handri neeva
-
ఆన్.. ఆఫ్.. ఆన్!
సాక్షి ప్రతినిధి కర్నూలు: హంద్రీ–నీవా నీటి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. సకాలంలో నీళ్లివ్వకుండా రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందకుండా చేస్తోంది. కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని ‘సాక్షి’ రెండు రోజులుగా ఎండగట్టడంతో గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత హంద్రీ–నీవా ఎస్ఈ రామగోపాల్ మల్యాల పంప్‌హౌస్ వద్ద పూజలు చేసి రెండు పంపులు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. మొత్తం 12 పైపులకుగానూ కేవలం రెండు పంప్‌లు మాత్రమే ఆన్ చేయడం గమనార్హం. అయితే గంటలోపే స్విచ్ ఆఫ్ చేసి నీటి విడుదలను నిలిపివేశారు. మల్యాల నుంచి నీళ్లు బ్రాహ్మణకొట్కూరు సమీపంలోకి రాగానే పంపులు స్విచ్ ఆఫ్ చేశారు. మళ్లీ రాత్రి ఏడున్నర గంటల సమయంలో హడావుడిగా ఒక్క పంపు ఆన్ చేసి 337.6 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటిస్తుండటంతో కొత్త అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి కాకపోయినా నీటిని విడుదల చేశారు. పాత అప్రోచ్ రోడ్డును జేసీబీలతో తొలగించారు. 500 క్యూసెక్కులు కూడా కష్టమే!కొత్తగా నిర్మించిన అప్రోచ్ రోడ్డులో 13 చిన్న సైజు సిమెంట్ పైపులను అమర్చారు. కాలువలో పూర్తిస్థాయి నీటి మట్టం ఉన్నప్పుడు 2,200–2,500 క్యూసెక్కులు ప్రవహించే సామర్థ్యం ఉంది. ఇప్పుడు అమర్చిన చిన్న పైపులతో 500 క్యూసెక్కులు కూడా ప్రవహించడం కష్టమేనని తెలుస్తోంది. పాత అప్రోచ్ రోడ్డు నిర్మాణ సమయంలో నీరు ప్రవహించేందుకు వీలుగా పుట్టా సంస్థ పైపులు వేయకపోవడమే ఈ దుస్థితికి కారణం. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో 45 చోట్ల టీడీపీ కూటమి ఎమ్మెల్యేలే గెలిచినా సీమ రైతన్నల ప్రయోజనాలను కాపాడేందుకు గొంతు విప్పకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
యుద్ధప్రాతిపదికన హంద్రీ-నీవా, గాలేరు-నగర, తెలుగుగంగ పనులు
-
సీమ నీటి కష్టాలు నాకు తెలుసు: సీఎం జగన్
CM YS Jagan Kurnool And Nandyal Tour Updates 12:33PM డోన్ సభలో సీఎం జగన్ ప్రసంగం ►ఈరోజు ఒకవైపున పండుగ, మరోవైపున మీ అందరి ప్రేమాభిమానాల మధ్య మంచి కార్యక్రమం దేవుడి దయతో ఇక్కడ జరుపుకుంటున్నాం. ►మనందరి ప్రభుత్వం నీటి విలువ తెలిసిన ప్రభుత్వం. ►రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన అంతా కూడా శాశ్వతమైన మార్పు తీసుకొని రావాలని ►మంచి ఉద్దేశంతో అడుగులు వేయడం జరిగింది. ►అందులో భాగంగానే ఈరోజు కర్నూలు, నంద్యాల జిల్లాలకు మంచి జరిగిస్తూ, మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. ►హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు తాగునీరు, సాగు నీరు అందించే కార్యక్రమం. ►లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ 77 చెరువులు నింపే కార్యక్రమం. ►దాదాపు రోజుకు 160 క్యూసెక్కులు చొప్పున 90 రోజుల్లో 1.24 టీఎంసీల నీళ్లు నింపేట్లుగా కార్యక్రమం మొదలవుతోంది. ►పక్కనే శ్రీశైలం ఉన్నా కూడా ఈ మెట్ట ప్రాంతాలకు పత్తికొండ, డోన్ మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందని దుస్థితి. ►డోన్‌లో అయితే ఒక్క ఎకరా కూడా ఇరిగేషన్ లో లేని పరిస్థితి. ►ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా గతంలో ఎవరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. ►2019 మార్చిలో ఎన్నికలు జరిగాయి. ►2018 నవంబర్ అంటే ఎన్నికలకు కేవలం నాలుగు ఐదు నెలల ముందు మాత్రం ఒక జీవో ఇస్తారు, టెంకాయ కొడతారు ప్రజల్ని మోసం చేసేందుకు అడుగులు పడతాయి. ►అటువంటి పరిస్థితి నుంచి భూమి కూడా అక్వైర్ చేయలేదు. ►కేవలం టెంకాయ కొట్టేందుకు మాత్రమే 8 ఎకరాలు కొనుగోలు చేశారు. ►అటువంటి దారుణమైన మోసాలు, పరిస్థితుల మధ్య మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడింది. ►రాయలసీమ బిడ్డగా, నీటి విలువ తెలిసిన బిడ్డగా ఈ ప్రాంతానికి తోడుగా నిలబడేందుకు అక్షరాలా 250 కోట్ల విలువ చేసే ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాం. ►ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేసే రోజు వచ్చింది. ►అత్యంత కరువుతో కూడిన 8 మండలాలకు 10,130 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు తాగునీరు అందిస్తూ, 253 కోట్లతో ఈ ప్రాజెక్టుకు పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ►ఈ ప్రాజెక్టు వల్ల డోన్, పత్తికొండ రెండు నియోజకవర్గాలకు చాలా మంచి జరుగుతుంది. ►ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది. ►వెల్దుర్తి, కల్లూరు మండలాల్లో 22 చెరువులకు హంద్రీ నీవా కాలువ నుంచి పైప్ లైన్ కనెక్టివిటీ పూర్తియింది. ట్రయల్ రన్స్ కొనసాగుతున్నాయి. ►క్రిష్ణగిరి, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, దేవరకొండ మండలాల్లోని 14 చెరువులకు కూడా పైప్‌లైన్ కనెక్టివిటీ పూర్తయి పైప్ లైన్ కనెక్టివిటీ కొనసాగుతోంది. ►ప్యాపిలి బ్రాంచ్ కింద ప్యాపిలి, డోన్ మండలాల్లో 19 చెరువులకు పైప్ లైన్ పూర్తయి, ట్రయల్ రన్ కొనసాగుతోంది. ►జొన్నగిరి బ్రాంచ్ కింద డోన్, తుగ్గలి మండలాల్లో మరో 7 చెరువులకు కూడా కనెక్టివిటీ పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నాం. ►ఈ ప్రాజెక్టులో కొత్తగా డోన్ నియోజకవర్గంలో అదనంగా అవసరాన్ని బట్టి మరో 8 చెరువులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ►మొత్తంగా 77 చెరువులకు సంబంధించిన ఈ ప్రాజెక్టు పనులన్నింటికీ 253 కోట్లతో పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వడం జరుగుతోంది. ►ఇదొక్కటే కాకుండా గాజులదిన్నె ప్రాజెక్టుకు, ఈ సంజీవయ్య సాగర్ ప్రాజెక్టుకు, ఎమ్మిగనూరు నియోజకవర్గం కొనగండ్ల మండలం గాజుల ►దిన్నె వద్ద 4.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినది. ►24,372 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ►వర్షాలు పడితేనే బతకాలి తప్ప దీనికి కూడా కృష్ణా జలాల అలకేషన్ లేదు. ►పత్తికొండ నియోజకవర్గంలో 27 గ్రామాలకు, క్రిష్ణగిరి మండలంలో మరో 55 ఆవాసాలకు డోన్ మున్సిపాలిటీకి, కొనగండ్లతోపాటు మరో 10 ►ఆవాసాలకు తాగునీరు అందిస్తోంది. ►కర్నూలు నగరానికి కూడా నీటి సరఫరా ఇక్కడి నుంచే జరిగే కార్యక్రమం జరుగుతోంది. ►గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4.5 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు పెంచాం. ►హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి తూము నిర్మించి గ్రావిటీ ద్వారా ప్రాజెక్టుకు నీళ్లు కేటాయిస్తూ 57 కోట్లు ఖర్చు చేసి ఆ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ►ఆలోచన చేయమని అడుగుతన్నా. నేను చెప్పే ఈ గాజులదిన్నె ప్రాజెక్టుగానీ, కృష్ణానది అలకేషన్ లేదని గానీ ఇంత ఉపయోగపడే ప్రాజెక్టుకు మంచి జరిగించాలనే ఆలోచన గతంలో ఎప్పుడూ జరగలేదు. ►ఈ ప్రాంతంలో వర్షాలు పడితే తప్ప వ్యవసాయం జరగదని తెలిసి కూడా ఏ రోజు కూడా చెరువులు నింపాలని ఆలోచన చేయలేదు. ►కేవలం ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు, టెంకాయలు గుర్తుకొస్తాయి, జీవో కాపీ గుర్తుకొస్తుంది. ►ప్రజలకు మంచి చేయాలి అన్న ఆలోచన, తపన ఎప్పుడూ రాదు. ►నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో మీ కష్టాలు నేను విన్నాను, మీ కష్టాలను నేను చూశాను, మీకు నేను ఉన్నాను అని చెప్పా. ►చెప్పిన మాట ప్రకారం నాలుగు సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి మీ ముందు మీ బిడ్డ నిలబడుతున్నాడు. ఈరోజు నిజంగా రాయలసీమ ప్రాంతాన్ని తీసుకుంటే ఇంత దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్నాం. ►ఈరోజు హంద్రీనీవా నుంచి తూము పెట్టి 77 గ్రామాలకు లిఫ్ట్ చేసి నీళ్లు పంపించగలుగుతున్నాం. ►హంద్రీనీవా ప్రాజెక్టు కట్టింది ఎవరు అని అడుగుతున్నా. ►ఇదే పెద్దమనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పెద్దమనిషి హంద్రీనీవాకు ఖర్చు చేసింది కేవలం 13 కోట్లు. ►ఆ తర్వాత దివంగత నేత ప్రియతమ నాయకుడు, నాన్నగారు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవా కాలువ 6 వేల కోట్లతో నిర్మించారు. ►అందుకే ఈరోజు ఆ ప్రధాన కాలువ ద్వారా మనం తూములు పెట్టుకోగలుగుతున్నాం. నీళ్లతో చెరువులు నింపగలుగుతున్నాం. ►తేడా గమనించమని అడుగుతున్నా ►ప్రజల గురించి నిజంగా ఆలోచన చేశారంటే అప్పట్లో ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారి హయాంలో జరిగింది. ►మళ్లీ ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఏర్పడిన మీ బిడ్డ ప్రభుత్వంలోనే మళ్లీ జరుగుతోంది. ►రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా తోడుగా నిలబడేందుకు ఆదుకొనేందుకు అప్పట్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కార్యక్రమాన్ని ►నాన్నగారు 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ►ఈరోజు వాతావరణ మార్పులు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ►పడితే ఒకేసారి కుంభవర్షం పడుతోంది. నీళ్లు స్టోర్ చేసుకోలేకపోతే ఆ తర్వాత వరదలు వచ్చే రోజులు తక్కువే. ►పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను మీ బిడ్డ ప్రభుత్వంలో 80 వేల క్యూసెక్కులకు తీసుకెళ్తూ అడుగులు పడుతున్నాయి. ►800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ ను తీసుకొచ్చి 3 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడులో వేసే కార్యక్రమం జరుగుతోంది. ►గతంలో పాలకులను చూశాం పోతిరెడ్డిపాడులో నీళ్లు పడాలంటే శ్రీశైలం నిండితే గానీ నీళ్లు రాని పరిస్థితి. ►881 అడుగులు చేరితే తప్ప నీళ్లు రాని పరిస్థితి. ►అలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం డ్యామ్ నిండి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల్లో మాత్రమే నీళ్లు తీసుకొనే పరిస్థితి ఉంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వగలుగుతామా? ►అటువంటి పరిస్థితుల్లో ఎవరూ ఆలోచన చేయలేదు. ►మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ గురించి ఆలోచన చేశాం. ►800 అడుగుల్లోనే ఆ పక్కన తెలంగాణ తీసుకుంటోంది. వాళ్ల లిఫ్ట్ ప్రాజెక్టులన్నీ 800 అడుగుల్లోపే ఉన్నాయి. ►వాళ్లు రేప్పొద్దున పవర్ జెనరేట్ చేస్తున్నారు. మనకేమో 881 అడుగులు వస్తే తప్ప నీళ్లు అందని పరిస్థితి. ►దాన్ని మారుస్తూ రాయలసీమ ప్రజలకు తోడుగా ఉండేందుకు 800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ►వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మన కళ్ల ఎదుటే కరువుతో ఉన్న ప్రకాశం జిల్లా కనిపిస్తోంది. ►వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే తప్ప దానికి నీళ్లు రావు. ►నాన్నగారి హయాంలో ఒక్కో టన్నెల్ 18 కిలోమీటర్లు. ►దాని తర్వాత అడుగులు ముందుకు వేయాలి అంటే ఇబ్బందికర పరిస్థితులు. ►తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ►కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాకు మళ్లీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు మొదటి టన్నెల్ పూర్తి చేశాడు. ►రెండో టన్నెల్ రేపు నెల అక్టోబర్‌లో జాతికి అంకితం చేయబోతున్నాం. ►మీ బిడ్డ హయాంలోకి రాకముందు గతంలో చంద్రబాబు హయాంలో రాయలసీమ జిల్లాల ప్రాజెక్టులను గమనించాలి. ►గండికోట 27 టీఎంసీల కెపాసిటీ, నీళ్లు పెట్టే పరిస్థితి కేవలం 12 టీఎంసీలు పెట్టలేని పరిస్థితి. ►చిత్రావతి 10 టీఎంసీల కెపాసిటీ, కేవలం మూడు నాలుగు టీఎంసీలు నీళ్లు పెట్టలేని పరిస్థితి. ►బ్రహ్మం సాగర్ 17 టీఎంసీల కెపాసిటీ, కానీ నీళ్లే అందని పరిస్థితి. ►మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాజెక్టులో కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ పెంచాం. ►ఆర్ఆర్ కు సంబంధించిన డబ్బులు ఇచ్చాం. ►ఈ రోజు ఈప్రాజెక్టులో పూర్తిగా నీటి నిల్వ చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నా. ►గతానికి ఇప్పటికీ తేడాను గమనించమని అడుగుతున్నా. ►ఇవన్నీ ఒకవైపున చెబుతూ మరోవైపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ఆలోచన చేయాలి. ►మనం ఎప్పుడైతే ఎన్నికలకు వెళ్లేటప్పుడు మనస్సాక్షిని అడగాలి. ►ఈ ప్రభుత్వంలో మనకు మంచి జరిగిందా? లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ►గతానికి ఇప్పటికి తేడా గమనించమని అడుగుతున్నా. ►గతంలో ఇదే రాష్ట్రమే, ఇదే బడ్జెట్, అప్పులు అప్పటి కన్నా గ్రోత్ రేటు తక్కువే. ►మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి. ►అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నాలుగు సంవత్సరా ల కాలంలో 2.35 లక్షల కోట్లు నేరుగా పంపించాం. ►గతంలో చంద్రబాబు హయాంలో ఇదే కార్యక్రమం ఎందుకు జరగలేదు ఆలోచన చేయాలి. ►మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు? చంద్రబాబు ఎందుకు చేయలేదు. ►చంద్రబాబు నమ్ముకున్నది ప్రజలకు మంచి చేయాలని కాదు ►ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి మీద ఆయన నమ్మకం. ►రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది వీళ్లతో పంచుకోవడం. ►అలా పంచుకుంటే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు. ►ఈనాడు రాయదు, చూపించదు. ఆంధ్రజ్యోతి చంద్రబాబు కోసం డంకా బజాయిస్తుంది. ►టీవీ5 చంద్రబాబు ఎంత దారుణంగా పాలన చేసినా బ్రహ్మాండగా చేశాడని చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ►అప్పట్లో జరిగిందంతా దోచుకోవడం, పంచుకోవడం తినుకోవడం. ►గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే, పైస్థాయిలో చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీరికితోడు ఒక దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది. ►కానీ మీ బిడ్డ హయాంలో ఈరోజు గమనించమని అడుగుతున్నా. ►ప్రతి గ్రామంలో పాలన మారింది. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం వచ్చింది. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ వచ్చాడు. ►రాజకీయాలు, పార్టీలు, చూడటం లేదు. లంచాలు, వివక్ష లేదు. ►అర్హత ఉంటే చాలు మా పార్టీకి ఓటు వేశాడా లేదనేది చూడటం లేదు. ►గ్రామంలో సోషల్ ఆడిట్ లో లిస్టు పెడుతున్నారు. ►రాకపోతే మీరు అడగండి మీ జగనన్న ప్రభుత్వం ఇస్తుందని భరోసా కల్పిస్తున్న పాలన కనిపిస్తోంది. ►మీ ఊర్లో ఉండే స్కూళ్లను గమనించండి, గతానికి ఇప్పటికీ తేడా గమనించండి. ►స్కూళ్లన్నీ ఇంగ్లీష్ మీడియం అయ్యాయి, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు. ►6వ తరగతి నుంచి ఐఎఫ్ పీ ప్యానెల్స్ పెడుతున్నారు. ►8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తున్నారు. ఈ మార్పులు నాడు-నేడుతో మారుతున్నాయి. ►స్కూళ్ల పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా, హాస్పిటల్స్ పరంగా ఎప్పుడూ చూడని విధంగా గ్రామంలో విలేజ్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి. ►మారిపోయిన పీహెచ్ సీలు కనిపిస్తున్నాయి. ►సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు కనిపిస్తున్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్న పరిస్థితి. ►53 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ నింపిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ►ఆరోగ్య సురక్షను లాంచ్ చేశాం. ప్రతి ఇంట్లో జల్లెడ పడుతున్నారు. ►ఏ సమస్య ఉన్నా టెస్టులు చేసి మందులు ఇచ్చి చేయి పట్టుకొని నడిపిస్తున్నాం. ►వ్యవసాయం తీసుకుంటే ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. ఈ క్రాపింగ్ జరుగుతోంది. ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికీ మంచి జరుగుతోంది. ►పంటల కొనుగోలులో ఇబ్బంది ఎదురైతే వెంటనే ఆర్బీకే స్థాయి నుంచే కొనుగోలు చేసేలా ఈరోజు పరిస్థితి కనిపిస్తోంది. ►ప్రతి అడుగులోనూ వ్యవసాయం, చదువులు, ఆరోగ్యం, గవర్నెన్స్, మహిళలకు తోడుగా ఉండే కార్యక్రమం, సామాజిక న్యాయం తీసుకున్నా మన ప్రభుత్వానికి సాటి ఎవ్వరూ లేని చెబుతున్నా. ►అందరితో నా విన్నపం ఒక్కటే అబద్ధాలు నమ్మకండి ►రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి. ►మనకు ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, టీవీ5, దత్తపుత్రుడు లేడు. ►నేను వీళ్లను నమ్ముకోలేదు. నేను నమ్మకున్నదల్లా మంచి చేయడం, ఆ మంచి మీ ఇళ్లలో జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ►ఉండాలని పిలుపునిస్తున్నా. ►దేవుడి దయ వల్ల మీకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 12:20PM డోన్ సభలో మంత్రి బుగ్గన ►జిల్లా ప్రజలకు ఇది పండుగ రోజు ►కరువు సీమలో సీఎం జగన్ చర్యలతో సాగు, తాగునీళ్లు ►గతంలో ఈ ప్రాంతం అనేక అవస్థలు పడింది ►77 చెరువులకు సీఎం జగన్ జలకళనుఅందించారు ►డోన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ►పలు ప్రాంతాల్లో అనేక కొత్త రోడ్లను వేయించారు. ►గత పాలకులు కేవలం మాటలకే పరిమితమయ్యారు. ►గత ప్రభుత్వ కుంభకోణాలను అసెంబ్లీలో వివరిస్తాం ►చంద్రబాబు అరెస్టుపై కొంతమంది అవాస్తవాలు చెబుతున్నారు ►అవినీత కేసులో ప్రతిపక్ష నేత అరెస్టై జైలుకు వెళ్లారు 12:07PM ►డోన్ బహిరంగ సభా వేదిక వద్దకు సీఎం జగన్ 11:10 AM ►హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరువులకు నీటి కేటాయింపు. ►కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేలా సీఎం జగన్ చర్యలు. ►రూ.224 కోట్లతో పంప్‌హౌస్‌ను ప్రభుత్వం నిర్మించింది. ►77 చెరువులకు లక్కసాగరం పంప్‌హౌస్ నీటిని అందించనుంది. దీంతో, నీటి కష్టాలు తీరునున్నాయి. 10:58AM ►లక్కసాగరం వద్ద పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం జగన్ ►డోన్, పత్తికొండ,ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో చెరువులకు జలకళ ►హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి తాగు,సాగునీటి సరఫరా ►10,394 ఎకరాలకు సాగునీరందించే పథకం ప్రారంభం 10:21AM ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకున్నారు ►ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ సృజన, రాష్ట్ర మంత్రులు గుమ్మనూరు జయరాం, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ►మరి కాసేపట్లో లక్కసాగరం వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు వద్దకు సీఎం జగన్. ►అక్కడినుండి పంప్ హౌస్‌కు చేరుకుని రాయలసీమ వరప్రధాయనిగా వున్న 77 చెరువులకు నీళ్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ 7:50AM ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ►సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ►హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు నీటిని నింపే ప్రాజెక్టును సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. ►ఈ కార్యక్రమం అనంతరం నంద్యాల జిల్లా డోన్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. -
కృష్ణాజలాలతో చెరువులన్నీ నింపుతాం
సాక్షి, జీడిపల్లి(అనంతపురం) : కరువు జిల్లా అనంతకు హంద్రీనీవా వరంలాంటిదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతోనే హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయన్నారు. ఆ మహానేతను జిల్లా వాసులెప్పటికీ మరువలేరన్నారు. బుధవారం ఆయన బెళుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం రెండో దశ కాలువకు నీటిని విడుదల చేశారు. అంతకుముందు హెడ్‌రెగ్యులేటర్ వద్ద అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రైతు మిషన్ సభ్యుడు రాజారాంలతో కలిసి మంత్రి గంగపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ కృష్ణా జలాలతో జిల్లాలోని అన్ని చెరువులను నింపి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అనంతరం హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ వెంకటరమణ మాట్లాడుతూ జీడిపల్లి రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1.68 టీఎంసీలు కాగా, ప్రస్తుతం రిజర్వాయర్‌లో 1.60 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతానికి రెండో దశ కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేశామని, 24 గంటల తర్వాత ఇన్‌ఫ్లో ఆధారంగా 600 క్లూసెక్కుల మేర విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో హంద్రీనీవా ఈఈ నారాయణ నాయక్, డీఈ వెంకటేశ్వర్లు, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
హంద్రినీవా, తుంగభద్ర ప్రాజెక్టులపై ఆరా
-
హెచ్ఎన్ఎస్ఎస్ జూనియర్ అసిస్టెంట్‌పై ఛీటింగ్ కేసు
కర్నూలు: హంద్రీనీవా సుజల స్రవంతి అనంతపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న అనిల్‌కుమార్‌పై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది. కర్నూలు నగరం కొత్తపేటకు చెందిన షేక్ జమీలా కూతురు షాహిదా పదోతరగతి వరకు చదువుకుంది. ఈ విషయం తెలుసుకున్న అనిల్‌కుమార్ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి షేక్ జమీలా దగ్గర లక్ష రూపాయలు దండుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులు వాపస్ ఇవ్వమని కోరినప్పటికీ అతను తప్పించుకొని తిరుగుతుండటంతో శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ డేగల ప్రభాకర్ తెలిపారు. -
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కొత్తపల్లి (పత్తికొండ రూరల్): రానున్న వేసవిలో కర్నూలు నగరంలో నీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పందికోన రిజర్వాయర్ వద్ద ఎడమకాలువ నుంచి గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. పందికోన రిజర్వాయర్‌కు 400 క్యూసెక్కుల నీటిని హంద్రీ–నీవా కాలువ ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. ఇందులో 200 క్యూసెక్కుల నీటిని గాజుల దిన్నె ప్రాజెక్టుకు సరఫరా చేస్తామని చెపా్పరు. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అనంతరం కొత్తపల్లి గ్రామరైతులు కలెక్టర్‌ను కలిసి పందికోన రిజర్వాయర్ నుంచి వస్తున్న ఊట నీరుతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ఇక్కడ కాలువలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటిని మళ్లించాలని కోరారు.కలెక్టర్ వెంట పత్తికొండ తహసీల్దారు పుల్లయ్య, పంట కాలువల డీఈ గుణాకర్‌రెడ్డి, ఏఈలు, జేఈలు త్రినాథ్‌రెడ్డి, పురుషోత్తం, సాగునీటి ప్రాజెక్టు అధికారులు, ఆర్ఐ ఫకృద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా నది పరీవాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణాపై హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారికి లక్ష రూపాయల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించాలని ఆదేశించింది. అక్రమంగా ఇసుక తరలింపుపై గతంలో జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 320 ట్రాక్టర్లను సీజ్ చేశామని, సీజ్ చేసిన ఇసుకను కర్నూలు 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచామని ప్రభుత్వం తెలిపింది. మరి దీనిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదని హైకోర్టు ప్రశ్నించింది. అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్న వారికి జీవో నెంబర్ 42 ప్రకారం రూ. లక్ష జరిమానా ఎందుకు వేయలేదని ఎస్పీ, కలెక్టర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఇకపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో భూగర్భ గనుల శాఖాధికారి కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
పంప్‌హౌస్‌లో సెక్యూరిటీ గార్డు గల్లంతు
నందికొట్కూరు: హంద్రీనీవా పంప్‌హౌస్–2లో సెక్యూరిటీ గార్డు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. నందికొట్కూరు పట్టణానికి నాగేంద్ర అలియాస్ ఏసేపు(26) హంద్రీనీవా–2లో రెండేళ్ల నుంచి సెక్యూరిటీగార్డు పని చేస్తున్నారు. ఇతని తల్లిదండ్రులు అడ్డాకుల నాగేశ్వరరావు, పుల్లమ్మ మృతి చెందారు. ఆదివారం..యువకుడు పంప్‌హౌస్‌లో గల్లంతు కావడంతో హెచ్ఎన్ఎస్ఎస్(హంద్రీనీవా సుజల స్రవంతి) సిబ్బంది, ఎస్ఐ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారిందని ఉదయం వరకూ ఏమీ తేల్చలేమని ఎస్ఐ తెలిపారు. -
హంద్రీనీవా కాలువ పనుల్లో అపశృతి
చిత్తూరు: జిల్లాలో జరుగుతున్న హంద్రీనీవా కాలువ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. వీకోటలో జరుగుతున్న కాలువ పనుల్లో కాంక్రీట్ మిక్చర్ బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందింది. అంజనేయులు మహబూబ్‌నగర్‌జిల్లా వాసి. కాలువ పనులు పర్యవేక్షించే ఇంజనీర్లు, ఇతర అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని అతని స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. -
సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
- పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి - వైఎస్ జగన్ ఎదిగే నాయకుడు - విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ ఎమ్మిగనూరు: సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చి జిల్లాలోని ఆయకట్టుకు పుష్కలంగా నీరిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూశాఖా మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎమ్మెల్యే డా.బి. జయనాగేశ్వరరెడ్డితో కలసి ఆదివారం ఆయన ఎమ్మిగనూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు ప్రాంతాల ఆయకట్టుకు నీరు అందుతోందన్నారు. ఈ ప్రాజెక్టు కాలువ విస్తరణకు రూ.1300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదిగే నాయకుడని, ఆయనకు మరింత భవిష్యత్తు ఉందన్నారు. అయితే ఇప్పటి నుంచే సీఎం కుర్చీపై కాకుండా ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు. రాష్ట్రాన్ని దారుణంగా విడగొట్టిన పాపం కాంగ్రెస్‌దని, ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కేంద్ర మాజీ మంత్రి ఇప్పుడేమో రైతుల కోసం పోరాడుతున్నట్లు కవరింగ్ ఇచ్చుకునేందుకు డిల్లీ నాయకులతో సమావేశాలు పెట్టారని ఎద్దేవా చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఏర్పడిందని చెప్పిన కేఈ.. అందువల్లే అంబూజ, సోలార్జీ, ఏరోడ్రమ్ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. అనంతరం ఎమ్మిగనూరులో ఇండోర్ స్టేడియం, నందవరం రెవెన్యూ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమాల్లో జెడ్పీ వైస్ చైర్పర్సన్ పుష్పావతి, ఎంపీపీలు నరసింహారెడ్డి, శంకరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి, మార్కెట్‌యార్డు చైర్మన్ సంజన్న, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఈరన్నగౌడ్, దేశాయ్మాధవరావు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు విక్రమ్‌కుమార్‌గౌడ్, ఆర్డీఓ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
నీళ్లున్నా ..కన్నీళ్లే!
– హంద్రీనీవా నుంచి 1 టీఎంసీకి ఇండెంట్ పెట్టిన ఇంజినీర్లు – అనుమతులు ఇవ్వని ఈఎన్సీ – కృష్ణా బోర్డు కేటాయించిన నీరంతా ‘అనంత’ జిల్లాకేనని వినిపిస్తున్న వాదన కర్నూలు సిటీ: రాయలసీమ వాసుల కలల ప్రాజెక్టు హంద్రీనీవా. దీని కోసం జిల్లా ప్రజలు వందలాది ఎకరాల భూములను త్యాగం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి జిల్లాకు చుక్క నీరు అందని పరిస్థితి. కళ్ల ముందు నీరు పోతున్నా వినియోగించుకోలేని దుస్థితి. తెలుగు దేశం పార్టీ అ«ధికారంలోకి వచ్చినప్పటి నుంచి హంద్రీనీవా నీటి విషయంలో జిల్లాకు అన్యాయం జరుగుతూనే ఉంది. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు మినహా ఏ ప్రాజెక్టులో కూడా ఆశించిన మేరకు నీటి లభ్యత లేదు. దీంతో ఆయకట్టుకు, తాగు నీటికి జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పందికోన నుంచి హంద్రీనీవా నీరు ఒక టీఎంసీ.. జీడీపీ(గాజులదిన్నె ప్రాజెక్టుకు)కి విడుదల చేయాలని.. ఇందుకు అనుమతులు ఇవ్వాలని ఈఎన్సీకి కర్నూలు సర్కిల్ ఎస్ఈ లేఖ రాశారు. దీనికి స్పందించకపోగా హంద్రీనీవా నీరు మీరేలా తీసుకుంటారని ఎస్ఈపై ఈఎన్సీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నీరంతా అనంతకే...! హంద్రీనీవా కాలువ ద్వారా 40 టీఎంసీల వరద జలాలను రాయలసీమ జిల్లాకు తరలించాలనేది లక్ష్యం. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన 6.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు, సుమారు 33 లక్షల మంది తాగు నీటి అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ఏడాది సుమారు 15 టీఎంసీల నీటిని మల్యాల ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోశారు. ఇందులో జిల్లాకు వచ్చింది ప్రస్తుతం కృష్ణగిరి(0.16 టీఎంసీ), పందికోన(0.65 టీఎంసీ) రిజర్వాయర్లలోని నీటితో కలిపి 2.31 టీఎంసీలు మాత్రమే. అనంతపురం జిల్లాలో పెన్నా అహోబిలం రిజర్వాయర్, జీడీపల్లి రిజర్వాయర్, 53 చెరువులతో కలిపి ఈ నెల 6 నాటీకే అధికారుల లెక్కల ప్రకారమే ప్రస్తుతం సుమారు 10 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు ఖరీఫ్‌లో సుమారు 60 వేల ఎకరాల్లో ఆయకట్టు సాగు చేశారు. తాగు నీటి అవసరాలు తీర్చుకున్నారు. అయినా ఇంకా నీరు కావాలని అడుగుతున్నారు. వాస్తవం ఇదీ.. కృష్ణా బోర్డు 5 టీఎంసీలను కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులో కర్నూలు, అనంతపురం జిల్లాల పేర్లు ఉన్నాయి. అయితే అనంతపురం జిల్లాకు మాత్రమే ఈ కేటాయింపులని ఆ జిల్లా టీడీపీ నేతలు, అధికారులు వాదిస్తున్నారు. గతేడాది కూడా కాల్వ తూములకు కాంక్రీట్ వేసి వచ్చిన నీరంతా అనంతపురం జిల్లాకే తరలించారు. దీంతో అక్కడ గతేడాది వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తలేదు. జిల్లాలో మాత్రం హంద్రీనీవా కాలువ పక్కనే వెళ్తున్నా..ప్రజలు దాహార్తితో అల్లాడారు. దాహం తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. -
హంద్రీనీవాతో సీమ సస్యశ్యామలం
హాలహర్వి : దివంగత ముఖ్యమంత్రి ఽవైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా సాగు, తాగునీరు అందించి సీమ జిల్లాలను సస్యశ్యామలం చేశారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. బుధవారం ఆయన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో కలిసి మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయం, హర్ధగేరి హెల్త్ ఏటీఎంను ప్రారంభించారు. జిల్లాలో ఆలూరు నియోజకవర్గం అత్యంత వెనకబడిందని, ఈ ప్రాంత రైతులు వర్షాధారంపై ఏటా పంటలను సాగుచేసి నష్టపోతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కరువు రైతులను ఆదుకునేందుకు దివంగత మహానేత వైఎస్సార్ అప్పట్లోనే హాలహర్వి మండలం గూళ్యం తుంగభద్ర వృథా జలాలను ఆపేందుకు వేదావతి ప్రాజెక్టును నిర్మించేందుకు యత్నించారని, ఆయన మరణంతో ఆ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు గూళ్యం వద్ద దాదాపు రూ.650 కోట్లతో ప్రాజెక్టు చేపడతామని హామీ ఇచ్చారని, ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని హాలహర్వి, హొళగుంద, ఆస్పరి, ఆలూరు మండలాలకు తాగు, సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో ఉన్న చెరువులను నింపేందుకు హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తానని, అందుకు రూ.120 కోట్లు ఖర్చు పెడతానని ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆ ప్రచారాలను కట్టిబెట్టి హంద్రీనీవా ఽద్వారా చెరువులు నింపే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు కేంద్ర పథకాలను తమవిగా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ భీమప్పచౌదరి, ఎంపీపీ బసప్ప, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, జెడ్పీటీసీ సభ్యుడు రేగులరమణ, హర్ధగేరి సర్పంచు తిప్పారెడ్డి, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వీరభద్రగౌడ్, రాష్ట్ర జలవనరుల శాఖ అఫెక్స్ మెంబర్ కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. -
హంద్రీనీవాను వెంటనే పూర్తి చేయాలి
హిందూపురం టౌన్ : హంద్రీనీవా ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లను కేటాయించి రెండోదశ పనులను వెంటనే పూర్తి చేయాలని రాయలసీమ అభివద్ధి వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక అల్‌హిలాల్ పాఠశాలలో చైతన్య గంగిరెడ్డి అధ్యక్షతన రాయలసీమ అభివద్ధి వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ అభివద్ధి వేదిక కన్వీనర్ డాక్టర్ ఈటీ రామ్మూర్తి, రామకష్ణ, ఎల్ఐసీ నరేంద్ర, బదరీష్, న్యాయవాది రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ‘అనంత’కు ప్రాణపదమైన హంద్రీనీవా ప్రాజెక్టును యుద్ధపాత్రిపదికన పూర్తి చేయాలన్నారు. రాయలసీమ అభివద్ధి వేదిక డిమాండ్లపై త్వరలో డాక్టర్ ఎమ్మెల్సీ గేయానంద్ చేపట్టిన జీపుజాత హిందూపురంలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా పరిగి మండలానికి శ్రీధర్, శ్రీకాంత్, లేపాక్షి మండలానికి రామాంజినేయులు, చిలమత్తూరు మండలానికి చైతన్య గంగిరెడ్డి, అలీముల్లాను ఇన్చార్జిలుగా ఎంపిక చేశారు. వేదిక సభ్యులు రాజశేఖర్, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్, వెంకటరామిరెడ్డి, ఆదినారాయణప్ప, చంద్ర, బాబావలి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
రైతుల జీవితాలతో ఆటలా?
– కాంట్రాక్టర్లపై జల్లా కలెక్టర్ ఆగ్రహం – డిసెంబర్ చివరిలోగా హంద్రీనీవా పనులు పూర్తి చేయాలని ఆదేశం –పర్యవేక్షణకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు కర్నూలు(అగ్రికల్చర్): ‘‘రైతుల జీవితాలతో ఆటలు ఆడుకుంటారా...మీ నిర్లక్ష్యంతో పత్తికొండ, దేవనకొండ మండలాల్లో రూ.500 కోట్ల విలువ చేసే పంట నష్టపోయారు.. దీనికి మీరే బాధ్యత వహించాలి’’ అంటూ కాంట్రాక్టర్లపై జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం కాన్ఫరెన్స్ హాల్లో హంద్రీనీవా సుజల స్రవంతి ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. హెచ్ఎన్ఎస్ఎస్ 28,29 ప్యాకేజీలోని కుడి, ఎడమ కాల్వల పనులు వెంటనే ప్రారంభించి డిసెంబర్ నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు డిప్యూటీ కలెక్టర్లు..మల్లికార్జున, శశిదేవి, ఆదోని ఆర్డీఓ ఓబులేసులను నియమించారు. వీరికి 15 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 15 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సహకారం అందిస్తారన్నారు. భూ సేకరణ కోసం రూ.65 కోట్లు కేటాయించామని.. ఇప్పుడు కారణాలు చెప్పడం సరికాదన్నారు. గతంలో చేసిన పనులకు రూ.5 కోట్ల బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్లు నివేదించగా ప్రభుత్వంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ముచ్చమర్రి ఎత్తిపోతల పథకం వచ్చే నెలలో పూర్తవుతుందని.. మార్చి నెల చివరికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నందున 28, 29వ ప్యాకేజి పనులను డిసెంబర్‌లోగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ గంగాధర్‌గౌడ్, హంద్రీ నీవా సుజల స్రవంతి ఎస్ఈ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
హడావుడిగా పనుల ప్రారంభం
వజ్రకరూరు : హంద్రీనీవా ద్వారా నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నేడు మండలంలోని రాగులపాడు ఎత్తిపోతల ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టిన నేపథ్యంలో హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీల పనులను ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించింది. మండల పరిధిలోని ధర్మపురి వద్ద హంద్రీనీవా మైనర్కాలువlపనులను అధికారులు ఆదివారం ప్రారంభించారు. నియోజకవర్గంలోని 80 వేల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీల పనులు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. -
తెలుగు రాష్ట్రాలకు ఘాటు లేఖ
కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అనుసరిస్తున్న తీరుపై కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు ఆగ్రహంతో ఉంది. కృష్ణా జలాల వాడకం విషయంలో ఎవరికి వారే.. చందంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై గట్టిగా ప్రశ్నించాలని నిశ్చయించింది. ఈ మేరకు సమావేశ వివరాలను తెలియజేస్తూ బోర్డు ఇరు రాష్ట్రాలకు గురువారం లేఖలు రాసింది. నీటి వినియోగం విషయంలో తమకు మాటమాత్రమైన చెప్పకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఇది వరకే బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో చేసుకున్న ఒప్పందాలు విస్మరించి నీటిని వాడుకోవడాన్ని తీవ్రంగా పరగణిస్తామని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా, తె లంగాణ జూరాల నుంచి కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడులకు తమకు తెలపకుండానే, నీటి అవసరాల ఇండెంట్ ఇవ్వకుండానే వాడుకోవడాన్ని తప్పుపట్టింది. అయితే, ప్రస్తుతం సైతం ఇరు రాష్ట్రాలు తమ అవసరాలు చెప్పకుండా, నీటిని వాడుకుంటుండటంతో త్రిసభ్య కమిటీ భేటీ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రాజెక్టుల వారీ నీటి పరిస్థితులు, ఇరు రాష్ట్రాల అవసరాలు, మైనర్ ఇరిగేషన్ కింద వినియోగిస్తున్న నీటిపై వివరాలు ఏ రాష్ట్రం ఇవ్వలేదని, ఇప్పటికై వీటి వివరాలు సమర్పించాలని లేఖలో కోరింది. ఆ మేరకు అందిన సమాచారంతో ఈ నెల 24న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. -
వైఎస్ఆర్కి పేరొస్తుందనే...
అనంతపురం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరొస్తుందనే.. చంద్రబాబు హంద్రీనీవా పట్టించుకోలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. అనంతపురానికి కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్దే అని ఆయన గుర్తు చేశారు. గురువారం అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌లో ఆయన పుష్కర స్నానం చేశారు. అనంతరం వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఏటా 15 టీఎంసీలు వస్తున్న ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. డిస్ట్రిబ్యూటరీలను వెంటనే పూర్తి చేసి పంటలకు నీరు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలని వై.విశ్వేశ్వరరెడ్డి పూజలు నిర్వహించారు. -
రెచ్చిపోతున్న పరిటాల శ్రీరామ్
అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం రాజ్యమేలుతోంది. అధికారం అండతో మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. హంద్రీ-నీవా జల సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం రామగిరి మండలం పోలేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని అడ్డుకునేందుకు అల్లరిమూకలు బీహార్ తరహాలో రాళ్లు, కట్టెలు పట్టుకుని రోడ్లపై నిలబడి భయానక పరిస్థితులను తలపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక మంత్రి, ఆమె కొడుకు పరిటాల శ్రీరామ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల మద్దతు పెరుగుతుండడంతో.. జిల్లాకు అన్యాయం చేస్తూ హంద్రీ-నీవా నీటిని అక్రమంగా కుప్పంకు తరలించేందుకు ముఖ్యమంత్రి కుట్ర పన్నారని, ఈ విషయాన్ని జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన హంద్రీ-నీవా జల సాధన సమితి చైతన్య యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రామగిరి మండలం పోలేపల్లిలో కార్యక్రమం ఏర్పాటుకు ఇన్చార్జ్ సీఐ శ్రీధర్‌తో ముందురోజే ప్రకాష్‌రెడ్డి అనుమతి తీసుకున్నారు. అనుమతి ఉత్తర్వు సీఐ నుంచి ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్‌కు వెళ్లింది. ఏం జరిగిందో ఏమో కానీ డీఎస్పీ అనుమతికి నిరాకరించారు. పరిటాల సునీత, శ్రీరామ్ ఒత్తిడి మేరకే పోలీసులు అనుమతి ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది. దారి పొడవునా రౌడీ, అల్లరిమూకలు పోలేపల్లి సమావేశానికి పోలీసుల అనుమతి ఇవ్వలేదని తెలిసిన తర్వాత పరిటాల శ్రీరామ్ హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. చుట్టు పక్కల గ్రామాల్లో తమ అనుచరులుగా ఉన్న కొంతమంది రౌడీ మూకలను దింపి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కనిపిస్తే అడ్డుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎన్ఎస్ గేటు నుంచి వెంకటాపురం వెళ్లే దారిలో పాపిరెడ్డిపల్లి క్రాస్, పోలేపల్లి క్రాస్, చిగురుచెట్టు కింద, ఎగువపల్లి క్రాస్, సంజీవరాయుని రైస్‌మిల్, శ్రీహరికోట వద్ద గుంపులు గుంపులుగా జనం కట్టెలు, రాళ్లు, మారణాయుధాలు పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. ఎస్పీని కలిసి ప్రకాష్‌రెడ్డి ఈ క్రమంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ చేస్తున్న దౌర్జన్యాలను వివరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని ఆరోపించారు. అనుమతులు ఇవ్వకపోవడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అండతో వెళ్లి తీరుతాం శాంతియుతంగా నిర్వహిస్తున్న సమావేశాన్ని అధికారం దౌర్జన్యంతో అడ్డుకోవాలని మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవ ర్గ ప్రజలను పూర్తిగా విస్మరించారు. అన్నివర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి జీర్ణించుకోలేక పోలేపల్లి సమావేశాన్ని అడ్డుకున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల అండతో రామగిరి పర్యటన కచ్చితంగా చేసి తీరుతాం. దీంట్లో వెనుకడుగు వేసే ప్రసక్తేలేదు. - తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి -
హంద్రీనీవా జల సాధనకు రాజీలేని పోరాటం
‘విశ్వ’ జలదీక్షకు మద్దతు తెలిపిన సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ గుంతకల్లు: జిల్లాలోని చెరువులన్నింటికీ హంద్రీ నీవా కృష్ణ జలాలు ఇవ్వాలని, పిల్ల కాలువలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మార్చిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాల యంలో శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. కృష్ణ జలాలను చిత్తూరుకు మళ్లించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు జి ల్లాలోని ఆయకట్టుకు నీరు ఇవ్వరాదని, డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువ పనులను ఆపి వేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అనంతపురం జిల్లాకు 23 టీఎంసీలు కృష్ణ జలాలు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం 7, 8 టీఎంసీలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంతోందని ఆరోపించారు. గుంతకల్లు నియోజకవర్గంలోని రాగులపాడు నుంచి గూళపాళ్యం వరకు పిల్ల కాలువ ల నిర్మాణానికి రూ.36 కోట్లు అవసరమని అధికారులు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాకు తెలిపారన్నారు. అయినా ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ‘విశ్వ’ జలదీక్షకు సీపీఐ మద్దతు కృష్ణ జలాల సాధన కోసం ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి చేపట్టబోయే జలదీక్షకు సీపీఐ తరుపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు జగదీష్ ప్రకటించారు. ఈ జలదీక్షకు సీపీఐ, దాని అనుబంధ సంఘాల నాయకులు, రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. హంద్రీనీవా కా లువ పారే అన్ని మండలాల్లో మార్చి నుంచి ఆం దోళనలు చేపడతామన్నారు. సీపీఐ పట్టణ కార్యదర్శి ఎం.వీరభద్రస్వామి, సహాయ కార్యవర్శి బి.మహేష్, ఎస్ఎండీ గౌస్ పాల్గొన్నారు. -
'హంద్రీ నీవా పూర్తికై ఉద్యమం ఉధృతం'
అనంతపురం: హంద్రీ నీవా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 20, 21 తేదీల్లో వజ్రకరూర్‌లో జనజాగరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తొలిదశ ఆయకట్టుకు చంద్రబాబు నీరు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే డిస్ట్రిబ్యూటరీ పనులను నిలిపేయడానికి కారణాలు చెప్పాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. -
848 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం
ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి నీటి మట్టం 848.20 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి జలాశయానికి 4,479 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతికి 1,690 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 76.1448 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
ఇంకా పట్టిసీమలోనే..
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన హంద్రీనీవా పాత మోటారు ఇంకా పట్టిసీమలోనే ఉంది. ఈనెల 18న హడావుడిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ఈ మోటారును హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన 24 గంటల్లోనే జానంపేట వద్ద అక్విడెక్ట్‌కు గండి పడటంతో గోదావరి నుంచి నీటి తోడకాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 6వ నంబర్ వెల్‌కు బిగించిన హంద్రీనీవా పాత మోటారును తొలగించారు. దీని స్థానంలో చైనానుంచి తెచ్చిన మోటారును చైనా ఇంజినీర్లు బిగిస్తున్నారు. పాత మోటారును హంద్రీనీవాకు తరలిస్తామని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించినా.. దానిని అక్కడికి తీసుకెళ్లలేదు. -
ఆ మోటార్లు ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?
-
'హంద్రీనీవా పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుదే'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తమ పార్టీ నుంచి ప్రజా ఉద్యమం తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పుంగనురు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. బుధవారం చిత్తూరులో ఆయన మాట్లాడారు. హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉన్నదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. -
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యేలు
అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై అనంతపురం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు వై విశ్వేశ్వరరెడ్డి, చంద్బాషాలు నిప్పులు చెరిగారు. మంగళవారం అనంతపురంలో వై విశ్వేశ్వరరెడ్డి, చంద్బాషా మాట్లాడుతూ... హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హంద్రీనీవా పూర్తి చేస్తే రాయలసీమలో ఆత్మహత్యలు తగ్గుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తానంటున్న చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టుపై ఎందుకు హడావుడి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని వారు చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రాజెక్టు వెంటనే పూర్తిచేయాలన్న డిమాండ్‌తో జనవరి 28, 29 తేదీల్లో నిరాహారదీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 15 రోజులు చాలంటూ ఆర్థిక మంత్రి యనమల పేర్కొనడం దురదృష్టకరమని ఎమ్మెల్యే చాంద్‌బాషా వ్యాఖ్యానించారు. ఏపీలో రాజధాని నిర్మాణం, రుణమాఫీ, నిరుద్యోగభృతి వంటి అనేక సమస్యలున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు 45 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై సమాధానాలు చెప్పలేక అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు ప్రభుత్వం కుదిస్తోందని చాంద్ బాషా విమర్శించారు. -
పగిలిన హంద్రీనీవా పైపులైన్లు
కర్నూలు జిల్లా నాయకల్ వద్ద హంద్రీ నీవా పైప్ లైన్లు పగిలాయి. దాంతో నీళ్లు పెద్దమొత్తంలో వృథాగా పోతున్నాయి. పొలాలకు ముంపు ప్రమాదం ఏర్పడింది. ఈ కారణంగా రైతులు ఆందోళనలో్ మునిగిపోయారు. రైతులు చేసిన తప్పిదం వల్లే ఈ సంఘటన జరిగిందని అధికారులు అంటున్నారు. పంట పొలాలకు నీళ్లు పెట్టుకోవడం కోసం కొంతమంది రైతులు ఈ పైపులైనుకు రంధ్రం చేసే ప్రయత్నం చేసి ఉంటారని, దానివల్లే అది కాస్తా పగిలిపోయి మొత్తం నీరు వృథా అవుతోందని భావిస్తున్నారు. తాగునీటిని పంటపొలాలకు ఉపయోగించకూడదని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు అంటున్నారు.