‘సీతారామ’పై కాళేశ్వరం భయం
ప్రాజెక్టులో తెరపైకి డిఫెక్ట్ లయబులిటీ క్లాజ్
ఎత్తిపోతల ట్రయల్‌రన్‌కు సిద్ధమైన ప్రభుత్వం
పంప్‌హౌస్‌లలో చైనా మోటార్ల వినియోగం
ఆ దేశ ఇంజనీర్ల కోసం ఎదురుచూపులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. నిధుల వ్యయం నుంచి పంప్‌హౌస్‌లో మోటార్లు నడిపించే వరకు ప్రతీ అంశంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. అక్విడెక్టులు, పంప్‌హౌస్‌ల నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తయ్యాయి.
అయితే ప్రధాన కాల్వల నిర్మాణం పూర్తి కాకపోవడంతో రూ.వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు సాగునీరు అందలేదు. దీంతో ఇప్పటి వరకు అందుబాటులోకి వచి్చన సీతమ్మసాగర్ ప్రధాన కాల్వను నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు కలిపేలా కొత్తగా రాజీవ్ కెనాల్‌కు శ్రీకారం చుట్టారు. రాజీవ్ కెనాల్ ద్వారా ఈ ఖరీఫ్ సీజన్‌లో 1.50 లక్షల ఎకరాలకు గోదావరి నీరు అందించాలని నిర్ణయించారు.
డ్రై రన్‌కు వెనకడుగు..
భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో ఉన్న మొదటి పంప్‌హౌస్‌లో 25 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు మోటార్లు, రెండో పంప్‌హౌస్‌లో 40 మెగావాట్ల సామర్థ్యం గల ఆరు మోటార్లు, మూడో పంప్‌హౌస్‌లో 40 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లు ఐదు, 30 మెగావాêట్ల సామర్థ్యం గల మోటార్లు రెండు ఉన్నాయి.
ప్రస్తుత అవసరాల ప్రకారం ఒక్కో పంప్‌హౌస్‌లో ఒక్కో మోటార్‌ను నడిపించి నీటిని లిఫ్ట్ చేసినా సరిపోతుంది. దీంతో ఈ పంప్‌హౌస్‌ల్లో డ్రై రన్‌కు వడివడిగా ముందుకు కదిలిన ప్రభుత్వం.. చివరి నిమిషంలో వెనకడుగు వేసింది.
చైనా తంటాలు..
మూడు పంప్‌హౌస్‌ల్లో మొత్తం 19 మోటార్లను చైనాకు చెందిన షాంఘై ఎలక్ట్రిక్ కంపెనీ రెండేళ్ల క్రితమే బిగించింది. అయితే ప్రధాన కాల్వల నిర్మా ణం కాకపోవడం, విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో రెండేళ్లుగా అవి ఖాళీగానే ఉన్నాయి. దీంతో కంపె నీకి చెందిన ఇంజనీర్లు చైనా వెళ్లిపోయారు. రెండేళ్ల పాటు మోటార్లు, పంపులు అలాగే ఉండటంతో వా టి ప్రస్తుత పరిస్థితి ఏంటనే అంశంపై స్పష్టత లేదు.
విదేశాంగ శాఖకు చేరిన పంచాయితీ
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అంశంపై ఇటు ఎల్‌అండ్‌టీ, అటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య డిఫెక్ట్ లయబులిటీ అంశంపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సొంతంగా మోటార్లు ఆన్ చేసి రిస్క్ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో చైనా బృందాన్ని త్వరగా ఇక్కడకు తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను సంప్రదించారు.
సాధ్యమైనంత త్వరగా చైనా ఇంజనీర్లను రప్పించేలా ప్రయతి్నస్తున్నారు తప్పితే రిస్క్ తీసుకొని మోటార్లు ఆన్ చేసేందుకు సాహసించడం లేదు. ఆగçస్టు 15 నాటికి సారునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రకారమే ముందుకెళ్లడం మేలనే భావనలో ప్రభుత్వం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment