కేన్సర్ వ్యాధి నిర్ధారణతోనే ఎన్నో కుటుంబాలు అతలాకుతలమైపోతాయి. నయం అయి బయటపడితే పర్లేదు..నరకయాతనల మారి బాధపెడితే అనుభవిస్తున్నవారికి, సన్నిహితులకు మాటలకందని వేదనను అనుభవిస్తారు. ఈ కేన్సర్‌లలో కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి ఏకంగా శరీరంలో కేన్సర్ సోకిన లేదా ప్రభావిత భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బాధితులు దివ్యాంగులుగా మారిపోతారు. అలాంటి అరుదైన కేన్సర్ వ్యాధి బారినే పడింది ఇక్కడొక మహిళ. అయితే ఆ కోల్పోయిన భాగానికి సరికొత్తగా వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఊహించని పరిస్థితి ఎదురైతే అవమానంతో కాదు..దాన్ని అంగీకరిస్తూ కొత్త జీవితానికి ఎలా ఆహ్వానం పలకాలో చెప్పింది. పైగా తనలాంటి ఎందరో కేన్సర్ బాధితులకు ప్రేరణగా నిలిచింది. ఆ మహిళ కేన్సర్ కన్నీటి గాథ వింటే..కళ్లు చెమ్మగిల్లకుండా ఉండవు. ఇంతకీ ఈ కథేంటంటే..
అమెరికా(US)సంయుక్త రాష్ట్రాలకు చెందిన 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్(social media influencer ) ఎల్డియారా డౌసెట్(Eldiara Doucette) అరుదైన కేన్సర్ సైనోవియల్ సార్కోమా(synovial sarcoma) బారిన పడింది. ఈ కేన్సర్‌తో పోరాటం కారణంగానే సోషల్ మీడియాలో “బయోనిక్ బార్బీ" గా పేరుగాంచింది. అలా తన అరుదైన కేన్సర్‌కి సంబంధించిన విషయాలు నెటిజన్లతో పంచుకోవడంతో ఇదే సమస్యతో బాధపడుతున్న ఎందరో ఆమెకు స్నేహితులుగా మారారు. అంతేగాదు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోయింగ్‌ని సంపాదించిపెట్టింది.
ఆమెకు మూడేళ్లక్రితం ఈ అరుదైన కేన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయినప్పటి నుంచి ఈ సోషల్ మీడియా జర్నీ ప్రారంభమైంది. ఒక రకంగా ఈ వ్యాధి తనలాంటి ఎందరో భాధితులని ఆమెకు ఆత్మబంధువులుగా చేసింది. అదే ఆమెకు ఈ మహమ్మారితో పోరాడే శక్తిని, స్థైర్యాన్ని అందించింది.
అయితే ఈ కేన్సర్ మహమ్మారి బయోనిక్ బార్బీగా పిలిచే ఎల్డియారాపై గెలవాలనుకుందో ఏమో..!. తన విజృంభణతో ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు కేన్సర్ పునరావృతమవుతూనే ఉంది. ఎడతెగని కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలతో అలిసిపోయింది. ఆ మహమ్మారిపై గెలుస్తున్న ప్రతిసారి దాడి చేసి తిరగబెడుతూనే ఉండేది.
దీంతో ఆమె ఆరోగ్యం దిగజారడం మొదలైంది. ఇక ఆమె బతకాలంటే కేన్సర్‌కణాల ప్రభావం ఎక్కువగా ఉన్న కుడిచేతి(right arm)ని తొలగించక తప్పని స్థితికి వచ్చింది. ఆ కేన్సర్ వ్యాధిని కట్టడిచేయాలంటే ఆ చేతిని కోల్పోక తప్పని స్థితి. ఆ విషమ పరిస్థితుల్లోనే కుడిచేతి మెచేయి వరకు కోల్పోయి కేన్సర్‌ని విజయవంతంగా జయించింది. అయితే ఆ కోల్పోయిన కుడి చేతితో తాను చేసే పనులన్నీ గుర్తొచ్చి ఎల్డియారాకు కన్నీళ్లు ధారగా వచ్చేశాయి .
పుట్టుకతో వికలాంగురాలిగా ఉండటం వేరు..మధ్యలో హఠాత్తుగా వచ్చి పడిన వైకల్యాన్ని అధిగమించడం అంత ఈజీ కాదు. ఇక తాను ఒంటి చేత్తోనే జీవించాలన్న ఆలోచన కూడా జీర్ణించుకోలేనంత బాధను కలుగజేసిందామెకు. అయితే ఈమె మాత్రం సోషల్ మీడియా పోస్ట్‌లో "తన చేయే తనన అంతం చేయాలనుకుంది. కట్‌చేస్తే..అదే బాధితురాలిగా మారిందని ఉద్వేగంగా చెప్పుకొచ్చింది.
అయినా కేన్సర్‌ని ఓడించగలిగానూ, కాబట్టి తాను కోల్పోయిన చేతికి గ్రాండ్‌గా వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు చేయలని నిర్ణయించుకున్నట్లు స్థైర్యంగా చెప్పింది. ఇది తనలా కేన్సర్ కారణంగా అవయవాలు కోల్పోయిన వారిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలని చేస్తున్నట్లు పోస్ట్‌లో వివరించింది. ఇన్నాళ్లు ఎంతగానో ఉపకరించి ఎన్నో పనుల్లో హెల్ప్ చేశావు, అలాగే ఎందరినో ఓదార్చడానికి ఉపయోగపడ్డ ఆ చేతికి కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికింది.
పైగా ఆ కోల్పోయిన చేతిని నైయిల్ పాలిష్‌తో డెకరేట్ చేసి మరీ అంతక్రియలు నిర్వహించింది. "మనకు ఇలా జరగాలని రాసి పెట్టి ఉంటే మార్చలేం లేదా ఆపలేం. అయితే దాన్ని అంగీకరిస్తూ అధిగమిస్తే అంతిమంగా మనమే గెలుస్తామని చెబుతుంది". ఎల్డియా. అలాగే తన జీవితంలోకి వచ్చిన వైకల్యాన్ని అంగీకరించడమే గాక రోబోటిక్ ప్రొస్థెటిక్ మెటల్ రాడ్‌ను అమర్చుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది.
ఆనందంగా ఉండటం అనేది మన చేతిల్లోనే ఉంది. కోల్పోయమనో లేదా పొందలేకపోయమనో బాధపడిపోవడం కాదు..ఆ పరిస్థితిని కూడా మనకు సంతోషాన్ని ఇచ్చేదానిగా మార్చుకుని ఆనందభరితంగా చేసుకోవడమే జీవితం అని చాటిచెబుతోంది ఎల్డియారా. అంతటి పరిస్థితులోనూ తాను ఆనందంగా ఉండటమే గాక ఇతరులు కూడా తనలా అలాంటి పరిస్థితిని అధిగమించి సంతోషంగా ఉండాలని కోరుకోవడం నిజంగా గ్రేట్ కదూ..!.
(చదవండి: దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..)
Comments
Please login to add a commentAdd a comment