Image credit: Skarper / Red Bull
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి. బైకులు, కార్లలో మాదిరిగా కాకుండా.. సైకిల్స్‌లో చిన్న బ్యాటరీ లేదా ఈ-బైక్ కన్వర్షన్ కిట్‌లు ఉంటాయి. బ్యాటరీల గురించి విన్న చాలామందికి కన్వర్షన్ కిట్‌ల గురించి తెలియకపోవచ్చు. ఈ కథనంలో మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.
ఈ-బైక్ కన్వర్షన్ కిట్‌లు సాధారణ సైకిల్‌కు అదనంగా యాడ్ చేయడానికి అనుగుణంగా ఉంటాయి. ఇది మౌంట్ చేసుకున్న తరువాత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ ఫోటోలలో గమనించినట్లయితే డిస్క్ బ్రేక్‌కు అమర్చిన కన్వర్షన్ కిట్ చూడవచ్చు.
(Image credit: Skarper / Red Bull)
ఇక్కడ కనిపించే కన్వర్షన్ కిట్‌ను స్కార్పర్ అనే స్టార్టప్ ఈ ఏడాది పరిచయం చేసింది. ఇది ఒక అధునాతన టూ-మోడ్ ఎలక్ట్రిక్ బైక్ మోటారు. కస్టమ్ డిజైన్ చేసిన డిస్క్ బ్రేక్‌కు క్లిప్ చేసుకోవచ్చు. ఇది పూర్తి గేర్‌బాక్స్‌గా పనిచేస్తుంది. బైక్‌పై కస్టమ్ డిస్క్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మోటారును ఆన్ లేదా ఆఫ్ చేయడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. పవర్ అనేది వెంటనే మారుతుంది.
కన్వర్షన్ కిట్ తయారీకి సంస్థకు ఏకంగా మూడు సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఇది సైకిల్‌లో డిస్క్ బ్రేక్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. ఈ కిట్‌ను మౌంట్ చేయడం లేదా రిమూవ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి వినియోగదారుని అవసరమైనప్పుడు మౌంట్ చేసుకోవచ్చు, మిగిలిన సమయంలో తీసి ఇంట్లో జాగ్రత చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
చేతిలో పట్టుకెళ్ళడానికి అనుకూలంగా ఉండే కన్వర్షన్ కిట్ ధర 1295 యూకే పౌండ్స్ (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.30 లక్షలకంటే ఎక్కువ) అని తెలుస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ఈ కిట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో గొప్ప ఆదరణ పొందుతుందని తయారీదారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment