motor
-
చచ్చుబడిపోయిన చేతులకు అభయ హస్తం..!
సమస్యల గురించి వినడమే తప్ప పరిష్కారాల గురించి అవగాహన లేని వయసులో సైన్స్‌పై అమిత ఆసక్తి పెంచుకున్నాడు తమిళనాడుకు చెందిన శివసంతోష్. ఆ ఆసక్తే ఆవిష్కరణకు బీజం వేసింది. 21 ఏళ్ల వయసులో రోబోటిక్స్ స్టార్టప్‌ను ప్రారంభించేలా చేసింది...హెల్త్‌కేర్, ఎనర్జీ ప్రొడక్షన్, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి 21 ఏళ్ల శివసంతోష్ రోబోటిక్స్ స్టార్టప్ ‘మైక్రోమోటిక్’ను ప్రారంభించాడు. ‘లింబ్ మొబిలిటీ’ని పునరుద్ధరించడానికి డిజైన్ చేసిన ఈ తేలికపాటి వేరబుల్ మోటర్ సిస్టమ్ స్ట్రోక్, స్పైనల్ కార్డ్ ఇంజురీస్, సెరిబ్రల్ పాల్సీ, పార్కిన్స్ డిసీజ్...మొదలైన బాధితులకు ఉపయోగపడుతుంది. ఈ లింబ్ అసిస్ట్‌ను ఉపయోగించి కప్పులు, ప్లేట్లు, బ్యాగులు... మొదలైన వాటిని పట్టుకోవచ్చు. తీసుకెళ్లవచ్చు. రాయవచ్చు. టైపింగ్ చేయవచ్చు. ఫింగర్ మూమెంట్స్‌కు సంబంధించి ఎన్నో పనుల్లో లింబ్ అసిస్ట్ సహాయపడుతుంది.పుదుకొట్టై జిల్లా కీరమంగళం అనే చిన్న పట్టణంలో ఈ స్టార్టప్‌ను పప్రాభించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. దీనికి శివ చెప్పే జవాబు...‘స్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం. మా ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం. ఇన్నోవేషన్ కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని నిరూపించాలనుకున్నాను’ శివసంతోష్కు చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే ఎంతో ఇష్టం. రకరకాల యంత్రాలు ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. స్కూల్ ప్రాజెక్ట్‌లతో సైన్స్‌పై మరింత ఆసక్తి పెరిగింది. సైన్స్‌కు సంబంధించి రకరకాల పోటీలలో విజేతగా నిలిచేవాడు. ఈ నేపథ్యంలో తన ఆలోచనలు ఆవిష్కరణల చుట్టూ తిరిగేవి.‘కోవిడ్ మహమ్మారి టైమ్‌లో స్థానిక ఆసుపత్రుల కోసం ఆటోమేటిక్ శానిటైజర్ స్ప్రేయర్, యూవీ జెర్మిసైడ్ను డెవలప్ చేశాను. మరో వైపు శాటిలైట్ టెక్నాలజీ గురించి అధ్యయనం చేయడం మొదలు పెట్టాను’ అంటున్నాడు శివ. ఆ ఆసక్తి, అధ్యయనం అతడిని మరింత ముందుకు తీసుకెళ్లింది.మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన శివసంతోష్ ప్రస్తుతం చెన్నైలోని అన్నా యూనివర్శిటీ–కేసీజీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బీఈ చదువుతున్నాడు. తన స్టార్టప్ కోసం ఎక్కువ సమయం కేటాయించేందుకు శివసంతోష్కు కాలేజీ అనుమతి ఇచ్చింది.ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్స్‌తో మల్టీ యాక్సిస్ విండ్ టర్బైన్ను డెవలప్ చేయడంపై కూడా ఈ స్టార్టప్ కృషి చేస్తోంది. ‘డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ సమయాల్లో ఇళ్లు, వ్యాపారాలకు బ్యాకప్ పవర్‌కు సంబంధించి పవర్ జెనరేషన్‌కు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది’ అంటున్నాడు శివసంతోష్."మూడు పదాలను నమ్ముకుంటే చాలు మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి. అవి... ఎందుకు? ఏమిటి? ఎలా? సైన్స్‌పై ఆసక్తితో ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? నుంచి విమానం ఎలా ఎగురుతుంది? వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. శాస్త్రీయ విషయాలపై లోతైన అవగాహన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని." చెబుతున్నాడు శివసంతోష్.(చదవండి: -
చైనా వాళ్లు వస్తేనే మోటార్ ఆన్!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. నిధుల వ్యయం నుంచి పంప్‌హౌస్‌లో మోటార్లు నడిపించే వరకు ప్రతీ అంశంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. అక్విడెక్టులు, పంప్‌హౌస్‌ల నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తయ్యాయి. అయితే ప్రధాన కాల్వల నిర్మాణం పూర్తి కాకపోవడంతో రూ.వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు సాగునీరు అందలేదు. దీంతో ఇప్పటి వరకు అందుబాటులోకి వచి్చన సీతమ్మసాగర్ ప్రధాన కాల్వను నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు కలిపేలా కొత్తగా రాజీవ్ కెనాల్‌కు శ్రీకారం చుట్టారు. రాజీవ్ కెనాల్ ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో 1.50 లక్షల ఎకరాలకు గోదావరి నీరు అందించాలని నిర్ణయించారు. డ్రై రన్‌కు వెనకడుగు.. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో ఉన్న మొదటి పంప్‌హౌస్‌లో 25 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు మోటార్లు, రెండో పంప్‌హౌస్‌లో 40 మెగావాట్ల సామర్థ్యం గల ఆరు మోటార్లు, మూడో పంప్‌హౌస్‌లో 40 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లు ఐదు, 30 మెగావాêట్ల సామర్థ్యం గల మోటార్లు రెండు ఉన్నాయి. ప్రస్తుత అవసరాల ప్రకారం ఒక్కో పంప్‌హౌస్‌లో ఒక్కో మోటార్‌ను నడిపించి నీటిని లిఫ్ట్ చేసినా సరిపోతుంది. దీంతో ఈ పంప్‌హౌస్‌ల్లో డ్రై రన్‌కు వడివడిగా ముందుకు కదిలిన ప్రభుత్వం.. చివరి నిమిషంలో వెనకడుగు వేసింది. చైనా తంటాలు.. మూడు పంప్‌హౌస్‌ల్లో మొత్తం 19 మోటార్లను చైనాకు చెందిన షాంఘై ఎలక్ట్రిక్ కంపెనీ రెండేళ్ల క్రితమే బిగించింది. అయితే ప్రధాన కాల్వల నిర్మా ణం కాకపోవడం, విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో రెండేళ్లుగా అవి ఖాళీగానే ఉన్నాయి. దీంతో కంపె నీకి చెందిన ఇంజనీర్లు చైనా వెళ్లిపోయారు. రెండేళ్ల పాటు మోటార్లు, పంపులు అలాగే ఉండటంతో వా టి ప్రస్తుత పరిస్థితి ఏంటనే అంశంపై స్పష్టత లేదు. విదేశాంగ శాఖకు చేరిన పంచాయితీ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అంశంపై ఇటు ఎల్అండ్టీ, అటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య డిఫెక్ట్ లయబులిటీ అంశంపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సొంతంగా మోటార్లు ఆన్ చేసి రిస్క్ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో చైనా బృందాన్ని త్వరగా ఇక్కడకు తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను సంప్రదించారు. సాధ్యమైనంత త్వరగా చైనా ఇంజనీర్లను రప్పించేలా ప్రయతి్నస్తున్నారు తప్పితే రిస్క్ తీసుకొని మోటార్లు ఆన్ చేసేందుకు సాహసించడం లేదు. ఆగçస్టు 15 నాటికి సారునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రకారమే ముందుకెళ్లడం మేలనే భావనలో ప్రభుత్వం ఉంది. -
చిన్న పరికరం.. పెద్ద ప్రయోజనం - వీడియో
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి. బైకులు, కార్లలో మాదిరిగా కాకుండా.. సైకిల్స్‌లో చిన్న బ్యాటరీ లేదా ఈ-బైక్ కన్వర్షన్ కిట్లు ఉంటాయి. బ్యాటరీల గురించి విన్న చాలామందికి కన్వర్షన్ కిట్ల గురించి తెలియకపోవచ్చు. ఈ కథనంలో మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. ఈ-బైక్ కన్వర్షన్ కిట్లు సాధారణ సైకిల్‌కు అదనంగా యాడ్ చేయడానికి అనుగుణంగా ఉంటాయి. ఇది మౌంట్ చేసుకున్న తరువాత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ ఫోటోలలో గమనించినట్లయితే డిస్క్ బ్రేక్‌కు అమర్చిన కన్వర్షన్ కిట్ చూడవచ్చు. (Image credit: Skarper / Red Bull) ఇక్కడ కనిపించే కన్వర్షన్ కిట్‌ను స్కార్పర్ అనే స్టార్టప్ ఈ ఏడాది పరిచయం చేసింది. ఇది ఒక అధునాతన టూ-మోడ్ ఎలక్ట్రిక్ బైక్ మోటారు. కస్టమ్ డిజైన్ చేసిన డిస్క్ బ్రేక్‌కు క్లిప్ చేసుకోవచ్చు. ఇది పూర్తి గేర్‌బాక్స్‌గా పనిచేస్తుంది. బైక్‌పై కస్టమ్ డిస్క్‌ని ఇన్స్టాల్ చేసిన తర్వాత, మోటారును ఆన్ లేదా ఆఫ్ చేయడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. పవర్ అనేది వెంటనే మారుతుంది. కన్వర్షన్ కిట్ తయారీకి సంస్థకు ఏకంగా మూడు సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఇది సైకిల్లో డిస్క్ బ్రేక్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. ఈ కిట్‌ను మౌంట్ చేయడం లేదా రిమూవ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి వినియోగదారుని అవసరమైనప్పుడు మౌంట్ చేసుకోవచ్చు, మిగిలిన సమయంలో తీసి ఇంట్లో జాగ్రత చేసుకోవచ్చు. ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేతిలో పట్టుకెళ్ళడానికి అనుకూలంగా ఉండే కన్వర్షన్ కిట్ ధర 1295 యూకే పౌండ్స్ (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.30 లక్షలకంటే ఎక్కువ) అని తెలుస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ఈ కిట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో గొప్ప ఆదరణ పొందుతుందని తయారీదారులు భావిస్తున్నారు. -
హైదరాబాద్ కేంద్రంగా ‘హ్యుందాయ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా గ్రూప్ హ్యుందాయ్ మోటార్ భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ విభాగంలో నాయకత్వ స్థానం కోసం సిద్ధమవుతోంది. భవిష్యత్తులో పోటీతత్వ ఈవీ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని కంపెనీ మంగళవారం తెలిపింది. 2032 నాటికి దేశీయంగా అయిదు కొత్త ఈవీలను ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ నిర్ణయించింది. కొత్త ఈవీల పరిచయం, తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు వచ్చే 10 ఏళ్లలో రూ.20,000 కోట్లకుపైగా పెట్టుబడి చేయనున్నట్టు 2023 మే నెలలో సంస్థ ప్రకటించింది. ఈవీలు, అటానమస్ సహా భవిష్యత్ మోడళ్ల పరిశోధన కోసం హైదరాబాద్‌లోని రిసర్చ్, డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్‌ను కేంద్ర బిందువుగా మార్చాలని గ్రూప్ యోచిస్తోంది. ఈ కేంద్రంలో భారతీయ భాషల్లో వాయిస్ రికగి్నషన్ టెక్నాలజీని సైతం అభివృద్ధి చేస్తారు. భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమ 2030 నాటికి 50 లక్షల యూనిట్లను దాటుతుంది. వీటిలో ఎస్‌యూవీల వాటా 48 శాతం. ఆ సమయానికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాయని హ్యుందాయ్ తెలిపింది. 2022–23లో భారత్‌లో అన్ని కంపెనీలవి కలిపి 48,104 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. భవిష్యత్ వ్యూహంపై.. ‘భారత విపణిలో కంపెనీ కార్ల విక్రయాలు పెరిగేందుకు హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. అలాగే కొరియాలోని హుందాయ్–కియా నమ్యాంగ్ ఆర్అండ్డీ సెంటర్‌తో కలిసి భారత మార్కెట్ కోసం వాహనాలను అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగా టెస్టింగ్ కోసం కొత్త సదుపాయం నిర్మాణం గత సంవత్సరం ప్రారంభమైంది’ అని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్ యూసన్ ఛంగ్ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్‌తోపాటు చెన్నైలోని తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భవిష్యత్ వ్యూహంపై కంపెనీకి చెందిన కీలక అధికారులతో చర్చించారు. భారీ లక్ష్యంతో.. ఎస్‌యూవీలలో నాయకత్వ స్థానాన్ని బలోపేతం చేయడం, ఈవీ మోడళ్లను విస్తరించడం ద్వారా పరిమాణాత్మకంగా వృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు హ్యుందాయ్ వెల్లడించింది. ‘నాలుగేళ్లలో ఈవీ చార్జింగ్ సెంటర్ల సంఖ్యను 439కి చేర్చనున్నాం. గ్రూప్ కంపెనీ అయిన కియా 2025 నుండి భారత కోసం చిన్న ఈవీలను ఉత్పత్తి చేస్తుంది. ఇతర ఈవీ మోడళ్లతోపాటు వినియోగదార్లు కోరినట్టు కస్టమైజ్డ్ (పర్పస్ బిల్ట్ వెహికల్స్) అందిస్తుంది. కొత్త మోడళ్ల పరిచయం, ప్రస్తుతం ఉన్న 300 షోరూమ్‌లను రెండింతలు చేయాలన్నది కియా ప్రణాళిక. ప్రస్తుతం కియా మార్కెట్ వాటా 6.7% ఉంది. సమీప కాలంలో దీన్ని 10%కి చేర్చాలన్నది కియా 2.0 వ్యూహం’ అని హ్యుందాయ్ తెలిపింది. -
Viral Video: మార్కెట్లోకి సరికొత్త లాంగ్ మోటార్ సైకిల్ ..!
-
మరో బాహుబలి మోటార్ వెట్‌రన్ సక్సెస్
రామడుగు (చొప్పదండి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీపూర్ పంపుహౌస్ (గాయత్రి)లో నీటి పారుదల శాఖ అధికారులు సోమవారం రాత్రి 9.15 గంటలకు 4వ బాహుబలి విద్యుత్ మోటార్ వెట్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం అధికారులు ఇక్కడ 5వ బాహుబలి మోటార్‌కు విజయవంతంగా వెట్‌రన్ నిర్వహించిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 4వ మోటార్ వెట్‌రన్‌కు ఏర్పాట్లు చేసుకున్న అధికారులు కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించారు. అనంతరం రాత్రి వెట్‌రన్ నిర్వహించారు. రాష్ట్ర సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి స్విచ్ఆన్ చేసి మోటార్‌ను ప్రారంభించారు. ఈ వెట్‌రన్ కార్యక్రమంలో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్, డీఈఈ గోపాలకృష్ణ, ఏఈఈలు సురేశ్, రమేశ్, శ్రీనివాస్ ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. దాదాపు గంటపాటు ఈ వెట్‌రన్‌ను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. -
ఎంజీ మోటార్ నుంచి ‘ఎస్యూవీ హెక్టర్’..!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు భారత అనుబంధ సంస్థ అయిన ఎంజీ మోటార్ ఇండియా త్వరలోనే స్పోర్ట్–యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ)ను విడుదలచేయనుంది. ‘హెక్టర్’ పేరుతో ఈఏడాది మధ్యనాటికి కారు విడుదలకానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చబా మాట్లాడుతూ... ‘ఎస్యూవీ విభాగం ఇప్పుడు భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ఇక్కడి వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా భారీస్థాయిలో ఈ కారును ఇంజనీరింగ్ చేయగలిగాం. ఈ ఎస్యూవీ పూర్తిగా కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ కారు ఉత్పత్తి నిమిత్తం గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో రూ.2,000 కోట్లను పెట్టుబడి పెట్టిన ఈ కంపెనీ.. వచ్చే ఐదేళ్లలో రూ.5,000 కోట్లకు పెట్టుబడిని పెంచనున్నట్లు తెలిపింది. -
జల్సాల కోసం చోరీల బాట
మోటారు బైక్‌ల దొంగలు అరెస్టు రూ.3.60 లక్షల విలువైన బైక్‌లు స్వాధీనం కాకినాడ క్రైం : వారంతా యువకులు.. చదువు అబ్బకపోవడంతో బలాదూర్‌గా తిరుగుతూ, అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు చోరీల బాటపట్టారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. కాకినాడ సిటీ పరి«ధిలో ఇటీవల మోటారు బైక్‌ల వరుస మాయం సంఘటనలపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.3.60 లక్షల విలువైన 14 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం కాకినాడ త్రీటౌన్ క్రైం పోలీస్ స్టేçషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాకినాడ క్రైం డీఎస్పీ ఎ.పల్లపురాజు నిందితుల వివరాలను వెల్లడించారు. సామర్లకోట మండలం మాధవపట్నం అంబేడ్కర్ కాలనీకి చెందిన 19 ఏళ్ల బొలిపే రాజబాబు (రాజు), ఇదే కాలనీకి చెందిన బారిక వెంకటరమణలు పాత నేరస్తులు. వీరు గతంలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. పెదపూడి మండలం కరకుదురు గ్రామానికి చెందిన బొంతు సూరిబాబు (సురేష్), ఒక మైనర్ బాలుడు కలసి మూడు నెలలుగా కాకినాడ వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ క్రైం పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 మోటార్ బైక్‌లను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మోటార్ బైక్‌ల దొంగతనాలపై ఏఎస్పీ ఏఆర్ దామోదర్ పర్యవేక్షణలో తన ఆధ్వర్యంలో త్రీటౌన్ క్రైం ఎస్సై ఎస్ఎం.పాషా, క్రైం పార్టీ ఆధ్వర్యంలో మూడు నెలలుగా దర్యాప్తు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నలుగురు నిందితుల్లో ఇద్దరు పాత వారే.. కాకినాడ సాంబమూర్తినగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చోరీల పర్వం వెలుగుచూసింది. వీరి వద్ద నుంచి రూ.2.10 లక్షల విలువ చేసే 4 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదే విధంగా కాకినాడ టూటౌన్ క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు మోటారు బైక్‌లు చోరీకి గురయ్యాయి. వీటిని కాకినాడ రాజీవ్ గృహకల్ప వద్ద, డైరీఫారం సెంటర్లో చవ్వాకుల దుర్గాప్రసాద్ వద్ద నుంచి క్రైం ఎస్సై రామారావు అరెస్టు చేసి, రూ.1.50 లక్షల విలువ చేసే 5 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను శనివారం అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్టు తెలిపారు. బాలుడిని జువైనల్ యాక్టు ప్రకారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. సమావేశంలో క్రైం ఎస్సైలు ఎస్ఎం పాషా, హరీష్‌కుమార్, రామారావు, క్రైం పార్టీ పోలీసులు పాల్గొన్నారు. -
అల్లివలసకు తాగునీటి మోటారు అందించిన జెడ్పీటీసీ
రణస్థలం: గ్రామాలకు కనీసం తాగునీరు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని వైఎస్ఆర్ సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యులు గొర్లె రాజగోపాల్‌లు తెలిపారు. అల్లివలస గ్రామంలో తాగునీటి సమస్యపై ఈ నెల 17న సాక్షిలో ‘గొంతెండుతోంది’ అన్న శీర్షికన కథనం వెలువడింది. దీనికి స్పందించిన జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె రాజగోపాల్ మంగళవారం అల్లివలసకు తన సొంత డబ్బుతో తాగునీటి బోరు ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యతో బాధ పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని కిరణ్, రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశంలో ప్రస్తావించినా లాభం లేకపోయిందని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకున్నా వైఎస్ఆర్ సీపీ ప్రజలకు అండగా ఉంటోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా కార్యదర్శి పిన్నింటి సాయికుమార్, అల్లివలస ఎంపీటీసీ మైలపల్లి వెంకటేష్, వి.ఎల్లయ్య, సోరాడ కోర్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
యాక్సిడెంట్ బాధితులకు 35 లక్షల పరిహారం
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళా కానిస్టేబుల్ కుటుంబానికి ట్రక్ యజమాని, బీమా సంస్థ సంయుక్తంగా 35 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని థానె మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సూచించింది. ట్రక్ యజమాని మొహమ్మద్ నజీర్ ఖాన్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ థానె కార్యాలయం కలసి ఆ డబ్బును చెల్లించాలని జడ్జ్ కె.డి. వదానె ఆదేశించారు. 2012 యాక్సిడెంట్ కేసులో తల్లిని కోల్పోయిన మహిర్ తౌఫీక్, తౌఫీక్ బాబు తాంబేలకు ఈ పరిహారం అందజేయాలని సూచించారు. ప్రమాదం జరిగిన సమయంలో మూడేళ్ల వయసున్న కొడుకు.. బాధితుడు మహిర్కు పరిహారంలోని 25 లక్షల రూపాయలను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రమాదం జరిగిన సమయంలో (జనవరి 3, 2012) నైగోన్ నుంచి నెహ్రూనగర్ కు ద్విచక్రవాహనంపై వెడుతున్న 30 ఏళ్ల సజియా తౌఫిక్ తాంబె అలియాస్ నళిని గైక్వాడ్ సియోన్ జంక్షన్ సమీపంలో ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఆమెను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన ఆమె.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని, రూ. 40 లక్షల నష్టపరిహారం చెల్లించాలని అప్పట్లో బాధితురాలి తరపున కేసు దాఖలు చేశారు. తమ వాదనలకు మద్దతుగా బాధితురాలి తరపు న్యాయవాది అందుకు కావలసిన పత్రాలను కూడా సమర్పించారు. కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం హక్కుదారుడు, ప్రత్యర్థుల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు వెలువరించింది. అప్పట్లో వేగంగా వస్తున్న ట్రక్ ముందు వెళ్తున్న హ్యుందయ్ కారు ఉన్నట్లుండి యూ టర్న్ తిప్పడంతో దాన్ని తప్పించబోయి అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టినట్లు ప్రత్యర్థులు సమర్పించిన పత్రాల ఆధారంగా తెలుస్తోంది. దీంతో అటు హ్యుందయ్ కారు డ్రైవర్ నిర్లక్ష్యం, ఇటు ట్రక్ డ్రైవర్ అతి వేగంపై విచారించిన కోర్టు ఘటనకు బాధ్యులైన సంబంధిత బీమా సంస్థ, ట్రక్ డ్రైవర్లు సంయుక్తంగా పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. -
బావిలో పడి ఇద్దరు రైతుల మృతి
లింగంపల్లి: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోటార్ బిగించే యత్నంలో ప్రమాదవశాత్తూ ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నవాబ్‌పేట మండలం లింగంపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. మోటార్ బిగించడానికి యత్నిస్తూ ఇద్దరు రైతులు ప్రమాదవశాత్తూ వ్యవసాయబావిలో పడి మృతిచెందారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంకా పట్టిసీమలోనే..
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన హంద్రీనీవా పాత మోటారు ఇంకా పట్టిసీమలోనే ఉంది. ఈనెల 18న హడావుడిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ఈ మోటారును హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన 24 గంటల్లోనే జానంపేట వద్ద అక్విడెక్ట్‌కు గండి పడటంతో గోదావరి నుంచి నీటి తోడకాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 6వ నంబర్ వెల్‌కు బిగించిన హంద్రీనీవా పాత మోటారును తొలగించారు. దీని స్థానంలో చైనానుంచి తెచ్చిన మోటారును చైనా ఇంజినీర్లు బిగిస్తున్నారు. పాత మోటారును హంద్రీనీవాకు తరలిస్తామని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించినా.. దానిని అక్కడికి తీసుకెళ్లలేదు. -
ప్రమాదవశాత్తూ రైతు మృతి
కరీంనగర్ : బోరు బావిలోని మోటర్ వెలికి తీస్తుండగా ప్రమాదవశాత్తూ ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ముత్యంపేట గ్రామానికి చెందిన సాయిరెడ్డి(42) అనే రైతుకి చెందిన వ్యవసాయ బావిలోని మోటర్ చెడిపోయింది. దీంతో దాన్ని బయటకు తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మోటర్ మీదపడి రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కెపాసిటర్‌తో మోటార్ భద్రం
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : విద్యుత్ సరఫరాలో తరచూ హెచ్చుతగ్గులు అవుతుంటాయి. రైతులు కెపాసిటర్ అమర్చకపోవడంతో వ్యవసాయ పంపుసెట్లు తరచూ కాలిపోతున్నాయి. మరమ్మతులకు గురువుతాయి. బాగు చేసుకునేందుకు తడిసి మోపెడువుతుంది. కెపాసిటర్‌ను అమర్చితే ట్రాన్స్ఫార్మర్, మోటార్ పని కాలాన్ని పెంచుకోవచ్చు. కాలిపోయే వాటికి అయ్యే ఖర్చును తగ్గించవచ్చని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ అశోక్ వివరించారు. జిల్లాలోని 52 మండలాల్లో 98 వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి 14,368 ట్రాన్స్ఫార్మర్లు ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. జిల్లాలో రోజుకు 20 నుంచి 25 ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతున్నాయి. అధిక లోడువల్ల కొన్ని, మోటార్లకు కేపాసిటర్లు అమర్చక విద్యుత్ లోడు హెచ్చుతగ్గులు అయినప్పడు నియంత్రణ లేక ట్రాన్స్పార్మర్లు, మోటార్లు తరచూ చెడిపోతున్నాయి. జిల్లాలో 80 శాతం మంది రైతులు విద్యుత్ మోటార్లకు కెపాసిటర్లు అమర్చకోక ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్పార్మర్లు, మోటార్లు కాలిపోయి రోజులకొద్దీ పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి ఎదురవుతోంది. ప్రసుత్తం రబీ సంటలు సాగు చేసుకుంటున్నారు. పంటలకు నీరందిచడం ముఖ్యం ఘట్టంగా చెప్పుకోవచ్చు విద్యుత్ మోటార్లు తరచూ కాలిపోకుండా రైతులు ముందు జాగ్రత్తగా కెపాసిటర్‌ను అమర్చుకుంటే విలువైన పంటలను రక్షించకోవచ్చు. ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చు. వ్యవసాయ మోటార్ల వినియోగంపై రైతులకు సూచనలు, సలహాలు అందించారు. అవగాహన లేక.. మోటార్లకు కెపాసిటర్ అమర్చడం వల్ల లాభమెంత.. నష్టమెంత అనే విషయాలపై అవగాహన లేకపోవడంతో రైతులు విద్యుత్ మోటార్లకు కెపాసిటర్ అమర్చడం లేదు. రూ.150 నుంచి రూ.200 ఖర్చుతో అమర్చుకోవచ్చు. మోటారు కాలిపోయిన తర్వాత వందలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. కొంతమంది రైతులు మోటార్ ఆన్, ఆఫ్ స్విచ్‌ను బంద్ చేసిన తర్వాత మోటారుకు ఏదైనా మరమ్మతు చేసే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో కెపాసిటర్‌ను తీసి వేస్తున్నారు. మరమ్మతు చేసే సమయంలో న్యూట్రల్, ఫేస్ వైర్లను కలిపితే(షాట్ చేసి) ముట్టుకున్నట్లయితే ఎలాంటి షాక్ తగలదు. మోటార్లకు ఏదైనా మరమ్మతు వచ్చినప్పడు అవగాహన ఉన్న ఎలక్ట్రీషియన్‌తో మరమ్మతు చేయించుకోవడం ఉత్తమం. మోటారు వైండింగ్ కాలిపోయినప్పుడు మరమ్మతు చేసేవారు మోటారు వైండింగ్ వైర్ గేజ్ పెద్దవి, చిన్నవి అమరుస్తుండడంతో కెపాసిటర్ లేక కాలిపోతున్నాయి. కెపాసిటర్ బిగిస్తే విద్యుత్ హెచ్చుతగ్గుల నియంత్రణ వల్ల జరిగే నష్టాన్ని అరికట్టవచ్చు. ఐఎస్ఐ మార్కు ఉన్నవే.. ఐఎస్ఐ మార్కు ఉన్న స్టార్టర్ వాడాలి. మూడు ఫ్యూజులు బిగించి ఐదు ఆంప్స్(సన్నవి) ఫ్యూజ్ వైరు మాత్రమే వినియోగించాలి. భూమి నుంచి మోటారుకు ఎర్త్‌వైరు(జీఐ వైరు) ఏర్పాటు చేయాలి. గొయ్యి తడిగా ఉండేలా చూడాలి. దీనివల్ల ప్యూజ్ సరిగా పని చేస్తుంది. సిఫారసు చేసిన సైజుల్లోనే సెక్షన్(నీరందించే) పైపులు బిగించాలి. సెక్షన్ పైపుకన్నా డెలివరీ పైపు సైజ్ పెద్దగా ఉండాలి. స్టార్టర్ ఉండే ట్రిప్ కాయిల్ తొలగించకూడదు. తొలగిస్తే మోటారు కాలిపోయే ప్రమాదముంది. పంపు, మోటారుకు మధ్య ఉన్న ఫ్లాంజివాసర్లు, బోల్టులు సరిగా అమర్చాలి. స్టార్టర్ సరిగ్గా పనియేయడం వల్ల హైవోల్టేజీ వస్తే స్టార్టర్ అటోమేటిక్‌గా పడిపోయి మోటారు ఆగిపోతుంది. లేదా ప్యూజ్ మాత్ర మే మాడిపోయి మోటారుకు రక్షణ ఇస్తుంది. కెపాసిటర్ వల్ల విద్యుత్ ఓల్టేజీలో హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. మోటారు హెచ్‌పీని బట్టి కెపాసిటర్‌ను అమర్చాలి. 3 హెచ్‌పీ మోటారుకు 1 కేవీఏఆర్ కెపాసిటర్, 5 హెచ్‌పీ మోటార్‌కు 2 కేవీఏఆర్, 7 హెచ్‌పీ మోటార్‌కు 3 కేవీఏఆర్ కెపాసిటర్ అమార్చాలి. విద్యుత్ మోటార్లకు బీమా సౌకర్యం.. రైతులు ఉపయోగిస్తున్న విద్యుత్ మోటార్లు, పంపుసెట్లు, డీజిల్ ఇంజిన్లు, పంపు, స్టార్లర్లు, కెపాసిటర్ వంటి విడి భాగాలకు సైతం బీమా చేసుకునే అవ కాశం ప్రభుత్వం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అజమాయిషీతో పనిచేస్తున్న ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్స్యూరెన్స్ కం పెనీ వ్యవసాయ పంపుసెట్లు బీమా పథకం అమలు చేస్తున్నాయి. యాంత్రిక, విద్యుత్‌శక్తి లోపాలతో చెడిపోయిన, అగ్నిప్రమాదాలు, పిడుగుపాటు, దొంగతనం వంటి వాటిలో జరిగే నష్టాలకు కంపెనీ నుంచి బీమా పొందవచ్చు. పంపుసెట్ల సామర్థ్యం, ఎన్నాళ్లుగా వినియోగిస్తున్నరో చూసి మార్కెట్ విలువలను అనుసరించి ప్రీమియం, బీమా మొత్తం నిర్ణయిస్తారు. -
ఒక ఐడియా వంట ఖర్చు తగ్గించింది
బెజ్జూర్, న్యూస్‌లైన్ : వంటగ్యాస్ ధరలు విపరీంతగా పెరగడంతోపాటు వంటచెరుకు పెరుగున్న తరుణంలో సామాన్యుడు వంట చేసుకోవడానికి నెలకు కనీసం రూ.500 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏదైనా పరిష్కారం కనుగొనాలనే తలంపుతో మండలంలోని మర్థిడి గ్రామానికి చెందిన జుమిడే ఆనంద్ కేవలం రూ.100 ఖర్చుతో మట్టిపొయ్యిని తయారు చేసి పిడుకెడు బొగ్గుతో వంట పూర్తి చేయడానికి ప్రయోగం చేశాడు. అందుకుగాను తన వద్ద ఉన్న ఫెవిస్టిక్, ఇనుప డబ్బా, 3 వాట్స్‌తో తిరిగే మోటార్, ఎంసిల్, రంధ్రాలతో కూడిన రేకుతో ప్రయోగం చేశాడు. మట్టిపొయ్యికి ఒక వైపులా రేకు డబ్బాను అమర్చి డబ్బాకు రెండువైపుల రంధ్రాలు చేశాడు. ఒక వైపు మోటార్‌ను బిగించడంతోపాటు మరోవైపు పొయ్యి లోపలిభాగంలో గాలి వచ్చేలా ఏర్పాటు చేశాడు. పొయ్యిపై రంధ్రాలు చేసిన రేకు ఉంచాడు. సెల్బ్యాటరీ సహాయంతో మోటార్ తిరిగేలా కనెక్ష న్ ఇచ్చాడు. గాలి కోసం ఫ్యాన్‌ను మోటార్‌కు బిగించాడు. దీం తో బ్యాటరీ సాయంతో మోటార్ తిరుగుతుంది. అందులోని ఫ్యాన్ తిరగడంతో చిన్నపాటి గాలితో రంధ్రాల రేకుపై ఉన్న బొగ్గులు గ్యాస్ మాదిరిగా మండుతుంది. ఎలాంటి కాలుష్యం లేకుండా పొగచూరకుండా గ్యాస్ కన్నా రెండు నిమిషాలు ముందుగానే వంట పూర్తవుతుంది. దీని కి కావాల్సింది రోజూ పిడికెడు బొగ్గులు మాత్రమే. ఎలాంటి ఖర్చు లేకుండా వం ట పూర్తి చేయడానికి తయారు చేశాడు. -
చిన్న కార్లతో హ్యుందాయ్ సందడి
హైదరాబాద్: చిన్న కార్ల మార్కెట్లో హ్యుందాయ్ భారీ యుద్ధానికే సిద్ధం అవుతోంది. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకికి పోటీగా కొత్త కొత్త మోడళ్లను రంగంలోకి తేనున్నది. రెండేళ్లలో కనీసం నాలుగు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేవడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది, వీటిల్లో ఎస్యూవీ, సెడాన్లు కూడా ఉంటాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. మరోవైపు అమ్మకాలు మరింతగా పెంచుకోవడానికి గాను పూర్తిగా భారత్‌లోనే డిజైన్ చేసి, భారత్‌లోనే కార్లను తయారు చేసే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. దీంట్లో భాగంగా హైదరాబాద్‌లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. వివరాలు..., వచ్చే నెలలో గ్రాండ్ ఐ10 చిన్న కార్ల సెగ్మెంట్లో మారుతీ తర్వాతి స్థానం హ్యుందాయ్‌దే. కొత్త కొత్త మోడళ్లను రంగంలోకి తేవడం ద్వారా మార్కెట్ లీడర్ మారుతీ సుజుకి కంపెనీకి గట్టిపోటీనివ్వాలని హ్యుందాయ్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ కార్లపై కంపెనీ దృష్టిపెడుతోంది. దీంట్లో భాగంగానే ఈ సెగ్మెంట్లో బాగా అమ్ముడయ్యే మారుతీ సుజుకి ఆల్టోకు పోటీగా ఇయాన్ 1.1 లీటర్ కారును అందుబాటులోకి తేనున్నదని సమాచారం. కొత్త కాంపాక్ట్ కారు, గ్రాండ్ ఐ10ను హ్యుందాయ్ కంపెనీ వచ్చే నెలలో మార్కెట్లోకి తేనున్నది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కారు మారుతీ స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో కార్లకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాల అంచనా. డీజిల్ కార్ల విభాగంలో హ్యుందాయ్ వెనకబడి ఉందని, అమ్మకాలు మరింతగా పెంచుకోవడానికి కొత్త డీజిల్ కార్లతో రంగంలోకి రానున్నదని నిపుణులంటున్నారు. మేడిన్ ఇండియా గ్రాండ్ ఐ10 తరహా కార్లను భారత్‌లోనే అభివృద్ధి చేసే, తయారు చేయాలని హ్యుందాయ్ యోచిస్తోంది. వీటిని విదేశాలకు కూడా విక్రయించాలని భావిస్తోంది. మార్కెట్లో అమ్మకాలు పెంచుకునే వ్యూహాంలో భాగంగా పూర్తిగా భారత్‌లోనే తయారయ్యే కారును రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ షారుక్ హాన్ చెప్పారు. అయితే ఈ లక్ష్యం ఐదేళ్ల తర్వాతే సాకారం అవుతుందని ఆయన చెప్పారు. ఈ లక్ష్యసాధన కోసం హైదరాబాద్‌లో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నామని పేర్కొన్నారు. తమ మాతృ కంపెనీకి కొరియాలో ఉన్న ఆర్ అండ్ డీ సెంటర్‌తో పోల్చితే ఈ సెంటర్ శక్తి సామర్థ్యాలు తక్కువేనని అంగీకరించారు. తమ మాతృసంస్థ డెవలప్ చేసిన కార్లను భారత పరిస్థితులకు తగ్గట్లుగా అవసరమైన మార్పులు, చేర్పులు చేయడానికి ప్రస్తుతం ఈ హైదరాబాద్ ఆర్ అండ్ డీ సెంటర్ తోడ్పడుతోందని వివరించారు. ఇలాంటి సహకారమందించే స్థాయి నుంచి సొంతంగా కార్లును డిజైన్ చేసే స్థాయికి ఈ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నామని షారుక్ హాన్ పేర్కొన్నారు.