ఇస్రో పంపించిన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని మీద దిగిన తరువాత ప్రపంచమే భారతదేశం వైపు చూస్తోంది. నిజానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయాణం ఈ రోజు మొదలైంది కాదు. 60 సంవత్సరాల క్రితం ప్రారంభమై ఈ రోజు యావత్ ప్రపంచాన్ని ఆకర్శిస్తోందంటే దాని వెనుక ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
1957లో సోవియన్ యూనియన్ అంతరిక్షమాలోకి మొదటి ఉపగ్రహం స్పుత్నిక్ ప్రయోగించిన తరువాత ప్రపంచం ద్రుష్టి అంతరిక్ష పరిశోధనవైపు మరలింది. 1960లో భారతదేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటున్న సమయంలో అంతరిక్ష పరిశోధన కోసం అడుగులు వేసింది. హోమీ బాబా అణు ఇంధన శాఖకు అధిపతిగా ఉన్న రోజుల్లో 1962 నాటికి అంతరిక్ష పరిశోధన కమిటీ ఒక ప్రత్యేక విభాగంగా అవతరించింది. దానికి విక్రమ్ సారాభాయ్ చీప్ అయ్యారు.
అప్పట్లో ఆధునిక రాకెట్ టెక్నలాజి తెలిసిన దేశాలు ఆ విషయాలను చాలా రహస్యంగా ఉంచాయి. ఆ సమయంలో మనదేశంలో పరిశోధన కేంద్రానికి దక్షిణ భారతదేశం అనువైన ప్రదేశంగా నిలిచింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న యువ శాస్త్రవేత్తలు అరవముతన్, రామకృష్ణారావు, అబ్దుల్ కలాం వంటి వారు శిక్షణ కోసం నాసా వెళ్లారు.
మొదటి అడుగు..
1963లో నాసా భారతదేశానికి 'నైక్-అపాచీ' రాకెట్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ తరువాత ఇండియా మొదటి రాకెట్ ప్రయోగాన్ని 1963లో ప్రయోగించింది. ఇదే మనదేశం ఈ రంగంలో వేసిన మొదటి అడుగు అనే చెప్పాలి. 1965లో తుంబాలో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందింది. 1975 ఏప్రిల్ 19 భారతదేశానికి చెందిన మొదటి అంతరిక్ష నౌక 'ఆర్యభట్ట' ప్రయోగించారు.
1981 నాటికి టెలీ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన 'ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్‌పరిమెంట్'ను ప్రయోగించింది. విద్యుదయస్కాంత పరిశుభ్రత కోసం దీనిని పరీక్షించడానికి, ISRO ఎద్దుల బండిపై అమర్చిన తాత్కాలిక పరీక్షా సదుపాయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
భారతీయ పౌరుడి అంతరిక్ష యాత్ర..
భారత వ్యోమగామి 'రాకేష్ శర్మ' భారతదేశానికి చెందిన అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. 1984 ఏప్రిల్ 3న సోవియట్ యూనియన్ (ప్రస్తుతపు రష్యా) కు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి వెళ్ళాడు. అప్పటి వరకు అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములలో రాకేష్ శర్మ 138వ వాడు కావడం గమనార్హం.
PSLV అరంగేట్రం..
క్రమంగా అధునాతన రాకెట్లు అవసరమని తలచి భారత్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV అభివృద్ధి ప్రయత్నాలను ప్రారంభించింది. 1993లో మొదటి పీఎస్‌ఎల్‌వీ విఫలమైంది, కానీ 1994లో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ విజయవంతమైంది. ఆ తరువాత ప్రయోగించిన 95 శాతం పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు విజయవంతమయ్యాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పువాల్సినవి 2008లో చంద్రునిపై ప్రయోగించిన చంద్రయాన్-1, 2013లో మార్స్ ఆర్బిటర్ స్పేస్‌క్రాఫ్ట్, 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించడం.
అంగారకుడిపై భారత్..
2007లో అప్పటి ఇస్రో చీప్ మాధవన్ నాయర్ అంగారకునిమీదకు ప్రోబ్ పంపాలని ప్రతిపాదించారు. దీనిని 2012లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించారు. మొత్తానికి తొలి ప్రయత్నంతోనే అంగారకుడిపై ప్రయోగాల్లో విజయవంతమైన దేశంగా భారత్ అవతరించింది.
ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?
చంద్రయాన్..
చంద్రయాన్-1 & 2 రెండు విఫలమయ్యాయి. అయితే ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 గొప్ప విజయం సాధించి భారతీయ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పింది. కాగా ఇటీవల ఆదిత్య-ఎల్1 కూడా ప్రయోగించారు. సుమారు ఆరు దశాబ్దాలు దిన దిన ప్రవర్ధమానం చెందుతూ గొప్ప విజయనాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన ఖాతాలో వేసుకుంది. ఇది భారతీయులందరికి గర్వకారణం అనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment