీ–సీ59 రాకెట్ ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువుతో నింగి వైపునకు దూసుకెళ్లింది. ళీ మొదటిదశ అయిన కోర్ అలోన్ దశలో 139 టన్నుల ఘన ఇంధనం, దీనికి చుట్టూరా ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు, ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం, ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో కలిపి 73.5 టన్నుల ఇంధనం, మొదటిదశలో మొత్తం కలిపి 212.5 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 109 సెకండ్లకు పూర్తి చేశారు. → 41 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 262 సెకండ్లలో రెండోదశ పూర్తయ్యింది.→ 7.65 టన్నుల ఘన ఇంధనంతో 489 సెకండ్లకు మూడో దశ ముగిసింది. → 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1,015 సెకండ్లకు నాలుగో దశను కటాఫ్ చేశారు. ప్రోబా–3 మిషన్‌ను ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 👏 Celebrating Success!The PSLV-C59/PROBA-3 Mission reflects the dedication of NSIL, ISRO and ESA teams. This achievement highlights India’s critical role in enabling global space innovation.🌍 Together, we continue building bridges in international space collaboration! 🚀✨…— ISRO (@isro) December 5, 2024 -
శ్రీహరికోట : ఇస్రో మరో ఘనత.. నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ-డీ3 (ఫొటోలు)
-
ఎస్ఎస్ఎల్వీడీ-3 ప్రయోగం సక్సెస్
సాక్షి,సూళ్లూరుపేట/తిరుమల: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం(ఆగస్టు16) స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ డీ3)ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.కౌంట్‌డౌన్ ముగియగానే అనుకున్న షెడ్యూల్ ప్రకారం రాకెట్ 9.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం నాలుగు దశల్లో 17 నిమిషాలపాటు జరిగిన రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్ సోమనాథన్ ప్రకటించారు. రాకెట్ ప్రయోగం సక్సెస్ అవడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్‌లో రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది. రక్షణ రంగంతో పాటు విపత్తు నిర్వహణ, ఇతర రంగాలకు ఈ ఉపగ్రహాల సేవలు ఏడాదిపాటు అందనున్నాయి. -
రాకెట్ ప్రయోగం విజయవంతం
-
శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
సాక్షి, తిరుపతి: శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా ఈ ఉదయం రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే మంగళవారం వేకువ ఝామున ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా వేశారు శాస్త్రవేత్తలు.చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాణ్ రాకెట్‌ను రూపొందించింది. సొంత ల్యాంచ్‌ప్యాడ్ ఏర్పాటు చేసి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టాలనుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఎనిమిది గంటల కౌంట్‌డౌన్ అనంతరం ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఉదయం 5.48 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. ప్రయోగాన్ని సమీక్షించేందుకు ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ సోమవారం సాయంత్రమే షార్కు కూడా చేరుకున్నారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో శాస్త్రవేత్తలు ప్రయోగం నిలిపివేశారు.ఏప్రిల్ 7వ తేదీ నుంచి అగ్నిబాణ్ ప్రయోగం వాయిదా పడడం ఇది నాలుగోసారి. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్ రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగిస్తున్నారు. -
ఇస్రో కీర్తి కిరీటంలో మరో ఉపగ్రహం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో ఉపగ్రహం ప్రకాశించనుంది. వాతావరణ రంగంలో సేవలందించేందుకు ప్రత్యేకంగా ఉద్దేశించిన ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని త్వరలో శ్రీహరికోట నుంచి రోదసికి ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కక్ష్యలో పరిభ్రమిస్తూ ఇన్శాట్-3డీ, ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాలు అందిస్తున్న సేవలకు కొనసాగింపుగా ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని త్వరలో జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ సాయంతో నింగికి ప్రయోగించనున్నారు. కేంద్రప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కోసం ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 17-మార్చి 17 తేదీల మధ్య ఎప్పుడైనా దాన్ని ప్రయోగించేలా లాంచ్ విండోను ఇస్రో నిర్ణయించింది. ఆ తేదీల మధ్య కాలంలో రాకెట్ గమన మార్గానికి అవాంతరాలు కలుగకుండా ముందుజాగ్రత్త చర్యగా వైమానిక సంస్థలకు ఇస్రో ఇప్పటికే నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్స్) జారీ చేసింది. అంతా సవ్యంగా ఉంటే, వీలు కుదిరితే ఫిబ్రవరి మాసం మధ్యలోనే ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెట్టాలని ఇస్రో యోచిస్తోంది. బెంగళూరులోని ప్రొఫెసర్ యు.ఆర్.రావు శాటిలైట్ సెంటరులో ఇప్పటికే అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్ కార్యక్రమాలతోపాటుగా కీలక పరీక్షలన్నిటినీ విజయవంతంగా పూర్తిచేసుకున్న ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటోంది. వాతావరణ సంబంధమైన అధ్యయనం నిర్వహించే ఈ ఉపగ్రహం బరువు ప్రయోగ సమయంలో 2,275 కిలోలు ఉంటుంది. వాతావరణ అంచనాలు రూపొందించడానికి, విపత్తుల గురించి ముంచే హెచ్చరించడానికి వీలుగా తనలోని అత్యాధునిక శాస్త్రీయ పరికరాలతో భూ, సముద్ర ఉపరితలాలను ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహం పరిశీలిస్తుంది. ఇమేజర్లు, డేటా రిలే ట్రాన్స్‌పాండర్ (డీఆర్టీ), శాటిలైట్ ఎయిడెడ్ సర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఏఎస్ & ఆర్) ట్రాన్స్‌పాండర్ తదితర పరికరాలను దానిలో అమర్చారు. మార్చిలో నింగికి ‘నిసార్’… ఇస్రో ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి నెలలో ‘నిసార్’ ఉపగ్రహ ప్రయోగం జరగనుంది. ‘నిసార్’ అంటే నాసా-ఇస్రో సింథటిక్ ఆపెర్చర్ రాడార్. ఇదొక భూ పరిశీలక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. ఈ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’, మన ఇస్రోల సంయుక్త ప్రాజెక్టు. ‘నిసార్’ ప్రయోగంలో వాడే ఉపగ్రహ వాహక నౌక (జీఎస్ఎల్వీ)కు తాజా ఇన్శాట్-3డీఎస్ ప్రయోగం అర్హతా పరీక్ష లాంటిదని అంతరిక్ష రంగ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే... ‘నిసార్’ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.12,500 కోట్లు. సింథటిక్ అపెర్చర్ రాడార్ (సార్) అమర్చిన ‘నిసార్’… భూమి సంబంధ మార్పుల్ని పరిశీలిస్తుంది. చిత్తడి నేలల స్థితిగతులు, అగ్నిపర్వతాల కారణంగా నేల రూపురేఖల్లో సంభవించే మార్పులను గమనిస్తుంది. అలాగే భూమిపై శీతలావరణం (క్రయోస్ఫియర్)కు సంబంధించి మంచు పలకలు, హిమనీనదాలు, సముద్ర మంచులో కలిగే మార్పులను క్షుణ్ణంగా శోధిస్తుంది. :::: జమ్ముల శ్రీకాంత్ -
PSLV-C58 XPoSat: ఇస్రో పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతం (ఫొటోలు)
-
పీఎస్ఎల్వీ సీ-58 ప్రయోగం విజయవంతం
Live Updates.. పీఎస్ఎల్వీ సీ-58 విజయవంతపై సీఎం జగన్ హర్షం ►ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ► నూతన సంవత్సరంలో మంచి విజయాన్ని సాధించారు ►అనుకున్న రీతిలోనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టటం సంతోషకరం ►భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలి ►పీఎస్ఎల్వీ సీ-58 ప్రయోగం విజయవంతం. ►2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించిన అమెరికా ►అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన దేశంగా ఘనత దక్కించుకున్న భారత్ ►కొత్త ఏడాదిలో ఇస్రో తొలి ప్రయోగం సక్సెస్ ►శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు ►శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ 58. #WATCH | PSLV-C58 XPoSat Mission launch | ISRO launches X-Ray Polarimeter Satellite (XPoSat) from the first launch-pad, SDSC-SHAR, Sriharikota in Andhra Pradesh. (Source: ISRO) pic.twitter.com/ua96eSPIcJ — ANI (@ANI) January 1, 2024 ►ఎక్స్‌పోశాట్ ఉపగ్రహ జీవితకాలం ఐదేళ్లు. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా ప్రయోగం. ►2024 నూతన సంవత్సరం ప్రారంభం రోజునే ఇస్రో తొలి ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలుపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నిర్వహించనున్న పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైంది. ఇస్రో ఎక్స్ రే పొలారి మీటర్ శాటిలైట్(ఎక్స్పో శాట్)ను ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో తొలి పొలారిమీటర్ మిషన్ కావడం విశేషం. ►కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9:10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకోనుంది. ►అనంతరం రాకెట్లో నాలుగో స్టేజ్ అయిన పీఎస్4 అక్కడి నుంచి దిగువ కక్ష్యకు వస్తుంది. ఇందులో తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు ఉంటాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. #WATCH | PSLV-C58 XPoSat Mission launch | Sriharikota, Andhra Pradesh: The launch of the X-Ray Polarimeter Satellite (XPoSat) is set for today at 09:10 am from the first launch-pad, SDSC-SHAR, Sriharikota in Andhra Pradesh. (Visuals from Satish Dhawan Space Centre) pic.twitter.com/c5LkajQEpU — ANI (@ANI) January 1, 2024 ►కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్‌రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్ పో శాట్ అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనానికిగాను ఎక్స్‌పోశాట్‌లో రెండు అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూ కక్ష్య నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ►ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పరికరం పోలిక్స్ మధ్యతరహా ఎక్స్‌రే కిరణాలను వెదజల్లే మూలాలపై పరిశోధన చేస్తుంది. ఇక మిగిలిన ఎక్స్‌స్పెక్ట్ పేలోడ్ అంతరిక్షంలోని బ్లాక్‌హోళ్లు, న్యూట్రాన్ నక్షత్రాలు, యాక్టివ్ గలాటిక్ న్యూక్లై, పల్సర్ విండ్, నెబ్యులా తదితరాల నుంచి వెలువడే ఎక్స్‌రే కిరణాల స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందించనుంది. గడిచిన ఏడాది 2023లో ఇస్రో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
’ఆదిత్య’ మార్గాన్ని చక్కదిద్ది... కీలక ఘట్టాన్ని పూర్తి చేసిన ఇస్రో
బెంగళూరు: సూర్యశోధనకు ఉద్దేశించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహ ప్రయోగంలో మరో కీలక దశను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. దాని మార్గాన్ని సరిదిద్దే ప్రక్రియను సజావుగా జరిపినట్టు ఆదివారం ప్రకటించింది. అక్టోబర్ 6న 16 సెకన్ల పాటు ఇది కొనసాగిందని వివరించింది. లగ్రాంజ్ పాయింట్1 వైపు ఉపగ్రహం నిర్దేశిత మార్గంలో సాగేలా ఉంచేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. ఆదిత్య –ఎల్1 సూర్యునిపైకి భారత తొలి ప్రయోగం. దీన్ని సెపె్టంబర్ 2న శ్రీహరికోట నుంచి జరిపారు. తర్వాత దాని గమనాన్ని సెపె్టంబర్ 19న లగ్రాంజియన్ పాయింట్ కేసి నిర్దేశించారు. తాజా ప్రయత్నం ద్వారా దాన్ని మరింతగా సరిచేశారు. 125 రోజుల పాటు భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆదిత్య–ఎల్1ను సూర్యునికి అతి సన్నిహితమైన హాలో కక్ష్యలోకి ప్రవేశపెట్టాలన్నది ఇస్రో లక్ష్యం. -
ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతం.. అభినందనల వెల్లువ
సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 విజయవంతంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత తొలి మిషన్ విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చంద్రయాన్-3 విజయం తర్వాత భారత్ తన అంతరిక్ష యాత్రను కొనసాగిస్తోందని అన్నారు. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై అవగాహన పెంపొందించడానికి మన శాస్త్రవేత్తల అవిశ్రాంత ప్రయత్నాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. After the success of Chandrayaan-3, India continues its space journey. Congratulations to our scientists and engineers at @isro for the successful launch of India’s first Solar Mission, Aditya -L1. Our tireless scientific efforts will continue in order to develop better… — Narendra Modi (@narendramodi) September 2, 2023 ఇస్రో శాస్త్రవేత్తలపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ‘భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ అయిన ఆదిత్య-ఎల్1 ప్రయోగం భారతదేశ స్వదేశీ అంతరిక్ష కార్యక్రమాన్ని కొత్త పథంలోకి తీసుకెళ్లే ఒక మైలురాయి సాధన. ఇది అంతరిక్షం, ఖగోళ దృగ్విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి మనకు ఎంతగానో సాయపడుతుంది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను నేను అభినందిస్తున్నాను. మిషన్ విజయవంతం అయినందుకు నా శుభాకాంక్షలు’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. The launch of Aditya-L1, India's first solar mission, is a landmark achievement that takes India’s indigenous space programme to a new trajectory. It will help us better understand space and celestial phenomena. I congratulate the scientists and engineers at @isro for this… — President of India (@rashtrapatibhvn) September 2, 2023 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది అని సీఎం పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ @isro ఈరోజు ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇస్రో మరో కీలక మైలురాయిని దాటిందని సీఎం అన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా… pic.twitter.com/dOngtX8pUr — Telangana CMO (@TelanganaCMO) September 2, 2023 ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతం సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఆదిత్య ఎల్-1 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ- సీ27 వాహకనౌక ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ఆదిత్య ఎల్1ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. రాకెట్ నుంచి విజయవంతంగా ఆదిత్య ఎల్1 విడిపోయినట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమవడానికి సహకరించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. దీంతో శ్రీహరి కోట షార్‌లో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకుంటున్నారు. చదవండి: ఆదిత్య ఎల్-1 సక్సెస్‌పై సీఎం జగన్ హర్షం. ఇస్రోకు అభినందనలు -
ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో మైలురాయిని దాటేసింది. చంద్రయాన్-3 చరిత్రాత్మక విజయం ఇచ్చిన జోష్‌తో సూర్యుడిపై తొలి ప్రయోగం చేపట్టింది. సూర్యుడిపై పరిశోధనల క్రమంలో ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో శ్రీహరి కోట షార్‌లో శాస్త్రవేత్తల సంబురాలు చేసుకుంటున్నారు. ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్ అయ్యిందని, నిర్దేశిత కక్ష్యలోకి ఉప్రగహాన్ని పీఎస్ఎల్వీ ప్రవేశపెట్టిందని, వాహన నౌక నుంచి ఉపగ్రహం విడిపోయిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. చదవండి: ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా.. PSLV-C57/Aditya-L1 Mission: The launch of Aditya-L1 by PSLV-C57 is accomplished successfully. The vehicle has placed the satellite precisely into its intended orbit. India’s first solar observatory has begun its journey to the destination of Sun-Earth L1 point. — ISRO (@isro) September 2, 2023 సూర్యుడిపై ఇస్రో తొలి మిషన్ ఆదిత్య ఎల్-1. పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం సోలార్ స్మార్ట్స్ను అధ్యయనం చేస్తుంది. ఆదిత్య ఎల్-1ను భూదిగువన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆపై దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి దింపారు. ఇక ఇక్కడి నుంచి లాంగ్రేంజ్ పాయింట్ 1 వైపు పయనిస్తుంది ఉపగ్రహం. ఈ క్రమంలో.. భూగురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతాన్ని దాటి వెళ్తుంది. అనంతరం క్రూజ్ దశ ప్రారంభం అవుతుంది. భూమి నుంచి నాలుగు నెలలపాటు.. దాదాపు 125 రోజులపాటు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది సోలార్ మిషన్. అక్కడ ఎల్1 పాయింట్‌కు చేరుకుని.. సోలార్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్‌ను తోలుగా అధ్యయనం చేస్తుంది ఆదిత్య ఎల్ 1. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం బరువు 1475 కిలోలు. ఉపగ్రహ జీవిత కాలం ఐదేళ్లకు పైనేనని ఇస్రో ప్రకటించింది. ఈ ఐదేళ్లలో.. సౌర తుఫానులు, జ్వాలలు, తీరు తెన్నులపై పరిశోధనలు నిర్వహిస్తుంది. ప్రతీరోజూ 1440 ఫొటోలు తీసి భూమికి పంపడంతో పాటు.. ఫిబ్రవరి నెలాఖరు నుంచి రెగ్యులర్‌గా డేటా అందిస్తుంది ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం. రూ. 378 కోట్లతో ప్రయోగించిన ఈ మిషన్.. నాలుగు నెలలపాటు ప్రయాణించి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్ (ఎల్ 1) వద్దకు చేరుకోనుంది. అనంతరం సూర్యుడిపై ప్రయోగాలు చేయనుంది. ఏడు పేలోడ్స్ సూర్యుడిపై ఇస్రో తొలి మిషన్ ఆదిత్య ఎల్-1. ఇందులో 7 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 92వది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 59వది. ఆదిత్య–ఎల్1 నిర్దేశిత కక్ష్యలోకి చేరిన వెంటనే అందులో అమర్చిన విజిబుల్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పేలోడ్ నిమిషానికి ఒకటి చొప్పున రోజుకు సుమారు 1,440 చిత్రాలను తీసి విశ్లేషణ కోసం గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతుందని ప్రాజెక్టు సైంటిస్ట్ అండ్ ఆపరేషన్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ చెప్పారు. ఫిబ్రవరి చివరినాటికి మొదటి చిత్రం అందుతుందని భావిస్తున్నామన్నారు. -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్ షార్కు రానున్నారు. సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలిస్తారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం.. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే 175 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మలుపుతిప్పిన చంద్రయాన్-3.. ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం
వాషింగ్టన్: చంద్రయాన్-3 విజయం తర్వాత ప్రపంచ దేశాల చూపు భారత దేశం వైపు మళ్లింది. ప్రపంచ దేశాలు భారత్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన నాసా-ఇస్రో SAR (NISAR) ఉపగ్రహాన్ని ప్రయోగించే బాధ్యతలను ఇస్రో చేతులకు అప్పజెప్పింది నాసా. భూమి యొక్క కక్ష్యను పరిశీలించే నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి ముందు ఇస్రో దీనికి తుది మెరుగులు దిద్దుతోంది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం, NISAR 12 రోజుల్లో మొత్తం భూగోళాన్ని మ్యాప్ చేయగలదు. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు సహా భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, సహజ ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి తాత్కాలికమైనా కూడా స్థిరమైన సమాచారాన్ని అందిస్తుంది. NISAR L, S డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ ఆపర్చ్యుర్ రాడార్ (SAR)ని కలిగి ఉంటుంది. ఇందులో L బ్యాండ్ SARను కాలిఫోర్నియా జెట్ ప్రపల్షన్ లేబొరేటరీ డెవలప్ చేయగా S బ్యాండ్ SARను మాత్రం ISRO అభివృద్ధి చేసింది. ఇది స్వీప్ SAR టెక్నిక్‌తో పనిచేస్తూ హై రిజొల్యూషన్ డేటాను అందిస్తుంది. SAR పేలోడ్లు ఇంటిగ్రేటెడ్ రాడార్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రక్చర్ (ఐరిస్)పై అమర్చబడ్డాయి. SUV-పరిమాణంలో ఉండే పేలోడ్‌ను ప్రత్యేక కార్గో కంటైనర్‌లో బెంగళూరుకు తరలించినట్లు యూఎస్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. బెంగళూరులోని యూ.ఆర్.రావు శాటిలైట్ సెంటర్లో ఉపగ్రహం తుదిమెరుగులు దిద్దుకుని 2024లో ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ప్రణాళిక రూపొందించింది నాసా. Touchdown in Bengaluru! @ISRO receives NISAR (@NASA-ISRO Synthetic Aperture Radar) on a @USAirforce C-17 from @NASAJPL in California, setting the stage for final integration of the Earth observation satellite, a true symbol of #USIndia civil space collaboration. #USIndiaTogether pic.twitter.com/l0a5pa1uxV — U.S. Consulate General Chennai (@USAndChennai) March 8, 2023 ఇది కూడా చదవండి:ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు! -
Chandrayaan-3 Updates: కీలక దిశగా చంద్రయాన్–3
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/తిరువనంతపురం/శ్రీహరికోట: విజయవంతంగా రోదసి చేరిన చంద్రయాన్–3 ప్రయోగం 41 రోజుల ముఖ్యమైన ప్రయాణంలో కీలక దశ దిశగా సాగుతోంది. దానికి జత చేసిన థ్రస్టర్లను మండించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం నుంచే మొదలు పెట్టారు. తద్వారా ఉపగ్రహాన్ని భూమి నుంచి కక్ష్య దూరం పెంచే ప్రక్రియ మొదలైంది. అంతిమంగా చంద్రయాన్–3ని ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై వీలైనంత సున్నితంగా దించాలన్నది లక్ష్యం. చంద్రయాన్–3ని శుక్రవారం మధ్యాహ్నం ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదికగా విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. రోదసిలో దాని ప్రయాణం అద్భుతంగా సాగుతోందని తిరువనంతపురంలోని విక్రం సారాబాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్ఎస్.ఉన్నికృష్ణన్ నాయర్ శనివారం మీడియాకు తెలిపారు. తొలి దశ ప్రయోగం నూటికి నూరు శాతం విజయవంతమైందన్నారు. -
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Chandrayaan 3: విజయవంతంగా భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 (ఫొటోలు)
-
నింగిలోకి చంద్రయాన్.. ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు
-
భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో కొత్త అధ్యాయం: మోదీ
-
చంద్రయాన్-3 విజయవంతంపై సీఎం జగన్ హర్షం
సాక్షి, అమరావతి: చంద్రయాన్-3 విజయవంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను సీఎం జగన్ అభినందించారు. మన శాస్త్రవేత్తలు ప్రపంచ పటంలో గర్వించదగిన స్థానం సాధించారని కొనియాడారు. అంతరిక్ష యాత్రలో చంద్రయాన్-2 విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కాగా శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 3 రాకెట్ విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. 24 రోజులపాటు భూమి చుట్టూ ప్రదక్షిణ చేయనుంది. ఆ తరువాత చంద్రుని వైపు పయనించనుంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్ కానుంది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇస్రో సత్తాకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని సంస్త ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. త్వరలోనే చంద్రుడిని చేరుకుంటామన్నారు. ఇస్రో టీమ్‌కు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అభినందలు తెలిపారు. ప్రపంచ దేశాలకు దీటుగా ఇస్రో పరిశోధనలు చేస్తోందని తెలిపారు. చదవండి: Chandrayaan-3 Moon Mission Launched: విజయవంతంగా భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 రాకెట్ -
Chandrayaan 3 Launch Visuals Video: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ - 3
-
విజయవంతంగా భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 రాకెట్
ఇస్రోలో శాస్త్రవేత్తల సంబరాలు ►మూడు దశల్లో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అవ్వాలని శాస్త్రవేత్తలు ఆకాంక్షించారు. శ్రీహారికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఒక చారిత్రాత్మక రోజని ఇస్రో పేర్కొంది. యావత్ దేశ ప్రజలందరి ఆకాంక్షలు నిజమవ్వాలని ఆకాంక్షించింది. చంద్రయాన్-3 మిషన్ కోసం పనిచేసిన శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ అభినందనలు తెలిపారు. ఇస్రో సత్తాకు ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు. విజయవంతంగా కక్ష్యలోకి చంద్రయాన్-3 ►చంద్రయాన్-3 రాకెట్ విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఎల్వీఎం 3ఎం 4రా కెట్ నుంచి శాటిలైట్ విజయవంతంగా విడిపోయింది. 24 రోజులపాటు భూ కక్షలోనే చంద్రయాన్-3 ప్రదక్షిణ చేయనుంది. ఆ తర్వాత చంద్రుడి వైపు పయనించనుంది. 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది.ఆగష్టు 23 లేదా 24 చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్ కానుంది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. ► ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. బాహుబలి రాకెట్ ఎల్ వీఎం-3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్-3 ప్రయోగం మధ్యాహ్నం 2.35 నిముషాలకు విజయవంతంగా ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్వీఎం-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. కాగా ప్రయోగానికి 25 గంటల పై చిలుకు కౌంట్‌డౌన్ గురువారం మధ్యాహ్నం 1.05కు మొదలైంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశమూ వెళ్లని చంద్రుడి రెండో వైపుకు ల్యాండర్, రోవర్లను పంపనున్నారు. దాంతో అన్ని దేశాల చూపూ భారత్‌వైపే ఉంది. అందుకే ఈసారి గురి తప్పొద్దనే పట్టుదలతో ఇస్రో సకల జాగ్రత్తలూ తీసుకుంది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ బుధవారం నుంచీ షార్‌లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలతో సమీక్షించారు. ► చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్–3 ప్రయోగం ప్రధాన లక్ష్యం... ►ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం చంద్రయాన్–1 నుంచి తాజా చంద్రయాన్–3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయతి్నస్తూ వస్తోంది. ►అందులో భాగంగా చంద్రయాన్–3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించనున్నారు. చదవండి: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! చంద్రయాన్–3 బరువు 3,920 కిలోలు ► ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలుంటాయి. ► చంద్రయాన్–2 వైఫల్యంతో చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు ఆగిపోయాయి. చంద్రయాన్–2లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్–3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే పంపుతున్నారు. ► చంద్రయాన్–3 ప్రపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చి పంపుతున్నారు. ► ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు 2 నెలలుగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
చంద్రయాన్-3 లాంఛ్‌కి ప్రధాని హాజరవుతారా?
ఢిల్లీ: యావత్ భారతంతో పాటు ప్రపంచం కూడా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టబోయే చంద్రయాన్-3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జులై 14వ తేదీన శ్రీహరికోట(ఏపీ) సతీశ్ ధావన్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. అయితే ఈ ప్రయోగానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారా? అనే ప్రశ్న.. ఇస్రో చీఫ్‌కు ఎదురైంది?. చంద్రయాన్-3 మిషన్ ఏర్పాట్ల గురించి ఇస్రో చీఫ్ సోమనాథ్ మీడియాతో చిట్ ఛాట్ చేశారు. అయితే మోదీ హాజరవుతారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘ప్రతీ ఒక్కరినీ మేం ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. అయితే వాళ్లు వస్తారా.. రారా.. అనేది మాత్రం వాళ్లకే వదిలేశాం అని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. జులై 13-14 తేదీల్లో భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయోగ సమయంలో హాజరవ్వడం అనుమానంగానే కనిపిస్తోంది. అయితే చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో జరిగే కార్యక్రమానికి మాత్రం హాజరు కావొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. 2019లో చంద్రయాన్ 2 మిషన్ లాంఛ్‌కి ప్రధాని మోదీ హాజరయ్యారు. అయితే చంద్రుడి మీద క్రాష్ ల్యాండ్‌తో అది విఫలమైంది. ఆ సమయంలో ఇస్రో చైర్మన్‌గా ఉన్న కే శివన్ అది చూసి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. అది చూసి ప్రధాని మోదీ.. ఆయన హత్తుకుని ఓదర్చారు. చంద్రుడిపై పరిశోధన, అక్కడి రహస్యాల అన్వేషణ, వ్యోమగాములను పంపించడం ద్వారా అంతరిక్ష రంగంలో భారత్ సత్తా ప్రదర్శించేందుకు చంద్రయాన్ ప్రాజెక్టును తెర మీదకు తెచ్చారు. మూడు ప్రయోగాలకు సుమారు రూ.1,600 కోట్లు వ్యయం అంచనా వేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2008 అక్టోబర్ 22న చేపట్టిన చంద్రయాన్–1 ప్రయోగం విజయవంతమైంది. అక్కడ నీటి జాడలున్నాయని గుర్తించింది. చంద్రయాన్–1 ప్రయోగానికి రూ.380 కోట్లు ఖర్చు చేశారు. 2019 జూలై 15న చంద్రయాన్–2కు శ్రీకారం చుట్టింది. ఆర్బిటార్ ద్వారా ల్యాండర్, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించడమే కాకుండా 14 రకాల పేలోడ్స్‌ను పంపించారు. ప్రయోగమంతా సక్సెస్ అయిందనుకున్న తరుణంలో ఆఖరు రెండు నిమిషాల్లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టడంతో సంకేతాలు ఆగిపోయాయి.చంద్రయాన్–2 ప్రాజెక్టును రూ.598 కోట్లు వ్యయం చేశారు. అయితే చంద్రయాన్ 3 కచ్చితంగా విజయవంతమై తీరుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జులై 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2గం.35నిమిషాల సమయంలో చంద్రయాన్ 3 మొదలవుతుంది. ఈ మిషన్ 45 రోజులపాటు కొనసాగి ఆగష్టు చివరికల్లా చంద్రుడిపై ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు.. చంద్రయాన్–3 ప్రయోగానికి దాదాపు రూ.615 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇదీ చదవండి: విభిన్నం, వినూత్నం.. చంద్రయాన్ -
విభిన్నం, వినూత్నం.. చంద్రయాన్–3
చల్లని వెన్నెలను ఇచ్చే చందమామను మనం చూసేది కేవలం ఒకవైపే. కంటికి కనిపించని అవతలి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు కొంతవరకు విజయం సాధించాయి. అంతరిక్ష నౌకలను క్షేమంగా పంపించాయి. చంద్రుడి ఉపరితలంపై ఆయా అంతరిక్ష నౌకలు కాలుమోపాయి. ఈ జాబితాలో చేరాలని భారత్ సైతం ఉవి్వళ్లూరుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–3 ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. వచ్చే నెలలో జరిగే ఈ ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రుడిపైకి రోవర్‌ను పంపించి, అక్కడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవడ మే ఈ మిషన్ లక్ష్యం. చంద్రయాన్–3 స్పేస్‌క్రాఫ్ట్‌ను జీఎస్ఎల్వీ–ఎంకే–3 రాకెట్ ద్వారా చందమామపైకి పంపించనున్నారు. చంద్రయాన్–3 మిషన్‌ను కచి్చతంగా సఫలం చేయాలని, చంద్రుడిపై ప్రయో గాల్లో మనదైన ముద్ర వేయాలని ఇస్రో సైంటిస్టులు అహోరాత్రులూ శ్రమిస్తున్నారు. భవిష్యత్తులో మనుషులను చంద్రుడిపైకి పంపించడానికి ఈ ప్రయోగం కీలకం అవుతుందనడంలో సందేహం లేదు. మీకు గుర్తుందా? చంద్రయాన్–2 ప్రయోగం దేశ ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిలి్చంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఆర్బిటార్‌తో వెళ్లిన చంద్రయాన్–2 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రు డి ఉపరితలంపై క్షేమంగా దిగలేకపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో 2019 సెపె్టంబర్ 6న క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రయోగం విఫలం కావడంతో అప్పటి ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రధాని మోదీ సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. దేశ ప్రజలంతా సానుభూతి ప్రదర్శించారు. చంద్రయాన్–2తో పోలిస్తే చంద్రయాన్–3 ప్రయోగం చాలా విభిన్నంగా, వినూత్నంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. రెండింటి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని అంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం... ► ఆర్బిటార్, మిషన్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం చేసుకుంటూ పనిచేసే ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా చంద్రయాన్–2లో కేవలం ఒక్కటే ఉంది. చంద్రయాన్–3లో ఇలాంటివి రెండు కెమెరాలు అమర్చుతున్నారు. చంద్రుడిపై ల్యాండర్ భద్రంగా దిగడానికి ఇవి ఉపకరిస్తాయి. ► చంద్రయాన్–2లో 9 కీలక పరికరాలు ఉన్నాయి. ఇవి చంద్రుడి కక్ష్యలో ఇంకా చక్కగా పనిచేస్తూనే ఉన్నాయి. చంద్రయాన్–3 ప్రొపల్షన్ మాడ్యూల్లో కేవలం స్పెక్ట్రో–పోలారీమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్(ఎస్హెచ్ఏపీఈ) అనే పేలోడ్ కూడా ఉంటుంది. ఇతర గ్రహాలపై మానవ నివాస యోగ్యమైన ప్రదేశాల అన్వేషణకు అవసరమైన సమాచారాన్ని ఈ పరికరం అందజేస్తుంది. ► చంద్రయాన్–3లో ల్యాండర్‌తోపాటు లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ అరే(ఎల్ఆర్ఏ)ను సైతం పంపించ బోతున్నారు. జాబిల్లిపై పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. తాజా ప్రయోగం విజయవంతం కావడం ఖాయమని సైంటిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనల్లో ఒక కీలకమైన మైలురాయి కానుంది. ► చంద్రయాన్–2లో జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్ ఉపయోగించారు. చంద్రయాన్–3లోనూ ఇలాంటి రాకెట్‌ను వాడుతున్నారు. చంద్రయాన్–2 రాకెట్లో ల్యాండర్, రోవర్, ఆర్బిటార్ ఉన్నాయి. మూడో ప్రయోగంలో ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయి. చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ఆర్బిటార్‌ను ఈ తాజా ప్రయోగంలోనూ ఉపయోగించుకుంటారు. ఈ ఆర్బిటార్ ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో క్షేమంగా ఉంది. సమాచారం ఇచి్చపుచ్చుకోవడానికి, ఉపరితలంపై మ్యాపింగ్ కోసం ఆర్బిటార్‌ను వాడుకుంటారు. ► చంద్రయాన్–2 వైఫల్యం నుంచి సైంటిస్టులు పాఠాలు నేర్చుకున్నారు. అందుకే చంద్రయాన్–3లో కొన్ని మార్పులు చేశారు. చదవండి: మెట్రోలో యువకుల పిడిగుద్దులు.. వీడియో వైరల్.. జూలై 13న చంద్రయాన్–3 ప్రయోగం! న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. జూలై 13న మధ్యాహ్నం 2.30 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ ప్రయోగం ప్రారంభించనున్నట్లు సీనియర్ శాస్త్రవేత్త ఒకరు బుధవారం చెప్పా రు. అయితే, ప్రయోగ తేదీని ఇంకా ఖరారు చేయలేదని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. జూలై12 నుంచి 19వ తేదీల మధ్య ఏదో ఒక రోజు ప్రయోగం చేపట్టే అవకాశముందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది. చంద్రయాన్–1 ప్రయోగం 2008 అక్టోబర్22న, చంద్రయాన్–2 ప్రయోగం 2019 జూలై 22న ప్రయోగం నిర్వహించారు. చంద్రయాన్–1 విజయవంతమైంది. జాబిల్లి ఉపరితలంపై నీడ జాడ లను గుర్తించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ 312 రోజులపాటు సేవలందించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
AP: ఇక వానలే.. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు
సాక్షి, అమరావతి: వేసవిలో ఎండలు మండుతున్న వేళ తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందింది. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. శ్రీహరికోట సమీపంలో రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణశాఖ తెలిపింది. కాగా, వచ్చే 24 గంటల్లో మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని వాతావరణశాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీని ప్రభావంతో అక్కడక్కడే జల్లులు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
SSLV D2 రాకెట్ ప్రయోగం విజయవంతం
సాక్షి, తిరుపతి: శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో ఎస్ఎస్ఎల్వీ డీ2.. మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. కాగా, 13 నిమిషాల 2 సెకన్లలో రాకెట్ ప్రయోగం పూర్తికానుంది. దీని ద్వారా 2 దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాయి. కాగా, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ2)ను శుక్రవారం ఉదయం 9.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్–1, ఆజాదీ శాట్–2 అనే మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక, ఎస్ఎస్ఎల్వీ–డీ1 పేరుతో గత ఏడాదిలో చేసిన మొదటి ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారు. రాకెట్ వివరాలు ఇవే.. ఎస్ఎస్ఎల్వీ–డీ2 రాకెట్ 34 మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో పూర్తిచేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 785.1 సెకన్లలో పూర్తి చేస్తారు. -
శ్రీహరికోటలో మరో విషాదం
-
ఇస్రో జైత్రయాత్ర: పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం
సాక్షి, సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ సీ54 విజయవంతమైంది. ఈఓఎస్ 06, ఎనిమిది చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు దీనిని ప్రయోగించారు. సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 1,117 కేజీల బరువున్న ఈఓఎస్ 06, అలాగే 18.28 కేజీల బరువున్న ఐఎన్ఎస్ 2బీ, 16.15 కిలోల బరువున్న ఆనంద్, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్ బోల్ట్ షాటిలైట్స్‌తో పాటు.. 17.92 కేజీల బరువున్న 4 యూఎస్‌కు చెందిన యాస్ట్రో కాట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం కావడం గమనార్హం. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితం పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం కావడంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితమే ఈ విజయమని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నీటి వనరుల పర్యవేక్షణ, తుపాను అంచనా, భూవాతవరణంపై పీఎస్ఎల్వీ సీ54 అధ్యయనం చేయనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చదవండి: (క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం: సీఎం జగన్) -
PSLV-C54 Launch: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ54
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ54 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా 9 ఉప గ్రహాలను భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులో సన్‌సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. కాగా, పీఎస్ఎల్వీ సీ–54 రాకెట్‌కు శుక్రవారం ఉదయం 10.26 నిమిషాలకు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగంరాజరాజన్లు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం రాకెట్‌లోని నాల్గో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం రాకెట్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-S
-
శ్రీహరికోట: నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-ఎస్
తిరుపతి: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం రాకెట్ ప్రయోగం జరిగింది. దేశీయంగా ప్రైవేట్ రంగంలో రూపొందిన మొదటి రాకెట్ విక్రమ్-ఎస్. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ ఈ ప్రైవేట్‌రాకెట్‌ను రూపొందించింది. ‘మిషన్ ప్రారంభ్’ విజయవంతమైందని ప్రకటించారు సైంటిస్టులు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగానికి నాంది పలుకుతూ ప్రైవేట్‌రంగంలో రూపొందిన తొలి రాకెట్ విక్రమ్–ఎస్. రాకెట్‌కు అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యులైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్–ఎస్ అని నామకరణం చేశారు.స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్–ఎస్ రాకెట్ మొత్తం బరువు 545 కేజీలు. ఎత్తు ఆరు మీటర్లు. మిషన్ ప్రారంభ్ విజయోత్సాహంతో.. ఇది కొత్త ప్రారంభం అని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ ప్రకటించారు. మన అంతరిక్ష ప్రయోగాల్లో ఇదో కొత్త అధ్యాయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
ఇస్రో గ‘ఘన’ విజయం
-
ఇస్రో దీపావళి ధమాకా
సూళ్లూరుపేట: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(ఎస్డీఎస్సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్‌వెహికల్‌ఎం3–ఎం2 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకం రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి యత్నంలోనే ఇస్రో గ‘ఘన’ విజయం సొంతం చేసుకుంది. శనివారం అర్థరాత్రి 12 గంటల 7 నిమిషాల 40 సెకన్లకు స్పేస్‌సెంటర్ రెండో ప్రయోగవేదికగా ఈ రాకెట్‌ను ప్రయోగించారు. ఒకేసారి 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను పోలార్ లోయర్ ఎర్త్ ఆర్బిట్(ఎల్ఈఓ)లో ప్రవేశపెట్టారు. ఇస్రోకు చెందిన వాణిజ్యవిభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ చేస్తున్న తొలి వాణిజ్యపర ప్రాజెక్ట్ ఇది. బ్రిటన్‌కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్, భారతి ఎంటర్ప్రైజెస్ భాగస్వాములుగా వన్‌వెబ్ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. వన్‌వెబ్ ఇండియా–1 పేరిట 36 ఉప్రగ్రహాలను కక్ష్యలో పంపేందుకు వన్‌వెబ్‌తో న్యూస్పేస్ ఇండియా ఒప్పందం చేసుకుంది. వన్‌వెబ్ లిమిటెడ్ అనేది వివిధ దేశాల ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు అంతరిక్ష, ఇంటర్నెట్ సేవలు అందించే గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 648 శాటిలైట్లను నిర్వహిస్తోంది. రాకెట్ పేరు మార్చారు జీఎల్ఎల్వీ–ఎంకే3గా ఇన్నాళ్లు పిలవబడిన రాకెట్‌నే కాస్త ఆధునీకరించి కొత్తగా లాంచ్‌వెహికల్ ఎం3–ఎం2గా నామకరణం చేయడం గమనార్హం. జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్ష్య(జీటీవో)లోకి శాటిలైట్లను పంపే రాకెట్లకే జీఎస్ఎల్వీగా పిలుస్తున్నారు. శనివారం నాటి రాకెట్ జీటీవోకి పంపట్లేదు. ఎల్‌ఈఓలోకి పంపుతోంది. అందుకే దీనిని వేరే పేరుపెట్టారు. జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్ష్య(జీటీఓ)లోకి 4,000 కేజీల బరువును, ఎల్‌ఈఓలోకి దాదాపు 8,000 కేజీల బరువును తీసుకెళ్లే సత్తా లాంచ్‌వెహికల్ ఎం3–ఎం2 రాకెట్ సొంతం. ప్రయోగం ప్రత్యేకతలు ►36 శాటిలైట్ల మొత్తం బరువు 5,796 కేజీలు. ►ఇంతటి బరువును 43.5 మీటర్ల ఎత్తయిన ఒక భారతీయ రాకెట్ మోసుకెళ్లడం ఇదే తొలిసారి. ►ఎల్వీఎం3–ఎం2 రాకెట్‌తో తొలి వాణిజ్యపరమైన ప్రయోగం ►ఈ రకం రాకెట్‌తో లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ఉపగ్రహాలు పంపడం ఇదే ప్రథమం -
ఇస్రోకి చేరిన 36 వన్‌వెబ్ ఉపగ్రహాలు
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్‌కి చెందిన 36 ఉపగ్రహాలు శ్రీహరికోటలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కి చేరుకున్నాయి. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ–షార్) నుంచి జీఎస్ఎల్వీ–ఎంకే ఐఐఐ రాకెట్ ద్వారా వీటిని ప్రయోగించనున్నారు. ఇందుకోసం వన్‌వెబ్ సంస్థ .. ఇస్రోలో భాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్)తో చేతులు కలిపింది. ఈ ఏడాది మరో విడత, వచ్చే ఏడాది మరో మూడు విడతలు లాంచింగ్‌లు ఉంటాయని వన్‌వెబ్ తెలిపింది. లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో) ఉపగ్రహాల ద్వారా ఇప్పటికే అలాస్కా, కెనడా, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో కనెక్టివిటీ సర్వీసులు అందిస్తున్నట్లు వివరించింది. వన్‌వెబ్‌లో దేశీ దిగ్గజం భారతి ఎంటర్ప్రైజెస్ ప్రధాన ఇన్వెస్టరుగా ఉంది. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ షాక్: 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటికి! -
రాకెట్ లాంచ్‌ని ప్రత్యక్షంగా చూడాలనుందా?..అయితే ఇది మీకోసమే!
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా గగనతలంలోకి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపిస్తారు శాస్త్రవేత్తలు. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్తాయి రాకెట్లు. ఆ దృశ్యాలను ఎవరైనా టీవీలో చూడాల్సిందే. అయితే.. ఆ అద్భుతాన్ని ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). ఈ వారాంతంలో తన తదుపరి స్పేస్ మిషన్‌ను ప్రయోగించనుంది ఇస్రో. ఆ ప్రయోగాన్ని లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తోంది. నేరుగా చూడాలనుకునేవారు ముందుగా రిజిస్టర్ చేసుకోండి మరి. ఎస్ఎస్ఎల్వీ-డీ1/ఈఓఎస్-02 మిషన్‌ను 2022, ఆగస్టు 7న ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది ఇస్రో. ఆంధ్రప్రదేశ్, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పెస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుందని ట్విట్టర్లో పేర్కొంది ఇస్రో. ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆసక్తి ఉన్నవారు తమ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలంటూ ఓ లింక్‌ను షేర్ చేసింది. ఈ మిషన్ ద్వారా ఈఓఎస్-02 , ఆజాదిసాట్ అనే రెండు శాటిలైట్లను మోసకెళ్లనుంది రాకెట్. The launch of the SSLV-D1/EOS-02 Mission is scheduled for Sunday, August 7, 2022, at 9:18 am (IST) from Satish Dhawan Space Centre (SDSC), Sriharikota. ISRO invites citizens to the Launch View Gallery at SDSC to witness the launch. Registration is open at https://t.co/J9jd8yDs4a pic.twitter.com/rq37VfSfXu — ISRO (@isro) August 1, 2022 ఇదీ చదవండి: Viral Video: సముద్రంలో తెల్లటి చుక్కల్లా....జెల్లీ ఫిష్ సముహం -
పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం
సాక్షి, శ్రీహరికోట: నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ53 దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ53.. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం. చదవండి: సెట్టింగ్ ‘బంగార్రాజు’.. ఇదేందయ్యా ఇది.. ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి. -
ISRO: పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈఓఎస్–04, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్ శాట్-1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 కక్ష్యలోకి మోసుకెళ్లింది. సోమవారం ఉదయం 5.59కి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచదేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగరవేశారు. కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలివే.. ►వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం ఆర్ఐశాట్-1 ఉపగ్రహం ►భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం ఐఎన్ఎస్-2టీడీ ►భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం ఐఎన్ఎస్-2టీడీ ఉపగ్రహం ►భూమి అయానోస్పియర్ అధ్యయనం కోసం ఇన్స్పైర్ శాట్-1 ఉపగ్రహం స్పందించిన ఇస్రో చైర్మన్ పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. దీంతో శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. -
గగన్‌యాన్ మిషన్ కోసం మరో కీలక ప్రయోగం: ఇస్రో
శ్రీహరికోట : మానవ సహిత యాత్ర కోసం భారత్ గగన్‌యాన్ మిషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మిషన్ కోసం రష్యాలో ఒక సంవత్సరం పాటు భారత వ్యోమగాములు శిక్షణను కూడా పూర్తి చేశారు. గగన్ యాన్ మిషన్ కోసం మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేయాలని ఇస్రో భావిస్తోంది. గగన్‌యాన్ మిషన్‌తో డేటా వినిమయం జరపడం కోసం ప్రత్యేకంగా డాటా రిలే సాటిలైట్ను ప్రయోగించనుంది. గగన్‌యాన్ మిషన్‌కు ముందుగా ఈ శాటిలైట్‌ను ఇస్రో ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది వ్యోమగాములను లోయర్ ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)కు పంపడానికి ఉపయోగపడుతుంది. మొదటి దశలో భాగంగా ఈ మానవరహిత మిషన్ డిసెంబర్ నెలలో ప్రారంభించనున్నారు. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా వ్యోమగాములు వెళ్లే అంతరిక్ష నౌకకు డేటారిలే ఉపగ్రహంగా పనిచేస్తోందని, అందుకోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.800 కోట్లకు ఆమోదం తెలిపిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. నిర్ణీత కక్షలో తిరిగే శాటిలైట్‌కు, భూమి మీద ఉండే గ్రౌండ్ స్టేషనుకు సరైన సంబంధం లేకుంటే శాటిలైట్ అందించే డేటా భూమి పైకి చేరదు. దీన్ని నిరోధించడానికి డేటా రిలే శాటిలైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాగా, నాసా మానవ సహిత అంతరిక్ష నౌకల కోసం, అత్యంత బలమైన డేటా రిలే ఉపగ్రహాన్ని కలిగి ఉంది. భూమిపై ఎలాంటి ప్రత్యేకమైన గ్రౌండ్ స్టేషన్ అవసరం లేకుండానే నిర్ణీత కక్షలో తిరిగే అన్ని ఉపగ్రహాలను ఈ డేటారిలే శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మారిషస్, బ్రూనై, ఇండోనేషియా, బియాక్‌లో ఉండే గ్రౌండ్ స్టేషన్లను ఇస్రో ఉపయోగిస్తుంది. గగన్‌యాన్ మిషన్ కోసం కోకో దీవుల్లో గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నట్లు గత నెల ఇస్రో చైర్పర్సన్ కే శివన్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సీఎన్ఈఎస్తో గగన్‌యాన్ సహకారం కోసం ఒక ఒప్పందంపై ఇస్రో సంతకం చేసింది. చదవండి: షార్‌లో పాక్షిక లాక్డౌన్ -
ఇస్రో సూపర్ సక్సెస్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన పీఎస్ఎల్వీ సీ51 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. ఈ ఏడాది మొట్టమొదటగా ఆదివారం ఉదయం 10.24 గంటలకు ప్రయోగించిన రాకెట్ విజయంతో శుభారంభమైంది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 53వ ప్రయోగంతో షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన 78వ ప్రయోగం ఇది. 44.4 మీటర్ల పొడవైన పీఎస్ఎల్వీ సీ51 రాకెట్‌కు సంబంధించి శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగి వైపు దూసుకెళ్లింది. 1.38 గంటల వ్యవధిలో 19 ఉపగ్రహాలను భూమికి 537 నుంచి 637 కిలో మీటర్లు పరిధిలోని వివిధ సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది. ఇటీవల ఏర్పాటైన ఇస్రో అనుబంధ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాణిజ్యపరంగా చేపట్టిన ఈ మొట్టమొదటి మిషన్‌లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–01 ఉపగ్రహం ప్రధానమైంది. 637 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని 17.23 నిమిషాల్లో సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత పీఎస్ఎల్వీ సీ51 రాకెట్లో నాలుగో దశలో అమెరికాకు చెందిన స్పేస్‌బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12 చిన్న తరహా ఉపగ్రహాలు, సాయ్–1 కాంటాక్ట్–2 అనే మరో ఉపగ్రహంతో కలిపి 13 ఉపగ్రహాల శ్రేణిని ఒకసారి, తమిళనాడు కోయంబత్తూరులోని శ్రీశక్తి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన శ్రీ శక్తిశాట్, శ్రీపెరంబుదూర్‌లోని జెప్పియర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జిట్‌శాట్, మహారాష్ట్ర నాగపూర్‌లోని జీహెచ్ రాయ్సోనీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జీహెచ్ఆర్సీ ఈశాట్ మూడు ఉపగ్రహాలను యూనిటిశాట్స్‌ను, న్యూ స్పేస్ ఇండియాలో భాగంగా భారత ప్రైవేట్ సంస్థలు రూపొందించిన సింధునేత్ర, సతీష్ ధవన్ శాట్‌లను కలిపి మరో శ్రేణిగా చేర్చి రోదసీలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టడంతో ప్రయోగం పూర్తయింది. ఈ మిషన్‌తో ఇస్రో ఇప్పటి వరకు 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించినట్లయింది. 14 మిషన్ల ప్రయోగమే లక్ష్యం: డాక్టర్ కె.శివన్, ఈ ఏడాదిలో 14 మిషన్లు ప్రయోగించాలనే లక్ష్యంతో పని చేయాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు పిలుపునిచ్చారు. పీఎస్ఎల్వీ సీ51 ప్రయోగం విజయవంతమైన అనంతరం శివన్ షార్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ 14 మిషన్ల ప్రయోగంలో భాగంగా 7 లాంచింగ్ వెహికల్స్, ఆరు ఉపగ్రహాలు, ఒక మానవరహిత ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 2020లో కోవిడ్–19 వల్ల ప్రయోగాల విషయంలో వెనుకబడ్డామని, ఇకపై వేగం పెంచుతామని తెలిపారు. బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–01ను ఇక్కడ నుంచి ప్రయోగించడం సంతోషంగా ఉందన్నారు. అనుకున్న ప్రకారం 17.23 నిమిషాలకు అమెజానియా–01 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన కొద్ది నిమిషాలకు సోలార్ ప్యానెల్స్ పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు. పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ ద్వారా అమెజానియా–01 ఉపగ్రహం సక్సెస్ పుల్గా కక్ష్యలోకి చేరుకున్నందుకు సంతోషంగా ఉందని బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ కెసార్ పొంటీస్ అన్నారు. ప్రయోగం విజయం అనంతరం ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ అమోఘం అని, ఈ రాకెట్ తయారు చేసిన టీంను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భారత్‌లో ప్రైవేట్ సంస్థలకు ఆహ్వానం పలికేందుకు న్యూ స్పేస్ ఇండియాను ఏర్పాటు చేశామని సీఎండీ నారాయణన్ తెలిపారు. భారత్‌లో ప్రైవేట్ సంస్థలకు చెందిన వారు ఉప గ్రహాలను తయారు చేసుకుంటే వాటిని ఇస్రో ప్రయోగించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రముఖుల అభినందనలు వాణిజ్యపరంగా మొట్టమొదటిసారిగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధాని మోదీ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. దేశం చేపట్టిన సంస్కరణలు అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త శకానికి నాందిపలికాయన్నారు. అమెజానియా ప్రయోగం విజయవంతం కావడంపై బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారోకు ప్రధాని అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో రెండు దేశాల మధ్య సహకారానికి నాందికానుందన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రోకు ఏపీ గవర్నర్ అభినందనలు సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సి–51 రాకెట్ ప్రయోగం విజయవంతంకావడంపట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఏపీ ముఖ్యమంత్రి అభినందనలు పీఎస్ఎల్వీ –సీ 51 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇస్రో భవిష్యత్‌లో చేపట్టే అన్ని ప్రయోగాల్లోనూ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
శ్రీహరికోట: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-51
-
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్
-
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-51
సూళ్లూరుపేట/తిరుమల/శ్రీకాళహస్తి: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించింది. పీఎస్ఎల్వీ సీ 51 ద్వారా బ్రెజిల్ దేశానికి చెందిన అమెజానియా–1 ఉపగ్రహం(637 కిలోల బరువు), అమెరికాకు చెందిన స్పేస్ బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12, సాయ్–1 నానో కాంటాక్ట్–2 ఉపగ్రహాలు, న్యూ స్పేస్ ఇండియా పేరుతో భారత ప్రైవేట్ సంస్థలకు చెందిన సతీష్ ధవన్ శాట్, సింధు నేత్ర, దేశంలోని మూడు వర్సిటీలకు చెందిన శ్రీ శక్తి శాట్, జిట్ శాట్, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌లను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. వీటిలోని ఒక శాటిలైట్‌లో తొలిసారిగా మోదీ ఫొటో, భగవద్గీత అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. వైఎస్ జగన్ అభినందనలు.. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
శ్రీహరికోట షార్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎలక్ట్రిక్ ప్యానెల్ గదులు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. యూపీఎస్‌లో సాంకేతిక లోపంతోనే ఈ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జీఎస్ఎల్వీ ఎఫ్-10 ప్రయోగం వాయిదా
సాక్షి, శ్రీహరికోట : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 5.43 గంటలకు నింగిలోకి ఎగరాల్సిన జీఎస్ఎల్వీ ఎఫ్-10 ను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ప్రారంభించిన కౌంట్‌డౌన్ ప్రక్రియను నిలిపివేశామన్నారు. కాగా ప్రయోగాన్ని నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఇస్రో అధికారులు ట్విటర్లో ఈ విషయాన్ని దృవీకరించారు. జియోస్టేషనరీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను భారత్ ప్రయోగించడం ఇదే తొలిసారి. ఓ ప్రాంతానికి సంబంధించిన రియల్ టైమ్ ఇమేజ్‌లను ఈ ఉపగ్రహం అందిస్తుంది. ప్రకృతి విపత్తులను కూడా ఇది మానిటర్ చేస్తుంది. జీశాట్-1 బరువు 2275 కిలోలు. శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్‌ను నుంచి జీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగిస్తారు. 18 నిమిషాల తర్వాత జీశాట్-1 ఉపగ్రహం... జీటీవో కక్ష్యలోకి చేరుకుంటుంది. జియోస్టేషనరీ ఆర్బిట్ భూమికి సుమారు 36వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జీశాట్-1 ఉపగ్రహం ఏడేళ్ల పాటు పనిచేయనున్నది. The launch of GISAT-1 onboard GSLV-F10, planned for March 05, 2020, is postponed due to technical reasons. Revised launch date will be informed in due course. — ISRO (@isro) March 4, 2020 -
నేడే కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 5.43 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్10) నింగిలోకి దూసుకెళ్లనుంది. కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి సాయంత్రం 3.43 గంటలకు కౌంట్ డౌన్ ♦ ఇస్రో చైర్మన్ డాక్టర్ కే.శివన్ చేతులు మీదుగా బుధవారం సాయంత్రం 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం. 10 గంటలకు ఎంఆర్ఆర్ సమావేశం ♦ బుధవారం ఉదయం 10 గంటలకు షార్‌లోని బ్రహ్మ ప్రకాష్ హాలులో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం. ♦ రాకెట్‌లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు పూర్తి చేసి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు ప్రయోగ పనులు. ♦ ‘ల్యాబ్’ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్. ♦ జీఐశాట్–1 ఉపగ్రహాల్లో ఇది మొట్టమొదటిది ♦ బుధవారం సాయంత్రం నుంచి రాకెట్ రెండోదశలో ద్రవ ఇంధనం నింపే ప్రక్రియ ♦ గురువారం ఉదయం నుంచి రాకెట్‌కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియకు ఏర్పాట్లు. ♦ గురువారం సాయంత్రం 5.43 గంటలకు 2,268 కిలోల బరువు కలిగిన జీఐశాట్–1 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ ఎఫ్–10 రాకెట్ నింగికి దూసుకు వెళ్తుంది. ♦ ఇది షార్ కేంద్రం నుంచి 76వ ప్రయోగం. ♦ జీఎస్ఎల్వీ మార్క్–2 సిరీస్‌లో 14వ ప్రయోగం. ♦ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజన్లతో నిర్వహిస్తున్న 8వ ప్రయోగం. ఇస్రో చరిత్రలో నూతన ఉపగ్రహం జీఎస్ఎల్వీ ఎఫ్10 (జీఎస్ఎల్వీ మార్క్ 2) రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన జీఐశాట్–1 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లో ప్రవేశపెట్టనున్నారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు)ను భూమికి 506 – 830 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్థన ధృవకక్ష్య)లోకి మాత్రమే పంపేవారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు), నావిగేషన్ శాటిలైట్స్ (దిక్సూచి ఉపగ్రహాలు)ను భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి పంపేవారు. ఈసారి జియో ఇమేజింగ్ శాటిలైట్ పేరుతో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్ట మొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపి పని చేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించడం విశేషం. దీని తరువాత జూలైలో జీఎస్ఎల్వీ ఎఫ్12 రాకెట్ ద్వారా జీఐశాట్–2 రెండో ఉపగ్రహాన్ని కూడా పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థతో అనుసంధానం, విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ రెండు భారీ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. -
నేటి ముఖ్యాంశాలు
⇒ ఏపీలో ఇంటర్ పరీక్షలు.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహణ ⇒ తెలంగాణలో ఇంటర్ పరీక్షలు..ఉదయం 8:45లోపు సెంటర్ లోపలికి వెళ్లాలని నిబంధన, నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ ⇒ ఏపీ కేబినెట్ సమావేశం.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై చర్చ ⇒ శ్రీహరికోట: జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగానికి రంగం సిద్ధం.. నేటి సాయంత్రం 3:43గంటలకు కౌంట్‌డౌన్, రేపు సాయంత్రం 5:43 గంటలకు నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్-10 హైదరాబాద్‌లో నేడు ⇒ దివా వెడ్నస్ డే విత్ డిజే వినిష్ వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్, బేగంపేట్ సమయం: రాత్రి 8 గంటలకు ⇒ లేడీస్ కిట్టీ పార్టీ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 10 గంటలకు ⇒ ఇండియా సాఫ్ట్ వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ( హెచ్ఐసీసీ), మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ⇒ ఇండియన్ మీడియా, ఎంటర్టైన్మెంట్ కాన్క్లేవ్ వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ( హెచ్ఐసీసీ), మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ⇒ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, సెలబ్రేషన్స్ బై కే లక్ష్మి వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్ సమయం: రాత్రి 8 గంటలకు ⇒ లేబల్ లవ్ – ఎగ్జిబిషన్, సేల్ బై శశి నహతా వేదిక: హయత్ ప్లేస్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ⇒ హిందీ క్లాసెస్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 4 గంటలకు ⇒ వర్క్ షాప్ ఆన్ ఐఎల్ఇఏ వేదిక: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, బాచుపల్లి సమయం: ఉదయం 9 గంటలకు ⇒ ఆర్ట్ ఎగ్జిబిషన్ బై జొగెన్ చౌదరి, రాంకుమార్ వేదిక:కళాకృతి, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ⇒ ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నరసింహ గౌడ వేదిక: సాలార్జంగ్ మ్యూజియం సమయం: ఉదయం 10 గంటలకు ⇒ ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ – ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ⇒ సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్ డక్కన్ , బంజారాహిల్స్ సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు ⇒ ఛాంపియన్ బ్రంచ్ వేదిక: రడిషన్ హైదరాబాద్ , హైటెక్ సిటీ సమయం:మధ్యామ్నం 12–30 గంటలకు ⇒ చెస్ వర్క్‌షాప్ వేదిక: కైట్స్ ఆండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ⇒ బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ , మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు ⇒ వినికిడి ఉచిత వైద్య పరీక్షలు వేదిక: నోవా ఈఎన్టీ హాస్పిటల్, సోమాజిగూడ సమయం: ఉదయం 9 గంటలకు -
విదేశీ ఉపగ్రహ మార్కెట్‌పై ఇస్రో దృష్టి
సాక్షి, అమరావతి: ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక కావడం గమనార్హం. అతి తక్కువ వ్యయంతో ఒకేసారి పలు ఉపగ్రహాలను నింగిలోకి పంపే సామర్థ్యాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కలిగి ఉండటంతో విదేశాలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. 1999లో తొలిసారిగా జర్మనీకి చెందిన డీఎల్ఆర్–టబ్‌సాట్ రిమోట్ సెన్సింగ్ మైక్రో శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఇస్రో ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు 33 దేశాలకు చెందిన 319 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఇస్రో స్వయం ప్రతిపత్తి... విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో2018–19లో రికార్డు స్థాయిలో రూ.324.19 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2017–18లో రూ.232.56 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. గడిచిన ఐదేళ్లలో రూ.1,245.17 కోట్ల నికర ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇస్రో తన ప్రయోగాలకు సొంతంగానే నిధులను సమకూర్చుకునే స్థితికి చేరుకుంటోంది. విదేశీ ఉపగ్రహ ప్రయోగాల కోసం బెంగళూరు కేంద్రంగా ఆంట్రిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. 1992లో ఏర్పాటైన ఈ సంస్థ గడిచిన మూడేళ్లలో 239 ఒప్పందాల ద్వారా రూ.6,280 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని సముపార్జించింది. విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో పీఎస్ఎల్వీ కీలకపాత్ర పోషిస్తోంది. ఇంతవరకు పీఎస్ఎల్వీ 52.7 టన్నుల శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది. గత నెలలోనే పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. వచ్చే మార్చిలోగా ఆరుసార్లు ఉపగ్రహాలను నింగిలోకి పంపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. పదేళ్లలో రూ.20,300 కోట్లు రానున్న పదేళ్లలో అంతర్జాతీయ శాటిలైట్ మార్కెట్ వేగంగా విస్తరించనుందని బీఐఎస్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17,000కుపైగా మినీ శాటిలైట్లను ప్రయోగిస్తారని చెబుతోంది. ప్రస్తుతం రూ.3,591 కోట్లుగా ఉన్న శాటిలైట్ లాంచింగ్ మార్కెట్ విలువ 2030 నాటికి రూ.20,300 కోట్లకు చేరుతుందని బీఐఎస్ లెక్కగట్టింది. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఇస్రో వాటా కేవలం 2 శాతమే. ఈ వ్యాపార అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి ఆంట్రిక్స్కు అనుబంధంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) పేరిట 2019లో మరో సంస్థను ఇస్రో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ విదేశాలకు చెందిన ఉపగ్రహ ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధి వ్యాపారంపై దృష్టి సారిస్తుంది. -
ప్లాటినం షార్, శాస్త్రవేత్తల సంబురాలు
సాక్షి, సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. అయిదేళ్లపాటుసేవలు అందించనున్న ఈ వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మరోవైపు రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. పీఎస్ఎల్వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్ అనే ఉపగ్రహాలు, టైవోక్–0129, ఆరు ఐహోప్‌శాట్ ఉపగ్రహాలు, జపాన్‌కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన తైవాక్–0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫ్యాట్–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు. రిశాట్-2బీఆర్1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగించారు. ఇక ఇస్రో ప్రయోగాల్లో పీఎస్ఎల్వీ రాకెట్‌కు ప్రత్యేక స్థానమున్నది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాకెట్లలో ఒకటిగా దీనికి పేరుంది. 49 ప్రయోగాల్లో కేవలం రెండు మాత్రమే విఫలమయ్యాయి. మూడో తరం లాంచ్ వెహికల్ అయిన పీఎస్ఎల్వీ.. చంద్రయాన్-1, మంగళ్యాన్ మిషన్లను విజయవంతం చేసింది. కాగా ఇప్పటివరకూ 74 రకాల రాకెట్లను నింగిలోకి పంపిన ఇస్రో... ఈ ప్రయోగంతో ప్లాటినం జూబ్లీని అందుకుంది. అంతేకాకుండా పీఎస్ఎల్వీ సిరీస్‌లో 50వ ప్రయోగానికి విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రాయన్-1,2, మంగళ్యాన్-1 వంటి గ్రహాంతర ప్రయోగాలకు వేదికిగా నిలిచింది. 2020లో గగన్‌యాన్‌కు సమాయత్తమవుతోంది. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని ప్రయోగాలు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మాట్లాడుతూ... ‘ ఈ రోజు చారిత్రాత్మకమైన 50వ పీఎస్ఎల్వీ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించాం. శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగం. 26 సంవత్సరాల పీఎస్ఎల్వీ రాకెట్ విజయాలలో ఎందరో శాస్త్రవేత్తల కృషి ఉంది. పీఎస్ఎల్వీని వివిధ రకాలుగా అభివృద్ధి చేశాం. భవిష్యత్‌లో ఎన్నో ప్రయోగాలకు ఇస్రో సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఓ ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీఎస్ఎల్వీ ఆధునీకరణలో కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తల వివరాలను ఈ పుస్తకంలో సవివరంగా ప్రచురించారు. సీఎం వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
పీఎస్ఎల్వీ సీ-48 కౌంట్‌డౌన్ స్టార్ట్
-
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ–48
సూళ్లూరుపేట/తిరుమల: పీఎస్ఎల్వీ సీ–48 ఉపగ్రహ వాహక నౌక బుధవారం సాయంత్రం 3.25 గంటలకు నింగిలోకి దూసుకుపోనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి రోదసీలోకి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు పూర్తిచేసింది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ఇస్రో చైర్మన్ కె.శివన్ సమక్షంలో కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. పీఎస్ఎల్వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్ అనే ఉపగ్రహాలు, టైవోక్–0129, ఆరు ఐహోప్‌శాట్ ఉపగ్రహాలు, జపాన్‌కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన తైవాక్–0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫ్యాట్–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఇస్రో చైర్మన్ కె.శివన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ఇది ఇస్రోకు చరిత్రాత్మక ప్రయోగమన్నారు. -
షార్‌లో హై అలర్ట్..
సాక్షి, నెల్లూరు: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బంగాళాఖాతంలో 50 నాటికల్ మైళ్ళ మేర సీఐఎస్ఎఫ్, మెరైన్ పోలీసుల విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. షార్ తీరంలో తిరిగే పడవలపై మరింత నిఘా పెట్టారు. తీర ప్రాంతంలో రోజూ కన్న మరింత ఎక్కువ బలగాలను మోహరించిన గస్తీని కట్టుదిట్టం చేశారు. మరోవైపు శ్రీహరికోట మొదటి, రెండో గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. కొత్తవారి కదలికలపై నిఘా ఉంచారు. శ్రీహరికోట సమీపంలోని అడవుల్లో బలగాలు కూంబింగ్ చేపట్టారు. అలాగే రొట్టెల పండుగ సందర్భంగా వేనాడు దర్గాకు వచ్చే వాహనాల తనిఖీలు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. -
షార్.. నిశ్శబ్దం!
షార్‌లో కొన్ని గంటలకు ముందు హుషార్. చివరి క్షణాల్లో ఉద్విగ్న వాతావరణం. అంతలోనే నిశ్శబ్దం. భారత్‌కు ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగే అద్భుత క్షణాల కోసం యావత్ ప్రపంచంతో పాటు షార్ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూశారు. చివరి పావుగంటలో ల్యాండర్ నిర్ణీత కక్ష్యలో పయనిస్తూ వచ్చింది. అన్ని స్టేజీల్లోనూ సవ్యమార్గంలో వచ్చిన ల్యాండర్ చివరి స్టేజీలో గతితప్పింది. ల్యాండర్ చివరి క్షణంలో సిగ్నల్స్ అందకపోవడంతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. మరి కొన్ని క్షణల్లో సంబరాలకు సిద్ధంగా ఉన్న శ్రీహరికోటలోని షార్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు నిరాశకు గురయ్యారు. షార్ కేంద్రంగా ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేశారు. గ్రహాంతర ప్రయోగాలు చేసి ఉత్సాహంగా గగన్‌యాన్‌కు ముందడుగు వేస్తున్న ఈ తరుణంలో ఈ విఫలం వారిని ఎంతో బాధకు గురి చేస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కళ్లల్లో ఒత్తులేసుకుని టీవీలకు అతుక్కుపోయి వీక్షించారు. సాక్షి, సూళ్లూరుపేట: జిల్లాలోని షార్ కేంద్రంగా ఇప్పటి వరకూ 73 ప్రయోగాలు చేశారు. అందులో పది మాత్రమే విఫలం అయ్యాయి. 2004లోనే గ్రహాంతర ప్రయోగాలకు షార్ వేదికగా ఇస్రో శ్రీకారం చుట్టింది. 2008లో చంద్రయాన్–1 ప్రయోగించిన అనంతరం చంద్రయాన్–2కు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. దశాబ్దం పాటు అహర్నిశలు శ్రమ కోర్చి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అగ్రదేశాలకు దీటుగా చంద్రయాన్–2ను తయారు చేశారు. 2009 నుంచి ఎన్నో ప్రయోగాత్మక ప్రయోగాలు చేశారు. పూర్తి స్థాయిలో అన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఈ ఏడాది జూలై 14 జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ద్వారా సుమారు 3.6 టన్నుల బరువు కలిగిన ఆర్బిటర్–విక్రమ్ ల్యాండర్– రోవర్ (ప్రజ్ఞాన్) త్రీఇన్‌వన్ ప్రయోగాన్ని చేయాలని మహూర్తం నిర్ణయించుకున్నారు. ప్రయోగం మరో గంటలో ఉందనగా ఆఖరి గంటలో కౌంట్‌డౌన్ సమయాన్ని నిలిపివేశారు. అయినా నిరాశ చెందకుండా చాలెంజ్‌గా తీసుకుని క్రయోజనిక్ దశలో చిన్నపాటి లీకేజీని వారం రోజుల్లో సరిచేసి ప్రయోగానికి సిద్ధమయ్యారు. జూలై 22వ తేదీన చంద్రయాన్ మిషన్‌ను షార్ రెండో నింగిలోకి పంపారు. ఆ తర్వాత అన్ని దశలనూ విజయవంతంగా నిర్వహించారు. అనుకున్న దానికంటే వ్యోమనౌక నింగిలో దూసుకుపోతూ జాబిల్లి చెంతకు పయనిస్తుండడంతో శాస్త్రవేత్తల ఆనందాలకు అవధుల్లేకుండా పోయింది. ఈ నెల 2వ తేదీన ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. ఈ నెల 3, 4 తేదీల్లో ల్యాండర్‌లోని ఇంధనాన్ని మండించి చంద్రుడికి అత్యంత దగ్గరగా తీసుకెళ్లారు. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటలలోపు చంద్రుడి ఉపరితలంపై దించే ఆపరేషన్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చంద్రుడికి 2.1 కిలో మీటర్లు దూరంలోకి చేరుకున్నాక ల్యాండర్ నుంచి బైలాలులోని భూనియంత్రత కేంద్రానికి సిగ్నల్స్ తెగిపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు దేశ ప్రజలంతా కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ 15 నిమిషాలు.. ముందు నుంచి శాస్త్రవేత్తలు ల్యాండర్ దిగే 15 నిమిషాలు ఎంతో కీలకంగా భావించారు. అంతా సవ్వంగా సాగిపోతూ 14 నిమిషాలు దాటిపోయింది. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయి అవాంతరం ఏర్పడింది. ఇస్రో చైర్మన్ డాక్టక్ కే శివన్‌తో పాటు శాస్త్రవేత్తలంతా కలత చెందారు. పదేళ్లు చేసిన కఠోర శ్రమ, మరో వైపు ప్రయోగం జరిగిన తర్వాత 48 రోజులు పడిన శ్రమ ఇలా అయిందని ఆవేదన చెందారు. ఏదైనా అద్భుతం జరుగుతుందా! వికమ్ర్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోతే ప్రయోగం విఫలం అయినట్టు కాదని షార్ ఉద్యోగులు అంటున్నారు. ల్యాండర్ చంద్రుడి వైపునకు వెళుతున్న సమయంలో దానికి ఉన్న సౌరపలకాలు విద్యుత్ సరఫరా చేస్తాయి. అంటే సూర్యుడి కిరణాలు సౌర పలకాలపై ప్రసరిస్తే అందులో నుంచి విద్యుత్ ఉత్పత్తి అయి భూనియంత్రిత కేంద్రానికి సిగ్నల్స్ అందజేస్తుంది. ఇది చదవండి : రైతు బిడ్డ నుంచి రాకెట్ మ్యాన్ సౌర కుటుంబంలోని గ్రహాలు ఒకదాని చుట్టూ ఒకటి తిరిగే క్రమంలో చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి అడ్డం రావడంతో సూర్య కిరణాలు ప్రసరించకపోవడం వల్ల సౌర పలకాల నుంచి విద్యుత్ అందకపోవడంతో సిగ్నల్స్ అందలేదని వాదన వినిపిస్తోంది. ఒక లూనార్ డే అంటే 14 రోజుల పాటు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డు ఉంటుందని, ఈ 14 రోజులు గడిస్తే మళ్లీ సౌరపలాకలపై సూర్యకిరణాలు ప్రసరించి విద్యుత్ అందజేసిన వెంటనే ల్యాండర్ నుంచి సిగ్నల్స్ అందే అవకాశం లేకపోలేదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రయాన్–2 చూసొద్దాం
సాక్షి, రామగుండం : సాధారణంగా ఇస్రో నుంచి ఉపగ్రహాలను పంపించడం ప్రసార మాధ్యమాల్లో చూస్తుంటాం. ఇటీవల చంద్రయాన్–2ను పంపించి ప్రపంచ దృష్టిని ఆకర్శించింది. అలాంటిది ఇస్రో కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి చంద్రయాన్–2 చంద్రుడి మీద దిగడం ప్రత్యక్షంగా చూసే అవకాశం కొంత మంది విద్యార్థులకు దక్కనుంది. ఇందుకుగాను ఎనిమిది నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఇస్రో నిర్వహించచే ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ చూపితే సరిపోతుంది. భారత సాంకేతిక ఎదుగుదల గురించి విద్యార్థులకు ఆసక్తి కలిగించేందుకు ‘ఇస్రో మైగవ్’ ఆన్లైన్ ప్రతిభాపాటవ పోటీలను నిర్వహిస్తోంది. ఈనెల 10 నుంచి ఆన్లైన్ ద్వారా అభ్యర్థనలు పంపుకోవాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలు పొందుపరిచారు. ఎనిమిది నుంచి పదో తరగతిచదువుతున్న విద్యార్థులెవ్వరైనా ‘ఇస్రో మై గవ్’లో మొదట ఆన్లైన్ ఖాతా ప్రారంభించాలి. విద్యార్థి నమోదు ధ్రువీకరణ జరిగిన అనంతరం వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థికి పెద్దవారు సహకరించవచ్చు. కానీ ఏకంగా వారే సమాధానాలు ఇవ్వకుండా నైతికత పాటించాలని నిర్వాహకులు చెబుతున్నారు. పోటీ ఇలా.. ఆన్‌లైన్‌ను అనుసంధానం చేసుకొని ‘ఇస్రో మై గవ్’ అని ఆంగ్లంలో చిరునామా నమోదు చేయగానే వివరాలు వస్తాయి. రెండో అంశంపై ఎంటర్ నొక్కగానే వివరాలు, నియమ నిబంధనలు తెలిసిపోతాయి. ఈనెల 10వ తేదీ 12.01 గంటల నుంచి 20వ తేదీ, 11.59 గంటల వరకు ఆన్లైన్లో సమాధానాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. పది నిమిషాల వ్యవధిలో ఇరవై ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. ఒక్కసారి పోటీ ప్రారంభమయ్యాక మధ్యలో ఆపడం ఉండదు. తెరపై ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వాలి. తెలియకపోతే తప్పుకొని తర్వాత వచ్చే ప్రశ్న తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఎంపిక విధానం.. వేగం కచ్చితత్వంతోపాటు స్పందించే మనస్తత్వం ఉన్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రతీ రాష్ట్రం నుంచి ఇద్దరేసి ప్రతిభావంతులను గుర్తిస్తారు. విజేతల సంఖ్య ఎక్కువగా ఉంటే అతి తక్కువ వ్యవధిలో అత్యధికంగా సరైన సమాధానాలు రాసిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జయపత్రం అందిస్తారు. చంద్రయాన్–2 చంద్రుడి మీదకు దిగే క్రమాన్ని స్వయంగా వీక్షించడానికి బెంగళూరులోని ఇస్రో కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలో విజేతలైన విద్యార్థులు మిగతా రాష్ట్రాల విజేతలతోపాటు ప్రధానమంత్రి మోడీతో కలిసి చంద్రయాన్ చంద్రుడి మీదకు దిగే అపురూపమైన సన్నివేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. తగు ఆధారాలు, ధ్రువపత్రాలతో ఇస్రోను సంప్రదిస్తే విజేతలకు ఆహ్వానం పంపిస్తారు. -
చంద్రయాన్-2 విజయం వెనుక ఆ ఇద్దరు..
న్యూఢిల్లీ: దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైంది. ఇది భారతదేశ చరిత్రలో మరొక గర్వించదగిన క్షణం. చంద్రయాన్ -2 ప్రయోగం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జరిగింది. ఉపగ్రహం దాదాపుగా 3 లక్షల కి.మీ.కు పైగా ప్రయానించి చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరనుంది. చంద్రయాన్-2 చంద్రుని కక్ష్య చేరేందుకు 45 రోజుల సమయం పట్టనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం ఉపగ్రహం నుంచి లాండర్ వేరుపడనుంది. ఇస్రో వ్యవస్థాపక శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ పేరును లాండర్‌కు పెట్టారు. ప్రయోగం విజయవంతం కావడం వెనుక ఉన్న ఇద్దరు మహిళలను దేశం మొత్తం ప్రశంసిస్తోంది. భారతదేశ చరిత్రలో మొదటిసారి, ఇస్రో యాత్రకు ఇద్దరు మహిళలు నాయకత్వం వహించారు. చంద్రయాన్-2 ప్రయోగానికి ముత్తయ్య వనిత ప్రాజెక్ట్ డైరెక్టర్ కాగా, రితు కరిధల్ చంద్రయాన్ -2 మిషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రయోగం విజయవంతం కావడంలో మహిళల పాత్ర కూడా కీలకం. దాదాపు 30శాతం మంది మహిళలు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. భారతదేశపు అంతరిక్ష మిషన్ చరిత్రలో మొదటిసారి మహిళా శాస్త్రవేత్తల నేతృత్వంలో ప్రయోగం జరిగింది. ఈ మిషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తలను యావత్ దేశం అభినందిస్తోంది. -
అంతరిక్ష యవనికపై జాబిల్లికి జైత్రయాత్ర!
శ్రీహరికోట (సూళ్లూరుపేట) : భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43గంటలకు 3,850 కిలోల జీఎస్ ఎల్వీ– మార్క్–3 ఎం1 వాహక నౌకను ప్రయోగించడానికి సర్వం సిద్ధం చేశారు. పదేళ్లపాటు ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి రూపొందించిన ఈ చంద్ర యాన్–2 మిషన్‌కు ఆదివారం సా.6.43గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఏ రాజ రాజన్ ఆధ్వర్యంలో ఆదివారం లాంచ్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ల్యాబ్ మీటింగ్‌లో సా.6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించాలని నిర్ణయించారు. 20 గంటల కౌంట్‌డౌన్ సమయంలో భాగంగా ఆదివారం రాత్రికి మూడో దశలోని క్రయోజనిక్ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. అలాగే, సోమవారం వేకువజామున రాకెట్‌కు రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తిచేయడానికి పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ద్రవ ఇంధనం నింపిన అనంతరం రాకెట్‌కు పలు పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత ప్రయోగానికి మరికొన్ని గంటల ముందు రాకెట్లో హీలియం గ్యాస్ నింపడానికి, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యవస్థలను అప్రమత్తం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రయాన్–2 ప్రయోగం ఇస్రో చరిత్రలో అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోయే ప్రయోగంగా చెప్పవచ్చు. ఇంతపెద్ద రాకెట్‌ను, ఇంతపెద్ద ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ప్రయోగాన్ని ఇస్రో చరిత్రలో భారీ ప్రయోగంగా అభివర్ణిస్తున్నారు. నేటి మ.2.43 గంటలకు వినువీధిలోకి.. కాగా, 20 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం మ.2.43 గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గ్రహాంతర ప్రయోగాల్లో ఈ ప్రయోగం మూడోది. చంద్రునిపై పరిశోధనలు చేయడానికి చేస్తున్న రెండో ప్రయోగం. షార్ నుంచి 75వ ప్రయోగం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ముందుగా అనుకున్నట్లుగా ఈనెల 15వ తేదీన జరగాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. -
శ్రీహరికోటకు చేరుకున్న రాష్ట్రపతి
సూళ్లురుపేట : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు చేరుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఆయన వీక్షించనున్నారు. సోమవారం వేకువ జామున 2.51 గంటలకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇందుకోసం ఆదివారం సాయంత్రం శ్రీహరికోటకు చేరుకున్న రాష్ట్రపతికి ఇస్రో చైర్మన్ శివన్, నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఘన స్వాగతం పలికారు. శ్రీహరికోటలోని రెండో వాహక అనుసంధాన భవనాన్ని రాష్ట్రపతి పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేతలు ఇస్రో ప్రయోగాల తీరు తెన్నులను రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా శ్రీహరికోట పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, కోవింద్ షార్ కేంద్రాన్ని సందర్శించిన నాలుగో రాష్ట్రపతి కావడం విశేషం. అంతకుముందు రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిని, ఈఓ సింఘాల్‌ను రాష్ట్రపతి అభినందించారు. అనంతరం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, చిత్తూరు కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తాలు వీడ్కోలు పలికారు. -
చందమామపైకి చలో చలో
సూళ్లూరుపేట (శ్రీహరికోట)/తిరుమల: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టనున్న ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది. నెల్లూరు జిల్లా సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం వేకువజామున 2.51 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. షార్‌లోని బ్రహ్మ ప్రకాశ్ హాలులో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్యర్యంలో, ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ పర్యవేక్షణలో శనివారం మిషన్ సంసిద్ధత సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 7 నుంచి శనివారం దాకా ప్రయోగ వేదిక మీదున్న రాకెట్‌కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాక ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాకెట్ సిద్ధంగా ఉందని, పరీక్షలన్నీ పూర్తి చేశామని చెప్పి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) చైర్మన్ ఆర్ముగ రాజరాజన్‌కు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలో కూడా బోర్డు శనివారం రాత్రి మరోసారి సమావేశమైంది. ఈ సందర్భంగా రాకెట్‌కు కె. శివన్ ఆధ్వర్యంలో మళ్లీ లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. ప్రయోగ సమయానికి 20 గంటల ముందు అంటే ఆదివారం ఉదయం 6.51 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించాలని నిర్ణయించారు. 20 గంటల కౌంట్‌డౌన్ అనంతరం జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్.. 3,850 కిలోల బరువుగల చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని భూమి నుంచి చంద్రుడిపైకి మోసుకెళ్తుంది. జీఎస్ఎల్వీ మార్క్ 3–ఎం1 రాకెట్ పొడవు 43.43 మీటర్లు, బరువు 640 టన్నులు. ఇందులో 3,850 కిలోల బరువుగల చంద్రయాన్–2 మిషన్‌ను పంపుతున్నారు. ఉపగ్రహంలో 2.3 టన్నుల ఆర్బిటర్, 1.4 టన్నుల ల్యాండర్ (విక్రమ్), 27 కిలోల రోవర్ (ప్రజ్ఞాన్)లో 14 ఇండియన్ పేలోడ్స్ (ఉపకరణాలు)తోపాటు ఆమెరికాకు చెందిన రెండు, యూరప్ దేశాలకు సంబంధించి రెండు పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. ఇలా పనిచేస్తుంది... – మొదటి దశలో జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్, దాని ఇరువైపులా ఉన్న అత్యంత శక్తివంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి పయనమవుతుంది. ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 131.30 సెకన్లలో మొదటి దశను పూర్తి చేస్తారు. – రెండో దశలో ద్రవ ఇంజన్ మోటార్లు 110.82 సెకన్లకే ప్రారంభమవుతాయి. 203 సెకన్లకు రాకెట్ శిఖర భాగాన అమర్చిన చంద్రయాన్–2 మిషన్‌కు ఉన్న హీట్ షీల్డ్స్ విడిపోతాయి. ఈ దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని ఉపయోగించి 308.50 సెకన్లకు రెండో దశను పూర్తి చేస్తారు. – మూడో దశలో అత్యంత కీలకమైన క్రయోజనిక్ (సీ–25) మోటార్లు 310.90 సెకన్లకు ప్రారంభమవుతాయి. 958.71 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను పూర్తి చేస్తారు. అనంతరం రాకెట్‌కు శిఖర భాగాన అమర్చిన త్రీ–ఇన్–వన్ చంద్రయాన్–2 మిషన్ 973.70 సెకన్లకు (16.21 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ) 170.06 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 39,059.6 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్ ఆర్బిట్ (అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత ఈ బాధ్యతను బెంగళూరులోని మాస్టర్ కంట్రోల్ సెంటర్ అధీనంలోకి తీసుకొని మిషన్ చంద్రుడిపైకి వెళ్లే వరకు ఆపరేషన్ నిర్వహిస్తుంది. 16 రోజుల్లో కక్ష్య దూరం పెంపు... ప్రయోగం జరిగిన 16 రోజుల్లో అపోజిని 39,059.6 కిలోమీటర్ల నుంచి 1,41,000 పెంచేందుకు ఆర్బిటర్‌ను మండించి నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి ఆర్బిటర్‌ను చంద్రుడి వైపు మళ్లిస్తారు. తదనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు రెట్రోబర్న్ చేసి వంద కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యను తగ్గించడానికి నాలుగుసార్లు అపరేషన్ చేపడతారు. 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లు ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్‌ను మండిస్తారు. ఆ తరువాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి ఉపరితలంపైన దక్షిణ ధ్రువ ప్రాంతంలోని మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దిగుతుంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి రావడానికి సుమారు 4 గంటల సమయాన్ని తీసుకుంటుంది. ఇది సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు).. అంటే 14 రోజుల్లో 500 మీటర్ల దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మూలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇదంతా జరగడానికి 52 రోజులు పడుతుంది. ఇలా 3.50 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సెప్టెంబర్ 6న ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి మీదకు చేరుకుని పరిశోధనలకు శ్రీకారం చుడుతుంది. తిరుమలలో ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు... తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ శనివారం దర్శించుకున్నారు. చంద్రయాన్–2 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆయన సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. -
టిక్:టిక్:టిక్
జాబిల్లిపైకి ఓ ల్యాండర్‌ను ప్రయోగించిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించేందుకు ఇక కేవలం కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున 2:51 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన బాహుబలి రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్–3 ద్వారా చంద్రయాన్–2 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఒక్క దెబ్బకు మూడు పిట్టలన్న చందంగా ఈ ప్రయోగం ద్వారా ఇస్రో బహుళ ప్రయోజనాలను సాధించనుంది. ఈ ప్రయోగం భారత కీర్తి కిరీటంలో మరో కలికితురాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అత్యంత సంక్లిష్టమైన ప్రయోగం... ఇస్రో ఇప్పటివరకూ చేపట్టిన ప్రయోగాలన్నింటికంటే చంద్రయాన్–2 చాలా సంక్లిష్టమైంది. జాబిల్లి చుట్టూ తిరిగే ఆర్బిటర్.. ఉపగ్రహంపై దిగే ల్యాండర్లు రెండింటినీ జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా పంపనున్నారు. ల్యాండర్ జాబిల్లిపైకి సురక్షితంగా దిగాక అందులోంచి రోవర్ బయటకు వచ్చి ఉపరితలంపై దాదాపు అర కిలోమీటర్ దూరం ప్రయాణిస్తుంది. అత్యంత శీతల (–157 డిగ్రీ సెల్సియస్) పరిస్థితుల్లో ఈ యంత్రాన్ని పనిచేయించడం ఒక సవాలే. జీఎస్ఎల్వీ రాకెట్ ఆర్బిటర్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెడితే 50 రోజుల ప్రయాణం తరువాత అది జాబిల్లిపైకి చేరుతుంది. జాబిల్లికి సుమారు 150 కి.మీ. దూరంలో ఉన్న దశలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరుపడుతుంది. నాలుగు రోజులపాటు చక్కర్లు కొడుతూ నెమ్మదిగా వంద కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది. దశలవారీగా వేగాన్ని 30 కిలోమీటర్లకు తగ్గించుకొని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగుతుంది. చందమామ ఉపరితలంపైకి ల్యాండర్ దిగిన నాలుగు గంటల తరువాత అందులోంచి రోవర్ బయటపడుతుంది. సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో ల్యాండర్ నుంచి వేరుపడి ఆ తరువాత 14 రోజుల్లో సుమారు 500 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ల్యాండర్‌పై మన జాతీయ పతాకం ముద్రితమై ఉంటుంది. రోవర్‌కు ఉన్న ఆరు చక్రాలపై అశోకచక్రను ముద్రించారు. చంద్రయాన్–2 మొత్తం ఖర్చు రూ. 978 కోట్లుకాగా అందులో రూ. 603 కోట్లు ల్యాండర్, ఆర్బిటర్ల నిర్మాణానికి, నేవిగేషన్, భూమ్మీది నెట్వర్క్ ఏర్పాటుకు ఖర్చు పెట్టారు. మిగిలిన రూ. 375 కోట్లను జీఎస్ఎల్వీ మార్క్–3 నిర్మాణం, క్రయోజెనిక్ ఇంజిన్, ఇంధనాల కోసం ఉపయోగించారు. ఇవీ లక్ష్యాలు... చంద్రయాన్–2 ప్రధాన లక్ష్యం ఇప్పటివరకూ ఏ దేశమూ ప్రవేశించని ప్రాంతాల్లో ప్రయోగాలు చేయడం. తద్వారా ఎప్పుడూ చీకటిలోనే ఉండే దక్షిణ ధ్రువ ప్రాంతంలో పెద్ద ఎత్తున నీరు ఏమైనా ఉందా? అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు స్వచ్ఛమైన ఇంధనం హీలియం–3 ఛాయలను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. జాబిల్లిపై ఉన్న హీలియం–3ని సమర్థంగా వాడుకోగలిగితే భూమి మొత్తానికి అవసరమైన విద్యుత్‌ను ఏకంగా 250 ఏళ్లపాటు తయారు చేసుకోవచ్చనని అంచనా. వినువీధిలో భారత పతాక మరోసారి రెపరెపలాడేందుకు రంగం సిద్ధమైంది. జాబిల్లిపై నీటి జాడలను నిర్ధారించిన చంద్రయాన్–1కు కొనసాగింపుగా మరోసారి చందమామపై కాలుమోపేందుకు చంద్రయాన్–2 సిద్ధమైంది. మునుపెన్నడూ.. ఎవ్వరూ చేయని రీతిలో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో... ఓ ల్యాండర్‌ను దింపడం.. రోవర్‌ను నడపడం, జాబిల్లి చుట్టూ ఉపగ్రహాన్ని తిప్పడమన్న లక్ష్యాలతో నింగికి ఎగరనున్న చంద్రయాన్–2 అవసరమేమిటి? ప్రయోగాలు ఏం తేల్చనున్నాయి? ఇస్రో శాస్త్రవేత్తలకు కలాం ఇచ్చిన సలహా... మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఇస్రో శాస్త్రవేత్తలకు ఇచ్చిన సలహా ఈనాటి చంద్రయాన్–2గా పరిణమించిందంటే ఆశ్చర్యం ఏమీ కాదు. ఎందుకంటే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ స్వావలంబన సాధించాలని, అందుకుతగ్గ సామర్థ్యం మనకు ఉందని బలంగా నమ్మి, ప్రోత్సహించిన వ్యక్తుల్లో కలామ్ ఒకరన్నది తెలిసిందే. 2003లో జాబిల్లిపై ప్రయోగాలు చేసేందుకు ఇస్రో ఆలోచిస్తోందన్న వార్తలు వస్తున్న తరుణంలో తనను కలిసిన ఇస్రో శాస్త్రవేత్తలతో కలాం మాట్లాడుతూ చంద్రయాన్ ప్రాజెక్టు ద్వారా జాబిల్లిని చేరితే ఆ విజయం దేశ యువత, పిల్లల్లోనూ స్ఫూర్తి నింపుతుందని సూచించారు. అంతేకాకుండా 2009లోనూ జాబిల్లిపైనే ఎందుకు ప్రయోగాలు చేయాలో చెబుతూ భవిష్యత్తులో భూమికి, అంగారకుడికి మధ్య వారధిగా జాబిల్లి ఉపయోగపడుతుందని చెప్పారు. జాబిల్లి చుట్టూ 100 కి.మీ. దూరంలో చంద్రయాన్–1 తిరుగుతూ సమాచారం సేకరిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు కలాంకు వివరించినప్పుడు అంతదూరం వెళ్లిన అంతరిక్ష నౌకను జాబిల్లిపైకి దింపవచ్చు కదా అని సూచించారట. ఈ సూచన ఫలితంగానే చంద్రయాన్–1లో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఎంఐపీ) రూపకల్పన జరిగిందని, జాబిల్లిపై దిగిన ఈ పరికరం అక్కడ నీరు ఉన్న విషయాన్ని నిర్ధారించిందని చంద్రయాన్–1 ప్రాజెక్టు డైరెక్టర్ ఎం. అన్నాదురై తెలిపారు. భవిష్యత్తులో జాబిల్లి అంతరిక్ష పారిశ్రామిక కేంద్రంగా మారే అవకాశముందని 2009లోనే కలాం అంచనా కట్టారు. కేంద్రక సంలీన చర్య ద్వారా విద్యుదుత్పత్తి సాధ్యమైన రోజున హీలియంకు డిమాండ్ పెరుగుతుందని, దీనిద్వారా తయారు చేసే విద్యుత్‌తో భూమ్మీద వాహనాలు నడుస్తాయని, జాబిల్లిపై మానవ ఆవాసాలకూ ఉపయోగపడుతుందని కలాం అప్పట్లో వివరించినట్లు అన్నాదురై వివరించారు. ట్విట్టరాటీ జాబితాలో అగ్రస్థానంలో జాతీయ పతాకం ‘‘చంద్రయాన్–2 ద్వారా జాబిల్లిపైకి ఏం తీసుకెళితే బాగుంటుంది?’’ఇటీవల ట్విట్టర్ ప్రపంచానికి ఇస్రో వేసిన ప్రశ్న ఇది. ఇందుకు భారీగా స్పందించిన నెటిజన్లు... జాతీయ పతాకాన్ని తీసుకెళ్లాలని సూచించారు. దీంతోపాటు కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ట్వీట్ల ద్వారా పంచుకున్నారు. గౌతమ్ సింగ్ అనే వ్యక్తి.. ఇండియా మ్యాప్‌ను తీసుకెళ్లాలని, భవిష్యత్తులో గ్రహాంతర వాసులెవరైనా జాబిల్లిని సందర్శిస్తే.. ఈ మ్యాప్ చూసి మనం ఎవరో తెలుసుకుంటారని వ్యాఖ్యానించారు. జాతీయ పతాకం వారికి ఏమాత్రం ఉపయోగపడదని అన్నారు. ఇంకొందరు మన దేశం మట్టిని అక్కడికి తీసుకెళ్లాలని సూచించగా.. కొంతమంది ఈ ఆలోచనకు మద్దతుగా నిలిచారు. ఇంకొందరు మాత్రం ఆ గ్రహాన్ని కలుషితం చేయడం సరికాదని పేర్కొన్నారు. -
చంద్రయాన్–2 ప్రత్యక్షంగా చూసేద్దాం!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఆకాశాన్ని తాకే ఎత్తులో నిల్చున్న తెల్లటి రాకెట్ లాంచర్.. దానిలోనుంచి నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్.. ఈ దృశ్యాలను మనం చాలాసార్లు టీవీల్లోనే చూస్తుంటాము. అయితే ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని ఇస్రో కల్పిస్తోంది. సాదాసీదా ప్రయోగం కాకుండా ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించే సువర్ణ అవకాశాన్ని ఇస్రో మనముందుంచింది. ఈ నెల 15 తెల్లవారుజామున 2:51 గంటలకు నిర్వహించనున్న చంద్రయాన్–2ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 10 వేల మంది ప్రజలకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. ఇందుకు నేటినుంచే (గురువారం) ఇస్రో వెబ్సైట్ ( ఠీఠీఠీ. జీటటౌ.జౌఠి.జీn) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్లోనే అనుమతి ఇస్తారు. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ- 46
-
పీఎస్ఎల్వీ సీ 45 విజయవంతం
-
ఇస్రో చరిత్రలో మరో మైలు రాయి
-
నింగిలోకి ఎగిసిన జీశాట్-7ఏ ఉపగ్రహం
-
పీఎస్ఎల్వీ సీ-43 ప్రయోగం విజయవంతం
-
పీఎస్ఎల్వీ సీ-43 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-43 రాకెట్ ప్రయోగం విజయవంతమయింది. భారత్‌కు చెందిన హైసిస్ ఉపగ్రహంతో పాటు 8 దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-43 రాకెట్ నిర్దిష్ట కక్ష్యలోకి చేర్చినట్టు ఇస్రో ప్రకటించింది. ఇస్రో సిబ్బంది సమిష్టి కృషి వల్లే ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో చైర్మన్ డా. కె శివన్ తెలిపారు. కాగా, 28 గంటల కౌంట్ డౌన్ అనంతరం గురువారం ఉదయం 9.58 గంటలకు సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి లాంచ్ పాడ్ నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ వాహననౌక 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగంలో 380 కిలోల హైసిస్ స్వదేశీ ఉపగ్రహంతో పాటు 261.5 కిలోల బరువు కలిగిన 8 దేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. హైసిస్ భూ ఉపరితల పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఇది ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది. డీడీ రిపోర్టర్ కన్నుమూత పీఎస్ఎల్వీ సీ-43 రాకెట్ ప్రయోగం కవరేజ్ కోసం వచ్చిన చెన్నైదూరదర్శన్ రిపోర్టర్ రవీంద్రన్ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన విధుల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీహరికోటకు వచ్చారు. నిన్న రాత్రి మీడియా సెంటర్లో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపట్ల ఇస్రో శాస్త్రవేత్తలు సంతాపం తెలిపారు. -
పీఎస్ఎల్వీ సీ43 రెడీ
భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి నింగిలోగి ఎగిరేందుకు పీఎస్ఎల్వీ సీ43 వాహన నౌక సిద్ధమయింది. గురువారం ఉదయం 9.58 గంటలకు ప్రయోగించనున్నారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేసుకుని నింగికెగిరేందుకు లాంచ్ పాడ్ వద్దకు వెళుతున్న రాకెట్.. శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 9.57 గంటలకు పీఎస్ఎల్వీ సీ – 43 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించనున్నారు. దీనికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశంలో ప్రయోగ తేదీని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున 5.57 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఉదయం 9.57 గంటలకు నింగివైపునకు దూసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ – 43 రాకెట్ సిద్ధంగా ఉంది. నాలుగు దశల రాకెట్ అనుసంధానాన్ని పూర్తి చేసి మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)æ నుంచి రాకెట్‌ను ప్రయోగవేదికపై వదిలిపెట్టి వెనక్కి వచ్చింది. 44.4 మీటర్ల ఎత్తున పీఎస్ఎల్వీ సీ – 43 రాకెట్ ప్రయోగ సమయంలో ఇంధనంతో కలిపి 320 టన్నుల బరువుతో నింగికి పయనమవుతుంది. ప్రయోగంలో 380 కిలోల హైసిస్ స్వదేశీ ఉపగ్రహంతో పాటు 261.5 కిలోల బరువు కలిగిన 8 దేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఉపగ్రహాల బరువు 641.5 కిలోలు కావడంతో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా ప్రయోగించనున్నారు. దీన్ని కోర్ అలోన్ ప్రయోగం అంటారు. షార్‌లోని మొదటి ప్రయోగవేదికకు సంబం«ధించిన మొబైల్ సర్వీస్ టవర్‌లో రాకెట్‌ను అనుసంధానించిన కొన్ని దృశ్యాలను ఇస్రో మంగళవారం విడుదల చేసింది. రాకెట్‌లోని కోర్ అలోన్ దశ(ప్రథమ) ప్రయోగవేదికపై అనుసంధానం రాకెట్ మొదటి దశను కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డిజైన్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అనుసంధానం చేశారు. ఈ దశలో రాకెట్ నింగికి దూసుకెళ్లడానికి 138.2 టన్నుల ఘన ఇంధనాన్ని నింపుతారు రాకెట్ రెండోదశలో విడి భాగాలను అమరుస్తున్న దృశ్యం రాకెట్ రెండోదశలో 2.8 వ్యాసార్థంలో ఉన్న మోటార్లో 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపుతారు. ఈ దశనూ వీఎస్సెస్సీలోనే తయారు చేశారు. మూడో దశ రాకెట్ విడిభాగాల అమరిక ఈ దశ రెండు మీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది. మూడో దశలో 7.6 టన్నుల ఘన ఇంధనం, నాలుగోదశలో 2.5 ద్రవ ఇంధనాన్ని నింపుతారు. నాలుగో దశకు పైభాగంలో 641.5 కిలోల బరువు కలిగిన 31 ఉపగ్రహాల పొందికను అమర్చి అనుసంధానం చేస్తున్న దృశ్యం శిఖరభాగంలో నాలుగో దశ రాకెట్ అనుసంధానం ఈ దశలోనే ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. ఈ దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపుతారు. రాకెట్ అనుసంధానం పూర్తయ్యాక మొబైల్ సర్వీస్ టవర్ నుంచి రాకెట్ వదిలిపెట్టి వెనక్కి వెళ్తున్న దృశ్యం -
చీకట్లను చీల్చుకుంటూ....
దేశమంతా చీకట్లు కమ్ముకుంటున్న వేళ, నా సమయమైందే అని చంద్రుడు ఎదురొస్తున్న వేళ బంగారు వర్ణపు నిప్పులు కక్కుతూ జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్న వేళ తీసిన అపురూప సుందర చిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. చంద్రుడికి అభిముఖంగా జీఎస్ఎల్వీ దూసుపోతున్న ఫొటోను చూసి కుంచెపై గీచిన చిత్రంలా అందంగా ఉందంటూ నెటిజన్లంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా పేరుగాంచిన జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ద్వారా జీశాట్–29 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రోకు ఇది 67వ అంతరిక్ష ప్రయోగం. సమాచార ఉపగ్రహమైన జీశాట్–29లో కేఏ, కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లను అమర్చారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్ ప్రజల ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ రాకెట్ 43.43 మీటర్ల పొడవుతో 640 టన్నుల బరువుంటుంది. జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారి ఆలయంలో రాకెట్ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి శివన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 ప్రయోగం
-
నేడు నింగిలోకి జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్
-
ఇస్రో ‘బాహుబలి’ కౌంట్‌డౌన్ ప్రారంభం
శ్రీహరికోట/తిరుమల: ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) బాహుబలిగా పేరుగాంచిన జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ద్వారా జీశాట్–29 ఉపగ్రహ ప్రయోగానికి మంగళవారం మధ్యాహ్నం 27 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వాతావరణం సహకరిస్తే బుధవారం సాయంత్రం సరిగ్గా 5.08 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 నింగిలోకి దూసుకెళ్లనుంది. గజ తుపాను కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం తెలిసిందే. మొత్తంగా ఇస్రోకు ఇది 67వ అంతరిక్ష ప్రయోగం. సమాచార ఉపగ్రహమైన జీశాట్–29లో కేఏ, కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లను అమర్చారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్ ప్రజల ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. శ్రీవారి పాదాల చెంత పూజలు ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో చైర్మన్ కె.శివన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని, నెల్లూరు జిల్లాలోని చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయంలో రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వెలుపల శివన్ మాట్లాడుతూ ‘వాతావరణం సహకరించకపోతే జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 ప్రయోగం వాయిదా పడుతుంది. అయితే రేపు సాయంత్రమే రాకెట్‌ను ప్రయోగించగలమని మేం ఆశిస్తున్నాం. ఇస్రోకు అత్యంత ముఖ్యమైన ప్రయోగాల్లో ఇదొకటి. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇది మైలురాయి వంటిది’ అని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో మరింత అధునాతన ఉపగ్రహాలను అభివృద్ధి చేసేందుకు ఇస్రోకు మార్గం సుగమమవుతుందన్నారు. ‘చంద్రయాన్–2, అంతరిక్ష మానవ సహిత యాత్ర ప్రయోగాలను కూడా జీఎస్ఎల్వీ–మార్క్3 రాకెట్ ద్వారానే చేపట్టనున్నాం. మేం అందుకు సన్నద్ధమవుతున్నాం’ అని శివన్ చెప్పారు. జీఎస్ఎల్వీ–మార్క్3 ఇస్రో అభివృద్ధి చేసిన ఐదో తరం రాకెట్. 4 టన్నుల బరువైన ఉపగ్రహాలను కూడా ఇది భూస్థిర బదిలీ కక్ష్య (జీటీవో–జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టగలదు. ఈ రాకెట్ 43.43 మీటర్ల పొడవుతో 640 టన్నుల బరువుంటుంది. -
సిన్మా అయితే ఓ.కే.... శ్రీహరికోటా....అదేంటి!!!
ఒక సినిమా విడుదలైతే దానిగురించి తెరముందు, తెరవెనుక జరిగిన విషయాలన్నీ సమస్తం చెప్పగలిగిన నేటి యువతరంలో శ్రీహరికోటనుంచి ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాలలో ఏ ఒక్కదాన్ని గురించి అయినా స్పష్టంగా చెప్పగలవారెందరున్నారు? అలాగే సాటిమనిషి బాగోగుల గురించి తాపత్రయపడిన మహానుభావుల జీవితాలు ఎలా సాగాయో తెలుసుకుని వాటినుంచి ఎంతమంది స్ఫూర్తి పొందుతున్నారు? ఇవి నావి కావు... యువతరం గురించి కలాంగారి ఆవేదనాభరిత ప్రశ్నలు అవి. అత్యంత భయంకరమైన క్యాన్సర్ వ్యాథికి ఔషధం కనుక్కున్న మేడమ్ క్యూరీ పోలండ్‌లో పుట్టింది. చిన్నతనంలో తల్లి చనిపోయింది. తండ్రి ఫిజిక్స్ పాఠాలు చెప్పేవాడు. ఇంగ్లీష్ చదువులకు ఆమెను ప్యారిస్ పంపాడు. డబ్బుపెట్టి మంచి గది తీసుకోలేక ఎముకలు కొరికే చలిలో ఒక చిన్న పూరిపాకలో ఉంటూ చదువుకునేది. డబ్బుచాలక రొట్టె నీళ్ళలో ముంచుకు తినేది. ట్యూషన్లు చెబుతూ, ఇంగ్లీష్‌లో యూనివర్శిటీ ఫస్ట్ వచ్చింది. ఇంగ్లీష్ ఎం.ఎ చేసి కూడా తండ్రి సూచన మేరకు మళ్ళీ ఫిజిక్స్ మొదలు పెట్టింది. పూరిపాకనే ప్రయోగశాలగా మార్చుకుని అలా చదువు కొనసాగిస్తుండగా ప్రేమ ప్రయత్నంలో మోసపోయి ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయింది. తరువాత తాను నిలదొక్కుకుని నిబ్బరంగా ఆలోచించి..‘‘ఒక చిన్న దెబ్బ తగిలితే ఆత్మహత్యా? నాకోసం తపిస్తున్న నా తండ్రి నా తోడబుట్టిన వాళ్ళు... వారిపట్ల నాబాధ్యత ఇదేనా’’ అని ఆత్మవిమర్శ చేసుకుంటూ ‘‘...కాదు, కాదు... ఎక్కడ కింద పడ్డానో అక్కడే పైకి లేవాలి. నాకు జరిగిన మోసాన్ని ఒక పీడకలగా మర్చిపోవాలి’ అని దృఢంగా నిశ్చయించుకుంది. తన శక్తిని మొత్తాన్నీ ఫిజిక్స్ మీద పెట్టింది. మళ్ళీ వివాహం చేసుకుని గర్భిణీ అయి ఉండి కూడా, భర్తతో కలిసి శాస్త్రానికి సంబంధించిన ఉపన్యాసాల పరంపర కొనసాగిస్తూ, క్యాన్సర్‌కు చికిత్స చేయతగిన మూలకాన్ని కనిపెట్టి యురేనియం అని ధ్వనించేటట్లుగా తన మాతృదేశంపేరుని జోడించి ‘పొలేరియం’ అని పేరుపెట్టి తన దేశభక్తి చాటుకుంది. ఆమెచేసిన కృషికి గుర్తింపు లభించి ‘నోబెల్ బహుమతి’ లభించింది. ఆమెతో కలిసి పనిచేసినందుకు ఆమె భర్తకు, ఆమె గురువుకు మరో రెండు నోబెల్ బహుమతులొచ్చాయి. దానితో బాగా ఐశ్వర్యం కూడా వచ్చింది. ఆ సంతోషం ఎక్కువకాలం నిలవకుండానే తండ్రి చనిపోయాడు... మరికొద్ది రోజుల్లోనే రోడ్డు ప్రమాదంలో భర్త కూడా చనిపోయాడు. అప్పటికి ఆమె వయసు 40 దాటలేదు. క్యాన్సర్‌కు ఔషధం కనిపెట్టడానికి రోజుకు 18 గంటలు కష్టపడి ఆరోగ్యాన్ని ఎంతగా త్యాగం చేసేసిందంటే.. ఆమెకే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది.అయినా ఆమె వెరవలేదు. ఆ పరుగు, ఆ పట్టుదల, ఆ కసి ఆగలేదు...ఈ సారి కెమిస్ట్రీలో మరొక ‘నోబెల్’ బహుమతి తెచ్చుకుంది. ఆమె దార్శనికత వలన ఆమె కూతురికి, అల్లుడికి కూడా మరో రెండు నోబెల్ బహుమతులొచ్చాయి. అంటే ఆమె ఒక్కతే ఆరు నోబెల్ బహుమతులకు కారణమయింది. ఆమే తన పరిశోధనలకు పేటెంట్ తీసుకుని ఉంటే తదనంతరకాలంలో ఆమె వంశీకులకు బిల్‌గేట్స్ కన్నా వెయ్యిరెట్ల ఐశ్వర్యం వచ్చి ఉండేది. కానీ ‘‘అది భూమిలోంచి వచ్చింది, ప్రకృతి ఇచ్చింది. అది ప్రజలకు అందాలి. ఆ పేటెంట్ తీసుకోవడానికి నేనెవర్ని. నాకు అక్కరలేదు.’’ అని చెప్పేసింది. చివరగా తను కోరుకున్నదేమిటంటే తన సమాధిలో పిడికెడు మట్టి...అదీ తన జన్మభూమినుంచి తెచ్చి చల్లాలని కోరుకుంది.ఎవరి జీవితాలూ వడ్డించిన విస్తళ్ళు కావు. గులాబీ పువ్వు కింద ముళ్ళు చూసి భయపడిన వాడు జీవితంలో అక్కడే ఉంటాడు. ఆ పువ్వు సౌందర్యాన్ని, సౌరభాన్ని చూడాలనుకున్నవాడు ముందుకే అడుగేస్తాడు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఇక ఇస్రో నుంచి భారీ ప్రయోగాలు!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఇప్పటికే ఎన్నో విజయవంతమైన రాకెట్ ప్రయోగాలతో చరిత్ర సృష్టించిన శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.628.95 కోట్ల వ్యయంతో రెండో వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్ (ఎస్వీఏబీ)ని నిర్మించారు. దీని ద్వారా రెండు రాకెట్లను అనుసంధానం చేయొచ్చు. ఈ నెల 22న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు. రెండో వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్ (ఎస్వీఏబీ)లో జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లు, సుమారు ఐదు కిలోలు బరువు కలిగిన ఉపగ్రహాలను కూడా ప్రయోగించేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. చంద్రయాన్–2 లాంటి భారీ ప్రయోగాలకు కూడా ఎస్వీఏబీ వేదిక కానుంది. ఏటా నాలుగు జీఎస్ఎల్వీ, 12 పీఎస్ఎల్వీ ప్రయోగాలు చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు కృతనిశ్చయంతో ఉన్నారు. 96 మీటర్లు ఎత్తు కలిగిన ఎస్‌వీఏబీలో అంతర్జాతీయ స్థాయి వసతులు ఉండేలా ఇస్రో శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి మంజూరైన రూ.628.95 కోట్లలో ప్లాట్‌పామ్‌లకు రూ.70 కోట్లు, డోర్లకు రూ.24 కోట్లు, బోగీలకు రూ.8 కోట్లు, క్రేన్‌కు రూ.22 కోట్లు, హాలర్ (టాక్టర్)కు రూ.10 కోట్లు, ట్రాక్‌కు రూ.23 కోట్లు, సర్వీస్ వ్యవస్థకు రూ.45 కోట్లు, సివిల్ పనులన్నింటికి కలిపి రూ.280 కోట్లు, మిగిలిన రూ.146.95 కోట్లు ఇతర ఖర్చులకు వెచ్చించారు. ప్రస్తుతం పెరిగిన మెటీరియల్ కాస్ట్‌తో మరో వంద కోట్లు దాకా బడ్జెట్ పెరిగింది. వ్యోమగాములను పంపడానికి ఏర్పాట్లు షార్‌లో రూ.245 కోట్ల వ్యయంతో మల్టీ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్ కేంద్రాన్ని నిర్మించి గతేడాది ప్రారంభించారు. ఒకేసారి పది రాకెట్లను ట్రాకింగ్ చేసే సామర్థ్యం కలిగిన ఎంఓటీఆర్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రపంచంలో ఎంఓటీఆర్ ఉన్న రెండో దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఘన ఇంధనం తయారీకి అవసరమైన వాటిని రూ.226 కోట్లతో నిర్మించేందుకు ఇటీవలే టెండర్ల ప్రక్రియను ముగించారు. మరో ఏడాదిన్నరలో వీటిని పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే వ్యోమనౌకను ప్రయోగాత్మకంగా ప్రయోగించి విజయం సాధించడంతో షార్‌లోనే స్పేస్ షటిల్‌కు కావాల్సిన రన్‌వేను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాబోయే పదేళ్లలో ఇక్కడి నుంచే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే ఇస్రోకు గుండెలాంటి షార్ ప్రపంచ స్థాయి రాకెట్ ప్రయోగ కేంద్రంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. -
పీఎస్ఎల్వీ-సీ41 విజయవంతం
శ్రీహరికోట : పీఎస్ఎల్వీ సీ41 రాకెట్ ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి గురువారం వేకువజామున 4.04 గంటలకు రాకెట్ ప్రయోగం జరిగింది. 19.19 నిమిషాల తర్వాత రాకెట్ లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు దశల అనంతరం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహం నిర్ణయించిన సమయానికి విడిపోయి కక్ష్యలోకి ప్రవేశించింది. గతేడాది ఆగస్టు 31న పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1హెచ్ ఉపగ్రహం విఫలం కావడంతో దాని స్థానంలో గురువారం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహాన్ని పంపారు. ఇది విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. దేశీయ దిక్సూచి వ్యవస్థ కింద ఇప్పటికే 8 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. వచ్చే 8 నెలల్లో 9 ప్రయోగాలు చేస్తామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్3 ద్వారా కమ్యునికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని , ఈ ఏడాది చివరిలో చంద్రయాన్-2 ప్రయోగం ఉంటుందని వివరించారు. దేశీయ నావిగేషన్ సేవల కోసం త్వరలోనే యాప్‌ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. యాప్‌డౌన్‌లోడ్ ద్వారా వాతావరణ హెచ్చరికలు మత్స్యకారులకు చేరనున్నాయని వివరించారు. విపత్తు నిర్వహణ, వాహనాల గమనాన్ని పరిశీలించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు చాలా ఉపయోగం కలగనుంది. ఈ ఉపగ్రహం వల్ల దృశ్య, వాయిస్ దిక్సూచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల వైఎస్సాసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు తన తరపున అభినందనలు తెలియజేశారు. భవిష్యత్‌లో మరిన్ని ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.