CM YS Jagan Kurnool And Nandyal Tour Updates
12:33PM
డోన్ సభలో సీఎం జగన్ ప్రసంగం
►ఈరోజు ఒకవైపున పండుగ, మరోవైపున మీ అందరి ప్రేమాభిమానాల మధ్య మంచి కార్యక్రమం దేవుడి దయతో ఇక్కడ జరుపుకుంటున్నాం.
►మనందరి ప్రభుత్వం నీటి విలువ తెలిసిన ప్రభుత్వం.
►రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన అంతా కూడా శాశ్వతమైన మార్పు తీసుకొని రావాలని ►మంచి ఉద్దేశంతో అడుగులు వేయడం జరిగింది.
►అందులో భాగంగానే ఈరోజు కర్నూలు, నంద్యాల జిల్లాలకు మంచి జరిగిస్తూ, మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం.
►హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు తాగునీరు, సాగు నీరు అందించే కార్యక్రమం.
►లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ 77 చెరువులు నింపే కార్యక్రమం.
►దాదాపు రోజుకు 160 క్యూసెక్కులు చొప్పున 90 రోజుల్లో 1.24 టీఎంసీల నీళ్లు నింపేట్లుగా కార్యక్రమం మొదలవుతోంది.
►పక్కనే శ్రీశైలం ఉన్నా కూడా ఈ మెట్ట ప్రాంతాలకు పత్తికొండ, డోన్ మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందని దుస్థితి.
►డోన్‌లో అయితే ఒక్క ఎకరా కూడా ఇరిగేషన్ లో లేని పరిస్థితి.
►ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా గతంలో ఎవరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు.
►2019 మార్చిలో ఎన్నికలు జరిగాయి.
►2018 నవంబర్ అంటే ఎన్నికలకు కేవలం నాలుగు ఐదు నెలల ముందు మాత్రం ఒక జీవో ఇస్తారు, టెంకాయ కొడతారు ప్రజల్ని మోసం చేసేందుకు అడుగులు పడతాయి.
►అటువంటి పరిస్థితి నుంచి భూమి కూడా అక్వైర్ చేయలేదు.
►కేవలం టెంకాయ కొట్టేందుకు మాత్రమే 8 ఎకరాలు కొనుగోలు చేశారు.
►అటువంటి దారుణమైన మోసాలు, పరిస్థితుల మధ్య మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడింది.
►రాయలసీమ బిడ్డగా, నీటి విలువ తెలిసిన బిడ్డగా ఈ ప్రాంతానికి తోడుగా నిలబడేందుకు అక్షరాలా 250 కోట్ల విలువ చేసే ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాం.
►ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేసే రోజు వచ్చింది.
►అత్యంత కరువుతో కూడిన 8 మండలాలకు 10,130 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు తాగునీరు అందిస్తూ, 253 కోట్లతో ఈ ప్రాజెక్టుకు పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగింది.
►ఈ ప్రాజెక్టు వల్ల డోన్, పత్తికొండ రెండు నియోజకవర్గాలకు చాలా మంచి జరుగుతుంది.
►ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది.
►వెల్దుర్తి, కల్లూరు మండలాల్లో 22 చెరువులకు హంద్రీ నీవా కాలువ నుంచి పైప్ లైన్ కనెక్టివిటీ పూర్తియింది. ట్రయల్ రన్స్ కొనసాగుతున్నాయి.
►క్రిష్ణగిరి, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, దేవరకొండ మండలాల్లోని 14 చెరువులకు కూడా పైప్లైన్ కనెక్టివిటీ పూర్తయి పైప్ లైన్ కనెక్టివిటీ కొనసాగుతోంది.
►ప్యాపిలి బ్రాంచ్ కింద ప్యాపిలి, డోన్ మండలాల్లో 19 చెరువులకు పైప్ లైన్ పూర్తయి, ట్రయల్ రన్ కొనసాగుతోంది.
►జొన్నగిరి బ్రాంచ్ కింద డోన్, తుగ్గలి మండలాల్లో మరో 7 చెరువులకు కూడా కనెక్టివిటీ పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నాం.
►ఈ ప్రాజెక్టులో కొత్తగా డోన్ నియోజకవర్గంలో అదనంగా అవసరాన్ని బట్టి మరో 8 చెరువులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
►మొత్తంగా 77 చెరువులకు సంబంధించిన ఈ ప్రాజెక్టు పనులన్నింటికీ 253 కోట్లతో పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వడం జరుగుతోంది.
►ఇదొక్కటే కాకుండా గాజులదిన్నె ప్రాజెక్టుకు, ఈ సంజీవయ్య సాగర్ ప్రాజెక్టుకు, ఎమ్మిగనూరు నియోజకవర్గం కొనగండ్ల మండలం గాజుల ►దిన్నె వద్ద 4.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినది.
►24,372 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
►వర్షాలు పడితేనే బతకాలి తప్ప దీనికి కూడా కృష్ణా జలాల అలకేషన్ లేదు.
►పత్తికొండ నియోజకవర్గంలో 27 గ్రామాలకు, క్రిష్ణగిరి మండలంలో మరో 55 ఆవాసాలకు డోన్ మున్సిపాలిటీకి, కొనగండ్లతోపాటు మరో 10 ►ఆవాసాలకు తాగునీరు అందిస్తోంది.
►కర్నూలు నగరానికి కూడా నీటి సరఫరా ఇక్కడి నుంచే జరిగే కార్యక్రమం జరుగుతోంది.
►గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4.5 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు పెంచాం.
►హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి తూము నిర్మించి గ్రావిటీ ద్వారా ప్రాజెక్టుకు నీళ్లు కేటాయిస్తూ 57 కోట్లు ఖర్చు చేసి ఆ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది.
►ఆలోచన చేయమని అడుగుతన్నా. నేను చెప్పే ఈ గాజులదిన్నె ప్రాజెక్టుగానీ, కృష్ణానది అలకేషన్ లేదని గానీ ఇంత ఉపయోగపడే ప్రాజెక్టుకు మంచి జరిగించాలనే ఆలోచన గతంలో ఎప్పుడూ జరగలేదు.
►ఈ ప్రాంతంలో వర్షాలు పడితే తప్ప వ్యవసాయం జరగదని తెలిసి కూడా ఏ రోజు కూడా చెరువులు నింపాలని ఆలోచన చేయలేదు.
►కేవలం ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు, టెంకాయలు గుర్తుకొస్తాయి, జీవో కాపీ గుర్తుకొస్తుంది.
►ప్రజలకు మంచి చేయాలి అన్న ఆలోచన, తపన ఎప్పుడూ రాదు.
►నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో మీ కష్టాలు నేను విన్నాను, మీ కష్టాలను నేను చూశాను, మీకు నేను ఉన్నాను అని చెప్పా.
►చెప్పిన మాట ప్రకారం నాలుగు సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి మీ ముందు మీ బిడ్డ నిలబడుతున్నాడు. ఈరోజు నిజంగా రాయలసీమ ప్రాంతాన్ని తీసుకుంటే ఇంత దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్నాం.
►ఈరోజు హంద్రీనీవా నుంచి తూము పెట్టి 77 గ్రామాలకు లిఫ్ట్ చేసి నీళ్లు పంపించగలుగుతున్నాం.
►హంద్రీనీవా ప్రాజెక్టు కట్టింది ఎవరు అని అడుగుతున్నా.
►ఇదే పెద్దమనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పెద్దమనిషి హంద్రీనీవాకు ఖర్చు చేసింది కేవలం 13 కోట్లు.
►ఆ తర్వాత దివంగత నేత ప్రియతమ నాయకుడు, నాన్నగారు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవా కాలువ 6 వేల కోట్లతో నిర్మించారు.
►అందుకే ఈరోజు ఆ ప్రధాన కాలువ ద్వారా మనం తూములు పెట్టుకోగలుగుతున్నాం. నీళ్లతో చెరువులు నింపగలుగుతున్నాం.
►తేడా గమనించమని అడుగుతున్నా
►ప్రజల గురించి నిజంగా ఆలోచన చేశారంటే అప్పట్లో ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారి హయాంలో జరిగింది.
►మళ్లీ ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఏర్పడిన మీ బిడ్డ ప్రభుత్వంలోనే మళ్లీ జరుగుతోంది.
►రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా తోడుగా నిలబడేందుకు ఆదుకొనేందుకు అప్పట్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కార్యక్రమాన్ని ►నాన్నగారు 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు.
►ఈరోజు వాతావరణ మార్పులు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం.
►పడితే ఒకేసారి కుంభవర్షం పడుతోంది. నీళ్లు స్టోర్ చేసుకోలేకపోతే ఆ తర్వాత వరదలు వచ్చే రోజులు తక్కువే.
►పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను మీ బిడ్డ ప్రభుత్వంలో 80 వేల క్యూసెక్కులకు తీసుకెళ్తూ అడుగులు పడుతున్నాయి.
►800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ ను తీసుకొచ్చి 3 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడులో వేసే కార్యక్రమం జరుగుతోంది.
►గతంలో పాలకులను చూశాం పోతిరెడ్డిపాడులో నీళ్లు పడాలంటే శ్రీశైలం నిండితే గానీ నీళ్లు రాని పరిస్థితి.
►881 అడుగులు చేరితే తప్ప నీళ్లు రాని పరిస్థితి.
►అలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం డ్యామ్ నిండి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల్లో మాత్రమే నీళ్లు తీసుకొనే పరిస్థితి ఉంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వగలుగుతామా?
►అటువంటి పరిస్థితుల్లో ఎవరూ ఆలోచన చేయలేదు.
►మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ గురించి ఆలోచన చేశాం.
►800 అడుగుల్లోనే ఆ పక్కన తెలంగాణ తీసుకుంటోంది. వాళ్ల లిఫ్ట్ ప్రాజెక్టులన్నీ 800 అడుగుల్లోపే ఉన్నాయి.
►వాళ్లు రేప్పొద్దున పవర్ జెనరేట్ చేస్తున్నారు. మనకేమో 881 అడుగులు వస్తే తప్ప నీళ్లు అందని పరిస్థితి.
►దాన్ని మారుస్తూ రాయలసీమ ప్రజలకు తోడుగా ఉండేందుకు 800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
►వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మన కళ్ల ఎదుటే కరువుతో ఉన్న ప్రకాశం జిల్లా కనిపిస్తోంది.
►వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే తప్ప దానికి నీళ్లు రావు.
►నాన్నగారి హయాంలో ఒక్కో టన్నెల్ 18 కిలోమీటర్లు.
►దాని తర్వాత అడుగులు ముందుకు వేయాలి అంటే ఇబ్బందికర పరిస్థితులు.
►తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
►కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాకు మళ్లీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు మొదటి టన్నెల్ పూర్తి చేశాడు.
►రెండో టన్నెల్ రేపు నెల అక్టోబర్లో జాతికి అంకితం చేయబోతున్నాం.
►మీ బిడ్డ హయాంలోకి రాకముందు గతంలో చంద్రబాబు హయాంలో రాయలసీమ జిల్లాల ప్రాజెక్టులను గమనించాలి.
►గండికోట 27 టీఎంసీల కెపాసిటీ, నీళ్లు పెట్టే పరిస్థితి కేవలం 12 టీఎంసీలు పెట్టలేని పరిస్థితి.
►చిత్రావతి 10 టీఎంసీల కెపాసిటీ, కేవలం మూడు నాలుగు టీఎంసీలు నీళ్లు పెట్టలేని పరిస్థితి.
►బ్రహ్మం సాగర్ 17 టీఎంసీల కెపాసిటీ, కానీ నీళ్లే అందని పరిస్థితి.
►మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాజెక్టులో కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ పెంచాం.
►ఆర్ఆర్ కు సంబంధించిన డబ్బులు ఇచ్చాం.
►ఈ రోజు ఈప్రాజెక్టులో పూర్తిగా నీటి నిల్వ చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నా.
►గతానికి ఇప్పటికీ తేడాను గమనించమని అడుగుతున్నా.
►ఇవన్నీ ఒకవైపున చెబుతూ మరోవైపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ఆలోచన చేయాలి.
►మనం ఎప్పుడైతే ఎన్నికలకు వెళ్లేటప్పుడు మనస్సాక్షిని అడగాలి.
►ఈ ప్రభుత్వంలో మనకు మంచి జరిగిందా? లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
►గతానికి ఇప్పటికి తేడా గమనించమని అడుగుతున్నా.
►గతంలో ఇదే రాష్ట్రమే, ఇదే బడ్జెట్, అప్పులు అప్పటి కన్నా గ్రోత్ రేటు తక్కువే.
►మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి.
►అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నాలుగు సంవత్సరా ల కాలంలో 2.35 లక్షల కోట్లు నేరుగా పంపించాం.
►గతంలో చంద్రబాబు హయాంలో ఇదే కార్యక్రమం ఎందుకు జరగలేదు ఆలోచన చేయాలి.
►మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు? చంద్రబాబు ఎందుకు చేయలేదు.
►చంద్రబాబు నమ్ముకున్నది ప్రజలకు మంచి చేయాలని కాదు
►ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి మీద ఆయన నమ్మకం.
►రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది వీళ్లతో పంచుకోవడం.
►అలా పంచుకుంటే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు.
►ఈనాడు రాయదు, చూపించదు. ఆంధ్రజ్యోతి చంద్రబాబు కోసం డంకా బజాయిస్తుంది.
►టీవీ5 చంద్రబాబు ఎంత దారుణంగా పాలన చేసినా బ్రహ్మాండగా చేశాడని చెప్పే కార్యక్రమం జరుగుతుంది.
►అప్పట్లో జరిగిందంతా దోచుకోవడం, పంచుకోవడం తినుకోవడం.
►గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే, పైస్థాయిలో చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీరికితోడు ఒక దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది.
►కానీ మీ బిడ్డ హయాంలో ఈరోజు గమనించమని అడుగుతున్నా.
►ప్రతి గ్రామంలో పాలన మారింది. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం వచ్చింది. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ వచ్చాడు.
►రాజకీయాలు, పార్టీలు, చూడటం లేదు. లంచాలు, వివక్ష లేదు.
►అర్హత ఉంటే చాలు మా పార్టీకి ఓటు వేశాడా లేదనేది చూడటం లేదు.
►గ్రామంలో సోషల్ ఆడిట్ లో లిస్టు పెడుతున్నారు.
►రాకపోతే మీరు అడగండి మీ జగనన్న ప్రభుత్వం ఇస్తుందని భరోసా కల్పిస్తున్న పాలన కనిపిస్తోంది.
►మీ ఊర్లో ఉండే స్కూళ్లను గమనించండి, గతానికి ఇప్పటికీ తేడా గమనించండి.
►స్కూళ్లన్నీ ఇంగ్లీష్ మీడియం అయ్యాయి, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు.
►6వ తరగతి నుంచి ఐఎఫ్ పీ ప్యానెల్స్ పెడుతున్నారు.
►8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తున్నారు. ఈ మార్పులు నాడు-నేడుతో మారుతున్నాయి.
►స్కూళ్ల పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా, హాస్పిటల్స్ పరంగా ఎప్పుడూ చూడని విధంగా గ్రామంలో విలేజ్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి.
►మారిపోయిన పీహెచ్ సీలు కనిపిస్తున్నాయి.
►సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు కనిపిస్తున్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్న పరిస్థితి.
►53 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ నింపిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
►ఆరోగ్య సురక్షను లాంచ్ చేశాం. ప్రతి ఇంట్లో జల్లెడ పడుతున్నారు.
►ఏ సమస్య ఉన్నా టెస్టులు చేసి మందులు ఇచ్చి చేయి పట్టుకొని నడిపిస్తున్నాం.
►వ్యవసాయం తీసుకుంటే ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. ఈ క్రాపింగ్ జరుగుతోంది. ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికీ మంచి జరుగుతోంది.
►పంటల కొనుగోలులో ఇబ్బంది ఎదురైతే వెంటనే ఆర్బీకే స్థాయి నుంచే కొనుగోలు చేసేలా ఈరోజు పరిస్థితి కనిపిస్తోంది.
►ప్రతి అడుగులోనూ వ్యవసాయం, చదువులు, ఆరోగ్యం, గవర్నెన్స్, మహిళలకు తోడుగా ఉండే కార్యక్రమం, సామాజిక న్యాయం తీసుకున్నా మన ప్రభుత్వానికి సాటి ఎవ్వరూ లేని చెబుతున్నా.
►అందరితో నా విన్నపం ఒక్కటే అబద్ధాలు నమ్మకండి
►రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి.
►మనకు ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, టీవీ5, దత్తపుత్రుడు లేడు.
►నేను వీళ్లను నమ్ముకోలేదు. నేను నమ్మకున్నదల్లా మంచి చేయడం, ఆ మంచి మీ ఇళ్లలో జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ►ఉండాలని పిలుపునిస్తున్నా.
►దేవుడి దయ వల్ల మీకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
12:20PM
డోన్ సభలో మంత్రి బుగ్గన
►జిల్లా ప్రజలకు ఇది పండుగ రోజు
►కరువు సీమలో సీఎం జగన్ చర్యలతో సాగు, తాగునీళ్లు
►గతంలో ఈ ప్రాంతం అనేక అవస్థలు పడింది
►77 చెరువులకు సీఎం జగన్ జలకళనుఅందించారు
►డోన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు
►పలు ప్రాంతాల్లో అనేక కొత్త రోడ్లను వేయించారు.
►గత పాలకులు కేవలం మాటలకే పరిమితమయ్యారు.
►గత ప్రభుత్వ కుంభకోణాలను అసెంబ్లీలో వివరిస్తాం
►చంద్రబాబు అరెస్టుపై కొంతమంది అవాస్తవాలు చెబుతున్నారు
►అవినీత కేసులో ప్రతిపక్ష నేత అరెస్టై జైలుకు వెళ్లారు
12:07PM
►డోన్ బహిరంగ సభా వేదిక వద్దకు సీఎం జగన్
11:10 AM
►హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరువులకు నీటి కేటాయింపు.
►కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేలా సీఎం జగన్ చర్యలు.
►రూ.224 కోట్లతో పంప్‌హౌస్‌ను ప్రభుత్వం నిర్మించింది.
►77 చెరువులకు లక్కసాగరం పంప్‌హౌస్ నీటిని అందించనుంది. దీంతో, నీటి కష్టాలు తీరునున్నాయి.
10:58AM
►లక్కసాగరం వద్ద పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం జగన్
►డోన్, పత్తికొండ,ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో చెరువులకు జలకళ
►హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి తాగు,సాగునీటి సరఫరా
►10,394 ఎకరాలకు సాగునీరందించే పథకం ప్రారంభం
10:21AM
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకున్నారు
►ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ సృజన, రాష్ట్ర మంత్రులు గుమ్మనూరు జయరాం, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే తొగురు ఆర్థర్
►మరి కాసేపట్లో లక్కసాగరం వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు వద్దకు సీఎం జగన్.
►అక్కడినుండి పంప్ హౌస్‌కు చేరుకుని రాయలసీమ వరప్రధాయనిగా వున్న 77 చెరువులకు నీళ్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
7:50AM
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు.
►సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
►హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు నీటిని నింపే ప్రాజెక్టును సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
►ఈ కార్యక్రమం అనంతరం నంద్యాల జిల్లా డోన్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment