హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ జూనియర్‌ అసిస్టెంట్‌పై ఛీటింగ్‌ కేసు | cheating case on HNSS junior assistant | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ జూనియర్‌ అసిస్టెంట్‌పై ఛీటింగ్‌ కేసు

Published Fri, May 12 2017 10:31 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

cheating case on HNSS junior assistant

కర్నూలు: హంద్రీనీవా సుజల స్రవంతి అనంతపురం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంటుగా పని చేస్తున్న అనిల్‌కుమార్‌పై రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఛీటింగ్‌ కేసు నమోదైంది. కర్నూలు నగరం కొత్తపేటకు చెందిన షేక్‌ జమీలా కూతురు షాహిదా పదోతరగతి వరకు చదువుకుంది. ఈ విషయం తెలుసుకున్న అనిల్‌కుమార్‌ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి షేక్‌ జమీలా దగ్గర లక్ష రూపాయలు దండుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులు వాపస్‌ ఇవ్వమని కోరినప్పటికీ అతను తప్పించుకొని తిరుగుతుండటంతో శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ డేగల ప్రభాకర్‌ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement