చంద్రయాన్‌–2 ప్రత్యక్షంగా చూసేద్దాం!  | ISRO Gives Chance To Watch Chandrayan Two | Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌–2 ప్రత్యక్షంగా చూసేద్దాం! 

Published Wed, Jul 3 2019 10:47 PM | Last Updated on Wed, Jul 3 2019 10:47 PM

ISRO Gives Chance To Watch Chandrayan Two - Sakshi

శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఆకాశాన్ని తాకే ఎత్తులో నిల్చున్న తెల్లటి రాకెట్‌ లాంచర్‌.. దానిలోనుంచి నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్లే  రాకెట్‌.. ఈ దృశ్యాలను మనం చాలాసార్లు టీవీల్లోనే చూస్తుంటాము. అయితే ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని ఇస్రో కల్పిస్తోంది. సాదాసీదా ప్రయోగం కాకుండా ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని  ప్రత్యక్షంగా వీక్షించే సువర్ణ అవకాశాన్ని ఇస్రో మనముందుంచింది. ఈ నెల 15 తెల్లవారుజామున 2:51 గంటలకు నిర్వహించనున్న చంద్రయాన్‌–2ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 10 వేల మంది ప్రజలకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. ఇందుకు నేటినుంచే (గురువారం) ఇస్రో వెబ్‌సైట్‌ ( ఠీఠీఠీ. జీటటౌ.జౌఠి.జీn) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లోనే అనుమతి ఇస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement