కర్నూలు జిల్లా నాయకల్ వద్ద హంద్రీ నీవా పైప్ లైన్లు పగిలాయి. దాంతో నీళ్లు పెద్దమొత్తంలో వృథాగా పోతున్నాయి. పొలాలకు ముంపు ప్రమాదం ఏర్పడింది. ఈ కారణంగా రైతులు ఆందోళనలో్ మునిగిపోయారు. రైతులు చేసిన తప్పిదం వల్లే ఈ సంఘటన జరిగిందని అధికారులు అంటున్నారు.
పంట పొలాలకు నీళ్లు పెట్టుకోవడం కోసం కొంతమంది రైతులు ఈ పైపులైనుకు రంధ్రం చేసే ప్రయత్నం చేసి ఉంటారని, దానివల్లే అది కాస్తా పగిలిపోయి మొత్తం నీరు వృథా అవుతోందని భావిస్తున్నారు. తాగునీటిని పంటపొలాలకు ఉపయోగించకూడదని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు అంటున్నారు.
పగిలిన హంద్రీనీవా పైపులైన్లు
Published Thu, Oct 16 2014 10:10 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM
Advertisement
Advertisement