భారత్‌లో ప్రజాస్వామ్యం ఇంకా పూర్తి స్థాయిలో పరిణామం చెందలేదని ఛత్తీస్‌గఢ్ ప్రిన్సిపల్ కార్యదర్శి డిపి రావు ...
విశాఖపట్నం సిటీ: భారత్‌లో ప్రజాస్వామ్యం ఇంకా పూర్తి స్థాయిలో పరిణామం చెందలేదని ఛత్తీస్‌గఢ్ ప్రిన్సిపల్ కార్యదర్శి డిపి రావు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బౌద్ధమత ప్రభావం అనే అంశంపై రెండు రోజుల సదస్సు సోమవారంతో ముగిసింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ యూరప్‌లో ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో అమలవుతోందన్నారు. భారత్‌లో 1950 నుంచే ప్రజాస్వామ్యం అమల్లో ఉందని అందుకే మన దేశంలో ఇంకా కొన్ని బలారిష్టాలున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్‌లో అపారమైన సంపద ఉందని అది అందరికీ చేరే మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్‌కు చెందిన మౌలానా అజాద్ యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బుద్ధిజం చాలా అవశ్యమన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించిన తర్వాతే రాజ్యాంగం రచించారని, అందుకే మన రాజ్యాంగంలో శాంతి చర్యలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ సదస్సులో ఏయూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, రె క్టార్ నారాయణ, ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుందరరావు, ఆంత్రోపాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జయకిషన్, సదస్సు సమన్వయకర్త పాల్ తదితరులు పాల్గొన్నారు.