కరీంనగర్ : బోరు బావిలోని మోటర్ వెలికి తీస్తుండగా ప్రమాదవశాత్తూ ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ముత్యంపేట గ్రామానికి చెందిన సాయిరెడ్డి(42) అనే రైతుకి చెందిన వ్యవసాయ బావిలోని మోటర్ చెడిపోయింది.
దీంతో దాన్ని బయటకు తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మోటర్ మీదపడి రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తూ రైతు మృతి
Published Mon, Mar 23 2015 4:33 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM