పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన హంద్రీనీవా పాత మోటారు ఇంకా పట్టిసీమలోనే ఉంది. ఈనెల 18న హడావుడిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ఈ మోటారును హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన 24 గంటల్లోనే జానంపేట వద్ద అక్విడెక్ట్‌కు గండి పడటంతో గోదావరి నుంచి నీటి తోడకాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 6వ నంబర్ వెల్‌కు బిగించిన హంద్రీనీవా పాత మోటారును తొలగించారు. దీని స్థానంలో చైనానుంచి తెచ్చిన మోటారును చైనా ఇంజినీర్లు బిగిస్తున్నారు. పాత మోటారును హంద్రీనీవాకు తరలిస్తామని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించినా.. దానిని అక్కడికి తీసుకెళ్లలేదు.
ఇంకా పట్టిసీమలోనే..
Published Mon, Sep 28 2015 9:06 PM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM
Advertisement
Advertisement