మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్ల కాళ్లు, చేతులు తీసేయాలని పలువురు మహిళా ఎమ్మెల్సీలు అన్నారు.
మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్ల కాళ్లు, చేతులు తీసేయాలని పలువురు మహిళా ఎమ్మెల్సీలు అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల మీద శాసన మండలిలో సోమవారం చర్చ జరిగింది. మహిళల కోసం 1090 హెల్ప్లైన్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండలికి తెలిపారు.
అయితే, మహిళలపై దాడులను అరికట్టడానికి బహిరంగ చట్టాలు తేవాలని పలువురు ఎమ్మెల్సీలు కోరారు. ఈ దాడులకు పాల్పడేవాళ్లకు బెయిల్ ఇవ్వడం సరికాదని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు.