వజ్రకరూరు : హంద్రీనీవా ద్వారా నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నేడు మండలంలోని రాగులపాడు ఎత్తిపోతల ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టిన నేపథ్యంలో హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీల పనులను ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించింది.
మండల పరిధిలోని ధర్మపురి వద్ద హంద్రీనీవా మైనర్‌కాలువlపనులను అధికారులు ఆదివారం ప్రారంభించారు. నియోజకవర్గంలోని 80 వేల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీల పనులు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
హడావుడిగా పనుల ప్రారంభం
Published Mon, Aug 29 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
Advertisement
Advertisement