చచ్చుబడిపోయిన చేతులకు అభయ హస్తం..! | Tamil Nadu Sivasanthosh's Motor Function Loss With Robotic Technology | Sakshi
Sakshi News home page

21 ఏళ్ల యువకుడి సరికొత్త ఆవిష్కరణ.. చచ్చుబడిపోయిన చేతులకు అభయ హస్తం..!

Published Fri, Dec 20 2024 4:34 PM | Last Updated on Fri, Dec 20 2024 4:52 PM

Tamil Nadu Sivasanthosh's Motor Function Loss With Robotic Technology

సమస్యల గురించి వినడమే తప్ప పరిష్కారాల గురించి అవగాహన లేని వయసులో సైన్స్‌పై అమిత ఆసక్తి పెంచుకున్నాడు తమిళనాడుకు చెందిన శివసంతోష్‌. ఆ ఆసక్తే ఆవిష్కరణకు బీజం వేసింది. 21 ఏళ్ల వయసులో రోబోటిక్స్‌ స్టార్టప్‌ను ప్రారంభించేలా చేసింది...

హెల్త్‌కేర్, ఎనర్జీ ప్రొడక్షన్, ఏరోస్పేస్‌ రంగాలకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి 21 ఏళ్ల శివసంతోష్‌ రోబోటిక్స్‌ స్టార్టప్‌ ‘మైక్రోమోటిక్‌’ను ప్రారంభించాడు. ‘లింబ్‌ మొబిలిటీ’ని పునరుద్ధరించడానికి డిజైన్‌ చేసిన ఈ తేలికపాటి వేరబుల్‌ మోటర్‌ సిస్టమ్‌ స్ట్రోక్, స్పైనల్‌ కార్డ్‌ ఇంజురీస్, సెరిబ్రల్‌ పాల్సీ, పార్కిన్స్‌ డిసీజ్‌...మొదలైన బాధితులకు ఉపయోగపడుతుంది. ఈ లింబ్‌ అసిస్ట్‌ను ఉపయోగించి కప్పులు, ప్లేట్లు, బ్యాగులు... మొదలైన వాటిని పట్టుకోవచ్చు. తీసుకెళ్లవచ్చు. రాయవచ్చు. టైపింగ్‌ చేయవచ్చు. ఫింగర్‌ మూమెంట్స్‌కు సంబంధించి ఎన్నో పనుల్లో లింబ్‌ అసిస్ట్‌ సహాయపడుతుంది.

పుదుకొట్టై జిల్లా కీరమంగళం అనే చిన్న పట్టణంలో ఈ స్టార్టప్‌ను పప్రాభించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. దీనికి శివ చెప్పే జవాబు...‘స్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం. మా ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం. ఇన్నోవేషన్‌ కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని నిరూపించాలనుకున్నాను’ 

శివసంతోష్‌కు చిన్నప్పటి నుంచి సైన్స్‌ అంటే ఎంతో ఇష్టం. రకరకాల యంత్రాలు ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. స్కూల్‌ ప్రాజెక్ట్‌లతో సైన్స్‌పై మరింత ఆసక్తి పెరిగింది. సైన్స్‌కు సంబంధించి రకరకాల  పోటీలలో విజేతగా నిలిచేవాడు. ఈ నేపథ్యంలో తన ఆలోచనలు ఆవిష్కరణల చుట్టూ తిరిగేవి.

‘కోవిడ్‌ మహమ్మారి టైమ్‌లో స్థానిక ఆసుపత్రుల కోసం ఆటోమేటిక్‌ శానిటైజర్‌ స్ప్రేయర్, యూవీ జెర్మిసైడ్‌ను డెవలప్‌ చేశాను. మరో వైపు శాటిలైట్‌ టెక్నాలజీ గురించి అధ్యయనం చేయడం మొదలు పెట్టాను’ అంటున్నాడు శివ. ఆ ఆసక్తి, అధ్యయనం అతడిని మరింత ముందుకు తీసుకెళ్లింది.

మెకాట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన శివసంతోష్‌ ప్రస్తుతం చెన్నైలోని అన్నా యూనివర్శిటీ–కేసీజీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో బీఈ చదువుతున్నాడు. తన స్టార్టప్‌ కోసం ఎక్కువ సమయం కేటాయించేందుకు శివసంతోష్‌కు కాలేజీ అనుమతి ఇచ్చింది.

ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ సెల్స్‌తో మల్టీ యాక్సిస్‌ విండ్‌ టర్బైన్‌ను డెవలప్‌ చేయడంపై కూడా ఈ స్టార్టప్‌ కృషి చేస్తోంది. ‘డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ సమయాల్లో ఇళ్లు, వ్యాపారాలకు బ్యాకప్‌ పవర్‌కు సంబంధించి పవర్‌ జెనరేషన్‌కు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది’ అంటున్నాడు శివసంతోష్‌.

"మూడు పదాలను నమ్ముకుంటే చాలు మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి. అవి... ఎందుకు? ఏమిటి? ఎలా? సైన్స్‌పై ఆసక్తితో ఫ్యాన్‌ ఎలా తిరుగుతుంది? నుంచి విమానం ఎలా ఎగురుతుంది? వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. శాస్త్రీయ విషయాలపై లోతైన అవగాహన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని." చెబుతున్నాడు శివసంతోష్‌.

(చదవండి:
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement