limb
-
'బయోనిక్ బార్బీ': ఆమె చేయి ప్రాణాంతకంగా మారడంతో..!
కేన్సర్ వ్యాధి నిర్ధారణతోనే ఎన్నో కుటుంబాలు అతలాకుతలమైపోతాయి. నయం అయి బయటపడితే పర్లేదు..నరకయాతనల మారి బాధపెడితే అనుభవిస్తున్నవారికి, సన్నిహితులకు మాటలకందని వేదనను అనుభవిస్తారు. ఈ కేన్సర్లలో కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి ఏకంగా శరీరంలో కేన్సర్ సోకిన లేదా ప్రభావిత భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బాధితులు దివ్యాంగులుగా మారిపోతారు. అలాంటి అరుదైన కేన్సర్ వ్యాధి బారినే పడింది ఇక్కడొక మహిళ. అయితే ఆ కోల్పోయిన భాగానికి సరికొత్తగా వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఊహించని పరిస్థితి ఎదురైతే అవమానంతో కాదు..దాన్ని అంగీకరిస్తూ కొత్త జీవితానికి ఎలా ఆహ్వానం పలకాలో చెప్పింది. పైగా తనలాంటి ఎందరో కేన్సర్ బాధితులకు ప్రేరణగా నిలిచింది. ఆ మహిళ కేన్సర్ కన్నీటి గాథ వింటే..కళ్లు చెమ్మగిల్లకుండా ఉండవు. ఇంతకీ ఈ కథేంటంటే..అమెరికా(US)సంయుక్త రాష్ట్రాలకు చెందిన 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్(social media influencer ) ఎల్డియారా డౌసెట్(Eldiara Doucette) అరుదైన కేన్సర్ సైనోవియల్ సార్కోమా(synovial sarcoma) బారిన పడింది. ఈ కేన్సర్‌తో పోరాటం కారణంగానే సోషల్ మీడియాలో “బయోనిక్ బార్బీ" గా పేరుగాంచింది. అలా తన అరుదైన కేన్సర్‌కి సంబంధించిన విషయాలు నెటిజన్లతో పంచుకోవడంతో ఇదే సమస్యతో బాధపడుతున్న ఎందరో ఆమెకు స్నేహితులుగా మారారు. అంతేగాదు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోయింగ్‌ని సంపాదించిపెట్టింది. ఆమెకు మూడేళ్లక్రితం ఈ అరుదైన కేన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయినప్పటి నుంచి ఈ సోషల్ మీడియా జర్నీ ప్రారంభమైంది. ఒక రకంగా ఈ వ్యాధి తనలాంటి ఎందరో భాధితులని ఆమెకు ఆత్మబంధువులుగా చేసింది. అదే ఆమెకు ఈ మహమ్మారితో పోరాడే శక్తిని, స్థైర్యాన్ని అందించింది. అయితే ఈ కేన్సర్ మహమ్మారి బయోనిక్ బార్బీగా పిలిచే ఎల్డియారాపై గెలవాలనుకుందో ఏమో..!. తన విజృంభణతో ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు కేన్సర్ పునరావృతమవుతూనే ఉంది. ఎడతెగని కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలతో అలిసిపోయింది. ఆ మహమ్మారిపై గెలుస్తున్న ప్రతిసారి దాడి చేసి తిరగబెడుతూనే ఉండేది. దీంతో ఆమె ఆరోగ్యం దిగజారడం మొదలైంది. ఇక ఆమె బతకాలంటే కేన్సర్కణాల ప్రభావం ఎక్కువగా ఉన్న కుడిచేతి(right arm)ని తొలగించక తప్పని స్థితికి వచ్చింది. ఆ కేన్సర్ వ్యాధిని కట్టడిచేయాలంటే ఆ చేతిని కోల్పోక తప్పని స్థితి. ఆ విషమ పరిస్థితుల్లోనే కుడిచేతి మెచేయి వరకు కోల్పోయి కేన్సర్‌ని విజయవంతంగా జయించింది. అయితే ఆ కోల్పోయిన కుడి చేతితో తాను చేసే పనులన్నీ గుర్తొచ్చి ఎల్డియారాకు కన్నీళ్లు ధారగా వచ్చేశాయి . పుట్టుకతో వికలాంగురాలిగా ఉండటం వేరు..మధ్యలో హఠాత్తుగా వచ్చి పడిన వైకల్యాన్ని అధిగమించడం అంత ఈజీ కాదు. ఇక తాను ఒంటి చేత్తోనే జీవించాలన్న ఆలోచన కూడా జీర్ణించుకోలేనంత బాధను కలుగజేసిందామెకు. అయితే ఈమె మాత్రం సోషల్ మీడియా పోస్ట్‌లో "తన చేయే తనన అంతం చేయాలనుకుంది. కట్‌చేస్తే..అదే బాధితురాలిగా మారిందని ఉద్వేగంగా చెప్పుకొచ్చింది. అయినా కేన్సర్‌ని ఓడించగలిగానూ, కాబట్టి తాను కోల్పోయిన చేతికి గ్రాండ్‌గా వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు చేయలని నిర్ణయించుకున్నట్లు స్థైర్యంగా చెప్పింది. ఇది తనలా కేన్సర్ కారణంగా అవయవాలు కోల్పోయిన వారిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలని చేస్తున్నట్లు పోస్ట్‌లో వివరించింది. ఇన్నాళ్లు ఎంతగానో ఉపకరించి ఎన్నో పనుల్లో హెల్ప్ చేశావు, అలాగే ఎందరినో ఓదార్చడానికి ఉపయోగపడ్డ ఆ చేతికి కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికింది. పైగా ఆ కోల్పోయిన చేతిని నైయిల్ పాలిష్‌తో డెకరేట్ చేసి మరీ అంతక్రియలు నిర్వహించింది. "మనకు ఇలా జరగాలని రాసి పెట్టి ఉంటే మార్చలేం లేదా ఆపలేం. అయితే దాన్ని అంగీకరిస్తూ అధిగమిస్తే అంతిమంగా మనమే గెలుస్తామని చెబుతుంది". ఎల్డియా. అలాగే తన జీవితంలోకి వచ్చిన వైకల్యాన్ని అంగీకరించడమే గాక రోబోటిక్ ప్రొస్థెటిక్ మెటల్ రాడ్‌ను అమర్చుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఆనందంగా ఉండటం అనేది మన చేతిల్లోనే ఉంది. కోల్పోయమనో లేదా పొందలేకపోయమనో బాధపడిపోవడం కాదు..ఆ పరిస్థితిని కూడా మనకు సంతోషాన్ని ఇచ్చేదానిగా మార్చుకుని ఆనందభరితంగా చేసుకోవడమే జీవితం అని చాటిచెబుతోంది ఎల్డియారా. అంతటి పరిస్థితులోనూ తాను ఆనందంగా ఉండటమే గాక ఇతరులు కూడా తనలా అలాంటి పరిస్థితిని అధిగమించి సంతోషంగా ఉండాలని కోరుకోవడం నిజంగా గ్రేట్ కదూ..!. View this post on Instagram A post shared by el deer uh ᯓ★ (@semibionicbarbie) (చదవండి: దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..) -
చచ్చుబడిపోయిన చేతులకు అభయ హస్తం..!
సమస్యల గురించి వినడమే తప్ప పరిష్కారాల గురించి అవగాహన లేని వయసులో సైన్స్‌పై అమిత ఆసక్తి పెంచుకున్నాడు తమిళనాడుకు చెందిన శివసంతోష్. ఆ ఆసక్తే ఆవిష్కరణకు బీజం వేసింది. 21 ఏళ్ల వయసులో రోబోటిక్స్ స్టార్టప్‌ను ప్రారంభించేలా చేసింది...హెల్త్‌కేర్, ఎనర్జీ ప్రొడక్షన్, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి 21 ఏళ్ల శివసంతోష్ రోబోటిక్స్ స్టార్టప్ ‘మైక్రోమోటిక్’ను ప్రారంభించాడు. ‘లింబ్ మొబిలిటీ’ని పునరుద్ధరించడానికి డిజైన్ చేసిన ఈ తేలికపాటి వేరబుల్ మోటర్ సిస్టమ్ స్ట్రోక్, స్పైనల్ కార్డ్ ఇంజురీస్, సెరిబ్రల్ పాల్సీ, పార్కిన్స్ డిసీజ్...మొదలైన బాధితులకు ఉపయోగపడుతుంది. ఈ లింబ్ అసిస్ట్‌ను ఉపయోగించి కప్పులు, ప్లేట్లు, బ్యాగులు... మొదలైన వాటిని పట్టుకోవచ్చు. తీసుకెళ్లవచ్చు. రాయవచ్చు. టైపింగ్ చేయవచ్చు. ఫింగర్ మూమెంట్స్‌కు సంబంధించి ఎన్నో పనుల్లో లింబ్ అసిస్ట్ సహాయపడుతుంది.పుదుకొట్టై జిల్లా కీరమంగళం అనే చిన్న పట్టణంలో ఈ స్టార్టప్‌ను పప్రాభించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. దీనికి శివ చెప్పే జవాబు...‘స్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం. మా ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం. ఇన్నోవేషన్ కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని నిరూపించాలనుకున్నాను’ శివసంతోష్కు చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే ఎంతో ఇష్టం. రకరకాల యంత్రాలు ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. స్కూల్ ప్రాజెక్ట్‌లతో సైన్స్‌పై మరింత ఆసక్తి పెరిగింది. సైన్స్‌కు సంబంధించి రకరకాల పోటీలలో విజేతగా నిలిచేవాడు. ఈ నేపథ్యంలో తన ఆలోచనలు ఆవిష్కరణల చుట్టూ తిరిగేవి.‘కోవిడ్ మహమ్మారి టైమ్‌లో స్థానిక ఆసుపత్రుల కోసం ఆటోమేటిక్ శానిటైజర్ స్ప్రేయర్, యూవీ జెర్మిసైడ్ను డెవలప్ చేశాను. మరో వైపు శాటిలైట్ టెక్నాలజీ గురించి అధ్యయనం చేయడం మొదలు పెట్టాను’ అంటున్నాడు శివ. ఆ ఆసక్తి, అధ్యయనం అతడిని మరింత ముందుకు తీసుకెళ్లింది.మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన శివసంతోష్ ప్రస్తుతం చెన్నైలోని అన్నా యూనివర్శిటీ–కేసీజీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బీఈ చదువుతున్నాడు. తన స్టార్టప్ కోసం ఎక్కువ సమయం కేటాయించేందుకు శివసంతోష్కు కాలేజీ అనుమతి ఇచ్చింది.ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్స్‌తో మల్టీ యాక్సిస్ విండ్ టర్బైన్ను డెవలప్ చేయడంపై కూడా ఈ స్టార్టప్ కృషి చేస్తోంది. ‘డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ సమయాల్లో ఇళ్లు, వ్యాపారాలకు బ్యాకప్ పవర్‌కు సంబంధించి పవర్ జెనరేషన్‌కు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది’ అంటున్నాడు శివసంతోష్."మూడు పదాలను నమ్ముకుంటే చాలు మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి. అవి... ఎందుకు? ఏమిటి? ఎలా? సైన్స్‌పై ఆసక్తితో ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? నుంచి విమానం ఎలా ఎగురుతుంది? వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. శాస్త్రీయ విషయాలపై లోతైన అవగాహన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని." చెబుతున్నాడు శివసంతోష్.(చదవండి: -
ఎటు చూసినా రక్తపు మడుగే:ఒడిశా ప్రమాద బాధితుడి ఆవేదన
తూర్పుకోస్తా రైల్వే బాలాసోర్–బహనాగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెను ప్రమాదం నుంచి అనుభవ్ దాస్ అనే ప్రయాణకుడు ప్రాణాలతో బయటపడినట్లు ట్విట్టర్లో తెలిపాడు. తాను హౌరా నుంచి చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్రయాణికుడుగా పేర్కొన్నాడు. ఆ ప్రమాదంలో ఎలాటి గాయాల బారిన పడకుండా సురక్షితంగా బయటపడినందుకు మొదటగా దేవుడికి ధన్యవాదాలు అంటూ.. ఆ విషాదకర ఘటన గురించి వివరించాడు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లోని దాదాపు 13 కోచ్‌లు దెబ్బతిన్నాయని, అలాగే బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మూడు జనరల్ కోచ్‌లు పూర్తిగా దెబ్బతిన్నట్లు వెల్లడించాడు. తాను వ్యక్తిగతంగా దాదాపు 200కి పైగా మృతులను చూసినట్లు పేర్కొన్నాడు. కుటుంబాలకు కుటుంబాలు చితికిపోవడం, అవయవాలు తెగిపడిన శరీరాలు, రక్తపు మడుగులా మారిన రైలు పట్టాలు, తదితర భయానక దృశ్యాలు చూశానని చెప్పుకొచ్చాడు. ఇవి తాను జీవితంలో మర్చిపోలేని దారుణమైన దృశ్యాలని ఉద్వేగంగా చెప్పాడు. ఆయా బాధిత కుటుంబాలకు దేవుడు సాయం చేయాలని, అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరితగతిని కోలుకుని వారి కుటుంబ సభ్యులను చేరుకోవాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పాడు. కాగా, హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్(12841) ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొంది. ఆ ఘటన నుంచి తేరుకునేలోపే ఎదురుగా వస్తున్న బెంగళూరు -హౌరా ఎస్ఎంవీటీ(12864) ఎక్స్‌ప్రెస్ రైలు కోరమండల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 233 మంది చనిపోగా, సుమారు 900 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే మూడు ఎన్డిఆర్ఎఫ్ యూనిట్లు, 4 ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ యూనిట్లు, 15 ఫైర్ రెస్క్యూ బృందాలు, 30 మంది వైద్యులు, 200 మంది పోలీసు సిబ్బంది, 60 అంబులెన్స్‌లు రంగంలోకి దిగి రెస్కూ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు సాగుతున్నాయని, అలాగే సమీపంలోని ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేసినట్లు ఒడిశా ఛీఫ్ సెక్రటరీ ప్రదీప్ తెలిపారు. As a passenger on the Coromandel Express from Howrah to Chennai, I am extremely thankful to have escaped unscathed. It probably is the biggest train accident related incident. Thread of how the incident unfolded 1/n — Anubhav Das (@anubhav2das) June 2, 2023 (చదవండి: పట్టాలపై మృత్యుకేళి.. ఘటనపై దర్యాప్తునకు హైలెవల్ కమిటీ) -
నేను మీ జుట్టుని
మేము / నేను దాదాపు నిర్థకమైన అవయవాన్నే. పెద్ద పనేమీ చేయను. ఆనంద్ నాకు ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ తన కీలక అవయవాల్లో దేనికి అనారోగ్యం కలిగినా ఎంత బాధపడతాడో... నేను అనవసరం అని తెలిసినా ఆనంద్ అంతే ఆందోళన చెందుతుంటాడు. నేను ఆనంద్ జుట్టును. మేము అని పిలిస్తే ఆనంద్ జుట్టును. నేను అంటే... ఆనంద్‌కు జుట్టులోని ఒకానొక కేశాన్ని. నేను రాలితే ఎంతగానో బాధపడిపోతాడు ఆనంద్. ఎంతో ఖర్చు పెడతాడు. ఆనంద్ దేహంలో నేను కంటిపై ఉంటే కనుబొమల ఆకృతికి తగ్గట్లు చాలా పొట్టిగా ఉంటాను. అదే తలపై పొడవుగా పెరుగుతాను. ఆనంద్ జుట్టునైన నాలో దాదాపు లక్ష వెంట్రుకలు ఉంటాయి. అదే గడ్డంలో దాదాపు ముప్ఫైవేలు ఉంటాయి. తల, గడ్డంలోని రోమాలు వేగంగా పెరుగతాయి. నన్ను కట్ చేయకుండా అదేపనిగా పెంచితే గడ్డంలోనైతే 14 సెంటీమీటర్లు, తలమీదనైతే 12 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాను. నన్ను నేను రోజూ రాల్చుకుంటుంటాను... నాలోంచి (జుట్టు నుంచి) రోజూ దాదాపు 75 కేశాలు రాలిపోతుంటాయి. దాదాపు రెండు నెలలు విశ్రాంతి తర్వాత మళ్లీ అవి పెరగడం ప్రారంభిస్తాయి. ఆనంద్ తలపై ఉండే జుట్టు ఎప్పటికప్పుడు కొత్తగా, ఫ్రెష్‌గా ఉండటానికి ఇలా జరుగుతుంది. ఆనంద్ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేను ‘నూగు’ (ఇంగ్లిష్‌లో వెల్లస్) అని పిలిచే చాలా మృదువైన జుట్టుగా ఉండేదాన్ని. ఆనంద్‌కు కొత్తగా మీసం మొలిచే సమయంలో ఇలాంటి మృదువైన జుట్టును గమనించవచ్చు. ఆ తర్వాత నేను కాస్త రఫ్‌గా మారిపోతాను. దీన్నే టెర్మినల్ హెయిర్ అంటారు. కానీ జుట్టును ఎప్పటికప్పుడు కొత్తగా చేసుకునే ప్రయత్నంలో భాగంగా టెర్మినల్ హెయిర్ అయిన నేను రాలుతూ నూగు వెంట్రుకలను పుట్టించుకుంటూ ఉంటాను. ఒకవేళ టెర్మినల్‌గా హెయిర్‌గా మారిన నేను మళ్లీ నూగు వెంట్రుకలుగా పుట్టకపోతే ఆ ప్రదేశంలో రోమాంకురం నుంచి రోమం పుట్టదు. ఇదే ప్రక్రియ అదేపనిగా జరిగితే ఆనంద్‌కు బట్టతల వస్తుంది. అయితే, ఆనంద్ భార్యకు బట్టతల రావడం అరుదు. వయసు పెరుగుతుంటే సన్నబడుతుంటా... ఆనంద్ వయసు పెరుగుతున్న కొద్దీ అతడిలోని నా చుట్టుకొలత (డయామీటర్) తగ్గుతుంటుంది. అంటే నేను సన్నబడిపోతుంటా. అంతేకాదు కాస్త నిడివి కూడా తగ్గుతుంటా. నాణ్యత కూడా ఒకింత తగ్గుతుంటుంది. నా ఫాలికిల్‌లో ప్రధానంగా చాలావరకు ప్రోటీన్ ఉంటుంది. నాకు కొంత సాగే గుణం ఉంటుంది. నేను చాలా సన్నగా ఉంటాను కాబట్టి మరీ బలహీనం అని అపోహపడకండి. ఒక్కోసారి నేను గరిష్ఠంగా 90 గ్రాముల బరువునూ భరించగలను. నా ఫాలికిల్ చివరన ఉన్న సంక్లిష్టమైన కణాల్లో కొంత రంగునిచ్చే పదార్థం ఉంటుంది. దీనివల్ల ఆనంద్ జుట్టుకు ఉండాల్సిన రంగును ఈ సంక్లిష్ట కణాల్లోని కలరింగ్ మ్యాటర్, అది అక్కడ చిన్న చిన్న రేణువుల్లా (గ్రాన్యూల్స్)లా వ్యాపించిన తీరు నిర్ణయిస్తాయి. అలాగే అక్కడి పిగ్మెంట్ ఉన్న తీరు వల్ల కూడా వెంట్రుకకు బ్రౌన్ లేదా నలుపు రంగు ఎరుపు లేదా పసుపు రంగు వచ్చేలా చేస్తుంటాయి. ప్రతి ఫాలికిల్ చివర సబేషియస్ గ్లాండ్ అనే గ్రంథి ఉండి, దాని నుంచి కేశానికి వాటర్ప్రూఫింగ్ కలిగించేలా, కొవ్వులాంటి ఒక స్రావం విడుదల అవుతూ ఉంటుంది. వెంట్రుక మొదలులోని జీవకణాలు కింద నుంచి పెరుగుతూ ఉంటాయి. అవి అక్కడ పెరుగుతూ వెంట్రుకను పైకి తోస్తూ ఉంటాయి. దాంతో రోమం కింది వైపు నుంచి పై వైపునకు పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగే ప్రక్రియలో అది గట్టిబారుతుంది. ఇలా గట్టిబారే ప్రక్రియను కెరటినైజేషన్ అంటారు. కేశంలో ఉండే ఈ కెరటిన్ అనే పదార్థమే ఆవు కొమ్ముల్లో, బాతు ఈకల్లో, ఖడ్గమృగం కొమ్ములోనూ ఉంటుంది. వేర్వేరు చోట్లలో వేర్వేరు పెరుగుదల... నేను ఆనంద్ దేహంపై ఉన్న స్థానాన్ని బట్టి నా పెరుగుదల కూడా వేరుగా ఉంటుంది. ఉదాహరణకు కనుబొమలు, కనురెప్పల వద్ద నా పెరుగుదల తక్కువ. అయితే అక్కడ షేవ్ చేసినప్పటికంటే వాటిని లాగేస్తే మరింత వేగంగా పెరుగుతాను. ఇక మీసంలో నా పెరుగుదల కనుబొమల కంటే కాస్త వేగంగా జరుగుతుంది. మా ఫాలికిల్స్లోని అడ్డుకోత (క్రాస్సెక్షన్)లోని నిర్మాణాన్ని బట్టి జట్టులోని మా కేశాలు నిటారుగా పెరగడమో లేదా అలలు అలలుగా ఉండటమో లేదా రింగులుగా తిరగడమో చేస్తాయి. అడ్డుకోత నిర్మాణంలో మేము ఇలా గుండ్రం (రౌండ్)గానో లేదా అండాకారం (ఓవల్ షేప్)లోనో లేదా బల్లపరుపు (ఫ్లాటెన్‌డ్)గానో... ఇలా ఈ మూడు ఆకృతుల్లో ఏదో ఒక రకంగా ఉంటాం. అడ్డుకోత నిర్మాణంలో మేము గుండ్రంగా ఉంటే వాళ్ల జుట్టు నిటారుగా స్ట్రెయిట్‌గా పెరుగుతుంది. మేం అండాకరంలో ఉంటే అలలు అలలుగా (వేవీగా) పెరుగుతుంది. ఇక బల్లపరుపుగా ఉంటే రింగులు తిరుగుతుంది. ఇదే నిర్మాణం కేశం పొడవునా ఒకేలా కాకుండా కాస్తంత వేర్వేరుగానూ మారవచ్చు. అందుకే కొన్నిసార్లు కొంత మేర స్ట్రెయిట్‌గా పెరిగినా... ఆ తర్వాత రింగులు తిరుగుతుంటాను. నా నిర్మాణమూ ఆసక్తిదాయకం... నేను (రోమం) మొలిచే చోట ఒక సెంటీమీటరులో నాలుగో వంతు భాగం... చర్మంలోని సెరియమ్ అనే భాగంలో కూరుకుపోయి ఉంటుంది. ఈ సెరియమ్ అనే భాగం ఎపిడర్మిస్ అనే చర్మపు పొర కింద ఉంటుంది. దీనిలో రక్తపు సరఫరాతో పాటు నరాలూ ఉంటాయి. ఈ భాగాన్ని ఫాలికిల్ అంటారు. ఈ భాగంలో నేను నా పొడవును పెంచుకునే ఫ్యాక్టరీలా పనిచేస్తుంటాను. ఆ పనిని రోజులో 24 గంటల పాటు ఏడేళ్లు కొనసాగిస్తాను. ఏడేళ్ల తర్వాతే ఫ్యాక్టరీలోని ఆ భాగానికి విశ్రాంతిని ఇస్తాను. అందుకే అప్పటివరకూ నేను పెరుగుతూనే ఉంటాను. ఏడేళ్ల తర్వాత నేను కాస్త వ్యవధి ఇచ్చి రాలిపోతాను. మళ్లీ నా అంకురం నుంచి పెరగడం మొదలు పెడతాను. ఫాలికిల్ భాగంలో రక్తసరఫరా, నరాలు ఉంటాయి కాబట్టి నన్ను పట్టి లాగితే నొప్పిగా ఉంటుంది. కానీ మిగతా కేశ భాగంలో రక్తసరఫరా, నరాలు ఉండవు. కాబట్టి కట్ చేసినా నొప్పి ఉండదు. ఒక వయసు తర్వాత తెల్లబడటం మామూలే... ఇప్పుడు ఆనంద్ వయసు 47 ఏళ్లు. ఇక అతడి జుట్టులో కొన్ని కేశాలు తెల్లబడటం మామూలే. నా అంకురంలో ఉండే రంగును ఇచ్చే పదార్థాల ఉత్పాదన తగ్గుతూ పోవడమే ఆనంద్ జుట్టు తెల్లబడటానికి కారణం. ఒక విధంగా చెప్పాలంటే... జుట్టు అనే మేము ఆనంద్ ఆరోగ్యాన్ని కూడా రికార్డు చేస్తూ ఉంటాం అని కూడా చెప్పవచ్చు. ఆనంద్ ఆహారంలో చాలా కొద్ది భాగాన్నే తీసుకునే మేము... అతడిలోని పోషకాల లోపాన్ని తెలియపరుస్తాం. ఇప్పుడు ఉన్న మోటారు వాహనాలు వెలువరించే కాలుష్యంతో ఆనంద్ చుట్టూ ఉండే వాతావరణంలో లెడ్ ఎక్కువైతే అది మాలోనూ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆనంద్ వద్ద అతడి తాతగారికి సంబంధించిన జట్టు ఉంటే... దాన్ని ఆనంద్ జుట్టుతో పోల్చితే అతడి కేశాల్లో లెడ్ ఎంతగా పెరిగిందో చెప్పేయవచ్చు. ఇక ఒకవేళ ఆనంద్ తీసుకునే టీలో ఆర్సెనిక్ అనే విషం కలిసిందనుకోండి... మంచి కెమిస్ట్ మమ్మల్ని పరిశీలిస్తే ఆ విషయం వెంటనే తెలిసిపోతుంది. అవన్నీ అపోహలే... మా (జుట్టు) గురించి చాలా అపోహలే ఉన్నాయి. మేం చనిపోయాక కూడా పెరుగుతామన్నది అందులో ఒకటి. అది అబద్ధం. ఇక షేవ్ చేసుకుంటే మేం మరింత దట్టంగా పెరుగుతామన్నది మరో అపోహ. అందుకే ఆనంద్ భార్య తన కాళ్లపై ఉండే మమ్మల్ని షేవ్ చేసుకోడానికి వెనకాడుతుంది. కానీ ఇదీ నిజం కాదు. మేమూ డయాగ్నోజ్ పరీక్షలకు సహాయం చేస్తాం... ఆనంద్ రక్త పరీక్ష, మూత్రపరీక్ష లాగే జుట్టు పరీక్ష చేయించాడనుకోండి. అతడి ఆరోగ్య సమస్యలు కొన్నింటిని మేమూ నిర్ధారణ (డయాగ్నోజ్) చేయగలం. మమ్మల్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లోగానీ, ఎక్స్-రే ద్వారా గాని పరిశీలిస్తే ఆనంద్‌కు ఉన్న జన్యుపరమైన జబ్బులనూ చెప్పగలం. స్కార్లెట్ ఫీవర్ వంటి తీవ్రమైన జ్వరం, నిమోనియా వస్తే మేం రాలిపోతాం. మాకూ ఎన్నో జబ్బులు... ఆనంద్ ఇతర అవయవాల్లాగే మాకూ ఎన్నో జబ్బులు వస్తాయి. మా ఫాలికిల్స్‌లో ఒక్కోసారి చిన్న గడ్డలు (ట్యూమర్స్) రావచ్చు. కొందరిలో ఫంగస్‌కు సంబంధించిన జబ్బులూ (రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్) రావచ్చు. ఇక ‘విటమిన్-ఏ’ ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే మేం రాలిపోవచ్చు. మా మీద వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లూ దాడి చేస్తాయి. కొందరిలో ప్యాచ్‌లు... ప్యాచ్ల్లాగా ఉండే బట్టతల రావచ్చు. అలోపేషియా ఏరేటా అని పిలిచే ఈ బట్టతల ఎందుకు వస్తుందో ఇంకా తెలియదు. కొందరు వంశపారంపర్యంగా వస్తుందంటారు. ఆ టైమ్‌లో పలుచబడతాం... ఆనంద్ యుక్తవయసుకు రాగానే అతడిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్రవిస్తుంది. దాంతో తలపై హెయిర్‌లైన్ వెనక్కుపోతుంటుంది. అలాగే ఆనంద్ భార్యలోనూ గర్భధారణ సమయంలో, ఆ తర్వాత ఆమెలో స్రవించే హార్మోన్లు మా పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. ఆనంద్ భార్య గర్భం దాల్చినప్పుడు ఆమె తలపై మేం దట్టంగా ఉన్నా... ప్రసవం తర్వాత ఆమె తల కాస్త పలచబారుతున్నట్లు ఆనంద్ భార్య గుర్తిస్తుంది. అయితే ఆమె భయపడాల్సిందేమీ లేదు. ప్రసవం అయిన కొన్నాళ్ల తర్వాత ఆమెలోని హార్మోన్ల పాళ్లు చక్కబడ్డ తర్వాత మేం మళ్లీ దట్టంగానే పెరుగుతాం. సాధారణంగా ఆనంద్ భార్యలో ఒత్తిడి పెరిగినప్పుడు స్రవించే పురుష హార్మోన్ కొద్దిపాళ్లలోనే ఉంటుంది. అయితే ఒకవేళ ఆమెలో పురుష హార్మోన్ల పాళ్లు పెరిగితే మాత్రం అది మా పెరుగుదలపై దుష్ర్పభావం చూపుతుంది. మమ్మల్ని సంరక్షించుకోవడం ఎలా...? మా కుదుళ్లలో దుమ్ము పేరుకోకుండా, బ్యాక్టీరియా చేరుకోకుండా జాగ్రత్త పడాలి. ఇందుకోసం వారానికి రెండుసార్లు షాంపూ చేసుకోవడం మేలు. మేం మరీ ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. అదే జరిగితే మేం పెళుసుబారిపోతాం. ఉప్పునీళ్లు, క్లోరినేటెడ్ నీళ్లలో ఈదకుండా జాగ్రత్త పడాలి. మేం ఆరోగ్యంగా ఉండాలంటే... ముందు ఆనంద్ ఆరోగ్యంగా ఉండాలి. అతడి ఆరోగ్యమే మాకు మహా భాగ్యం. - డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ , చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్.