న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎస్‌ఏఐసీ మోటార్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు భారత అనుబంధ సంస్థ అయిన ఎంజీ మోటార్ ఇండియా త్వరలోనే స్పోర్ట్–యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ)ను విడుదలచేయనుంది. ‘హెక్టర్’ పేరుతో ఈఏడాది మధ్యనాటికి కారు విడుదలకానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చబా మాట్లాడుతూ... ‘ఎస్‌యూవీ విభాగం ఇప్పుడు భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది.
ఇక్కడి వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా భారీస్థాయిలో ఈ కారును ఇంజనీరింగ్ చేయగలిగాం. ఈ ఎస్‌యూవీ పూర్తిగా కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ కారు ఉత్పత్తి నిమిత్తం గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో రూ.2,000 కోట్లను పెట్టుబడి పెట్టిన ఈ కంపెనీ.. వచ్చే ఐదేళ్లలో రూ.5,000 కోట్లకు పెట్టుబడిని పెంచనున్నట్లు తెలిపింది.
ఎంజీ మోటార్ నుంచి ‘ఎస్‌యూవీ హెక్టర్’..!
Published Thu, Jan 10 2019 4:26 AM | Last Updated on Thu, Jan 10 2019 10:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment