సినిమాకో, షాపింగ్ పనిమీదనో బయటికి వెళ్లినపుడు కారు పార్కింగ్ కోసం పెద్దగా హైరానా పడాల్సిన పనిలేదిక. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన రోబో అందుబాటులోకి వచ్చేసింది. డ్రైవర్‌తో పనిలేకుండా... డ్రైవర్‌తో పోల్చితే ఈ రోబో అదే స్థలంలో 60శాతం ఎక్కువ కార్లను పార్క్ చేయగలదని దీన్ని తయారుచేసిన కంపెనీ చెబుతోంది. ‘రే’గా పిలుచుకునే ఈ అధునాతన రోబో ప్రస్తుతం జర్మనీ దేశంలోని దసెల్‌డోర్ఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిలో బిజీగా ఉంది. వెహికల్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో మనం కారును వదిలేస్తే చాలు ఇదే తన పని కానిచ్చేస్తుంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే రోబో... కారు పొడవు, వెడల్పు, ఎత్తులను స్కాన్‌చేసి నాలుగు ఫోర్క్‌ల సాయంతో కారును పెకైత్తి కారుకు సరిపోయే స్థలాన్ని ఎంపికచేసి అక్కడ పార్క్ చేస్తుంది. మనకు కారు కావాల్సినపుడు టికెట్‌ను ఇచ్చేస్తే దగ్గరిలోని వెహికల్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు కారును తెచ్చి వదిలేస్తుంది.