సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన శనివారం రష్యా ఆయుధాగారాన్ని సందర్శించారు. రష్యా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సహిత బాంబర్లు, హైపర్‌సానిక్ క్షిపణులు, అత్యాధునిక యుద్ధ నౌకను పరిశీలించారు. కిమ్ తొలుత ఉత్తర కొరియా నుంచి రైలులో అరి్టయోమ్ సిటీకి చేరుకున్నారు. ఇక్కడికి సమీపంలోని ఎయిర్‌పోర్టులో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లు, యుద్ధ విమానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిమ్ వెంట రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉన్నారు.
టు–160, టు–95–, టు–22 బాంబర్ల గురించి కిమ్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మిగ్–31 ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించే హైపర్‌సానిక్ కింజాల్ క్షిపణుల గురించి కిమ్‌కు సెర్గీ వివరించారు. ఇలాంటి క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం ప్రయోగిస్తోంది. కిమ్, సెర్గీ షోయిగు కలిసి రేవు నగరం వ్లాదివోస్తోక్ చేరుకున్నారు. ఇక్కడ అత్యాధునిక యుద్ధ నౌకలను, ఆయుధాలను కిమ్ పరిశీలించారు. ఆయుధాలు, ఉపగ్రహాల తయారీ విషయంలో రష్యా నుంచి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికే కిమ్ రష్యాలో పర్యటిస్తున్నట్లు పశి్చమ దేశాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment