junior engineer
-
రైల్వేలో 13,847 పోస్టులు
న్యూఢిల్లీ: రైల్వే శాఖ 13వేలకు పైగా భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్(జేఈ), జూనియర్ ఇంజినీర్స్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్(డీఎంఎస్), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్(సీఎంఏ) పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ పోస్టుల వేతన స్కేలు రూ.35,400 నుంచి రూ.1,12,400గా ఉంది. ‘13,847 పోస్టులకు ఆర్ఆర్బీæసైట్లో నోటిఫికేషన్ ఇచ్చింది. జూనియర్ ఇంజినీర్ల పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంజినీరింగ్ చేసి ఉండాలి. డిపో సూపరింటెండెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన వర్సిటీ/ సంస్థ నుంచి ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు అర్హులు లేదా సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన వారు అర్హులే. జూనియర్ ఇంజినీర్(ఐటీ)పోస్టులకు పీజీడీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్)/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్)/ డీవోఈఏసీసీ ‘బీ’లెవెల్ మూడేళ్ల కోర్సు లేక గుర్తింపు పొందిన వర్సిటీ/సంస్థ నుంచి తత్సమాన కోర్సు చేసిన వారు అర్హులు. కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుకు ఫిజిక్స్, కెమిస్ట్రీతో బ్యాచిలర్ డిగ్రీ చేసిన 45 శాతం మార్కులు పొందిన వారు అర్హులు. ఈ 2వ దశ రిక్రూట్మెంట్ పరీక్ష దరఖాస్తుకు ఆఖరి తేదీ జనవరి 31’ అని పేర్కొంది. ఈ పోస్టులకు జనవరి 1, 2019 నాటికి 18–33 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు అర్హులని నోటిఫికేషన్లో తెలిపింది. -
రైల్వేలో భారీగా ఇంజనీర్ ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే శాఖ మరోసారి భారీ ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. దాదాపు 13వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించనున్నామని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది ముఖ్యంగా జూనియర్ ఇంజనీర్ (జెఇ), జూనియర్ ఇంజనీర్ (ఐటి), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ 13,487 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగవకాశాలను కల్పించిన రైల్వే శాఖ మరోసారి 13వేలకు పైగా ఉద్యోగులను నియమించుకుంటోదంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఇండియన్ రైల్వేస్ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చినట్టు తెలిపారు. ఖాళీల మొత్తం సంఖ్య: 13487 జూనియర్ ఇంజనీర్: 12844 జూనియర్ ఇంజనీర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) : 29 డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: 227 కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్: 387 ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు ముగింపు తేదీ : జనవరి 31 नये साल के अवसर पर मोदी सरकार का तोहफा : भारतीय रेल 1 लाख से अधिक नौकरियों के बाद युवाओं के लिए लेकर आ रही है 13,000 से अधिक और नौकरियों के अवसर, अधिक जानकारी के लिए नीचे दिए गए लिंक पर क्लिक करेंhttps://t.co/moGob8NwGM pic.twitter.com/AtG9jk2srA — Piyush Goyal (@PiyushGoyal) January 1, 2019 -
హెచ్ఎన్ఎస్ఎస్ జూనియర్ అసిస్టెంట్‌పై ఛీటింగ్ కేసు
కర్నూలు: హంద్రీనీవా సుజల స్రవంతి అనంతపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న అనిల్‌కుమార్‌పై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది. కర్నూలు నగరం కొత్తపేటకు చెందిన షేక్ జమీలా కూతురు షాహిదా పదోతరగతి వరకు చదువుకుంది. ఈ విషయం తెలుసుకున్న అనిల్‌కుమార్ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి షేక్ జమీలా దగ్గర లక్ష రూపాయలు దండుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులు వాపస్ ఇవ్వమని కోరినప్పటికీ అతను తప్పించుకొని తిరుగుతుండటంతో శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ డేగల ప్రభాకర్ తెలిపారు. -
ఒకే రోజు మూడు పరీక్షలా!
జోగిపేట, న్యూస్‌లైన్: ఒకే రోజు మూడు ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష నిర్వహిస్తూ అధికారులు నిరుద్యోగుల ఆశలకు గండి కొట్టారు. దీంతో నిరుద్యోగులు రెండు ఉద్యోగ అర్హత పరీక్షలకు గైర్హాజరు కాక తప్పడంలేదు. మూడింటిలో ఏదో ఒక దానికే హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం సంబంధిత అధికారులకు విన్నవించినా వారు స్పందించకపోవడంతో నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జూనియర్ ఇంజినీర్, పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ నెల 25 పరీక్ష జరుగనుంది. అదే అటవీ శాఖ ఆధ్వర్యంలో సెక్షన్ ఆఫీసర్ల ఉద్యోగానికి కూడా అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మూడు ఉద్యోగాలకు ఇంచుమించుగా డిగ్రీ, ఇంజినీరింగ్, సైన్స్ గ్రూపు విద్యార్థులు అర్హులు. అటవీ శాఖ పరీక్షను వాయిదా వేయాలని అధికారులను కోరినా వారు పట్టించుకోలేదు. పోస్టల్ అసిస్టెంట్ పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఏదేని డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. 25వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం.. అటవీ శాఖలో సెక్షన్ అధికారి ఉద్యోగానికి బీఎస్సీ సైన్స్ గ్రూపు, ఇంజినీరింగ్‌లో మెకానికల్, సివిల్, కెమికల్ డిగ్రీ చదివిన వారు అర్హులు. ఈ ఉద్యోగానికి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తారు. జూనియర్ ఇంజినీర్ ఉద్యోగం.. జూనియర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఇంజినీరింగ్ చదివిన వారు అర్హులు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. నష్టపోనున్న నిరుద్యోగులు పోస్టల్ ఉద్యోగానికి ఏదేని డిగ్రీ చదివిన వారు అర్హులు. అదేవిధంగా ఇంజనీరింగ్, అటవీ శాఖ ఉద్యోగానికి ఇంజనీరింగ్, బీఎస్సీ చదివిన వారు అర్హులు. మూడింటిలో ప్రతి రెండు ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌తో పాటు ఏదేని డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. దాదాపుగా మూడు ఉద్యోగాలకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ముందుగానే తేదీలను ప్రకటించింది. అటవీశాఖ ముందుగా నిర్ణయించిన తేదీలను వాయిదా వేసి ఈనెల 25న పరీక్ష నిర్వహిస్తోంది. దీంతో నిరుద్యోగులు జేఎన్టీయూ అధికారులను పరీక్ష వాయిదా వేయాలని వేడుకుంటున్నారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో అభ్యర్థులు మూడింటిలో ఏదేని ఒక పరీక్షనే రాయాల్సి ఉంటుంది. మూడింటిలో ఏదో ఒకటి రాకపోతుందా అనే యోచనలో ఉన్న అభ్యర్థుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ తేదీలను ముందు చూపుతో నిర్ణయించకపోవడం వల్ల అర్హులైన నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. -
ఒకేరోజు మూడు ఉద్యోగ అర్హత పరీక్షలు
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ఒకే రోజు మూడు ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష ఉండటంతో నిరుద్యోగులు రెండు ఉద్యోగ అర్హత పరీక్షలకు గైర్హాజరు కాక తప్పడంలేదు. మూడింటిలో ఏదో ఒక దానికే హాజరు కావలసిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులకు విన్నవించినా వారు స్పందించకపోవడంతో నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఆధ్వర్యంలో జూనియర్ ఇంజినీర్, పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ నెల 25 తేదీన పరీక్ష జరగనుంది. అదే రోజు రాష్ట్రజేఎన్టీయూ ఆధ్వర్యంలో అటవీ శాఖ సెక్షన్ అధికారి ఉద్యోగానికి పరీక్ష ఉంది. ఈ మూడు ఉద్యోగాలకు ఇంచుమించుగా ఏదేని డిగ్రీ, ఇంజినీరింగ్, సైన్స్ గ్రూపు విద్యార్థులు అర్హులు. అటవీ శాఖ పరీక్షను వాయిదా వేయాలని జేఎన్టీయూ అధికారులను కోరినా వారు కనికరించకపోవడం శోచనీయం. నష్టం పోస్టల్ ఉద్యోగానికి ఇంజినీరింగ్, ఏదేని డిగ్రీ చదివిన వారు అర్హులు. అదేవిధంగా ఇంజినీరింగ్, అటవీ శాఖ ఉద్యోగానికి ఇంజినీరింగ్, బీఎస్సీ చదివిన వారు అర్హులు అవుతారు. మూడింటిలో ప్రతి రెండు ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌తో పాటు ఏదేని డిగ్రీ చదివిన వారు అర్హులు. దాదాపుగా మూడు ఉద్యోగాలకు ఆశతో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ముందుగానే తేదీలను ప్రకటించింది. రాష్ట్ర అటవీ శాఖ ముందుగా నిర్ణయించిన తేదీలను వాయిదా వేసి ఈ నెల 25న ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు జేఎన్టీయూ అధికారులను వేడుకున్నా పరీక్ష తేదీలనే వాయిదా వేయలేదు. దీంతో అభ్యర్థులు ఏదేని రెండు ఉద్యోగ అర్హత పరీక్షలను కోల్పోతున్నారు. మూడింటిలో ఏదేని ఒక ఉద్యోగం రాకపోదా అని ఆశతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆశలు ఆవిరైపోయాయి. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు స్పందించి అటవీ శాఖ ఉద్యోగ పరీక్షను వాయిదా వేసేవిధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇవీ.. ఆ మూడు ఉద్యోగాలు జూనియర్ ఇంజినీర్ ఈ ఉద్యోగానికి ఇంజినీరింగ్(డిగ్రీ) చదివిన వారు అర్హులు. 25 తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. పోస్టల్ అసిస్టెంట్ ఈ ఉద్యోగానికి ఏదేని డిగ్రీ చదివిన వారు అర్హులు. 25 తేదీన మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అటవీశాఖ సెక్షన్ అధికారి అటవీ శాఖ ఉద్యోగానికి బీఎస్సీ సైన్స్ గ్రూపు, ఇంజినీరింగ్‌లో మెకానికల్, సివిల్, కెమికల్ డిగ్రీ చదివిన వారు అర్హులు. ఈ ఉద్యోగానికి ఈ నెల 25 తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరీక్ష జరుగనుంది. -
ఒకే రోజు మూడు ‘పరీక్ష’లు
25న ఎస్ఎస్సీ జూనియర్ ఇంజనీర్, అటవీశాఖ, పోస్టల్ అసిస్టెంట్స్ పరీక్షలు తలపట్టుకుంటున్న నిరుద్యోగులు.. పట్టించుకోని అధికారులు హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేదే అరకొరగా. పోటీకి సన్నద్ధమయ్యే అభ్యర్థులు అహోరాత్రులు శ్రమిస్తేగానీ నెగ్గుకురాలేరు. అసలే రాష్ర్ట విభజన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో నోటిఫికేషన్లు లేక ఆవేదనలో ఉన్న అభ్యర్థులపై మరో పిడుగు పడింది! ఈనెల 25వ తేదీన ఒకే రోజు మూడు పరీక్షల జరగనుండటంతో దేనికి హాజరు కావాలో తేల్చుకోలేక నిరుద్యోగులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ జూనియర్ ఇంజనీర్, పోస్టల్ అసిస్టెంట్స్, అటవీశాఖ నోటిఫికేషన్లు అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 25న జూనియర్ ఇంజనీర్ పరీక్ష నిర్వహణకు మార్చి 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే రెండు నెలల క్రితమే పరీక్ష తేదీ ఖరారైంది. అయితే రాష్ట్ర అటవీ శాఖ దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా అదే రోజున ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్ష నిర్వహిస్తామని ఇటీవలే తేదీని ప్రకటించింది. దీంతో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏది రాయాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఇది చాలదన్నట్టు తాజాగా పోస్టల్ శాఖ కూడా మే 25వతేదీన పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించటం మూడు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఆందోళన నింపింది. పరీక్ష తేదీలను మార్చాలని అధికారులను కోరినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. అధికారులు చొరవ చూపాలి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం ఎదురు చూస్తున్న మాకు ఈ పరీక్షలు వరంలా అనిపించాయి. కానీ ఒకే రోజు మూడు పరీక్షలు పెట్టటం అంటే నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఒక్కటే. అధికారులు చొరవ తీసుకొని పరీక్షల తేదీలను మార్చాలి. - కృష్ణ, అభ్యర్థి, కర్నూలు ఒకే రోజు మూడు పరీక్షలా? ఒకే రోజు మూడు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? ఇది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడ మే. తేదీలు ఖరారు చేసేముందు అదే రోజు ఇతర పరీక్షలు ఉన్నాయోమో చూసుకోవాలా వద్దా? అధికారులు దీన్ని పరిశీలించి పరీక్ష తేదీలను మార్చాలి. - కిషోర్, అభ్యర్థి, హైదరాబాద్