తిరుపతి లడ్డూపై వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అసలు లడ్డూ ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో కలుగుతోంది. అసలు తిరుమల శ్రీ వేంకటేశుని ప్రసాదంగా లడ్డూ ఎప్పటి నుంచి ఉంది..అసలు లడ్డూయే ప్రసాదంగా ఎందుకు ఉంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు అనిరుధ్ కనిశెట్టి అనే చరిత్రకారుడు ‘ది ప్రింట్’లో రాసిన సమగ్ర కథనంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తొమ్మిదో శతాబ్దం నుంచి ఇప్పటివరకు తిరుపతి చరిత్రను వివరిస్తూ కాలగమనంతో పాటు శ్రీ వేంకటేశుని ప్రసాదం ఎలా మారుతూ వచ్చిందన్నది అనిరుధ్ తన కథనంలో రాసుకొచ్చారు.
వేల ఏళ్ల క్రితం తిరుపతి ప్రసాదం ఏంటి..?
నిజానికి తిరుమల-తిరుపతి అనగానే లడ్డూ టక్కున గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే తిరుపతి వెళ్లినపుడు ఏడుకొండలవాడిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమైన ఘట్టమో లడ్డూ ప్రసాదం తినడమూ భక్తులకు అంతే ముఖ్యం. ఏడుకొండలకు వెళ్లి లడ్డూ ప్రసాదం ఆరగించడమే కాదు..క్యూలో నిల్చొని కష్టపడి తీసుకున్న లడ్డూను ఇతరులకు పంచి పెట్టడం కూడా భక్తిలో భాగమైపోయాయి. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన లడ్డూ నిజానికి తొలి ఉంచి ఏడు కొండలవాడి ప్రసాదం కాదని అనిరుధ్ చెబుతున్నారు. తొమ్మిదో శతాబ్దం నుంచి 1900 సంవత్సరం వరకు శ్రీవారి ప్రసాదం అన్నం,నెయ్యితో తయారు చేసిన పొంగల్ అని తెలిపారు.
లడ్డూ ప్రసాదంగా ఎలా మారింది..?
తొమ్మిదో శతాబ్దంలో తిరుపతి పుణ్యక్షేత్రం బ్రాహ్మణుల ఆధీనంలో చిన్న పల్లెటూరుగా ఉండేది.ఆ తర్వాతి కాలంలో చోళులు, విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు, బ్రిటీషర్ల పాలనలో తిరుపతి క్షేత్రంలో చాలా మార్పులు జరిగాయి. శ్రీ వేంకటేశుడి మహిమతో తిరుపతి ప్రభ రోజురోజు పెరుగుతూ వచ్చింది.తొలుత అక్కడ పొంగల్‌గా ఉన్న ప్రసాదం ఉత్తర భారతీయుల కారణంగా లడ్డూగా మారిందని అనిరుధ్ తన కథనంలో రాశారు.
‘బాలాజీ’ అనే పిలుపు కూడా వారిదే..
బ్రిటీషర్ల పాలనలో ఉత్తర భారతీయులు ఎక్కువగా తిరుపతి సందర్శనకు వచ్చేవారని, వీరు వెంకటేశుడిని బాలాజీగా పిలుచుకునే వారని తెలిపారు. వీరే పొంగల్‌గా ఉన్న తిరుపతి ప్రసాదాన్ని తీయనైన లడ్డూగా మార్చారని అనిరుథ్ రాసుకొచ్చారు.తొలుత బ్రాహ్మణుల ఆధీనంలో తిరుపతి ఉన్నపుడు వెంకటేశునికి స్వచ్చమైన మంచి నీటితో అభిషేకాలు అక్కడ నెయ్యితో వెలిగించిన దీపాలు తప్ప ఎలాంటి నైవేద్యాలు ఉండేవి కాదని కథనంలో అనిరుధ్ పేర్కొనడం విశేషం.
ఇదీచదవండి: లడ్డూ వెనుక ‘బాబు’ మతలబు ఇదేనా..
Comments
Please login to add a commentAdd a comment