amputation
-
ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..?
బ్యాంకాక్: నడిచే ఎస్కలేటర్ లో పొరపాటున కాలు పడి ఇరుక్కోవడంతో 57 ఏళ్ల మహిళ మోకాలి పైభాగం వరకు కాలును తొలగించిన సంఘటన థాయ్ లాండ్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. దీంతో పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో సౌకర్యాలపై అనుమానాలు కమ్ముకుని, ఇకపై బ్యాంకాక్ పర్యటన అంటే పర్యాటకులు ఆలోచించే పరిస్థితి నెలకొంది. డాన్ ముయాంగ్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కారంత్ తనకుల్జీరపత్ తెలిపిన వివరాల ప్రకారం నఖోన్ సి తమ్మారత్ వెళ్తోన్న ఒక మహిళ నడిచే ఎస్కలేటర్ మీద వెళ్తుండగా ఉన్నట్టుండి ఆమె కాలు ఎస్కలేటర్ లోపల ఇరుక్కుపోయింది. చాలాసేపు నొప్పితో విలవిల్లాడిపోయిన ఆ మహిళకు విముక్తి కలిగించడానికి విశ్వప్రయత్నాలు చేశామని అన్నారు. ఇరుక్కున్న కాలిని విడిపించేందుకు చాలాసేపు శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. చివరి ప్రయత్నంలో ఆమె కాలును మోకాలి పైభాగం వరకు తొలగించి అనంతరం దగ్గర్లోని బుమ్రుంగ్రాండ్ అంతర్జాతీయ హాస్పిటల్ కు తరలించామని తెలిపారు కారంత్. ప్రమాదానికి గల కారణం ఏమిటన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మా వలన ఆ మహిళకు జరిగిన నష్టానికి నా సానుభూతి తెలియజేస్తున్నానని.. జరిగిన తప్పిదానికి మేము పూర్తి బాధ్యత వహిస్తామని, ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు తోపాటు ఆమెకు ఎలాంటి పరిహారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కారంత్. బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. మా అమ్మ పైకి ధైర్యంగానే ఉన్నప్పటికీ కాలు తీసేయడంతో ఆమె గుండె బద్దలైందని ఒకే కాలితో జీవితాంతం ఎలాగన్న ఆలోచన తనను లోలోపలే తొలిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
పనోడి సాయంతో పేషెంట్‌కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..
వైద్యులు రోగికి చికిత్స చేసేటప్పుడూ ట్రైయినింగ్ అవుత్ను నర్సు లేదా కనీసం వైద్యా విధానంపై కనీస అవగాహన ఉన్న వ్యక్తి సాయం తీసుకోవడం జరుగుతుంది. అలాకాకుండా ఏ మాత్రం వైద్యం గురించి అవగాహన లేని ఓ సాధారణ వ్యక్తి అదీకూడా ఆస్పత్రిని క్లీన్ చేసే వ్యక్తి సాయం తీసుకుంటే.. ఎవ్వరికైన వొళ్లు మండిపోతుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. ఒకవేళ పేషెంట్‌కి ఏదైన సమస్య ఎదురైతే ఆ తప్పుని సరిచేయడం అనేది అసాధ్యం. కానీ ఒక వైద్యుడు అలానే చేసి ఉద్యోగం పోగొట్టుక్నునాడు. ఈ షాకింగ్ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..జర్మనీలో మెయిన్జ్ యూనివర్శిటీకి చెందిన ఆస్పత్రిలో ఓ వైద్యుడు ఒక పేషెంట్‌కి కాలు తీసేవేసే ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఐతే ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆయన ఓ క్లీనర్ సాయం తీసుకున్నాడు. పేషెంట్‌కి మత్తుమందు ఇచ్చిన తర్వాత అతని కాలుని పట్టుకోమని చెప్పి వైద్య పరికారలను అందించమని కోరాడు. దీంతో సదరు క్లీనర్ ఆ వైద్యుడు సర్జరీలో సాయం అందించి ఆపరేషన్ థియోటర్ నుంచి బయటకు రావడంతో గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఆ వైద్యుడిపై ఫైర్ అయ్యింది. ఇదిలా ఉండగా, సర్జరీ చేయించుకున్న పేషెంట్‌కి ఎలాంటి హాని జరగలేదు. అతను సురక్షింతంగానే ఉన్నాడు. కానీ ఇలాంటి క్లిష్టమైన స్థితిలో సాయం చేసే మెడికల్ సిబ్బంది గురించి వాకబు చేయాలి లేదా ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకురావలి గానీ అలా చేయకూడదంటూ సదరు వైద్యుడికి ఆస్పత్రి యాజమాన్యం చివాట్లు పెట్టింది. ఈ ఘటన కారణంగా సదరు వైద్యుడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన 2020లో జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తున్న రష్యా బలగాలు.. పుతిన్ అభినందనల వెల్లువ) -
బిడ్డకు జన్మనివ్వడంతోనే..వికలాంగురాలిగా మారిన ఓ తల్లి..
ఏ తల్లికి అయినా మాతృత్వం అనేది చాలా గొప్ప అనుభూతి. ఆ మధుర క్షణాలు ప్రతి తల్లికి గొప్ప జ్ఞాపకంలాంటివి. అలాంటి మాతృత్వమే ఆమెకు శాపంగా మారింది. డెలివరీ అయ్యి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. హాయిగా తన బిడ్డతో గడపాలనుకునేలోపే మళ్లీ ఆస్పత్రి పాలై వికలాంగురాలిగా మారిపోయింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. అమెరికాలోని క్రిస్టినా పచెకో అనే మహిళ రెండో బిడ్డకు జన్మినిచ్చింది. ఆమెకు సీజెరియన్ చేసి బిడ్డను తీశారు. ఆమె ఆపరేషన్ చేయించుకుని.. రెండు రోజుల అనంతరమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఐతే ఇంటికి వచ్చిన తర్వాత నుంచే నలతగా ఉండటం ప్రారంభించింది. ఆపరేషన్ వల్లే అలా అనిపిస్తుందంటూ నర్సు ఒక ఇంజక్షన్‌ని కూడా ఇచ్చింది. అయినా క్రిస్టినా ఇంకా అలా డల్‌గానే ఉంది. విపరీతమైన జ్వరంతో చాలా నీరసించిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా.. ఆస్పత్రికి తరలించారు. ఐతే అక్కడ ఆమె శరీరం సెప్టిక్‌కి గురయ్యిందని తేలింది. ఆ ఇన్ఫెక్షన్ అంతా కాళ్లు, చేతులకు వ్యాపించినట్లు వెల్లడించారు వైద్యులు. దీంతో ఆమె రెండు చేతులు, పాదాలను తొలగించాల్సి వచ్చింది. ఇలా మొత్తం ఆమె ఆస్పత్రిలోనే సుమారు నాలుగుల నెలల వరకు ఉండాల్సి వచ్చింది. ఈ మేరకు క్రిస్టినా మాట్లాడుతూ.. ఆరోజు ఇప్పటికి మర్చిపోలేనంటూ నాటి సంఘటనను గుర్తు తెచ్చుకుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగానే..అలా కళ్లు మూతబడిపోయాయని చెబుతుంది. తన భర్త ప్లీజ్ కళ్లు తెరు మన పిల్లలు అంటూ ఏడుస్తున్న మాటలు వినిపిస్తున్నా.. తాను లేవలేకపోతున్నట్లు అనిపించిందని, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తనకు తెలియదంటూ.. చెప్పకొచ్చింది. ఏది ఏమైతే తాను ఆ భయానక పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడిగలిగానూ అదే చాలు, ఇప్పుడూ నా ఇద్దరూ పిల్లలను బాగా చూసుకోవాలి అని ఆనందంగా చెబుతోంది. (చదవండి: ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!) -
ఇకపై క్యాన్సర్‌తో కాళ్లూ, చేతులు కోల్పోనక్కర్లేదు!
గతంలో క్యాన్సర్ కాళ్లూ లేదా చేతులకు సంబంధించిన ఎముకలకు సోకిందంటే... దాన్ని దేహం నుంచి వేరు చేయాల్సిన పరిస్థితి ఉండేది. అలా చేయడాన్ని ఇంగ్లిష్‌లో ‘యాంపుటేషన్’గా వ్యవహరిస్తారు. దాంతో ఇక ఆ వ్యక్తి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి రాకుండా కాపాడదామంటే క్యాన్సర్ అలా అలా ఆరోగ్యకరమైన కణజాలానికి పాకుతూ పరిస్థితిని మరింత దుర్భరం చేస్తుందన్న అంశం తెలిసిందే కదా. కానీ ఇప్పుడు సాంకేతిక పురోగతి, అధునాతన వైద్యవిజ్ఞానాల నేపథ్యంలో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. గతంలో లాగా ఇప్పుడూ కాళ్లూ, చేతుల యాంపుటేషన్ లేకుండా... వాటిని రక్షించేందుకు చాలావరకు మార్గం సుగమమైంది. అందుకు దోహదపడేదే ‘లింబ్ సాల్వేజ్ సర్జరీ’. ఆ ప్రక్రియపై అవగాహన కలిగించే కథనమిది. లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటే..? క్యాన్సర్ గడ్డలనూ, వ్రణాలను శస్త్రచికిత్సతో తొలగిస్తారన్న విషయం తెలిసిందే. ఒకవేళ అది ఎముకకు పాకితే కేవలం ఆ గడ్డ (ట్యూమర్)ను మాత్రమే కాకుండా... చుట్టుపక్కల ఉండే కొంతభాగాన్ని కూడా తొలగిస్తారు. ఎందుకంటే ఒకవేళ అక్కడ పొరబాటున చిన్నపాటి క్యాన్సర్ కణం ఉన్నా... మళ్లీ అది పెరుగుతూ, వ్యాప్తిచెందుతూ నష్టం చేస్తుంది. కాలు లేదా చేయి విషయంలోనూ ఇదే జరుగుతుంది కాబట్టి గతంలో ప్రభావితమైన ప్రాంతాన్ని తొలగించడంలో భాగంగా కాలూ, చేతినీ తీసేయాల్సి వచ్చేది. అయితే అలా కాకుండా చాలా సునిశితంగా కేవలం ప్రభావితమైన గడ్డ మేరకు తొలగించి, ఎముకలోనూ ప్రభావితమైన ప్రాంతంలో కొత్త ఎముక భాగాన్ని తిరిగి అతికించేలా సర్జరీ నిర్వహించడాన్ని ‘లింబ్ సాల్వేజ్ సర్జరీ’గా చెప్పవచ్చు. మిగతా అవయవభాగాలతో పోలిస్తే ఎముక భాగంలో ఇలా కొత్త ఎముకను గ్రాఫ్ట్ చేయడం ఒకింత సవాలుతో కూడిన విషయం. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి తేడా రాకుండా జాగత్తగా శస్త్రచికిత్స నిర్వహించాలి. ఇందుకోసం కొన్ని ప్రక్రియలు అవలంబించాల్సి వస్తుంది. అవి... అల్లోగ్రాఫ్ట్ బోన్ రీప్లేస్మెంట్ : అవయవదానంలో భాగంగా బ్రెయిన్‌డెడ్‌గా మృతిచెందిన వ్యక్తుల నుంచి గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్లు (కళ్ల విషయంలోనైతే మృతి చెందాక కూడా కొంతసమయం వరకు సేకరించవచ్చు) వంటివి సేకరించడం మామూలే. ఇదే తరహాలో... మృతిచెందిన ఆరోగ్యవంతుడి దేహం నుంచి ఎముకలను సేకరించి, బోన్బ్యాంక్లో సుస్థిరపరుస్తారు. ఇలా సుస్థిరపరచిన ఎముకను... బాధితుడి దేహం నుంచి క్యాన్సర్‌కు లోనైన ఎముక పరిసర భాగాన్ని తొలగించిన ప్రదేశంలో, అవసరమైన మేరకు గ్రాఫ్ట్ చేస్తూ అమర్చడమే ‘అల్లోగ్రాఫ్ట్ బోన్ రీప్లేస్మెంట్’. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు, పరిమితులు ఉన్నాయి. ఒక్కోసారి ఇలా చేసే సమయంలో ఇన్ఫెక్షన్లు, గ్రాఫ్ట్ చేసిన చోట ఫ్రాక్చర్ కావడం వంటి సమస్యలు రావచ్చు. ఎండోప్రోస్థెసిస్ : ఈ ప్రక్రియతో లింబ్ సాల్వేజ్ చికిత్సలో పెను మార్పులు వచ్చాయి. ఎముకను రక్షించడంలో ఈ ఎండోప్రోస్థెసిస్ విప్లవాత్మకమైన భూమిక పోషిస్తోంది. ఇందులో మృతుడి శరీరం నుంచి కాకుండా... ఎలాంటి రసాయన చర్యలకు లోనుకాని లోహం (ఇనర్ట్ మెటల్)తో తయారు చేసిన... ఎముకకు ప్రత్యామ్నాయ భాగాన్ని అవసరమైన చోట అమరుస్తారు. సాధారణంగా ఆ భాగాన్ని ‘టైటానియమ్’ అనే లోహంతో రూపొందిస్తుంటారు. ఇందులోనూ కొన్ని ఇబ్బందులున్నాయి. ఇలా కృత్రిమంగా రూపొందించిన భాగాల జీవితకాలం చాలా పరిమితంగా ఏ పది లేదా పదిహేనేళ్లు ఉంటుంది. ఇది ఎండోప్రోస్థెసిస్ లో ఉండే పరిమితి. టీష్యూ రీజనరేషన్ : కాళ్లూ–చేతులను రక్షించే ఈ లింబ్ సాల్వేషన్ లో... టిష్యూ రీజనరేషన్ అన్నది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రంగం. బాధితుడి సొంత కణాలను సేకరించి, ‘ప్యూరిఫైడ్ ప్రోటీన్ గ్రోత్ ఫ్యాక్టర్’లాంటి చర్యలతోనూ, ‘సింథటిక్ మాట్రిక్స్ మెటీరియల్’ లాంటి కృత్రిమ పదార్థాలతో... బాధితుడు కోల్పోయిన అదే కణాలూ, కణజాలాలను... మళ్లీ ముందులాగే పెరిగేలా చేయడమే ఈ ‘టిష్యూ రీజనరేషన్’ ప్రక్రియ. ఇలా చేయడానికి కాలు లేదా చేతిలోని ఇతర కణజాలాలు, కండరాలూ, ఎముకలూ, కీళ్లు బలంగా ఉండాలి. ఆ తర్వాత కూడా... కృత్రిమంగా కణజాలం పెరిగిన చోట... అంతకుముందులాగే నాడీకణాల వ్యవస్థ–నరాలూ... అలాగే రక్తప్రసరణ వ్యవస్థలోని రక్తనాళాలూ అంతకుమునుపు ఉన్నట్లే పెరిగేలా చేయగలగాలి. అప్పుడే కాళ్లూ, చేతులు అంతకుముందులాగే పనిచేయగలుగుతాయి. ‘లింబ్ స్వాలేషన్’ సా«ధ్యం కాని పరిస్థితులు ►ఎముకకు క్యాన్సర్ సోకడం వల్ల అది బలహీనమై విరిగిన సందర్భంలో (పాథలాజికల్ ఫ్రాక్చర్స్). ►అంతకు మునుపు నిర్వహించిన బయాప్సీలో తేడాలు ►క్యాన్సర్ సోకిన ఎముకను క్యూరెటేజ్ చేసి తొలగించినప్పుడు ►కీమోథెరపీ తర్వాత కూడా క్యాన్సర్ ఆగకుండా అదేపనిగా విస్తరిస్తూ ఉండటం. పై కండిషన్స్ మినహా ఇప్పుడు చాలా సందర్భాల్లో కాళ్లూ–చేతులను కోల్పోవాల్సిన పరిస్థితులను వీలైనంతగా తగ్గించడమిప్పుడు సాధ్యమవుతోంది. ఇదీ ఇటీవలి కాలంలో వైద్యరంగంలో చోటు చేసుకున్న మంచి పురోగతి. డా. అజయ్ చాణక్య వల్లభనేని, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ -
రేప్ చేస్తే కాళ్లు, చేతులు తీసేయాలి
మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్ల కాళ్లు, చేతులు తీసేయాలని పలువురు మహిళా ఎమ్మెల్సీలు అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల మీద శాసన మండలిలో సోమవారం చర్చ జరిగింది. మహిళల కోసం 1090 హెల్ప్‌లైన్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండలికి తెలిపారు. అయితే, మహిళలపై దాడులను అరికట్టడానికి బహిరంగ చట్టాలు తేవాలని పలువురు ఎమ్మెల్సీలు కోరారు. ఈ దాడులకు పాల్పడేవాళ్లకు బెయిల్ ఇవ్వడం సరికాదని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు.