
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం జరిగింది. కుక్కుటేశ్వర స్వామి ప్రసాదంలో పురుగులు దర్శనమిచ్చాయి. పులిహోరాలో పురుగులు దర్శనమివ్వడంతో భక్తుడు షాక్ అయ్యారు. ప్రసాదంలో కనిపించిన పురుగులపై దేవస్ధానం అధికారులను భక్తులు నిలదీశారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పాదగయాలో నాసిరకం వస్తువులతో ప్రసాదం తయారీ అవుతోంది.
కాగా.. గత నెలలో హోమగుండంలో స్వామివారు, అమ్మవార్ల ఫోటోలతో ముద్రించిన రసీదు పుస్తకాలు, విలువైన పత్రాలను సిబ్బంది దహనం చేసిన సంగతి తెలిసిందే. తైల ద్రవ్యాలు వేయాల్సిన హోమ గుండంలో రసీదు పుస్తకాలు వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్తీక పూజలు సందర్భంగా హోమ గుండాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై శాఖపరమైన విచారణకు ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్న డీప్యూటీ పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment