chandrayan
-
ISRO: కొత్త ఏడాది తొలిరోజే కీలక ప్రయోగం
సాక్షి, బెంగళూరు: కొత్త ఏడాదిలో తొలిరోజే ఇస్రో సరికొత్త ప్రయోగానికి తెర తీసింది. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం(జనవరి 1) ఉదయం 9.10 గంటలకు ఎక్స్ రే పొలారి మీటర్ శాటిలైట్(ఎక్స్పో శాట్)ను ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో తొలి పొలారిమీటర్ మిషన్ కావడం విశేషం. పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్న ఈ ప్రయోగం కౌంట్‌డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్‌రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్ పో శాట్ అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనానికిగాను ఎక్స్‌పోశాట్‌లో రెండు అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూ కక్ష్య నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పరికరం పోలిక్స్ మధ్యతరహా ఎక్స్‌రే కిరణాలను వెదజల్లే మూలాలపై పరిశోధన చేస్తుంది. ఇక మిగిలిన ఎక్స్‌స్పెక్ట్ పేలోడ్ అంతరిక్షంలోని బ్లాక్‌హోళ్లు, న్యూట్రాన్ నక్షత్రాలు, యాక్టివ్ గలాటిక్ న్యూక్లై, పల్సర్ విండ్, నెబ్యులా తదితరాల నుంచి వెలువడే ఎక్స్‌రే కిరణాల స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందించనుంది. గడిచిన ఏడాది 2023లో ఇస్రో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదీచదవండి..అయోధ్య రామ మందిర వేడుకలు..కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు -
దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో.. 60 సంవత్సరాల అపురూప ఘట్టాలు!
ఇస్రో పంపించిన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని మీద దిగిన తరువాత ప్రపంచమే భారతదేశం వైపు చూస్తోంది. నిజానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయాణం ఈ రోజు మొదలైంది కాదు. 60 సంవత్సరాల క్రితం ప్రారంభమై ఈ రోజు యావత్ ప్రపంచాన్ని ఆకర్శిస్తోందంటే దాని వెనుక ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1957లో సోవియన్ యూనియన్ అంతరిక్షమాలోకి మొదటి ఉపగ్రహం స్పుత్నిక్ ప్రయోగించిన తరువాత ప్రపంచం ద్రుష్టి అంతరిక్ష పరిశోధనవైపు మరలింది. 1960లో భారతదేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటున్న సమయంలో అంతరిక్ష పరిశోధన కోసం అడుగులు వేసింది. హోమీ బాబా అణు ఇంధన శాఖకు అధిపతిగా ఉన్న రోజుల్లో 1962 నాటికి అంతరిక్ష పరిశోధన కమిటీ ఒక ప్రత్యేక విభాగంగా అవతరించింది. దానికి విక్రమ్ సారాభాయ్ చీప్ అయ్యారు. అప్పట్లో ఆధునిక రాకెట్ టెక్నలాజి తెలిసిన దేశాలు ఆ విషయాలను చాలా రహస్యంగా ఉంచాయి. ఆ సమయంలో మనదేశంలో పరిశోధన కేంద్రానికి దక్షిణ భారతదేశం అనువైన ప్రదేశంగా నిలిచింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న యువ శాస్త్రవేత్తలు అరవముతన్, రామకృష్ణారావు, అబ్దుల్ కలాం వంటి వారు శిక్షణ కోసం నాసా వెళ్లారు. మొదటి అడుగు.. 1963లో నాసా భారతదేశానికి 'నైక్-అపాచీ' రాకెట్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ తరువాత ఇండియా మొదటి రాకెట్ ప్రయోగాన్ని 1963లో ప్రయోగించింది. ఇదే మనదేశం ఈ రంగంలో వేసిన మొదటి అడుగు అనే చెప్పాలి. 1965లో తుంబాలో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందింది. 1975 ఏప్రిల్ 19 భారతదేశానికి చెందిన మొదటి అంతరిక్ష నౌక 'ఆర్యభట్ట' ప్రయోగించారు. 1981 నాటికి టెలీ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన 'ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పరిమెంట్'ను ప్రయోగించింది. విద్యుదయస్కాంత పరిశుభ్రత కోసం దీనిని పరీక్షించడానికి, ISRO ఎద్దుల బండిపై అమర్చిన తాత్కాలిక పరీక్షా సదుపాయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారతీయ పౌరుడి అంతరిక్ష యాత్ర.. భారత వ్యోమగామి 'రాకేష్ శర్మ' భారతదేశానికి చెందిన అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. 1984 ఏప్రిల్ 3న సోవియట్ యూనియన్ (ప్రస్తుతపు రష్యా) కు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి వెళ్ళాడు. అప్పటి వరకు అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములలో రాకేష్ శర్మ 138వ వాడు కావడం గమనార్హం. PSLV అరంగేట్రం.. క్రమంగా అధునాతన రాకెట్లు అవసరమని తలచి భారత్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV అభివృద్ధి ప్రయత్నాలను ప్రారంభించింది. 1993లో మొదటి పీఎస్ఎల్వీ విఫలమైంది, కానీ 1994లో ప్రయోగించిన పీఎస్ఎల్వీ విజయవంతమైంది. ఆ తరువాత ప్రయోగించిన 95 శాతం పీఎస్ఎల్వీ రాకెట్లు విజయవంతమయ్యాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పువాల్సినవి 2008లో చంద్రునిపై ప్రయోగించిన చంద్రయాన్-1, 2013లో మార్స్ ఆర్బిటర్ స్పేస్‌క్రాఫ్ట్, 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించడం. అంగారకుడిపై భారత్.. 2007లో అప్పటి ఇస్రో చీప్ మాధవన్ నాయర్ అంగారకునిమీదకు ప్రోబ్ పంపాలని ప్రతిపాదించారు. దీనిని 2012లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించారు. మొత్తానికి తొలి ప్రయత్నంతోనే అంగారకుడిపై ప్రయోగాల్లో విజయవంతమైన దేశంగా భారత్ అవతరించింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? చంద్రయాన్.. చంద్రయాన్-1 & 2 రెండు విఫలమయ్యాయి. అయితే ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 గొప్ప విజయం సాధించి భారతీయ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పింది. కాగా ఇటీవల ఆదిత్య-ఎల్1 కూడా ప్రయోగించారు. సుమారు ఆరు దశాబ్దాలు దిన దిన ప్రవర్ధమానం చెందుతూ గొప్ప విజయనాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన ఖాతాలో వేసుకుంది. ఇది భారతీయులందరికి గర్వకారణం అనే చెప్పాలి. -
ఆసక్తికరం : చంద్రయాన్ - 3 విజయంలో.. మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్ర?
భారత్.. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రునిపై అన్వేషణ కోసం ఇస్రో పంపిన చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా..ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సాధించింది. ఈ ప్రయోగం విజయ వంతం కావడం పట్ల ప్రపంచ దేశాలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాయి. ఈ తరుణంలో ఇస్రో చంద్రయాన్ - 3 విజయం వెనుక మసలా దోశ, ఫిల్టర్ కాఫీ ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇది వినడానికి విచిత్రంగా, నమ్మశక్యంగా లేకపోయినా చంద్రయాన్ - 3 విజయంలో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇస్రో సైంటిస్ట్‌ల నుంచి సేకరించిన సమాచారంతో వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సీనియర్ పాత్రికేయురాలు బర్కాదత్. దీంతో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ నివేదికలు నిజమేనని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చంద్రయాన్ -3 సక్సెస్‌లో ‘మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్ర’ పై ఆ ప్రాజెక్ట్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 వంటి అసాధ్యమైన పనిని నిర్విరామంగా పనిచేసేందుకు ఒపిక, శక్తి కావాలి. అయితే, ‘ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మసాలా దోస, ఫిల్టర్ కాఫీని అందించడం ద్వారా అలసట అనే విషయాన్ని పక్కన పెట్టాం. ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా అదనపు గంటలు పనిచేశారు. ఎక్కువ సేపు విధులు నిర్వహించేలా సంతోషంగా ముందుకు వచ్చారని గుర్తు చేశారు. ఇస్రో సైంటిస్ట్‌ల పనితీరు అమోఘం ఇస్రో మాజీ డైరెక్టర్ సురేంద్ర పాల్ కేవలం రూ.150 రూపాయల ఖర్చుతో ఒక సాధారణ ఎద్దుల బండిపై కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రవాణా చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు భారత్‌తో పాటు ఇతర దేశాల్లోని సైంటిస్ట్‌ల కంటే ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎక్కువగా ఉంటుందని ఇస్రో మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్ చెప్పారు. బాలీవుడ్ సినిమా నిర్మించేందుకు అయ్యే ఖర్చుతో ఏది ఏమైనప్పటికీ, భారత్ చంద్రయాన్ -3పై చేసిన ఖర్చు, సాధించిన విజయాలు నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే? ఒక బాలీవుడ్ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చుతో ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకు ఏ దేశమూ చేరని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అందరి మన్ననలు అందుకుంది. చంద్రయాన్-3 మిషన్‌ను కేవలం రూ. 615 కోట్ల రూపాయలతోనే ఇస్రో చేపట్టింది. అంతరిక్ష రంగంలో అద్భుత విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 విజయంపై ఈ ఆసక్తికర కథనాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ‘యాంకర్ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్ మహీంద్రా’ -
‘యాంకర్ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్ మహీంద్రా’
అంతరిక్ష ప్రయోగంలో (Chandrayaan-3) భారత్ విజయంపై బ్రిటీష్ మీడియా సంస్థలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేని భారత్‌కు అంతరిక్ష ప్రయోగాల కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం అవసరమా? అంటూ డిబెట్లు పెట్టి ప్రశ్నిస్తున్నాయి. అలా ప్రశ్నించిన బీబీసీ యాంకర్‌కు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా గూబ గుయ్యిమనేలా కౌంటర్ ఇచ్చారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డుకెక్కింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజులపాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్–3 మిషన్ ఘనంగా ముగించి.. 140 కోట్ల మంది భారతీయల హృదయాలను ఆనందంతోనూ ఒకింత విజయగర్వంతోనూ నింపింది. అయితే, భారత్ విజయాన్ని దాయాది దేశం పాకిస్తాన్, అమెరికా వంటి దేశాలు అభినందనలతో ముంచెత్తుతుంటే బ్రిటీష్ మీడియా సంస్థ బీబీసీ తన అక్కసు వెళ్లగక్కుకుంది. మరుగుదొడ్లే లేవు 700 మిలియన్ల మందికి కనీస మరుగదొడ్డి సదుపాయాలు లేవని.. అంతటి పేదరికంతో ఉన్న భారతదేశం.. అంతరిక్ష ప్రయోగానికి ఇంత మొత్తంలో ఖర్చు చేయాలా? అని ప్రశ్నిస్తూ బీబీసీ డిబేట్లు పెడుతోంది. అలా ఓ బీసీసీ యాంకర్ భారత్ విజయంపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీనిపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహినూర్ డైమండ్‌ను దోచుకొని బీబీసీ యాంకర్ డిబెట్‌ను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇలా ట్వీట్ చేశారు. నిజం ఏంటంటే? పేదరికం దశాబ్దాల వలస పాలన ఫలితం. మా నుంచి అత్యంత విలువైన ఆస్తి కోహినూర్ వజ్రమే కాదు, మా నమ్మకాన్ని, శక్తి సామర్ధ్యాల్ని దోచుకున్నారు. అలాంటి మీరు మరుగుదొడ్లు, అంతరిక్ష అన్వేషణ పెట్టుబడులపై ప్రశ్నించడం మీ వైఖరికి అద్దం పడుతోంది. మేం చంద్రునిపైకి వెళ్లడం అంటే ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు సహాయపడుతుంది. పరిశోధనా రంగంలో పురోగతిని సాధించేందుకు మాపై మాకు నమ్మకాన్ని కలిగిస్తుంది. పేదరికం నుండి బయటపడేయాలనే ఆకాంక్షను ఇస్తుంది. అసలు పేదరికం ఏంటంటే ఆకాంక్షల్లో కూడా పేదరికాన్ని కలిగి ఉండటమే’ అంటూ ఆనంద్ మహీంద్రా ధీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం, ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Really?? The truth is that, in large part, our poverty was a result of decades of colonial rule which systematically plundered the wealth of an entire subcontinent. Yet the most valuable possession we were robbed of was not the Kohinoor Diamond but our pride & belief in our own… https://t.co/KQP40cklQZ — anand mahindra (@anandmahindra) August 24, 2023 చదవండి👉‘ఈ కారు కొంటే మీ ఇంటిని మీరు తగలబెట్టుకున్నట్లే’ -
చంద్రయాన్-3 పై సినిమా.. ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనే
ప్రపంచ వ్యాప్తంగా ఆందరి దృష్టి చంద్రయాన్-3 మీదే ఉంది. భారతీయులందరి గుండెల్లో ఆనందాలు నింపుతూ.. చంద్రయాన్-3 చందమామ దక్షిణ ధ్రువంపై దిగుతుంటే.. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆనందంతో తిలకించారు. నేడు గర్వంగా భారతీయ జెండాను చంద్రమండలంపై ఎగురువేశాం అనే ఆనందం వెనుక ఎంతో శ్రమతో పాటు కన్నీళ్లు,ఉద్వేగం ఇముడుకొని ఉన్నాయి. ఇదంతా ఒక సినిమాగా మన కళ్లుకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తే అది నిజంగా అద్భుతమే అని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: జాబిల్లిపై ఇండియా జయకేతనం.. టాలీవుడ్ స్టార్స్ విషెస్) గతంలో చంద్రయాన్-2 వైఫల్యాలను గుర్తుచేసుకుంటూ మన ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన చంద్రయాన్-3లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చంద్రుడి మీది విక్రమ్ ల్యాండర్ దిగింది. చంద్రయాన్-2 నుంచి చంద్రయాన్-3 విజయం వరకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఇస్రో శాస్త్రవేత్తలు ఎలా అదిగమించారో తెలుపుతూ ఒక సినిమాగా తీసి భారతీయులకు చూపించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి ఆసక్తకరమైన సినిమాలు తీయాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అనే చెప్పవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆయన ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్లు కూడా చంద్రయాన్ 3 బయోపిక్ తీయమని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఏదైనా సెన్సేషన్ సృష్టించిన ఘటన జరిగితే ఆ అంశంపై సినిమా తీయడం మేకర్స్‌కు అలవాటే... బాలీవుడ్లో బయోపిక్ సినిమా తీయాలంటే మొదట వినిపించే పేరు అక్షయ్ కుమార్.... ఇప్పటికే ఆయన మిషన్ మంగల్, రామసేతు,కేసరి,OMG వంటి విభిన్న చిత్రాలతో మెప్పించాడు. దీంతో చంద్రయాన్-3 సినిమా తీస్తే ఆయన మాత్రమే న్యాయం చేయగలడని ఆయన ఫ్యాన్స్ తెలుపుతున్నారు. ప్రధాని మోదీతో అక్షయ్ కుమార్‌కు మంచి అనుబంధమే ఉంది. అందులో ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే చంద్రయాన్-3 విజయవంతం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌ను అక్షయ్ తెరకెక్కిస్తారని పలువురు అంటున్నారు. -
చంద్రయాన్–3: షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ ప్రక్రియ
LIVE UPDATES: ►చంద్రయాన్-2 వ్యోమనౌక షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ కానుంది. ►సాయంత్రం 5.44 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ►సాయంత్రం 6.04 గంటలకే ల్యాండర్ చంద్రుడిని తాకనుంది. ►విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే చివరి 17 నిమిషాలే అత్యంత కీలకం: ఇస్రో చైర్మన్ సోమనాథ్ ► ఆ 19 నిమిషాలు మాకు టెర్రరే. ►సాయంత్రం 5.47 గంటల తర్వాత ల్యాండర్ తన పని తాను చేసుకుపోతుంది. ►అన్ని సెన్సర్లు ఫెయిలైనా, ల్యాండింగ్ అయ్యేలా ప్రొపల్షన్ సిస్టమ్‌ను రూపొందించాం: ఇస్రో చీఫ్ సోమనాథ్ ►ఆ దశలో ల్యాండర్ ఎవరి మాట వినదు. ►2 ఇంజిన్లు ఫెయిలైనా సజావుగా ల్యాండింగ్ అయ్యేలా ప్లాన్. ►అల్గోరిథమ్స్ బాగా పనిచేస్తే చాలు ►వర్టికల్ ల్యాండింగ్ అత్యంత కీలకం ►గంటకు 7.2 కిమీ. మీ-10.8 కి,మీ స్పీడుతో నేడు ల్యాండిగ్ ►ల్యాండర్ 12 డిగ్రీల ఒరిగినా సేఫ్ ల్యాండింగ్‌కు ప్లాన్ ►నేటి ల్యాండింగ్‌లో పూర్తిగా కంప్యూర్లదే పాత్ర ►చంద్రయాన్- నేటి ల్యాండింగ్‌లో ఇస్రో శాస్త్రవేత్తలది కేవలం పరిశీలక పాత్రే ►నేడు చివరి 15న నిమిషాలు పూర్తిగా కంప్యూటర్ గైడెడ్ ►2019లో చంద్రయాన్-2 ల్యాండర్ నిలువుగా దిగకపోవడం వల్లే కూలింది ►నేడు అది జరగకూడదని సర్వ జాగ్రత్తలు ►చంద్రుడిపై ఐస్ ఉన్నట్లుందని 2009లో చెప్పిన చంద్రయాన్1 నాసా పరికరం ►చంద్రుడిపై సముద్రాలు ఉన్నట్లయితే హైడ్రోజన్, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే వీలు ►చంద్రుడిపై ఇప్పటి దాకా ల్యాండ్ అయిన రోవర్లు: అమెరికా, చైనా, రష్యా ►చంద్రయాన్-3 పరిశోధనల వైపు ప్రపంచం మొత్తం చూపు ►చంద్రయాన్-3 ల్యాండింగ్ సౌతాఫ్రికా నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా వీక్షించనున్నారు. ►మరొకన్ని గంటల్లో చంద్రుడిపై చారిత్రాత్మక ఘట్టం ►ఇవాళ జిబిల్లాపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ ►సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై అడుగుపెట్టనున్న విక్రమ్ ల్యాండర్ ►సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రోశాస్త్రవేత్తల ధీమా ►ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దేశ ప్రజలు ►విజయవంతం కావాలని పూజలు, హోమాలు ►చంద్రయాన్ 3 రూపకల్పనలో గద్వాల జిల్లా యువకుడు కృష్ణా ►చంద్రయాన్-3 మిషన్‌లో 2 పేలోడ్స్(AHVC). (ILSA)కి డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ రాసిన ఉండవల్లికి చెందిన కృష్ణ ►ప్రపంచ దేశాల చూపు చంద్రయాన్వైపే ►రష్యా లూనా-25 విఫలం కావడంతో చంద్రయాన్‌పై ఇతర దేశాల ఆసక్తి ►ప్రయోగం సక్సెస్ అయితే దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ ►గత నెల 14న చంద్రయాన్ 3 ప్రయోగం ►41 రోజుల పాటు ప్రయాణం చేసిన చంద్రయాన్ ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ తన తుది గమ్యాన్ని నేడు ముద్దాడనుంది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన తుదిఘట్టం బుధవారం ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణధ్రువ ఉపరితలంపై ల్యాండర్ మాడ్యూల్ అడుగు పెట్టనుంది. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించడానికి ఇస్రో సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ అపూర్వ ఘట్టాన్ని బుధవారం సాయంత్రం 5.20 నుంచే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ల్యాండర్ మాడ్యూల్ చందమామను చేరుకొనే అద్భుత దృశ్యాల కోసం దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘జయహో భారత్.. జయహో ఇస్రో’ అంటూ సోషల్ మీడియాలో యువత నినాదాల హోరు ఇప్పటికే మొదలయ్యింది. ప్రపంచ దేశాలు చంద్రయాన్–3 ప్రయోగంపై ప్రత్యేక ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. –సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా) ►70 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఫొటోల చిత్రీకరణ ల్యాండర్ మాడ్యూల్‌లోని ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా(ఎల్పీడీసీ) కేవలం 70 కిలోమీటర్ల ఎత్తునుంచి చంద్రుడి ఉపరితలాన్ని ఈ నెల 19న చిత్రీకరించింది.ఈ ఫొటోలను ఇస్రో మంగళవారం విడుదల చేసింది. ►ఈ నెల 17న ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడికి దగ్గరగా విజయవంతంగా వదిలిపెట్టింది. ►చంద్రయాన్–3లో ఇప్పటిదాకా చేపట్టిన ప్రతి ఆపరేషన్ విజయవంతమైంది. ఇప్పటిదాకా ప్రతి ఆపరేషన్ విజయవంతం ►భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి గత నెల 14న చంద్రయాన్–3 మిషన్‌ను ప్రయోగించింది. ►41 రోజుల ప్రయాణంలో ఐదుసార్లు భూమధ్యంతర కక్ష్యలో, మరో ఐదుసార్లు లూనార్ ఆర్బిట్(చంద్రుడి కక్ష్య)లో చంద్రయాన్–3 మిషన్ కక్ష్య దూరాన్ని పెంచుతూ వచ్చారు. ...ఇక మిగిలింది ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా దించడమే. ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ ఇలా.. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలం నుంచి 25గీ134 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో పరిభ్రమిస్తున్న ల్యాండర్ మాడ్యూల్‌ను సెకన్‌కు 1.68 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేసి బుధవారం సాయంత్రం 6.04 గంటలకు సురక్షితంగా దించనున్నారు. ఇందులో ఆఖరి 17 నిమిషాలు అత్యంత కీలకం. దీన్ని ‘17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అని అభివర్ణిస్తున్నారంతే ఇదెంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ 17 నిమిషాల్లోనే ల్యాండర్ తనలోని ఇంజిన్లను తానే మండించుకుంటుంది. సరైన సమయంలో ఇంజిన్లను మండించడం, సరైన పరిమాణంలో ఇంధనాన్ని వాడుకోవడం చాలా కీలకం. ల్యాండర్ మాడ్యూల్లో నాలుగు థ్రస్టర్ ఇంజిన్లు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత వీటిని మండించడం ప్రారంభమవుతుంది. దాంతో ల్యాండర్ వేగం క్రమంగా తగ్గిపోతుంది. తనలోని సైంటిఫిక్ పరికరాలతో ల్యాండింగ్ సైట్‌ను ల్యాండర్ మాడ్యూల్ గుర్తిస్తుంది. అడ్డంకులు ఏవైనా ఉంటే గుర్తిస్తుంది. ల్యాండింగ్ సైట్ చదునుగా ఉంటే బుధవారం ల్యాండింగ్ అవుతుంది. లేదంటే వాయిదా పడే అవకాశం లేకపోలేదు. వాయిదా పడితే ఈ నెల 27న సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తామని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ చెప్పారు. పరిస్థితులన్నీ అనూకూలించి, సాంకేతికపరంగా సహకారం అందితే సురక్షితంగా ల్యాండింగ్ అవుతుంది. ల్యాండర్ మాడ్యూల్‌ను నిరంతరం క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం చక్కగా పనిచేస్తోందని ఇస్రో మంగళవారం వెల్లడించింది. ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు అవసరమైన కమాండ్లను ల్యాండర్లో ఇస్రో అప్లోడ్ చేస్తుంది. -
జాబిల్లి తొలి ఫొటోలు.. షేర్ చేసిన ఇస్రో..
బెంగళూరు: చంద్రునిపై పరిశోధనల కోసం చంద్రయాన్-3.. ఉపగ్రహం జాబిల్లికి మరింత చేరువైంది. ఈ మేరకు ల్యాండర్ విక్రమ్ మొదటిసారి చంద్రుని ఫొటోలను పంపించింది. స్పేస్‌క్రాఫ్ట్ నుంచి గురువారమే విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తూ జాబిల్లి ఉపరితలాన్ని క్లిక్‌మనిపించింది. ఆ ఫొటోలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ల్యాండర్ విక్రమ్ తీసిన మొదటి ఫొటోలో చంద్రునిపై ఉన్న బిలాలను కూడా ఇస్రో గుర్తించింది. గార్డియానో బ్రూనో క్రేటర్ అనే పేరు కలిగిన బిలాన్ని గుర్తించారు. ఇటీవలే గుర్తించిన ఈ బిలం వ్యాసం దాదాపు 43 కిలోమీటర్లు ఉంటుంది. అయితే.. శుక్రవారం సాయంత్రం చేపట్టిన వేగాన్ని తగ్గించే ప్రక్రియ మరింత విజయవంతమైనట్లు తెలిపారు. Chandrayaan-3 Mission: View from the Lander Imager (LI) Camera-1 on August 17, 2023 just after the separation of the Lander Module from the Propulsion Module #Chandrayaan_3 #Ch3 pic.twitter.com/abPIyEn1Ad — ISRO (@isro) August 18, 2023 ఒకసారి ల్యాండర్ చంద్రున్ని తాకిన తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడివడుతుందని ఇస్రో తెలిపింది. అనంతరం రోవర్ కీలక సమాచారాన్ని సేకరిస్తుందని వెల్లడించింది. చంద్రుని ఆకృతి, శిథిలాలు, నీటి జాడ వంటి అనేక విషయాలను శోధిస్తుంది. ఇదీ చదవండి: India First 3D Printed Post Office: ఆత్మనిర్భర్ స్ఫూర్తి.. దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు.. అదీ 45 రోజుల్లో! -
చంద్రయాన్-3పై ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన.. మళ్లీ అదే జరిగితే..
బెంగుళూరు: చంద్రయాన్-2 ప్రయోగం దాదాపుగా విజయవంతంగా జరిగిందనుకుంటున్న తరుణంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో చివరి నిముషంలో ల్యాండర్ నుండి సంకేతాలు అందడం ఆగిపోయాయి. ఈ సారి చంద్రయాన్-3లో అలా కాకుండా విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకునే విధంగా రూపొందించామని అన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-2 వైఫల్యాన్ని ఇస్రో సవాలుగా స్వీకరించి చంద్రయాన్-3 ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే చంద్రయాన్-3 జులై 14, 2023న విజయవంతంగా ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. నిర్ణీత సమయం ప్రకారం ఇది ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉండగా ఒకరోజు అటు ఇటుగా చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అవ్వనుంది. ఇదిలా ఉండగా ఈ ప్రయోగం జరిగిన నాటి నుండి చంద్రయాన్-2 లా ఇందులో కూడా చివరి నిముషంలో ఏవైనా సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏమిటనే అనుమానాలు కలుగుతూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్. దిశా భారత్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రయాన్-3లో విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకోగలదని, సెన్సార్లతో సహా అందులోని అన్నీ ఫెయిల్ అయినా కూడా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ కావడం ఖాయమని అన్నారు. ప్రపల్షన్ వ్యవస్థను ఆ విధంగా సిద్ధం చేశామని తెలిపారు. ఆగస్టు 9,14,16 తేదీల్లో చంద్రయాన్-3 చంద్రుడిని సమీపిస్తుండగా ఒక్కో కక్ష్య మారుతూ వెళుతుందని అనంతరం ల్యాండర్ ప్రపల్షన్ ప్రక్రియ మొదలవుతుందని ఆ సమయంలోనే క్రాఫ్ట్ వేగం తగ్గించుకుని చివరిగా ఆగష్టు 23న క్షేమంగా ల్యాండ్ అవుతుందని అన్నారు. అందులోని రెండు ఇంజిన్లు పనిచేయకపోయినా కూడా సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని, ఆర్బిటర్ నుండి ల్యాండర్ వేరు కాగానే అడ్డంగా తిరిగే ప్రక్రియను క్రమపద్ధతిలో నిలువుగా కిందకు దిగేలా ల్యాండర్ డిజైన్ చేశామని, గతంలో ఇక్కడే పొరపాటు జరిగిందని ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాదని ఆయన అన్నారు. చంద్రయాన్-3 ల్యాండర్లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి.. మొదటిది చంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ (ChaSTE) చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతను కొలుస్తుంది. రాంబా-LP చంద్రుడి ఉపరితల ప్లాస్మా సాంద్రత, మార్పులను కొలుస్తుంది. భవిష్యత్తులో ల్యాండర్ల ల్యాండింగ్ స్థానాన్ని గుర్తించి నాసాకు నిర్దేశించడానికి రెట్రోరిఫ్లక్ట్రర్, చంద్రుడి కంపించే కోలాటాన్కు లెక్కించడానికి ఒక పరికరం ఉంటాయి. ఇది కాకుండా ప్రగ్యాన్ రోవర్ లో మరో మూడు పేలోడ్లు ఉంటాయని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఇది కూడా చదవండి: త్రివిధ దళాల్లో ఖాళీలను భర్తీ చేయండి -
Chandrayaan 3: 'రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా' రీతు కరిధాల్..
‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే ఆనంద తరంగాలలో వీరు...’ అన్నది చంద్రయాన్–3 ఆ ఆనంద తరంగాలలో తేలియాడిన అసంఖ్యాక భారతీయులలో ‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకున్న రీతు కరిధాల్ ఒకరు. మూడు దశలు పూర్తి చేసుకొని చంద్రయాన్–3 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి వెళ్లింది. దేశాన్ని సంతోషంలో ముంచెత్తింది. ‘చంద్రయాన్–3’లో ‘నేను సైతం’ అంట మిషన్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు స్వీకరించింది రీతు కరిధాల్. చిన్నప్పటి కలలు కలలుగానే ఉండిపోవు. కష్టపడితే ఆ కలలు నిజమవుతాయి. పదిమంది మన గురించి గర్వంగా చెప్పుకునేలా చేస్తాయి... అని చెప్పడానికి రీతు కరిధాల్ నిలువెత్తు నిదర్శనం. ‘ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలకు వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కుదురుతుందా? ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి?’ అనే ప్రశ్నకు రీతు కరిధాల్ మాటల్లో సమాధానం దొరుకుతుంది... ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన రీతు కరిధాల్‌కు చిన్నప్పడు ఆకాశం వైపు చూడడం అంటే ఇష్టం. రాత్రులలో గంటల తరబడి ఆకాశంకేసి చూసేది. నక్షత్రాల గురిం ఆలోచించేది. ‘చంద్రుడు ఒకసారి పెద్దగా, ఒకసారి చిన్నగా ఎందుకు కనిపిస్తాడు?’... లాంటి సందేహాలెన్నో ఆమెకు వచ్చేవి. అంతరిక్షంపై రీతు ఆసక్తి వయసుతోపాటు పెరుగుతూ పోయింది. హైస్కూల్ రోజులకు వచ్చేసరికి అంతరిక్షం, ఇస్రో, నాసాకు సంబంధించి పత్రికలలో వచ్చిన వార్తలు, వ్యాసాలను కట్ చేసి ఫైల్ చేసుకునేది. ‘యూనివర్శిటీ ఆఫ్ లక్నో’లో ఎం.ఎస్సీ., బెంగళరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసింది. 1997లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ‘మిషన్ ఎనాలసిస్ డివిజన్’ లో తొలి ఉద్యోగం. తొలి టాస్క్ తన ముందుకు వచ్చినప్పుడు... ‘చాలా కష్టం’ అనుకుంది. ఆ సమయంలో ఆ కష్టాన్ని పక్కకు తోసి టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి తాను చదువుకున్న ఫిజిక్స్, మ్యాథమేటిక్స్ కంటే తనమీద తనకు ఉన్న ఆత్మవిశ్వాసమే ఎక్కువగా ఉపయోగపడింది. ఆ తరువాత కూడా ప్రాజెక్ట్‌ల రపంలో ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించింది. ‘టైమ్ అండ్ ది టార్గెట్’ను దృష్టిలో పెట్టుకొని కాలంతో పరుగు తీసింది. ‘అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. పేయింగ్ గెస్ట్‌గా ఉన్నాను. పొద్దుటి నుంచి రాత్రి వరకు పనిచేయాల్సి వచ్చేది. అయితే అదేమీ నాకు భారంగా, కష్టంగా అనిపించేది కాదు. చేస్తున్న పని ఇష్టమైనది కావడమే దీనికి కారణం. అప్పట్లో ఎక్కువమంది మహిళలు ఇస్రోలో లేరు. ఒక ల్యాబ్ నుంచి మరో ల్యాబ్‌కు, ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌కు ఒంటరిగానే వెళ్లేదాన్ని. ఎప్పుడ భయం అనిపించేది కాదు’ అంటుంది రీతు. ఒక్కోమెట్టు ఎక్కుతూ ‘ఇస్రో’ చేపట్టిన ఎన్నో ప్రాజెక్ట్‌లలో కీలక బాధ్యతలు చేపట్టింది. ప్రతిష్ఠాత్మకమైన ‘మంగళాయాన్ మిషన్’లో డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా, చంద్రయాన్–2 మిషన్ డైరెక్టర్‌గా పనిచేసింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రీతుకు కోచింగ్ సెంటర్లకు వెళ్లేంత స్థోమత ఉండేది కాదు. చదువుపై తన ఆసక్తే తన శక్తిగా మారింది. బీఎస్సీ పూర్తికాగానే ‘ఏదో ఒక ఉద్యోగంలో చేరవచ్చు కదా’ అనే మాటలు చుట్టాలు పక్కాల నుంచి వినిపించేవి. ‘ఇస్రోలో పనిచేయాలనేది నా కల’ అని వారికి స్పష్టంగా చెప్పేది రీతు. తన పుస్తకం ‘దోజ్ మాగ్నిఫిసెంట్ ఉమెన్ అండ్ దెయిర్ ఫ్లైయింగ్ మెషిన్స్’ కోసం మిన్నీ వేద్ రీతు కరిధాల్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్యలో తన అనుభవాలను ఇలా పంచుకుంది రీతు... ‘ఇస్రోలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. లింగవివక్షతకు తావు లేదు. ప్రతిభ మాత్రమే ముఖ్యం అవుతుంది. రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఫీల్డ్‌లో సీనియర్ ఉమెన్ సైంటిస్ట్‌లు ప్రోగ్రామ్ డైరెక్టర్లు కావడం దీనికి నిదర్శనం. నా తొలి ప్రాజెక్ట్ చేయడానికి ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆ అవకాశం నన్ను వెదుక్కుంటూ వచ్చింది’ ‘టైమ్ మేనేజ్మెంట్’కు అధిక ప్రా«ధాన్యత ఇచ్చే రీతు వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించేది. వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా పిల్లల దగ్గర కూర్చొని వారితో హోంవర్క్ చేయించడం మరిచేది కాదు. ‘మంగళాయాన్ మిషన్’లో భాగమైనప్పుడు రీతు కువరుడి వయసు తొమ్మిది, కూతురు వయసు నాలుగు సంవత్సరాలు. క్షణం తీరిక లేని పనుల్లో కూడా ఏదో రకంగా తీరిక చేసుకొని పిల్లలతో తగిన సమయం గడిపేది. వారు నిద్రపోయిన తరువాత ఆఫీసు పని మొదలుపెట్టేది. అలా పనిచేస్తూ కుర్చీలోనే నిద్రపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి! ‘ఒకసారి మా అమ్మాయికి జ్వరం వచ్చింది. హాస్పిటల్‌కు తీసుకువెళ్లే టైమ్ లేకపోవడంతో నా భర్త తీసుకువెళ్లాడు. ఆఫీసులో ఉన్న మాటేగానీ నా మనసంతా పాపపైనే ఉంది. పాపకు ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు అడుగుతుండేదాన్ని. అపరాధ భావనతో బాధ అనిపించేది. కొన్నిసార్లు స్కూల్ ఫంక్షన్లకు వెళ్లడం కుదిరేది కాదు. అయితే కుటుంబం నాకు ఎప్పుడ అండగానే నిలబడింది. అదే నా బలం. ఆఫీసు నుంచి ఇంటికి ఆలస్యంగా రావడానికి కొన్ని కుటుంబాల్లో ఒప్పుకోరు. మగవాళ్ల విషయంలో అయితే పట్టింపులు ఉండవు. మంగళాయాన్ మిషన్ కోసం పనిచేసే రోజుల్లో ఇంటికి ఆలస్యంగా వచ్చేదాన్ని. అయితే నాపై ఉండే పనిఒత్తిడి గురించి తెలిసిన కుటుంబసభ్యులు నన్ను అర్థం చేసుకున్నారు. ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా అది నేను చేసే పనిపై ప్రభావం చపేది. అందుకే ఎలాంటి సమస్యలు రాకుండా, మనసు ప్రశాంతగా ఉండేలా చూసుకునేదాన్ని’ అంటుంది రీతు కరిధాల్. (చదవండి: ఆ కుక్క చనిపోయి వందేళ్లు..కానీ ఇంకా బతికే ఉంది ఎలాగో తెలుసా!) -
జాబిలి వైపు రాకెట్.. లాంఛ్ కాదు ఢీ కొట్టడానికి!
పరిశోధనల కోసం రాకెట్లను, శాటిలైట్లను అంతరిక్షంలోకి లాంఛ్ చేయడం సహజం. కానీ, ఇక్కడో రాకెట్ చంద్రుడ్ని ఢీ కొట్టే దూసుకెళ్తుండగా.. స్పేస్ ఏజెన్సీలన్నీ ఆసక్తిగా పరిశీలించబోతున్నాయి. అందుకు కారణాలు.. ఆ రాకెట్ ఎప్పుడో ఏడేళ్ల కిందట ప్రయోగించింది కావడం, ఇన్నాళ్లు స్పేస్‌లో కక్క్ష్య తప్పి అస్తవ్యస్తంగా సంచరించి ఇప్పుడు చంద్రుడి వైపు దూసుకెళ్లడం!. స్పేస్ఎక్స్ కంపెనీ ద్వారా ఫాల్కన్ 9 బూస్టర్ రాకెట్‌ను 2015 ఫిబ్రవరిలో అంతరిక్షంలోకి పంపించిన విషయం తెలిసిందే. అంతరిక్షంలోని లోతైన పరిస్థితుల్ని పరిశీలించడానికి ఈ రాకెట్‌ను ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు. మొదటి దశలో విజయవంతమైనప్పటికీ.. రెండో దశలో ఈ ప్రయోగం ప్లాప్ అయ్యింది. అయితే ఫాల్కన్ 9 బూస్టర్ అప్పటి నుంచి అస్తవ్యస్తమైన కక్క్ష్యను అనుసరించింది. దీంతో అదుపు తప్పి జాడ లేకుండా పోవడంతో స్పేస్ జంక్‌గా దాదాపు ఒక నిర్ధారణకు వచ్చేశారు సైంటిస్టులు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఆశ్చర్యకరరీతిలో ఈ రాకెట్ ట్రాక్ ఎక్కగా.. చంద్రుడి మీదకు క్రాష్ దిశగా దూసుకెళ్తుంది. నాసా అంచనాల ప్రకారం.. మార్చ్ 4వ తేదీన ఈ క్రాష్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి మిలియన్ మైళ్ల ట్రెక్‌లో అంతరిక్ష వాతావరణ ఉపగ్రహాన్ని పంపడం ద్వారా తన మొదటి డీప్-స్పేస్ మిషన్‌ను ప్రారంభించినప్పటికీ.. ఫాల్కన్ 9 బూస్టర్ కొంత అస్తవ్యస్తమైన కక్ష్యలో తిరుగాడింది. దీంతో ఈ రాకెట్ సంగతి పట్టించుకోవడం మానేశారు!. అయితే ఇన్నేళ్లకు ఇది చంద్రుడి వైపు కక్క్ష్యను మార్చుకుని దూసుకెళ్తోంది. సుమారు 4వేల కేజీల బరువున్న పాల్కన్ 9 బూస్టర్ రాకెట్.. ప్రస్తుతం గంటకు 9,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు పయనిస్తోంది. నాసా లునార్ ఆర్బిటర్(Lunar Reconnaissance Orbit)తో పాటు భారత్ చంద్రయాన్-2 స్పేస్‌క్రాఫ్ట్‌లు ఈ క్రాష్ ల్యాండ్‌ను అతి సమీపంగా గమనించనున్నాయి. అసలు ఈ క్రాష్ ల్యాండ్‌తో ఒరిగేది ఏముంటుందనే అనుమానం రావొచ్చు. చంద్రుడి ఉపరితలం మీది పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం ఈ క్రాష్‌ల్యాండ్‌ను పరిశీలించనున్నారు. 2009లో నాసా కావాలనే ఒక రాకెట్‌ను చంద్రుడి మీదకు క్రాష్ లాంఛ్ చేసింది. అయితే పాల్కన్ విషయంలో అనుకోకుండా చంద్రుడి ఉపరితలంపైకి ఢీ కొడుతుండడం విశేషం. ఇది చంద్రుడ్ని ఢీ కొట్టడం ద్వారా జరిగే ప్రభావం అంతగా ఉండకపోవచ్చని స్పేస్ రీసెర్చర్లు భావిస్తున్నారు. క్లిక్ చేయండి: 5జీతో విమానాలకు ముప్పు పొంచి ఉందా? నిపుణుల మాటేంటంటే.. -
చరిత్రలో మనకంటూ ఒక స్పేస్
సాక్షి, సెంట్రల్ డెస్క్: భూమికి అవతల ఏముంది.. ఇతర గ్రహాల్లో, ఇంకెక్కడైనా జీవం ఉందా.. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తోక చుక్కలు.. ఇలా అంతరిక్షంపై ఎప్పటినుంచో మనిషికి ఆసక్తి ఉంది. ఆ దిశగానే అంతరిక్ష ప్రయోగాలు చేపట్టారు. మనుషులు స్పేస్‌లోకి అడుగు పెట్టారు కూడా. 1961 ఏప్రిల్ 12న రష్యా కాస్మోనాట్ యూరీ గగారిన్ తొలిసారిగా స్పేస్‌లోకి వెళ్లారు. ఈ మేరకు ఏటా ఏప్రిల్ 12న ‘ఇంటర్నేషనల్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ డే’గా జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది చేపట్టిన పలు కీలక అంతరిక్ష ప్రయోగాలేంటో తెలుసుకుందామా? అమెరికా.. ఆర్టెమిస్-1 చంద్రుడిపైకి మనుషులను పంపే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా ఈ ఏడాది తొలి ప్రయోగం జరుగనుంది. నవంబర్‌లో ‘ఆర్టెమిస్-1’ను లాంచ్ చేసేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సుదూర అంతరిక్షంలో రహస్యాలను ఛేదించేందుకు, భూమిలాంటి గ్రహాలను గుర్తించేందుకు నాసా చేపట్టిన ‘ది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్’ ఈ ఏడాది అక్టోబర్‌లో నింగికి ఎగరనుంది. మార్స్‌పైకి.. మూడు దేశాలు ఒకప్పుడు జీవం ఉండి ఉంటుందని భావిస్తున్న అంగారక గ్రహంపై ఈ ఏడాది మూడు దేశాలు పరిశోధనలు చేపట్టాయి. అమెరికా పంపిన పర్సవెరన్స్ రోవర్ మార్స్‌పై ఉపరితలంపై తిరుగుతూ అక్కడి నేల, రసాయనాలు, జీవం ఉనికిని వెతుకుతోంది. ఈ రోవర్ వెంట వెళ్లిన ‘ఇన్‌జెన్యుటీ’.. భూమి అవతల మరోగ్రహంపై గాల్లోకి ఎగిరే తొలి హెలికాప్టర్ కానుంది. ఇక మార్స్‌పైకి చైనా, యూఏఈ దేశాలు తొలిసారి ప్రయోగాలు చేపట్టాయి. చైనాకు చెందిన టియాన్వెన్-1, యూఏఈకి చెందిన ది హోప్ ఆర్బిటర్ రెండూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం ఒక్క రోజు తేడాలో అంగారకుడిని చేరి పరిశోధనలు మొదలుపెట్టాయి. స్పేస్‌లో చెత్తను క్లీన్ చేసేందుకు.. సుమారు 50 ఏళ్లుగా వివిధ దేశాలు పంపిన శాటిలైట్లలో గడువు ముగిసిపోయినవి, చెడిపోయినవి, ప్రయోగాలకు వాడిన రాకెట్లు, వాటి విడిభాగాలు లక్షల సంఖ్యలో భూమిచుట్టూ తిరుగుతున్నాయి. వాటినే ‘స్పేస్ జంక్’ అంటారు. ఇవి భవిష్యత్తు శాటిలైట్ ప్రయోగాలకు ప్రమాదకరం. ఈ నేపథ్యంలో ఆ చెత్తను క్లీన్ చేసేందుకు జపాన్‌కు చెందిన ఆస్ట్రోస్కేల్ కంపెనీ ఈ ఏడాది మార్చి 22న ‘స్పేస్ జంక్ క్లీనప్’ మిషన్‌ను ప్రయోగించింది. చంద్రయాన్-3 చంద్రుడిపైకి రోవర్‌ను పంపేందుకు మన ఇస్రో చంద్రయాన్-3 ప్రాజెక్టును చేపట్టింది. దానిని ఈ ఏడాది చివర్లో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రయోగం వాయిదా పడింది. దీనిని వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో చేపట్టాలని భావిస్తోంది. ఆస్టరాయిడ్ల గుట్టు తేల్చే.. ల్యూసీ మిషన్ అంగారక గ్రహం అవతలి ఒక ఆస్టరాయిడ్, గురుగ్రహం కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఏడు ‘ట్రోజాన్ ఆస్టరాయిడ్ల’పై పరిశోధన కోసం నాసా చేపట్టిన ప్రయోగం ‘ల్యూసీ’ మిషన్. సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్లలో పరిస్థితులు, భూమిపై జీవం పుట్టుకకు సంబంధించిన ఆనవాళ్లను ఈ ప్రయోగంతో గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 12 ఏళ్లపాటు సాగు ఈ సుదీర్ఘ మిషన్ ఈ ఏడాది అక్టోబర్‌లో నింగికి ఎగరనుంది. చదవండి: మార్స్‌పై బుల్లి హెలీకాప్టర్, దానికి పేరు పెట్టిందెవరో తెలుసా? -
2022లో చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చైర్మన్
'ఫ్యూచర్ ఆఫ్ ఏరోస్పేస్ అండ్ ఏవియానిక్స్ ఇన్ ఇండియా' అనే అంశంపై యుపీఈఎస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన సమావేశంలో ఇస్రో చైర్మన్, కార్యదర్శి డాక్టర్ కే.శివన్ ప్రసంగించారు. ఈ సమావేశంలో డాక్టర్ కే.శివన్ రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రణాళిక గురించి మాట్లాడారు. అతను పేర్కొన్న ప్రాజెక్టులలో ఇస్రో యొక్క చంద్రయాన్-3 (మూన్ మిషన్ 3), ప్రతిష్టాత్మక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాం(గగన్ యాన్) ఉన్నాయి. "తరువాతి దశాబ్దకాలంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) హెవీ-లిఫ్ట్ లాంచ్ వాహనంతో సహా అనేక అధునాతన సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకుంది. హెవీ-లిఫ్ట్ లాంచ్ వాహనం 16-టన్నుల పేలోడ్లను జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ కక్ష్యకు తీసుకువెళ్ళగలదు. ఇది ప్రస్తుత జీఎస్ఎల్వీ ఎంకే3 లిఫ్ట్ సామర్థ్యానికి నాలుగు రెట్లు ఎక్కువ, అలాగే పునర్వినియోగపరిచే ప్రయోగ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు” చైర్మన్ డాక్టర్ కే.శివన్ పేర్కొన్నారు. చంద్రయాన్-2 లోపాలను గుర్తించి తదుపరి మిషన్ లో అటువంటి తప్పిదాలు జరగకుండా ఉండటానికి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము. చంద్రయాన్-3 ప్రయోగాన్ని 2022 మొదటి భాగంలో చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. గగన్‌యాన్ రూపకల్పన చివరి దశలో ఉంది అన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి మానవరహిత మిషన్ ట్రయల్ జరుగుతుంది అని కే.శివన్ తెలిపారు. రాబోయే కాలంలో ఇస్రో ప్రణాళికలను వివరిస్తూ జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీఓ)కు పేలోడ్ సామర్ధ్యాన్ని 5 టన్నులకు పెంచేలా ప్రయోగాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సెమీ-క్రియో ఇంజన్లు శక్తివంతమైనవని, పర్యావరణ అనుకూలమైనవని, తక్కువ ఖర్చుతో కూడుకున్నవని తెలిపారు. మరింత శక్తివంతమైన బూస్టర్ దశల అవసరాన్ని శివన్ ప్రస్తావించారు. మరింత శక్తివంతమైన 2000 న్యూటన్ లిక్విడ్ ఆక్సిజన్, కిరోసిన్ ఇంజన్ల పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. చదవండి: దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్ కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్! -
చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీకారం
బెంగళూర్ : చంద్రయాన్ 3 మిషన్‌కు శ్రీకారం చుట్టామని, పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఇస్రో చీఫ్ కే శివన్ బుధవారం వెల్లడించారు. చంద్రమండలానికి మానవ మిషన్‌ను ఇస్రో చేపట్టే ప్రయత్నాలపై ఆయన స్పందిస్తూ ఇది ఇప్పటికిప్పుడే సాధ్యం కాకున్నా ఏదోఒక రోజు ఇది సాకారమవుతుందని అన్నారు. ఇక చంద్రయాన్ 3 ల్యాండర్, క్రాఫ్ట్ ఖర్చు దాదాపు రూ 250 కోట్లు కాగా, లాంఛ్‌కు రూ 350 కోట్ల వ్యయమవుతుందని శివన్ వెల్లడించారు. చంద్రయాన్–2లో మాదిరిగానే చంద్రయాన్–3లోనూ ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటాయని అన్నారు. చంద్రయాన్–2లో ఆర్బిటర్ మిషన్ జీవితకాలం 7 సంవత్సరాలని, చంద్రయాన్–3లోనూ దీనిని ఉపయోగిస్తామని చెప్పారు. మరోవైపు గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములు ఈ మాసాంతానికి శిక్షణ నిమిత్తం రష్యా వెళతారని చెప్పారు. 1984లో రాకేష్ శర్మ రష్యన్ మాడ్యూల్లో అంతరిక్షంలోకి వెళ్లగా, ఈసారి భారత వ్యోమగాములు దేశీ మాడ్యూల్లోనే భారత్ నుంచి వెళతారని ఆయన తెలిపారు. చదవండి : వాళ్ల వివరాలు రహస్యంగా ఉంచిన ఇస్రో -
విక్రమ్‌ల్యాండర్ ఆచూకీ కనుగొన్నది మనోడే!
న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం నాసా ప్రయత్నించి చివరకు దాని ఆచూకీ కనిపెట్టింది. దీన్ని గుర్తించడంలో చెన్నైకి చెందిన ఓ ఇంజినీర్, ఖగోళ శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించినట్లు నాసా చెప్పింది. దీంతో నాసా అతనిపై ప్రశంసలు కురిపించింది. దీనిపై షణ్ముగ స్పందిస్తూ.. ఓ సాధారణ పిక్ నుంచే తాను ల్యాండర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించగలినట్లు షణ్ముగ చెప్పాడు. నాసా విడుదల చేసిన రెండు ఫోటోల్లో ఉన్న తేడాల ఆధారంగానే ఆ ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలిపాడు. లూనార్ ఆర్బిటార్ తీసిన ఫోటోలను నాలుగైదు రోజుల పాటు కనీసం 7 నుంచి 8 గంటలు స్కాన్ చేసినట్లు చెప్పాడు. అయితే తాను కనుగొన్న విషయాన్ని నాసా ద్రువీకరించడం సంతోషంగా ఉందన్నాడు. ఒక రకంగా తన శోధన అనేక మందికి ప్రేరణగా నిలుస్తుందని షణ్ముగ తెలిపాడు. Shanmuga Subramanian,an amateur astronomer from Chennai who has discovered debris of Chandrayaan-2's Vikram Lander on surface of the moon:I was able to find something out of the ordinary in a particular spot,so,I thought this must be the debris. I got confirmation from NASA today pic.twitter.com/8WBAZvNkRn — ANI (@ANI) December 3, 2019 -
అరగంట సేపు ఊపిరి బిగపట్టిన పరిస్థితి...
బెంగళూర్ : చంద్రయాన్-2ను మంగళవారం ఉదయం విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టామని ఇస్రో చీఫ్ కే. శివన్ వెల్లడించారు. జాబిల్లి కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టేందుకు చంద్రయాన్ 2లో లిక్విడ్ ఇంజన్‌ను సిబ్బంది మండించే క్రమంలో అరగంట సేపు ఊపిరి బిగపట్టిన పరిస్థితి నెలకొందని తాము అనుభవించిన టెన్షన్‌ను ఆయన వివరించారు. చంద్రయాన్ 2 సెప్టెంబర్ 7న చంద్రుడి వద్దకు చేరడం ఉత్కంఠభరిత సన్నివేశమని శివన్ పేర్కొన్నారు. ఇస్రో చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగంగా చంద్రయాన్ 2 వినుతికెక్కిన క్రమంలో సెప్టెంబర్ 7న మూన్ మిషన్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక మంగళవారం ఉదయం చంద్రయాన్ 2 చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించడంఈ ప్రయోగ ప్రక్రియలో అత్యంత కీలక దశగా ఇస్రో చీఫ్ కే. శివన్ అభివర్ణించారు. దాదాపు 30 రోజుల ప్రయాణం అనంతరం చంద్రుడి చెంతకు చేరనున్న భారత రెండో స్పేస్‌క్రాఫ్ట్ మంగళవారం ఉదయం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇక సెప్టెంబరు 7న తెల్లవారుజామున అత్యంత చారిత్రాత్మక ఘట్టం ప్రారంభమవుతుందని, 1.40గంటలకు ల్యాండర్లో ప్రొపల్షన్ ప్రారంభమై 1.55గంటలకు ల్యాండ్ అవుతుందని చెప్పారు. 3.10గంటలకు సోలార్ ప్యానెళ్లు తెరచుకుని మరోగంటలో అంటే 4 గంటల ప్రాంతంలో రోవర్ జాబిల్లి ఉపరితలానికి చేరకుని ఆపరేషన్ని ప్రారంభిస్తుందని తెలిపారు. ఆపై జాబిల్లి గుట్టమట్లను ఆవిష్కరించడంతో పాటు అక్కడి వాతావరణంపై పరిశోధన చేపడుతుందని వివరించారు. -
అంతరిక్ష యవనికపై జాబిల్లికి జైత్రయాత్ర!
శ్రీహరికోట (సూళ్లూరుపేట) : భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43గంటలకు 3,850 కిలోల జీఎస్ ఎల్వీ– మార్క్–3 ఎం1 వాహక నౌకను ప్రయోగించడానికి సర్వం సిద్ధం చేశారు. పదేళ్లపాటు ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి రూపొందించిన ఈ చంద్ర యాన్–2 మిషన్‌కు ఆదివారం సా.6.43గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఏ రాజ రాజన్ ఆధ్వర్యంలో ఆదివారం లాంచ్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ల్యాబ్ మీటింగ్‌లో సా.6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించాలని నిర్ణయించారు. 20 గంటల కౌంట్‌డౌన్ సమయంలో భాగంగా ఆదివారం రాత్రికి మూడో దశలోని క్రయోజనిక్ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. అలాగే, సోమవారం వేకువజామున రాకెట్‌కు రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తిచేయడానికి పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ద్రవ ఇంధనం నింపిన అనంతరం రాకెట్‌కు పలు పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత ప్రయోగానికి మరికొన్ని గంటల ముందు రాకెట్లో హీలియం గ్యాస్ నింపడానికి, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యవస్థలను అప్రమత్తం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రయాన్–2 ప్రయోగం ఇస్రో చరిత్రలో అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోయే ప్రయోగంగా చెప్పవచ్చు. ఇంతపెద్ద రాకెట్‌ను, ఇంతపెద్ద ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ప్రయోగాన్ని ఇస్రో చరిత్రలో భారీ ప్రయోగంగా అభివర్ణిస్తున్నారు. నేటి మ.2.43 గంటలకు వినువీధిలోకి.. కాగా, 20 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం మ.2.43 గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గ్రహాంతర ప్రయోగాల్లో ఈ ప్రయోగం మూడోది. చంద్రునిపై పరిశోధనలు చేయడానికి చేస్తున్న రెండో ప్రయోగం. షార్ నుంచి 75వ ప్రయోగం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ముందుగా అనుకున్నట్లుగా ఈనెల 15వ తేదీన జరగాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. -
నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..
సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా 50 సంవత్సరాల క్రితం అంటే, 1969, జూలై 16వ తేదీన అమెరికా, ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రముఖ హ్యోమగామి మైఖేల్ కాలిన్స్ తన ఇద్దరు సహచరులైన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్‌తో కలిసి ‘అపోలో11’లో చంద్ర మండల యాత్ర సాగించారు. చంద్రుడిపై తొలి అడుగు పెట్టిన తొలి మానవుడిగా చరిత్రలోకి ఎక్కిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ నేడు లేరు. ఆయన 2012లో అనారోగ్య కారణాల వల్ల మరణించారు. ఆయన వెనకాలే చంద్రుడిపై అడుగుపెట్టిన బజ్ ఆల్డ్రిన్ ఇప్పటికీ జీవించే ఉన్నారు. వారితో చంద్రుడిపైకి దిగని కాలిన్స్ ‘అపోలో 11’ మిషన్‌లో ఉండిపోయారు. చంద్ర మండలానికి మహత్తరమైన మానవుడి యాత్రను విజయవంతంగా పూర్తి చేసి నిన్నటికి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాసా మంగళవారం కెన్నడ స్పేస్ సెంటర్లో స్వర్నోత్సవాలను నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మైఖేల్ కాలిన్స్‌ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో తనతో పాటు బజ్ ఆల్డ్రిన్, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌లు కూడా పాల్గొంటారని ఆశించానని, ఇప్పుడు ఆర్మ్‌స్ట్రాంగ్ తమ మధ్య లేకపోవడం దురదష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇక బజ్ ఆల్డ్రిన్ ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదో తెలీదని అన్నారు. ఆనాడు ‘అపోలో 11’ పేరిట చంద్రమండలానికి చేపట్టిన సాహస యాత్ర ఎనిమిది రోజుల్లో విజయవంతంగా ముగిసింది. ఒక వేళ ఆ యాత్ర విజయవంతంగా ముగియకపోతే, చంద్రుడిపై అడుగుపెట్టిన వారు తిరిగి రాకపోతే ? అదే జరిగితే అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తాను చదవాల్సిన ఉపన్యాసాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ‘ఇన్ మూవ్మెంట్ ఆఫ్ మూన్ డిజాస్టర్’ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఉపన్యాసాన్ని విలియం సఫైర్ జూలై 18, 1969న రాశారు. ‘చంద్ర మండలానికి వెళ్లిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అనే సాహసికులకు గడ్డు రోజులు దాపురించాయి. వారు తిరిగి కోలుకుంటారని నమ్మకం కూడా లేదు. వారి ప్రాణత్యాగాలకు ఓ అర్థం ఉందని వారికి తెలుసు. నిజం తెలుసుకోవడం, వాస్తవాలను గ్రహించడంలో భాగంగా ఓ సమున్నత లక్ష్యం కోసం వీరిద్దరు ప్రాణాలను వొదిలారు. వారి కోసం వారి కుటుంబాలు, స్నేహితులు, దేశ జాతి, యావత్ ప్రపంచం, మొత్తం భూగోళమే నివాళుర్పిస్తుంది...’ అన్న దోరణిలో ఆయన ఉపన్యాసం సాగుతుంది. మైఖేల్ రాకెట్లో కక్ష్య తిరుగుతుండడం వల్ల ఆయన ప్రాణాలకు వచ్చే ముప్పేమి లేదని, చంద్రుడి మీద అడుగు పెట్టిన ఇద్దరికే ప్రమాదం ఉంటుందని నాడు భావించారు. అదష్టవశాత్తు అలాంటి ప్రమాదం ఏదీ జరగక పోవడంతో నిక్సన్, వ్యోమగాములకు ఫోన్లో మాట్లాడారు. -
చంద్రయాన్- 2 వాయిదా
శ్రీహరికోట/సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత పదేళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కఠోర శ్రమ చేసి రూపొందించిన చంద్రయాన్-2 ప్రయోగం సాంకేతిక కారణాల కారణంగా ఆదివారం అర్థరాత్రి వాయిదా పడింది. సోమవారం తెల్లవారుజామున 2.51 నిమిషాలకు తలపెట్టిన జీఎస్ఎల్వీ-3 ఎం–1 రాకెట్లో మూడో దశలో సాంకేతిక లోపం కారణంగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆదివారం ఉదయం 6.51 నిమిషాలకు ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ఆధ్వర్యంలో కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ప్రయోగానికి 56.24 నిమిషాల ముందుగా అంటే1.55 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. రాకెట్లో అత్యంత కీలక దశగా ఉన్న మూడో దశలో క్రయోజనిక్ ఇంజిన్‌కు సంబంధింన బ్యాటరీలు చార్జ్ కాకపోవడంతో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా తెలు స్తోంది. దీంతో పాటు క్రయోజనిక్‌లో ఉండే గ్యాస్ బాటిల్ లీకేజీ రావడం కూడా సాంకేతిక లోపానికి మరో కారణంగా గుర్తించారు. దీంతో ప్రస్తుతానికి ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు. ఈ విధమైన సాంకేతిక లోపం గతంలో ఎన్నడూ జరిగిన దాఖలాలు లేవు. దీనిపై ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు ఈ లోపం జరిగిందో దానిపై ఆత్మ విమర్శ చేసుకుంటున్నారు. కాగా, చంద్రయాన్-2 ప్రయోగాన్ని సెప్టెంబర్ 9న నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ‘షార్’కు రాష్ట్రపతి : భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించడానికి ‘షార్’కు వచ్చారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆయన రేణిగుంట నుంచి షార్ కేంద్రానికి చేరుకున్నారు. షార్‌లోని హెలీప్యాడ్ వద్ద ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్, షార్ డైరెక్టర్ ఎ.రాజరాజన్, జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అక్కడ నుంచి నక్షత్ర అతిథిగృహానికి చేరుకున్నారు. అనంతరం 7 గంటలకు చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించిన రెండో ప్రయోగ వేదిక వద్దకు చేరుకుని జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్‌ను సందర్శించారు. ఆ తరువాత షార్‌లో సుమారు రూ.650 కోట్లతో నిర్మించిన రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 60 ఏళ్లుగా పరిశోధనలు.. చంద్రుడి గురించి తెలుసుకోవడానికి గడిచిన 60 ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలు ఇప్పటివరకు 125 ప్రయోగాలు చంద్రుడి పైనే చేశాయని ఐక్యరాజ్య సమితి వెల్లడిస్తోంది. ఆ వివరాలు.. 1958 నుంచి అమెరికా చంద్రుడిపై పరిశోధనలను ప్రారంభించింది. 12 ప్రయోగాలు చేసిన తరువాత 13వ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి చేరుకుంది. అలా ఇప్పటిదాకా 58 ప్రయోగాలు చేసి 41 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. 1969లో అపోలో రాకెట్ ద్వారా నీల్ ఆమ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్ర్న్, మైఖేల్ పోలీన్స్ అనే ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించిన ఘనత అమెరికా పేరు మీదే వుంది. ఇక రష్యా కూడా 1958 నుంచి 53 ప్రయోగాలు చంద్రునిపైకి చేసింది. అందులో 35 మాత్రమే విజయవంతమయ్యాయి. జపాన్ అయితే 1990 నుంచి ఆరు ప్రయోగాలు సొంతంగా, ఒక్క ప్రయోగం నాసాతో కలిసి చేసింది. ఇందులో ఐదు విజయవంతమయ్యాయి. 2010 నుంచి చైనా కూడా ఏడు ప్రయోగాలు చేయగా ఒక్క ప్రయోగం ద్వారా మాత్రమే చంద్రుని దాకా వెళ్లగలిగింది. ఇజ్రాయిల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రునిపైకి ల్యాం డర్‌ను పంపించినా అది విజయవంతం కాలేదు. జర్మనీ 2003లో చంద్రుని మీదకు ఆర్బిటర్‌ను విజయవంతంగా పంపించింది. భారత్ విషయానికొస్తే 2008లో చంద్రుడి మీదకు ఆర్బిటర్‌ను ప్రయోగించి విజయం సాధించడమే కాకుండా చంద్రుడిపై నీటి జాడలున్నాయని కనుగొంది. ఈ దేశాలన్నీ చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగాలు చేసినపప్పటికీ ప్రధానంగా అమెరికా, రష్యాలే ఈ రంగంలో ఇప్పటికీ పోటీపడుతున్నాయి. తాజాగా.. భారత్ రెండోసారి ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై దింపి అందులో అమర్చిన రోవర్‌తో చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది. -
చంద్రయాన్–2లో మనోడు..
సిద్దిపేట జోన్/సిద్దిపేట రూరల్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగిస్తున్న చంద్రయాన్–2 ప్రాజెక్టులో సిద్దిపేట జిల్లా వాసి వీరబత్తిని సురేందర్ పాత్ర ఉండటం తెలంగాణకు గర్వకారణం. సురేందర్ గత 20 ఏళ్లుగా నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో స్పేస్ వెహికిల్స్ రాడార్ కమ్యూనికేషన్, టెలి కమాండ్ సిస్టం, ఎలక్ట్రికల్ సిస్టంతో పాటు పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సిద్దిపేటలోని చేనేత కుటుంబంలో జన్మించిన సురేందర్ కష్టాలను సహవాసంగా స్వీకరిస్తూ అంచెలంచెలుగా శాస్త్రవేత్తగా ఎదిగారు. తల్లి దండ్రులు వీరబత్తిని సత్తయ్య, రాజమణిలకు ఉన్న ముగ్గురు కుమారుల్లో రెండో వాడు సురేందర్. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి రాజమణి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుమారులను ప్రయోజకులుగా చేశారు. సురేందర్ విద్యార్థి దశ నుంచే గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆయన విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగింది. 10వ తరగతి అనంతరం నిజా మాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో చదివారు. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (రాంచీ)లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. శాస్త్రవేత్తగా ఎదగాలన్న ఆశయంతో కొత్తగూడెం ఏపీ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా, పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. 20 ఏళ్ళుగా... ఈసీఐఎస్లో పనిచేస్తున్న క్రమంలోనే సురేందర్‌కు శ్రీహరికోట స్పేస్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. 2000లో షార్‌లో చేరిన సురేందర్ అంతరిక్షంలో ఉపగ్రహాలను పంపే ప్రతి ప్రక్రియలో భాగస్వాముడిగా మారారు. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ లాంటి ప్రయోగాల్లో కూడా తనవంతు పాత్ర నిర్వర్తించారు. చాలా ఆనందంగా ఉంది.. ‘నా బిడ్డ సురేందర్ మొండివాడు.. ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని కచ్చితంగా చేస్తాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాం. కష్టపడి చదువుకునే మనస్తత్వం కలిగిన నా కొడుకు గురించి ఇప్పుడు పేపర్లో, టీవీల్లో వస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తల్లి దండ్రులుగా మాకు ఇంతకంటే ఏమి కావాలి. దేశం కోసం సేవ చేస్తున్న కుమారుడుని చూస్తే కడుపు నిండుతోంది’అంటూ సురేందర్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. -
‘పద్మావతి’ సన్నిధితో గవర్నర్ దంపతులు
సాక్షి, తిరుచానూరు: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ఎన్ నరసింహన్ దంపతులు శనివారం ఉదయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. టీటీడీ తిరుపతి జేఈవో బసంత్ కుమార్, డిప్యూటీ ఈవో ఝాన్సీ తదితరులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అలాగే ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా ఇస్తికాపాల్ స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు అమ్మవారి దర్శనం అనంతరం శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను బహూకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల: చంద్రయాన్-2 ప్రయోగం సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్-2 వాహక నౌక నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివన్ మాట్లాడుతూ.. చంద్రయాన్-2ను సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు ప్రయోగిస్తామన్నారు. రెండు నెలల అనంతరం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకుంటుందన్నారు. వర్షం వల్ల చంద్రయాన్-2 ప్రయోగానికి ఎలాంటి అంతరాయం కలగదని శివన్ తెలిపారు. -
చందమామ నవ్వింది చూడు
కలం పట్టిన ప్రతి కవీ చంద్రుని, వెన్నెలను వర్ణించకుండా లేడు. సాక్షాత్తు అన్నమయ్య చందమామ రావే జాబిల్లి రావే అంటూ సంకీర్తన రచించాడు. ఇందుకు భాషాభేదాలు లేవు. యావత్ప్రపంచం చంద్రుడిని వేనోళ్ల పొగిడింది. చంద్రయానాలూ చేస్తూ ఉంది. దేవదానవులు క్షీరసాగరాన్ని మధిస్తున్నారు. గిరగిర తిరుగుతోంది మందరగిరి. సముద్రంలో నుంచి ఒక్కోటి పుట్టుకొస్తున్నాయి. కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, ఉచ్చైశ్రవం, ధన్వంతరి, లక్ష్మీదేవి, హాలాహలం... అందులో నుంచి చంద్రుడు కూడా తెల్లగా చల్లగా ఉద్భవించాడు. సముద్రుడు చంద్రుడి తండ్రి అయ్యాడు, లక్ష్మీదేవి ‘చందురు ని తోబుట్టువు’ అయ్యింది. చంద్రుడి రాకతో భూమి మీద రేయింబవళ్లు ఏర్పడ్డాయి. సూర్యుడు పగలంతా మండించిన భూమిని రాత్రికల్లా చంద్రుడు తన అమృత కిరణాలతో చల్లబరుస్తున్నాడు. క్షీరసాగరం నుంచి పుట్టిన హాలాహలాన్ని ఏం చేయాలా అని అందరూ నిబిడాశ్చర్యంతో చూస్తుంటే పరమశివుడు వచ్చి అమాంతం మింగేసి తన కంఠంలో ఇమిడ్చి శ్రీకంఠుడయ్యాడు. మరి ఆ వేడిని చల్లార్చాలి కదా. అందుకు తగిన వాడు చంద్రుడే అనుకోవడంతో, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చంద్రుడు నెలవంక రూపంలో చంద్రుడు శిరస్సున చేరడంతో, జటాజూటుడు కాస్తా చంద్రశేఖరుడయ్యాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు చంద్రుడిని తన ఎడమకంటిగా చేసుకున్నాడు. సూర్యుడు కుడి కన్ను. సముద్రుడి కుమారుడు, లక్ష్మీదేవి సోదరుడు కావడంతో చంద్రుడిని కాస్త ప్రత్యేకంగా చూడటం ప్రారంభించారు ముల్లోకవాసులు. ఆయనను రాజు అన్నారు. దాంతో శివుడు చంద్రశేఖరుడే కాదు రాజశేఖరుడు కూడా అయ్యాడు. చంద్రుడు పదహారు కళలు సంతరించుకున్నాడు. తను పూర్ణరూపుడిగా కనపడే నిండు చందమామగా ఉన్న రోజున సముద్రుడు తన కుమారుడిని మురిపెంగా ముద్దాడాలని అలల రూపంలో ఎగసి ఎగసి పడుతుంటాడు. భూలోకవాసులంతా సముద్రస్నానాలు చేసి, చంద్రుడి అమృత కిరణాలలో తడిసి ముద్దవుతుంటారు. ఎంత చిత్రమో కదా... ఏ సముద్రం గర్భం చీల్చుకుని జన్మించాడో, ఆ సాగరం మీదకే తన కిరణాలు ప్రసరింపచేయడం. చంద్రునికి రెండు రెక్కలు కూడా తగిలించారు. కృష్ణ పక్షం, శుక్ల పక్షం. ఈ రెండు రెక్కలతో నెల్లాళ్లు ఎగురుతూ ఉంటాడు. కాని ఈ నెలలో ఒక రోజు కనపడు. అలా దోబూచులాడుతూ దాగున్న రోజును అమావాస్య చంద్రుడు అన్నారు. కవులు మరింత అందమైన పేరు పెట్టి, సినీవాలి అన్నారు. ఉషశ్రీ రచించిన అమృతకలశంలో సినీవాలి కనపడతాడు, అలాగే ఆరుద్ర రచించిన కవితల సంపుటికి అందంగా సినీవాలి పేరు పెట్టుకున్నాడు. ఇవన్నీ లౌకికం. ఒక్కసారి త్రేతాయుగానికి చంద్రయానం చేద్దాం. ఒకనాడు శ్రీరాముడు ఆడుకుంటూ, చందమామ కావాలని తండ్రి దశరథుడిని అడిగాడు. ఎంతైనా తండ్రి, దానికి తోడు రాముడంటే ప్రాణం. పైనున్న చంద్రుడిని నేను తేలేను అనలేడు కదా. అందుకే బాగా యోచించి, అద్దం తీసుకువచ్చాడు. అందులో చంద్రుడిని చూపాడు. రాముడు సంబర పడ్డాడు. ఆ రోజు నుంచి రాముడు శ్రీరాముడు కాదు శ్రీరామచంద్రుడు అయ్యాడు. ఇక్కడే మరో విషయం జ్ఞప్తికి తెచ్చుకోవాలి.వినాయకచవితి కథ అందరికీ తెలిసిందే. రాజ దృష్టి సోకితే రాళ్లు సైతం పగులుతాయి అంటారు అని చంద్రుడని ఉద్దేశించి శ్రీకృష్ణుడు పలుకుతాడు. వినాయక చవితి నాడు పాలలో చంద్రుడి నీడను చూడటంతో అపవాదుకు లోనవుతాడు శ్రీకృష్ణుడు. ఆ రోజు చంద్రుడిని చూడవద్దని చెప్పారు పెద్దలు. వినాయక చవితి కథ చదివి అక్షంతలు నెత్తిన వేసుకుంటే, చంద్రుడిని చూసిన దోషం పోతుందని ఉపశమనం కూడా చెప్పారు. కృతయుగంలో పుట్టిన శ్రీకృష్ణుడు త్రేతాయుగంలో రాముడిని శ్రీరామచంద్రుడిని చేశాడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి అపవాదు కలిగించి, జాంబవతిని, సత్యభామను వివాహమాడేలా చే శాడు. కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడి వాహనాలలో ఒకడిగా చేరాడు. చంద్రప్రభ వాహనం మీద కూడా ఆ కలియుగదైవం ఊరేగుతాడు. విద్యలలోనూ చంద్రుడిది అగ్రస్థానమే. తెలుగు భాషలో ఉండే ఉపమాలంకారంలో చంద్రుడినే చెబుతారు. ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది అని. నిజంగానే ఆడపిల్లల ముఖమంత అందంగా ఉంటాడా చంద్రుడు లేక చంద్రబింబమంత అందంగా ఉంటుందా ఆడ పిల్లలు వదనం. ఇదే నిజమైతే చంద్రుడిలో మచ్చ ఉంటుంది అంటారు కదా. అప్పుడు ఈ ఉపమానం సరికాదు కదా. అందుకే... అది మచ్చకాదని, కుందేలని సాహిత్యకారులు చంద్రుడిని శశాంకుడిగా ప్రఖ్యాతుడిని చేశారు. ఆడవారు మరో అడుగు ముందుకు వేసి బంగారాన్ని చంద్రహారంగా చేయించుకుని, స్టేటస్ సింబల్‌గా వేసుకుంటున్నారు. మళ్లీ అందులో కూడా ఒక వరుస నుంచి పది వరసల దాకా చంద్రహారం ధరించి, హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజులు ఒక అడుగు ముందుకు వేసి చంద్రశాలలు నిర్మించుకున్నారు. వాటినే ఇప్పుడు బార్బిక్యూ అంటున్నారు. రాజభవనం పై భాగాన విశాల ప్రదేశంలో చంద్రశాలలో నిర్మిస్తున్నారు. అంటే చంద్రకిరణాలు ఆహారం మీద పడి, ఆ ఆహారం అమృతంగా మారి, మనిషికి శక్తినిస్తుందేమో. అందుకే ఆ ఏర్పాట్లు అయి ఉంటాయి. అంతేనా, చక్కగా ఏకాంతంగా కూర్చుని, ఎవ్వరూ తమ ఏకాంతానికి భంగం కలిగించకుండా, ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం ఊహించుకుంటేనే నోరూరుతుంది కదూ. చంద్రుడిని షోడశకళానిధి అంటారు. ఆ పదహారు కళల చంద్రుడికి కూడా పదహారు ఉపచారాలు చేస్తారు. ఏం అదృష్టమో ఆయనది.మానవులకు కూడా చంద్రునితో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేశారు. ఎనిమిది పదుల కాలం జీవించినవారు ‘సహస్ర చంద్ర దర్శనం’ ఉత్సవాన్ని జరుపుకుంటారు. వేయిపున్నములు చూడటమంటే మాటలా. తల పండిపోయిన, నడుము వంగిపోయి కూడా ఆ చంద్రుడిని ఆరాధించడానికి ఉబలాటపడుతున్నారంటే, నిజంగా చంద్రుడు చాలా గొప్పవాడు. కలం పట్టిన ప్రతి కవీ చంద్రుyì ని, వెన్నెలను వర్ణించకుండా లేడు. సాక్షాత్తు అన్నమయ్య చందమామ రావే జాబిల్లి రావే అంటూ సంకీర్తన రచించాడు. ఇందుకు భాషాభేదాలు లేవు. యావత్ప్రపంచం చంద్రుడిని వేనోళ్ల పొగిడింది. ‘చందన్ సా బదన్, చందురుని మించి అందమొలికించు, నిండు చంద మామా నిగనిగల భామా, చందమామ నవ్వింది చూడు, చల్ల గాలి రమ్మంది చూడు, ఎక్కడమ్మా చందురూడు, మామా చందమామా వినరావా నా కథా... అబ్బో లెక్కలేనన్ని గీతాలు చంద్రుడిని అనంతకోటిరాగాలలో స్తుతించాయి. చిత్రమేమిటంటే చంద్రుడు చందమామగా మారి అందరికీ మేనమామ అయ్యాడు. అంతేనా... రూపంలో ఎవరైనా బాగుంటే వారిని చంద్రుడితోనే పోలుస్తుంటారు రూపులో చంద్రుడు అంటూ...రాఖీ పౌర్ణమి, గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, ఏరువాక పౌర్ణిమ, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, ఇలా ప్రతి నెలలోని పౌర్ణమికి ఒక్కో ప్రాధాన్యత సంపాదించుకున్నాడు. తన వెన్నెల్లో భోజనాలు చేస్తుంటే ఎంత పొంగిపోతాడో చందమామయ్య. ఇంతటి ప్రశస్తుడైన చంద్రుడికి కొద్దిసేపు కేతుయానం తప్పలేదు. ఏదో ఒక పున్నమి నాడు కేతువు చంద్రుడిని ఆం ఫట్! హాం ఫట్!! అంటూ మింగేస్తాడు!!! (చంద్రయాన్ సందర్భంగా సృజనాత్మక రచన) – వైజయంతి పురాణపండ -
వెన్నెల రాజు చెంతకు..!
సాక్షి, శ్రీహరికోట(సూళ్లూరుపేట): చందమామ ఉపరితలంలో కలియదిరుగుతూ పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్–2 ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ అనుసంధానం కార్యక్రమాలు ముగిశాయి. ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశానికి ఈ ప్రయోగం తలమానికం కావడంతో ప్రపంచమంతా ఇస్రో వైపు చూస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ(ఇస్రో) ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను నింగిలోకి పంపనుంది. ఇందుకు సంబంధించి సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్ షార్ కేంద్రంలో రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ షార్‌లోని రెండో ప్రయోగవేదికపై ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక బిల్డింగ్(వ్యాబ్) జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ అనుసంధానం పూర్తయింది. అక్కడి నుంచి రాకెట్‌ను ఉంబ్లికల్ టవర్‌కు అనుసంధానం చేసిన తరువాత పలు పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షలు చేయడంలో భాగంగా మంగళవారం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్(ఎఫ్డీఆర్–1) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన పనులను పూర్తిచేయడంలో ఇస్రొ శాస్త్రవేత్తలు బిజీబిజీగా ఉన్నారు. ఈ నెల 13వ తేదీ మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించిన అనంతరం ప్రయోగతేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. చంద్రుని మీద ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే పరిశోధనలు చేశాయి. 2008లో భారత్ చంద్రయాన్–1 ద్వారా మొదటి ప్రయత్నంలో చంద్రుడి చుట్టూ ఉపగ్రహాన్ని పంపి పలు పరిశోధనలు చేసిన విషయం తెలిసిందే. చంద్రయాన్–2 మిషన్‌లో భాగంగా ఈ సారి చంద్రుడిపైకి ల్యాండర్‌ను దింపి అందులో ఉన్న రోవర్ ద్వారా చంద్రుడిపై పరిశోధనలు చేస్తారు. చంద్రుడి మీద పరిశోధనలు చేసే నాలుగో దేశంగా భారత్ ఆవిర్భవించనుంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఈ నెల 13న రాత్రి షార్కు చేరుకోనున్నారు. -
చంద్రయాన్–2 ప్రత్యక్షంగా చూసేద్దాం!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఆకాశాన్ని తాకే ఎత్తులో నిల్చున్న తెల్లటి రాకెట్ లాంచర్.. దానిలోనుంచి నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్.. ఈ దృశ్యాలను మనం చాలాసార్లు టీవీల్లోనే చూస్తుంటాము. అయితే ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని ఇస్రో కల్పిస్తోంది. సాదాసీదా ప్రయోగం కాకుండా ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించే సువర్ణ అవకాశాన్ని ఇస్రో మనముందుంచింది. ఈ నెల 15 తెల్లవారుజామున 2:51 గంటలకు నిర్వహించనున్న చంద్రయాన్–2ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 10 వేల మంది ప్రజలకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. ఇందుకు నేటినుంచే (గురువారం) ఇస్రో వెబ్సైట్ ( ఠీఠీఠీ. జీటటౌ.జౌఠి.జీn) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్లోనే అనుమతి ఇస్తారు. -
షార్ డైరెక్టర్‌గా రాజరాజన్ బాధ్యతల స్వీకరణ
సూళ్లూరుపేట: షార్ నూతన డైరెక్టర్‌గా ఆర్ముగం రాజరాజన్ ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న ఎస్.పాండ్యన్ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనుండడంతో బాధ్యతలను ఆయనకు అప్పగించారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజరాజన్‌ను షార్ డైరెక్టర్‌గా నాలుగు రోజుల క్రితమే బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన నాలుగు రోజులుగా షార్‌లోనే ఉంటూ పాండ్యన్‌తో కలిసి అన్ని విభాగాలను సందర్శించి అవగాహన చేసుకున్నారు. ఈ నెల 15న చంద్రయాన్–2 ప్రయోగం నిర్వహించనున్న దృష్ట్యా ఆయన ముందుగానే విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సోమవారం నుంచి ఆయన ఆధ్వర్యంలోనే చంద్రయాన్–2 పనులు జరుగుతాయి. ఉద్యోగ విరమణ చేసిన షార్ మాజీ డైరెక్టర్ ఎస్ పాండ్యన్ చంద్రయాన్–2 ప్రయోగం అయ్యేదాకా ఇక్కడే ఉంటారని షార్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇదే..
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. భారత్ సొంతంగా ఓ స్పేస్ స్టేషన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందని ఇస్రో చీఫ్ కే శివన్ గురువారం వెల్లడించారు. గగన్‌యాన్ మిషన్‌కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్టును చేపడతామని చెప్పారు. మానవ సహిత గగన్‌యాన్ కార్యక్రమాన్ని పూర్తిచేసిన అనంతరం ఇదే ఊపును కొనసాగించేందుకు మనకు సొంత స్పేస్ స్టేషన్ ఉండాలని భావిస్తున్నామని చెప్పారు. కాగా జులైలో జరిగే చంద్రయాన్ 2, 2022లో జరిగే గగన్‌యాన్‌పై తాము దృష్టి కేంద్రీకరించామని, ఈ మిషన్ పూర్తయిన తర్వాత స్పేస్ స్టేషన్‌పై ఫోకస్ చేస్తామని అన్నారు. స్పేస్ స్టేషన్‌ను పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసేందుకు ఐదు నుంచి ఏడేళ్ల సమయం పడుతుందని, ఖర్చు విషయం ఇప్పుడే చెప్పలేమని చెప్పారు.