ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇదే.. | Isro Planning To Launch Spl Space Station | Sakshi
Sakshi News home page

భారత్‌కూ స్పేస్‌ స్టేషన్‌

Published Thu, Jun 13 2019 6:00 PM | Last Updated on Thu, Jun 13 2019 6:00 PM

Isro Planning To Launch Spl Space Station - Sakshi

న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. భారత్‌ సొంతంగా ఓ స్పేస్‌ స్టేషన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందని ఇస్రో చీఫ్‌ కే శివన్‌ గురువారం వెల్లడించారు. గగన్‌యాన్‌ మిషన్‌కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్టును చేపడతామని చెప్పారు. మానవ సహిత గగన్‌యాన్‌ కార్యక్రమాన్ని పూర్తిచేసిన అనంతరం ఇదే ఊపును కొనసాగించేందుకు మనకు సొంత స్పేస్‌ స్టేషన్‌ ఉండాలని భావిస్తున్నామని చెప్పారు.

కాగా జులైలో జరిగే చంద్రయాన్‌ 2, 2022లో జరిగే గగన్‌యాన్‌పై తాము దృష్టి కేంద్రీకరించామని, ఈ మిషన్‌ పూర్తయిన తర్వాత స్పేస్‌ స్టేషన్‌పై ఫోకస్‌ చేస్తామని అన్నారు. స్పేస్‌ స్టేషన్‌ను పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసేందుకు ఐదు నుంచి ఏడేళ్ల సమయం పడుతుందని, ఖర్చు విషయం ఇప్పుడే చెప్పలేమని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement