advanced technology
-
Virgin Media O2: సైబర్ కేటుగాళ్ల పనిపట్టే ఏఐ బామ్మ
ఎలా పనిచేస్తుంది? వర్జిన్ మీడియా ఓ2 సంస్థకు చెందిన యూజర్లకు స్కామర్లు చేసే నకిలీ/స్పామ్ ఫోన్‌కాల్స్‌ను కృత్రిమమేథ చాట్ అయిన ‘డైసీ’బామ్మ రెప్పపాటులో కనిపెడుతుంది. వెంటనే స్కామర్లతో యూజర్లకు బదులు ఈ బామ్మ మాట్లాడటం మొదలెడుతుంది. తమతో మాట్లాడేది నిజమైన బామ్మగా వాళ్లు పొరబడేలా చేస్తుంది. అవతలి వైపు నుంచి కేటుగాళ్లు మాట్లాడే మాటలను సెకన్లవ్యవధిలో అక్షరాల రూపంలోకి మార్చి ఆ మాటలకు సరైన సమాధానాలు చెబుతూ వేరే టాపిల్లోకి సంభాషణను మళ్లిస్తుంది. ‘కస్టమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’వంటి అధునాతన సాంకేతికతలను ఒడుపుగా వాడుకుంటూ అప్పటికప్పుడు కొత్తకొత్త రకం అంశాలను చెబుతూ సంభాషణను సాగదీస్తుంది. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా తాను పెంచుకున్న పిల్లి పిల్ల కేశసంపద గురించి, పిల్లి చేసే అల్లరి గురించి, తన కుటుంబసభ్యుల సంగతులు.. ఇలా అనవసరమైన అసందర్భమైన అంశాలపై సుదీర్ఘ చర్చలకు తెరలేపుతుంది. సోది కబర్లు చెబుతూ అవతలి వైపు స్కామర్లు విసిగెత్తిపోయేలా చేస్తుంది. అయినాసరే బామ్మ మాటలగారడీలో స్కామర్లు పడకపోతే తప్పుడు చిరునామాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కొద్దిగా మార్చేసి చెప్పి వారిని తికమక పెడుతుంది. ఓటీపీలోని నంబర్లను, క్రెడిట్, డెబిట్ కార్డు అంకెలను తప్పుగా చెబుతుంది. ఒకవేళ వీడియోకాల్ చేసినా అచ్చం నిజమైన బామ్మలా తెరమీద కనిపిస్తుంది. వెచ్చదనం కోసం ఉన్ని కోటు, పాతకాలం కళ్లజోడు, మెడలో ముత్యాలహారం, తెల్లని రింగురింగుల జుట్టుతో కనిపించి నిజమైన బ్రిటన్ బామ్మను మైమరిపిస్తుంది. యాసను సైతం ఆయా కేటుగాళ్ల యాసకు తగ్గట్లు మార్చుకుంటుంది. లండన్‌కు చెందిన వీసీసీపీ ఫెయిత్ అనే క్రియేటివ్ ఏజెన్సీ ఈ బామ్మ ‘స్థానిక’గొంతును సిద్ధంచేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి బామ్మ నుంచి తీసుకున్న స్వర నమూనాలతో ఈ కృత్రిమ గొంతుకు తుదిరూపునిచి్చంది.కేటుగాళ్ల సమాచారం పసిగట్టే పనిలో... మన సమాచారం స్కామర్లకు చెప్పాల్సిందిపోయి స్కామర్ల సమాచారాన్నే ఏఐ బామ్మ సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్‌కాల్ ఆన్లైన్లో ఉండేలా చేయడం ద్వారా ఆ ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెల్సుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, నిఘా సంస్థలకు అవకాశం చిక్కుతుంది. ‘‘ఎక్కువసేపు ఈ బామ్మతో ఛాటింగ్‌లో గడిపేలా చేయడంతో ఇతర యూజర్లకు ఫోన్‌చేసే సమయం నేరగాళ్లను తగ్గిపోతుంది. స్కామర్లు తమ విలువైన కాలాన్ని, శ్రమను బామ్మ కారణంగా కోల్పోతారు. ఇతరులకు స్కామర్లు ఫోన్‌చేయడం తగ్గుతుంది కాబట్టి వాళ్లంతా స్కామర్ల చేతిలో బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం తప్పినట్లే’’అని వర్జిన్ మీడియా ఓ2 ఒక ప్రకటనలో పేర్కొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొత్తగా 60 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం భివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని యువతకు స్కిల్‌కోర్సులు అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్థ)లను ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)లుగా అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఏటీసీలు పరిమిత సంఖ్యలో ఉండగా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒకటి చొప్పున ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏటీసీలు లేని సెగ్మెంట్లను గుర్తిస్తూ... అక్కడ కొత్తగా వాటి ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 59 నియోజకవర్గాల్లో 65 ఏటీసీలున్నాయి.ఒకట్రెండు చోట్ల రెండేసి ఏటీసీలు ఉండగా, 60 నియోజకవర్గాల్లో మాత్రం వీటి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ఏటీసీలు లేని చోట కొత్తగా నెలకొల్పేందుకు కారి్మక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు స్థల లభ్యత, ఇతర వసతులను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు పంపాలని కోరింది. ప్రస్తుతం వరంగల్ రీజియన్ పరిధిలో 35, హైదరాబాద్ రీజియన్ పరిధిలో 30 ఏటీసీలు ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్‌లో ఉన్న వాటిల్లో అత్యాధునిక ట్రేడ్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ జిల్లాలోని ఆరు ఏటీసీలను ఇప్పటికే మారుతి, హ్యుందాయ్, ఏషియన్ పెయింట్స్ లాంటి సంస్థలు దత్తత తీసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లోని ట్రేడ్లలో చేరేందుకు అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.తాజాగా అన్ని చోట్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రేడ్లను అందుబాటులోకి తేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం... 2వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో ఆధునీకరణ పనులు చేపట్టడంతో ఐటీఐ ట్రేడ్లకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇప్పటికే 20కి పైగా కొత్త ఏటీసీల ఏర్పాటు కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు రూపొందించగా, అవి కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ విభాగానికి చేరాయి. అతి త్వరలో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. -
సరికొత్త స్పేస్ సూట్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’అర్టిమిస్–3 ప్రయోగం కోసం సన్నద్ధమవుతోంది. చందమామ ఉపరితలంపైకి వ్యోమగాములను పంపించడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి ప్రాడా కంపెనీ తన వంతు సాయం అందిస్తోంది. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాముల కోసం అత్యాధునిక స్పేస్ సూట్‌ను(అక్సియోమ్ ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్–ఏఎక్స్ఈఎంయూ) అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఏరోసేŠస్స్ అండ్ ఫ్యాషన్, అక్సియోమ్ స్పేస్ సంస్థల సహకారం తీసుకుంది. ఇటలీలోని మిలన్ నగరంలో ఇంటర్నేషనల్ అస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో ఈ స్పేస్ సూట్‌ను ప్రదర్శించింది. మిగిలి ఉన్న కొన్ని పరీక్షల్లో సైతం ఈ స్పేస్‌సూట్ నెగ్గితే చంద్రుడిపైకి వెళ్లే నాసా వ్యోమగాములు ఇదే ధరించబోతున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్నవాటితో పోలిస్తే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ప్రాడా కంపెనీ చెబుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకొని, దీర్ఘకాలం మన్నికగా ఉండేలా ఈ స్పేస్‌సూట్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రాడా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ అధికారి లోరెంజో బెర్టిలీ చెప్పారు. దృఢత్వం, భద్రతా ప్రమాణాల విషయంలో దీనికి తిరుగులేదని అన్నారు. ఇప్పటిదాకా జరిగిన పరీక్షల్లో ప్రాడా స్పేస్‌సూట్ నెగ్గింది. 2025లో తుది పరీక్షలు జరుగబోతున్నాయి. వివిధ రకాల వ్రస్తాల ఉత్పత్తిలో ప్రాడాకు మంచి పేరుంది. -
6జీ రేసులో భారత్
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికతల ప్రయోజనాలను అందిపుచ్చుకునే దిశగా భారత్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ బాటలో 6జీ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే గణనీయంగా పేటెంట్లు దాఖలు చేసింది. ఈ విషయంలో వివిధ అధ్యయనాల ప్రకారం భారత్ నాలుగు, ఆరు స్థానాల్లో ఉంది. బ్రిటన్‌కి చెందిన యూ స్విచ్ ప్లాట్‌ఫాం ప్రకారం గతేడాది ఏప్రిల్ నాటికి 265 పేటెంట్లతో (6జీ) భారత్ నాలుగో స్థానంలో ఉంది. చైనా (4,604), అమెరికా (2,229), దక్షిణ కొరియా (760) తొలి మూడు ర్యాంకుల్లో ఉన్నాయి. ఇక గ్లోబల్ ఐపీ మేనేజ్మెంట్ సంస్థ మ్యాక్స్‌వాల్ ప్రకారం 188 పేటెంట్లతో భారత్ ఆరో స్థానంలో ఉంది. (ప్రభుత్వ డేటా ప్రకారం ఈ సంఖ్య ఈ ఏడాది 200 దాటేసింది). ఈ విషయంలో బ్రిటన్ (151), జర్మనీ (84), స్వీడన్ (74), ఫ్రాన్స్ (73) కన్నా ముందుండటం గమనార్హం. 6,001 పేటెంట్లతో చైనా అగ్రస్థానంలో ఉండగా, అమెరికా (3,909), దక్షిణ కొరియా (1,417), జపాన్ (584), యూరోపియన్ యూనియన్ (214) వరుసగా టాప్ 5 ర్యాంకుల్లో ఉన్నాయి. భారత్ ప్రధానంగా బ్లాక్‌చెయిన్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ), 6జీ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎనర్జీ హార్వెస్టింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ వంటి విభాగాల్లో ఎక్కువగా పేటెంట్లు దాఖలు చేసినట్లు ఫ్రాన్స్‌కి చెందిన ఐపీ సొల్యూషన్స్ సంస్థ క్వెస్టెల్ తెలిపింది. 10 శాతం వాటా లక్ష్యం.. 6జీ సాంకేతికతకు సంబంధించి భారత్ భారీ లక్ష్యాలనే పెట్టుకుంది. వచ్చే మూడేళ్లలో అంతర్జాతీయంగా 6జీ పేటెంట్లలో 10 శాతం వాటా దక్కించుకోవాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా భారత్ 6జీ అలయెన్స్ ఆవిష్కరణ, 6జీ ట్రయల్స్ కోసం టెస్ట్ బెడ్స్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంది. పేటెంట్ల దాఖలుకే పరిమితం కాకుండా 6జీ ప్రమాణాలను ప్రభావితం చేసే దిశగా కూడా భారత్ కృషి చేస్తోంది. 160 పైగా దేశాల ప్రమాణాల సంస్థలకు సభ్యత్వం ఉన్న ఐఎస్‌వోలోని (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) టెక్నికల్ కమిటీలు, సబ్‌కమిటీల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అక్టోబర్ 15 నుండి 24 వరకు భారత్‌లో వరల్డ్ టెలీకమ్యూనికేషన్స్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (డబ్ల్యూటీఎస్ఏ) జరగనున్న నేపథ్యంలో ఈ విషయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 6జీ, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటాలాంటి కీలక టెక్నాలజీల భవిష్యత్ ప్రమాణాల గురించి చర్చించేందుకు 190 పైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. -
‘సరళ’జల తరంగిణి
పది గ్రామాల్లో పంట సిరుల కోసం సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలనుకున్నారు. అనుకున్నదే తడవు అమెరికాకు చెందినఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. స్వాతం్రత్యానికి ముందు మొదలై.. స్వాతం్రత్యానంతరం ప్రారంభమైన ఆ సాగునీటి ప్రాజెక్టు వయసు ఏడున్నర దశాబ్దాలు.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో సంస్థానాదీశుల కాలంలో అప్పట్లో రూ.35 లక్షలతో నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టు విశేషాలివి. – వనపర్తివనపర్తి సంస్థానాదీశుడి ఆలోచనే.. స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన.. అప్పటి వనపర్తి సంస్థానా«దీశుడు రాజారామేశ్వర్రావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ప్రత్యేకంగా నిర్మించేందుకు ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతం్రత్యానంతరం అప్పటి మిలిటరీ గవర్నర్ జేఎన్ చౌదరి 1949 సెపె్టంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో దీన్ని పూర్తి చేశారు. 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రాజెక్టును ప్రారంభించారు. ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే.. ప్రాజెక్టులోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతటవే తెరుచుకుంటాయి. అప్పట్లో ఈ పరిజ్ఞానంతో ఆసియాలోనే నిర్మించిన మొదటి ప్రాజెక్టు కాగా.. ప్రపంచంలో రెండోది కావడం విశేషం. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్‌ను నిర్మించారు. ఒక్కొక్క సైఫన్ నుంచి 520 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. మట్టికట్ట పొడవు 3,537 అడుగులు, రాతికట్ట పొడవు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 అడుగులు. నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడికాల్వ 8 కిలోమీటర్లు, ఎడమ కాల్వ 20 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న కట్ట ఇప్పటికి రెండుసార్లు తెగిపోయింది. 1964లో మొదటిసారి, 2019 డిసెంబర్ 31వ తేదీన రెండోసారి కట్టకు గండిపడింది. ముంపు సమస్య పరిష్కారానికే.. వర్షం నీరు ఊకచెట్టు వాగులో నుంచి వృథాగా కృష్ణానదిలో కలిసిపోవటం.. ఈ వాగు సమీపంలోని గ్రామాలు తరచూ వరద ముంపునకు గురయ్యేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి సంస్థానం అధీనంలోని పది గ్రామాల్లోని సుమారు 4,182 ఎకరాలకు సాగునీరందించేలా 0.5 టీఎంసీ సామర్థ్యంతో సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు సాగునీరందే గ్రామాలు ప్రస్తుతం మదనాపురం మండల పరిధిలో ఉన్నాయి. ఎడమ కాల్వ పరిధిలో శంకరంపేట, దంతనూరు, మదనాపురం, తిరుమలాయపల్లి, వడ్డెవాట, చర్లపల్లి, రామన్‌పాడు, అజ్జకోలు, కుడికాల్వ పరిధిలో నెల్విడి నర్సింగాపూర్ గ్రామాలున్నాయి. కాగా.. సరళాసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇటీవల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి సరళాసాగర్‌ను సందర్శించినా.. ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం గమనార్హం. మరమ్మతులకు ప్రతిపాదనలు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టుకు అక్కడక్కడా ఏర్పడిన నెర్రెలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇందుకోసం నిపుణులైన ఇంజనీర్లను రప్పించి.. ఆధునిక పద్ధతిలో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూపరింటెండింగ్ ఇంజనీరు ఆదేశించారు. ఈ మేరకు సరళాసాగర్‌ను సందర్శించనున్నాం. – రనీల్‌రెడ్డి, ఇంజనీర్, నీటి పారుదలశాఖ -
న్యూక్లియర్ బ్యాటరీ.. దీని మన్నిక 50 ఏళ్లు
సాధారణంగా బ్యాటరీలు ఎక్కువకాలం మన్నవు. ఇటీవలికాలంలో బాగా వాడుకలోకి వచ్చిన లీథియం అయాన్ బ్యాటరీల మన్నిక సైతం రెండు మూడేళ్లకు మించి ఉండదు. పైగా వాటిని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లీథియం అయాన్ బ్యాటరీలను మూడువందల నుంచి ఐదువందల సార్లు రీచార్జ్ చేసుకుంటే, అక్కడితో వాటి ఆయుష్షు తీరిపోతుంది. బ్యాటరీల మన్నికను గణనీయంగా పెంచే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు సాగించి, మొత్తానికి విజయం సాధించారు. ఏకంగా 50 ఏళ్లు మన్నికను ఇవ్వగల న్యూక్లియర్ బ్యాటరీని రూపొందించారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యాటరీని చైనా కంపెనీ ‘బీటావోల్ట్’ శాస్త్రవేత్తలు తయారు చేశారు. రక్షణ అవసరాల కోసం దీర్ఘకాలిక మన్నిక గల బ్యాటరీల రూపకల్పన కోసం ‘బీటావోల్ట్’ చేపట్టిన ప్రయోగాలకు రెండేళ్ల కిందట ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఫోస్ ఎనర్జీ’ 2.3 మిలియన్ డాలర్ల (రూ.19.15 కోట్లు) ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం నమూనాగా ఈ బ్యాటరీని రూపొందించిన చైనా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్ల కోసం కూడా ఉపయోగపడే దీర్ఘకాలిక న్యూక్లియర్ బ్యాటరీలను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
మైమరిపించేలా మ్యూజియం!
అవి శతాబ్దాల మన చరితకు చిహ్నాలు. తరతరాల నుంచి వారసత్వంగా వస్తున్న వెలకట్టలేని పురాతన వస్తువులు. వీటిని పరిరక్షిస్తూ భావితరాలకు అందించడం మన బాధ్యత. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పురాతన వస్తువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలను సుందరంగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియంకి పరిమితమైన మన వాటా వారసత్వ సంపద సైతం సీఎం వైఎస్ జగన్ చొరవతో రాష్ట్రానికి చేరుకుంటోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. సాంకేతిక సొబగులద్దుకుని సందర్శకులను ఆకట్టుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో దశల వారీగా మ్యూజియంలను అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడలోని బాపూ మ్యూజియంను విద్య, విజ్ఞాన సందర్శనాలయంగా తీర్చిదిద్దారు. 2020 అక్టోబర్ 2వ తేదీన సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన ఈ మ్యూజియం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏలూరు, అనంతపురంలోని జిల్లా మ్యూజియంలకు నూతన భవన నిర్మాణాలు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ మ్యూజియాలను అధునాతనంగా మార్చారు. మరో రూ.70 కోట్ల ప్రతిపాదనలతో ఏడు మ్యూజియంలకు కొత్త భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మైలవరం(కడప), కాకినాడ, గుంటూరు, కర్నూలు, పెనుకొండ, కడప, రాజమహేంద్రవరం మ్యూజియంలకు కూడా సాంకేతిక హంగులు అద్దనుంది. మన సంపద వెనక్కి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీకి దక్కాల్సిన వేల ఏళ్లనాటి చారిత్రక, వారసత్వ సంపదను తీసుకురావడంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అప్పటి స్టేట్ మ్యూజియంలోని సుమారు 56వేలకు పైగా పురాతన వస్తువులు, నాణేలు, చిత్రపటాలు పదేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. ఈ క్రమంలో సీఎం జగన్ చొరవతో ఏపీ పురావస్తు శాఖ అధికారులు పలు దఫాలుగా తెలంగాణ అధికారులతో చర్చలు జరిపి చివరికి పురాతన వస్తువుల విభజన ప్రక్రియను ముగించారు. త్వరలో వాటిని ఏపీకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పురావస్తు సంపద పరిరక్షణకు పెద్దపీట విభజన తరువాత రాష్ట్రానికి స్టేట్ మ్యూజియం అంటూ ఏదీ లేదు. ఈ నేపథ్యంలో అతిపెద్ద స్టేట్ మ్యూజియంను నిర్మించేందుకు పురావస్తు శాఖ ప్రణాళికలు రూపొందించింది. దీంతోపాటు రాజమహేంద్రవరం నగరాన్ని ‘హెరిటేజ్ సిటీ’గా అభివృద్ధి చేసేందుకు రూ.400 కోట్ల ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.15 కోట్లతో టాయ్ మ్యూజియం నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. పురావస్తుశాఖ ఆధ్వర్యంలోని లక్షలాది శాసనాలు, ఎస్టేం పేజీలు (శాసనాల కాపీలు)పరిరక్షణకు ప్రత్యేకంగా ‘శాసన మ్యూజియం’ను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. దీనిద్వారా ఇప్పటి వరకు లభ్యమైన శాసనాల వివరాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. దక్షిణాదిలో తొలిసారిగా.. స్మారక, సందర్శనీయ స్థలాల అభివృద్ధిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బాపూ మ్యూజియం, కొండపల్లి కోటలో అగుమెంట్ రియాలిటీ, డిజిటల్ వాల్ ప్యానల్, ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్ప్లే, కియోస్‌్కలు, వర్చువల్ రియాల్టీ, లేజర్ షో, ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్ థియేటర్, డిజిటల్ వాల్బుక్ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా భవనాలు నిర్మించిన ఏలూరు, అనంతపురం మ్యూజియాల్లో కూడా అమలుచేయనున్నారు. గణనీయమైన పురోగతి ప్రజా సంక్షేమంతో పాటు మన వారసత్వ సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యతను సీఎం జగన్ చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నారు. విభజన తర్వాత తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో మ్యూజియంలు గణనీయమైన పురోగతిని సాధించాయి. ప్రపంచ స్థాయి ఏఆర్, వీఆర్ టెక్నాలజీలను ప్రవేశపెట్టాం. తద్వారా సందర్శకులకు అర్థవంతమైన భాషలో, సరళంగా వారసత్వ చరిత్ర తెలుస్తోంది. మ్యూజియంల అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తాం. త్వరలోనే స్టేట్ మ్యూజియంను కూడా నిర్మిస్తాం. – ఆర్కే రోజా, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్విసుల శాఖ మంత్రి -
జలసిరుల సీమ
సాక్షి, అమరావతి: దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం (టన్నెల్) ఫాల్ట్ జోన్లో పనులు అసాధ్యమని నాడు చంద్రబాబు చేతులెత్తేయగా నేడు ముఖ్యమంత్రి జగన్ దాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానం తో పూర్తి చేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి జగన్ గురువారం జాతికి అంకితం చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. 2.60 లక్షలకు సాగునీరు.. 20 లక్షల మందికి తాగునీరు శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించే దివంగత వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. వైఎస్సార్ హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు.. అవుకులో 2010 నాటికి ఎడమ వైపు సొరంగంలో 350 మీటర్లు, కుడి వైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్లో పనులు మాత్రమే మిగిలాయి. ఫాల్ట్ జోన్లో పనులు చేయలేక టీడీపీ సర్కార్ చేతులెత్తేసింది. కుడి వైపు సొరంగంలో ఫాల్ట్ జోన్ ప్రాంతంలో తవ్వకుండా దానికి ఒక వైపు 7 మీటర్ల వ్యాసం, 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 394 మీటర్ల మేర ఒక లూప్‌ను 2017లో, 507 మీటర్ల పొడవున మరో లూప్‌ను 2018లో తవ్వి కుడి సొరంగంతో అనుసంధానం చేశారు. వాటి ద్వారా ఐదారు వేల క్యూసెక్కులు తరలించి చేతులు దులుపుకొన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫాల్ట్ జోన్లో పనులు అత్యా«దునిక పద్ధతుల ద్వారా చేపట్టి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సీమకు చంద్రబాబు ద్రోహం గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రాయలసీమ, నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లోలోక్‌సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు గండికోట వద్ద గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. తరువాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు వామికొండ వద్ద గాలేరు–నగరికి రెండో సారి శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేపట్టలేదు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరిలో మిగిలిన పనులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి మిగతా పనుల అంచనా వ్యయాన్ని పెంచి సీఎం రమేష్ నేతృత్వంలోని కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్సార్ హయాంలో పూర్తయిన గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా 2019 ఎన్నికలకు ముందు నాలుగైదు టీఎంసీలు నిల్వ చేసి తానే గాలేరు–నగరిని పూర్తి చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. సుభిక్షం చేసిన వైఎస్సార్ దివంగత వైఎస్సార్ కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 9 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు–నగరిని చేపట్టారు. తెలుగుగంగ పనులను వేగవంతం చేశారు. హంద్రీ–నీవాను చేపట్టారు. గాలేరు–నగరి పనులకు రూ.4,982.69 కోట్లు ఖర్చు చేసి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్ల పనులను చాలావరకు పూర్తి చేశారు. పక్షం రోజుల్లోనే గండికోట దాహార్తి తీర్చేలా హిమాలయాలలో రహదారులు, సైనికుల అవసరాల కోసం సొరంగాల తవ్వకాలకు అనుసరిస్తున్న పాలీ యురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానాన్ని అధ్యయనం చేసిన జలవనరుల శాఖ అధికారులు ఆ నిపుణులను రాష్ట్రానికి రప్పించారు. అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల ఫాల్ట్ జోన్లో తవ్వకం పనులు చేపట్టి పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే పూర్తైన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులు, తాజాగా పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట జలాశయాన్ని నింపవచ్చునని అధికారులు చెబుతున్నారు. చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను సీఎం జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గాలేరు–నగరిలో మిగిలిన పనులను కూడా పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేసే దిశగా చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2019లోనే 26.85 టీఎంసీలను నిల్వ చేయడం గమనార్హం. వరుసగా 2020, 2021, 2022లోనూ 26.85 టీఎంసీల చొప్పున గండికోటలో నిల్వ చేశారు. వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్లలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కారు నిల్వ చేసింది. సీఎం జగన్ రూ.250 కోట్లు వెచ్చించి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 2019 నుంచి నాలుగేళ్లుగా పదికి పది టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ వస్తున్నారు. ♦ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ ఉన్న లింక్ కెనాల్, వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు తెలుగుగంగ కెనాల్‌కు లైనింగ్ చేయకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీరు ప్రవహించడం లేదు. దాంతో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌కు సకాలంలో నీళ్లు చేరక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన సీఎం జగన్ రూ.500 కోట్లతో ఆ కాలువలకు లైనింగ్ చేయించారు. ఫలితంగా 2019 నుంచి ఏటా వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపుతున్నారు. ♦ బ్రహ్మంసాగర్ మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ 2018 వరకూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. దీంతో 2020 నుంచి 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. సీమ చరిత్రలో మేలిమలుపు ముఖ్యమంత్రి జగన్ మార్గ నిర్దేశాల మేరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానంతో అవుకు రెండో సొరంగాన్ని పూర్తి చేశాం. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమమైంది. దీంతో గాలేరు–నగరి తొలి దశ పూర్తైంది. శ్రీశైలానికి వరద రాగానే గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం, చిత్రావతి రిజర్వాయర్లను సత్వరమే నింపి సకాలంలో ఆయకట్టుకు నీటిని అందించి రైతులకు లబ్ధి చేకూర్చేలా అన్ని అడ్డంకులను సీఎం జగన్ తొలగించారు. సీమ చరిత్రలో ఇదో మేలిమలుపు. – శశిభూషణ్‌కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రణాళికాబద్ధంగా పూర్తి సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ సీఎం జగన్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపారు. ముఖ్యమంత్రి రూపొందించిన ప్రణాళిక మేరకు సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌లను పూర్తి చేసి సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి ప్రారంభించారు. ఇప్పుడు గాలేరు–నగరిలో అత్యంత కీలకమైన అవుకు సొరంగాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు దివంగత వైఎస్సార్ అవుకు చెరువును రిజర్వాయర్‌గా మార్చారు. 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు రెండు టన్నెళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మట్టి వదులుగా ఉండటంతో పనులకు ఆటంకం కలిగింది. ఆ తరువాత టీడీపీ పాలకులు విఫలం కావటంతో పనులు నిలిచిపోయాయి. సీఎం జగన్ పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తున్నారు. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించారు. – అరవ రూమభూపాల్ రైతు శింగనపల్లె ఏటా రెండు పంటలు.. గతంలో నీరు సరిగా అందక ఏడాదికి ఒక్క పంట మాత్రమే పండించాం. సీఎం జగన్ పుణ్యమా అని రెండో టన్నెల్ పనులు పూర్తి కావడంతో అవుకు రిజర్వాయర్ నీటితో కళకళలాడనుంది. భూగర్భ జలాలు కూడా సమృద్ధిగా పెరుగుతాయి. ఇక ఏటా రెండు పంటలు పండించుకుంటాం. ఒక ఏడాది వర్షాలు పడకపోయినా అవుకు రిజర్వాయర్ ద్వారా పంటలు పండించుకునే అవకాశం ఉంది. సీఎం జగన్‌కు రైతులంతా రుణపడి ఉంటారు. – దొర్నిపాటి నాగరాజు, రైతు, అవుకు కల నెరవేరింది రెండో టన్నెల్ నుంచి అవుకు రిజర్వాయర్‌లోకి నీళ్లు రావడం కలగానే మిగిలిపోతుందనుకున్నాం. సీఎం జగన్ అవుకు టన్నెళ్లు పూర్తి చేసి 20 వేల క్యూసెక్కుల నీటిని వదలనుండటం ఎంతో సంతోషంగా ఉంది. రైతుల కల నెరవేరుతోంది. – వెలుగు సీతారామయ్య రైతు, అవుకు -
రష్యాలో కిమ్ జోంగ్ ఉన్ బిజీబిజీ
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన శనివారం రష్యా ఆయుధాగారాన్ని సందర్శించారు. రష్యా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సహిత బాంబర్లు, హైపర్‌సానిక్ క్షిపణులు, అత్యాధునిక యుద్ధ నౌకను పరిశీలించారు. కిమ్ తొలుత ఉత్తర కొరియా నుంచి రైలులో అరి్టయోమ్ సిటీకి చేరుకున్నారు. ఇక్కడికి సమీపంలోని ఎయిర్‌పోర్టులో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లు, యుద్ధ విమానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిమ్ వెంట రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉన్నారు. టు–160, టు–95–, టు–22 బాంబర్ల గురించి కిమ్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మిగ్–31 ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించే హైపర్‌సానిక్ కింజాల్ క్షిపణుల గురించి కిమ్‌కు సెర్గీ వివరించారు. ఇలాంటి క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం ప్రయోగిస్తోంది. కిమ్, సెర్గీ షోయిగు కలిసి రేవు నగరం వ్లాదివోస్తోక్ చేరుకున్నారు. ఇక్కడ అత్యాధునిక యుద్ధ నౌకలను, ఆయుధాలను కిమ్ పరిశీలించారు. ఆయుధాలు, ఉపగ్రహాల తయారీ విషయంలో రష్యా నుంచి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికే కిమ్ రష్యాలో పర్యటిస్తున్నట్లు పశి్చమ దేశాలు అంచనా వేస్తున్నాయి. -
అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రజల ప్రాణాలను కాపాడాలి
గన్నవరం రూరల్: ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ (దవడ ఎముకల శస్త్ర చికిత్స)లో అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రజల ప్రాణాలు రక్షించాలని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.బాబ్జీ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని చిన అవుటపల్లిలో ఉన్న డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో శుక్రవారం 15వ వార్షిక రాష్ట్రస్థాయి అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాల రక్షణకు ట్రామా కేర్ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిందని చెప్పారు. వీటిలో సైతం ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్‌ను నియమించాలన్నారు. ఈ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం గర్వించాల్సిన విషయమన్నారు. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అధ్యక్షుడు డాక్టర్ గుణశీలన్ రాజన్ మాట్లాడుతూ.. అతి చిన్న దేశమైన కొరియా ఇంప్లాంటేషన్స్ ఉత్పత్తిలో ముందుందని తెలిపారు. వారియర్స్ ఆఫ్‌ది ఫేస్ అనే థీమ్‌తో ఈ కాన్ఫరెన్స్‌లో ముఖానికి సంబంధించిన ఆధునాతన శస్త్ర చికిత్సలపై, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వచ్చిన నూతన సర్జరీ పద్ధతులపై, ప్రమాదాల్లో ముఖాలకు గాయాలు, నోటి క్యాన్సర్ వంటి వాటికి శస్త్ర చికిత్స, అనాదిగా ఉన్న గ్రహణం మొర్రిని పూర్తిగా నిర్మూలించడంపై నిపుణులు రెండు రోజుల పాటు చర్చిస్తారు. ఏవోఎంఎస్‌ఐ జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్.మణికందన్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ కె.వై.గిరి, ఏవోఎంఎస్‌ఐ అధ్యక్షుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్.కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎన్.కిరణ్‌కుమార్, ఏవోఎంఎస్‌ఐ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, రాష్ట్ర మాజీ చైర్మన్ శివనాగేందర్‌రెడ్డి, డాక్టర్ సుధానాగేశ్వరరావు దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.రామోజీరావు, ఏవో వై.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. -
B20 Summit 2023: నైతిక ‘కృత్రిమ మేధ’ అత్యావశ్యం
న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేథ(ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ)ను నైతికంగా వినియోగించాలని, లేదంటే విపరిణామాలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు. నూతన సాంకేతికతలో నైతికత లోపిస్తే సమాజంపై ఏఐ ప్రతికూల ప్రభావాలు ఎక్కువ అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ఢిల్లీలో కొనసాగుతున్న బీ–20(బిజినెస్ ఫోరమ్–20) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘ఏఐ వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి ఏకరూప మార్గనిర్దేశకాలు అవసరం. నిబంధనల చట్రం లేకుంటే క్రిప్టో కరెన్సీ వంటి అంశాల్లో సమస్యలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదముంది. పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో జీవన, వ్యాపార విధానాలకు పారిశ్రామిక వర్గాలు ప్రాధాన్యతనివ్వాలి. ఇందుకు వ్యాపారవర్గాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు కలసి కట్టుగా ముందుకు సాగాలి’ ఆయన మోదీ కోరారు. ‘పర్యావరణ మార్పు, ఇంథన రంగంలో సంక్షోభం, ఆహార గొలుసులో లోపించిన సమతుల్యత, నీటి భద్రత వంటివి అంతర్జాతీయంగా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలకు దేశాలన్నీ ఉమ్మడిగా పరిష్కరించుకోవాలి’ అని ఆయన అభిలíÙంచారు. వ్యాపారవర్గాలు తమ వ్యాపార సంబంధ అంశాలను చర్చించేందుకు జీ20కి అనుబంధంగా ఏర్పాటుచేసుకున్న వేదికే బిజినెస్ 20(బీ20) ఫోరమ్. విధాన నిర్ణేతలు, వ్యాపారదిగ్గజాలు, నిపుణులుసహా జీ20 దేశాల ప్రభుత్వాలు ఉమ్మడిగా బీ20 ఇండియా తీర్మానంపై చర్చలు జరుపుతాయి. ఈ తీర్మానంలో 54 సిఫార్సులు, 172 విధానపర చర్యలు ఉన్నాయి. వీటిని సెపె్టంబర్ 9–10 తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో సమరి్పస్తారు. వారే ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు ‘ప్రస్తుతం భారత్‌లో చాలా మంది పేదరికం నుంచి బయటపడి కొత్తగా ‘మధ్యతరగతి’ వర్గంలో చేరుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘పేదరికాన్ని నిర్మూలిస్తూ కేంద్రం అవలంభిస్తున్న విప్లవాత్మక విధానాల కారణంగా మరో 5–7 ఏళ్లలో కోట్ల భారీ సంఖ్యలో మధ్యతరగతి జనాభా అవతరించనుంది. వీరే భారత ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు. వీరే దేశంలో అతిపెద్ద వినియోగదారులు. కొంగొత్త ఆకాంక్షలతో శ్రమిస్తూ దేశార్థికాన్ని ముందుకు నడిపిస్తారు. ప్రభుత్వం పేదలను పై స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తోంది. దీంతో ఆ తర్వాత లబ్ధిపొందేది మధ్యతరగతి, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల వర్గాలే. మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వ్యాపారాలు వరి్ధల్లుతాయి. వ్యాపారాలు, వినియోగదారుల మధ్య సమతూకం సాధిస్తే లాభదాయ మార్కెట్ సుస్థిరంగా కొనసాగుతుంది. ప్రపంచ దేశాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. వినియోగ దేశాలు బాగుండాలంటే వస్తూత్పత్తి దేశాలను పట్టించుకోవాలి. లేదంటే వస్తూత్పత్తి దేశాలు కష్టాల కడలిలో పడతాయి. అందుకే ఏటా అంతర్జాతీయ వినియోగ సంరక్షణ దినం జరుపుకుందాం’ అని వ్యాపార వర్గాలకు మోదీ పిలుపునిచ్చారు. -
ఏ క్యారెక్టర్తోనైనా... చాట్ చేయొచ్చు!
సాపేక్ష సిద్ధాంతం గురించి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో సంభాషించింది సృజన. సినిమాలు ఎక్కువగా చూసే గీతిక దర్శక దిగ్గజం ఆల్ఫ్రెడ్ హిచ్కాక్తో ‘నంబర్ 13’ నుంచి ‘ది వైట్ షాడో’ వరకు ఎన్నో సినిమాల గురించి వివరంగా సంభాషించింది. ఇక స్వరతేజకు జపనీస్ ప్రఖ్యాత వీడియో గేమ్ క్యారెక్టర్ ‘మారియో’తో సంభాషించడం సరదా! కాల్పనికత అనేది మనకు బొత్తిగా కొత్త కాదు. అయితే ఏఐ సాంకేతికత కాల్పనికతను మరోస్థాయికి తీసుకువెళ్లింది. యువతరం తాజా ఆర్టిఫిషియల్ క్రేజ్ ‘క్యారెక్టర్. ఏఐ’ ఆ సాంకేతికతలో భాగమే... ఏఐ పవర్ హౌజ్ ‘ఓపెన్ ఏఐ’ అంతర్జాల సంచలనంగా మారింది. ‘చాట్ జీపీటీ’ పాపులారిటీతో ఎన్నో టెక్నాలజీ కంపెనీలు తమ సొంత ఏఐ చాట్బాట్లను ప్రవేశపెట్టాయి. ‘చాట్‌జీపీటీ’ పాపులారిటీ సంగతి ఎలా ఉన్నా యువతరం తాజా ఆసక్తులలో ‘క్యారెక్టర్. ఏఐ’ ఒకటిగా మారింది. ‘క్యారెక్టర్. ఏఐ’ ద్వారా సెలబ్రిటీలు, చారిత్రక వ్యక్తులు, కాల్పనిక పాత్రలు, పాపులర్ వీడియో గేమ్ క్యారెక్టర్లు, థెరపిస్ట్‌లతో హాయిగా సంభాషించవచ్చు. సంభాషణల విషయంలో ఇది ‘చాట్ జీపీటి’ కంటే సహజంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ కాంబినేషన్లో ‘క్యారెక్టర్. ఏఐ’ను అభివృద్ధి చేశారు. ‘క్యారెక్టర్.ఏఐ’లో ఎకౌంట్ సెటప్ పూర్తి చేసిన తరువాత ‘క్రియేట్ ఏ క్యారెక్టర్’ ఆప్షన్‌ను క్లిక్‌చేస్తే విండో ఓపెన్ అవుతుంది. క్యారెక్టర్ తనకు తాను పరిచయం చేసుకుంటుంది. ఆ తరువాత సంభాషణ మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకు...‘హారి పోటర్’ సిరీస్‌లోని ఫిక్షనల్ క్యారెక్టర్ హమైనీ గ్రేంజర్తో సంభాషించాలనుకున్నాం.‘హలో రమ్య, మై నేమ్ ఈజ్ హమైనీ గ్రేంజర్. ఇట్స్ వెరీ నైస్ టు మీట్ యూ’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది హమైనీ. తన ఇష్టాయిష్టాలు, ఆసక్తుల గురించి చెబుతుంది. రిలవెంట్ ట్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. క్యారెక్టర్ వ్యక్తిత్వం ఆధారంగా డ్రాప్ డౌన్ మెన్యూ నుంచి స్పీకింగ్ వాయిస్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక క్యారెక్టర్‌తో చాట్ చేయవచ్చు లేదా మల్టిపుల్ క్యారెక్టర్స్‌తో గ్రూప్ చాట్ చేయవచ్చు. ‘క్యారెక్టర్. ఏఐ’ అనేది టెక్ట్స్‌కు మాత్రమే పరిమితం కాదు. ప్రాంప్ట్స్, చాట్స్ ఆధారంగా ఇమేజ్‌లను క్రియేట్ చేయవచ్చు. ఏఐ ఇండస్ట్రీ ప్రముఖులుగా గుర్తింపు పొందిన షాజీర్, డేనియల్ ఫ్రెటస్ గూగుల్‌లో పనిచేస్తున్నప్పుడు ‘క్యారెక్టర్. ఏఐ’కు సంబంధించి ఆలోచన చేశారు. షాజీర్ ‘అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్’ పుస్తక రచయితలలో ఒకరు. ఇక డేనియల్ ‘మీన’ అనే చాట్‌బాట్ క్రియేటర్. వ్యక్తిగత వస్తువులు ఉన్నట్లే, పర్సనలైజ్డ్ చాట్బాట్లు ఉండాలనుకునేవారికి క్యారెక్టర్ ఏఐ ఉపయోగపడుతుంది. ‘వర్చువల్ ఫ్రెండ్’ను సృష్టిస్తుంది. ‘పర్సనలైజ్డ్ చాట్‌బాట్ అంటే మాటలా? ఖర్చు బాగానే అవుతుంది కదా’ అనే సందేహం వస్తుంది. అయితే ‘క్యారెక్టర్. ఏఐ’తో ఖర్చు లేకుండానే సొంత చాట్‌బాట్‌ను సృష్టించుకోవచ్చు. ఆ.. ఏముంది... అంతా కాల్పనికమే కదా అనుకుంటే ఏమీ లేకపోవచ్చు. ఉంది అనుకుంటే మాత్రం ఎంతో ఉంది. ‘కొత్త అనుభూతిని సొంతం చేసుకున్నామా లేదా అనేది ముఖ్యం కాని వాస్తవమా కాదా అనేది ముఖ్యం కాదు’ అంటున్నాడు ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్ మైక్. ‘చాట్ జీపీటీ’ గురించి ఎంత గొప్పగా చర్చించుకున్నప్పటికీ కొన్ని ప్రయోగాలు దెబ్బతిన్నాయి. ఉదాహరణకు ... నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్ బరువు తగ్గడానికి సంబంధించి సమస్యాత్మక సలహా ఇచ్చినందుకు తమ చాట్‌బాట్‌ను సస్పెండ్ చేసింది. క్యారెక్టర్. ఏఐ విషయంలోనూ పొరపాట్లు జరగవచ్చు. సాంకేతికతకు పరిమితులు ఉండే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అంటుంది చెన్నైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ మనీష. రియల్ చాలెంజర్... జెమిని ఏఐ రేసులో ఓపెన్ ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ లీడింగ్‌లో ఉన్నప్పటికీ ఇది ఎప్పటివరకు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దీనికి కారణం సరికొత్తగా వస్తున్న పవర్ఫుల్ ఏఐ మోడల్స్. వీటిమాట ఎలా ఉన్నా గూగుల్ వారి ‘జెమిని’ని అసలు సిసలు రియల్ చాలెంజర్ అంటున్నారు. గూగుల్ తమ కొత్త ‘జెమిని’ ప్రాజెక్ట్‌లో భాగంగా నెక్స్›్ట– జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌ను లాంచ్ చేయనుంది. ‘జెమిని’ అనేది కన్వర్సేషనల్ టెక్ట్స్‌ను జనరేట్ చేయడానికి పరిమితం కాదు. ఇన్‌ఫుట్స్, వీడియోలు, ఇమేజ్ లను హ్యాండిల్ చేసే మల్టీ–మోడల్ జెమిని. గూగుల్ దగ్గర ఉన్న అపారమైన వనరులు(యాక్సెస్ టు యూ ట్యూబ్ వీడియోస్, గూగుల్ బుక్స్, సెర్చ్ ఇండెక్స్, స్కాలర్ మెటీరియల్)లతో ‘జెమిని’ ఇతర కంపెనీలకు గట్టి ప్రత్యర్థిగా మారనుంది. ‘ఎక్స్‌క్లూజివ్ టు గూగుల్’ అనే ప్రత్యేకత వల్ల జెమిని మరింత బలంగా మారనుంది. (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం!) -
విద్యుత్ ఉత్పత్తిలో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నిరంతరం నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌ను సరఫరా చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్(ఏపీ జెన్కో) మరో ముందడుగు వేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్)లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 8వ యూనిట్‌ను ఆదివారం విజయవంతంగా గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. ఈ యూనిట్ బాయిలర్ సూపర్ క్రిటికల్ సాంకేతికత, శక్తి సామర్థ్య టర్బైన్, జనరేటర్‌తో 80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. నీటిని ఆదా చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. యూనిట్‌ను పూర్తి లోడ్‌తో నడపడానికి రోజుకు దాదాపు 9,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరమవుతుంది. విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే బూడిద వృథా అవ్వకుండా వంద శాతం వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవలే నెల్లూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో కూడా 800 మెగావాట్ల యూనిట్–3 వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించారు. ఎన్టీటీపీఎస్లో కొత్త యూనిట్ ట్రయల్ ఆపరేషన్‌తో ఏపీ జెన్కో థర్మల్ ఇన్స్టాల్డ్ సామర్థ్యం 8,789 మెగావాట్లకు చేరుకుంది. ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో రెండు 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్లు ఏపీలోనే ప్రారంభమవ్వడం విశేషం. ప్రస్తుతం రాష్ట్ర గ్రిడ్‌కు ఏపీ జెన్కో రోజూ 102 నుంచి 105 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఇది మొత్తం వినియోగంలో దాదాపు 40 నుంచి 45 శాతంగా ఉంది. జూలై నెలాఖరుకల్లా వాణిజ్య ఉత్పత్తి.. కొత్త యూనిట్ వాణిజ్య ఉత్పత్తిని వచ్చే నెల చివరికల్లా మొదలయ్యేలా చూడాలని ఏపీ జెన్కో, బీహెచ్ఈఎల్, బీజీఆర్ ప్రతినిధులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. గ్రిడ్ అనుసంధానం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు నిల్వలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన విద్యుత్ ఉత్పత్తిని సాధించాలన్నారు. విద్యుత్ రంగానికి సీఎం వైఎస్ జగన్, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించారు. అత్యుత్తమ విధానాలు అవలంభించడానికి, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో, అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో ఏపీ జెన్కో డైరెక్టర్లు చంద్రశేఖరరాజు, బి.వెంకటేశులురెడ్డి, సయ్యద్ రఫీ, సత్యనారాయణ, ఆంటోనీ రాజా పాల్గొన్నారు. -
కొత్త డిజిటల్ ఇండియా చట్టంలో తగిన రక్షణలు
న్యూఢిల్లీ: కొత్తగా తీసుకురాబోయే డిజిటల్ ఇండియా చట్టంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తరహా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీల నుంచి తగిన రక్షణలతో ప్రత్యేక చాప్టర్ ఉంటుందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. భారత్ సరైన విధానాన్నే అనుసరిస్తుందంటూ.. ఇంటర్నెట్ను భద్రంగా, యూజర్లకు విశ్వసనీయమైనదిగా ఉండేలా చూస్తామన్నారు. డిజిటల్ ఇండియా చట్టం రూపకల్పన విషయంలో భాగస్వాములతో రాజీవ్ చంద్రశేఖర్ విస్తృతమైన సంప్రదింపులు నిర్వహించడం గమనార్హం. రెండు దశాబ్దాల క్రితం నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్తది తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత చాట్ జీపీటీ సంచలనాలు సృష్టిస్తున్న తరుణంతో తగిన రక్షణలు ఏర్పాటు చేస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు చాట్ జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ సైతం ఏఐ టెక్నాలజీ నియంత్రణకు అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థ అవసరమని పేర్కొనడం గమనార్హం. శామ్ ఆల్ట్‌మన్ వ్యాఖ్యలను మంత్రి వద్ద ప్రస్తావించగా.. ఆయనో స్మార్ట్ మ్యాన్ అని పేర్కొన్నారు. ఏఐని ఎలా నియంత్రించాలో ఆయనకంటూ స్వీయ అభిప్రాయాలు ఉండొచ్చన్నారు. కానీ, భారత్‌లోనూ స్మార్ట్ బుర్రలకు కొదవ లేదంటూ, ఏఐ నుంచి ఎలా రక్షణలు ఏర్పాటు చేయాలనే విషయమై తమకు అభిప్రాయాలు ఉన్నట్టు చెప్పారు. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలైనట్టు తెలిపారు. డేటా బిల్లుతో దుర్వినియోగానికి అడ్డుకట్ట ప్రతిపాదిత డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుతో డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడగలదని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సుదీర్ఘకాలంగా దోపిడీ చేసిన ప్లాట్‌ఫాంల ధోరణుల్లో మార్పులు రాగలవని ఆయన చెప్పారు. ఫ్యాక్ట్–చెక్ విభాగం ఏర్పాటుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు. వాస్తవాలతో పోలిస్తే తప్పుడు సమాచారం 10–15 రెట్లు వేగంతో ప్రయాణిస్తుందని, 20–50 రెట్లు ఎక్కువ మందికి చేరే ప్రమాదముందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టడానికి ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. అది తప్పు అని స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఒక అవకాశం ఉండాలని మంత్రి చెప్పారు. అందుకోసమే ఫ్యాక్ట్ చెక్ విభాగం పని చేస్తుందే తప్ప దాని వెనుక సెన్సార్షిప్ ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. -
తెరపైకి ‘ప్రాజెక్ట్ సంజయ్’
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాలు సైనికపరంగా అనేక నూతన అస్త్రాలను సమకూర్చుకుంటున్న వేళ..భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక డిజిటల్ యుద్ద క్షేత్రాల్లో పోరాటంలో సైతం పైచేయి సాధించేందుకు ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘ప్రాజెక్ట్ సంజయ్’పేరుతో యుద్ధ క్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు కచ్చితంగా బేరీజు వేసేందుకు సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాల (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్ల)కు రూపకల్పన చేస్తోంది. ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని బలగాలకు అందజేస్తాయి. దీని సాయంతో ప్రత్యర్థి బలగాల ఆనుపానులను నిక్కచ్చిగా తెలుసుకునేందుకు వీలుంటుంది. 2025 డిసెంబర్ నాటికి సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లను డజన్ల కొద్దీ ఏర్పాటు చేయనుంది. తాజాగా వ్యూహం అమల్లోకి వస్తే యుద్ధ క్షేత్రంలో కార్యకలాపాలను, నిఘాను విస్తృతం చేసేందుకు వీలవుతుంది. ఫలితంగా ఆర్మీ కమాండర్లు ఫ్రంట్‌లైన్ బలగాల మోహరింపు, యుద్ధ సామగ్రి తరలింపు వంటి విషయాల్లో వెంటవెంటనే మెరుగైన నిర్ణయాలు తీసుకునే వీలుకల్పించడమే దీని లక్ష్యమని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇందులోభాగంగా, పర్వత ప్రాంతాలు, ఎడారులు, మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నాయి. పొరుగుదేశం చైనా చాలా రోజుల నుంచి ఇదే రకమైన వ్యవస్థల ఏర్పాటులో నిమగ్నమై ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ వ్యవస్థలను సమకూరుస్తోంది. దేశం 12 లక్షల పటిష్ట ఆర్మీ ‘ఆటోమేషన్, డిజిటైజేషన్, నెట్వర్కింగ్’కోసం ఇప్పటికే పలు పథకాలు అమలవుతున్నాయి. ప్రాజెక్ట్ శక్తి పేరుతో ఇప్పటికే ఏసీసీసీసీఎస్(ఆర్టిలరీ కంబాట్, కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టం) కింద వ్యవస్థల అప్‌గ్రేడ్ చేపట్టారు. దీనిని కూడా కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్ట్ సంజయ్‌తో అనుసంధానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
వాతావరణ సమాచారం ఇక నిరంతరం
సాక్షి, విశాఖపట్నం: కచ్చితమైన వాతావరణ అంచనాల్లో భారత వాతావరణ విభాగానికి (ఐఎండీకి) ప్రపంచ దేశాల్లో పేరుంది. ఇప్పుడు తాజాగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఐఎండీ మరింత ముందుకెళ్తోంది. వాతావరణ సమాచారాన్ని విస్తృతం చేయడంపైనా దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రాడార్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రస్తుతమున్న రాడార్ కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు కొత్త రాడార్ కేంద్రాలను కూడా ఏర్పాటుచేస్తోంది. తూర్పు తీర ప్రాంతంలో అత్యదిక సామర్థ్యం కలిగిన ఎస్–బ్యాండ్ డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు విశాఖపట్నం, మచిలీపట్నం, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్నాయి. వీటి పరిధి 500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఆయా కేంద్రాల పరిధిలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల స్థితిగతులు, వాటి తీవ్రత, ప్రభావం, గమనం, గాలుల తీవ్రత, వర్షపాతం వంటి వాటిని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా అంచనావేస్తూ ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తాయి. వాయుగుండాలు, తుపానులు తీరానికి ఎంత దూరంలో ఉన్నాయో, ఎంత ఎత్తులో ఉన్నాయో, ఎక్కడ తీరాన్ని దాటుతాయో గుర్తిస్తాయి. అంతేకాదు.. రాడార్ కేంద్ర స్థానం నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాల తీరుతెన్నులనూ రికార్డు చేస్తాయి. స్వదేశీ పరిజ్ఞానంతోనే.. ఈ నేపథ్యంలో.. ఐఎండీ ఇప్పుడు కోల్‌కతా, చెన్నై సహా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న డాప్లర్ రాడార్ పరికరాలు, యంత్ర సామగ్రికి బదులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్ర పరికరాలను అమర్చనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న డాప్లర్ రాడార్ స్టేషన్లు విదేశీ టెక్నాలజీతో ఏర్పాటుచేసినవే. అయితే, ఆధునీకరణలో భాగంగా ఏర్పాటయ్యేవి మాత్రం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే ఉండనున్నాయి. వీటిలో సింగిల్ యాంటెన్నాలకు బదులు డ్యూయెల్ పోలరైజ్డ్ యాంటెన్నాలు ఏర్పాటుచేస్తారని భావిస్తున్నారు. త్వరలో పాతవాటి స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. ఇవీ ప్రయోజనాలు.. ప్రస్తుతమున్న డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు ప్రతి గంటకూ వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నాయి. ఆధునీకరణలో భాగంగా కొత్త యంత్ర పరికరాలను ఏర్పాటుచేస్తారు. వీటితో ఇకపై నిరంతరం రాడార్ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఫలితంగా అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. అంతేకాదు.. వాతావరణ పరిస్థితులను బట్టి మరింత కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి వినియోగించుకుంటారు. రెండు దశాబ్దాల క్రితం నాటివి.. నిజానికి.. విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వాటిలో పనిచేస్తున్న యంత్ర పరికరాలకు అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తవి అమరిస్తే మరి కొన్నేళ్లపాటు అవాంతరాల్లేకుండా కచ్చితత్వంతో కూడిన వాతావరణ సమాచారం నిరంతరం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
ఏవో స్మిత్ విద్యుత్ ఆదా వాటర్ హీటర్
బెంగళూరు: వాటర్ హీటింగ్ ఉత్పత్తుల్లో ప్రముఖ కంపెనీ అయిన ఏవో స్మిత్ ‘ఎలిగెన్స్ ప్రైమ్’ పేరుతో ఓ అధునాతన వాటర్ హీటర్‌ను విడుదల చేసింది. ఇది విద్యుత్ వినియోగాన్ని ఆదా చేసే ఫైవ్ స్టార్ రేటెడ్ ఉత్పత్తి అని కంపెనీ తెలిపింది. ఇందులో రస్ట్ రెసిస్టెడ్ ఇంటెగ్రేటెడ్ డిఫ్యూజర్ టెక్నాలజీని వినియోగించినట్టు, విద్యుత్‌ను ఆదా చేయడంతోపాటు, నీటి వేడి కోల్పోకుండా చూస్తుందని పేర్కొంది. దీర్ఘకాలం పాటు మన్నుతుందని, కస్టమర్ల అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను తీసుకురావాలన్న తమ విధానంలో భాగమే ఈ ఉత్పత్తి అని తెలిపింది. 15 లీటర్లు, 25 లీటర్ల సైజులో లభించే ఈ వాటర్ హీటర్ ధర రూ.11,400 నుంచి మొదలవుతుందని ఏవో స్మిత్ పేర్కొంది. -
Constitution Day: ప్రజల చెంతకు కోర్టులు: సీజేఐ
వ్యాజ్యప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం చాలా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘‘అపార వైవిధ్యానికి నిలయమైన భారత్ వంటి అతి పెద్ద దేశంలో న్యాయమందించే వ్యవస్థ ప్రతి పౌరునికీ అందుబాటులో ఉండేలా చూడటమే అతి పెద్ద సవాలు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టడంతో పాటు అధునాతన టెక్నాలజీని మరింతగా వాడుకోవాలి. న్యాయం కోసం ప్రజలు కోర్టు మెట్లెక్కడం కాదు, కోర్టులే వారి చెంతకు చేరే రోజు రావాలి. ఈ దిశగా టెక్నాలజీని న్యాయవ్యవస్థ మరింతగా అందిపుచ్చుకుంటోంది. తద్వారా పనితీరును మరింతగా మెరుగు పరుచుకునేలా కోర్టులను తీర్చిదిద్దుతున్నాం’’ అని వివరించారు. ప్రధాని ప్రారంభించిన ఇ–సైట్లే అందుకు నిదర్శనమన్నారు. ‘‘ఉదాహరణకు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్‌లోని సమాచారం వర్చువల్ జస్టిస్ క్లాక్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. జస్ట్‌ఈజ్ మొబైల్ యాప్ 2.0 ద్వారా జిల్లా జడ్జిలు తమ కోర్టుల్లో పెండింగ్ కేసులు తదితరాలన్నింటినీ నిరంతరం మొబైల్లో పర్యవేక్షించగలరు’’ అని చెప్పారు. హైబ్రిడ్ విధానం ద్వారా సుప్రీంకోర్టు విచారణలో లాయర్లు దేశంలో ఎక్కడినుంచైనా పాల్గొంటున్నారని గుర్తు చేశారు. జడ్జిలపై గురుతర బాధ్యత ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వాలు అందేలా చూడాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత జిల్లా జడ్జి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా అందరిపైనా ఉందని సీజేఐ అన్నారు. ‘‘ఇది జరగాలంటే న్యాయమూర్తులమంతా మన పనితీరును, మనలో పాతుకుపోయిన దురభిప్రాయాలు, తప్పుడు భావజాలాలను ఎప్పటికప్పుడు ఆత్మశోధన చేసుకుంటుండాలి. భిన్న నేపథ్యాల వ్యక్తుల జీవితానుభవాలకు సంబంధించిన భిన్న దృక్కోణాలను అర్థం చేసుకోనిదే మన పాత్రను సమర్థంగా నిర్వహించలేం’’ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థది కీలకపాత్ర న్యాయం కోసం ప్రజలు తొలుత ఆశ్రయించేది జిల్లా న్యాయవ్యవస్థనేనని సీజేఐ గుర్తు చేశారు. ‘‘అందుకే ఆ వ్యవస్థను బలోపేతం చేయడం, అవసరమైన అన్నిరకాల సాయమూ అందించడం అత్యవసరం. ఉన్నత న్యాయవ్యవస్థకు మితిమీరిన విధేయత చూపే భావజాలం నుంచి జిల్లా న్యాయవ్యవస్థను బయటికి తేవడం చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘భిన్న రంగాల వ్యక్తుల తాలూకు అనుభవాన్ని ఒడిసిపట్టి న్యాయవ్యవస్థలో భాగంగా మార్చడం చాలా ముఖ్యం. ఇందుకోసం న్యాయ వృత్తిలో అణగారిన వర్గాలు, మహిళల ప్రాతినిధ్యం మరింత పెరిగేలా చూడటం చాలా అవసరం’’ అని సూచించారు. -
5జీ కన్జ్యూమర్ సేవల్లోకి రావడం లేదు
ముంబై: టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కీలక ప్రకటన చేశారు. వినియోగదారులకు 5జీ సేవలను అందించే ప్రణాళిక ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేశారు. భారీ నష్టాల కారణంగా కన్జ్యూమర్ టెలికం సేవల నుంచి కొన్నేళ్ల క్రితమే టాటా గ్రూపు తప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాకపోతే 4జీ, 5జీకి సంబంధించి అధునాత టెక్నాలజీ సదుపాయాలను నిర్మించడంపైనే తమ ప్రయత్నాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయని, 6జీపైనా పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. ‘లోక్మత్ మహరాష్ట్రియన్ ఆఫ్ ఇయర్ 2022’ అవార్డుల కార్యక్రమం సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడారు. టాటా గ్రూపు కంపెనీలు నిర్మిస్తున్న టెక్నాలజీ సదుపాయాలు పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసినవని, పరీక్షించిన అనంతరం పెద్ద ఎత్తున విస్తరించనున్నట్టు చెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటికే విచారణలు వస్తున్నట్టు తెలిపారు. గ్రూపులోని నాలుగు ఎయిర్‌లైన్స్ కంపెనీలను స్థిరీకరించే ప్రణాళికలపై మాట్లాడుతూ.. ఒక్కటే ఎయిర్‌లైన్, రెండు ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఒకటి పూర్తిస్థాయి సేవలతో ప్రపంచ స్థాయి కంపెనీగా ఉంటుంది. అప్పుడు భారతీయులు ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుటుంది. రెండోది తక్కువ వ్యయాలతో కూడి ఉంటుంది. ఇది మా లక్ష్యం. ఇది సుదీర్ఘ ప్రయాణం’’ అని పేర్కొన్నారు. రూపాయి అన్ని ఇతర కరెన్సీలతో లాభపడుతూ, డాలర్‌తో విలువను కోల్పోతున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని మనం నియంత్రించగలమన్నారు. టాటా గ్రూపు, ఇతర పారిశ్రామిక గ్రూపులు ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర అధునాతన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నట్టు చంద్రశేఖరన్ చెప్పారు. -
5 నిమిషాల్లో ఎలక్ట్రిక్ కారు చార్జ్!
వాషింగ్టన్: భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఉద్దేశించిన ఒక అధునాతన సాంకేతికత సాయంతో విద్యుత్ కారును కేవలం ఐదు నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయొచ్చని నాసా ఆర్థికసాయంతో పరిశోధన చేసిన ఒక అధ్యయన బృందం ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో రోడ్డు వెంట ఉన్న చార్జింగ్ స్టేషన్లో దాదాపు 20 నిమిషాలు, ఇళ్లలో అయితే గంటల తరబడి విద్యుత్ కార్లను చార్జ్ చేయాల్సి వస్తోంది. దాంతో ఇప్పటికీ భారత్‌లో కొందరు విద్యుత్ వాహనాలకు యజమానులుగా మారేందుకు సంసిద్ధంగా లేరు. ప్రస్తుతమున్న అధునాతన చార్జర్లు 520 ఆంపియర్ల కరెంట్‌నే బదిలీచేయగలవు. వినియోగదారులకు ఎక్కువగా అందుబాటులో ఉన్న చార్జర్లు అయితే కేవలం 150 ఆంపియర్లలోపు విద్యుత్‌నే పంపిణీచేయగలవు. అయితే, నూతన ఫ్లో బాయిలింగ్, కండన్సేషన్ ఎక్స్పరిమెంట్తో ఇది సాధ్యమేనని అమెరికాలోని పురŠూడ్య విశ్వవిద్యాయంలోని పరిశోధకులు చెప్పారు. అయితే, 1,400 ఆంపియర్ల విద్యుత్ ప్రసరణ సామర్థ్యముండే చార్జింగ్ స్టేషన్లలో ఇది సాధ్యమేనని నాసా పేర్కొంది. ఇంతటి ఎక్కువ ఆంపియర్ల విద్యుత్ ప్రసరణ సమయంలో వేడి బాగా ఉద్భవిస్తుంది. దీనికి చెక్‌పెట్టేందుకు ద్రవ కూలెంట్‌ను ముందుగా చార్జింగ్ కేబుల్ గుండా పంపించారు. ఇది కరెంట్‌ను మోసుకెళ్లే కండక్టర్లో జనించే వేడిని లాగేస్తుంది. దీంతో 4.6 రెట్లు వేగంగా చార్జింగ్ చేయడం సాధ్యమైంది. కరెంట్ ప్రసరించేటపుడు వచ్చే 24.22 కిలోవాట్ల వేడిని ఈ విధానం ద్వారా తొలగించగలిగారు. ‘కొత్త పద్ధతి కారణంగా చార్జింగ్ సమయం బాగా తగ్గుతుంది. ఎక్కువ సేపు చార్జింగ్ జంజాటం లేదుకాబట్టి ఎక్కువ మంది ఎలక్టిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతారు’ అని పరిశోధకులు వ్యాఖ్యానించారు. భారరహిత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ రెండు ఫేజ్‌ల ఫ్లూయిడ్ ఫ్లో, వేడి బదిలీ ప్రక్రియను పరీక్షించనున్నారు. -
ఆ సత్తా భారత్ సొంతం
కేవడియా(గుజరాత్): ప్రపంచ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారత్ ముందుండి నడిపించగలదని, ఆ సామర్థ్యం భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరుగుతున్న ఇండస్ట్రీ 4.0 అనే సదస్సునుద్దేశిస్తూ ప్రధాని మోదీ వర్చువల్‌గా ఒక సందేశం పంపారు. అందులోని సారాంశం ఆయన మాటల్లోనే.. ‘ అధునాతన సాంకేతికత ఆలంబనగా నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలవ్వాలి. సృజనాత్మక ఆలోచనలతోనే ఇది సాధ్యం. వేర్వేరు కారణాల వల్ల గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్ భాగస్వామి కాలేకపోయింది. ఇండస్ట్రీ 4.0కు సారథ్యం వహించే సుధృఢ లక్షణాలు దేశానికి ఉన్నాయి. యువజనాభా, డిమాండ్, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బాటలుపరిచే కేంద్ర ప్రభుత్వం సమష్టిగా దీన్ని సుసాధ్యంచేయగలవు. ప్రపంచ వస్తు గొలుసు వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించేలా చేయగల సమర్థత దేశీయ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు ఉంది. ఇందుకోసం సంస్కరణలు తెస్తూ, రాయితీల తోడ్పాటు అందిస్తూ అధునాతన సాంకేతికతను సంతరించుకున్న ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషిచేస్తున్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘3డీ ప్రింటింగ్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలైటిక్స్, ఎల్ఓటీ వంటి రంగాల్లో పారిశ్రామికాభివృద్ధితో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ వృద్ధిచెందుతోంది’ అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుజరాత్ కోసం 75 , కర్ణాటక కోసం 100 ఈవీ బస్సులను ప్రారంభించారు. పుణెలోని ఇండస్ట్రీ 4.0(సీ4ఐ4) ల్యాబ్‌నూ మొదలుపెట్టారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై భారీ పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. పర్యావరణహిత అభివృద్ధిని భారత్ చాటిచెప్పింది పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థికాభివృద్ధిని భారత్ సాధిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు భారత్ ‘వైల్డ్‌లైఫ్ వీక్’ను పాటిస్తోంది. ఈ మేరకు దేశ ప్రజలకు మోదీ హిందీలో గురువారం ఇచ్చిన సందేశాన్ని కేంద్ర పర్యావరణశాఖ శుక్రవారం ట్వీట్ చేసింది. ఆ సందేశంలో మోదీ ఏం చెప్పారంటే.. ‘పరిశ్రమలతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యం. అయితే, పరిశ్రమలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉంటుంది. కానీ, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లకుండానే ఆర్థికాభివృద్ధి దిశగా పయనించడమెలాగో ప్రపంచానికి భారత్ సాధించి చూపింది. సరైన విధానపర నిర్ణయాలు, అమలుతోనే ఇది సాకారమైంది. తోటి జీవాల పట్ల, జీవావరణం, జీవ వైవిధ్యం మీద మనిషి మరింత దృష్టిసారించాలి. భారత్ గడిచిన ఎనిమిదేళ్లలో కొత్తగా 259 స్థలాలను అభయారణ్యాలుగా గుర్తించి సంరక్షణ బాధ్యతలు తీసుకుంది. పులుల సంఖ్యను రెట్టింపు చేసుకుంటూ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందే చేరుకున్నాం. ఆసియా సింహాలు, గజరాజుల సంఖ్యా పెరుగుతోంది’ అని అన్నారు. -
8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ
లండన్: సంప్రదాయ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) పరీక్ష ద్వారా గుండె వైఫల్యాన్ని గుర్తించేందుకు 20 నిమిషాలకుపైగా సమయం పడుతుంది. కానీ, కేవలం 8 నిమిషాల్లోనే గుర్తించే అత్యాధునిక సాంకేతికతను బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులు అభివృద్ధి చేశారు. అంటే ఎంఆర్ఐ పరీక్షతో పోలిస్తే సగం కంటే తక్కువ సమయంలోనే గుండె వైఫల్యాన్ని నిర్ధారించవచ్చు. దీనివల్ల సమస్యను 8 నిమిషాల్లోనే గుర్తించి, రోగులకు ప్రభావవంతమైన చికిత్స అందించవచ్చని పరిశోధకులు చెప్పారు. ఎంఆర్ఐతో సవివరమైన 4డీ ఫ్లో చిత్రాలను అభివృద్ధి చేసి, గుండె పనితీరును తెలుసుకోవచ్చని అన్నారు. ఈ టెక్నాలజీకి ‘4డీ ఫ్లో ఎంఆర్ఐ’ అని పేరు పెట్టారు. ఇందులో గుండె కవాటాలు, గుండె లోపలికి రక్తప్రవాహాన్ని స్పష్టం చూడవచ్చు. వీటిని బట్టి రోగులకు ఎలాంటి చికిత్స అందించాలన్నది వైద్యులు నిర్ణయించుకోవచ్చు. ఈ పరిశోధన వివరాలను యూరోపియన్ రేడియాలజీ ఎక్స్పరిమెంటల్ పత్రికలో ప్రచురించారు. హార్ట్ ఫెయిల్యూర్‌ను గుర్తించే విషయంలో ఇది విప్లవాత్మకమైన టెక్నాలజీ అని పరిశోధకులు వెల్లడించారు. -
లండన్‌లో మాయమైన కారు... పాకిస్తాన్లో ప్రత్యక్షం
లండన్: అది దాదాపు రూ.2.4 కోట్ల విలువైన ఖరీదైన బెంట్లీ కారు. దాన్ని బ్రిటన్‌లో మాయం చేసిన దొంగలు పాకిస్తాన్లో అమ్మేశారు. అయితే అధునాతన సాంకేతికత సాయంతో దాని జాడను బ్రిటన్ అధికారులు కనుగొన్నారు. మూడు లక్షల డాలర్ల విలాసవంత బెంట్లీ కారు కొన్ని వారాల క్రితం లండన్‌లో చోరీకి గురైంది. ఎట్టకేలకు దాని జాడను బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ పాకిస్తాన్లో కనుగొంది. బ్రిటన్ అధికారులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన కరాచీ కలెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంపన్నులుండే డీహెచ్ఏ ప్రాంతంలో కారు దాచిన విషయం తెల్సుకున్నారు. ఓ ఖరీదైన భవంతి ప్రాంగణంలో చేసిన సోదాల్లో కారు దొరికింది. అయితే, పాకిస్తాన్ రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్‌తో యజమాని అది పాక్ వాహనమని వాదించే ప్రయత్నం చేశాడు. అయితే, బ్రిటన్ అధికారులు ఇచ్చిన ఛాసిస్ నంబర్ వివరాలు ఈ కారుతో సరిపోలాయి. సరైన వాహన పత్రాలు ఇవ్వడంలో యజమాని విఫలమవడంతో కారును అధికారులు సీజ్ చేశారు. అతడిని, విక్రయించిన బ్రోకర్‌ను అరెస్ట్‌చేశారు. తూర్పు యూరప్‌లోని ఒక దౌత్యవేత్త పత్రాలను అడ్డుపెట్టుకుని కారును అక్రమంగా పాకిస్తాన్‌కు తరలించారని తేలింది. బెంట్లీ కారులోని ట్రేసింగ్ ట్రాకర్‌ను దొంగలు స్విఛ్ ఆఫ్ చేయడం మరిచిపోయారని, అందుకే అధునిక ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా జాడ ఎక్కడుంతో ఇట్టే కనిపెట్టారని పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఖరీదైన వాహనాన్ని అక్రమంగా పాక్‌కు తీసుకురావడంతో ఆ దేశం 30 కోట్ల పాక్ రూపాయల పన్నును కోల్పోయింది. ఈ స్మగ్లింగ్ రాకెట్ సూత్రధారి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!
2,000-year-old skull of a Peruvian warrior fused together by metal: మన సైన్స్ చాలా అత్యధునికంగా అభివృధి చెందింది అని చెబుతుంటాం. పైగా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని చూసి మనకు మనమే మురిసిపోతాం. కానీ ఎలాంటి కనీస సదుపాయలు అందుబాటులో లేని పురాతన కాలంలోనే మన పూర్వీకులు అత్యధునిక టెక్నాజీని ఉపయోగించారు అనడానికి ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు విషయంలోకెళ్తే... 2,000 సంవత్సరాల నాటి పెరువియన్ యోధుడి పుర్రె లోహంతో కలిసి ఉంది. యూఎస్ మ్యూజియంలో ఉన్న ఈ పుర్రెని నాటి అధునాతన శస్త్రచికిత్సకు ఇది ఒక ఉదాహరణ చెబుతారు. ఆ పుర్రె యుద్ధంలో గాయపడిన పెరువియన్‌ది. పైగా ఆ వ్యక్తికి తలకు పెద్ద గాయం అయ్యిందని, అందువల్ల తలలోని ఎముకలను జాయింట్ చేయడానికి ఒక లోహపు (ఐరన్ ప్లేట్) ముక్కును ఉపయోగించి శస్త్ర చికిత్స చేశారని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు ఆ శస్త్ర చికిత్స చేయడం వల్లే ఆ మనిషి ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. అయితే ఆ సమయంలో అనస్థీషియా ఇచ్చారో లేదో అనేది కచ్చితంగా చెప్పలేం అని అన్నారు. పురాతన కాలంలోనే అధునాతన శస్త్రచికిత్సలు చేయగల నైపుణ్యం కలిగి ఉన్నారని చెప్పడానికి ఈ పుర్రె ఇప్పుడు కీలకమైన సాక్ష్యంగా పేర్కొనవచ్చు అని ఆస్టియాలజీ మ్యూజియం ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ శస్త్ర చికిత్సను ట్రెఫినేషన్ అని పిలుస్తారని, పైగా లోహాన్ని కరిగించి పోయేలేదని కూడా సోషల్ మీడియాలో పేర్కొంది. (చదవండి: రైలు రావడం చూసి మరీ ఆమెను పట్టాలపై తోసేశాడు.. ఆపై ఏం జరిగిందో చూడండి) -
రష్యా తో ‘లైఫ్ లైన్స్’కు ముప్పు!
ఆధునిక సాంకేతికత మన జీవితాలను ఆక్రమించేసింది. ఇంటర్నెట్ లేనిది క్షణమైనా గడవని పరిస్థితి. కొద్ది గంటలు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సేవలు లేదా సామాజిక మాధ్యమ యాప్‌లు నిలిచిపోతే అదో పెద్ద వార్త అవుతోంది. అలాంటిది ఇంటర్నెట్కు జీవనాడులుగా పరిగణించే సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను ఎవరైనా కత్తిరించేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రపంచం స్తంభించిపోతుంది. అండర్ వాటర్ క్యాప్సుల్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ (ఫైల్) వివిధ ఖండాలను కలుపుతున్న ఆప్టికల్ ఇంటర్నెట్, రక్షణ వ్యవస్థలు, వైద్య ఆరోగ్య సేవలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, ఆర్థిక కార్యకలాపాలు, క్యాబ్ సర్వీసులు, ఫుడ్ డెలివరీలు... ఇలా ఒకటేమిటి ప్రతిదీ నిలిచిపోతుంది. ప్రపంచం అతలాకుతలమవుతంది. ఇప్పుడదే ముప్పు రష్యా నుంచి పొంచి వుందని అమెరికా, బ్రిటన్‌తో సహా ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. అణ్వాయుధ పోటీ గతించిన ముచ్చట. శత్రుదేశాలను దెబ్బతీయడానికి, ప్రపంచ దేశాలను భయపెట్టడానికి రష్యా, చైనాలు ఇప్పటికే సైబర్ దాడులను సమర్థమంతమైన ఆయుధంగా వాడుతున్నాయి. ఇతర దేశాల్లోని కీలక వ్యవస్థలపై దాడులు కొనసాగిస్తూ, వాటిని కుప్పకూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యాకింగ్, డేటా చౌర్యం జరుగుతోంది. అందుకే ప్రపంచదేశాలన్నీ ‘సైబర్ సెక్యూరిటీ’ని అతిపెద్ద సవాల్‌గా స్వీకరించాయి. ఈ తరుణంలోనే రష్యా గత ఐదారేళ్లుగా కొత్త యుద్ధ తంత్రానికి తెరలేపింది. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటూ... ఏ క్షణమైనా వాటిని తుంచేసే విధంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వీటిలో నుంచి ప్రసారమయ్యే సమాచారాన్ని తస్కరించే సాంకేతికతలనూ అభివృద్ధి చేస్తోంది. భారీగా పెట్టుబడులు పెడుతోంది. కొత్తగా నియమితులైన బ్రిటన్ చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ అడ్మిరల్ టోనీ రాడకిన్ ఈ జీవనాడులకు రష్యా నుంచే ప్రధాన ముప్పు పొంచి వుందని గతవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను పరిరక్షించుకోవడానికి.. ప్రత్యేక నిఘా నౌకను 2024 కల్లా జలప్రవేశం చేయిస్తామని బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ ఇటీవల ప్రకటించింది. ఇది అణ్వాయుధ యుద్ధంతో సమానమైన ముప్పని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్ష మంది సైన్యాన్ని మోహరించడంతో రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా, నాటో దేశాలు రష్యాను పలుమార్లు హెచ్చరించాయి. దీంతో రష్యా అభివృద్ధి చేస్తున్న సముద్రగర్భ సాంకేతికతలు, సమకూర్చుకుంటున్న సాధానాలపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. రష్యా ఇలాంటి తీవ్ర చర్యలకు దిగే అవకాశాలు తక్కువే అయినా... అమెరికా, నాటో దేశాలతో ఘర్షణ ముదిరితే... రష్యా దీన్నో ఆయుధంగా వాడే ప్రమాదం ఉందనేది నిపుణుల అభిప్రాయం. రష్యా ఏయే మార్గాల్లో ప్రపంచానికి జీవనాడులైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను దెబ్బతీయగలదో చూద్దాం.. 436: వివిధ సముద్రాల మీదుగా పలు ఖండాలను, ప్రపంచ దేశాలను కలుపుతూ కడలి గర్భంలో మొత్తం 436 ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్స్ ఉన్నాయి. వీటి మొత్తం పొడవు.. 12,87,475 కిలోమీటర్లు. ఇవే నేటి మన ప్రపంచపు జీవనాడులు (లైఫ్ లైన్స్). నిరంతరాయ ఇంటర్నెట్ సేవలకు మూలాధారం. వీటిలో అన్నింటికంటే పొడవైనది అమెరికా– ఆసియా ఖండాలను కలిపేది. ఈ కేబుల్‌లైన్ పొడవు 20,004 కిలోమీటర్లు. 97%: అంతర్జాతీయంగా నిత్యం జరిగే కమ్యూనికేషన్స్‌లో 97 శాతం ఈ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. శాటిలైట్స్ మన కమ్యూనికేషన్స్ అవసరాల్లో మూడు శాతం మాత్రమే తీరుస్తున్నాయి. 10 లక్షల కోట్ల డాలర్లు: సముద్రపు అడుగుభాగంలోని 436 కేబుల్ లైన్స్ ద్వారా ప్రతిరోజూ 10 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. ప్రపంచం ఆర్థిక రంగానికి ఇదే లైఫ్‌లైన్.