న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేథ(ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ)ను నైతికంగా వినియోగించాలని, లేదంటే విపరిణామాలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు. నూతన సాంకేతికతలో నైతికత లోపిస్తే సమాజంపై ఏఐ ప్రతికూల ప్రభావాలు ఎక్కువ అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ఢిల్లీలో కొనసాగుతున్న బీ–20(బిజినెస్ ఫోరమ్–20) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.
‘ఏఐ వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి ఏకరూప మార్గనిర్దేశకాలు అవసరం. నిబంధనల చట్రం లేకుంటే క్రిప్టో కరెన్సీ వంటి అంశాల్లో సమస్యలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదముంది. పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో జీవన, వ్యాపార విధానాలకు పారిశ్రామిక వర్గాలు ప్రాధాన్యతనివ్వాలి. ఇందుకు వ్యాపారవర్గాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు కలసి కట్టుగా ముందుకు సాగాలి’ ఆయన మోదీ కోరారు.
‘పర్యావరణ మార్పు, ఇంథన రంగంలో సంక్షోభం, ఆహార గొలుసులో లోపించిన సమతుల్యత, నీటి భద్రత వంటివి అంతర్జాతీయంగా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలకు దేశాలన్నీ ఉమ్మడిగా పరిష్కరించుకోవాలి’ అని ఆయన అభిలíÙంచారు. వ్యాపారవర్గాలు తమ వ్యాపార సంబంధ అంశాలను చర్చించేందుకు జీ20కి అనుబంధంగా ఏర్పాటుచేసుకున్న వేదికే బిజినెస్ 20(బీ20) ఫోరమ్. విధాన నిర్ణేతలు, వ్యాపారదిగ్గజాలు, నిపుణులుసహా జీ20 దేశాల ప్రభుత్వాలు ఉమ్మడిగా బీ20 ఇండియా తీర్మానంపై చర్చలు జరుపుతాయి. ఈ తీర్మానంలో 54 సిఫార్సులు, 172 విధానపర చర్యలు ఉన్నాయి. వీటిని సెపె్టంబర్ 9–10 తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో సమరి్పస్తారు.
వారే ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు
‘ప్రస్తుతం భారత్‌లో చాలా మంది పేదరికం నుంచి బయటపడి కొత్తగా ‘మధ్యతరగతి’ వర్గంలో చేరుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘పేదరికాన్ని నిర్మూలిస్తూ కేంద్రం అవలంభిస్తున్న విప్లవాత్మక విధానాల కారణంగా మరో 5–7 ఏళ్లలో కోట్ల భారీ సంఖ్యలో మధ్యతరగతి జనాభా అవతరించనుంది. వీరే భారత ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు. వీరే దేశంలో అతిపెద్ద వినియోగదారులు. కొంగొత్త ఆకాంక్షలతో శ్రమిస్తూ దేశార్థికాన్ని ముందుకు నడిపిస్తారు. ప్రభుత్వం పేదలను పై స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తోంది.
దీంతో ఆ తర్వాత లబ్ధిపొందేది మధ్యతరగతి, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల వర్గాలే. మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వ్యాపారాలు వరి్ధల్లుతాయి. వ్యాపారాలు, వినియోగదారుల మధ్య సమతూకం సాధిస్తే లాభదాయ మార్కెట్ సుస్థిరంగా కొనసాగుతుంది. ప్రపంచ దేశాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. వినియోగ దేశాలు బాగుండాలంటే వస్తూత్పత్తి దేశాలను పట్టించుకోవాలి. లేదంటే వస్తూత్పత్తి దేశాలు కష్టాల కడలిలో పడతాయి. అందుకే ఏటా అంతర్జాతీయ వినియోగ సంరక్షణ దినం జరుపుకుందాం’ అని వ్యాపార వర్గాలకు మోదీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment