Evolution
-
ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం
ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న సమయంలో 'గూగుల్' (Google) గురించి తెలియని వారు దాదాపు ఉండరనేది అక్షర సత్యం. ఆవకాయ వండాలన్న.. అమలాపురం గురించి తెలుసుకోవాలన్నా.. అన్నింటికీ ఒకటే సులభమైన మార్గం గూగుల్. ఈ రోజు నభూతో నభవిష్యతిగా ఎదిగిన 'గూగుల్' రెండు దశాబ్దాల క్రితం ఓ సాదాసీదా సెర్చ్ ఇంజన్ మాత్రమే. ఇప్పుడు ఏ ప్రశ్నకైనా సమాధానం అందించే జగద్గురుగా మారింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గూగుల్ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..చరిత్ర గురించి చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని చదువుకున్నాం. ఇప్పుడు మాత్రం గూగుల్ పూర్వం యుగం, గూగుల్ తర్వాత యుగం అని చదువుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. దీన్ని బట్టి చూస్తే.. గూగుల్ ఎంతలా వ్యాపించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.గూగుల్ ప్రారంభం..90వ దశకం చివరిలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటిలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో ప్రావిణ్యం కలిగిన ఇద్దరు PhD స్టూడెంట్స్ ''సెర్గీ బ్రిన్, లారీ పేజ్''లు గూగుల్ ప్రారంభించాలని నిర్విరామంగా శ్రమించి మెరుగైన సర్చ్ ఇంజిన్ కోసం ఒక నమూనాను అభివృద్ధి చేశారు. 1997 సెప్టెంబర్ 15న ‘గూగుల్ డాట్ కామ్’ డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఆ తరువాత 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేసుకుని.. తోటి పీహెచ్డీ స్టూడెంట్ 'క్రెయిగ్ సిల్వర్‌స్టీన్'ను తొలి ఉద్యోగిగా చేర్చుకుని సంస్థను అధికారికంగా ప్రారంభించారు.గూగుల్ అనే పదం ఎలా వచ్చిందంటే..'గూగుల్' అనే పేరు 'గూగోల్' అనే పదం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గూగోల్ అనే పదానికి అర్థం ఒకటి తర్వాత వంద సున్నాలు లేదా సరైన శోధన ఫలితాలను అందించేది. ఈ పదాన్ని జేమ్స్ న్యూమాన్ అండ్ ఎడ్వర్డ్ కాస్నర్ రాసిన 'మ్యాథమెటిక్స్ అండ్ ది ఇమాజినేషన్' అనే పుస్తకం నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది.గూగుల్ ప్రస్థానం ఇలా..1998లో అధికారికంగా ప్రారంభమైన గూగుల్ అంచెలంచేలా ఎదుగుతూ కేవలం సెర్చ్ ఇంజన్‌గా మాత్రమే కాకుండా.. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, గూగుల్ స్టోర్స్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ మొదలైనవి ప్రారంభించి ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేసింది.1997 - గూగుల్.కామ్ డొమైన్ రిజిస్ట్రేషన్1998 - గూగుల్ అధికారికంగా ప్రారంభమైంది1999 - గూగుల్ పేజీ ర్యాంక్ డెవెలప్2000 - యాహూ భాగస్వామ్యంతో.. పెద్ద యూజర్ 'ఆర్గానిక్ సెర్చ్'గా అవతరించింది. గూగుల్ టూల్ బార్ లాంచ్. కొత్తగా 10 భాషలను జోడించింది (ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్వీడిష్, ఫిన్నిష్, స్పానిష్, పోర్చుగీస్, డచ్, నార్వేజియన్, జపనీస్, చైనీస్, కొరియన్, డానిష్).2001 - గూగుల్ తన మొదటి ఛైర్మన్ 'ఎరిక్ ష్మిత్'ను స్వాగతించింది. గూగుల్ ఫొటోస్ ప్రారంభమైంది.2002 - Google AdWords పరిచయం, గూగుల్ న్యూస్ మొదలైంది. గూగుల్ చరిత్రలో ఇది పెద్ద మైలురాయి.2003 - గూగుల్ AdSense ప్రారంభమైంది, దీనికి మొదట కంటెంట్ టార్గెటింగ్ అడ్వర్టైజింగ్ అని పేరు పెట్టారు.2004 - జీమెయిల్ ప్రారంభం2005 - గూగుల్ మ్యాప్స్2006 - Google YouTubeని కొనుగోలు చేస్తుంది2007 - ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కంపెనీ అయిన డబుల్ క్లిక్‌ను గూగుల్ కొనుగోలు చేసింది2008 - గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రారంభించింది2009 - ఫోర్బ్స్ మ్యాగజైన్ సెర్గీ బ్రిన్, లారీ పేజ్‌లను ప్రపంచంలోని ఐదవ అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పేర్కొంది2010 - గూగుల్ తన మొట్టమొదటి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ నెక్సస్ వన్ను విడుదల చేసింది.2011 - సీఈఓగా లారీ పేజ్ నియామకం, ఎరిక్ ష్మిత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. 2012 - గూగుల్ మోటరోలా మొబిలిటీని కొనుగోలు చేసింది2013 - గూగుల్ రీడర్ మూసివేసి.. Chromecast ప్రారంభం2014 - హమ్మింగ్ బర్డ్ ఆల్గారిథం2015 - సీఈఓగా సుందర్ పిచాయ్2016 - గూగుల్ తయారు చేసిన మొదటి ఫోన్.. గూగుల్ పిక్సెల్ లాంచ్2017 - HTCలో కొంత భాగాన్ని కొనుగోలు చేసింది2018 - మొబైల్ స్పీడ్ అల్గారిథం అప్డేట్, 20 సంవత్సరాల చరిత్రలో 100 బిలియన్ డాలర్లను అధిగమించింది2019 - బ్రాడ్ కోర్ అల్గారిథం, గూగుల్ SERPs స్టార్ట్2020 - నియామకాలను నెమ్మదించడం, మెషీన్లు మరియు డేటాపై ఎక్కువ దృష్టి పెట్టడం (కోవిడ్-19)2021 - ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ కంటెంట్‌ను ఉపయోగించుకునే హక్కు కోసం మీడియా కంపెనీలకు Google చెల్లించాల్సిన చట్టాన్ని ప్రతిపాదించింది.2022 - క్రోమ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ 2023 - గూగుల్ పిక్సెల్ 8, 8ప్రో లాంచ్, గూగుల్ జెమిని ఏఐ2024 - 2024 మార్చిలో గూగుల్ కోర్ అప్డేట్లో దాని ప్రధాన ర్యాంకింగ్ సిస్టమ్‌లకు అల్గారిథమిక్ మెరుగుదలలను చేసింది. ఈ అప్డేట్ స్పామ్, లో-వాల్యూ కంటెంట్ వంటి వాటిని పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగం.1998లో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన గూగుల్.. నేడు 50 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1.50 లక్షల కంటే ఎక్కువ మంది గూగుల్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.గూగుల్ ఉపయోగాలుప్రతి ప్రశ్నకు మల్టిపుల్ సమాధానాలు అందిస్తున్న గూగుల్.. ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. ప్రత్యేకంగా విద్యారంగంలో గూగుల్ పాత్ర అనన్య సామాన్యమనే చెప్పాలి.🡆బ్లాగర్, యూట్యూబ్, గూగుల్ అందిస్తున్న సేవలు.. సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ దెబ్బకు ఇంటర్నెట్ ఒక అనధికారిక ఓపెన్ యూనివర్సిటీలా మారిపోయింది.🡆వినోదం కోసం యూట్యూబ్ వినియోగించుకునే వారి సంగతి పక్కన పెడితే.. 10వ తరగతి చదివే ఒక విద్యార్ధి నుంచి.. IAS చదివే వ్యక్తి వరకు యూట్యూబ్ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.🡆భౌతిక, రసాయనిక శాస్త్రాలు మాత్రమే కాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం మీద పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు మాత్రమే కాకుండా.. పాఠాలు నేర్పే గురువులకు సైతం గురువుగా మారిన గూగుల్ ఉపయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఇదీ చదవండి: నిమిషానికి రూ.2 కోట్లు!.. గూగుల్ ఎలా సంపాదిస్తుందో తెలుసా?గూగుల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదిగూగుల్ లేకపోతే ప్రపంచంలో జరిగే విషయాలు అందరికీ చేరటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ప్రజల సమూహాలు చేరినప్పుడు మాత్రమే ఇతర విషయాలను చర్చించుకోవాల్సి వచ్చేది. గూగుల్ లేకుండా స్మార్ట్‌ఫోన్ వినియోగం కూడా ఉండేది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ గూగుల్ ఉపయోగించాల్సిందే.గూగుల్ లేకపోతే చదువుకునే వారికి కూడా అన్ని అంశాలు అందుబాటులో ఉండేవి కాదు. ఎందుకంటే గూగుల్ ప్రమేయం లేకుండా ఏదైనా తెలుసుకోవాలంటే తప్పకుండా ఉద్గ్రంధాలను (పుస్తకాలు) తిరగేయాల్సిందే. అంటే మనకు కావలసిన విషయం తెలుసుకోవడానికి రోజుల సమయం పట్టేది. మొత్తం మీద గూగుల్ లేని ప్రపంచంలో జీవించడం ఇప్పుడు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. -
తిరుపతికి లడ్డూ ఎలా వచ్చింది?
తిరుపతి లడ్డూపై వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అసలు లడ్డూ ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో కలుగుతోంది. అసలు తిరుమల శ్రీ వేంకటేశుని ప్రసాదంగా లడ్డూ ఎప్పటి నుంచి ఉంది..అసలు లడ్డూయే ప్రసాదంగా ఎందుకు ఉంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు అనిరుధ్ కనిశెట్టి అనే చరిత్రకారుడు ‘ది ప్రింట్’లో రాసిన సమగ్ర కథనంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తొమ్మిదో శతాబ్దం నుంచి ఇప్పటివరకు తిరుపతి చరిత్రను వివరిస్తూ కాలగమనంతో పాటు శ్రీ వేంకటేశుని ప్రసాదం ఎలా మారుతూ వచ్చిందన్నది అనిరుధ్ తన కథనంలో రాసుకొచ్చారు.వేల ఏళ్ల క్రితం తిరుపతి ప్రసాదం ఏంటి..?నిజానికి తిరుమల-తిరుపతి అనగానే లడ్డూ టక్కున గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే తిరుపతి వెళ్లినపుడు ఏడుకొండలవాడిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమైన ఘట్టమో లడ్డూ ప్రసాదం తినడమూ భక్తులకు అంతే ముఖ్యం. ఏడుకొండలకు వెళ్లి లడ్డూ ప్రసాదం ఆరగించడమే కాదు..క్యూలో నిల్చొని కష్టపడి తీసుకున్న లడ్డూను ఇతరులకు పంచి పెట్టడం కూడా భక్తిలో భాగమైపోయాయి. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన లడ్డూ నిజానికి తొలి ఉంచి ఏడు కొండలవాడి ప్రసాదం కాదని అనిరుధ్ చెబుతున్నారు. తొమ్మిదో శతాబ్దం నుంచి 1900 సంవత్సరం వరకు శ్రీవారి ప్రసాదం అన్నం,నెయ్యితో తయారు చేసిన పొంగల్ అని తెలిపారు. లడ్డూ ప్రసాదంగా ఎలా మారింది..?తొమ్మిదో శతాబ్దంలో తిరుపతి పుణ్యక్షేత్రం బ్రాహ్మణుల ఆధీనంలో చిన్న పల్లెటూరుగా ఉండేది.ఆ తర్వాతి కాలంలో చోళులు, విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు, బ్రిటీషర్ల పాలనలో తిరుపతి క్షేత్రంలో చాలా మార్పులు జరిగాయి. శ్రీ వేంకటేశుడి మహిమతో తిరుపతి ప్రభ రోజురోజు పెరుగుతూ వచ్చింది.తొలుత అక్కడ పొంగల్‌గా ఉన్న ప్రసాదం ఉత్తర భారతీయుల కారణంగా లడ్డూగా మారిందని అనిరుధ్ తన కథనంలో రాశారు. ‘బాలాజీ’ అనే పిలుపు కూడా వారిదే..బ్రిటీషర్ల పాలనలో ఉత్తర భారతీయులు ఎక్కువగా తిరుపతి సందర్శనకు వచ్చేవారని, వీరు వెంకటేశుడిని బాలాజీగా పిలుచుకునే వారని తెలిపారు. వీరే పొంగల్‌గా ఉన్న తిరుపతి ప్రసాదాన్ని తీయనైన లడ్డూగా మార్చారని అనిరుథ్ రాసుకొచ్చారు.తొలుత బ్రాహ్మణుల ఆధీనంలో తిరుపతి ఉన్నపుడు వెంకటేశునికి స్వచ్చమైన మంచి నీటితో అభిషేకాలు అక్కడ నెయ్యితో వెలిగించిన దీపాలు తప్ప ఎలాంటి నైవేద్యాలు ఉండేవి కాదని కథనంలో అనిరుధ్ పేర్కొనడం విశేషం. ఇదీచదవండి: లడ్డూ వెనుక ‘బాబు’ మతలబు ఇదేనా.. -
దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో.. 60 సంవత్సరాల అపురూప ఘట్టాలు!
ఇస్రో పంపించిన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని మీద దిగిన తరువాత ప్రపంచమే భారతదేశం వైపు చూస్తోంది. నిజానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయాణం ఈ రోజు మొదలైంది కాదు. 60 సంవత్సరాల క్రితం ప్రారంభమై ఈ రోజు యావత్ ప్రపంచాన్ని ఆకర్శిస్తోందంటే దాని వెనుక ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1957లో సోవియన్ యూనియన్ అంతరిక్షమాలోకి మొదటి ఉపగ్రహం స్పుత్నిక్ ప్రయోగించిన తరువాత ప్రపంచం ద్రుష్టి అంతరిక్ష పరిశోధనవైపు మరలింది. 1960లో భారతదేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటున్న సమయంలో అంతరిక్ష పరిశోధన కోసం అడుగులు వేసింది. హోమీ బాబా అణు ఇంధన శాఖకు అధిపతిగా ఉన్న రోజుల్లో 1962 నాటికి అంతరిక్ష పరిశోధన కమిటీ ఒక ప్రత్యేక విభాగంగా అవతరించింది. దానికి విక్రమ్ సారాభాయ్ చీప్ అయ్యారు. అప్పట్లో ఆధునిక రాకెట్ టెక్నలాజి తెలిసిన దేశాలు ఆ విషయాలను చాలా రహస్యంగా ఉంచాయి. ఆ సమయంలో మనదేశంలో పరిశోధన కేంద్రానికి దక్షిణ భారతదేశం అనువైన ప్రదేశంగా నిలిచింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న యువ శాస్త్రవేత్తలు అరవముతన్, రామకృష్ణారావు, అబ్దుల్ కలాం వంటి వారు శిక్షణ కోసం నాసా వెళ్లారు. మొదటి అడుగు.. 1963లో నాసా భారతదేశానికి 'నైక్-అపాచీ' రాకెట్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ తరువాత ఇండియా మొదటి రాకెట్ ప్రయోగాన్ని 1963లో ప్రయోగించింది. ఇదే మనదేశం ఈ రంగంలో వేసిన మొదటి అడుగు అనే చెప్పాలి. 1965లో తుంబాలో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందింది. 1975 ఏప్రిల్ 19 భారతదేశానికి చెందిన మొదటి అంతరిక్ష నౌక 'ఆర్యభట్ట' ప్రయోగించారు. 1981 నాటికి టెలీ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన 'ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పరిమెంట్'ను ప్రయోగించింది. విద్యుదయస్కాంత పరిశుభ్రత కోసం దీనిని పరీక్షించడానికి, ISRO ఎద్దుల బండిపై అమర్చిన తాత్కాలిక పరీక్షా సదుపాయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారతీయ పౌరుడి అంతరిక్ష యాత్ర.. భారత వ్యోమగామి 'రాకేష్ శర్మ' భారతదేశానికి చెందిన అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. 1984 ఏప్రిల్ 3న సోవియట్ యూనియన్ (ప్రస్తుతపు రష్యా) కు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి వెళ్ళాడు. అప్పటి వరకు అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములలో రాకేష్ శర్మ 138వ వాడు కావడం గమనార్హం. PSLV అరంగేట్రం.. క్రమంగా అధునాతన రాకెట్లు అవసరమని తలచి భారత్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV అభివృద్ధి ప్రయత్నాలను ప్రారంభించింది. 1993లో మొదటి పీఎస్ఎల్వీ విఫలమైంది, కానీ 1994లో ప్రయోగించిన పీఎస్ఎల్వీ విజయవంతమైంది. ఆ తరువాత ప్రయోగించిన 95 శాతం పీఎస్ఎల్వీ రాకెట్లు విజయవంతమయ్యాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పువాల్సినవి 2008లో చంద్రునిపై ప్రయోగించిన చంద్రయాన్-1, 2013లో మార్స్ ఆర్బిటర్ స్పేస్‌క్రాఫ్ట్, 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించడం. అంగారకుడిపై భారత్.. 2007లో అప్పటి ఇస్రో చీప్ మాధవన్ నాయర్ అంగారకునిమీదకు ప్రోబ్ పంపాలని ప్రతిపాదించారు. దీనిని 2012లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించారు. మొత్తానికి తొలి ప్రయత్నంతోనే అంగారకుడిపై ప్రయోగాల్లో విజయవంతమైన దేశంగా భారత్ అవతరించింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? చంద్రయాన్.. చంద్రయాన్-1 & 2 రెండు విఫలమయ్యాయి. అయితే ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 గొప్ప విజయం సాధించి భారతీయ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పింది. కాగా ఇటీవల ఆదిత్య-ఎల్1 కూడా ప్రయోగించారు. సుమారు ఆరు దశాబ్దాలు దిన దిన ప్రవర్ధమానం చెందుతూ గొప్ప విజయనాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన ఖాతాలో వేసుకుంది. ఇది భారతీయులందరికి గర్వకారణం అనే చెప్పాలి. -
B20 Summit 2023: నైతిక ‘కృత్రిమ మేధ’ అత్యావశ్యం
న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేథ(ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ)ను నైతికంగా వినియోగించాలని, లేదంటే విపరిణామాలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు. నూతన సాంకేతికతలో నైతికత లోపిస్తే సమాజంపై ఏఐ ప్రతికూల ప్రభావాలు ఎక్కువ అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ఢిల్లీలో కొనసాగుతున్న బీ–20(బిజినెస్ ఫోరమ్–20) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘ఏఐ వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి ఏకరూప మార్గనిర్దేశకాలు అవసరం. నిబంధనల చట్రం లేకుంటే క్రిప్టో కరెన్సీ వంటి అంశాల్లో సమస్యలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదముంది. పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో జీవన, వ్యాపార విధానాలకు పారిశ్రామిక వర్గాలు ప్రాధాన్యతనివ్వాలి. ఇందుకు వ్యాపారవర్గాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు కలసి కట్టుగా ముందుకు సాగాలి’ ఆయన మోదీ కోరారు. ‘పర్యావరణ మార్పు, ఇంథన రంగంలో సంక్షోభం, ఆహార గొలుసులో లోపించిన సమతుల్యత, నీటి భద్రత వంటివి అంతర్జాతీయంగా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలకు దేశాలన్నీ ఉమ్మడిగా పరిష్కరించుకోవాలి’ అని ఆయన అభిలíÙంచారు. వ్యాపారవర్గాలు తమ వ్యాపార సంబంధ అంశాలను చర్చించేందుకు జీ20కి అనుబంధంగా ఏర్పాటుచేసుకున్న వేదికే బిజినెస్ 20(బీ20) ఫోరమ్. విధాన నిర్ణేతలు, వ్యాపారదిగ్గజాలు, నిపుణులుసహా జీ20 దేశాల ప్రభుత్వాలు ఉమ్మడిగా బీ20 ఇండియా తీర్మానంపై చర్చలు జరుపుతాయి. ఈ తీర్మానంలో 54 సిఫార్సులు, 172 విధానపర చర్యలు ఉన్నాయి. వీటిని సెపె్టంబర్ 9–10 తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో సమరి్పస్తారు. వారే ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు ‘ప్రస్తుతం భారత్‌లో చాలా మంది పేదరికం నుంచి బయటపడి కొత్తగా ‘మధ్యతరగతి’ వర్గంలో చేరుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘పేదరికాన్ని నిర్మూలిస్తూ కేంద్రం అవలంభిస్తున్న విప్లవాత్మక విధానాల కారణంగా మరో 5–7 ఏళ్లలో కోట్ల భారీ సంఖ్యలో మధ్యతరగతి జనాభా అవతరించనుంది. వీరే భారత ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు. వీరే దేశంలో అతిపెద్ద వినియోగదారులు. కొంగొత్త ఆకాంక్షలతో శ్రమిస్తూ దేశార్థికాన్ని ముందుకు నడిపిస్తారు. ప్రభుత్వం పేదలను పై స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తోంది. దీంతో ఆ తర్వాత లబ్ధిపొందేది మధ్యతరగతి, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల వర్గాలే. మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వ్యాపారాలు వరి్ధల్లుతాయి. వ్యాపారాలు, వినియోగదారుల మధ్య సమతూకం సాధిస్తే లాభదాయ మార్కెట్ సుస్థిరంగా కొనసాగుతుంది. ప్రపంచ దేశాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. వినియోగ దేశాలు బాగుండాలంటే వస్తూత్పత్తి దేశాలను పట్టించుకోవాలి. లేదంటే వస్తూత్పత్తి దేశాలు కష్టాల కడలిలో పడతాయి. అందుకే ఏటా అంతర్జాతీయ వినియోగ సంరక్షణ దినం జరుపుకుందాం’ అని వ్యాపార వర్గాలకు మోదీ పిలుపునిచ్చారు. -
విమానం పుట్టుక వెనుక ఇంత చరిత్ర ఉందా? (ఫోటోలు)
-
Evolution Of Royal Enfield Bikes: రాయల్ ఎన్ఫీల్డ్ సుదీర్ఘ చరిత్ర - ఆసక్తికరమైన ఫోటోలు
-
మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ల చరిత్రకు ఇదే నిదర్శనం (ఫోటోలు)
-
మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్
పుణె: ఆటోమోటివ్ తయారీ రంగంలో మహిళా సిబ్బందిని పెంచే దిశగా పినకిల్ ఇండస్ట్రీస్ కొత్తగా ‘ఎవల్యూషనారీ’ పేరిట వినూత్న ప్రయోగం చేపట్టింది. కేవలం మహిళలను మాత్రమే నియమించుకునేందుకు ఫిబ్రవరి 23, 24న మధ్యప్రదేశ్ పిఠంపూర్‌లోని తమ ప్లాంటులో రిక్రూట్మెంట్ నిర్వహించనుంది. ఆసక్తి గల మహిళా అభ్యర్ధులు httpr:// pinnac eindurtrier. com/ evo utionari& campaifn/లో లేదా పినకిల్ ఇండస్ట్రీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో నమోదు చేసుకోవచ్చని లేదా నేరుగా వాకిన్ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని సంస్థ తెలిపింది. కెరియర్లో విరామం తీసుకున్నప్పటికీ అర్హత కలిగిన మహిళా ఇంజినీర్లు, నిపుణులు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ప్రెసిడెంట్ అరిహంత్ మెహతా తెలిపారు. మెకానికల్, ఎలక్ట్రికల్, రోబోటిక్స్ తదితర విభాగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉన్న ఇంజినీర్లతో పాటు ఆర్అండ్డీ, ఆపరేషన్స్, స్టోర్స్ తదితర విభాగాల్లోనూ నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. ఆటోమోటివ్ సీటింగ్, ఇంటిరీయర్స్, రైల్వే సీటింగ్ మొదలైన విభాగాల్లో పినాకిల్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
ఉడెన్ కిక్ టు ఎలక్ట్రిక్ దాకా.. స్కూటర్ పుట్టుక, పరిణామ క్రమం గురించి తెలుసా?
Scooter History And Evolution: స్కూటర్.. సామాన్యుడికి ఇష్టమైన మోతబండి. మార్కెట్లో భారత వాహన రంగాన్ని సైతం ఏలే దమ్ముంది ఈ బండికి. అయితే కాలం మారినట్లే.. ఇందులోనూ కొత్త కొత్త అప్డేట్ వెర్షన్లు వస్తున్నాయి. మరి దీని పరిణామా క్రమంలో కొన్ని మార్పులు ఎలా జరిగాయి.. ఆ కథ ఏంటో ఒక్కసారి స్కూటర్బండిపై కాలంలో వెనక్కి వెళ్లి చూద్దాం. స్కూటర్.. జర్మనీలో 18వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ బండి ప్రయాణం ఇప్పటికీ అప్రతిహతంగా సాగుతోంది. ఆధునిక కాలంలోనూ తన రూపం మార్చుకుని సామాన్యుడి జీవితంలో మమేకమవుతోంది. 19వ శతాబ్దంలో భారత్‌లోకి ప్రవేశించిన స్కూటర్లు రోడ్లపై ఎటు చూసినా దర్శనమిచ్చేవి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్క్‌లు వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో అవే ఎక్కువగా కనిపించేవి. సినిమాల్లో హీరోల ఎంట్రన్స్‌లు కూడా వాటి పైనే ఎక్కువగా ఉండేవి. వ్యవసాయ పనులు చేసుకునే వారు, ఉద్యోగస్తులే కాకుండా దాదాపు అన్ని వర్గాల వారితో స్కూటర్ తన బంధాన్ని పెనవేసుకుంది. ద్విచక్ర వాహనదారుల అభిరుచులలో మార్పులు రావడంతో కాలక్రమేణా స్కూటర్లు తన రూపును మార్చుకున్నాయి. ఇప్పుడు మార్కెట్లో ఎలక్ట్రికల్ స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్రోలు వాహనాలు ఎక్కువగా రోడ్లపై తిరుగుతుండటం, శబ్ధ కాలుష్యం తదితర కారణాలతో వాహనదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించారు. ఎలక్ట్రికల్ స్కూటర్లే కాకుండా స్పోర్ట్స్ బైక్‌లు, బుల్లెట్లపై యువతలో క్రేజ్ ఉండటంతో వాటిని కూడా కంపెనీలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఒక్కసారి బ్యాటరీ రీచార్జ్ చేస్తే వందకుపైగా కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉండటం, పెట్రోల్ ఖర్చు తప్పుతుండటం, కాలుష్య రహిత వాహనం కావడంతో ఎక్కవమంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఎలక్ట్రికల్ స్కూటర్ల హవా నడుస్తోంది. వీటి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో చాలా కంపెనీలు ఆన్లైన్లో ప్రీబుకింగ్‌ను ఓపెన్ చేస్తున్నాయి. అట్లాంట భారత్‌లో తయారైన మొట్టమొదట స్కూటర్ ఇదే. ఎన్‌హెచ్ రాజ్‌కుమార్ అనే వ్యక్తి కేరళలోని తిరువనంతపురంలో దీన్ని రూపొందించడాన్ని మొదలుపెట్టారు. సుదీర్ఘకాలం పాటు శ్రమించి 1976లో తొలిసారిగా మీడియా ముందు అట్లాంట స్కూటర్‌ను ప్రవేశపెట్టారు. గంటకు 70 కిలో మీటర్ల వేగం, లీటర్‌కు 60 కిలోమీటర్ల మేరకు ప్రయాణం దీని సొంతం. అప్పట్లో దీని ధర రూ.2,300 ఉండేది. ఈ స్కూటర్‌ను తయారు చేయడానికి వాడిన భాగాల్లో 75 శాతం మన దేశంలో తయారు చేసినవే. కొన్నాళ్ల అనంతరం కేంద్ర ప్రభుత్వం దీన్ని టేకోవర్ చేయడం ప్రారంభించింది. రాజకీయ కారణాలు, కార్మికుల సమస్యలతో ‘అట్లాంట’ తన ఉనికిని కోల్పోయింది. లూనా 1972లో 50సీసీ ఇంజన్‌తో కెనిటిక్ ఇంజనీరింగ్ సంస్థ మోపెడ్‌ను భారత ఆటోమెబైల్ మార్కెట్లోకి విడుదల చేసింది. 2000 సంవత్సరం వరకు వీటి ఉత్పత్తి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయదారులు దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పటికీ రూరల్ ప్రాంతాల్లో లూనాలు కనిపిస్తుండటం విశేషం. చేతక్ 1972లో బజాజ్ కంపెనీ చేతక్ బండిని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 15వ శతాబ్దానికి చెందిన రాజస్థాన్ రాజు మహారాణ ప్రతాప్ తన గుర్రానికి పెట్టుకున్న పేరు (చేతక్)నే బజాజ్ కంపెనీ ఈ బండికి పెట్టింది. గంటలకు 90 కిలోమీటర్ల వేగం, లీటర్‌కు 62 కిలోమీటర్ల ప్రయాణం దీని సొంతం. 2006 వరకు దీని హవా సాగింది. ఆ తరువాత బజాజ్ కంపెనీ బైక్‌లపై దృష్టి సారించి చేతక్‌ల ఉత్పత్తిని నిలిపివేసింది. ఇలా 1950లో మొదలైన స్కూటర్ కాలాంతరంగా పలు రూపాలను మార్చుకుంటూ వస్తోంది. ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఎలక్ట్రికల్ స్కూటర్లపై వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాటి తయారీకి కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. కొన్ని కంపెనీలు మహిళల కోసం ప్రత్యేకంగా స్కూటర్లు డిజైన్ చేస్తున్నాయి. ప్రస్తుతం రోడ్లపై అవే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. లంబ్రెట్టా 1920ల అనంతరం ఆటోపెడ్ కన్నా మెరుగ్గా 1952లో లంబ్రెట్టా అనే స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. దీని భాగాలను ఇటలీ నుంచి భారత్‌కు తీసుకువచ్చి ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా (ఏపీఐ) అసెంబ్లింగ్ చేసేది. దీని ఇంజన్ కెపాసిటీ 48సీసీ. ఎల్ఐ 150 సీరీస్ 2 అనే పేరుతో ఏపీఐకి లైసెన్స్ మంజూరు అయ్యింది. 1976 వరకు వీటి అమ్మకాలు జరగ్గా ఆ తరువాత న్యాయపరమైన సమస్యలు తలెత్తడంతో వీటిని మార్కెట్లోకి విడుదల చేయడాన్ని ఏపీఐ నిలిపివేసింది. ఆటోపెడ్ దీన్నే క్రప్–రోలర్ అని కూడా పిలిచేవారు. 1915–1921 వరకు ఇవి ప్రపంచ మార్కెట్లో ఉన్నాయి. గంటకు 32 కిలోమీటర్ల వేగంతో దీనిపై ప్రయాణించవచ్చు. దీని టైర్లు 10 ఇంచులకు పైగా ఉండేవి. ఉడెన్ కిక్ స్కూటర్ 1894లో హిల్డర్ బ్రాండ్ అండ్ ఓల్ఫ్ ముల్లర్ మోటర్ సైకిల్‌ను రూపొందించినా పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. వారు రూపొందించిన మోటర్‌సైకిల్ స్ఫూర్తితో అర్థర్ హుగో సీసెల్గిబ్జన్ స్కేటింగ్‌కి ఉపయోగించే చక్రాలు, చెక్కతో 1913లో ఉడెన్ కిక్ స్కూటర్‌ను రూపొందించారు. మార్కెట్లోకి ఇది 1916లో వచ్చింది. అయితే అప్పటికే ప్రపంచవ్యాప్తంగా స్కూటర్ల తయారీకి విస్తృత స్థాయిలో పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆటోపెడ్ మార్కెట్లోకి వచ్చింది. –సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ -
భారత్‌లో ప్రజాస్వామ్య పరిణితి తక్కువే
విశాఖపట్నం సిటీ: భారత్‌లో ప్రజాస్వామ్యం ఇంకా పూర్తి స్థాయిలో పరిణామం చెందలేదని ఛత్తీస్‌గఢ్ ప్రిన్సిపల్ కార్యదర్శి డిపి రావు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బౌద్ధమత ప్రభావం అనే అంశంపై రెండు రోజుల సదస్సు సోమవారంతో ముగిసింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ యూరప్‌లో ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో అమలవుతోందన్నారు. భారత్‌లో 1950 నుంచే ప్రజాస్వామ్యం అమల్లో ఉందని అందుకే మన దేశంలో ఇంకా కొన్ని బలారిష్టాలున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్‌లో అపారమైన సంపద ఉందని అది అందరికీ చేరే మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్‌కు చెందిన మౌలానా అజాద్ యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బుద్ధిజం చాలా అవశ్యమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించిన తర్వాతే రాజ్యాంగం రచించారని, అందుకే మన రాజ్యాంగంలో శాంతి చర్యలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ సదస్సులో ఏయూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, రె క్టార్ నారాయణ, ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుందరరావు, ఆంత్రోపాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జయకిషన్, సదస్సు సమన్వయకర్త పాల్ తదితరులు పాల్గొన్నారు. -
వికాసం: అందంగా మాట్లాడటం ఒక కళ!
‘మాట్లాడటం సిల్వర్; మౌనం బంగారం’ అన్న ఇంగ్లిష్ సామెత కరెక్టయితే అయ్యుండచ్చు గాక. దీని కన్నా మించిన సూక్తి ‘సరైన సందర్భంలో సరిగ్గా మాట్లాడటం ప్లాటినం!’ ‘నీ భార్య చనిపోయిందని తెలిసి చాలా సంతోషంగా ఉంది’ అన్నాడు ఓ స్నేహితుడు. అసలే భార్య మరణించి రోదిస్తూన్న వ్యక్తి ఈ మాటలకి నిర్ఘాంతపోయాడు. ‘నీకు క్యాన్సర్ అని డాక్టర్లు నిర్ధారించారట’ స్నేహితుడు కొనసాగించాడు. ‘ఇంకో నాలుగైదు నెలల కన్నా బతకవని చెప్పారట. నిజమేనా? పిల్లలు కూడా లేరు కదా! ఎంతో సంతోషంగా ఉంది’. వింటున్న వ్యక్తి సాచి పెట్టి కొట్టాడు. ‘మాట్లాడటం సిల్వర్; మౌనం బంగారం’ అన్న ఇంగ్లిష్ సామెత కరెక్టయితే అయ్యుండచ్చు గాక. దీని కన్నా మించిన సూక్తి ‘సరైన సందర్భంలో సరిగ్గా మాట్లాడటం ప్లాటినం!’. మన ఫీలింగ్‌ని అవతలివారికి కరెక్ట్‌గా అర్థమయ్యేలా చెప్పగలగటం ఒక కళ. దీన్నే ‘కమ్యూనికేషన్’ అంటారు. పై సంఘటనలో స్నేహితుని ఉద్దేశం ఏమిటంటే, ‘నీవొక ఆరు నెలల్లో మరణించబోతున్నావు, నీకెలాగో పిల్లల్లేరు. ఇప్పుడు నీ భార్య కూడా మరణించింది. ఆ విధంగా నీకు అన్ని భవబంధాలు నశించాయి. ఎంతో అదృష్టం చేసుకుంది కాబట్టే నీ అంతిమ దినాల్లో కష్టాలు చూడకుండా, నీ మరణం తరువాత కష్టాల్ని భరించకుండా నీ భార్య ఈ లోకం నుండి వెళ్లిపోయింది.’ ఇది సరిగ్గా చెప్పలేకే అతడు ఒక స్నేహాన్ని పోగొట్టుకున్నాడు. సాంఘిక సేవలో నిమగ్నమైన ఒక నిశ్శబ్ద సోషల్ వర్కర్‌కి భారతరత్న రావొచ్చు. మౌనంగా తన పని తాను చేసుకుపోయే ఒక సైంటిస్ట్‌కి నోబుల్ ప్రైజ్ రావొచ్చు. కానీ సమాజంలో పేరు, ప్రతిష్ట పెరగాలంటే మనిషికి ఈ ఏడు రకాల అంశాల్లో ‘కనీసం కొన్నయినా’ ఉండాలి. తెలివి, విషయ పరిజ్ఞానం, లౌక్యం, ఇతరులతో సంబంధాలు, డబ్బు, దాతృత్వం, కమ్యూనికేషన్. చివరిది అన్నిటికన్నా ముఖ్యం. అవసరం లేని విషయాన్ని మాట్లాడటం, అసందర్భమైన సమయంలో మాట్లాడకుండా ఉండటం కళ. తప్పు సంకేతం వచ్చేలా మాట్లాడటం మరీ దారుణం. ఆ విషయాన్ని పై స్నేహితుడి ఉదాహరణ నిరూపిస్తుంది. ఒక విషయాన్ని అవతలివారికి చెప్పేటప్పుడు, అది వారికి సరిగ్గా అర్థం అయిందా లేదా అని చూడాలి. ఒక దినపత్రికలో ‘నక్సలైట్లు పోలీస్‌స్టేషన్‌ను చుట్టు ముట్టి, కాల్పులు జరిపినప్పుడు పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఇందులో ఆరుగురు గాయపడ్డారు’ అని వార్త వచ్చింది. గాయపడింది పోలీసులో, నక్సలైట్లో చదివేవారికి అర్థం కాలేదు. చదవటం, రాయటం, మాట్లాడటం, వినటం, హావభావాలు, సంజ్ఞల మీద కమ్యూనికేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. సంభాషణాన్ని రెండు రకాలుగా విడగొట్టవచ్చు. ప్రైవేట్ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్. ప్రైవేట్ కమ్యూనికేషన్లో నాలుగు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. 1. మన మూడ్, మాట్లాడటానికి తగిన విధంగా ఉందా? 2. అవతలివారి మూడ్, వినటానికి సరైన స్థితిలో ఉందా? 3. అవతలివారి మూడ్‌ని, మన మాటల్తో మార్చగలిగే పరిస్థితి ఉందా? 4. అవతలివారి పరిస్థితిని బట్టి మన మూడ్ మార్చుకొనే అవసరం ఉందా? ఈ చివరి దాన్ని భావోద్వేగ నియంత్రణ (ఎమోషనల్ కంట్రోల్) అంటారు. ఐదు జ్ఞానేంద్రియాలతో మనం గ్రహించేది ‘వాస్తవం’. అది దృశ్యం కావొచ్చు. పరిమళం కావొచ్చు. శబ్దం కావొచ్చు. అలా గ్రహించిన దాన్ని మనం ఏ విధంగా అన్వయించుకుంటామనేది మన ‘ఫీలింగ్’. - యండమూరి వీరేంద్రనాథ్