pattiseema lift irrigation project
-
‘పట్టిసీమ’ పైప్‌లైన్ లీక్
పోలవరం రూరల్: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ లీకై 20 అడుగుల మేర నీరు ఎగసిపడింది. సమీపంలోని పొలాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. యథావిధిగా శుక్రవారం పట్టిసీమ ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్ చేసి కుడి కాలువలోకి నీరు విడుదల చేశారు. అయితే మార్గమధ్యంలో చీకడోడిమెట్ట ప్రాంతంలో భారీగా నీరు లీకై పొలాల్లోకి చేరుతోంది. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టిసీమ ఇంజనీరింగ్ అధికారులు మోటార్లను నిలిపివేసి పైప్‌లైన్ పరిస్థితిని పరిశీలించారు. చీకడోడిమెట్ట ప్రాంతంలో ఎయిర్ వాల్ ప్లేట్ లేకపోవడంతో నీరు ఎగసిపడినట్టు గుర్తించి మరమ్మతులు చేశారు. అనంతరం నీటి విడుదలను పునరుద్ధరించారు. గతంలో పైప్‌లైన్ ఎయిర్ వాల్ ప్లేట్‌ను తొలగించి రైతులు సాగునీటిని వినియోగించుకున్నారని, ఆ తర్వాత ప్లేట్ సరిగా బిగించకపోవడం వల్ల నీటి ఒత్తిడికి అది ఎగిరిపోయి నీరు ఎగసిపడినట్టు డీఈ ఆర్.పెద్దిరాజు తెలిపారు. కాగా, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల రెండో తేదీన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి హడావుడిగా కుడి కాలువకు నీటిని విడుదల చేశారని, పైప్‌లైన్‌ను పూర్తిగా పరిశీలించి మరమ్మతులు చేపట్టే అవకాశం కూడా ఇవ్వలేదని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
నామినేషన్‌పై అడ్డగోలు లూటీ!
సాక్షి, అమరావతి: అటు పేదలకు పథకాలు అందకూడదు.. ఇటు ప్రాజెక్టుల పనులు ముందుకు సాగకూడదు!! ఇదీ ఈనాడు దుర్బుద్ధి! ఇదే లక్ష్యంగా అస్మదీయులకు అడ్డగోలుగా.. అంటూ ఓ బురద కథనాన్ని పాఠకులపైకి వదిలింది. ఓ నిర్మాణ కంపెనీకి ప్రభుత్వం అంతులేని మేలు చేస్తోందంటూ రామోజీ అక్కసు వెళ్లగక్కారు. గత సర్కారు హయాంలోనూ ఇదే కంపెనీ కాంట్రాక్టు పనులు చేసిన విషయం ఆయనకు గుర్తులేదా? రామోజీ, యనమల బంధుగణం నవయుగ, పుట్టా సుధాకర్ యాదవ్ నామినేషన్‌పై పనులను దక్కించుకుని అంచనాలు పెంచేసి బిల్లులు కాజేయడం నిజం కాదా? నాటి సీఎం చంద్రబాబు అండతో ప్రజాధనాన్ని కొల్లగొట్టడం రామోజీకి తప్పుగా తోచలేదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ పనులు చేపట్టినా వ్యతిరేకించడం దివాళాకోరుతనం కాదా? అయినా ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలుంటాయి. అందుకు అనుగుణంగా పనులు చేపడతాయి. అది కూడా తప్పుబట్టే వారిని ఏమనుకోవాలి? ఈనాడు ఆరోపణ: బిల్లులు చెల్లింపులకు ప్రభుత్వ గ్యారెంటీలా? వాస్తవం: మీడియా ముసుగులో బురద చల్లుతున్న ఇదే రామోజీ గతంలో మధ్యవర్తిత్వం నడిపి పట్టిసీమ, పురుషోత్త పట్నం లాంటి పథకాలను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా + 22 శాతంతో అధిక రేట్లకు కట్టబెట్టారు. అప్పుడు ఇదే గుత్తేదారు చంద్రబాబుకు అస్మదీయుడని ఆయనకు ఎందుకు అనిపించలేదు? పోలవరంలో రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి నిబంధనలకు విరుద్ధంగా రూ.1,333 కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా దోచి పెట్టినప్పుడు రామోజీకి ఫైనాన్స్ కోడ్ గుర్తు రాలేదా? వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అదే పనిని రివర్స్ టెండర్ల ద్వారా 12.60 శాతం తక్కువ వ్యయంతో మేఘా సంస్థకు పారదర్శకంగా కేటాయించి రూ.660 కోట్లను ఆదా చేసింది. 22 శాతం అదనంతో రూ.257.39 కోట్లను చంద్రబాబు లూటీ చేస్తే అది తప్పుకాదా రామోజీ? ఈనాడు ఆరోపణ: అస్మదీయుల బిల్లుల చెల్లింపులకు అడ్డగోలుగా గ్యారెంటీలు వాస్తవం: గత ప్రభుత్వంలోనూ ఇదే కాంట్రాక్టు సంస్థ పట్టిసీమ సహా వివిధ ప్రాజెక్టుల్లో పనులు చేసింది. మరి రామోజీకి అప్పుడు అంతా సవ్యంగానే కనిపించింది కదా? మేఘా ప్రతిపాదనలకు అధికారులు సై.. వాస్తవం: మేఘా కంపెనీ పోలవరంతోపాటు కీలకమైన వెలిగొండ టన్నెల్ పనులు చేస్తోంది. పోలవరం కోసం రాష్ట్ర ఖజానా నుంచి వెచ్చించిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖజానా నుంచి రూ.1,319 కోట్లు పోలవరం పనులకు వ్యయం చేసింది. మేఘా దాదాపు రూ.1,200 కోట్ల మేర పనులు చేసింది. పోలవరం పనులు పునఃప్రారంభించే సీజన్ ఆరంభం కావడంతో డబ్బులు రీయింబర్స్ చేయాలని రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించేలోగా పనులను వడివడిగా చేపట్టి కొలిక్కి తేవాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఈ నేపథ్యంలో మేఘా నిధుల కోసం బ్యాంకుల నుంచి లోన్ తీసుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతి కోరింది. ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా షరతులతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. బ్యాంకు విధించే వడ్డీ తదితర రుసుములను పూర్తిగా మేఘానే భరించాల్సి ఉంటుంది. న్యాయపరమైన అన్ని అంశాలకు సైతం కంపెనీనే బాధ్యత వహించాలి. ఇటువంటి కఠిన షరతుల మధ్య మేఘా ప్రతిపాదన పరిశీలనలో ఉంది. -
అవసరం లేకపోయినా ఎత్తిపోయాలా!?
సాక్షి, అమరావతి: పట్టువదలని వక్రమార్కుడు (రామోజీ) ఎప్పటిలాగే మళ్లీ తన అభూత కల్పనలతో ఓ సత్యదూరమైన కథనాన్ని అల్లారు. ఈసారి ఆయన రాతల గాలి పట్టిసీమ గోదావరి జలాలపై మళ్లింది. ‘పట్టిసీమ నీరూ తేలేరా’ అంటూ శనివారం ‘ఈనాడు’లో పాఠకుల మీద తన పైత్యాన్ని రుద్దిన తీరుచూస్తే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం బురదజల్లడానికే ఈ తప్పుడు రాతలు అని మరోసారి తన మనస్సులో మాటను చెప్పకనే చెప్పుకున్నారు. నిజానికి.. పులిచింతల, పట్టిసీమ ఎత్తిపోతల జలాలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ కృష్ణా డెల్టా చివరి ఆయకట్టుకూ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లందిస్తుంటే.. పది లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేసిన రైతుల కళ్లలో ఆనందాన్ని చూసి ఓర్చుకోలేని రామోజీ.. తన కథనంలోని ప్రతి అక్షరంలో జగన్‌పై అక్కసు వెళ్లగక్కారు తప్ప అందులో వీసమెత్తు నిజంలేదు. అప్పట్లో ఏనాడైనా సకాలంలో నీళ్లిచ్చారా? అసలు టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో ఏనాడూ కృష్ణా డెల్టాకు సకాలంలో నీళ్లందించిన దాఖలాల్లేవు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఏటా జూన్ మొదటి వారంలోనే నీళ్లందిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 7న కృష్ణా డెల్టాకు నీళ్లందిస్తే సకాలంలో నీళ్లందించలేదంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలో పులిచింతలలో 38 టీఎంసీలు నిల్వ ఉండేవి. గోదావరిలో వరద ప్రవాహం ప్రారంభం కానంత వరకూ కృష్ణా డెల్టాకు పులిచింతల నుంచి 18 టీఎంసీలను విడుదల చేశారు. బేసిన్లో వర్షాలు కురవడం.. గోదావరిలో వరద ప్రారంభమవడంతో జూలై 21న పట్టిసీమ ఎత్తిపోతల పంపులు ఆన్‌చేసి.. పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి జలాలను తరలించి డెల్టాకు విడుదల చేశారు. జూలై ఆఖరు, ఆగస్టు ప్రథమార్థంలో తెలంగాణలో కురిసిన వర్షాలవల్ల మూసీ నుంచి పులిచింతలలోకి 19 టీఎంసీలు చేరాయి. సీజన్ ప్రారంభంలో పులిచింతల నుంచి కృష్ణా డెల్టాకు 18 టీఎంసీలను విడుదల చేయకపోతే.. మూసీ వరద నుంచి వచ్చిన 19 టీఎంసీలు కడలి పాలయ్యేవి. ఇది ప్రస్తుత ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం. ప్రజాధనాన్ని వృథా చేయమంటారా? గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజ్‌కి పట్టిసీమ ద్వారా ఒక టీఎంసీని ఎత్తిపోయాలంటే రూ.2.65 కోట్లు వ్యయమవుతుంది. అయినా.. పులిచింతల, పట్టిసీమ జలాలతో కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరాకూ నీళ్లందించాలని విద్యుత్ ఛార్జీలు ఎంతైనా భరిస్తామని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ఎత్తిపోతల నిర్వహణకు రూ.15.80 కోట్లను విడుదల చేశారు. మరోవైపు.. తెలంగాణలో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురవడంవల్ల ఉప నదులు, వాగులు, వంకల ద్వారా ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు చేరింది. కృష్ణా డెల్టాలో మూడు దఫాలుగా భారీ వర్షాలు కురిసిన సందర్భాలలోనూ నీటి అవసరం తక్కువగా ఉంది. అలాంటి సందర్భాల్లోనూ పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేయడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేయాలా రామోజీ? పట్టిసీమ ద్వారా ఇప్పటిదాకా ఎత్తిపోసిన 54.35 టీఎంసీలను పులిచింతల నీటికి జతచేసి డెల్టాలో ఆయకట్టు చివరి భూములకు ప్రభుత్వం నీళ్లందించింది. డెల్టా ఎగువ ప్రాంతాల్లో పంట కోత దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. కాలువల ద్వారా నీటి సరఫరా మీద ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం పులిచింతలలో నిల్వ ఉన్న 13.61 టీఎంసీలను తాగునీరు, అత్యవసర సాగునీటి అవసరాలకే ఉపయోగిస్తారు. అదే చంద్రబాబు హయాంలో పట్టిసీమ ద్వారా పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోసినా కృష్ణా డెల్టాలో ఏటా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి, రైతులు నష్టపోయారు. అయినా రామోజీ పెన్ను ఏనాడూ పెగల్లేదు. దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే రోతరాతలుఅంతకుముందు.. జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తిచేస్తానంటూ 2014, జూలై 28న శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు.. ఐదేళ్లలో రూ.68,293.94 కోట్లు ఖర్చుచేసినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. ధరల సర్దుబాటు (జీఓ–22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు (జీఓ–63)ల ద్వారా కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. రాబట్టుకున్న కమీషన్లను చంద్రబాబు ముఠా పప్పుబెల్లాల్లా పంచుకుంది. అందులో రామోజీకి వాటా దక్కింది. నిజానికి.. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే పులిచింతలలో 45.77 టీఎంసీలు నిల్వచేసుకోవచ్చునని.. కృష్ణా డెల్టాకు అది వరమని అప్పట్లో సీఎం వైఎస్ జగన్ అనేకసార్లు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. కమీషన్ల కోసం పట్టిసీమను చేపట్టారు. కృష్ణా, గోదావరి నదుల్లో దాదాపుగా ఒకేసారి వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలే. అలాంటప్పుడు గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తే.. ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయాల్సిందే. పట్టిసీమకు పెట్టే వ్యయాన్ని పోలవరంపై పెట్టి పూర్తిచేస్తే.. గ్రావిటీపై కృష్ణా డెల్టాకు నీళ్లందించవచ్చునని కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ చెప్పారు. దీన్ని సాగునీటిరంగ నిపుణులు, అధికారులు అప్పుడూ, ఇప్పుడూ బలపరుస్తున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే నిర్వాసితుల సమస్యను పరిష్కరించి 2019 నుంచి పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వచేస్తున్నారు కాబట్టే.. ఏటా కృష్ణా డెల్టాకు సకాలంలో సమృద్ధిగా నీళ్లందించగలుగుతున్నారు. -
నీళ్లపై రామోజీ విషం
-
నీళ్లపై రామోజీ విషం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రారంభించారు కాబట్టి అందులో ఎంత అవినీతి జరిగినా పట్టించుకోకూడదు!! గత సర్కారు హయాంలో కమీషన్లు కాజేసినా సరే అది నిరాటంకంగా సాగిపోవాల్సిందే!! అవసరం ఉన్నా లేకున్నా అమలై తీరాల్సిందే!! ఇదీ రామోజీ తీరు!! అందుకు తాజా తార్కాణమే ‘పట్టిసీమ నాపై పగబట్టిందే..!’ శీర్షికతో ఈనాడు ప్రచురించిన కథనం. చంద్రబాబు జేబులో డబ్బులతోనే టీడీపీ నిధులతోనే పట్టిసీమ ఎత్తిపోతలను నిర్మించినట్లుగా చిత్రీకరిస్తూ బురద చల్లేందుకు యత్నించారు. పట్టిసీమ ఎత్తిపోతల్లో బోనస్ రూపంలో రూ.257.55 కోట్లు, కమీషన్ల రూపంలో మరో రూ.200 కోట్లకుపైగా టీడీపీ పెద్దల జేబులోకి వెళ్లిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు రామోజీ శతవిధాలా ప్రయత్నించారు. అవసరమైనప్పుడు పట్టిసీమ ఎత్తిపోతలను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందిగానీ గోదావరి నీళ్లను ప్రకాశం బ్యారేజ్‌లోకి ఎత్తిపోసి సముద్రంలోకి వదిలేసేందుకు కాదనే విషయాన్ని ఇకనైనా రామోజీ గుర్తిస్తే మంచిది!! ఈనాడు ఆరోపణ: పట్టిసీమను ఇన్నాళ్లూ పక్కనపెట్టినా ఇప్పుడు అదే దిక్కు అయింది వాస్తవం: సాధారణంగా కృష్ణా, గోదావరికి ఒకేసారి వరదలు వస్తాయి. గత నాలుగేళ్లుగా జూలై నుంచే కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీటిని విడుదల చేస్తూ ప్రకాశం బ్యారేజ్ నుంచి 2019లో 797, 2020లో 1278, 2021లో 501, 2022లో 1331 టీఎంసీల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేశారు. పట్టిసీమను గత నాలుగేళ్లలో పెద్దగా ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకపోయింది. కమీషన్ల కోసం చంద్రబాబు రూ.1,621.72 కోట్లు పోసి కట్టిన పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసి సముద్రం పాలు చేయలేదనే రీతిలో రామోజీ అక్కసు వెళ్లగక్కారు. ఆరోపణ: గోదావరి నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నా పట్టిసీమ ద్వారా తరలించకుండా చోద్యం చూశారు వాస్తవం: పులిచింతలలో నిల్వ చేసిన నీటితోపాటు పట్టిసీమ నుంచి అవసరమైన మేరకు నీటిని ఎత్తిపోస్తూ కృష్ణా డెల్టాకు సమర్థంగా నీళ్లందించేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దాని ప్రకారమే నీటిని సరఫరా చేస్తోంది. ఈ సీజన్ ఆరంభంలో పులిచింతలలో 38 టీఎంసీల నిల్వ ఉంది. గోదావరిలో వరద రానంతవరకూ కృష్ణా డెల్టా అవసరాల కోసం పులిచింతల నుంచి 18 టీఎంసీలను ప్రభుత్వం విడుదల చేసింది. పులిచింతలలో నీటి నిల్వలు తగ్గుతున్న క్రమంలో గోదావరికి వరద రావడంతో పట్టిసీమ పంపులను జూలై 21న ప్రారంభించి ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డె ల్టాకు నీళ్లందించింది. ప్రభుత్వం దూరదృష్టితో రూపొందించిన ప్రణాళికను అమలు చేయడం వల్లే పులిచింతలలో వినియోగించుకున్న మేరకు 19 టీ ఎంసీలను తిరిగి నిల్వ చేయగలిగింది. అదే పులి చింతలలో నీటిని ముందుగా కృష్ణా డెల్టాకు విడుదల చేయకుంటే మూసీ నుంచి వచ్చిన వరద సముద్రం పాలయ్యేది. పులిచింతలకు దిగువన మున్నేరు, కట్టలేరు, పాలేరులో వరద తగ్గాక మళ్లీ పట్టి సీమ పంపులను ప్రారంభించి గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్‌కు తరలిస్తున్నారు. ఇప్పటివరకూ పట్టిసీమ ద్వారా 3.14 టీఎంసీలను కృష్ణా డెల్టాకు ప్రభుత్వం సరఫరా చేసింది. రైతుల ప్రయోజనాల పరిరక్షణే ఈ ప్రభుత్వానికి పరమావధి. ఆరోపణ: పోలవరాన్ని కుళ్లబొడిచి కోలుకోకుండా చేశారు. పట్టిసీమ మాత్రం ప్రభుత్వాన్ని వదలడం లేదు వాస్తవం: పోలవరాన్ని కమీషన్ల కోసం సర్వనాశనం చేసింది చంద్రబాబే. కమీషన్ల కోసం ఆయన పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీనే చెప్పిన విషయం రామోజీకి గుర్తు లేదా? 2014 జూన్ 8 నుంచి 2016 డిసెంబర్ 30 వరకూ రెండున్నరేళ్లు చంద్రబాబు పోలవరంలో తట్టెడు మట్టి కూడా తవ్వకుండా కాలక్షేపం చేశారు. దివంగత వైఎస్సార్ హయాంలో చాలావరకూ పూర్తయిన పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తూ కమీషన్ల కోసం చంద్రబాబు 2015లో పట్టిసీమ ఎత్తిపోతల చేపట్టారు. 21.99 శాతం అధిక ధరలకు (ఏడాదిలోపు పూర్తి చేస్తే 16.99 శాతం బోనస్ ఇచ్చే నిబంధనతో) కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు. గడువులోగా అన్ని పనులు పూర్తి కాకున్నా రూ.257.55 కోట్లను బోనస్‌గా ఇ చ్చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. పట్టిసీమ ఎ త్తిపోతల్లో భారీ కుంభకోణం జరిగిందని కాగ్ తేల్చి చెప్పడమే అందుకు తార్కాణం. ఈలోగా పోలవ రం నిర్మాణ బాధ్యతలు దక్కించుకుని 2018 నాటి కే పూర్తి చేస్తామని అసెంబ్లీలో బాబు శపథం చేశారు. జీవనాడిని జాప్యం చేస్తూ రూ.1,930 కోట్ల తో పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టారు. ప ర్యా వరణ అనుమతి లేకుండా చేపట్టడం వల్ల పురు షోత్త పట్నం ఎత్తిపోతలపై రూ. 24.90 కోట్లను పరి హా రంగా చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. దీంతో రూ. 1,900 కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. -
పట్టిసీమ ప్రాజెక్ట్‌పై మంత్రి అంబటి కీలక ప్రకటన
-
పరిహారం చెల్లించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో నిర్మాణమైన పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సంయుక్త కమిటీ సిఫార్సు చేసిన నష్టపరిహారాన్ని చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ ఆదేశించిన రూ.120 కోట్ల పరిహారం చెల్లింపుపై తరువాత విచారిస్తామని తెలిపింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల పర్యావరణ ఉల్లంఘనలపై జమ్ముల చౌదరయ్య, పెంటపాటి పుల్లారావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ ప్రాజెక్టు వ్యయం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు సంయుక్త కమిటీ పోలవరం ప్రాజెక్టును మినహాయించి పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ.2.48 కోట్లు పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1.90 కోట్లు నష్టపరిహారంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4.38 కోట్లు భారం పడింది. ఎన్జీటీ ఆదేశాలు సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ప్రతివాదుల న్యాయవాది శ్రావణ్‌కుమార్ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని, పురుషోత్తపట్నం రైతులకు పరిహారం ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రెండువారాల సమయం ఇవ్వాలని ఏపీ న్యాయవాది కోరారు. రెండువారాల్లో జరిమానా చెల్లించారా లేదా అనే అంశంపై నివేదిక అందజేయాలని, లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ మూడువారాల తర్వాత చేపడతామని తెలిపింది. -
తెలంగాణ వాదనపై ఏపీ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందన్న తెలంగాణ వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. గోదావరి జలాలపై తెలంగాణ నీటిపారుదల అధికారులు వాదనకు ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేసిందో చూపించాలని ఏపీ అధికారులు నిలదీశారు. కాగా గోదావరి నదిపై రెండు తెలుగు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, వర్కింగ్ మాన్యువల్ ఖరారు, బడ్జెట్, సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై చర్చించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన భేటీ ముగిసింది. (డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే) బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికం గోదావరి బోర్డు సమావేశంలో భాగంగా గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందన్న తెలంగాణ వాదననలు ఏపీ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన ఆధారంగా గోదావరిలో 967 టీఎంసీలు వాటా ఉంటుందని తెలంగాణ బోర్డు దృష్టికి తీసుకురాగా.. దీనిపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్‌లో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చూపలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికంగా తీసుకోవాలని ఏపీ అధికారులు బోర్డు చైర్మన్‌కు విన్నవించారు. కొత్త ప్రాజెక్టులకు బ్రేక్.. అలాగే బచావత్ ట్రిబ్యునల్‌లో ఎక్కడా కూడా తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న బోర్డు చైర్మన్ చంద్రశేఖర్.. నీటి వినియోగం లెక్కలు తేల్చేందుకు టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని రెండు రాష్ట్రాలను ఆదేశించారు. ఈ నెల 10వ తేదీలోగా ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు సూచించారు. బోర్డు సూచనకు ఇరు ప్రభుత్వాల అధికారులు అంగీకరించారు. ఈ సమావేశంలో ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ వాదనలు విపించారు. కేంద్రం ఆదేశాలతో.. కాగా విభజన చట్టానికి విరుద్ధంగా, ‘అపెక్స్ కౌన్సిల్’ అనుమతి లేకుండా గోదావరిపై తెలంగాణ చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు, నీటి మళ్లింపు ప్రాజెక్టులు, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచుతుండటాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ అనుమతించే వరకూ ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గోదావరి బోర్డు చైర్మన్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ దృష్ట్యా వాటిని నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను గోదావరి బోర్డు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బోర్డు సమావేశం జరిగింది. గురువారంమే కృష్ణా బోర్డు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. -
పట్టిసీమ ఎత్తిపోతల వద్ద అగ్నిప్రమాదం
సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎత్తిపోతల పథకానికి కరెంటు సప్లై చెయ్యడానికి మూడు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ 220 కె.వి ఉండగా అందులో ఒకటవ నెంబర్ ట్రాన్స్ఫార్మర్ అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని సబ్ స్టేషన్ వద్ద ఉన్న వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక కేంద్రం కొవ్వూరులో ఉండడంతో అగ్నిమాపక ఆలస్యం కావడంతో వాహనం రావడం ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైంది. సబ్‌స్టేషన్‌లో మూడు ట్రాన్స్ఫార్మర్లు ఉండగా ఎన్ని అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయి అన్నది ఇంకా నిర్ధారించ లేకపోతున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి నీటి విడుదలను గత 15 రోజుల నుండి ఆపివేయడంతో మోటార్లు జరగడం లేదు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. -
పట్టిసీమ ఎత్తిపోతల వద్ద అగ్నిప్రమాదం
-
‘పట్టిసీమ వల్ల సీమకు ఉపయోగం లేదు’
సాక్షి, కడప: గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించే ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చలను స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ మైసూరా రెడ్డి అన్నారు. త్వరలోనే గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి సంఘం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదనగుప్తాలతో కలిసి మైసూరా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమలోని 7 ప్రాజెక్ట్‌లకు నీటిని తరలించాలని ఏపీ విభజన చట్టంలో ఉందన్నారు. రాయలసీమకు 150 టీఎంసీల నీటిని కేటాయించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల సీమకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు మైసూరా రెడ్డి. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల జరుగుతున్న అన్యాయంపై ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు చర్చించాలని కోరారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లకు పుష్కలంగా నీరు చేరాలంటే కృష్ణా నదిపై సిద్ధేశ్వరం అలుగును త్వరగా పూర్తి చేయాలని కోరారు. శ్రీశైలంలో 885 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలన్న అంశంలో ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలని సూచించారు. -
నదుల అనుసంధానం ఎవరికోసం?
పట్టిసీమతో దేశంలోనే నదుల అనుసంధానానికి తొలి కర్తగా తన్నుతాను పొగడుకుంటున్న బాబు కొత్తగా గోదావరి–పెన్నా అనుసంధానం కూడా తానే పూర్తిచేస్తానని హోరెత్తిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయినా దాని కుడికాల్వద్వారా తరలించగలిగే నీరు 11.65 క్యూసెక్కులు మాత్రమే. గోదావరి నీటిని కృష్ణానదికి తరలించే ప్రయత్నం చేయకుండానే నీటి లభ్యత లేకుండా దాదాపు రూ.6 వేల కోట్ల వ్యయంతో గోదావరి పెన్నా అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడం మోసపూరితం. పర్యావరణ అనుమతులు లేని, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టని ఈ ప్రాజెక్టును ఇప్పటికైనా నిలిపివేసి పోలవరం కుడికాల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నించడం ఏపీకి మంచిది. ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధానం అనే అంశాన్ని తరచుగా ప్రస్తావిస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో గోదావరి నీటిని కృష్ణా నదిలోనికి తరలించడం ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం ఇప్పటికే జరిగిపోయినట్లుగా పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆధునిక కాలంలో అపర భగీరధుడుగా టీడీపీ నేతలు కీర్తించడంలో పోటీపడుతున్నారు. కానీ ఈ అనవసర కీర్తి కండూతి యావలో పడి.. ముప్పై సంవత్సరాల క్రితమే ఇదే కృష్ణానది నుంచి పెన్నానది లోనికి తెలుగుగంగ భారీ ప్రాజెక్టు ద్వారా నీరు తరలించిన అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని మరచిపోవటం భావ్యమా? పట్టిసీమ తర్వాత కొత్తగా గోదావరి పెన్నా అనుసంధానంపై గత రెండు మూడు సంవత్సరాలుగా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రకటనలు ఇస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ వారు 2016 అక్టోబరులో రూపొందించిన గోదావరి–పెన్నా అనుసంధానానికి నాలుగు ప్రత్యామ్నాయాలు సూచించారు. అందులో నాల్గవదానిని దాదాపు ఆమోదించారు. ఆ నాల్గవ ప్రత్యామ్నాయ వివరాలు : పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఆ రిజర్వాయర్ (45 మీటర్లు) నుండి 80 మీటర్ల లెవల్‌కు కనీసం 60వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి 280 కి.మీ. కాలువలో 24 కి.మీ. వరకు సొరంగాల ద్వారా కృష్ణానదిని 4.5 కి.మీ. ఆక్విడెక్టు ద్వారా దాటించి, తిరిగి 56 కి.మీ.కాల్వను 10 కి.మీ. పంపింగ్ మెయిన్ల ద్వారా ఎత్తిపోసి ప్రకాశంజిల్లా బొల్లాపల్లి వద్ద నిర్మించబోయే 360 టిఎంసీల జలాశయం (240 మీటర్ల లెవల్‌కు) ఎత్తిపోస్తారు. ఆ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నిర్మించే అత్యంత భారీ స్థాయి కాల్వలకు గాను 28 గిరిజన గ్రామాల నుంచి మాత్రమే కాకుండా, వేలాది ఎకరాల అటవీ భూమిని కూడా సేకరించవలసి ఉంటుంది. దీనికి గానూ 6 నుంచి 7వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం ప్రధాన కాల్వల పొడవు 720 కి.మీ. 2017 మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అనుసంధానంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ తరువాత వార్తాపత్రికలలో దీనిపై అనేక కథనాలు వచ్చాయి. 2017 సెప్టెంబరులో గోదావరి నుంచి 6,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి చింతలపూడి లిఫ్ట్ ఫేజ్ 2కు శంఖుస్థాపన చేశారు. దీనిద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద 2.8 లక్షలఎకరాల స్థిరీకరణకు ఈ నీటిని వినియో గిస్తామని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. మొత్తం నీటి వినియోగం 63 టీఎంసీలు. అంచనా విలువ 4,908 కోట్లు. 2019 జూన్ నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. దరిమిలా గోదావరి–పెన్నా నదుల అనుసంధానం మొదటి దశగా పేర్కొంటున్న పథకానికి 2018 నవంబరులో ఏపీ ముఖ్యమంత్రి నకి రేకల్ వద్ద శంఖుస్థాపన చేశారు. కృష్ణా నదిలోని హరిశ్చంద్రాపురం (ప్రకాశం బ్యారేజికి 23 కిలోమీటర్ల ఎగువన) వద్ద 7వేల క్యూసెక్కుల నీటిని 56.35 కి.మీ.కాల్వతో 10.25 కి.మీ. మేరకు పైపులైన్ల ద్వారా మొత్తం 73 టీఎంసీల నీటిని సాగర్ కుడికాల్వ (80 కి.మీ.) వద్దకు తరలి స్తారు. దీని అంచనా 6,020 కోట్లు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిర్దేశిం చిన కాలం జూన్ 2019. అయితే గోదావరి పెన్నా అనుసంధానం మొదటి ప్రతిపాదనలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. పట్టిసీమ ద్వారా వచ్చే 8వేల క్యూసెక్కుల నీటితో పాటు చింతల పూడి లిఫ్ట్‌ద్వారా వచ్చే 6వేల క్యూసెక్కుల నీటిని పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణానదికి తరలిస్తామని ఆ నీటిని కృష్ణాడెల్టా వద్ద కొత్తగా ఏర్పాటుచేసే ఈ అనుసంధానం ద్వారా నాగార్జున సాగర్ కుడికాల్వ ఆయకట్టులోని 9.6 లక్షల ఎకరాల భూమికి సాగునీటి అవసరాలు తీరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాని పోలవరం కుడికాల్వ చివర (174 కి.మీ వద్ద) ప్రవాహ సామర్ధ్యం 11,165 క్యూసెక్కులు మాత్రమే. ఈ నీరు డెల్టా అవసరాలకు కూడా ఏమాత్రం సరిపోదు. ఒకవైపున చింతలపూడి లిఫ్ట్ స్కీము ద్వారా 4.8 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని చెబుతూ పట్టిసీమ ద్వారా డెల్టా అవసరాలు పూర్తిగా నెరవేరుస్తామని చెబుతూ ఇంకొకవైపు అదే నీటిని సాగర్ కుడికాల్వకు తరలిస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే. పోలవరం ప్రాజెక్టు పూర్తయినప్పటికీ కుడికాల్వ ద్వారా తరలించగ లిగే నీరు 11.165 క్యూసెక్కులు మాత్రమే అని ఈ సందర్భంగా గమ నించాలి. తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే గోదా వరిలోని మిగులు జలాలు లభ్యమయ్యే కాలం బాగా తగ్గిపోతుంది. పైగా కృష్ణా నదిలో సాగర్ దిగువన లభించే నీరు అంతంత మాత్రమే. సాగర్ నుండి నీటి విడుదలకు అవకాశం దాదాపుగా లేదు. అదే సమ యంలో పులిచింతలలోనికి సరిపడా నీరు చేరదు. పోలవరం కుడి కాల్వ ద్వారా వచ్చే నీరు కూడా పరిమితం. మరి అందుబాటులో లేని ఏ నీటిని ఎత్తిపోయడానికి సుమారుగా 6వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు? నీటి లభ్యత లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంలో ఉన్న ఔచిత్యం ఏమిటి అనేది ప్రశ్న. ఈ సందర్భంగా ఒకసారి గత 10 సంవత్సరాల కాలంలో నీటి లభ్యత వినియోగం గురించి పరిశీలిద్దాం. శ్రీశైలం వద్దకు చేరిన నీరు 2009–10 నుండి వరుసగా (టీఎంసీలలో) 1222, 1028, 736, 197, 848, 614, 59, 345, 489 ఈ సంవత్సరం 562 టీఎంసీలు. దీనినుండి పోతిరెడ్డిపాడు హంద్రీ నీవా ద్వారా రాయలసీమకు, చెన్నైకు లభించిన నీటి వినియోగం. 2009–10 సంవత్సరాలS నుండి వరుసగా. 60, 84, 84, 30, 106, 76, 9, 105, 126.5, 145 టీఎంసీలు, అలాగే నాగార్జున సాగర్ కుడి కాల్వకు 2015–16లో 17.5 టీఎంసీలు, 2016–17లో 59.7 టీఎంసీలు, 2017–18లో 89.9 టీఎంసీలు, 2018–19లో 91 టీఎంసీలు కేటాయించారు. సాగర్ కుడికాల్వ ఆయకట్టుకు గత 3 సంవత్సరాల కాలంలో సాగుకు అనుమతించలేదు. ఈ సంవత్సరం అంటే 2018–19కి గాను శ్రీశైలం వద్దకు అదనంగా 200 టీఎంసీల నీరు చేరినప్పటికీ, ఈ లెక్క ప్రకారం కుడికాల్వ ఆయకట్టుకు 132 టీఎంసీలు పొందే హక్కు ఉన్న ప్పటికీ కేవలం 91 టీఎంసీలు (70శాతం) మాత్రమే కేటాయించి వివక్ష చూపారు. నీరు లేక వంతులవారీగా నీరు విడుదల కావటం వలన కాల్వల చివర ఉన్న వేలాది ఎకరాల భూమికి తీవ్ర నీటి కొరత ఏర్పడింది. తెలంగాణ విడిపోయిన తరువాత నీటి కేటాయింపులు కృష్ణా రివర్ బోర్డు ఆదేశానుసారం ఉంటాయి. ఈ కేటాయింపు ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీల దామాషాలో ఉంటుంది. సాగర్‌లో నీరు ఉన్నప్పటికీ కుడికాల్వ ఆయకట్టుకు అదనంగా నీరు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో గోదావరి నీటిని కృష్ణా నదిలోనికి తరలించే ప్రయత్నం చేయకుండానే నీటి లభ్యత లేకుండా అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడం దురదృష్టకరమే కాకుండా, మోస పూరితం కూడా. ఇక్కడ గుర్తించవలసిన మరొక ప్రధాన విషయం ఏమిటంటే, అత్యంత భారీ వ్యయం, భారీస్థాయిలో భూసేకరణ, 360 టీఎంసీల బృహత్ జలాశయం నిర్మాణం, 700 కి.మీ. పొడవైన కాల్వ, దానిలో భాగంగా 24 కి.మీ. సొరంగాలు, భారీగా విద్యుత్, అవసరాలు వగై రాలతో కూడిన గోదావరి–పెన్నా నదుల అనుసంధానం చేపట్టి దాన్ని పూర్తి చేయడానికి దీర్ఘకాలం పడుతుంది. దీనికోసం అత్యంత భారీగా వ్యయం అవుతుంది కూడా. అందువలన ముందుగా పోలవరం కుడికాల్వ ప్రవాహ సామర్ధ్యాన్ని 27,500 క్యూసెక్కులకు పెంచాలి. దీనిని త్వరితగతిన పూర్తిచేయడానికి కూడా అవకాశం ఉంది. పోలవరం పూర్తయిన తరు వాత సాగునీటి పారుదల ద్వారా నీటిని ప్రకాశం బ్యారేజి వద్దకు తరలించవచ్చు. ఆ నీటినుంచి కృష్ణాడెల్టా అవసరాలకు పోను మిగులు జలాలను వైకుంఠపురం వద్ద నిర్మించబోయే బ్యారేజి ఎగువకు ఎత్తిపోసి, ఆ నీటిని తిరిగి పులిచింతలలోనికి ఎత్తిపోయడం ద్వారా కృష్ణానదిలో 15 నుంచి 18 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోవచ్చు. అలాగే పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నవంబరు తరువాత కూడా నిల్వ చేసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజి, పులిచింతల మధ్య దూరం 87 కి.మీ. పూర్తిస్థాయి నీటిమట్టం ప్రకాశం బ్యారేజి వద్ద 17 మీటర్లు, వైకుంఠపురం వద్ద 25 మీటర్లు, పులిచింతల వద్ద 54 మీటర్లు, సాగర్ కుడికాల్వ వద్ద 135 మీటర్లుగా ఉంటుంది. సాగర్ కుడికాల్వ ఆయకట్టుకు నీరు సప్లిమెంట్ చేయాలంటే పులిచింతలకు 32 కి.మీ.దూరంలో గల సాగర్ కుడికాల్వకు ఈ లింకు ఏర్పాటు చేసి దీనిద్వారా సుమారు 10వేల క్యూసెక్కుల నీటిని 90 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయాలి. దీనివలన కుడికాల్వ ఆయకట్టుకు నీరు అందించే భరోసా ఏర్పడుతుంది. పైగా ఇప్పుడు చేపట్టిన ఈ అనుసంధానానికి ఇంతవరకు పర్యావరణ అనుమతులు లేవు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగలేదు. ఈ రెండు అంశాల ప్రాతిపదికన చూస్తే ఇది పూర్తిగా చట్ట ఉల్లంఘన కిందికే వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇప్పటికైనా నిలుపుదల చేసి పోలవరం కుడికాల్వ సామర్ధ్యాన్ని పెంచడానికి సమాయత్తమవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రేయస్కరం. వ్యాసకర్త : యెర్నేని నాగేంద్రనాధ్, రైతాంగ సమాఖ్య అధ్యక్షులు మొబైల్ : 98495 59955 -
పర్యావరణ అనుమతులు అవసరమా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నదుల అనుసంధానంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖకు జాతీయ హరిత ట్రెబ్యునల్(ఎన్జీటీ) అదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పట్టిసీమ, పురుషోత్త పట్నం, చింతలపూడి, గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరమా? కాదా? అనే విషయంపై కూడా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్జీటీ కోరింది. వారం రోజుల్లో నిర్ణయం తీసుకొని నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను పిబ్రవరి 22కు వాయిదా వేసింది. ఏపీలో నదుల అనుసంధానం పేరిట అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారంటూ ఎన్జీటీలో మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, త్రినాథ్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. గోదావరి డెల్టాకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నదులు అనుసంధానం చేస్తున్నారని పిటీషనర్లు తమ వాదన వినిపించారు. పిటీషనర్ల వాదనలు విన్న ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో కూడా వీటిపై పిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
‘వైకుంఠపురం’లో పట్టిసీమ వ్యూహం
సాక్షి, అమరావతి: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ‘బోనస్’ పేరుతో కాంట్రాక్టర్‌తో కలిసి రూ.376.14 కోట్లు దోచేసిన తరహాలోనే వైకుంఠపురం బ్యారేజీ పనుల్లోనూ రూ.500 కోట్లకుపైగా కాజేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. అంతర్గత అంచనా విలువ (ఐబీఎం) కంటే ఐదు శాతం ఎక్కువ ధర కోట్ చేస్తూ కాంట్రాక్టర్లు షెడ్యూళ్లు దాఖలు చేస్తే.. జీవో 94 ప్రకారం ఆ టెండర్లను రద్దు చేయాలి. కానీ, ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌తో 24.99 శాతం అధిక ధర (ఎక్సెస్) కోట్ చేస్తూ దాఖలు చేసే షెడ్యూల్‌ను ఆమోదించాలని సోమవారం సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు జలవనరుల శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో 4.99 శాతం ఎక్సెస్.. రెండేళ్లలో పనులు పూర్తి చేస్తే 20 శాతం బోనస్(ప్రతి ఆరు నెలలకు లక్ష్యం మేరకు పనులు చేస్తే 5 శాతం చొప్పున బోనస్) ఇచ్చేలా షరతు విధించి.. పట్టిసీమ ఎత్తిపోతల తరహాలోనే వైకుంఠపురం టెండర్‌నూ కేబినెట్లో ఆమోదిస్తామని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాజధాని అమరావతిలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాల కోసం కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణ పనులకు రూ.801.8 కోట్ల అంచనా వ్యయంతో గతేడాది జూలై 9న ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ విధానంలో ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. వైకుంఠపురం బ్యారేజీ పనులను తనకు బాగా కావాల్సిన నవయుగ సంస్థకే అప్పగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆ సంస్థకే పనులు దక్కేలా నిబంధనలతో అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అంచనా వ్యయం పెంచకపోతే గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్ పేచీ పెట్టారు. ఉన్నతస్థాయి ఒత్తిళ్ల మేరకు నవయుగను కాదని ఇతర కాంట్రాక్టర్లు షెడ్యూళ్లు దాఖలు చేయకపోవడంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. అంచనా వ్యయం పెంచేసినా.. ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన జలవనరుల శాఖ అధికారులు బ్యారేజీ పనులతోపాటు రాజధానికి 10 క్యూమెక్కుల నీటిని తరలించే పథకాన్ని కలిపి ఒకే ప్యాకేజీ కింద రూ.1,025.98 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచేసి ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ) విధానంలో 2018 ఆగస్టు 31న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ధరలకు కూడా కాంట్రాక్టర్ సంతృప్తి వ్యక్తం చేయలేదు. అంచనా వ్యయాన్ని మరింతగా పెంచేయాలంటూ మొండికేశారు. దాంతో ఆ టెండర్‌ను రద్దుచేసి, అంచనా వ్యయాన్ని రూ.1,075.15 కోట్లకు పెంచేసి, అక్టోబర్ 25న ముచ్చటగా మూడోసారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినా కాంట్రాక్టర్ కనికరించలేదు. తాజా ధరల మేరకు అంచనా వ్యయాన్ని సవరించాలని పట్టుబట్టారు. ముఖ్యమంత్రి ఎంపిక చేసిన కాంట్రాక్టర్ అడ్డం తిరిగిన నేపథ్యంలో ఆ టెండర్‌ను కూడా రద్దు చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా.. వైకుంఠపురం బ్యారేజీ పనులను నవయుగ సంస్థకు కట్టబెట్టి, భారీగా కమీషన్లు వసూలు చేసుకోవడానికి వ్యూహం రచించిన సీఎం చంద్రబాబు.. ఆ పనులకు తక్షణమే టెండర్లు పిలవాలంటూ 20 రోజులుగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో వారం రోజుల గడువుతో స్వల్పకాలిక టెండర్ నోటిఫికేషన్ జారీచేసి, తాను సూచించిన కాంట్రాక్టర్‌కే పనులు కట్టబెట్టాలని అంటున్నారు. ఈ మేరకు అంతర్గత అంచనా విలువను రూ.1,459 కోట్లకు పెంచేస్తూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ధరలతో కూడా సీఎం చంద్రబాబు, కాంట్రాక్టర్ తృప్తి పడలేదని సమాచారం. బోనస్ పేరుతో బొక్కేద్దాం.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులకు 2015లో రూ.1,170.25 కోట్లను ఐబీఎంగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎం చంద్రబాబుతో కుదిరిన ఒప్పందం మేరకు కాంట్రాక్టర్ 21.9991 శాతం అధిక ధరలు కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేశారు. జీవో 94 ప్రకారం ఈ టెండర్‌ను రద్దు చేయాలి. కానీ, చంద్రబాబు జోక్యం చేసుకుని.. జీవో 94 ప్రకారం 5 శాతం అధిక ధరలతోపాటు ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తే 16.9991 శాతం బోనస్ ఇస్తామని ఆఫర్ ప్రకటించి, టెండర్‌కు ఆమోముద్ర వేశారు. దాంతో పనుల అగ్రిమెంట్ విలువ రూ.1,427.70 కోట్లకు పెరిగింది. ఇందులో 16.9991 శాతం బోనస్ విలువ రూ.199 కోట్లు కావడం గమనార్హం. వీటితోపాటు డిజైన్లు మార్చేయడం ద్వారా పట్టిసీమలో రూ.376.14 కోట్లు దోచేశారు. పట్టిసీమ స్ఫూర్తితో వైకుంఠపురం బ్యారేజీ పనుల టెండర్‌ను ఖరారు చేయాలని సోమవారం సాగునీటి ప్రాజెక్టుల పనులపై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. సమీక్ష ముగిసిన తర్వాత అధికారులను బయటకు పంపించి.. కాంట్రాక్టర్, జలవనరుల శాఖకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులతో చంద్రబాబు రహస్య మంత్రాంగం జరిపారు. 24.99 శాతం అదనపు ధరలకు కాంట్రాక్టర్ షెడ్యూల్ దాఖలు చేస్తారని.. ఇందులో 4.99 శాతం అదనపు ధరగా పరిగణించాలని, మిగతా 20 శాతాన్ని బ్యారేజీ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తే బోనస్‌గా ఇస్తామని నిబంధన పెట్టి, టెండర్లను ఆమోదించాలని దిశానిర్దేశం చేశారు. అంటే అంచనా వ్యయం పెంచడం ద్వారా రూ.657.12 కోట్లు, 24.99 శాతం అధిక ధరలకు అంటే.. రూ.364.60 కోట్లు వెరసి రూ.1,021.72 కోట్ల మేర కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చి.. అందులో రూ.500 కోట్లకు పైగా కమీషన్ల రూపంలో రాబ్టుకోవాలన్నది సీఎం చంద్రబాబు ఎత్తుగడ. -
తెలంగాణ తరహాలో ఏపీలోనూ టీడీపీకి బుద్ధిచెప్పాలి
సాక్షి, కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిననాటినుంచి రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. బాబు అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. రైతు సమస్యలపై చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసి వ్యక్తి ఆయన అని మండిపడ్డారు. చంద్రబాబు తన ఆదాయం కోసమే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. రైతులు బాగుడాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీని ఎలా తన్ని తరిమేశారో అదే రీతిలో.. రానున్న ఎన్నికల్లో ఏపీలోనూ టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘మొన్న మోదీ, నిన్న రాహుల్ కాళ్లు పట్టుకున్నావ్’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రతీ మాట అబద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓవైపు రాయలసీమ ప్రజలు కరువుతో అల్లాడిపోతుంటే.. పట్టిసీమ వల్ల రాయలసీమ బాగుందంటూ బాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం లోటస్‌పాండ్‌లో విలేకరులతో మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాగ్ ఇచ్చిన నివేదిక నిజం కాదా అని ప్రశ్నించారు. ‘2014లో అధికారంలోకి రాగానే 17 వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 67 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని మంత్రి దేవినేని చెబుతున్నారు. అంటే దాదాపు 50 వేల కోట్ల రూపాయల మేర టీడీపీ అవినీతికి పాల్పడింది’ అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనుసంధానం వల్ల ఏం లాభం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ మహానేత వైఎస్సార్ హయాంలోనే జరిగాయని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన పాలనా కాలంలోనే 80 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులు పూర్తిచేయలేక చంద్రబాబు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. గోదావరి- పెన్నా లింకేజీ అంటూ టెండర్లను పిలిచేది మరోసారి దోపిడీ చేయడానికే బాబు సిద్ధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గతంలో కంటే సాగు విస్తరణ 2లక్షల హెక్టార్లలో తగ్గిందన్న శ్రీకాంత్ రెడ్డి.. మరి నదుల అనుసంధానం చేసి ఏం సాధించారంటూ ప్రశ్నించారు. ‘రాష్ట్రంలోనే ఏమి చేయలేని వాడివి. కేంద్రంలో ఏం సాధిస్తావ్. మొన్న మోదీ, నిన్న రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకున్నావ్. పదవి కోసం ఇన్ని కుట్రలు, మోసాలు చేయాలా’ అని చంద్రబాబును విమర్శించారు. -
నా వాదన తప్పని నిరూపిస్తే క్షమాపణ చెబుతా
సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి బాండ్లు, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, ఇళ్ల నిర్మాణాలు, రూ.18 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు తదితర అంశాలపై చర్చకు రావాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి సవాల్ విసిరారు. తన వాదన తప్పని నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణ చెబుతానని పునరుద్ఘాటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటాల్లోనే.. ఈ అంశాలపై స్పష్టత ఇవ్వండి... - అమరావతి బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్ల అప్పుకు 10.36 శాతం వడ్డీ ఎలా ఇస్తారు? ఆరు నెలల ముందు 8 శాతం కన్నా ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకోకూడదని మీరే జీవో నంబర్ 68 జారీ చేశారు. మరి 10.36 శాతం వడ్డీకి ఎలా రుణం తీసుకుంటారు. అమరావతి బాండ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పండి. అధిక వడ్డీకి బాండ్లు జారీ చేసే కన్నా బ్యాంక్ ఇచ్చే వడ్డీకి పావలా అధికంగా ఇచ్చినా రూ.2 వేల కోట్లను రాష్ట్ర ప్రజలు ఇస్తారు కదా. అధిక వడ్డీకి అప్పులు చేయడమే కాకుండా బీఎస్ఈలో గంట కొట్టేందుకు రూ.1.8 కోట్లు ఖర్చు చేస్తారా? - పోలవరం ప్రాజెక్టులో పనులు చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నారని గతంలోనే చెప్పా. ఇప్పుడు అదే విషయంపై గొడవ జరుగుతోంది. పనులు లేకుండానే, ఎం బుక్స్‌లో రాయకుండానే బిల్లులు చేసుకున్నారు. - పట్టిసీమ ప్రాజెక్టులో 22% అదనపు చెల్లింపులు ఎలా చేస్తారు? వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో అదనపు చెల్లింపులు 5 శాతం కన్నా ఎక్కువ చేయలేదు. ఎత్తిపోతల పథకాల్లో చెల్లింపులపై చర్చించేందుకు సిద్ధమా? - పేదలకు అపార్ట్మెంట్లలో నిర్మించి ఇచ్చే ఇళ్ల చదరపు గజం ధర రూ.2,939ని మంత్రి నారాయణ చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరేమో చదరపు గజానికి రూ.1,500తో హై క్లాస్‌లో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. మరి పేదలకు ఇచ్చే ప్లాట్లకు అంత పెద్ద మొత్తం ఎలా ఇస్తున్నారో చెప్పండి. - విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ.18 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు వచ్చాయని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అవి ఎక్కడ ఉన్నాయో చూపించండి. - మీరు ప్రచురించిన ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై చర్చిద్దాం రండి. వైఎస్ ఎక్కడ అవినీతి చేశారో చూపించండి. అప్పు కోసం ప్రత్యేక విమానాల్లో వెళతారా? అప్పు కోసం ఆడీ కార్లలో, ప్రత్యేక విమానాల్లో వెళతారా? అలా వెళితే ఎవరైనా అప్పిస్తారా? సీఆర్డీఏను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థగా కాదు, కంపెనీగా పేరు మార్చుకోండి. కుటుంబరావు చెప్పినట్లు మార్గదర్శిలో తప్పులేకపోతే డబ్బులు తిరిగి ఎందుకు ఇచ్చారు? కోర్టులో ఉన్న మార్గదర్శి కేసును మళ్లీ కదిలిస్తా. 30 ఏళ్లలో హెరిటేజ్ విలువ ఎప్పుడెప్పుడు పెరిగిందో నేను చెబుతా. ఆయా సమయాల్లో ఏఏ ప్రభుత్వ డెయిరీలు మూత పడ్డాయో కూడా చూపిస్తా. చర్చకు రావాలి’ అని కుటుంబరావుకు ఉండవల్లి సవాల్ విసిరారు. సమావేశంలో అశోక్‌కుమార్ జైన్, చెరుకూరి రామారావు, అల్లుబాబి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వట్టిసీమ
-
సీమకు కన్నీరే!
‘దేశంలో నదుల అనుసంధానం చేసిన ఘనత మాదే. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సమృద్ధిగా సాగునీరు ఇచ్చి, సాగర్ ద్వారా డెల్టాకు ఇవ్వాల్సిన కృష్ణా జలాలను శ్రీశైలం డ్యాం నుంచి రాయలసీమ జిల్లాలకు తరలిస్తాం. అందులో చుక్కనీరు కూడా కిందకు తీసుకెళ్లం.’ – ఇవీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు రెండేళ్లుగా చెబుతున్న మాటలు. అయితే.. వారి మాటల్లో చిత్తశుద్ధి లేదని తేలిపోతోంది. శ్రీశైలం డ్యాం నుంచి నీటిని యథేచ్ఛగా దిగువకు తీసుకెళ్తున్నారు. నాలుగేళ్ల నుంచి కనీస నీటి మట్టం అనే నిబంధనను సైతం ఉల్లంఘించి మరీ నాగార్జున సాగర్‌కు తరలిస్తున్నారు. ఇక్కడి అధికార పార్టీ నేతలకు ఈ వాస్తవం తెలిసినా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మాట రావడం లేదు. కర్నూలు సిటీ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ జిల్లాలకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. అయినా సీమకు చెందిన టీడీపీ నేతలు ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదు. ఈ ఏడాది జిల్లాతో పాటు వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా, తుంగభద్ర బేసిన్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆయా నదులకు వరద జలాలు పోటెత్తాయి. ఫలితంగా శ్రీశైలం డ్యాంకు సుమారు 151 టీఎంసీల నీరు చేరింది. ఈ నీటిని సైతం దిగువకు తీసుకెళుతున్నారు. కృష్ణా డెల్టా ప్రాంతాలైన గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో తాగునీటి అవసరాల పేరుతో గత నెలలో 52 టీఎంసీలకు, తాజాగా మరో 12 టీఎంసీల నీటికి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డు నుంచి అనుమతులు తీసుకుంది. అదే రాయలసీమలోని కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందని, 21 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇంజినీర్లు ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రతిపాదనలకు కృష్ణాబోర్డు నుంచి అనుమతులు ఇప్పించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఇదే తరుణంలో ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా నెల్లూరు జిల్లాకు 9 టీఎంసీల నీటిని తరలించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల నీరు వస్తుందన్న భావనతో గత నెల 28న ఎలాంటి ముందస్తూ ప్రణాళికలు లేకుండా నీరుపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించారు. ఖరీఫ్‌లో స్థిరీకరించిన ఆయకట్టుకు మొత్తం నీరు ఇస్తామని మంత్రులు ప్రకటించారు. దీంతో రైతులు వరి సాగుకు నారు పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీశైలం డ్యాంలో నీరు తక్కువగా ఉందని, ఆయకట్టుకు ఇవ్వలేమని ఇంజినీర్లు తాజాగా ప్రకటించడంతో ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. కరువు జిల్లాలకు కృష్ణా జలాలేవీ? రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర, కృష్ణా జలాలే ఆధారం. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగు,తాగునీరు, చెన్నై తాగునీటి అవసరాలకు కలిపి వంద టీఎంసీలకు పైగా నీరు కావాలి. గత నెల 28న ఐఏబీ సమావేశంలో కర్నూలు జిల్లాలో తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, సిద్దాపురం స్కీమ్ కింద 2.51 లక్షల ఎకరాలకు, వైఎస్సార్ జిల్లాలో 1,67,000 ఎకరాలకు కృష్ణా జలాలు అందిస్తామని తీర్మానాలు చేశారు. అలాగే తుంగభద్ర జలాలను కేసీ కాలువ కింద కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు 29.9 టీఎంసీల మేర ఇస్తామన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన నీటిని మొదటి ప్రాధాన్యత కింద కరువు ప్రాంతమైన సీమకు ఇవ్వాల్సి పోయి.. ప్రభుత్వం తాగు నీటి పేరుతో శ్రీశైలం నుంచి సాగర్‌కు వదిలేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 871.30 అడుగుల నీటి మట్టం, 147 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఇందులో సాగర్‌కు ఇంకా 41 టీఎంసీలు (ముందు అనుమతించిన 52 టీఎంసీలలో 23, ప్రస్తుతం అనుమతించిన 12 టీఎంసీలు కలిపి) విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం అనుమతించిన 12 టీఎంసీల నీటిని ఈ నెల 18లోపు విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉత్తర్వులిచ్చింది. అలాగే గతంలో అనుమతించిన 52 టీఎంసీల నీటిని సైతం ఈ నెల 23లోపు విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 147 టీఎంసీలలో 41 టీఎంసీల నీటిని విడుదల చేస్తే మిగిలేది 106 టీఎంసీలు మాత్రమే. అలాగే నీటిమట్టం 856.8 అడుగులకు తగ్గిపోతుంది. 854 అడుగులకు పైగా నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సీమకు నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. ఈ స్థాయికి తగ్గితే చుక్క నీరు కూడా రాదు. 21 టీఎంసీలు అడిగాం జూలైలో 9 టీఎంసీలు, ఆగస్టు నెలకు 21 టీఎంసీల నీరు కావాలని ప్రభుత్వాన్ని అడిగాం. అయితే జూలైకు అనుమతిచ్చారు. ఆగస్టు అవసరాల కోసం అనుమతి రావాల్సి ఉంది. నీటి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగకు కొంత నీటిని వెలుగోడు నుంచి విడుదల చేయనున్నాం. వర్షాలు వస్తేనే సాగునీటి విడుదల సాధ్యమవుతుంది. – నారాయణరెడ్డి, సీఈ, జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు ఆ నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలి చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇస్తామని జల హారతులు పట్టిన నేతలు ఈ రోజు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో సమాధానం చెప్పాలి. గత మూడు ఐఏబీ సమావేశాల్లో సీఎం వల్లే రాయలసీమకు సాగునీరు వచ్చిందని అభినందన తీర్మానాలు చేయించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నీటిని విడుదల చేయించాలి. మాయమాటలతో రైతులను నిలువునా ముంచుతున్నారు. తీర్మానాలపై ఉన్న ధ్యాస రైతులపై జిల్లా నేతలకు లేకుండా పోయింది. శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నా ..ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంది – బొజ్జా దశరథరామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ పట్టిసీమ పేరుతో నిలువునా ముంచుతున్నారు. కృష్ణాడెల్టాకు పట్టిసీమ ద్వారా నీటిని ఇస్తామని, డెల్టాకు ఇచ్చే నీటిని రాయలసీమకు మళ్లిస్తామని చెప్పుకుంటూ టీడీపీ నేతలు ఆయకట్టుదారులను నిలువునా మోసం చేస్తున్నారు. దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం వైఎస్సార్ జిల్లాలో (60 శాతం), ఆ తరువాత కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నమోదైంది. అయినా రాయలసీమకు నీళ్లివ్వడం లేదు. ఈ రోజు శ్రీశైలంలో నీరున్నా పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పూర్తి స్థాయిలో తగ్గించారు. తాగునీటి అవసరాల పేరిట సాగర్‌కు నీటిని తీసుకెళుతున్నా.. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. – వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
పొలిటికల్ కారిడర్ 17th July 2018
-
వారం రోజుల్లో పట్టిసీమ నుంచి నీరు విడుదల
ఏలూరు (మెట్రో) : గోదావరిలో నీటి మట్టం పెరుగుతోందని, ఎగువున భారీ వర్షాలు కురుస్తున్నందున వారం రోజుల్లో పట్టిసీమ ద్వారా నీరు విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో వ్యవసాయాధికారుల సమావేశంలో ఖరీఫ్ పంటకు నారుమడులు, కౌలు రైతులకు రుణాలు, శివారు ప్రాంత భూములకు సాగునీరు వంటి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. గోదావరిలో ఇప్పటికే 30 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని మన అవసరాలకు పదిహేను వేల క్యూసెక్కుల నీరు సరిపోతుందని మిగిలిన 15వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పట్టిసీమ ద్వారా నీరు విడుదల చేసి కృష్ణా డెల్టా రైతులను ఆదుకుంటామని కలెక్టర్ చెప్పారు. కృష్ణా కాలువ నుంచి పట్టిసీమ నీరు రావడానికి ఆలశ్యమవుతున్న దృష్ట్యా తూర్పు లాకుల వద్ద గురువారం సాయంత్రంలోగా మోటార్ల ద్వారా దెందులూరు, పెదపాడు, ఏలూరు మండలాల పరిధిలో వరి నర్సరీలు పెంచుకునేందుకు వీటిని మళ్లించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మూడు మండలాల పరిధిలో 440 హెక్టార్లలో వరి నర్సరీ పెంచాల్సిన అవసరం ఉన్నదని రేపు సాయంత్రానికల్లా తూర్పు లాకుల ప్రాంతాన్ని తనిఖీ చేస్తానని మోటార్లు అన్ని పని చేస్తూ ఉండాలన్నారు. 18.55శాతం పామాయిల్ దిగుబడి సొమ్ము ఇవ్వాల్సిందే జిల్లాలో పామాయిల్ రైతులకు 18.55శాతం ఆయిల్ దిగుబడి చొప్పున ఇకపై సొమ్ము చెల్లించాల్సిందేనని జిల్లా కలెక్టర్ భాస్కర్ ఆయిల్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రాధాన్యతా రంగాల ప్రగతితీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఎన్నో ఏళ్లుగా స్థానిక ఆయిల్‌పామ్ రైతులకు 16.4 శాతం దిగుబడి మాత్రమే వస్తుందంటూ సొమ్ము చెల్లిస్తుండటంతో పలువురు రైతులు ఫిర్యాదు చేశారన్నారు. తెలంగాణలోని సత్తుపల్లిలో 18.55 శాతం ఆయిల్ దిగుబడి వస్తుండటంతో అక్కడే ఆయిల్‌పామ్ గెలలు క్రషింగ్ చేయించడంతో నిరూపితమైందన్నారు. ఇకనుంచి ఆయిల్‌పామ్ రైతులకు 18.55 శాతం వంతున సొమ్ము చెల్లించాలని, దీన్ని అన్నిక ంపెనీలు పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో వాస్తవాలతో కూడిన నివేదికలు సమర్పించకపోతే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. పరిశ్రమలకు 24 గంటల్లో అనుమతులు పరిశ్రమలకు అవసరమైతే 24 గంటల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పా. స్థారునిక కలెక్టరేట్లో జిల్లాస్థాయి పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పని చేసి భారీ పరిశ్రమలకు కూడా 48 గంటల్లో అనుమతులు ఇచ్చి రికార్డు సృష్టించాలని అంతే తప్ప చిన్నచిన్న అంశాలను సాకుగా చూపించి అనుమతులను జాప్యం చేయొద్దని కలెక్టర్ సూచించారు. ఆన్లైన్ విధానం అమల్లో ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఎప్పటికప్పుడు ఆన్లైన్ పరిశీలిస్తూ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. దీనివల్ల నూతన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు పశ్చిమ వైపు ఎదురుచూస్తారని ఆయన చెప్పారు. వట్లూరు బ్రిడ్జి ఆలస్యంపై ఏఈ సస్పెన్షన్ వట్టూరు బ్రిడ్జి దశాబ్దం దాటుతున్నా నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతుందని కలెక్టర్ ఆర్అండ్బీ అధికారులను ప్రశ్నించారు. దీనికి బాధ్యులని తక్షణం సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన ఆర్అండ్బీ ఏఈ శేషుకుమార్‌ను బుధవారం సాయంత్రానికి సస్పెండ్ చేయాలని ఆశాఖ ఎస్ఈ నిర్మలను ఆదేశించారు. ఈ సమావేశాల్లో అదనపు జేసీ షరీఫ్, డీఆర్వో సత్యనారాయణ, వ్యవసాయశాఖ జేడీ గౌసియాబేగం, ఆర్అండ్బీ ఎస్ఇ నిర్మల, పరిశ్రమల శాఖ జీఎం త్రిమూర్తులు, జిల్లాలోని ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పర్సంటేజీలు మానుకుంటే నాణ్యమైన రోడ్లు పర్సంటేజీలు మానుకుంటేనే నాణ్యమైన రోడ్లు దర్శనమిస్తాయని లేకపోతే ఎన్నాళ్లు అయినా ఆధ్వానస్థితి తప్పదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ఆర్అండ్బీ అధికారులతో రోడ్లు పరిస్థితిపై ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని ఆర్‌అండ్‌బీలో అవినీతి రాజ్యమేలుతోందని ఏ రోడ్డు చూసినా నిర్మించిన ఆరు నెలలకే గతుకులమయం అవుతోందని కలెక్టర్ చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి ఆర్అండ్బీ సిబ్బంది, అధికారులు పర్సంటేజీలు వదులుకుంటే నాణ్యమైన రోడ్లను ప్రజలు చూడగలుగుతారని ఆయన చెప్పారు. ఏలూరు – జంగారెడ్డిగూడెం రోడ్డుపై గర్భిణి ప్రయాణిస్తే రోడ్డుపైనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉందని కలెక్టర్ చెప్పారు. -
పొలిటికల్ కారిడర్ 12th June 2018
-
ఏపీలో అవినీతిపై ఇదివరకే కాగ్ నివేదిక ఇచ్చింది
-
‘వైఎస్సార్ క్రెడిట్‌ను సైతం చంద్రబాబు తన ఖాతాలోకా’
సాక్షి, హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు జాతీయ స్కాంలా తయారైందని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమార్జనకు ఈ ప్రాజెక్ట్ సంజీవనిలా మారిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం పనులు 39 శాతం పూర్తయ్యాయని, కానీ ఆ క్రెడిట్ కూడా చంద్రబాబు తనఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని స్కామ్‌ల ప్రాజెక్టులా చంద్రబాబు మార్చివేశారని, ఏ రోజు కూడా ప్రాజెక్టుల గురించి ఆలోచించలేదన్నారు. మరోవైపు చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో గమనిస్తే కర్ణాటకలో ఆలమట్టి లాంటి ఎన్నో ప్రాజెక్టులొచ్చాయని, కానీ ఏపీలో అలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు. ప్రాజెక్టులు, నీటి ఆవశ్యకత గురించి చంద్రబాబు ఉపన్యాసాలు దంచి కొడతారని.. కానీ పని మాత్రం చేయరని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కోసం ప్రాజెక్టులు, పోలవరం పూర్తి చేయడం తన జీవిత ఆశయమని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు. 2018 నాటికి పోలవరం ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తానన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏంతో సాధించానని చంద్రబాబు చెబుతారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు పునాది వేసిన స్థలంలో నిలబడి ప్రాజెక్టు మొత్తం పూర్తయిందని, అయితే భూగర్భంలో ఉన్నందున కనిపిస్తలేదని చంద్రబాబు చెప్పడం సబబు కాదన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని నీటిని సరఫరా చేస్తామంటున్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్టణం ప్రాజెక్టులకు రూ.3,400 కోట్లు ఖర్చు చేశారు. అందులో 350 కోట్లు అవినీతి జరిగిందని కాగ నివేదిక ఇవ్వడం నిజం కాదా అని ఈ సందర్భంగా సజ్జల ప్రశ్నించారు. తన అవినీతి కోసమే చంద్రబాబు శాశ్వత ప్రాజెక్టులను ఎప్పుడూ పూర్తి చేయరని.. కేవలం కమీషన్ల కోసమే తాత్కాలిక ప్రాజెక్టులు కడుతున్నాడరంటూ మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపులకు, పోలవరం అంచనాలకు సంబంధమే లేదన్నారు. -
టీడీపీ నేతలకు ప్యాంట్లు, లుంగీలు తడుస్తున్నాయి..
సాక్షి, విజయవాడ : ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలు విరుచుకుపడ్డారు. దేవినేని ఉమ హుందాతనాన్ని మరిచి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా దేవినేని వ్యాఖ్యలను టీజేఆర్ సుధాకర్ బాబు ఖండించారు. ఆయన బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు దొంగల పార్టీని నడుపుతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా వచ్చిన జన సమూహంతో కనకదుర్గ వారధి వణికినప్పటి నుంచి టీడీపీ నేతలకు ప్యాంట్లు, లుంగీలు తడుస్తున్నాయి. పట్టిసీమలో దోచుకున్నారని నివేదిక ఇచ్చింది కాగ్... వైఎస్సార్ సీపీ కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. మీ అన్నయ్య దేవినేని చనిపోయిన రోజు సాయంత్రం మీ వదినగారు చనిపోయారు. ఆమె మృతిపై ఇప్పటికీ చాలా అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. రాబోయే ఎన్నికలలో టీడీపీ మొదటిగా ఓడిపోయేది మైలవరం నియోజకవర్గమే. కనీస రాజకీయ మర్యాదలు పాటించని కుంకలు మీరు. దమ్ము, ధైర్యం ఈ రెండు పదాలు తెలుగుదేశం నాయకులు వాడకూడదు. బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి నోరు జారితే దేవినేని ఇంటిని ముట్టడిస్తాం. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని తెలంగాణలో ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన దద్దమ్మలు మీరు. మా నాయకుడు... మీ నాయకుడి చరిత్రపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ సవాల్ విసిరారు. -
పట్టిసీమపై మంత్రి దేవినేని అసత్య ప్రచారం
-
45 టీఎంసీల కోటా పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటి వాటాను వచ్చే జూన్ వాటర్ ఇయర్ నుంచి అమలు చేయాలని పట్టుబట్టేందుకు తెలంగాణ సిద్ధమైంది. వాటాల విషయమై ఇప్పటికే కృష్ణా, గోదావరి బోర్డులు చేతులెత్తేయడం, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యేవరకు పాత విధానమే అమల్లో ఉంటుందని కేంద్రం సంకేతాలు పంపిన నేపథ్యంలో దీనిపై కేంద్రం వద్ద తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది. బచావత్ అవార్డు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీరు కేటాయించారు. అయితే పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా కేటాయింపులు కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇదే బచావత్ అవార్డులో పేర్కొ న్న మేరకు, పోలవరానికి అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని, ఈ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, అలాగే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో మరో 45 టీఎంసీల వాటా ఇవ్వాల ని తెలంగాణ అంటోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీలు దక్కుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా ఉండటంతో కర్ణాటక తన వాటా మేరకు 21 టీఎంసీల వినియోగం మొదలుపెట్టింది. అయితే తెలంగాణకు దక్కే వాటాల అంశం మాత్రం పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలను పేర్కొంటూ ఈ వాటర్ ఇయర్లో తెలంగాణకు 45 టీఎంసీల మేర కోటా పెంచాలని పట్టుబట్టనుంది. ఇవే అంశాలతో ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి ఒకట్రెండు రోజుల్లో కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది. వాటర్ ఇయర్ ఆరంభానికి కేవలం 40 రోజుల గడువే ఉన్న నేపథ్యంలో ముందు నుంచే ఈ అంశంపై కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. -
అవినీతి జరగలేదంటే.. ఏ శిక్షకైనా నేను సిద్ధం
-
అవినీతి జరగలేదంటే.. ఏ శిక్షకైనా నేను సిద్ధం
సాక్షి, అమరావతి: పట్టిసీమలో అవినీతి జరిగింది.. జరగలేదంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసే ఏ శిక్ష కైనా తాను సిద్ధమంటూ బీజేపీ ఎమ్మెల్సీ విష్ణు కుమార్ రాజు సవాల్ విసిరారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి దమ్ముంటే పట్టిసీమపై విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫొటోషూట్ కోసమే సీఎం పార్లమెంటు మెట్లకు మొక్కారని ఎద్దేవా చేశారు. రోజూ ఇసుక కుంభకోణంలో కోట్లు కొల్ల గొడుతున్నారని, పట్టిసీమ, ఇసుక కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘సింగపూర్‌లో సీఎం చంద్రబాబు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఇది భారత దేశ ప్రజలను అవమానించడమే. సీఎం 40 సంవత్సరాల అనుభవం ఏమైంది. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని మంత్రి గంటా శ్రీనివాస రావు బీజేపీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులతో ఉద్యమానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు’ అని విష్ణు కుమార్ వ్యాఖ్యానించారు. -
పట్టిసీమ పనులపై సీబీఐ విచారణ జరిపించాలి
-
చంద్రబాబు గతాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు..
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదట్నుంచీ చెబుతోందని ఆపార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగ్ తన నివేదికలో పట్టిసీమలో అవినీతి జరిగిందని వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ చేపట్టాలని టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందని అన్నారు. కానీ, కాగ్ చెప్పినంత మాత్రాన విచారణ జరిపించలేమని చంద్రబాబు చెప్పడం ఆయన ద్వంద్వ వైఖరిని మరోసారి స్పష్టం చేసిందని ఎమ్మెల్యే సురేష్ ఎద్దేవా చేశారు. 2జీ, బొగ్గు కుంభకోణం కేసుల్లో కాగ్ చెప్తేనే సీబీఐ విచారణ జరిగిందన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై టీడీపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్ల పచ్చపార్టీ... కమీషన్ల కోసమే కాంట్రాక్టర్లను మారుస్తున్నారనీ.. వాటి అంచనా వ్యయాల్ని ఇష్టారీతిన పెంచుతున్నారని సురేష్ ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టు వ్యయం రూ.495 కోట్ల నుంచి 1012 కోట్లకు పెంచారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి రూ.2844 కోట్లు అవసరం కాగా కేవలం 334 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే వెలుగొండ ప్రాజెక్టుకు సింహభాగం నిధుల కేటాయింపులు జరిగాయని అన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రానికి అమ్మేశారా..!!
సాక్షి, విజయవాడ: రాష్ట్ర భవిష్యత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారధి విమర్శించారు. ప్రజా సంకల్పం వల్లే జాతీయ రహదారుల దిగ్భందం విజయవంతం అయ్యిందన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పార్థసారధి, పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌లు మాట్లాడారు. 2016లో కేంద్రం, హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామంటే స్వాగతించి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని పార్థసారధి ఈ సందర్భంగా చంద్రబాబుపై మండిపడ్డారు. నాలుగేళ్ల పాలనలో ఎన్నడూ హోదా కోసం పనిచేయని ఆయనకు వైఎస్సార్ సీపీని విమర్శించే నైతికత లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ల అవినీతిని వారి రాజకీయ భాగస్వామి పవన్ కల్యాణ్ ఎండగట్టడంతో టీడీపీకి దిక్కుతోచడం లేదని ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ మీద యుద్ధం..ఆంధ్రుల ఆత్మ గౌరవం’ వంటి భారీ డైలాగులతో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి తన హుందాతనాన్ని కోల్పోతున్నారని చురకలంటించారు. కాగ్ పెట్టిన వాతలు.. పోలవరం నిర్మాణం పూర్తయితే పట్టిసీమ ప్రాజెక్టు వృథా అని కాగ్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గుర్తు చేశారు. కానీ పట్టిసీమ డీపీఆర్ (డీటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)లో దాని జీవిత కాలం 20 ఏళ్లు అని పేర్కొన్నారని టీడీపీపై ధ్వజమెత్తారు. పట్టిసీమ కాంట్రాక్టర్‌కు 22 శాతం అదనంగా చెల్లింపులు జరిగాయని ఆరోపించారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ప్రజాపద్దుల కమిటీ కూడా బయటపెట్టిందనీ.. అందుకనే ఆ సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారని విమర్శించారు. ఈ కమిటీలో వైఎస్సార్ సీపీ ఒక్కటే లేదని ఇతర అన్ని పార్టీల సభ్యులు ఉన్నారని అన్నారు. ఒకపైపు దేశం పురోగమిస్తుంటే.. చంద్రబాబు విదేశీ సాంకేతికత, జపాన్ తరహా పోరాటం అనడం సిగ్గుచేటని అన్నారు. టీడీపీ రెండు నాల్కల ధోరణి ప్రశ్నిస్తారనే భయంతో పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలను చూసి టీడీపీ నేతలు మౌనం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
పట్టిసీమపై బీజేపీ, టీడీపీ మాటల యుద్ధం
-
బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం..
సాక్షి, అమరావతి : ఏపీ శాసనసభలో బుధవారం పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బుధవారం సభలో చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు...ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయన ఆరోపించారు. పట్టిసీమపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. మొత్తం రూ.371 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగాయని, కాగ్ కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించిందన్నారు. 30 పంపులు ఏర్పాటు చేస్తామని 24 పంపులే ఏర్పాటు చేశారని, ప్రాజెక్ట్ వ్యయం రూ.1170 కోట్లు అంచనా వేసి చివరకు రూ.1487 కోట్లు చెల్లించారన్నారు. ఆధారాలు లేకుండా తాము ఆరోపణలు చేయడం లేదని, వాస్తవాలను మాత్రమే చెబుతున్నామని అన్నారు. దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలని విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. దీంతో మంత్రులు...విష్ణుకుమార్ రాజుపై ఎదురుదాడికి దిగారు. ఓ దశలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టిసీమపై బీజేపీ చవకబారు ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. దమ్ముంటే రాజీనామాలు చేయండి.. ఇలాగైతే ప్రజల్లోకి వెళ్లలేరని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేయడంతో...దమ్ముంటే రాజీనామాలు చేద్దాం రండి అంటూ విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. అక్రమాలకు పాల్పడకపోతే మంత్రులకు భయమెందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాను ఎవరితోనూ కుమ్మక్కు కాలేదని, ఆ అవసరం తనకు లేదని అన్నారు. కాగ్ నివేదికను చదివే మాట్లాడుతున్నానని విష్ణుకుమార్ రాజు అన్నారు. మంత్రుల భాష సరిగా లేదు ఏపీ మంత్రుల తీరును మంత్రి మాణిక్యాలరావు తప్పుబట్టారు. పట్టిసీమపై విష్ణుకుమార్ రాజు ఆధారాలతోనే మాట్లాడుతున్నారని, టీడీపీ నేతలు తప్పు చేయకపోతే విచారణకు సిద్ధంగ కావాలన్నారు. మంత్రుల భాష సరిగా లేదని, ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే ప్రజా ద్రోహులవుతారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలు వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. -
స్నేహితురాలిని కాపాడబోయి యువతి మృతి
పోలవరం: గోదావరిలో ప్రమాదవశాత్తు పడి మునిగిపోతున్న స్నేహితురాలిని కాపాడబోయి ఓ యువతి మరణించింది. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన ర్యాలి సాయిరమ్య(18) గూటాల పంచాయతీ కొత్తపట్టిసీమ గ్రామం వద్ద ఆదివారం గోదావరిలో మునిగిపోయి మరణించింది. కొవ్వూరులోని ఏబీఎన్పీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రమ్య స్నేహితులతో కలసి కొత్తపట్టిసీమలోని మరో స్నేహితురాలైన వలవల శ్రీవల్లి ఇంటికి శనివారం సాయంత్రం వచ్చింది. పోలవరం ప్రాజెక్టు చూడాలని రాత్రి వారంతా అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం స్నేహితులైన శ్రీవల్లి, ఊనగట్లకు చెందిన గూడపాటి సాయిభవాని, కొవ్వూరుకు చెందిన ప్రత్యూషలతో కలిసి గోదావరినదికి స్నానానికి వెళ్లింది. నది ఒడ్డున నిలబడి సెల్ఫీలు తీసుకుంటుండగా, సాయిభవాని తలపై నీళ్లు చల్లుకునేందుకు నదిలోకి వంగింది. ఆమె నిలబడిన రాళ్లు నాచుపట్టి ఉండటంతో నదిలోకి జారిపడింది. ఆమెను కాపాడేందుకు సాయిరమ్య ప్రయత్నించగా, ఇద్దరూ నదిలో మునిగిపోయారు. కేకలు వేయటంతో దగ్గరలో ఉన్న యువకులు వచ్చి సాయిభవానీని కాపాడారు. ఈమె పోలవరం వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకుంది. సాయిరమ్య మృతి చెందింది. పోలవరం ఎస్సై కె.శ్రీహరిరావు స్బిబందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దొమ్మేరులో విషాదఛాయలు కొవ్వూరులో విషాదఛాయలు సాయిరమ్య మృతితో ఆమె స్వగ్రామం దొమ్మేరులో విషాదఛాయలు అలముకున్నాయి. ర్యాలి శ్రీనివాసరావు ప్రథమ కుమార్తె ఆమె. అపురూపంగా చూసుకునే రమ్య మృతితో కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. సర్పంచ్ ముదునూరి జ్ఞానేశ్వరి, వైఎస్సార్సీపీ నాయకుడు ముదునూరి నాగరాజు సాయిరమ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న సాయిరమ్య మృతి ఆ కుటుంబానికి తీరని లోటని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇన్నాళ్లకు గుర్తొచ్చె.. నిర్మాణ వ్యయానికి రెక్కలొచ్చె..
కొవ్వూరు: తాడిపూడి ఎత్తిపోతల పథకంపై సర్కారు సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోంది. కృష్ణా జిల్లాకు నీళ్లు తరలించడం కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆగ మేఘాలపై పూర్తి చేసిన ప్రభుత్వం తాడిపూడిని విస్మరించింది. జిల్లాలో మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్దేశించిన ఈ పథకంను పూర్తి చేయడానికి చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపు రెట్టింపయ్యింది. ఈ పథకం నిర్మాణ వ్యయం మొదట్లో రూ.467.70 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పుడు ఆ వ్యయం కాస్తా రూ.885.53 కోట్లకు పెరిగింది. ఇటీవలే ప్రభుత్వం అదనపు అంచనా వ్యయానికి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే సుమారు రూ.417.83 కోట్ల వ్యయం అదనంగా పెరిగింది. చంద్రబాబు ప్రారంభించారు.. వైఎస్ పూర్తి చేశారు 2003 నవంబర్ 12న అప్పట్లో సీఎం హోదాలో చంద్రబాబు ఈ పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు ఎనభై శాతం పనులు పూర్తి చేశారు. 2007 అక్టోబర్ 25న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి పంట పొలాలకు నీళ్లు అందించారు. అయితే చివరి ఆయకట్టు వరకూ సాగునీరందించాలని చేపట్టిన భూ సేకరణలో సమస్యలు ఎదురయ్యాయి. రైతులు కోర్టును ఆశ్రయించడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో ఈ పథకంపై కన్నెత్తి చూడకపోవడం విశేషం. అసంపూర్తి పనులు పూర్తయితే.. తాళ్లపూడి మండలంలోని తాడిపూడిలో ప్రారంభమైన ఈ ఎత్తిపోతల పథకం వల్ల తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల తదితర మండలాల్లోని 2,06,600 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నది లక్ష్యం. వైఎస్ చలవ వల్ల ఈ పథకం ద్వారా ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 1,57,454 ఎకరాలకు సాగునీరు అందుతోంది. వాస్తవానికి లక్ష ఎకరాలు మాత్రమే ఉంటుందని రైతులు చెబుతున్నారు. తాడిపూడి వద్ద గోదావరి జలాలను ఎత్తిపోసి కాలువల ద్వారా సుమారు 74 కిలోమీటర్ల దూరంలోని నల్లజర్ల మండలంలోని పొలాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం అసంపూర్తిగానే నిలిచిపోయింది. ఇంకా మెయిన్ కెనాల్‌పై 154 స్ట్రక్చర్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా వీటిలో 141కి పూర్తి చేశారు. 31 పంపిణీ కాలువలు పూర్తి చేయాల్సి ఉండగా 29 పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా రెండు పంపిణీ కాలువలు తవ్వాల్సి ఉంది. ప్రధానంగా ఐదు సబ్లిఫ్ట్లుంటే మొదటి సబ్ సబ్ లిఫ్ట్ పూర్తి చేశారు. 2, 3, 4, సబ్లిఫ్ట్లతో పాటు ఐదు సబ్లిఫ్ట్లో కొన్ని చోట్ల అసంపూర్తి పనులు ఉన్నాయి. మొత్తం మీద సుమారు 70 పనులు పూర్తి కావాల్సి ఉంది. ఐదో సబ్‌లిఫ్ట్ ద్వారా 12,915 ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా గత ఏడాది నాలుగు వేల ఎకరాలకు నీరు అందించారు. అసంపూర్తి పనులు పూర్తి చేస్తే తప్ప ఆయకట్టు అంతటికీ సాగునీరు అందే పరిస్థితి లేదు. 420 ఎకరాల భూసేకరణకు సంబంధించి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీని నిమిత్తం రూ.80 కోట్లు విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో అంచనా వ్యయం రెట్టింపు ముడుపుల కోసం, పర్సంటేజీల కోసమే టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించింది. తాడిపూడిని మూడున్నరేళ్లుగా విస్మరించింది. స్వయంగా చంద్రబాబే శంకుస్థాపన చేసిన పథకం ఇన్నాళ్లకు ఆయనకు గుర్తుకు రావడం శోఛనీయం. అసంపూర్తి పనులను అధికారంలోకి రాగానే పూర్తి చేసి ఉంటే అంచనా వ్యయం పెరిగేది కాదు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా అంచనా వ్యయం రెట్టింపైంది. ఇప్పటికైనా అసంపూర్తి పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు రైతులకూ సాగునీరు అందించాలి. –తానేటి వనిత, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్, కొవ్వూరు -
‘పట్టిసీమ’పై తేలని పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు దక్కాల్సిన వాటాలపై అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే కృష్ణాబోర్డు చేతులెత్తేయగా.. గోదా వరి నదీ యాజమాన్య బోర్డు వద్ద కూడా పంచాయితీ ఎటూ తేలలేదు. పట్టిసీమ మళ్లిం పు జలాలపై ఎలాంటి అభ్యంతరాలు, విజ్ఞప్తు లు ఉన్నా.. వాటిని లిఖితపూర్వకంగా తమకు అందజేయాలంటూ గోదావరి బోర్డు చేతులు దులుపుకొంది. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు, వర్కిం గ్ మాన్యువల్, మళ్లింపు జలాల అంశాలపై చర్చించేందుకు మంగళవారం హైదరాబాద్‌లో ని జల సౌధలో గోదావరి బోర్డు సమావేశం నిర్వహించింది. బోర్డు చైర్మన్ సాహూ, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, తెలంగాణ, ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఎస్కే జో షి, శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. మళ్లింపు జలాలపైనే ప్రధానంగా చర్చ సమావేశంలో మళ్లింపు జలాల అంశంపై చర్చించారు. పట్టిసీమ ద్వారా ఏపీ ఇప్పటికే 106 టీఎంసీల మేర గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించిందని, అందులోంచి ఎగువ రాష్ట్రాలకు దక్కే 45 టీఎంసీల వాటాను తేల్చి తెలంగాణకు కేటాయింపులు చేయాలని రాష్ట్ర అధికారులు కోరారు. దీనిపై కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోనందున గోదావరి బోర్డు నిర ్ణయం తీసుకోవాలన్నారు. దీనిపై ఏపీ విభేదిం చింది. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో తెలం గాణకు చుక్క నీటి వాటా కూడా దక్కదని.. పోలవరం ప్రాజెక్టు ఫలాలను ముందుగా అందుకోవాలన్న లక్ష్యంతోనే పట్టిసీమ చేపట్టా మని పేర్కొంది. తెలంగాణ సర్కారు గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు విరు ద్ధంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు రెండో దశ, వరద కాల్వ, దేవా దుల, కాళేశ్వరం, సీతారామ, మంజీరా, ఎల్లం పల్లి, సింగూరుల నుంచి 163 టీఎంసీల గోదా వరి జలాలను కృష్ణా పరీవా హక ప్రాంతానికి మళ్లిస్తోందని పేర్కొన్నట్లు తెలిసింది. మళ్లింపు జలాలతో ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను తేల్చే అధికారం గోదావరి బోర్డుకు, బ్రిజేశ్ ట్రిబ్యునల్కుగానీ లేదని, ఆ అధికారం గోదా వరి ట్రిబ్యునల్‌కే ఉందని ఏపీ పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరాలు తెలపగా.. లిఖితపూర్వ కంగా ఇవ్వాలని బోర్డు చైర్మన్ సాహూ సూచించారు. డీపీఆర్‌లు ఇస్తామన్న ఏపీ.. గోదావరిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం లేదని, రాష్ట్ర విభజనకు ముందు నాటి ప్రాజెక్టులనే రీ ఇంజనీరింగ్ చేస్తున్నం దున కొత్త డీపీఆర్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణ లిఖిత పూర్వకంగా తెలిపిం ది. ఏపీ పరిధిలో చేపట్టిన పురుషోత్తమ పట్నం, పట్టిసీమ, చింతపూడి ప్రాజెక్టుల డీపీ ఆర్‌లను 15 రోజుల్లో ఇస్తామని పేర్కొంది. వర్కింగ్ మాన్యువల్‌కు ఓకే! సమావేశంలో గోదావరి బోర్డు వర్కింగ్ మాన్యువల్‌కు ఆమోదం తెలిపారు. ఇక పలు ప్రాంతాల్లో టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానిం చారు. ఇక ఒడిశా నిర్మిస్తున్న కోలాబ్ ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ అభ్యంతరా లను 15 రోజుల్లోగా అందజేయాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించింది. -
పట్టిసీమపై కట్టుకథలు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల విషయంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో తన వరుస వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే గోదావరి డెల్టాకే కాదు, కృష్ణా డెల్టాలోనూ రెండో పంట సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, పోలవరం నిర్మాణం విషయంలో తాత్సారం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తయిన పోలవరం కుడికాలువ మీదుగా కృష్ణా డెల్టాకు నీళ్లందించే ముసుగులో కమీషన్ల కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. పట్టిసీమ పేరుతో రూ.372.07 కోట్లు దోచేశారని సాక్షాత్తూ కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తన నివేదికలో బహిర్గతం చేసింది. దీంతో జనం కళ్లు గప్పేందుకు చంద్ర బాబు నిత్యం అబద్ధాల దండోరా వేస్తున్నారు. ముఖ్య మంత్రి మాటలు విని కృష్ణా డెల్టా రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిధులు అప్పుడే ఇచ్చి ఉంటే.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలు ఆలస్యంగా సాగు చేయడం వల్ల కోతల సమయంలో తుఫాన్ల దెబ్బకు రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. జూన్‌లోనే ఖరీఫ్ సాగుకు నీళ్లం దించడంతోపాటు రబీ పంటలకూ నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యం తో.. తెలంగాణ ప్రాంతం నేతలు అడ్డుపడినా ఖాతరు చేయకుండా పులిచింతల ప్రాజెక్టును దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆగమేఘాలపై ఆ ప్రాజెక్టును పూర్తి చేశారు. ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు కేవలం రూ.193.14 కోట్లు పరిహారం చెల్లిస్తే.. పులిచింతల ప్రాజెక్టులో 45.77 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం 2015 సెప్టెంబరు 24న రూ.78.12 కోట్లు తెలంగాణ సర్కార్‌కు ఇచ్చింది. గతేడాది ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి వరద జలాలు వచ్చాయి. పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంతో 2016 ఆగస్టు 31న ఏపీ ప్రభుత్వం రూ.66.02 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.49 కోట్లు విడుదల చేయకపోవడంతో పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీలకు మించి నిల్వ చేయడానికి తెలంగాణ సర్కార్ అంగీకరించలేదు. దీంతో గతేడాది 55.21 టీఎంసీల కృష్ణా జలాలను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేయాల్సి వచ్చింది. తెలంగాణ సర్కార్ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ ఏడాది మార్చి 17న మిగతా రూ.49 కోట్ల పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను గత ఏడాదే విడుదల చేసి ఉంటే పులిచింతలలో 45.77 టీఎంసీలను పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటల సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. నిధుల ఎత్తిపోతల పథకాలు ఏటా కృష్ణా, గోదావరి నదులకు ఇంచుమించుగా జూలై నుంచి అక్టోబర్ వరకూ దాదాపు 90 రోజులపాటు ఒకేసారి వరద వస్తుంది. గోదావరి నీటిని నిల్వ చేసే జలాశయం లేకపోవడం, పులిచింతలకు దిగువన కృష్ణా నదిపై నీటిని నిల్వ చేసే జలాశయం కూడా లేకపోవడం వల్ల ఏటా వందలాది టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిసి పోతున్నాయి. వరదను ఒడిసి పట్టి గోదావరి డెల్టాలో రెండో పంటకు పుష్కలంగా నీటిని అందించడం.. కొత్తగా 7.21 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీరు, విశాఖపట్నం ప్రజల తాగునీటి, పారిశ్రామిక అవసరాలను తీర్చడం, కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించడం, తద్వారా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయడమే ధ్యేయంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. పోలవరం రిజర్వాయర్‌లో 194.1 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. వైఎస్ హయాంలో పోలవరం కుడి కాలువ దాదాపుగా పూర్తయ్యింది. ఎడమ కాలువ 161 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. జలాశయం పనులను పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాతోపాటు విశాఖకూ గోదావరి జలాలను తరలింవచ్చు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు భారీగా కమీషన్లు కొల్లగొట్టేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చారు. వైఎస్ హయాంలో పూర్తయిన పోలవరం కుడి కాలువ మీదుగా గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తరలించి.. నదుల అనుసంధానం చేశానంటూ గొప్పలు పోయారు. ఇందుకోసం రూ.1,647 కోట్లు వ్యయం చేశారు. ఇదే ఊపులో పోలవరం ఎడమ కాలువ మీదుగా ‘ఏలేరు’కు గోదావరి జలాలను తరలించడానికి రూ.1,660 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలతో అవసరమే ఉండదు. 2018 నాటికి పాక్షికంగా, 2019 నాటికి పూర్తిగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని పదేపదే చెబుతున్న చంద్రబాబు ఈ రెండు ఎత్తిపోతల పథకాలను చేపట్టడంలో ఆంతర్యం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. రైతులపై పెనుభారం కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. డెల్టా తూర్పు, పశ్చిమ కాలువల ఆయకట్టుకు నీళ్లందించాలంటే 16,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయాలి. కానీ, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా 8,500 క్యూసెక్కులను ఎత్తిపోసినా.. ప్రకాశం బ్యారేజీకి 7,000 క్యూసెక్కులు చేరుతాయి. దీనివల్ల కాలువలకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయని దుస్థితి నెలకొంది. దాంతో పులిచింతలలో నిల్వ చేసిన నీటిని దిగువకు విడుదల చేసి.. కాలువలకు 8,000 నుంచి 8,500 క్యూసెక్కులు విడుదల చేశారు. పొట్ట దశలో ఉన్నప్పుడు పంటలకు అధికంగా నీళ్లు అవసరం. కాలువల్లో నీళ్లందకపోవడంతో రైతులు వేలాది రూపాయలు వెచ్చించి డీజిల్ మోటార్ల ద్వారా పొలాలకు నీటిని తోడుకోవాల్సి వచ్చింది. ఇక పట్టిసీమ ఫలాలను రాయలసీమకూ అందించామని చంద్రబాబు చెబుతున్న మాటల్లో వీసమెత్తు వాస్తవం లేదు. తెలుగుగంగ, శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ), కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఆరు తడి పంటలకే నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచే పనులు రూ.45 కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతాయి. కానీ, ఆ పనులను పూర్తి చేయకపోవడం వల్ల గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీలకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించలేకపోతున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశ కింద 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ పనులు చేయకుండా రూ.1,100 కోట్లతో ప్రధాన కాలువ విస్తరణ పనులు చేపట్టి సీఎం రమేశ్ వంటి కోటరీలోని కాంట్రాక్టర్లకు వాటిని అప్పగించి చంద్రబాబు కమీషన్లు జేబులో వేసుకున్నారు. -
పట్టిసీమలో చుక్క వాటా ఇవ్వం
ఏపీ సర్కారు కొత్త మెలిక ► పట్టిసీమ పోలవరంలో భాగమేనంటూ కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖ ► తెలంగాణే గోదావరి నుంచి కృష్ణాకు 163టీఎంసీలు మళ్లిస్తోందని వాదన ► వాటిలో తమకు వాటా ఇవ్వాలని పేచీ ► గోదావరి నీటిని మళ్లిస్తూ పట్టిసీమలో వాటా అడగడంపై అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ చిచ్చురేగేలా ఆంధ్రప్రదేశ్ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో ఎగువన ఉన్న తెలంగాణకు చుక్క నీటి వాటా దక్కదని స్పష్టం చేసింది. పోలవరంలో అంతర్భాగంగానే పట్టిసీమ చేపట్టామని స్పష్టం చేసింది. తెలంగాణనే ఎస్సారెస్పీ, వరద కాల్వ, దేవాదుల, సింగూరు ప్రాజెక్టుల ద్వారా ఏకంగా 163 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖలు రాశారు. పాతవాదనతోనే లేఖలు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 80, పోలవరం కుడి కాలువ ద్వారా 80 వెరసి 160 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ ప్రభుత్వం కృష్ణా డెల్టాకు మళ్లిస్తోందని, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం తమకు కృష్ణా జలాల్లో 90 టీఎంసీలు అదనంగా ఇవ్వాలని గతంలో తెలంగాణ సర్కార్ కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖలు రాసింది. దీనిపై స్పందించిన కృష్ణా, గోదావరి బోర్డులు వివరణ కోరుతూ జూలై 14న ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాశా యి. వీటిపై స్పందించిన ఆ ప్రభుత్వం ఇప్పటివరకూ చేస్తున్న వాదననే వినిపిస్తూ ఇటీవల రెండు బోర్డులకు లేఖలు రాసింది. ఆ నీటిని వాడుకుంటున్నారుగా! ‘పోలవరం ప్రాజెక్టుపై సరిహద్దు రాష్ట్రాలతో ఆగస్టు 4, 1978లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ మహారాష్ట్ర 14, కర్ణాటక 21, నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వినియోగించుకునే వెసులుబాటును కల్పిస్తూ గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఫలా లను ముందుగా అందుకోవాలన్న లక్ష్యంతోనే కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలించడానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాం.పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గ్రావిటీ ద్వారానే కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు తరలిస్తాం. ఇదే అంశాన్ని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. అంటే పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టులు రెండు వేర్వేరు కాదన్నది స్పష్టం అవుతోంది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు వెలువడే నాటికి కృష్ణా నదిపై జూరాల, గోదావరి ఉప నది అయిన మంజీరపై సింగూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఆ రెండు ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కర్ణాటకలో భూమి ముంపునకు గురైంది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కర్ణాటకకు నష్ట పరిహారం చెల్లించింది. జూరాల, మంజీరల నిర్మా ణంలో కర్ణాటకతో సమైక్య ప్రభుత్వం కుదర్చుకున్న ఒప్పందం మేరకు పోల వరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే గోదా వరి జలాలకుగాను కృష్ణా జలాల్లో అదనపు వాటా కోరే అధికారం తెలంగాణకు లేదు.’ అని ఏపీ సర్కార్ తన లేఖల్లో స్పష్టం చేసింది. కృష్ణా జలాల్లో 163 టీఎంసీలు ఇవ్వాలి.. ‘గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ సర్కార్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ ద్వారా 24, శ్రీరాంసాగర్ వరద కాలువ ద్వారా 6.6 టీఎంసీలు, దేవాదుల ఎత్తిపోతల ద్వారా 20.6, ప్రాణహిత–చేవెళ్ల(మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు) ద్వారా 78, సీతారామ ఎత్తిపోతల ద్వారా 22, మంజీర, ఎల్లంపల్లి ద్వారా 8.1, సింగూరు ద్వారా 4 మొత్తంగా 163 టీఎంసీల జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో 14(బీ) క్లాజ్ ప్రకారం తెలంగాణ సర్కార్ కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లించిన 163 టీఎంసీల గోదావరి నీళ్లల్లో అదే స్థాయిలో మాకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలి’అని తన లేఖల్లో ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. -
‘అది డబ్బులు తోడే ప్రాజెక్ట్’
రాజమహేంద్రవరం: పట్టిసీమ నీళ్లు తోడే ప్రాజెక్టుకాదని, డబ్బులు తోడే ప్రాజెక్టు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల నుంచి అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని, కనీసం ఆఫీస్ అటెండర్ నుంచి కూడా సమాధానం రాలేదని వాపోయారు. ప్రభుత్వ పనితీరును అంచనా వేసేందుకు కాగ్ నివేదికే సరైన ఆయుధమన్నారు. కాగ్ నివేదిక ఆధారంగా ప్రభుత్వ పనితీరును పీఏసీ ప్రశ్నిస్తుందని వెల్లడించారు. వైఎస్ రాజశేఖరెడ్డి చేపట్టినన్ని సాగునీటి ప్రాజెక్టులు ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదని తెలిపారు. ‘రాజా ఆఫ్ కరప్షన్’పై చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వ పెద్దల అవినీతిని నిరూపిస్తానని ఇంతకుముందు ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన సవాల్‌పై ప్రభుత్వం తోకముడిచిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో బహిరంగ చర్చ కోసం మంగళవారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టారు. -
ఆ హక్కు బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు లేదు
పట్టిసీమ, పోలవరం వాటాల పంపిణీపై ఏపీ కొత్త వాదన వాటాలు రావాల్సిందేనంటున్న తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తూ చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై ఏపీ మరో కొర్రీ పెట్టింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను తేల్చే అధికారం బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు లేదని.. ఆ అధికారం గోదావరి ట్రిబ్యునల్‌కే ఉందని కొత్త వాదన మొదలుపెట్టింది. ఇన్నాళ్లూ పట్టిసీమ, పోలవరం వాటాల్ని బ్రిజేశ్ ట్రిబ్యు నలే తేల్చుతుందంటూ కేంద్ర కమిటీలు, బోర్డుల ముందు చెప్పిన ఏపీ.. ఇప్పుడు పూర్తి విరుద్ధమైన వాదన చేస్తుండడం గమనార్హం. అఫిడవిట్ దాఖలు కృష్ణా జలాల విషయంగా తామిచ్చిన తీర్పు పై అఫిడవిట్ దాఖలు చేయాలని బ్రిజేశ్ ట్రిబ్యునల్ గత నెలలోనే తెలంగాణ, ఏపీ లను ఆదేశించింది. ఈ మేరకు ఏపీ గురు వారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో ఎస్సారెస్పీ, వరద కాల్వ, దేవాదుల, సింగూరు నుంచి హైదరాబాద్‌కు నీటి సరఫరా పేరుతో తెలంగాణ గోదావరి జలాలను కృష్ణాబేసిన్‌కు తరలిస్తోందని.. కర్ణాటక, మహారాష్ట్రలు సైతం అదే తరహాలో కృష్ణా నీటిని ఇతర బేసిన్లకు తరలిస్తున్నా యని అందులో వివరించింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ జలాలపై గోదావరి ట్రిబ్యునల్ మాత్రమే పునః సమీక్ష చేయ గలదని.. బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు ఆ అధికారం లేదని పేర్కొంది. ఇక తెలంగాణ మైనర్ ఇరిగేషన్ కింద ఎక్కువ నీటిని వినియోగిం చుకుంటూ లెక్కల్లో తక్కువగా చూపుతోం దని ఆరోపించింది. ఆ లెక్కలను తేల్చి ఏపీకి కృష్ణా జలాల్లో వాటా పెంచాలని కోరింది. తెలంగాణకు వాటా పెరగాల్సిందే.. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా ఏపీ 160 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు తరలిస్తున్నందున.. అందులో తెలం గాణకు 73 టీఎంసీలు దక్కాలని తెలంగాణ మరోసారి స్పష్టం చేయనుంది. దీనిపై త్వరలో అఫిడవిట్ సమర్పించనుంది. -
పట్టిసీమా... వట్టిసీమా?
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ‘‘ఎంతైనా సెందరబాబు గ్రేటురా’’ అన్నాడు ఏకాంబరం. ‘‘అది నిజవే కానీ... ఇపుడు హఠాత్తుగా ఆయనెందుకు గుర్తుకొచ్చాడు’’ అన్నాడు చిదంబరం. ‘‘పట్టిసీమతో నీళ్లిస్తానన్నాడా ఆ బాబు. ఇచ్చేశాడు. ఆ నీటితో రైతులంతా పంట పండించేసి... ఆ బియ్యంతో పరమాన్నం వండేసి సెందరబాబుకి ఓ గిన్నెలో తీసుకొచ్చి పెట్టార్రా... సెందరబాబంటే మజాకేంటి?’’ అన్నాడు ఏకాంబరం పూనకం వచ్చినట్లు.‘‘అరేయ్... నాకు తెలీక అడుగుతాను ఆ పాయసం వండిన బియ్యం పట్టిసీమ నీళ్లతోనే పండించారేట్రా?’’ అని ఆరా తీశాడు చిదంబరం.‘‘అరే వాళ్లే చెప్పారు కదరా బాబూ! నువ్వు టీవీల్లో చూడనేదా ఏటి?’’ అని ప్రశ్నించాడు ఏకాంబరం. ‘‘టీవీల్లో చాలా చూపిస్తార్రా బాబూ. అక్కడకొచ్చిన వాళ్లసలు రైతులో కాదో కూడా డౌటే’’ అన్నాడు చిదంబరం.‘అదేంట్రా నీకన్నీ అనుమానాలే... అయినా నీకెందుకొచ్చింది అనుమానం’’ అన్నాడు ఏకాంబరం.‘‘ఎందుకంటే... అసలు పట్టిసీమ ప్రాజెక్టే ఓ బొంగులో ప్రాజెక్టని కాగ్ చెప్పేసింది కదేటి. అసలు పట్టిసీమ నుండి తీసుకెళ్లిన నీళ్లని కృష్ణా నీటితో కలిపి సముద్రంలో కలిపేశారట. ఇంతోడి దానికి వందల కోట్లు ఉత్తి పుణ్యానికి తినేశారని కాగ్ ఏకి పారేసిందనుకో’’ అన్నాడు చిదంబరం. ‘‘ఏకాంబరానికి ఒళ్లు మండింది. అరే అపోజిషన్ వాళ్లు అలాగే చెబుతార్రా, అవి నమ్మద్దు’’ అన్నాడు. చిదంబరం పగలబడి నవ్వి... ‘‘కాగ్ అంటే పెతిపక్షం కాదెహె... అది గౌర్మెంట్ సంస్థే. పెబుత్వం ఖర్చు పెట్టే పెతీ పైసాకీ లెక్కలూ గట్రా సరి చూసి ఎంత తగలేశారో... ఎంత తినేశారో వివరంగా చెబుతూ పుస్తకాలు రాస్తారన్నమాట వాళ్లు’’ అన్నాడు చిదంబరం.‘‘ఏకాంబరానికి ఓడిపోవడం ఇష్టం లేదు. అయితే కాగ్ వాళ్లు పెతి పక్షంతో కలిసిపోయి ఊరికే బురద జల్లుతున్నారేమో ఎవరికి తెలుసు?’’ అన్నాడు.‘‘ఛస్ ఊరుకోయేస్. ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే పళ్లు రాలిపోతాయి నోటికెంతొస్తే అంతా వాగేయడమేనేటి?’’ అని చిదంబరం సీరియస్ అయ్యాడు. ఏకాంబరానికి ఏమనాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. -
తెలంగాణను అడ్డుకొనే శక్తి ఏపీకి లేదు: తుమ్మల
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్త రామదాసు ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. భక్త రామదాసు ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన పట్టిసీమకు అనుమతి ఉందా అని ప్రశ్నించారు. ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో భక్తరామదాసు ప్రాజెక్టు ఆగదని, తెలంగాణకు రావలసిన 299 టీఎంసీలలోనే వాడుకుంటున్నామని చెప్పారు. ప్రాజెక్టులు ఆపే శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకుంటుందన్నారు. కృష్ణా జలాల్లో తమకు రావలసిన వాటా ఎలా తీసుకోవాలో తమకు తెలుసునని తుమ్మల స్పష్టం చేశారు. రైతుల విషయంలో అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ఏపీకి సూచించారు. -
కమీషన్లకోసమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం
ఆనాడు జగన్మోహన్రెడ్డి చెప్పిందే నిజమైంది రూ.387 కోట్ల అవినీతిని తప్పుపట్టిన కాగ్ తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కన్నబాబు కరప (కాకినాడ రూరల్) : కమీషన్ల కోసమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారని ఆనాడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిందే నిజమైందని ఆ పార్టీ తూర్పుగోదారి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా కరప మండలం కొంగోడు గ్రామంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జేబులు నింపే ప్రాజెక్టులు చేపడుతూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఎత్తిపోతల పథకాలను విస్మరిస్తున్నారని కన్నబాబు విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై తమ పార్టీ అధినేత అసెంబ్లీలో, బయట మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగి బురద జల్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుడి, ఎడమ కాలువలు నిర్మిస్తే ఆ కాలువలపై ఎత్తిపోతల పథకాలు నిర్మించి టీడీపీ ప్రభుత్వం అవినీతి గేట్లు ఎత్తారన్నారు. నిధులు దుర్వినియోగమయ్యాయన్న కాగ్‌కు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి లింగం రవి, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కర్నాసుల సీతారామాంజనేయులు, జి.భావారం సర్పంచి రొక్కాల గణేష్, మాజీ సర్పంచులు కోట వెంకటేశ్వరరావు, బొమ్మిడి శ్రీనివాస్, గొల్లపల్లి ప్రసాదరావు, మారెళ్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
పట్టిసీమ.. ఆద్యంతం దోపిడీ పర్వం
కాంట్రాక్టర్‌తో సర్కారు పెద్దల కుమ్మక్కును కడిగిపారేసిన కాగ్ - అప్పనంగా రూ.199 కోట్లు బోనస్ ఇచ్చారని ఆక్షేపణ సాక్షి, అమరావతి: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై ప్రభుత్వం సాగించిన దోపిడీ పర్వాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఏకిపారేసింది. ముందస్తు ప్రణాళిక లేకుండా, పోలవరం కుడి కాలువ డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టకుండా.. గృహ, పారిశ్రామిక లబ్ధిదారులను గుర్తించకుండా పట్టిసీమ ఎత్తిపోతలను చేపట్టడాన్ని తప్పుబట్టింది. రూ.372.02 కోట్లు కాంట్రాక్టర్‌కు అనుచితంగా లబ్ధి చేకూర్చిందని ఎత్తి చూపింది. ఇంత చేసినా పోలవరం ముందస్తు ఫలాలు నిర్దేశించిన వారికి అందించలేకపోయిందని పేర్కొంది. 2015 – 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్.. శాసనసభకు సమర్పించిన నివేదికలో ‘పట్టిసీమ’ బాగోతాన్ని స్పష్టంగా వివరించింది. టెండర్ల నిబంధనలు సడలించి అక్రమాలు పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనుల అంచనా విలువ టెండర్లలో పేర్కొన్న ప్రకారం రూ.1,170.25 కోట్లు. జీవో 94 ప్రకారం ఐదు శాతానికి మంచి అదనపు ధరకు పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించకూడదు. కానీ, 21.999 శాతం అదనపు ధరతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మేఘా) సంస్థ షెడ్యూలు దాఖలు చేసింది. ఐదు శాతం అదనపు ధరకు.. ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తే 16.999 శాతం బోనస్ ఇచ్చేలా నిబంధనలు సడలించి మేఘాకే పనులు అప్పగించిందని, దీని వల్ల అంచనా వ్యయం పెరిగిందని కాగ్ తేల్చింది. కానీ.. ఒప్పంద కాలంలోనే భూసేకరణ పూర్తి చేయడంతో పాటు డిజైన్లను సత్వరమే ఆమోదించడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జల వనరుల శాఖ పట్టిసీమ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసింది. దీని వల్ల పనులు ఏడాదిలోగా పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, గడువులోగా పూర్తి చేసిన కాంట్రాక్టర్‌కు రూ.199 కోట్లను బోనస్ రూపంలో ఇవ్వడాన్ని కాగ్ తప్పుబట్టింది. అవసరం లేకున్నా డయాఫ్రమ్ వాల్ పట్టిసీమ ఎత్తిపోతలకు సంప్రదాయ పద్ధతుల్లో రూ.147 కోట్లతో పంప్ హౌస్ నిర్మించాలని అంచనాల్లో సర్కార్ పేర్కొంది. కానీ.. డయా ఫ్రమ్ వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో పంప్ హౌస్ నిర్మాణానికి అనుమతించడం వల్ల అంచనా వ్యయం రూ.253.17 కోట్లకు పెరిగింది. పంప్ హౌస్ నిర్మాణంలో బేసిక్ పెరామీటర్లలో మార్పేమీ లేకున్నా కాంట్రాక్టర్‌కు అదనంగా రూ.106.17 కోట్లను అనుచితంగా లబ్ధి చేకూర్చారని కాగ్ తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని జలవనరుల శాఖను ప్రశ్నించగా, తప్పును అంగీకరించిందని పేర్కొంది. కానీ.. కేవలం రూ.100 కోట్లు మాత్రమే కాంట్రాక్టర్‌కు అదనంగా చెల్లించామని జల వనరుల శాఖ వివరణ ఇచ్చిందని, ఈ వివరణ కూడా ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేసింది. పన్ను మినహాయించినా దోచిపెట్టారు.. సాగు, తాగునీటి పథకాలకు వినియోగించే పైపులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును పూర్తిగా మినహాయించింది. కానీ.. పట్టిసీమ ఎత్తిపోతల కాంట్రాక్టర్‌కు పైపులపై రూ.32.01 కోట్లను ఎక్సైజ్ పన్నుల రూపంలో సర్కారు చెల్లించడాన్ని కాగ్ తప్పుబట్టింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయంలోనే ఒక శాతం కార్మిక సంక్షేమ పన్నును చేర్చారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ నుంచి రూ.14.22 కోట్లను జల వనరుల శాఖ వసూలు చేయాలి. కానీ.. కార్మిక సంక్షేమ పన్ను రూపంలో కాంట్రాక్టర్‌కు రూ.14.22 కోట్లను అక్రమంగా తిరిగి చెల్లించి.. అనుచిత లబ్ధి చేకూర్చారని కాగ్ తేల్చింది. మొత్తంగా కాంట్రాక్టర్‌కు రూ.372.02 కోట్ల మేర అనుచితంగా లబ్ధి చేకూర్చిందని కాగ్ స్పష్టం చేసింది. ముందస్తు ఫలాలు దక్కిందెక్కడ? పట్టిసీమ ఎత్తిపోతలను 2016 మార్చి నాటికి పూర్తి చేసినా పోలవరం కుడి కాలువ పనులు, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేయలేదు. దీని వల్ల 24 పంపులతో నీటిని తరలించాల్సి ఉండగా.. కేవలం 11 పంపుల ద్వారానే నీటిని ఎత్తిపోయగలిగారని కాగ్ ఎత్తి చూపింది. డిస్ట్రిబ్యూటరీల పనులు చేయకపోవడం వల్ల పోలవరం కుడి కాలువ కింద 1.2 లక్షల ఎకరాలకు నీళ్లందించలేకపోయారని స్పష్టం చేసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం 20 ఏళ్ల(లైఫ్ టైమ్)పాటు పని చేస్తుందని ప్రభుత్వం పేర్కొంటూనే.. మరోవైపు 2019 నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. ఇది పూర్తయితే పట్టిసీమ ఉపయోగించమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో పట్టిసీమ పథకం పనిచేసేది కేవలం మూడేళ్లేనని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఇది అనవసరమని కాగ్ స్పష్టం చేసింది. -
‘పట్టిసీమ’లో అవినీతి బట్టబయలు
రూ.370 కోట్ల దుర్వినియోగంపై వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు కాగ్ నివేదికపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ మండపేట : సాగునీటి ప్రాజెక్టుల పేరిట చంద్రబాబు సర్కారు సాగిస్తున్న అవినీతి భాగోతాన్ని కాగ్ బట్టబయలు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టులో రూ.370 కోట్లు అవినీతి జరిగినట్టు కాగ్ వెల్లడించడంపై రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయోజనం లేని పట్టిసీమ పేరుతో ప్రజాధనాన్ని సీఎం చంద్రబాబు, ఆయన అనుచరగణం దిగమింగారని ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, మండపేట నియోజకవర్గ కోఆరి్డనేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు) విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు వలన ప్రయోజనం లేదని వైఎస్సార్ సీపీ, రైతు సంఘాలు ఎంత మొర పెట్టుకున్నా వినకుండా ప్రజాధనాన్ని దోచుకునేందుకు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారని త్రినాథరెడ్డి విమర్శించారు. మొదట రెండు టీఎంసీలు, తర్వాత 48 టీఎంసీల నీరు కృష్ణా బ్యారేజీ ద్వారా సముద్ర జలాల్లో కలిసిపోయాయన్నారు. పుష్కర, పురుషోత్తపట్నం టెండర్లలోను అక్రమాలు జరిగినట్టు కాగ్ బహిర్గతం చేసిందన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ బూటకమని విమర్శించారు. రూ.42 వేల కోట్లు ప్రస్తుత అంచనా వ్యయంగా చంద్రబాబు చెబుతుండగా 2013 అంచనాల ప్రకారం మాత్రమే ఇస్తామని కేంద్రం చెబుతోందన్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు చేసిన చెల్లింపులు పోగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చేది రూ.ఐదు వేల కోట్ల లోపే ఉంటుందన్నారు. పట్టిసీమ అవినీతిపై చంద్రబాబు, ఇరిగేష¯ŒSశాఖ మంత్రి సమాధానం చెప్పాలని, లేకుంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజుబాబు మాట్లాడుతూ రుణమాఫీకి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరం కాగా మూడు విడతల్లోను ఇచ్చింది కేవలం రూ.11 వేల కోట్లు మాత్రమేనన్నారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పట్టిసీమపై చర్చకు రాకుండా ప్రగల్భాలా?
– ఎమ్మెల్యే బుచ్చయ్యపై ఉండవల్లి మండిపాటు – తనది తప్పని నిరూపిస్తే బహిరంగ క్షమాపణకు సిద్ధమని వెల్లడి సాక్షి, రాజమహేంద్రవరం : పట్టిసీమ శుద్ధ దండగ ప్రాజెక్టని, రూ.1,650 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి కట్టిన ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నుంచి కృష్ణా నదికి తీసుకెళ్లి సముద్రంలో కలుపుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పునరుద్ఘాటించారు. శుక్రవారం ఆయన రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టిసీమ వల్ల ప్రయోజనం శూన్యమని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమన్న తన సవాల్‌ను స్వీకరించిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ తర్వాత ఆ విషయం మరచిపోయి ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. కొట్టించుకోవడం బుచ్చయ్యకు అలవాటే.. కృష్ణా బ్యారేజ్‌పై చర్చ పెడితే అక్కడి రైతులు తనపై దాడి చేస్తారని బుచ్చయ్య చెప్పడం హాస్యాస్పదమని ఉండవల్లి అన్నారు. కొట్టడం, కొట్టించుకోవడం బుచ్చయ్యకు బాగా అలవాటైన పనేనన్నారు. రాజమహేంద్రవరం కంబాలచెరువులో ప్రజలు బుచ్చయ్యను కొట్టిన విషయం నగరవాసులు ఇంకా మరచిపోలేదన్నారు. పట్టిసీమపై తన వాదన అబద్ధమని నిరూపిస్తే బహిరంగ క్షమాపణలు చెబుతానన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఉండవల్లి చెప్పారు. పట్టిసీమ నుంచి కోట్ల రూపాయల విద్యుత్ ఉపయోగించి 45 టీఎంసీలను కృష్ణాలో పోశారని చెప్పారు. అదే సమయంలో కృష్ణా నుంచి 55 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని జలవనరులశాఖ వెబ్సైట్ నుంచి సేకరించిన సమాచారం చూపించారు. మంత్రి దేవినేని ఉమా ఆ నీరు పులిచింతల నుంచి వెళ్లిందని చెబుతున్నారని, పులిచింతల నుంచి సముద్రంలోకి వెళ్లింది కృష్ణా జలాలు కాదా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేలా డొంకతిరుగుడు సమాధానాలు చెప్పడం సరి కాదన్నారు. బుచ్చయ్యకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని స్పష్టం చేశారు. సమావేశంలో అల్లుబాబి, పి.అచ్యుత్‌దేశాయ్, చెరుకూరి రామారావు, నక్కా నగేష్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా జిల్లాలో వేధింపులకు కేరాఫ్‌గా మారిన బాస్
-
గోదావరి జిల్లాల్లో మూడో పంట కోసమే పట్టిసీమ
పట్టిసీమలోని అవినీతినే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది – సీమ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి – వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గుంటూరు, గోదావరి జిల్లాల్లో మూడో పంటకు నీరు ఇవ్వడం కోసమే పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించారని, ఈ విషయాన్ని ముందు నుంచి వైఎస్ఆర్సీపీ చెబుతుంటే ఎవరూ నమ్మలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం కర్నూలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం స్వయంగా సీఎం చంద్రబాబునాయుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడో పంటకు నీరు ఇవ్వాలని, జూన్‌లో రైతులు నారు పోసుకునేందుకు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మేక తోలు కప్పిన పులిలాంటి వారని, ఆయన నైజమే మోసమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, ఇన్నాళ్లు పట్టిసీమ ప్రాజెక్టును గోదావరి జలాలను రాయలసీమకు వినియోగించడం కోసం నిర్మిస్తున్నామని చెప్పి ఇక్కడి రైతుల్లో ఆశలు రేకెత్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ వ్యతిరేకం కాదన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అవినీతినే తమ పార్టీ ప్రశ్నించిందన్నారు. మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన ప్రాజెక్టుకు రూ.1600 కోట్లు ఖర్చు చేయడం దారుణమన్నారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై అధికార పార్టీ నేతలు నోరు మెదపకపోవడం చూస్తే ఈ ప్రాంత ప్రజలపై వారికున్న అభిమానం ఏపాటిదో తెలియజేస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు, కొడుమూరు సమన్వయకర్తలు హఫీజ్‌ఖాన్, మురళీకృష్ణ, కేంద్ర పాలిక మండలి సభ్యుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, నగర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం వాటాలు తేల్చేలా ఆదేశాలివ్వండి
కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శితో విద్యాసాగర్‌రావు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు పరి ష్కరించేందుకు ఏర్పాటైన ఏకే బజాజ్ కమిటీకి స్పష్టమైన ఆదేశాలిచ్చి పోలవరం, పట్టిసీమ వాటాలు తేల్చేలా చూడాలని కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్సింగ్ను రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు ఆర్.విద్యాసాగర్‌రావు కోరారు. శుక్రవారం ఢిల్లీలో అమర్‌జీత్‌సింగ్‌తో భేటీ అయిన ఆయన.. బజాజ్ కమిటీ విధులపై చర్చించారు. పోలవరం, పట్టిసీమల ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు తరలిస్తున్న నీటిలో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలను కమిటీ తేల్చాలని పేర్కొన్నా, ఆ అంశం తమ పరిధిలోకి రాదంటూ కమిటీ ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భం గా చేసిన వ్యాఖ్యలను అర్జీత్సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. ట్రిబ్యునల్ కేటాయింపులు చేసేందుకు చాలా సమయం పడుతున్నందున ఈలోగా తాత్కా లిక కేటాయింపులు చేసి, నిర్దిష్ట వాటా చెప్పాల్సిన బాధ్యత కమిటీపై ఉందని.. అది పట్టించుకోకుండా విధివిధానాలంటే కమిటీ ఏర్పాటుకు అర్థం లేదని వివరించారు. అమర్జీత్సింగ్ స్పందిస్తూ.. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, కమిటీ పెద్దలతో మాట్లాడతానని స్పష్టం చేసినట్లుగా సమాచారం. -
‘కృష్ణా’లో అన్యాయాన్ని సరిదిద్దండి
-
‘కృష్ణా’లో అన్యాయాన్ని సరిదిద్దండి
ఏకే బజాజ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి జలాల కేటాయింపు, వినియోగంలో తెలంగాణకు దశాబ్దాలుగా అన్యాయం పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల కింద 78 టీఎంసీలు రావాలి పులిచింతల, సుంకేశులను ఉమ్మడి జాబితాలో చేర్చాలి కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ట్రిబ్యునల్ కేటాయింపులను మార్చలేం: ఏకే బజాజ్ హైదరాబాద్ కృష్ణా జలాల కేటాయింపులు, వినియోగంలో తెలంగాణకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దానిని సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైందని ఏకే బజాజ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తమకు నీటి కేటాయింపులు, పంపిణీ విషయంలో వివక్షే ఎదురవుతోందని పేర్కొంది. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 98 టీఎంసీల వాటాలో.. తెలంగాణకు గరిష్టంగా 78 టీఎంసీలు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఇందులో పోలవరానికి సంబంధించి 43 టీఎంసీలు (96శాతం వాటా), పట్టిసీమకు సంబంధించి 35 టీఎంసీలు (65శాతం వాటా) ఇవ్వాలని విన్నవించింది. తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా నీటి యాజమాన్యం, నీటి వాటాలపై చర్చించేందుకు ఏకే బజాజ్ కమిటీ సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో తెలంగాణ సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించింది. ఇందులో కమిటీ చైర్మన్ ఏకే బజాజ్‌తో పాటు సభ్యులు డీకే మెహతా, ఆర్పీ పాండే, ప్రదీప్ కుమార్ శుక్లా, ఎన్ఎన్ రాయ్, కేఆర్ఎంబీ చైర్మన్ ఎస్కే హల్దర్, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్‌రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులు, పంపిణీలో అన్యాయంపై జోషి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందున్న పరిస్థితి, సాగునీటి రంగంలో అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలు, పథకాలను వివరించారు. ఏపీ ఆవిర్భావం తర్వాత ఆయా పథకాలను తుంగలో తొక్కిన వైనాన్ని తెలిపారు. 811లో 450 టీఎంసీలైనా రావాలి హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో రూపొందించిన అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్ర ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ 174 టీఎంసీలను కోల్పోయిందని ఎస్కే జోషి వివరించారు. బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునళ్ల ముందు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఉమ్మడి ఏపీ సర్కారు సమర్థంగా వాదించలేదన్నారు. అంతర్జాతీయంగా సాగునీటి కేటాయింపులు, పంపిణీకి సంబంధించి అమల్లో ఉన్న సహజ న్యాయసూత్రాలను ఉమ్మడి ఏపీ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. క్యాచ్మెంట్, సాగుయోగ్య భూములు, పేదరికం, వెనుకబాటుతనం, జనాభా తదితర అంశాలలో ఏ ప్రాతిపదికన, ఏ ప్రమాణాలతో చూసినా.. ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు 450 టీఎంసీలు రావాల్సి ఉందని వివరించారు. కమిటీకి విజ్ఞప్తి చేసిన మరిన్ని అంశాలు.. ⇒ నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద తెలంగాణ వాస్తవ ఆయకట్టు 6.6 లక్షల ఎకరాలుకాగా.. ఉమ్మడి ఏపీలో దాన్ని 6 లక్షల ఎకరాలకు తగ్గించారు. అందులోనూ 5 లక్షల ఎకరాలకే నీళ్లిచ్చారు. ఏపీ ప్రాంతంలో మాత్రం ఎడమ కాల్వ కింద ఆయకట్టును 1.3 లక్షల ఎకరాల నుంచి 3.7 లక్షల ఎకరాలకు పెంచారు. కుడి కాల్వ కింద 7.9 లక్షల నుంచి 11.74 లక్షల ఎకరాలకు పెంచుకున్నారు. ⇒1956లో ఏపీలోని కేసీ కెనాల్‌కు, తెలంగాణలోని ఆర్డీఎస్కు 85 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అనంతరం ఉమ్మడి ఏపీలో కేసీ కెనాల్ కింద ఆయకట్టును 2.78 లక్షల ఎకరాలకు పెంచారు. అదే ఆర్డీఎస్ కింద మాత్రం 37 వేల ఎకరాలకు నీళ్లివ్వలేదు. ⇒ఇక ఏపీ తనకు కేటాయించిన నీటిలో 350 టీఎంసీల నికర జలాలు, 150 టీఎంసీల మిగులు జలాలు కలిపి మొత్తం 500 టీఎంసీలు బేసిన్ అవతలే వినియోగిస్తోంది. ⇒తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగి మూడేళ్లు కావస్తున్నా కృష్ణాలో తెలంగాణలో వాటా తేలలేదు. 299:512 నిష్పత్తి ప్రకారం 2015లో రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా అంగీకారం కుదిరింది. దాని ప్రకారం కృష్ణా ప్రాజెక్టుల ’ఆపరేషనల్ ప్రోటోకాల్’ను రూపొందించాలి. ఉమ్మడి ప్రాజెక్టుల జాబితాలోకి జూరాలను చేర్చడం ఆక్షేపణీయం. ⇒పులిచింతల, సుంకేశుల ప్రాజెక్టులను ఉమ్మడి జాబితాలో చేర్చాలి. ట్రిబ్యునల్ కేటాయింపులను మార్చలేం ‘‘కృష్ణా జల వివాదాలపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటాం. కృష్ణా బోర్డు నిర్వహణ, ఆపరేషనల్ ప్రొసీజర్స్, గోదావరి నుంచి పోలవరం, పట్టిసీమ ద్వారా మళ్లిస్తున్న జలాల అంశాన్ని పరిశీలించాలని మాకు కేంద్రం సూచించింది. ఇరు రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని బోర్డుకు సరైన విధివిధానాలు రూపొందించాలని తెలంగాణ కోరింది. నదీ జలాల మళ్లింపునకు సంబంధించి ఉమ్మడి ఏపీ సమయంలో ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తాం. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉన్న 299ః512 టీఎంసీల నిష్పత్తిని ఎవరూ మార్చలేరు. మేం నివేదిక ఇచ్చేందుకు 90 రోజుల సమయం సరిపోకపోవచ్చు, గడువు పొడిగించాలని కేంద్రాన్ని కోరుతాం. తదుపరి పర్యటనలో ప్రాజెక్టులను కూడా సందర్శిస్తాం..’’ – ఏకే బజాజ్, కృష్ణా జల వివాదాలపై ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ -
‘పట్టిసీమ’పై చర్చకు సిద్ధమే
సమయం, స్థలం చెప్పండి అన్ని వివరాలతో వస్తా... వివరిస్తా మంగళవారం రావల్సిన కమిటీ పర్యటన ఎందుకు రద్దు చేసుకుందో ఆ లెక్కా తేలుస్తాఅదే రోజు జరగాల్సిన అంచనా కమిటీ ఎటుపోయిందో కూడా చెబుతా ఎమ్మెల్యే గోరంట్ల చేసిన సవాల్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి ప్రతి సవాల్ సాక్షి, రాజమహేంద్రవరం : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిరుపయోగమైందా? లేకా ఉపయోగమైందా? అన్న అంశంపై జరిగే చర్చకు సమయం, స్థలం నిర్ణయించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సవాల్ విసిరారు. గతంలో పలు విలేకర్ల సమావేశాల్లో ‘పట్టిసీమ’ బోగస్ పథకమని, ప్రత్యేక ప్యాకేజీ ఒక బ్రహ్మ పదార్థమని ఉండవల్లి సాదాహరణంగా ఆరోపించారు. తన ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తే టీడీపీ నేతలకు బహిరంగ క్షమాపణలు చెబుతానని ప్రకటించారు. సోమవారం విలేకర్ల సమావేశంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ‘పట్టిసీమ’ ‘ప్రత్యేక ప్యాకేజీ’లపై ఉండవల్లి ఆరోపణలను ఖండిస్తూ ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటిస్తూనే ఉండవల్లిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గోరంట్ల సవాల్‌పై మంగళవారం ఉండవల్లి స్పందించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం, ప్రత్యేక ప్యాకేజీపై చర్చకు సమయం, స్థలం చెప్పాలని కోరుతూ గోరంట్లకు బహిరంగ లేఖ రాశారు. పట్టిసీమ ప్రాజెక్టు ఏవిధంగా నిరుపయోగమైనదో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలతో సహా మీ ముందుంచడానికి సిద్ధంగా ఉన్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇవే కాకుండా పోలవరం ప్రాజెక్టు విషయమై మంగళవారం జరగాల్సిన ‘అంచనా కమిటీ’ సమావేశాన్ని, మంగళవారం ప్రాజెక్టు పరిశీలనకు రావాల్సిన కమిటీ పర్యటనను రద్దు చేయాడానికి గల కారణాలను కూడా గోరంట్ల బుచ్చయ్య ముందు ఉంచడానికి తాను రెఢీగా ఉన్నానని సవాల్ విసిరారు. -
అవినీతి కోసమే పట్టిసీమ
- ఎర్రకోట చెన్నకేశవరెడ్డి - వైఎస్సార్సీపీలోకి 30 మంది చేరిక ధర్మాపురం(నందవరం) : అవినీతి అక్రమార్జన కోసమే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు పెంచిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్నారు. ధర్మాపురంలో ఆదివారం ఆ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమకు మొదట్లో రూ. వెయ్యి కోట్లు అవసరమని చెప్పి ఆ తర్వాత అమాంతంగా రూ. 3 వేల కోట్లకు పెంచి సీఎం అవినీతికి తెరతీశారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యమని, వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలోకి 30 మంది చేరిక ధర్మాపురం గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 30 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీకు చెందిన విద్యాకమిటీ చైర్మన్ చిన్నమద్దిలేటి, వార్డు మెంబర్ రంగస్వామి, చిన్ననాగన్న, గోవిందు, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీకు చెందిన నరసింహులు, కాశిం, వడ్డేనరసన్నలతో పాటు ఆయా పార్టీలకు చెందిన మరో 23 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీఏ ధర్మకారి నాగేశ్వరరావు, ఆ పార్టీ నాయకులు కేఆర్ రాఘవరెడ్డి, ధర్మాపురం రాఘవరెడ్డి, సుధాకర్, బందేనవాజ్, కడిమెట్లతిమ్మప్పాచారి, సయ్యద్‌చాంద్, జగ్గాపురం నరసరాజు, జయన్న, శ్రీనివాసులు, రాఘవేంద్ర, ఆదోని భీమన్న తదితరులు పాల్గొన్నారు. -
పట్టిసీమ తరహాలోనే పురుషోత్తపట్నం
డిప్యూటీ సీఎం చినరాజప్ప సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన పిఠాపురం టౌన్ : పట్టిసీమ తరహాలోనే పురషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురువారం నాటి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి బుధవారం పిఠాపురం వచ్చిన రాజప్ప విలేకరులతో మాట్లాడారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఎస్వీఎస్ఎన్ వర్మ వెంట ఉన్నారు. చంద్రబాబు పిఠాపురంలో పాల్గొనే కార్యక్రమాల వివరాలు రాజప్ప వెల్లడించారు. రూ.1638 కోట్లతో చేపట్టే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పిఠాపురంలో ముఖ్యమంత్రి శుంకుస్థాపన చేస్తారన్నారు. ఈ పథకం పూర్తయితే ఏలేరు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) ఆయకట్టు భూములు సస్యశ్యామలం అవుతాయని తెలిపార. ఏడాదిలోగా పూర్తయ్యే ఈ పథకం వల్ల అదనపు ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. చంద్రబాబు పర్యటన సాగేదిలా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం మధ్యాహ్నం పిఠాపురం చేరుకుంటారు. బైపాస్ రోడ్డులోని ఇల్లింద్రాడ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఆయన హెలికాప్టర్ దిగుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పాదగయ జంక్షన్ వద్దకు వచ్చి సామర్లకోట రోడ్డులోని వైభవ వెంచర్స్‌లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొంటారని, అక్కడ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారని చినరాజప్ప తెలిపారు. భారీ బందోబస్తు పిఠాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం నుంచే పట్టణాన్ని పోలీసులు మొహరించారు.డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో బైపాస్ రోడ్డు, సామర్లకోట రోడ్డు, ఇల్లింద్రాడ జంక్షన్, వై జంక్షన్ ప్రాంతాల్లో పోలీసుల పహారా కాస్తున్నారు. సుమారు 1500 మంది పోలీసులను భద్రాతా విధులు నిర్వహిస్తారని డీఎస్పీ తెలిపారు. -
'చంద్రబాబు అవినీతి పాలనకు 100 మార్కులు'
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి పాలనకు చంద్రబాబుకు 100 మార్కులు వేయొచ్చని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. ముఖ్యమైన మూడు రంగాల్లో కనీసం ఒక శాతం అభివృద్ధి కూడా జరగలేదని బొత్స ధ్వజమెత్తారు. దోపిడీ కోసమే పట్టిసీమ ప్రాజెక్ట్‌ను కట్టారని ఆయన ఆరోపించారు. వ్యవసాయంపై అసలు కార్యాచరణే రూపొందించలేదని, ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా రాష్ట్రానికి రాలేదని, లక్షల కోట్ల ఎంఓయూలు ఏమయ్యాయని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. 2016 ఏడాదిలో చంద్రబాబు పాలన అవినీతి మిన్నగా ఉందని బొత్స ధ్వజమెత్తారు. అభివృద్ది సున్నా రెండేళ్ల పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. చంద్రబాబు రెండంకెల వృద్ది రేటు అని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, రాష్ట్రంలో అభివృద్ది, వృద్ది రేటు లెక్కల్లో తప్ప వాస్తవంగా ఎక్కడా కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో పంచ భూతాలను టీడీపీ నేతలు పంచుకు తింటున్నారని, కేవలం అయిదు శాతం మాత్రమే వృద్ది రేటు ఉందన్నారు. అయితే12 శాతం అంటూ దొంగ లెక్కలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. వృద్ది రేటు ప్రకటనలు అన్నీ బోగస్ అని దానిపై తాము బహిరంగ చర్చకు సిద్దమన్నారు. మంత్రులు, టీడీపీ నేతల వృద్ది రేటు పెరిగింది కాని రాష్ట్రం వృద్ది రేటు పెరగలేదని బొత్స అన్నారు. దోపిడీ కోసమే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారని,వ్యవసాయం అంటే దండగ అనే భావన ముఖ్యమంత్రికి ఉంది కాబట్టే వ్యవసాయంపై చిన్న చూపు చూస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ఎవరూ సంతృప్తి చెందడం లేదని,రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని అన్నారు. వృద్ది రేటు కాదని, క్రైమ్ రేటు పెరుగుతుందని బొత్స అన్నారు. ఎక్కడ చూసినా కల్తీ మాఫియాలే అని వ్యాఖ్యలు చేశారు. మహిళా ప్రజాప్రతినిధిని మంత్రి రావెల కిశోర్ బాబు వేధిస్తే చర్యలు తీసుకోలేదని అన్నారు. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలచే దమ్ముంటే రాజీనామా చేయించాలని బొత్స సవాల్ విసిరారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో వంగవీటి రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
పట్టిసీమ నీటిలో వాటా ఇవ్వండి
- కేంద్ర జల వనరుల శాఖకు తెలంగాణ విన్నపం - తాత్కాలిక కేటాయింపుల్లో నిష్పత్తి మార్చరాదని వినతి సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు పట్టిసీమ ద్వారా తరలిస్తున్న నీటిలో తమకు తాత్కాలిక ప్రాతిపదికనైనా నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల వనరులశాఖను కోరింది. ఈ కేటాయింపులపై కేంద్రం నియమించిన కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇస్తుందని, అయితే అప్పట్లోగా తాత్కాలికంగా కొంత వాటాను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ నీటి పారుదల సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు బుధవారం ఇక్కడ కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్సింగ్ను కలసి కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పాపారావు కూడా ఉన్నారు. అలాగే ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంతవరకు కృష్ణా జలాలను తాత్కాలికంగా ఇరు రాష్ట్రాల మధ్య పంచుతూ కేంద్ర జల వనరుల శాఖ నిర్ధారించిన కేటాయింపులను మారుస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. అలాగే పట్టిసీమ ద్వారా మళ్లించే జలాలపై శాశ్వత వాటా తేల్చేందుకు వీలుగా కృష్ణా ట్రిబ్యునల్‌లో సంబంధిత అంశాన్ని ప్రస్తావించాలని కోరారు. ఈ అంశాలపై కేంద్ర కార్యదర్శి సానుకూలంగా స్పందించారని విద్యాసాగర్‌రావు తెలిపారు. -
చంద్రబాబుపై హర్షకుమార్ ఆగ్రహం
-
చంద్రబాబుపై హర్షకుమార్ ఆగ్రహం
రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ ఎంపీ హర్షకుమార్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పట్టిసీమ విషయంలో చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పట్టి సీమకు ఎలాంటి గుర్తింపు లేదని అన్నారు. నదుల అనుసంధానం తానే చేశానంటూ చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా కల్లబొల్లి మాటలని హర్ష కుమార్ చెప్పారు. పట్టి సీమకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్పష్టం చేసిందని హర్ష కుమార్ తెలిపారు. -
ఏటయిందే గోదారమ్మా..!
డిసెంబర్ మొదట్లోనే కనిష్ట స్థాయికి పడిపోయిన ప్రవాహం గోదావరి డెల్టాలో రబీ పంటల సాగుపై రైతుల్లో ఆందోళన కనీసం 90 టీఎంసీలు అవసరమంటోన్న జలవనరుల శాఖ సీలేరు రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్నది 30 టీఎంసీలే సాక్షి, అమరావతి: ఈ ఏడాది రబీ ప్రారంభంలోనే గోదావరి నదిలో ప్రవాహం కనిష్ట స్థాయికి పడిపోవడం డెల్టా రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పంటల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. డెల్టాలో రబీలో పంటల సాగుకు కనిష్టంగా 90 టీఎంసీలు అవసరం. సీలేరు నదిపై నిర్మించిన రిజర్వాయర్లలో 30 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గోదావరిలో సహజ సిద్ధంగా ఉండే ప్రవాహాల నుంచి 60 టీఎంసీలు వస్తే డెల్టాలో రబీ పంటలు చేతికందుతాయి. కానీ.. డిసెంబర్ ప్రారంభంలోనే గోదావరిలో ప్రవాహాలు కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో.. డ్రైయిన్ల నుంచి నీటిని ఎత్తిపోసినా 60 టీఎంసీల నీటి లభ్యత అసాధ్యమని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ఇది పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 10,13,161 ఎకరాల్లో ఖరీఫ్‌లోనూ, రబీలోనూ పంటలు సాగు చేస్తారు. పంటల సాగుకు కనిష్టంగా ఖరీఫ్‌లో 102, రబీలో 90 టీఎంసీలు అవసరం. డెల్టాలో ఖరీఫ్ పంటల కోతలు పూర్తయివడంతో రబీ పంటలకు నారుమళ్లు పోసుకుని.. పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజీకి 5,633 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. ఐదు వేల క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేసి, 633 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఇదే సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 5,600 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు మళ్లించారు. వీటిని కలుపుకున్నా గోదావరిలో ప్రవాహం 11,233 క్యూసెక్కులేనని స్పష్టమవుతోంది. ఆందోళనలో రైతన్నలు.. గోదావరి డెల్టాలో రబీలో డిసెంబర్ 15 నుంచి వరి నాట్లు వేస్తారు. ఏప్రిల్ నెలాఖరుకు పంట నూర్పిళ్లను ప్రారంభిస్తారు. డిసెంబర్ 15 నాటికి పట్టిసీమ పంపులను నిలిపేస్తామని సర్కార్ చెబుతోంది. వరి నాట్ల సమయంలో డెల్టాకు కనిష్టంగా 13 వేల క్యూసెక్కులు అవసరం. పంట పొట్ట దశలో ఉన్నప్పుడూ ఇదే స్థాయిలో అవసరం. డిసెంబర్ ప్రారంభంలోనే 11 వేల క్యూసెక్కులకు నీటి ప్రవాహం పడిపోయిన నేపథ్యంలో.. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో కనీసం 2,500 నుంచి మూడు వేల క్యూసెక్కులు కూడా వచ్చే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. సీలేరు నదిపై నిర్మించిన రిజర్వాయర్లలో 30 టీఎంసీలు మాత్రమే డెల్టాకు విడుదల చేసే అవకాశం ఉంది. సీలేరు రిజర్వాయర్ల నుంచి రోజుకు ఐదు వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేసినా.. గోదావరి సహజ ప్రవాహాలతో కలిపి 7,500 క్యూసెక్కులకు మించి డెల్టాకు విడుదల చేసే అవకాశం ఉండదు. ఇది రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలేవీ? గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన నేపథ్యంలో కాలువల పరిస్థితి దయనీయంగా ఉంది. ఖరీఫ్‌లో ఆయకట్టు భూములకు నీళ్లందక ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రబీలో సమర్థంగా డెల్టా కు నీళ్లందించడానికి ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చ ర్యలూ తీసుకోలేదు. రైతులకు అవగాహన కల్పించే రీతిలో సమావేశాలు నిర్వహించిన పాపాన పోలేదు. గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ చివరి నిముషంలో డ్రెయిన్ల నుంచి నీటిని ఎత్తిపోసి హడావుడి చేసినా పంటలను రక్షించే అవకాశం ఉండదు. రైతులు వేలాది కోట్ల రూపాయలను పెట్టుబడుల రూపంలో కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా రైతులకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
పట్టిసీమపై సర్కారు మాటలన్నీవట్టిమాటలే
-
గ్రూప్-1 మెయిన్స్‌లో అడిగిన ప్రశ్నలివే..
హైదరాబాద్: ‘ప్యాకేజీతో పోల్చితే ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా?, పట్టిసీమ పథకం వల్ల ప్రయోజనాలేంటి?’ వంటి తాజా పరిణామాలను గ్రూప్-1 మెయిన్స్‌లో ప్రశ్నలుగా సంధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమయిన విషయం తెలిసిందే. తొలిరోజు బుధవారం జనరల్ ఎస్సేపై పరీక్ష జరిగింది. ప్రశ్నలన్నీ దాదాపుగా ఇటీవలి పరిణామాలపైనే ఇచ్చారు. విభజన తర్వాత ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఓ ప్రశ్న ఇచ్చారు. ‘భారత ప్రభుత్వం ఆం ధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రస్తుత ప్యాకేజీతో పోల్చితే హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా? వివరించండి?’ అని ప్రశ్నించారు. అలాగే నదుల అనుసంధానం ఏపీలో నీటి కొరత ఎలా తీర్చగలదో తెలపండి? పట్టిసీమ పథకం ప్రయోజనాలు వివరించం డి? అని మరో ప్రశ్న ఇచ్చారు. దళితులపై దాడుల నేపథ్యం లో.. భారతదేశంలో దళితుల ప్రస్తుత పరిస్థితేమిటి? అనేక పథకాలు, రక్షణ కోసం కఠిన చట్టాలున్నప్పటికీ క్షేత్రస్థాయిలో గణనీయమైన అభివృద్ధి ఎందుకు లేదు? అంటూ ప్రశ్నించారు. ‘దేశద్రోహ చట్టాలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. మన దేశం లో ఇటీవలి సంఘర్షణల నేపధ్యంలో పైన పేర్కొన్న వాక్యంపై చర్చించండి?’ అని మరో ప్రశ్న ఇచ్చారు. కాశ్మీర్‌లోయలో ఆందోళనల నేపథ్యంలో.. భారత్ చేస్తున్న ఉమ్మడి తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించాలని ప్రశ్నించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపైనా ప్రశ్న సంధించారు. తొలి రోజు పరీక్షకు 3,128 మందే హాజరు: కాగా, రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 8,760 మందికి గాను 3,128 మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 1,082 మంది, విశాఖలో 833 మంది, విజయవాడలో 654 మంది, తిరుపతిలో 559 మంది హాజరయ్యారని చెప్పారు. ఇదిలాఉండగా పరీక్ష ఉదయం 10 గంటలకే అయినా 8.30కల్లా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఏపీపీఎస్సీ నిబంధన పెట్టింది. అనేక మంది అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో వారిని పరీక్ష హాల్లోకి అనుమతించలేదు. ఇలా అవకాశాలు కోల్పోయిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ఈసారి పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. గదుల్లో సీసీ కెమెరాలు ఉన్న భవనాలనే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసింది. అభ్యర్థులకు బయోమెట్రిక్, ఐరిష్‌తో పాటు ప్రత్యేకంగా మళ్లీ ఫొటోలు తీశారు. వీటిని ఆయా అభ్యర్థుల దరఖాస్తుల్లోని ఫొటోలు ఇతర అంశాలతో సరిపోల్చిన తర్వాతే పరీక్ష హాల్లోకి అనుమతించారు. కాగా, ఈ పరీక్షను ఏపీ, తెలంగాణలు ఒకేరోజు నిర్వహించడంతో అభ్యర్థులు ఏదో ఒక్క రాష్ట్రానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన గంటన్నర ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధనతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని తొలగించాలంటూ పలువురు అభ్యర్థులు బుధవారం హైదరాబాద్‌లోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందు చేరుకున్నామని, కానీ 9 గంటలకే బయోమెట్రిక్ పూర్తరుుందంటూ పరీక్షకు అనుమతించలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌భాస్కర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. -
పట్టిసీమ, హోదాలపై ఏపీ గ్రూప్-1లో ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్యాకేజీతో పోల్చితే ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా?, పట్టిసీమ పథకం వల్ల ప్రయోజనాలేంటి?’ వంటి తాజా పరిణామాలను గ్రూప్-1 మెయిన్స్‌లో ప్రశ్నలుగా సంధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు బుధవారం జనరల్ ఎస్సేపై పరీక్ష జరిగింది. పలు ప్రశ్నలను ఇటీవలి పరిణామాలపైనే ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ఓ ప్రశ్న ఇచ్చారు. పట్టిసీమ పథకం ప్రయోజనాలు వివరించండి? అని మరో ప్రశ్న ఇచ్చారు. తొలిరోజు పరీక్షకు 3,128 మంది హాజరయ్యారు. -
పట్టిసీమ ఒక బోగస్ ప్రాజెక్ట్ : ఉండవల్లి
-
ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదు
- వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టీకరణ - హోదా వచ్చేంతవరకూ వైఎస్సార్సీపీ పోరాడుతుంది సాక్షి, విశాఖపట్నం: ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం అంటూ ఏదీ లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎన్నో నిధులు, రాయితీలు వస్తాయని, వాటి విలువ రూ.1.45 లక్షల కోట్లని చెప్పారు. హోదా ఇవ్వకుండా ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఈ నిధులకు సమానం కాదని పేర్కొన్నారు. దీనిపై బహిరంగ చర్చకు వచ్చే వారెవరైనా ఉంటే తాను సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంతవరకూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. విశాఖకు రైల్వేజోన్, విద్యా సంస్థలను కూడా ప్రత్యేక హోదా బిల్లులో పొందుపరిచారని, వాటిని సాధించేవరకూ వదిలేది లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో బీజేపీ, రాష్ర్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు మోసం చేశాయని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్‌ను స్వాగతిస్తాం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడొచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆచితూచి విమర్శలు చేశారని, అయితే, ప్రత్యేక హోదాపై ఆయన పోరాడతాననడాన్ని తాము స్వాగతిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన వైఎస్సార్సీపీతో కలసి పోరాటం చేయడానికి ముందుకొస్తే తాము స్వాగతిస్తామన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిన ద్రోహుల పార్టీ కాంగ్రెస్‌తో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. రాష్ర్ట ప్రజల అభిమతానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసి, జనానికి తీరని ద్రోహం చేసిన ద్రోహుల పార్టీతో తాము కలిసేది లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అర్థమైందని, అందుకే రాష్ర్టంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపేం దుకు సాహసించడం లేదన్నారు. ఎన్నికల తర్వాత తమ పార్టీ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో దీక్ష చేశారని, ఇకపైనా ఇదే ఒరవడి కొనసాగుతుందని తెలిపారు. ఏపీ అప్పుల వాటా రూ.1.50 లక్షల కోట్లు రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక లోటుతో ఉన్న ఏపీకి రూ.1.50 లక్షల కోట్ల అప్పులు వాటాగా వచ్చాయని వి.విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా అనకాపల్లిలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. -
కృష్ణా డెల్టాను నాశనం చేయొద్దు: నాగిరెడ్డి
తెనాలి: పట్టిసీమ పేరుతో కృష్ణా డెల్టాను నాశనం చేయవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రథమ వినియోగ హక్కు, నికర జలాల హక్కు కలిగిన కృష్ణాడెల్టాకు పట్టిసీమ పేరుతో నీటి కేటాయింపులపై అయోమయ పరిస్థితిని కల్పించవద్దన్నారు. చిత్తశుద్ధి ఉంటే కృష్ణాబోర్డు నుంచి ఏమేరకు నీటిని తీసుకుంటారో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వేమూరు నియోజకవర్గంలో సాగునీరు అందక దెబ్బతిన్న వరిసాగు పొలాలను నాగిరెడ్డి పరిశీలించారు. రెండేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 43 లక్షల హెక్టార్ల నుంచి 40.9 లక్షల హెక్టార్లకు పడిపోయిందన్నారు. -
పట్టిసీమ పేరుతో కృష్ణాడెల్టా నాశనం చేయెద్దు
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్.నాగిరెడ్డి తెనాలి పట్టిసీమ పేరుతో కృష్ణాడెల్టాను నాశనం చేయొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రథమ వినియోగ హక్కు, నికర జలాల హక్కు కలిగిన కృష్ణాడెల్టాకు పట్టిసీమ పేరుతో నీటి కేటాయింపులపై అయోమయ పరిస్థితిని కల్పించవద్దన్నారు. చిత్తశుద్ధి వుంటే కృష్ణాబోర్డు నుంచి ఏ మేరకు నీటిని తీసుకొంటారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేమూరు నియోజకవర్గంలో సాగునీరందక దెబ్బతిన్న వరిసాగు పొలాలను మంగళవారం నాగిరెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో సాగుభూమి 43 లక్షల హెక్టార్ల నుంచి 40.9 లక్షల హెక్టార్లకు పడిపోయిందన్నారు. తెలంగాణలో సాగుభూమి 38.58 లక్షల హెక్టార్ల నుంచి 43 లక్షల హెక్టార్లకు విస్తరించిందని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో పంటల సాగు 69 శాతం కాగా, గుంటూరు జిల్లాలో 59 శాతం మాత్రమేనని చె ప్పారు. ఇదే జిల్లాలో 1.89 లక్షల హెక్టార్లకు 76 శాతమే సాగు చేయగలిగినట్టు నాగిరెడ్డి వివరించారు. ఏరువాక పేరుతో పండుగలు చేసిన ప్రభుత్వం, జులై 10వ తేదీనుంచి నారుమళ్లు పోసుకోవచ్చని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణాడెల్టా రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని నాగిరెడ్డి ఆరోపించారు. పట్టిసీమ నీటిని నెల్లూరు, పెన్నావరకు తీసుకెళతామని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం కృష్ణాడెల్టాలో నారుమళ్లకు కూడా ఇవ్వలేకపోయినట్టు చెప్పారు. వెదజల్లిన చేలల్లో పంటలు ఎండిపోతున్నా, పుష్కరాల కోసమని అక్కడే వుంటున్న ముఖ్యమంత్రి పట్టించుకోలేదనీ, సుభిక్షమైన కృష్ణాడెల్టాను బీడుగా మార్చారని ఆరోపించారు. పంటకాలువల నుంచి ఇంజిన్లతో బ్రాంచి కాలువలకు, అక్కడ్నుంచి మళ్లీ ఇంజిన్లతో పొలాలు తడువుకోవాల్సిన దుస్థితిని రైతులు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పట్టిసీమ నీటిని తరలిస్తున్న పోలవరం కాలువను కాంక్రీట్ లైనింగ్‌తో సహా 130 కి.మీ వైఎస్ హయాంలో పూర్తిచేస్తే తర్వాత 42 కి.మీ దూరం కాలువను సక్రమంగా నిర్మించని కారణంగానే గండి పడిందన్నారు. మళ్లీ గండ్లు పడతాయన్న భయంతోనే పట్టిసీమకు గల 24 పంపులను వినియోగించే ధైర్యం చేయలేకపోతున్నట్టు చెప్పారు. మరోవైపు గత రెండేళ్లలో ప్రకటించిన కరువు మండలాల రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఇంతవరకు అందించలేదని గుర్తుచేశారు. 2003లో కరువు సమయంలో ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. పుష్కరాల కోసం తీసుకున్న నీటిని గత రెండుమూడు రోజులుగా ఇస్తున్న ప్రభుత్వం, ఇదే పరిమాణంలో కంటిన్యూగా సరఫరా ఇస్తామని హామీనివ్వాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. రైతాంగం కోసం ఏ పార్టీలతోనైనా కలిసి పోరాడేందుకు తమ పార్టీ సిద్ధంగా వుందన్నారు. వీరితో పార్టీ రైతువిభాగం రాష్ట్ర కార్యదర్శి తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పెరికల కాంతారావు, యలవర్తి రామమోహనరావు, యలవర్తి నాగభూషణం, గాదె శివరామకృష్ణారెడ్డి, ఉయ్యూరు అప్పిరెడ్డి, రాపర్ల నరేంద్ర ఉన్నారు. -
పట్టిసీమలో భక్తుల పాట్లు
పోలవరం : పట్టిసీమ పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరికి వరద పెరగడంతో భక్తుల రాకపోకల కోసం నదిలో వేసి ఇసుక బస్తాలు మునిగిపోయే దుస్థితి నెలకొంది. అయినా వాటిపైనే భక్తులు స్నానాలకు నడిచి వెళ్తున్నారు. మండలంలోని పట్టిసీమతోపాటు గూటాల, పోలవరం ఘాట్లలో జనం పలుచగా కనిపిస్తున్నారు. పట్టిసీమ శివక్షేత్రంలో భక్తులకు పులిహార ప్రసాదం అందజేశారు. వృద్ధులు, చిన్నారుల కోసం పట్టిసీమ రేవులో జల్లుస్నానాలు ఏర్పాటు చేశారు. -
'మరో ప్రాజెక్టు కడితే గోదావరి డెల్టా ఎడారే'
కాకినాడ: గోదావరి డెల్టాను ఎడారి చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. పట్టిసీమ మాదిరిగానే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వద్ద గోదావరి నదిపై మరో ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని విమర్శించారు. బుధవారం కాకినాడలో మీడియాతో మాట్లాడిన కురసాల.. ఇప్పటికే పట్టిసీమ వల్ల గోదావరి డెల్టా అన్యాయమయ్యే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇక గోదావరి నదిపై మరో ప్రాజెక్టు కడితే డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామన్న టీడీపీ మళ్లీ ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు నిర్మిస్తున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరి డెల్టాను ఎడారిగా చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుందని కురసాల కన్నబాబు అన్నారు. -
‘వ’ట్టిసీమే!
పట్టిసీమపై ప్రభుత్వం ఆర్భాట ప్రచారం ఆచరణలో నీరందని వైనం కంటితుడుపు చర్యలతో అన్నదాతల్లో అయోమయం పశ్చిమ డెల్టా రైతుల్లో ఆందోళన ‘పట్టిసీమ నుంచి నీటిని విడుదల చే శాం.. నారుమళ్లు పోసుకుని వరినాట్లు వేసుకోవచ్చు.. తుపాన్లు రాకముందే పంట చేతికొస్తుంది.. డెల్టా రైతులకు ఎలాంటి సమస్యలూ లేకుండా నివారించాం..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన కు, వాస్తవానికి పొంతన లేకుండా పోయింది. పట్టిసీమ నుంచి వస్తున్నాయని చెబుతున్న గోదావరి జలాలు పశ్చిమ డెల్టాకు అరకొరగానే ఉన్నాయి. నారుమళ్ల సంగతలా ఉంచితే వెదlపద్ధతిలో వరిసాగుకు శ్రీకారం చుట్టిన అన్నదాతలు సాగునీటిపై బెంగటిల్లుతున్నారు. శ్రీశైలం, సాగర్ జలాశయాలకు త్వరితగతిన నీరు చేరుకోవాలని కోరుకుంటున్నారు సాక్షి, అమరావతి / తెనాలి: డెల్టాలో ఏటా జూన్‌లో ఆరంభమయ్యే ఖరీఫ్ సీజను, ప్రతికూల పరిస్థితుల కారణంగా జూలై, ఆగస్టు నెలలకు మారి, చాలా కాలమైంది. గతేడాదిలానే ఈసారీ వర్షాలు జూన్‌లో వచ్చేసి ఆశ్చర్యపరిచాయి. నీటిని ఒడిసిపట్టేందుకు పులిచింతల సిద్ధం కాలేదు. పట్టిసీమ నుంచి ఈ నెల ఆరున నీరు విడుదల చేసినా పది రోజులకు కూడా ప్రకాశం బ్యారేజీకి చేరుకోలేదు. ఆ తర్వాతా అరకొరే. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని 5.71 లక్షల ఎకరాల ఆయకట్టుకు గత రెండు రోజులు కేవలం 500 క్యూసెక్కులనే ఇస్తున్నారు. 2.50 లక్షల ఎకరాలున్న కొమ్మమూరు కాలువకు కేవలం 55 క్యూసెక్కులట. రేపల్లె బ్యాంక్ కాలువకు 146 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 206, నిజాంపట్నం కాలువకు 110 ఇస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ పరిమాణాన్ని 1016 క్యూసెక్కులకు పెంచారు. అయినా కాలువ ఎగువ భూముల్లోనే నారుమళ్లకు నీరు ఎక్కటం లేదని రైతులు చెబుతున్నారు. గతేడాదీ ఇదే స్థితి... గతేడాది ఖరీఫ్ సీజనులో కృష్ణాడెల్టాకు కేవలం 35.17 టీఎంసీలే ఇచ్చారు. పట్టిసీమతో డెల్టా అవసరాలు తీరతాయని ఊదరగొట్టిన పాలకులు మాట నిలుపుకోలేకపోయారు. వరిపైరు కీలక దశలో నీటి తడులు ఇవ్వలేకపోయారు. దీంతో రెండు లక్షల ఎకరాల్లో సాగు వదిలేయాల్సి వచ్చింది. 20 వేల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఆయిల్ ఇంజిన్లతో నీరు పెట్టినా, సగటున 21–22 బస్తాల ధాన్యానికి మించి రాలేదనే విషయం తెలిసిందే. జిల్లాలో ధాన్యం దిగుబడి ఐదు లక్షల టన్నులు తగ్గింది. గత ఏడాది చేదు అనుభవంతో ప్రస్తుత ఖరీఫ్‌కు జాగ్రత్తపడాల్సిన పాలకులు, నారుమళ్లకు కూడా సరిపడా నీరివ్వలేకపోతున్నారు. పోలవరం కుడికాలువ పనులు పూర్తిస్థాయిలో జరగనందునే గోదావరిలో నీరున్నా, తీసుకోవటం సాధ్యంకాని పరిస్థితులు నెలకొన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గతేడాది వర్షాల కరువుతో వరి నారుమళ్లు వదిలేసి, రైతులు వెద పద్ధతిలో వరిసాగుకు మొగ్గుచూపారు. జిల్లాలో రెండు లక్షల 50 వేల ఎకరాల్లో వెదజల్లారు. ప్రస్తుతం ఆ పరిస్థితులే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాలు లేకపోవటం, కాలువలకు సరిపడా నీరు రాకపోవటంతో ఆయిలింజిన్లతో నీరు పెడుతున్నారు. ఎకరం తడిపేందుకు కనీసం రూ.2 వేల వరకు ఖర్చవుతోంది. ఇలా తడులిచ్చినా వర్షాలు కురిసి, పంట కాలువల్లో సాగునీరు అందితేనే దిగుబడులు బాగుండే అవకాశముంటుంది. జిల్లాలో సాగునీటి విడుదల ఇలా.. గుంటూరు పశ్చిమ డెల్టాకు సంబంధించి నాలుగు కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బ్యాంకు కెనాల్ సామర్థ్యం 2700 క్యూసెక్కులు కాగా 150, ఈస్ట్ కెనాల్ 770 క్యూసెక్కులకుగాను 182, నిజాంపట్నం కాలువ 440 క్యూసెక్కులకు గాను 110, కొమ్మమూరు 3600 క్యూసెక్కులకు గాను 203 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలుపుతున్నారు. కాలువలకు తక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేయడంతో కొన్ని చోట్ల స్లూయిస్‌కు నీరు అందడంలేదు. దీంతో పంట పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. వరినారు పోసుకొనేందుకు ఇబ్బందిగా మారింది. -
గోదావరిపై మరో ఎత్తిపోతలు
- ఎడమ గట్టుపై పురుషోత్తమపట్నం వద్ద నిర్మాణానికి ప్రణాళిక - పోలవరం ఎడమకాల్వ ద్వారా 35 టీఎంసీల మళ్లింపు లక్ష్యం సాక్షి, హైదరాబాద్ : గోదావరి కుడిగట్టుపై పట్టిసీమ పథకాన్ని చేపట్టిన తరహాలోనే ఎడమగట్టుపై మరో ఎత్తిపోతల స్కీమును చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తమపట్నం వద్ద దీన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గోదావరి నదికి జూన్ నుంచి సెప్టెంబరు మధ్య వరదొచ్చే వంద రోజుల్లో రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున 35 టీఎంసీలను పోలవరం ఎడమకాల్వ ద్వారా తరలించి ఏలేరు ఆయకట్టుకు చెందిన 53 వేల ఎకరాలకు నీళ్లందించడంతోపాటుగా విశాఖ నగర తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలనే పేరుతో ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం పనులకు రూ.954 కోట్లతో ఆగస్టు మొదటివారంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేసేందుకు జలవనరులశాఖ కసరత్తు చేస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఎడమకాల్వను ఇందుకోసం ఉపయోగించుకోవాలని చూస్తుండడం గమనార్హం. 181.5 కిమీల పొడవైన పోలవరం ఎడమకాల్వ పను ల్లో 75 శాతం వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. తక్కిన 25 శాతం పనులు పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కుస్తీలు పడుతోంది. పోలవరం ఎడమకాల్వ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడం, 540 గ్రామాలకు, విశాఖ ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాల్ని తీర్చాలనే లక్ష్యం సాకారం కావాలంటే హెడ్‌వర్క్స్ సత్వరమే పూర్తి చేయాలి. అయితే హెడ్‌వర్క్స్ పనుల్ని పక్కనపెట్టి ఎడమగట్టుపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తమపట్నం వద్ద రూ.954 కోట్లతో యుద్ధప్రాతిపదికన ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. పురుషోత్తమపట్నం వద్ద 325 క్యూసెక్కుల సామర్థ్యంతో 12 పంపుల్ని ఏర్పాటు చేసి నీటిని తోడి మూడు కిలోమీటర్ల పొడవైన పైపులైను ద్వారా తరలించి.. పోలవరం ఎడమకాల్వ 1.7 కిలోమీటర్ వద్ద కలపాలని భావిస్తున్నారు. ఎడమకాలువపై 57 కిలోమీటర్ వద్ద రెగ్యులేటర్ నిర్మించి ఏలేరు ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు విశాఖకు నీటిని తరలించవచ్చనేది యోచన. -
'మా వాట మాకు ఇవ్వండి'
-
'మా వాట మాకు ఇవ్వండి'
హైదరాబాద్: విద్యుత్ ఉత్పాదన పేరుతో నీళ్లు దిగువ ప్రాంతాలకు వదలొద్దని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు తగ్గకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు సర్కారు నిర్వాకం వల్లే గతేడాది రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కరువుతో అల్లాడిపోయాయని చెప్పారు. రాయలసీమకు పట్టిసీమ నీళ్లు వద్దని, తమకు రావాల్సిన వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుందన్నందున ఈ నీటి విషయంపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని సూచించారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చర్చించి రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు. మంత్రి దేవినేని ఉమా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టును మూడుసార్లు ప్రారంభించిన ఇప్పటికీ గోదావరి నీళ్లు కృష్ణా నదిలో కలవలేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. -
రాయలసీమకు నీళ్లెప్పుడిస్తావు బాబూ
ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విజయవాడ సెంట్రల్ : పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్ళు ఎప్పుడిస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టిసీమతో రాయలసీమ నీటి అవసరాలను తీరుస్తామని పదేపదే చెప్పిన చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో వెల్లడించాలన్నారు. కృష్ణా– గోదావరి జలాల అనుసంధానం జరిగినట్లు చెబుతూ ముఖ్యమంత్రి ఇప్పటికే మూడుసార్లు పట్టిసీమకు ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. రాయలసీమ పేరు చెప్పి పబ్బం గడుపుకుందామనుకుంటే కుదరదని హెచ్చరించారు. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా రాష్ట్రంలో సాగునీటి రిజర్వాయర్లు ఒట్టికుండల్లా మారాయని చెప్పారు. రిజర్వాయర్ల నీటితో సాగు, తాగు అవసరాలు తీర్చుకోవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం నేపథ్యంలో రాష్ట్రంలో జలాశయాలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా అక్రమ ప్రాజెక్టుల్ని ప్రభుత్వం అడ్డుకోవాలని సూచించారు. -
వట్టిసీమ.
-
ఎక్కడి పనులు ఇంకా అక్కడే..
- పట్టిసీమ నుంచి పూర్తి సామర్థ్యంతో విడుదలకాని నీరు - పూర్తిగాని అండర్ టన్నెల్స్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసి 10 రోజులైనా గోదావరి జలాలు ఇంకా కృష్ణమ్మను చేరలేదు. ఇప్పటివరకూ కేవలం 0.75 టీఎంసీల నీరు మాత్రమే దిగువకు వచ్చింది. శనివారం సాయంత్రానికి కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వద్దకు జలాలు చేరతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పట్టిసీమ నుంచి కృష్ణాజిల్లా సీతారామపురం బ్రిడ్జి వరకూ పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువను ‘సాక్షి’ బృందం పరిశీలన జరిపింది. పూర్తి సామర్థ్యంతో ఇస్తారా? ► ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 6న పట్టిసీమలోని 24 మోటార్లు ఆన్ చేశారు. ► అప్పటి నుంచి ఇప్పటి వరకూ రెండు మోటార్లు మాత్రమే నడుస్తున్నాయి. ►గురువారం వరకూ రోజుకు 700 క్యూసెక్కులు విడుదల చేయగా, శుక్రవారం నుంచి 2,450 క్యూసెక్కులు ఇస్తున్నారు. పూర్తిసామర్థ్యంతో నీటిని విడుదల చేయడం లేదు. ► భవిష్యత్‌లో కూడా 4వేల క్యూసెక్కుల కన్నా ఎక్కువ నీరు ఇచ్చే అవకాశం కనబడటం లేదు. అసంపూర్తిగా పనులు ► గోపాలపురం మండలం గుడ్డిగూడెం-గోపాలపురం మధ్య నాలుగు ప్రదేశాల్లో అండర్ టన్నెల్స్ నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. ► గోపాలపురం, చిట్యాల వద్ద పైపులతో తాత్కాలికంగా వంతెనల నిర్మాణం చేపట్టారు.►యూటీలు నిర్మించవలసిన ప్రదేశాల్లో మట్టితో గట్లు పూడ్చే పనులు జరుగుతూనే ఉన్నాయి. ► దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో 12 కిలోమీటర్ల మేర ఏటిగట్ల పనులు అసంపూర్ణంగా ఉన్నాయి. ► ముండూరు నుంచి జానంపేట వరకూ పనులు సాగుతూనే ఉన్నాయి. ► తాత్కాలిక వంతెనలు పైపులతో వేశారు. ప్రస్తుతం 2,450 క్యూసెక్కుల నీరు వస్తేనే అవి పూర్తిగా మునిగిపోయాయి. ► ఒకవేళ పూర్తి సామర్థ్యం 8,400 క్యూసెక్కుల నీరు వస్తే తాత్కాలిక వంతెనలు పూర్తిగా మునిగిపోవడంతో పాటు కొట్టుకుపోయే అవకాశం ఉంది. ► కృష్ణాజిల్లాలోనూ అదే పరిస్థితి కనపడుతోంది. పల్లెర్లమూడి వద్ద రామిలేరుపై అండర్ టన్నెల్ పనులు కూడా పూర్తి కాలేదు. సీతారామపురం వద్ద రాష్ట్ర రహదారిపై వంతెన పనులు పూర్తి కాలేదు.►వందలాది టీఎంసీ నీళ్లు ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తున్నా.. పట్టిసీమ నుంచి వదిలింది కేవలం 0.75 టీఎం సీలు. ► రోజుకు పూర్తి సామర్థ్యంతో విడుదల చేసినా కనీసం 120 రోజులపాటు గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా పంపితేగాని ఖరీఫ్‌లో ముఖ్యమంత్రి చెప్పినట్లు 80 టీఎంసీల నీటిని తరలించడం సాధ్యం కాదు. -
గోదావరి జలాలకు పూజలు
రంగన్నగూడెం (హనుమాన్‌జంక్షన్ రూరల్) / గన్నవరం రూరల్ : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు పోలవరం కుడికాలువ ద్వారా శుక్రవారం బాపులపాడు మండలానికి చేరాయి. మండల పరిధిలోని రంగన్నగూడెం వద్ద ఉదయం ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు నీటికి హారతులిచ్చారు. జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణారావు, ఎంపీపీ తుమ్మల కోమలి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వి.వీర్రాజు పూజలు నిర్వహించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వీర్రాజు మాట్లాడుతూ ప్రస్తుతం పోలవరం కాలువలో 2400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, ఎన్ఎస్పీ నూజివీడు ఓ అండ్ ఎం ఈఈ అర్జునరావు, జగ్గయ్యపేట ఎన్ఎస్పీ ఈఈ శ్రీనివాసరావు, పోలవరం డీఈఈ జె.ప్రసాద్, ఏఈ శ్యామ్‌కుమార్, సర్పంచి ప్రసన్నరావు పాల్గొన్నారు. కొత్తగూడెం చీమలవాగు యూటీ వద్ద.. కొత్తగూడెం(గన్నవరం రూరల్) : మండలంలోని కొత్తగూడెం చీమలవాగు అండర్ టన్నెల్ వద్ద శుక్రవారం పోలవరం కాలువ నీటికి రాష్ర్ట జలవనరుల శాఖ అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు పూజలు చేశారు. నీరు శుక్రవారం ఉదయం 11 గంటలకు బల్లిపర్రు గ్రామానికి నీరు చేరాయి. బల్లిపర్రు, తెంపల్లె, వీరపనేనిగూడెం, కొత్తగూడెం, చింతగుంట, గొల్లనపల్లి, గోపవరపుగూడెం, కట్టుబడిపాలెం దాటి సూరంపల్లి వద్దకు పోలవరంలో నీరు మధ్యాహ్నం 3 గంటలకు చేరాయి. -
ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు...:అంబటి
-
ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు...:అంబటి
హైదరాబాద్ :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...'చంద్రబాబు సర్కార్ ప్రచార ఆర్భాటాలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజా ప్రయోజనాలకు ఇవ్వడం లేదు. అందుకు పట్టిసీమే ఉదాహరణ. ఎన్టీఆర్ సుజల స్రవంతిని గాలికొదిలేశారు. నారావారి సారా స్రవంతిని మాత్రం దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు...అవినీతి ప్రదేశ్. చంద్రబాబు విజన్ 2020 అంటే ఇదేనా?. కమీషన్ల కోసం కాపురాలు కూల్చొద్దు. చంద్రబాబుని మందుబాబు అని పిలిచే పరిస్థితులు వస్తున్నాయి' అని అన్నారు. -
తూర్పు’న మరో పట్టిసీమ ‘పథకం’!
విశాఖపట్నానికి నీరు తరలించేందుకే? ‘పుష్కర’ను పరిశీలించిన కలెక్టర్ అరుణ్‌కుమార్ పురుషోత్తపట్నం : మరో పట్టిసీమ ఎత్తిపోతల ‘పథకానికి’ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా? తూర్పు గోదాకరి జిల్లా అధికారుల హడావిడి చూస్తే అవునన్నట్టుగానే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమలో ఏర్పాటు చేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం లాగే, పురుషోత్తపట్నం –రామచంద్రపురం మధ్య ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, పోలవరం కాలువ ద్వారా విశాఖపట్నానికి నీరు తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పురుషోత్తపట్నంలో ఉన్న తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని గురువారం కలెక్టర్ అరుణ్‌కుమార్ పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువను పరిశీలిందచేందుకు వచ్చిన ఆయన వెంట పుష్కర ఎల్ఎంసీ సర్కిల్ ఎస్ఈ సుగుణాకరరావు కూడా ఉన్నారు. పోలవరం ఎడమ కాలువ ఏడు ప్యాకేజీలుగా ఉండగా, ఇందులో ఐదు కలెక్టర్ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో సోమా కంపెనీ నూరు శాతం పనులు చేయగా, మిగిలిన నాలుగు కంపెనీలు కేవలం 60 నుంచి 80 శాతం పనులు మాత్రమే చేసినట్టు సమాచారం. ఆయా పరిస్థితులపై కలెక్టర్ ఆరాతీసినట్టు తెలిసింది. కాగా వీటిని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయగలరా లేక కొత్త కంపెనీలకు ఇవ్వాలనే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అందుకే వీటిని పరిశీలిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. -
పట్టిసీమకు ఒక రేటు.. పోలవరానికి ఇంకోటా?
-
పట్టిసీమకు ఒక రేటు.. పోలవరానికి ఇంకోటా?
► పరిహారం విషయంలో ఎందుకు తేడా ►ముందుగా భూములు ఇచ్చినవాళ్లను అన్యాయం చేస్తున్నారు ►వాళ్లకు పరిహారం పెంచాల్సిన అవసరం లేదా ►అన్యాయం జరుగుతోందని చెబితే బురద జల్లుతున్నారు ►ముంపు మండలాల వాసుల స్థానికతను ఏం చేశారు ►ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు ►పోలవరం నిర్వాసితులకు అండగా బహిరంగ సభ కుకునూరుపల్లి: పక్కపక్కనే ఉన్న పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల పరిహారం విషయంలో వేర్వేరు ప్రమాణాలు ఎందుకు పాటిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబును వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లా కుకునూరుపల్లిలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తుంటే.. జరిగేది అన్యాయం అని చెబితే పాలకపక్షం వాళ్లు మన గోడు వినడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా గోడు వినండి, మా పరిస్థితిని చూడండి.. మేం అన్యాయంగా ఏమీ చెప్పడం లేదు, మేం అడిగేది పూర్తిగా న్యాయబద్ధమైన కోరికలే. వాటిని నెరవేర్చడానికి మనసు రాకపోవడం దారుణమని అంటున్నాం ఇక్కడికి వచ్చినపుడు భూములు కోల్పోయినవారు, ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసినవారిని ఆదుకునే విషయంలో నాలుగు అడుగులు ముందుకు వేయండి, తోడుగా నిలబడండి అని అడిగితే చంద్రబాబు ఏమన్నారో తెలుసా.. ‘పోలవరం ప్రాజెక్టు రావడం జగన్‌కు ఇష్టం లేదు’ అంటారు చంద్రబాబు అన్యాయం చేశారంటే నా మీద బురద వేయడం మామూలైపోయింది రాజధాని విషయంలో అన్యాయంగా భూములు లాక్కుని, సింగపూర్ కంపెనీలకు ఇష్టం వచ్చిన రేట్లకు ఇస్తున్నారు లంచాలు తీసుకుని వాళ్లు, మీరు వ్యాపారాలు చేస్తున్నారంటే.. అమరావతిలో రాజధాని రావడం జగన్ కు ఇష్టం లేదంటున్నారు అన్యాయం జరుగుతోంది, సరిదిద్దాలని అడిడితే బురద జల్లుతున్నారు పోలవరం రావాలన్నది రాష్ట్ర ప్రజలందరి కోరిక. అది వస్తేనే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు మొత్తం రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఆ ప్రాజెక్టు కోసం 110 కిలోమీటర్లు నేను కూడా పాదయాత్ర చేశా ఎవరూ ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు.. పోలవరం రావాలని చెప్పేవాళ్లలో అందరం ఇక్కడే ఉన్నాం పోలవరం కోసం త్యాగాలు చేసిన వీళ్లకు సరైన న్యాయం చేస్తున్నామో లేదో పాలకులు గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలి వీళ్లు అడిగే ఏ కోరిక అన్యాయం అనిపించడం లేదు పట్టిసీమలో 20 లక్షలిస్తున్నారు.. మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు అదే తమకు కూడా వర్తింపజేయాలని అడగడంలో తప్పేముంది చంద్రబాబును గట్టిగా అడుగుతున్నాం.. ఒకే జిల్లాలో పక్కపక్కనే ఉన్న ప్రాజెక్టులు ఒక్కోదానికి ఒక్కో ప్యాకేజి ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నా భూముల రిజిస్ట్రేషన్ రేట్లను ఒకేలా వర్తింపజేయాలి ఇక్కడ అన్నీ 1/70 భూములు ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ విలువ తక్కువ చూపిస్తారు సత్తుపల్లి, అశ్వారావుపేటలో ఎకరాకు 7 లక్షల మార్కెట్ రేటుఉంది.. పట్టిసీమలో 20 లక్షలు మీరే ఇస్తున్నారు ఇక్కడ మాత్రం భూముల విలువ ఎందుకు తగ్గిస్తున్నారు చింతలపూడి నుంచి పట్టిసీమ, పోలవరం అన్నీ పక్కపక్కనే ఉన్నాయి పట్టిసీమకు అమలుచేసిన ప్యాకేజిని అందరికీ వర్తింపజేయాలి వీళ్ల భూములు 8, 9 ఏళ్ల క్రితం ఎకరాకు 1.15 లక్షల చొప్పున ఇచ్చి అప్పట్లో తీసుకున్నారు ఇది అప్పటి రేటు.. ఇప్పుడు 20 లక్షల వరకు చేరింది. ఎక్కడైనా కొనాలంటే ఆ 20 లక్షలు పెడితే తప్ప ఎకరా భూమి కూడా దొరకట్లేదు మా పరిస్థితి ఏంటి.. కాస్తో కూస్తో మాకు కూడా పరిహారం పెంచి ఇవ్వక్కర్లేదా అని అడుగుతున్నారు ఈ ప్రాజెక్టు కోసం మొదటి వరుసలో నిలబడి భూములు ఇచ్చినవాళ్లు ఉన్నారు 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 20 నుంచి సెక్షన్ 30 వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఐదేళ్ల వరకు ఎటువంటి వినియోగం చేయకపోతే భూములను తిరిగి వెనక్కి ఇవ్వాలి. అలా కూడా అక్కర్లేదు.. తమకు పరిహారం పెంచాలని మాత్రమే వీళ్లు అడుగుతున్నారు పట్టిసీమలాగ ఎకరానికి 20 లక్షలు కూడా అడగడం లేదు, అప్పుడిచ్చిన దానికి 5 లక్షలు పెంచి ఎక్స్‌గ్రేషియా ఇస్తే చాలని చాలా న్యాయంగా అడుగుతున్నారు పోలవరం ప్రాజెక్టు అంచనా 32 వేల కోట్లు అంటున్నారు. ఇలా భూములు ఇచ్చినవాళ్లకు కాస్తో కూస్తో ఇస్తే ప్రాజెక్టు మొత్తం విలువలో అది 5 శాతం కూడా ఉండదు కదా భూములు ఇచ్చినవాళ్ల ముఖంలో చిరునవ్వు ఉండాలి, వీళ్ల త్యాగాలు మర్చిపోకూడదు భూములన్నీ కోల్పోయినా పోలవరానికి వీళ్లు అండగా నిలబడుతున్నారు పోడు భూములు, అసైన్డ్ భూములు, ఏ పేరైనా సరే.. ప్రభుత్వం మాకు ఆ భూములు ఇచ్చిన తర్వాత అవి మావే కాబట్టి ప్రైవేటు భూములకు ఇచ్చిన రేటు, పరిహారం మాకు కూడా ఇవ్వాలి కదా అని కోరుతున్నారు వాళ్లు నిరుపేదలు కాబట్టే ఆ భూములు ఇచ్చారు. అలాంటి పేదలకు కాస్తో కూస్తో ఎక్కువ ఇవ్వాలి గానీ తగ్గిస్తే ఎలా వీళ్లకు ఇస్తున్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కేవలం 2, 3 లక్షలు దాటడం లేదు.. దాంతో ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు కొత్త ఇల్లు కట్టుకోవాలంటే 5 సెంట్ల స్థలానికి కూడా సరిపడ మొత్తం రావట్లేదు. కనీసం 10 లక్షల ప్యాకేజి ఇవ్వాలని వాళ్లు అడిగేది న్యాయబద్ధంగానే ఉంది ముంపు మండలాలు ఏపీలో చేరి రెండేళ్లయింది. ఇప్పటికీ వాళ్లకు సంబంధించిన స్థానికత సమస్య తేలలేదంటే ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలి స్థానికత ఇవ్వకపోవడంతో పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంటు, ప్రభుత్వ పథకాలు అందడం లేదు పిల్లలు డీఎస్సీ రాయాలన్నా, ఇంకేం రాయాలన్నా ఏ రాష్ట్రం వాళ్లో తెలియడం లేదు ఉద్యోగాల విషయంలో కూడా తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలూ వీళ్లను కాదంటున్నాయి ప్రతి విషయంలోనూ ప్రభుత్వం చేయగలిగిన పనులు కూడా చేయడం లేదు ఇంతమంది ఉసురు పోసుకుని నువ్వు సాధించేదేంటి బాబూ? 20 మంది ఎమ్మెల్యేలకు 30 కోట్ల చొప్పున కొన్నావు.. అంటే 600 కోట్లు ఖర్చుపెట్టావు ఎక్కడికి వెళ్లినా ప్రైవేటు విమానం తప్ప మామూలు విమానం ఎక్కడం లేదు బాబు పాలనలో ఏది చూసినా టెంపరరీ బిల్డింగులే. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక నివాసం.. చివరకు చంద్రబాబు ఇళ్లకు, ఆఫీసులకు చేసిన మరమ్మతల ఖర్చు లెక్క వేసుకుంటే 100 కోట్లు అవుతుంది కన్సల్టెన్సీలకు ఇంత, నాకింత అని చెప్పి ఈ రెండేళ్లలో 300 కోట్లు ఇచ్చారు ఈ డబ్బు కాస్త ఇటువైపు మళ్లిస్తే పోలవరం ప్రాజెక్టులో ప్రతి ఒక్కరూ ఆనందంగా ముందుకు వచ్చేవాళ్లు పోలవరం ప్రాజెక్టును కూడా బాబు అడ్డగోలుగా నాశనం చేస్తున్నారు దీని గురించి కేంద్రం లేఖలు రాస్తోంది.. కాంట్రాక్టరు పనులు సరిగా చేయడంలేదని, మార్చాలని చెప్పింది చంద్రబాబు మాత్రం ఆ కాంట్రాక్టరు తన బినామీ కాబట్టి మార్చే ప్రసక్తి లేదంటున్నారు కేంద్రాన్ని మోసం చేస్తూ.. పోలవరం ప్రాజెక్టులో లంచాల కోసం సబ్ కాంట్రాక్టరును కూడా తెచ్చుకుంటున్నారు వాళ్ల ద్వారా కోట్లకు కోట్లు దండుకుంటున్నారు చివరకు కేంద్రం కూడా ఈ దోపిడీని చూసి పోలవరం ప్రాజెక్టుకు సపోర్ట్ విషయంలో నాలుగడుగులు వెనక్కి వేస్తున్నారు దేశంలోనే ఇంత దారుణమైన సీఎం ఎవరూ ఉండి ఉండరు ఈ రెండేళ్లలో బాబు చేసింది సున్నా మీరు అడుగుతున్నవన్నీ చదివాను.. అవన్నీ సమంజసమైనవే పొరపాటున ఏదైనా మీకు అందకపోతే నిరాశ పడక్కర్లేదు మీరు ప్రాజెక్టుకు తోడుగా ఉండండి.. చంద్రబాబు ప్రభుత్వం ఎల్లకాలం సాగదు మరో రెండేళ్లకో, సంవత్సరానికో మన ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ పూలలో పెట్టి మీకు అందించి మీ ముఖాల్లో చిరునవ్వు చూస్తా పోలవరం ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం చంద్రబాబు మీద పోరాటం మాత్రం కొనసాగిస్తాం దానికి దేవుడి దయ కావాలి.. మీరంతా చంద్రబాబు ప్రభుత్వం పోవాలని కోరుకోవాలి కడుపునిండా బాధ ఉన్నా చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయత చూపిస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు -
పట్టీసీమ నీళ్ళెక్కడ?
-
పట్టిసీమ నీళ్లెక్కడ ?
-
‘పరిశ్రమలకు నీటిని అమ్ముకోవాలని చూస్తోంది’
ఏలూరు: పట్టిసీమ ప్రాజెక్టు నుంచి రాయలసీమకు నీటిని తరలిస్తానని చెబుతున్న టీడీపీ సర్కారు రాజధాని ప్రాంతంలోని పరిశ్రమలకు నీటిని అమ్ముకోవాలని చూస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ సీసీ నాయకుడు ఆళ్ల నాని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు పెట్టిన రూ.1500 కోట్ల ఖర్చును పోలవరంకు పెట్టివుంటే ప్రాజెక్టు ముందుకెళ్లేదన్నారు. గోదావరి రైతుల పొట్టకొట్టి అడ్డగోలుగా నీటిని తరలించుకుపోతున్నారని విమర్శించారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని ఆళ్ల నాని అన్నారు. -
ఏడాదిలోగా లక్ష ఎకరాలు
బందరు పరిధిలోని 29 గ్రామాల్లో భూముల సమీకరణ..రాజధాని ప్యాకేజీయే ఇక్కడా అమలు - రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు - మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి అధికారాలు - డీప్ వాటర్ సీ పోర్టు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు - పట్టిసీమ ప్రాజెక్టులో పనిచేసిన వారికి ఇంక్రిమెంట్ - అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న భూసేకరణ, భూసమీకరణలపై పెద్దఎత్తున ఆందోళనలు వెల్లువెత్తుతున్నా లెక్కచేయని ప్రభుత్వం తాజాగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఏకంగా లక్షా ఐదు వేల ఎకరాలను భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఇందులో 22 వేల ఎకరాలు మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు కోసం, మిగతాభూమి పారిశ్రామిక కారిడార్, తదితర అవసరాల కోసం కేటాయించాలని నిర్ణయించారు. 29 గ్రామాల్లో ఈ భూమినంతటినీ మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) ద్వారా ఏడాదిలోపు తీసుకోనుంది. రాజధాని రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇక్కడా ఇవ్వనున్నారు. రాజధానికి 33 వేల ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం పోర్టు, పారిశ్రామిక కారిడార్‌కు దానికి రెండు రెట్ల భూమిని తీసుకోవాలనుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మంత్రివర్గంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మీడియాకు వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ► మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం 30 వేల ఎకరాలను భూసేకరణ ద్వారా సేకరించాలని గత ఏడాదే నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో వెనక్కు తగ్గింది. భూసేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పోర్టుకు అవసరమైన 30 వేల ఎకరాలతోపాటు పారిశ్రామిక కారిడార్, ఇతర ప్రాజెక్టులకు కావాల్సిన మరో 70 వేల ఎకరాలు కలుపుకుని మొత్తం లక్షా ఐదు వేల ఎకరాలను భూసమీకరణ ద్వారా సేకరించాలని నిర్ణయించింది. పెడన మండలంలోని ఒక గ్రామం, మచిలీపట్నం మండలంలోని 28 గ్రామాల్లోని 426 చదరపు కిలోమీటర్ల భూమిని మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) ద్వారా సేకరించనుంది. వచ్చే ఏడాది జూలైలోపు ఈ భూమిని సేకరించాలని గడువు విధించింది. కృష్ణా డెల్టా పరిధిలోని ఈ లక్షా ఐదు వేల ఎకరాల్లో రెండు పంటలు పండుతాయి. వరి పండే తమ భూములను భూసేకరణకు ఇచ్చేది లేదని అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం రూటు మార్చి భూసమీకరణ పేరుతో వారి ముందుకు వెళ్లడానికి సిద్ధమవడం గమనార్హం. ఈ సమీకరణపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు రఘునాథ్‌రెడ్డి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాట వేశారు. కృష్ణా డెల్టా కింద ఉన్న ఈ భూములను మెట్ట భూములని ఆయన చెప్పడం విశేషం. ► పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసిన ఇంజినీరింగ్, నీటిపారుదల శాఖ అధికారులు, ఉద్యోగులకు మంత్రివర్గం అభినందనలు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన ఉద్యోగులందరికీ ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయం. ఇదే స్పూర్తితో పోలవరం ప్రాజెక్టును 2018 కల్లా పూర్తి చేయాలి. ప్రతి నెలా మంత్రివర్గంలో ఈ ప్రాజెక్టుపై చర్చించి ప్రతి వారం సమీక్షించాలి. ప్రతి నెలా ముఖ్యమంత్రి ప్రాజెక్టును సందర్శించాలి. ► రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న 15,745 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంపు. ప్రస్తుతం కనిష్టంగా ఉన్న రూ.6,700 వేతనాన్ని రూ.11,500కి, గరిష్టంగా ఉన్న రూ.12 వేలను రూ.17,500కి పెంచుతూ నిర్ణయం. వచ్చే నెల నుంచి ఇవ్వాలని ఆదేశం. ► ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) పార్కు ఏర్పాటుకు వంద ఎకరా ల భూమి కేటాయించేందుకు సమ్మతి. ఇప్పటికే 117 నియోజకవర్గాల్లో 18,340 ఎకరాల గుర్తింపు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే తరహాలో భూమిని సేకరించాలి. ఈ భూములను లేఅవుట్లుగా మార్చి రోడ్లు, విద్యుత్, త్రాగునీటి సౌకర్యాలు కల్పించి చిన్న పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు అనుమతి. ► ప్రైవేటు యూనివర్సిటీల చట్టం ప్రకారం అమిత్, ఎస్ఆర్ఎం, విట్, సెంచురియన్, ఫిషరీస్ అండ్ ఓషన్ యూనివర్సిటీల ఏర్పాటుకు సుముఖత. వీటికి ఎల్ఓఐ (లెటర్ ఆఫ్ ఇంటెన్షన్) ఇచ్చేందుకు అంగీకారం. మొదటి మూడు వర్సిటీలకు రాజధానిలో, షిషరీస్ వర్సిటీకి భీమవరంలో భూమి ఇచ్చేందుకు సమ్మతి. సెంచురియన్ వర్సిటీకి విజయనగరంలో సొంతంగా భూమి ఉండడంతో ఏర్పాటుకు అనుమతి. వాటర్, ఎనర్జీ, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, స్పోర్ట్స్, ఫిషరీస్ యూనివర్సిటీలను ఆయా శాఖలు పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి. ► ఒంగోలు ట్రిపుల్ ఐటీని 2016-17 సంవత్సరానికి తాత్కాలికంగా ఆ నగరంలోని ఆర్కే వ్యాలీలో ఏర్పాటుకు అంగీకారం. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీని తాత్కాలికంగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించేందుకు అనుమతి. రెండు క్యాంపస్‌లలో వెయ్యి మంది పిల్లలతో ప్రారంభించేందుకు అంగీకారం. ► ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఏర్పాటుకు నిర్ణయం. ప్రతి జిల్లాకూ బ్రాంచి, వాటి ద్వారా కాలేజీ, స్కూళ్లలోనూ ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటు. ఇందుకోసం కొత్త ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్ విధానం అమలు. జిల్లా కేంద్రాల్లో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అధికారుల నియామకం. ప్రతి శాఖలో ఇన్నోవేషన్ విభాగాలు ఏర్పాటు. మరికొన్ని నిర్ణయాలు ఇవీ... రాష్ట్రంలో గతంలో ఏర్పాటైన సెజ్‌లపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం మరోవైపు ఆ సెజ్‌లను విస్తరించేందుకు భారీగా భూములు కేటాయించింది. విశాఖజిల్లాలోని సెజ్‌ల విస్తరణకు భూములివ్వాలని నిర్ణయించింది. సెజ్‌లతోపాటు రాష్ట్రంలోని పలు ప్రైవేటు సంస్థలకు,కొన్ని ప్రభుత్వ శాఖలకూ భూములు ఇవ్వాలని తీర్మానించింది. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో భూముల కేటాయింపులు చేశారు. రాష్ట్రంలో నాలుగు బీఎస్సీ హార్టీకల్చర్ కాలేజీల ఏర్పాటుకు సమ్మతిస్తూ, పలు శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్కూల్ అసిస్టెంట్లుగా లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు ► రాష్ట్రంలోని గ్రేడ్-2 లాంగ్వేజ్ పండిట్లు, జెడ్పీ స్కూళ్లలో పనిచేస్తున్న పీఈటీలను స్కూల్ అసిస్టెంట్ క్యాడర్‌కు అప్‌గ్రేడ్ చేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. ► 2017 జూన్ రెండో తేదీలోపు ఏపీలో తమ పేర్లు ఎన్రోల్ చేసుకుని సెల్ప్ డిక్లరేషన్ ఇచ్చిన వారికి ఇక్కడి స్థానికతను వర్తింపజేయాలని మంత్రివర్గం తెలిపింది. -
చంద్రబాబుపై మోపిదేవి ఫైర్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. గురువారం గుంటూరులో మోపిదేవి వెంకటరమణ విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రబాబు పట్టిసీమను ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కమీషన్ కోసమే పట్టిసీమ తప్ప... ప్రజలకు ఏ ప్రయోజనం ఉండదని మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. పట్టిసీమను బుధవారం చంద్రబాబు మూడోసారి ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
మూడోసారి ప్రారంభం ఓ నాటకం
వైఎస్సార్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ధ్వజం సాక్షి, హైదరాబాద్ : పట్టిసీమ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముచ్చటగా మూడోసారి ప్రారంభించడం ఒక నాటకమని, ఇది ముడుపుల కోసం చేపట్టిందే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. బుధవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్చి 2015లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును అదే ఏడాది సెప్టెంబర్‌లో తొలిసారి చంద్రబాబు ప్రారంభించారన్నారు. ఆ సమయంలో నాలుగు పంపులు పని చేస్తాయని చెప్పారన్నారు. ఆ తర్వాత ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పడం కోసం 2016 మార్చిలో మరోసారి ప్రారంభించారన్నారు. మళ్లీ ఇపుడు 24 పంపులతో పని చేయిస్తున్నామని చెబుతూ మూడోసారి ప్రారంభించారన్నారు. ఒక ప్రాజెక్టును ఇన్నిసార్లు ప్రారంభించడం చంద్రబాబుకే చెల్లిందని, ఈ నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇటు ఆన్ చేయగానే.. అటు ఆపేశారు చంద్రబాబు స్విచ్ ఆన్ చేయగానే విడుదలయ్యే నీరు 66 కిలోమీటర్ల తర్వాత ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితిలో కెమెరాలు, వీడియోలతో ప్రచారార్భాటం ముగిశాక ఇంజినీర్లు పంపులను ఆపేశారని పద్మ పేర్కొన్నారు. వెయ్యి కోట్లు ముడుపులు కేవలం ముడుపుల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారని పద్మ దుయ్యబట్టారు. రూ 1300 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టును ఏడాది గడువు లోపు నిర్మించక పోయినా నిర్మించినట్లు న మ్మించేందుకు ప్రారంభోత్సవాలు చేసి కాంట్రాక్టరుకు 21 శాతం అదనంగా నిధులు చెల్లించారని ఆమె మండిపడ్డారు. ఈ వ్యవహారంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని, టీడీపీ పెద్దల జేబుల్లోకి ముడుపులు వెళ్లాయన్నారు. -
‘మూడో’ ముచ్చట
పట్టిసీమ ఎత్తిపోతలను మూడోసారి ప్రారంభించిన చంద్రబాబు - ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసిన రెండు గంటలకే మోటార్ల నిలిపివేత - పోలవరం కుడికాలువ పనులు పూర్తి కాకపోవడమే కారణం - మీడియాలో వార్తలతో 2 మోటార్లను పాక్షికంగా ఆన్ చేసిన అధికారులు - దశలవారీగా నీటిని వదులుతామని ముఖ్యమంత్రి ప్రకటన - గతంలో రెండుసార్లు పట్టిసీమను ప్రారంభించిన చంద్రబాబు సాక్షి ప్రతినిధి, ఏలూరు : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి మూడోసారి నీటి విడుదల రెండుగంటల ముచ్చటగానే ముగిసింది. ఈ ప్రాజెక్ట్‌ను ఏడాదిలో పూర్తి చేయడం తనకు కిక్కు ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన కొద్దిసేపటికే ఆ కిక్కు దిగిపోయేలా అధికారులు మోటార్లు నిలిపివేశారు. ముఖ్యమంత్రి లాంఛనంగా 24 మోటార్లను ఆన్‌చేసి, ఇటుకులకుంట వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి, గోదావరి జలాల్లో పూలు చల్లి వెళ్లిన కొద్దిసేపటికే మోటార్లను అధికారులు ఆపివేశారు. ఆయన పోలవరంలో సమీక్షలో ఉండగానే పట్టిసీమ నీటి విడుదల ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ పనులు పూర్తికాకపోయినా గోదావరిలోకి వరద నీరు రావడంతో పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలోని ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకున్నారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 24 మోటార్లను ఆన్ చేశారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి నేరుగా ఇటుకులకుంట వద్ద పోలవరం కుడి కాలువలో గోదావరి జలాలు కలిసే పాయింట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నీటిప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం పూజలు చేసి కాలువలో పూలు చల్లారు. ముఖ్యమంత్రి అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు వెళ్లిన కొద్దిసేపటికే అధికారులు ఎత్తిపోతల పథకం మోటార్ల స్విచ్ ఆఫ్ చేశారు. ముచ్చటగా మూడోసారి బుధవారం నిర్వహించిన ట్రయల్ రన్ కూడా రెండు గంటలకే ఆగిపోయిందని మీడియాలో వార్తలు రావడంతో రాత్రి పొద్దుపోయిన తరువాత రెండు మోటార్లను పాక్షికంగా ఆన్ చేశారు. గతేడాది ఆగస్టు 15న పట్టిసీమను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి, ఈ ఏడాది మార్చి 28న పట్టిసీమ పంపులకు ట్రయల్ రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పూర్తికాని పనులు పట్టిసీమ నీరు తీసుకెళ్లాల్సిన పోలవరం కుడి కాలువ పనులు పూర్తికాలేదు. జానంపేట వద్ద అక్విడెక్ట్తోపాటు కృష్ణా జిల్లాలో రామిలేరుపై అక్విడెక్ట్ పనులు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో నీటి ప్రవాహం వస్తే అవి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. గత ఏడాది కూడా జానంపేట వద్ద అక్విడెక్ట్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాంఛనంగా నీటి విడుదలను ప్రారంభించిన కొద్దిసేపటికే కట్టివేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రష్యా పర్యటనకు వెళ్తున్నారు. ఆయన పర్యటన ముగించుకుని వచ్చేనాటికి పట్టిసీమ నీరు ప్రకాశం బ్యారేజి వరకూ చేరుకుంటే అక్కడ పవిత్ర నదీ సంగమం పేరిట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిదానంగా నీటిని వదలాలని నిర్ణయించారు. కాలువ కొత్తగా కట్టిందని, దానిపై కట్టడాలు కూడా కొత్తవి కావడంతో క్రమపద్ధతిలో నీటిని విడుదల చేస్తామని, దీన్ని వివాదం చేయకుండా ఉండేందుకు ముందుగానే చెబుతున్నానని ముఖ్యమంత్రి ప్రకటించారు. పట్టిసీమ పూర్తవడం కిక్ ఇచ్చింది: సీఎం ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఏడాది కాలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం తనకు కిక్ ఇచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ స్ఫూర్తితోనే త్వరలో పోలవరం ఎడమ కాలువపైనా ఎత్తిపోతల పథకం నిర్మించే విషయమై ఆలోచన చేస్తున్నామని తెలిపారు. పట్టిసీమ మోటార్లు ప్రారంభించాక గోదావరి జలాలు పోలవరం కుడి కాలువలో కలిసే ఇటుకులకుంట వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నో దశాబ్దాల కల నేడు సాకారమవుతోందన్నారు. ఏడాదిలోనే పట్టిసీమ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం గిన్నిస్ రికార్డు అని తెలిపారు. గోదావరి డెల్టాకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వకుండా ఈ ఏడాది 85 టీఎంసీల నీటిని కృష్ణాడె ల్టాకు తీసుకువెళ్తామని చెప్పారు. అక్కడినుంచి కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమకు తీసుకువెళ్లే విషయంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదావరి, కృష్ణా, పెన్నా, అనంతరం సోమశిల ఇలా నదులను అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రజల సాగు, తాగు అవసరాలు తీర్చడంతోపాటు చెన్నై వాసులకు కృష్ణా జలాలతోపాటు గోదావరి జలాలను సరఫరా చేస్తామని వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం రాష్ట్రానికే మణిహారమని, దీనిని కూడా పట్టిసీమ మాదిరిగానే పూర్తి చేస్తామని సీఎం చెప్పారు. 2018 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. -
పట్టిసీమపై పక్కదారి
పట్టిసీమ ప్రాజెక్టు నుంచి సీఎం చంద్రబాబు పోలవరం కాలువకు బుధవారం నీటిని విడుదల చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఈ నీరు కృష్ణానదిలో చేరుతుందని పాలకులు ప్రకటించారు. అయితే పోలవరం కాలువ పనులు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. నూజివీడు మండలంలోని రామిలేరు వద్ద చేపట్టిన అండర్ టన్నెల్, గన్నవరం మండలం కొత్తగూడెం వద్ద చీమలవాగు యూటీ పనులు పూర్తికాలేదు. -
మూడోసారీ రెండు గంటల ముచ్చటే
సాక్షి ప్రతినిధి, ఏలూరు(పశ్చిమగోదావరి): పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి మూడోసారి నీటి విడుదల రెండుగంటల ముచ్చటగానే ముగిసింది. ఈ ప్రాజెక్ట్‌ను ఏడాదిలో పూర్తి చేయడం తనకు కిక్కు ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన కొద్దిసేపటికే ఆ కిక్కు దిగిపోయేలా అధికారులు మోటార్లు నిలిపివేశారు. ముఖ్యమంత్రి లాంఛనంగా 24 మోటార్లను ఆన్‌చేసి, ఇటుకులకుంట వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి, గోదావరి జలాల్లో పూలు చల్లి వెళ్లిన కొద్దిసేపటికే మోటార్లను అధికారులు ఆపివేశారు. ఆయన పోలవరంలో సమీక్షలో ఉండగానే పట్టిసీమ నీటి విడుదల ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ పనులు పూర్తికాకపోయినా గోదావరిలోకి వరద నీరు రావడంతో పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలోని ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకున్నారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 24 మోటార్లను ఆన్ చేశారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి నేరుగా ఇటుకులకుంట వద్ద పోలవరం కుడి కాలువలో గోదావరి జలాలు కలిసే పాయింట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నీటిప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం పూజలు చేసి కాలువలో పూలు చల్లారు. ముఖ్యమంత్రి అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు వెళ్లిన కొద్దిసేపటికే అధికారులు ఎత్తిపోతల పథకం మోటార్ల స్విచ్ ఆఫ్ చేశారు. ముచ్చటగా మూడోసారి బుధవారం నిర్వహించిన ట్రయల్ రన్ కూడా రెండు గంటలకే ఆగిపోయిందని మీడియాలో వార్తలు రావడంతో రాత్రి పొద్దుపోయిన తరువాత రెండు మోటార్లను పాక్షికంగా ఆన్ చేశారు. గతేడాది ఆగస్టు 15న పట్టిసీమను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి, ఈ ఏడాది మార్చి 28న పట్టిసీమ పంపులకు ట్రయల్ రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. -
'ఒక పథకాన్ని మూడుసార్లు ప్రారంభిస్తారా?'
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టిసీమ పథకాన్ని చంద్రబాబు ముచ్చటగా మూడోసారి ప్రారంభించారన్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఒక పథకాన్ని ఇన్నిసార్లు ఎక్కడైనా ప్రారంభించారా అని వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. ఓ వైపు ముఖ్యమంత్రి మోటర్లు ఆన్ చేయగానే మరోవైపు ఇంజినీర్లు వెంటనే స్విచ్ ఆఫ్ చేశారని అన్నారు. 60 కిలోమీటర్లు దాటితే నీళ్లు వెళ్లే పరిస్థితి లేదని, అందుకే ఇంజినీర్లు వెంటనే ఆపేశారని ఆమె పేర్కొన్నారు. ఇదే చిత్తశుద్ధి పోలవరంపై చూపితే ప్రాజెక్ట్ సగం పూర్తయ్యేదని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వలేని సీఎం రాయలసీమకు ఎక్కడ నుంచి ఇస్తారన్నారు. ప్రజలను నమ్మించడం కోసం చేస్తున్న ఆర్భాటాల వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పోతోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. -
'నాగావళి, వంశధారనూ అనుసంధానం చేస్తాం'
ఏలూరు : కృష్ణా, పెన్నానదులు అనుసంధానానికి ఆలోచన చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ఎడమకాల్వను ఏడాదిలోకాగా పూర్తి చేసి... సోమశిలకు నీటిని తరలిస్తామన్నారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల నుంచి చంద్రబాబు నీటిని విడుదల చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... 24 పంపులు, 12 పైప్లైన్ల ద్వారా పట్టిసీమ నుంచి నీరు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. మరో ఐదారు రోజుల్లో గోదావరి నీళ్లు కృష్ణా నదిలో కలుస్తాయని తెలిపారు. నాగావళి, వంశధార నదులనూ కూడా అనుసంధానం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. -
పొగాకు రైతులకు చేదు అనుభవం
ఏలూరు: పట్టిసీమ వద్ద పొగాకు రైతులకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ను కలిసేందుకు వచ్చిన రైతులకు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లనివ్వకుండా అడ్డుకున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేసిన సీఎం
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేశారు. 24 పంపుల ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని ఆయన విడుదల చేశారు. అంతకుమందు.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పట్టిసీమ వద్ద పొగాకు రైతులకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. కనీసం తమ సమస్యను సీఎంకు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడంలేదని పొగాకు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పట్టిసీమ జపం మానండి బాబూ..!
నేడు పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీళ్లు విడుదల చేయనున్నారు. అయితే సిద్ధేశ్వరం ద్వారానే పోతిరెడ్డిపాడు తూముల నుంచి రాయలసీమకు నీరందుతుందనే నిజాన్ని గ్రహించి, పట్టిసీమ జపం మాని, సీమకు నీరందించే మార్గం వైపు సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలి. లేదంటే శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్టుగా మరో సీమ ఉద్యమాన్ని చవిచూడక తప్పదు. ఈనెల 6వ తేదీన పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీళ్లు విడుదల చేస్తున్నట్టు చంద్ర బాబు ప్రకటించారు. పట్టి సీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణకు మళ్లించి రాయలసీమకు మేలు చేస్తు న్నామని పదే పదే తెలుగు దేశం ప్రభుత్వం ఊదరగొడు తున్నది. పట్టిసీమ ప్రభుత్వ ఉత్తర్వులో రాయలసీమకు నీళ్లు ఇస్తున్నట్టు ఎక్కడా చెప్పలేదు. కానీ, రాయల సీమకు పట్టిసీమ ద్వారా నీరందిస్తామని నమ్మించడానికి ప్రయత్నిస్తోంది. శుష్క వాగ్దానాలతో రాయలసీమ వాసుల్ని వంచించడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడడం లేదు. రాయలసీమకు కృష్ణా జలాలను తరలించేందుకు ఉన్న ఏకైక మార్గం పోతిరెడ్డిపాడు. ఈ పోతిరెడ్డిపాడు తూముల ద్వారా నీరు విడుదల చేయాలంటే శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 841 అడుగులపైన ఉండాలి. అయితే, శ్రీశైలం జలాశయంలో 854 అడుగు లకు పైన ఉంటేనే రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే నిబం ధన ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1996లో జీవో నంబరు 69 ద్వారా శ్రీశైలం కనీస నీటి మట్టపు స్థాయిని 834 అడుగులకు కుదించింది. ఈ 69వ నంబరు జీవోను రద్దుచేసి తిరిగి 854 అడుగుల కనీస నీటిమట్టం స్థాయిని ఉంచితే తప్ప పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు అందవు. 1996కు ముందు కనీస నీటి మట్టపు స్థాయి 854 అడుగులు ఉండేది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటిమట్టం స్థాయి ఉండేలా జీవో తీసుకువస్తే, టీడీపీ వర్గం తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి తిరిగి 834 అడుగుల స్థాయిలో ఉండేట్టుగా జీవోను తీసుకు వచ్చింది. రాయలసీమ ప్రాంతానికి నీరు అందించే చాలా పథకాలకు శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు తూముల ద్వారా మాత్రమే నీరు తీసుకోవాల్సి ఉంటుంది. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు కొన్ని నికర జలాల మీద, మరికొన్ని మిగులు జలాల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ నీళ్లయినా పోతిరెడ్డిపాడు తూముల ద్వారానే రావాల్సి ఉంటుంది. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండినప్పుడు దాని పూర్తి స్థాయి 885 అడుగులు ఉంటుంది. జీవో 69 ప్రకారం జలాశయం కనీస నీటి విడుదల మట్టం (మినిమం డ్రాడౌన్ లెవెల్) 834 అడుగులు. శ్రీశైలం జలాశయం ఎగువ భాగంలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అడుగు భాగం మట్టం (సిల్ లెవెల్) 842 అడుగులు. రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా నీరందా లంటే క్యారీ ఓవర్ రిజర్వాయర్‌గా శ్రీశైలం రిజర్వాయరు లోనే పైభాగంలో కృష్ణానదిపై 860 అడుగుల సిల్ లెవెల్‌తో ఒక అలుగు నిర్మించాలి. ఇదే సిద్దేశ్వరం అలుగు. ఈ అలుగు శ్రీశైలం డ్యాంకు సుమారు 90 కిలోమీటర్ల పై భాగాన ఉంటుంది. ఈ అలుగు 600 మీటర్లకు మించి లేదు. ఖర్చు 600 కోట్ల రూపాయలు కూడా కాదు. ఈ అలుగు వల్ల 50 టీఎంసీల నీళ్లు నిలువ చేయవచ్చు. దీనివల్ల పోతిరెడ్డిపాడు ద్వారా రాయల సీమకు నీళ్లందివ్వడం తేలిక. తెలంగాణ ప్రాంతానికి 90 రోజులపాటు నీరు తీసుకుపోయే అవకాశం జీవో నంబర్ 69 ఇస్తున్నది. 825, 802 సిల్ లెవెల్ గల శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ), కల్వకుర్తిలకు ఏ ఇబ్బందీ లేదు. నాగా ర్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ ఉన్న కోస్తా ప్రాంతానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. కృష్ణానది పోటెత్తి ప్రవహించినప్పుడు సీమకు నీరు తీసుకెళ్లడంలో విఫలమైన బాబు ప్రభుత్వం.. గోదావరి నీటిని మళ్లించడం ద్వారా కృష్ణా డెల్టాలో మిగిలే నీటిని సీమలో వినియోగించుకుంటామని చెప్పడం విడ్డూరం. దీనికే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు ప్రజ లను మభ్యపెడుతోంది. నిజానికి గోదావరి, కృష్ణా నదులు రెండింటిలో దాదాపు ఒకే సమయంలో వరద లొస్తాయి. కృష్ణాలో వరదలు ఉన్నప్పుడు గోదావరి నీటిని లిఫ్ట్ చేయవలసిన అవసరం లేదు. అలాగే కృష్ణా డెల్టాకు నీటి అవసరం ఉన్నప్పుడు గోదావరిలో వరద లేకపోతే లిఫ్ట్ చేయడానికి అవకాశమూ ఉండదు. అంటే కృష్ణా డెల్టాకే గోదావరి నీటి తరలింపుపై గ్యారంటీ లేదు. కానీ గోదావరి నీటిని కృష్ణా డెల్టా అవసరాలకు వాడి, అక్కడ మిగిలే కృష్ణా నికరజలాలను శ్రీశైలం నుంచి సీమకు నీళ్లిస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యా స్పదం. సీమపై నిజంగానేబాబుకు చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా సామర్థ్యానికి అనుగు ణంగా కాలువలను సిద్ధం చేయాలి. దీన్ని విస్మరించి పట్టిసీమతో సీమకు నీళ్లిస్తామంటే అంతకు మించిన నయవంచన మరొకటి లేదు. పట్టిసీమ, పట్టిసీమ అని రాయలసీమ వాసులను మోసగించవద్దు. రాయలసీమ వాసులకు వాస్తవాలు తెలుసు. తమకు నీళ్లు ఎట్లా వస్తాయో తెలుసు గనుకనే ‘సిద్ధేశ్వరం అలుగు - రాయలసీమకు వెలుగు’ అనే నినా దంతో దాదాపు 30 వేల మంది రైతులు ఇటీవలే కృష్ణా నదిలో కవాతు చేసిన సంగతి తెలుగుదేశం ప్రభుత్వం మరవద్దు. అటు తెలంగాణకుగాని, ఇటు కోస్తా ప్రాంతా నికిగాని ఏ ఇబ్బందీ లేని జీవో నంబరు 69 రద్దు చేయడంతోపాటు, సిద్ధేశ్వరం ద్వారానే పోతిరెడ్డిపాడు తూముల నుంచి రాయలసీమకు నీరందుతుందనే నిజాన్ని గ్రహించి, పట్టిసీమ జపం మాని రాయల సీమకు నీరందించే అంశంపై చంద్రబాబు దృష్టి పెట్టాలి. లేదంటే శ్రీకృష్ణ కమిటీ కరాఖండిగా చెప్పినట్టుగా మరో రాయలసీమ ఉద్యమాన్ని చవిచూడక తప్పదు. వ్యాసకర్త అధ్యక్షుడు, రాయలసీమ - భూమన్, అధ్యయనాల సంస్థ 90107 44999 -
అమరావతిలో 2018 ఒలింపిక్స్
విస్తుపరిచిన సీఎం ప్రకటన సాక్షి, విశాఖపట్నం : అమరావతిలో 2018 ఒలింపిక్స్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. శనివారం సాయంత్రం విశాఖ సాగరతీరంలో నైట్ బే మారథాన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ అమరావతిలో ఆసియా గేమ్స్ జరగ నున్నాయని మొదట చెప్పిన ఆయన.. ఆ వెంటనే ఒలింపిక్స్ గేమ్స్ జరగబోతున్నాయన్నారు. దీంతో అంతా విస్తుపోయారు. వాస్తవానికి వచ్చే నెల 5న బ్రెజిల్ దేశంలో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ప్రతి నాలుగేళ్లకోసారి నిర్వహించడం, వేదికలను ముందే ఖరారు చేయడం ఆనవాయితీ. అలా 2020లో టోక్యోలో, 2024లో రోమ్‌లో వీటిని నిర్వహించాలని ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ ఖరారు చేసింది. అలాంటప్పుడు 2018లో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని సీఎం ఎలా ప్రకటించారో అర్థంగాక జనం తలలు పట్టుకున్నారు. అనంతరం 10కె రన్ విభాగంలో విజేతగా నిలిచిన తెలంగాణ లోని నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన యువతి నవ్యా పటేల్‌కు రూ.50 వేలను అందజేశారు. పాల్మాన్పేట ఘటనపై విచారణ: సీఎం విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పాల్మాన్పేట ఘటనపై విచారణ జరిపిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం విశాఖ వచ్చిన చంద్రబాబును బాధితులు కలిసి వివరించారు.దీనికి స్పందించిన సీఎం ఘటనపై విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50 వేలు చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని చెప్పారు. కొత్తగా బోర్లు వేయకుండా నిషేధం సాక్షి, విజయవాడ బ్యూరో: భూగర్భజలాలను పరిరక్షించేందుకు అవసరమైతే కొత్తగా బోర్లు వేయకుండా నిషేధం విధిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో వర్షపునీటి వినియోగం, భూగర్భజలాల గురించి మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైపుల నుంచి ఈనెల 6న పోలవరం కుడి కాలువకు గోదావరి నీటిని వదులుతామని సీఎం చెప్పారు. పాలార్ ప్రాజెక్టును ఇంకా మొదలు పెట్టకుండానే తమిళనాడు సీఎం జయలలిత దాన్ని కట్టొద్దని లేఖ రాశారన్నారు. -
వరుణుడే దిక్కు!
విజయవాడ : పట్టిసీమ నుంచి జూన్ మొదటివారానికే కృష్ణాడెల్టాకు నీరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలు అమలుకు నోచుకోలేదు. జూన్ ముగిసిపోతున్నా సర్కారు నీటి మాటే ఎత్తడం లేదు. మరోపక్క ఏరువాక కార్యక్రమాలు మాత్రం ఆర్భాటంగా నిర్వహించేశారు. వాస్తవంలో రైతులు ఇంకా నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నీటిమట్టం 14 మీటర్లు ఉంటేనే... పట్టిసీమ వద్ద నీటిమట్టం 14 మీటర్ల కంటే ఎక్కువ ఉంటేనే కృష్ణాడెల్టాకు లిఫ్టు చేయాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడున్నది 13.5 మీటర్లు మాత్రమే. గోదావరి డెల్టాలో ముమ్మరంగా వరినాట్లు సాగుతున్నాయి. అందువల్ల అక్కడి కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి నదిలో 13.5 మీటర్ల కంటే నీరు తగ్గే పరిస్థితి ఉందే తప్ప పెరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నీటిమట్టం 13.5 మీటర్లను దాటాలంటే వర్షాలే ఆధారం. గోదావరి డెల్టాకు 13 వేల క్యూసెక్కుల నీరు అవసరం. ప్రస్తుతం 5,500 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని, అది 13 వేల క్యూసెక్కులను దాటిన తరువాతే పట్టిసీమ గురించి ఆలోచించాల్సి ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. శబరి నది ప్రాంతం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి.. ఆ నీరు గోదావరికి చేరితే నది నీటిమట్టం పెరుగుతుంది. లేదా గోదావరి డెల్టాలో భారీ వర్షాలు కురిస్తే.. రైతులు కాల్వల ద్వారా నీటిని తీసుకోవడం మానేస్తారు. అప్పుడు పైనుంచి వచ్చే నీటితో గోదావరి నది నీటిమట్టం పెరుగుతుంది. ఆ పరిస్థితులు ఉంటేనే కృష్ణాడెల్టాకు నీరివ్వగలమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పట్టిసీమ వద్ద ఒక్కసారి 14 మీటర్ల నీటిమట్టానికి చేరుకున్నా నీరొదిలే అవకాశం లేదు. క్రమంతప్పకుండా వస్తేనే పట్టిసీమకు నీరు వదలాలని ఇంజనీర్లు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత వర్షాల ఆధారంగా మరో పక్షం రోజుల్లో కృష్ణాడెల్టాకు నీరిచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తికాకుండానే.. పట్టిసీమ కుడికాల్వ పనులు ఇంకా జరుగుతున్నాయని, విద్యుత్ పనులు పూర్తికాకుండానే పూర్తయినట్లు ప్రభుత్వం చెబుతోందని ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఇటీవల ఆరోపించారు. ప్రాజెక్టును నిర్దిష్ట ఏడాదిలోపు పూర్తి చేస్తే 20 శాతం బోసన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, పనులు పూర్తికాకపోయినా డబ్బులు ఇచ్చేసిందని విమర్శించారు. -
సాగుకు ముందే చావు డప్పు
► 22 రోజుల్లో 12 మంది ఆత్మహత్య ► అనుమానాస్పద స్థితిలో మరో నలుగురు మృతి ► బ్యాంకు అప్పు పుట్టదు.. ప్రైవేట్ రుణాలే దిక్కు ► వచ్చేనెల 31తో ముగియనున్న ఖరీఫ్ రుణాల గడువు ► పట్టిసీమ నుంచి డెల్టాకు చుక్క లేదు.. పులి‘చింత’లే ► ఇప్పటికే పంట విరామాన్ని ప్రకటించిన కోనసీమ.. ► లక్షన్నర ఎకరాలు సాగుకు దూరమయ్యే ప్రమాదం ► రైతు చావుల నివారణకు చర్యలు తీసుకోవాలన్న కోర్టు ఆదేశాలను పట్టించుకోని పాలకులు ► సగటున ప్రతి 40 గంటలకు ఒక రైతు బలిదానం సాక్షి, హైదరాబాద్: ఆశల మోసులతో సాగుకు సన్నద్ధమైన అన్నదాతకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సాగుకు ముందే రాష్ట్రంలో అన్నదాతల ఇంట చావుడప్పు మోగుతోంది. వ్యవసాయ శాఖ లెక్క ప్రకారం జూన్ ఒకటిన ప్రారంభమైన ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 16 మంది రైతులు విభిన్న కారణాలతో చనిపోయారు. తెచ్చిన అప్పులు తీరక కొందరు, బ్యాంకుల నుంచి కొత్త అప్పులు పుట్టక మరికొందరు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఇంకొందరు తనువు చాలించారు. సగటున ప్రతి 40 గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తేలింది. అన్నదాతల ఆత్మహత్యలపై స్పందించాలని, నివారణకు చర్యలు చేపట్టాలని న్యాయస్థానాలు పాలకులకు పదేపదే మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదు. గిట్టుబాటు కాని సాగు చేయలేమని కోనసీమకు చెందిన అనంతవరం రైతులు ఇప్పటికే ‘క్రాప్ హాలీడే’ ప్రకటించారు. ఈ పిలుపు ప్రభావం సుమారు లక్షన్నర ఎకరాలపై ఉంటుందని అంచనా. కాలువల్లో నీరు పారుతుందో లేదో తేలకుండా పంటల్ని వేయలేమని మరికొన్ని ప్రాంతాల రైతులు చెబుతున్నారు. ఖరీఫ్‌కు ముందే సిద్ధం కావాల్సిన పులిచింతల ఇంకా చింతల్లోనే ఉంది. ఎంతో ఆర్భాటం చేసిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు చుక్కనీరు రాలేదు. ఫలితంగా ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. బుధవారం అనంతపురం జిల్లా బొమ్మిరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణారెడ్డి (55) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన వ్యవసాయ రుణాలు... ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రు.36 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికి 25 శాతానికి మించలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ ఉపశమనం కలిగించకపోగా తలకు మించిన భారంగా తయారైంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు), ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీలు), గ్రామీణ బ్యాంకులు మాత్రమే రైతుల పట్ల కాస్తంత ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. పాత అప్పులపై వడ్డీ చెల్లిస్తే కొత్త రుణాలు ఇస్తున్నాయి. మిగతా బ్యాంకులేవీ ఇందుకు సుముఖంగా లేవు. లీడ్ బ్యాంకులు ఆదేశించినా జాతీయ బ్యాంకులు పట్టించుకోవడం లేదు. అసలుతోపాటు వడ్డీని కూడా జమ చేస్తేనే రుణాలు ఇస్తామంటూ రైతుల్ని ఇబ్బందుల పాల్జేస్తున్నాయి. దీంతో రైతులు అనివార్యంగానే గ్రామాల్లో ఉండే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వాస్తవసాగుదార్లుగా ఉన్న కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం ఏప్రిల్ ఒకటి నుంచి జూలై 31లోగా రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలి. ఇప్పటికి మూడు నెలలు గడిచినా ఇచ్చింది 25 శాతమే అయితే ఇంకా మిగిలిన 40 రోజుల్లో ఎంతమందికి ఇస్తారనేది ప్రశ్నార్థకమే. ఇవ్వాల్సిన ఖరీఫ్ రుణాలు జిల్లా ఖరీఫ్ రుణం(కోట్లలో) శ్రీకాకుళం 1,446 విజయనగరం 1,048 విశాఖ 1,268 తూర్పుగోదావరి 4,250 పశ్చిమ గోదావరి 3,951 కృష్ణా 2,912 గుంటూరు 5,437 ప్రకాశం 2,876 నెల్లూరు 2,149 చిత్తూరు 2,869 వైఎస్సార్ 2,164 అనంతపురం 3,130 కర్నూలు 2,500 22 రోజులు... 12 మంది.. ఖరీఫ్ ప్రారంభమైన 22 రోజుల వ్యవధిలో 12 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో నలుగురు వేర్వేరు కారణాలతో చనిపోయారు. అన్నదాతల ఆత్మహత్యల్లో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో ఉండగా వైఎస్సార్ కడప, కర్నూలు, గుంటూరు జిల్లాలు తర్వాతి స్థానాలలో ఉన్నాయి. విశాఖ జిల్లాలోనూ రైతు ఆత్మహత్యలు చోటుచేసుకోవడం గమనార్హం. లెక్కల్లోకి రాని ఆత్మహత్యలు మరెన్నో ఉన్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన మరో ఇద్దరు రైతులు- రమణారెడ్డి (పొడ్రాళ్లపల్లి), శ్రీనివాసరెడ్డి (చాకర్లపల్లి) అనుమానాస్పద స్థితిలో పొలంలో చనిపోయారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు- కాల్‌మనీ ముఠా వేధింపులతో మరణించారు. ఇవన్నీ మీడియాలో వచ్చినవే. పత్రికల్లో, టీవీల్లో రానివి మరెన్నో. మహిళా రైతుల ఆత్మహత్యల్ని మీడియా సైతం నివేదించడం లేదు. ఈ లెక్క చూస్తుంటే ప్రతి నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూల ఎవరో ఒక రైతు మరణిస్తూనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. గత 22 రోజుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు జిల్లా మండలం గ్రామం రైతు పేరు అనంతపురం నల్లచెరువు బొమ్మిరెడ్డిపల్లి వెంకట రమణారెడ్డి (55) తాడిమర్రి చిల్లకొండయ్యపల్లి ఆర్వేటి నడిపి నాగప్ప(50) పెద్దవడుగూరు జి.కొత్తపల్లి దమ్మర హనుమంతు(50) యాడికి వెంగన్నపల్లి కొట్టి కొండారెడ్డి(65) పెనుకొండ మరువపల్లి గొల్ల లక్ష్మీనారాయణ(50) వైఎస్సార్ పులివెందుల చంద్రగిరి(ఇ.కొత్తపల్లె) షామీర్ (28) బి.మఠం చెంచయ్యగారిపల్లె వేమరెడ్డి జయరామిరెడ్డి(44) కర్నూలు గోనెగండ్ల గాజులదిన్నే కె.రాముడు(60) గూడూరు గూడూరు గొల్ల రాముడు(52) గుంటూరు ఈపూరు ఇనిమెళ్ల మందపాటి శ్రీనివాసరావు (40) ఈపూరు ఈపూరు దురిశాల వెంకటేశ్వర్లు(55) విశాఖపట్నం చోడవరం దండోరిపాలెం వబలరెడ్డి అప్పలనాయుడు (52) -
మా వాటా పెంచండి
►కృష్ణాలో నికర జలాలపై కేంద్ర జలవనరుల శాఖ సమావేశంలో తెలంగాణ విజ్ఞప్తి ►మా వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచండి ►ఏపీ వాటా 512 టీఎంసీల నుంచి 422 టీఎంసీలకు తగ్గించండి ►పట్టిసీమ, పోలవరంలో తెలంగాణకు నిర్ణీత వాటా ఉంటుంది ►811 టీఎంసీలపైన వచ్చే నీటిని 66.7:33.3 నిష్పత్తిలో పంచండి ►పాలమూరు, డిండి పాత ప్రాజెక్టులేబోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల నియంత్రణ అవసరం లేదు ►గతేడాది ఏపీ అదనంగా వాడుకున్న 13 టీఎంసీలను ►ఈ ఏడాది సర్దుబాటు చేయాలి సాక్షి, హైదరాబాద్ కృష్ణా నదీ జలాల్లో తమకున్న నికర జలాల కేటాయింపులను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ప్రస్తుతం ఉన్న 299 టీఎంసీల నీటి వాటాకు అదనంగా మరో 90 టీఎంసీల మేర నీటి వాటా తమకు న్యాయంగా దక్కుతుందని తెలిపింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు వాటాలు దక్కుతాయన్న అంశాన్ని వివరిస్తూ... తమ వాటాను 389 టీఎంసీలకు పెంచాలని, ఏపీ వాటాను 422 టీఎంసీలకు తగ్గించాలని కోరింది. 2016-17 వాటర్ ఇయర్లో కృష్ణా నీటి కేటాయింపులు, వినియోగంపై మంగళవారం కేంద్ర జల వనరుల శాఖ వద్ద జరిగిన సమావేశానికి తెలంగాణ తరఫున నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ, ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు కోటేశ్వర్రావు, నరసింహారావు, అడ్వొకేట్ రవీందర్రావు తదితరులు హాజరయ్యారు. పట్టిసీమ కొత్త ప్రాజెక్టే: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగం కాదని తెలంగాణ స్పష్టంచేసింది. ‘‘1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీ వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తెలంగాణదే. బచావత్ అవార్డులో పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం పై రాష్ట్రాలకు వాటా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఏపీ పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతోంది. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదని లోక్‌సభలో వైఎస్సార్సీసీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అంటే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలి. ఈ లెక్కన మొత్తంగా తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచి, ఏపీ వాటాను 512 టీఎంసీల నుంచి 422 టీఎంసీలకు తగ్గించాలి. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని ఆచరణలోకి తేవాలి’’ అని కోరింది. దీంతోపాటే గతేడాది నిర్ణీత వాటాలో తక్కువగా వాడుకున్న 13 టీఎంసీల నీటిని కూడా ఈ ఏడాది నీటి పంపకాల్లో సర్దుబాటు చేయాలని కోరింది. మొత్తంగా తెలంగాణకు 402 టీఎంసీలను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే ఏడు దశాబ్దాలుగా ఆయకట్టు అభివృద్ధి విషయంలో తెలంగాణ ఒడిదుడుకులను ఎదుర్కొందని, మొత్తం కృష్ణా బేసిన్లో సాగుకు యోగ్యంగా 37.19 లక్షల హెక్టార్లు ఉన్నా.. కేవలం 6.39 లక్షల హెక్టార్లే సాగు చేసుకోగలుగుతోందని తెలిపింది. ఈ దృష్ట్యా 811 టీఎంసీల నికర జలాలకుపైన వచ్చే అదనపు జలాలను 63.7ః33.3 నిష్పత్తిన తెలంగాణ, ఏపీలకు పంచాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ వాదనలోని ముఖ్యాంశాలివీ.. - కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తేవాలని కోరుతూ బోర్డు వర్కింగ్ మాన్యువల్ సిద్ధం చేసి నోటిఫికేషన్ కోసం కేంద్రానికి పంపింది. అయితే దీన్ని రాష్ట్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి బ్రజేశ్ ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చే వరకు ఆమోదించరాదని కోరింది. ప్రస్తుతం ఇది కేంద్ర పరిశీలనలో ఉన్నందున నియంత్రణపై తొందర అక్కర్లేదు. - రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89(ఏ), (బీ)ల ప్రకారం ట్రిబ్యునల్ కాల పరిమితిని రెండేళ్లు పెంచారు. దీనిలో కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్యా లేదా నాలుగు రాష్ట్రాల మధ్యా అన్న అంశం తేలలేదు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేవు. నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలు బ్రజేశ్ ట్రిబ్యునల్ పరిశీలనలో ఉన్నాయి. అలాంటప్పుడు బోర్డు నియంత్రణ అన్న ప్రశ్నే ఉదయించదు. - ఇదే చ ట్టంలోని 85(8), 87(1) సెక్షన్ల ప్రకారం కృష్ణా బోర్డు.. కేవలం ట్రిబ్యునల్లు ఇచ్చిన నిర్ణయాన్ని మాత్రమే అమలు పరచాలి. అంతే తప్ప నోటిఫికేషన్ తయారు చేయలేదు. బ్రజేశ్ ట్రిబ్యునల్ అమల్లోకి రానందున బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని ఉమ్మడి ఏపీలో చేసుకున్న తాత్కాలిక ఏర్పాట్ల మేరకు తెలుగు రాష్ట్రాలు తమ సరిహద్దుల్లో ఎక్కడైనా వాడుకునేలా మాత్రమే చూడాలి. - పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు కొత్త ప్రాజెక్టులు అనడం సరికాదు. కృష్ణాలో 70 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతలపై డీపీఆర్ తయారు చేయాలంటూ 2013లోనే జీవో 72 ఇచ్చారు. అదే కృష్ణాలో 30 టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండి ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారు. అలాంటప్పుడు అవి ముమ్మాటికీ పాత ప్రాజెక్టులే. ఈ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రుల స్థాయిలో ఉంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశం అవసరం లేదు. -
ఖరారు కానున్న ‘కృష్ణా’ ముసాయిదా!
* నేడు ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ వద్ద కీలక భేటీ * తెలంగాణ, ఏపీ నుంచి హాజరుకానున్న ఉన్నతాధికారులు * పోలవరం, పట్టిసీమల్లో వాటా కోరనున్న రాష్ట్రం * కొత్త ప్రాజెక్టులు, వాటి నియంత్రణకు ఏపీ పట్టుబట్టే అవకాశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి ప్రస్తుత వాటర్ ఇయర్లో విధివిధానాలతో కూడిన ముసాయిదా సిద్ధం కానుంది. కేంద్ర జలవనరులశాఖ నేతృత్వంలో మంగళవారం ఢిల్లీలోని అనుసంధాన్ భవన్లో జరగనున్న సమావేశంలో నీటి వినియోగ పద్ధతులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంగీకారానికి రానున్నాయి. తెలంగాణ ఇప్పటికే గతేడాది ముసాయిదాను కొనసాగించాలని కోరుతుండగా బేసిన్ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవడంతోపాటు కొత్త ప్రాజెక్టులపై తేల్చాలని ఏపీ గట్టిగా వాదించే అవకాశముంది. కృష్ణా జలా ల వినియోగంలో నెలకొన్న వివాదాలకు తాత్కాలిక పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్ 18, 19 తేదీల్లో ఇరు రాష్ట్రాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల అంగీకా రం మేరకు మార్గదర్శకాల ముసాయిదా (మాన్యువల్)ను తయారు చేసి దాన్ని 2015-16 ఏడాదిలో అమలు చేసింది. అయితే ఆ ముసాయిదా గడువు జూన్ 1తో ముగియడంతో మళ్లీ ముసాయిదాను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇరు రాష్ట్రాల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వ పెద్దలతో చర్చించిన రాష్ట్ర అధికారులు గతేడాది ముసాయిదానే కొద్దిపాటి మార్పులతో కొనసాగించాలని నిర్ణయిం చారు. ముసాయిదా అంశాలకు అదనంగా నికర జలాల్లో మరింత వాటా కోరాలని రాష్ట్రం భావిస్తోంది. కృష్ణాలో ఉన్న 299 టీఎంసీల నికర జలాల వాటాకు అదనంగా మరో 103 టీఎంసీల వాటా కోరాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే ఎగువ రాష్ట్రాలకు అంతే పరిమాణంలో నీటి హక్కులు సంక్రమిస్తాయని, ఈ లెక్కన 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహా రాష్ట్రకు, 45 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా వస్తాయని రాష్ట్రం పేర్కొంటోంది. దీన్ని ముసాయిదాలో చేర్చి 45 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాలని కోరాలని భావి స్తోంది. ఇదే బచావత్ అవార్డులో పోలవరం కాకుండా ఇంకా ఏదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుందని, 45 టీఎంసీలతో పట్టిసీమ చేపడితే అదే స్థాయిలో నీరు తెలంగాణకు దక్కాలని కోరనుంది. మొత్తం 90 టీఎంసీల అంశాన్ని ప్రస్తావించి దీనిపై స్పష్టత కోరే అవకాశం ఉంది. బోర్డు నియంత్రణ కోసం ఏపీ పట్టు.. ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని ఏపీ ప్రధానంగా ప్రస్తావించే అవకాశముంది. ముఖ్యంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్నందున నీటి విడుదలకు ప్రతిసారీ వారి వద్దకు వెళ్లాల్సి వస్తోందని, కొన్ని సందర్భాల్లో వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాదించే అవకాశముంది. ఈ దృష్ట్యా బేసిన్ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు నియంత్రణలోకి తేవాలని కోరనుంది. దీంతోపాటే తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు పూర్తిగా కొత్త ప్రాజెక్టులేనని, వాటిని నిలుపదల చేయాలని పట్టుబట్టే అవకాశాలున్నాయి. -
కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి సాక్షి, విజయవాడ: పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేశామని, రాబోయే రోజుల్లో కృష్ణా-పెన్నా నదుల్ని అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరిలో నిల్వలు పెరిగితే ఆ నీటిని కృష్ణా నదికి తీసుకువస్తామని, కృష్ణా నీటిని శ్రీశైలం వద్ద నిల్వచేసి రాయలసీమకు పంపుతామని వివరించారు. శనివారం విజయవాడలో జలవనరులశాఖ ఆధ్వర్యంలో సమగ్ర జలవనరుల నిర్వహణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కాడా టెక్నాలజీ ద్వారా 13 జిల్లాల్లోని నీటిపారుదల ప్రధాన ప్రాజెక్టులతో అనుసంధానం చేసిన వీడియో కాన్ఫరెన్స్ థియేటర్‌ను బాబు ఆవిష్కరించారు. రోడ్డుపై గొయ్యి ఉంటే ఇంజనీర్‌పై వేటే రాష్ట్రంలోని రోడ్లపై ఎక్కడ గోతులు కనిపించినా ఊరుకునేది లేదని, సంబంధించి ఇంజనీర్‌ను పిలిచి అక్కడికక్కడే చర్యలు తీసుకుంటానని సీఎం శనివారం జరిగిన ఆర్అండ్బీ సమీక్షలో హెచ్చరించారు. వాహనంలో ప్రయాణించే వారి మొబైల్ ఆధారంగా ఆ వాహన వేగాన్ని కనుగొనే విధానాన్ని గూగుల్ సంస్థ తమకు అందిస్తోందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష తెలంగాణలో అనుమతి లేకుండా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరిం చాల్సిన వ్యూహంపై ఏపీ సీఎం చంద్రబాబు శనివారం సమీక్ష నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమా, సుప్రీంకోర్టు న్యాయవాది గంగూలీ, నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం చర్చించారు. తెలంగాణ ప్రాజెక్టులు, రాష్ట్రాల మధ్య జల వివాదాలు, కృష్ణా రివర్ బోర్డు వ్యవహారం, ఏపీలో చేపట్టే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. -
జల ‘ముసాయిదా’లో మార్పులు చేయాలి
కృష్ణా జలాల వినియోగంపై గత ఏడాది చేసుకున్న ఒప్పందంలో మార్పులు కోరుతున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో గత ఏడాది కేంద్ర జల వనరుల శాఖ వద్ద చేసుకున్న ముసాయిదా ఒప్పందాలను ఈ ‘వాటర్ ఇయర్లో’నూ కొనసాగించేందుకు అంగీకరిస్తున్న తెలంగాణ, అందులో పలు మార్పులు చేయాలని పట్టుబడుతోంది. ఈ నెలాఖరులో కేంద్రం వద్ద జరిగే భేటీలో, ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ పథకం కేటాయింపులకు అనుగుణంగా తెలంగాణకు నీటి కేటాయింపులు చేసే అంశంపై పూర్తి స్థాయిలో చర్చించి దాన్ని ముసాయిదాలో చేర్చాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటే నీటి వినియోగ, అవసర షెడ్యూల్‌ను ముందుగానే బోర్డుకు అందించే విషయంలో కచ్చితత్వాన్ని పాటించేలా నిబంధనలు పెట్టాలని కోరే అవకాశాలున్నాయి. గత ఏడాది జూన్ 18, 19 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఒక ముసాయిదా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారమే ప్రస్తుతం నడుచుకుంటున్నా, అప్పుడప్పుడు కొన్ని విభేదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల నియంత్రణ అంశంలో ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొనడంతో ఈ అంశం ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉంది. దీన్ని పక్కనపెడితే గత ఏడాది ఒప్పందం ప్రకారం..నికర జలాల్లో మొత్తంగా ఉన్న 811 టీఎంసీల్లో ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలను తమ పరిధిలో ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు ఉంది. ఈ ఏడాది కూడా ఇదే విధానం కొనసాగే అవకాశం ఉంది. ఈ నీటి వినియోగం విషయంలో ఇరు రాష్ట్రాలు తమ అవసరాలను పేర్కొంటూ ముందుగానే బోర్డుకు షెడ్యూల్ అందించాలని ఒప్పందం సందర్భంగా నిర్ణయించాయి. అయితే దీనిపై ఏపీ నుంచి సరైన సమాచారం లేదన్నది తెలంగాణ వాదన. ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగ డేటాను ఇరు రాష్ట్రాలు బోర్డు ద్వారా పరస్పరం బదిలీ చేసుకోవాల్సి ఉన్నా అదీ జరగడం లేదు. దీంతో పలు సందర్భాల్లో బోర్డు సైతం నీటి విడుదలపై చేతులెత్తేస్తోంది. ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా అమలు చేసేలా ఒప్పందంలో మార్పులు చేయాలని తెలంగాణ కోరే అవకాశాలున్నాయి. మాకూ హక్కులు వస్తాయి.. ఇక బచావత్ అవార్డు ప్రకారం..పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని తెలంగాణ అంటోంది. పోలవరానికి 80 టీఎంసీలు కేటాయిస్తే, అదే తరహాలో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహారాష్ట్రకు, 45 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా వస్తాయని అంటోం ది. దీనిని కూడా ముసాయిలో చేర్చి 45 టీఎంసీలు అదనంగా కేటాయించాలని కోర వచ్చు. అదే బచావత్ అవార్డులో పోలవరం కాకుండా ఏదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరి మాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని, 80 టీఎంసీలతో పట్టిసీమ చేపడితే తమకూ నీటివాటా దక్కాలని తెలంగాణ కోరనుంది. -
రంగంలోకి గవర్నర్
♦ ఏపీ, తెలంగాణ జల జగడంపై ఆరా ♦ రాజ్‌భవన్‌కు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు ♦ వివాదం, ప్రాజెక్టుల అనుమతులపై గవర్నర్ ప్రశ్నలు ♦ ప్రాజెక్టులన్నింటికీ అనుమతులున్నాయన్న అధికారులు ♦ ఏపీ సర్కారే అక్రమంగా పట్టిసీమ ప్రాజెక్టు ♦ చేపట్టిందని వెల్లడి.. విభజన చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదం రాజ్‌భవన్‌కు చేరింది. తెలంగాణ ప్రాజెక్టులతో ఏపీకి అన్యాయం జరుగుతోం దంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరాహారదీక్షకు దిగనుం డడంతో ఉలిక్కిపడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ గురువారం రంగంలోకి దిగారు. తెలంగాణ సాగునీటి శాఖ ఉన్నతాధికారులను రాజ్‌భవన్‌కు పిలిపించి దాదాపు 45 నిముషాలపాటు వారితో సమావేశమయ్యారు. జల జగడంపై ఆరా తీశారు. ఏదైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టదలిస్తే ముందుగా ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుం దని సూచించారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులపైనా ప్రశ్నించారు. కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు వీలుగా అధికారుల నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని అనుమతులున్నాయి తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయని సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ గవర్నర్‌కు వివరించారు. ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలు, కృష్ణా, గోదావరిలో నీటి కేటాయింపులపై వివరణ ఇచ్చారు. గోదావరిలో తమకున్న 954 టీఎంసీల నీటి వాటాను వాడుకునేలా కంతనపల్లి, ప్రాణహిత, దేవాదుల ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తున్నామని వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013లోనే జీవో 72 ఇవ్వగా... అదే కృష్ణానదిలో 30 టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై7న జీవో 159 ఇచ్చారని గుర్తు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు గతంలో ఎలాంటి అనుమతులు, జీవోలు లేవని, విభజన అనంతరం చేపట్టిన ఈ ప్రాజెక్టుపై కచ్చితంగా బోర్డుకు తెలియజేయాల్సి ఉన్నా అలా చేయలేదన్నారు. పైగా అన్ని అనుమతులు ఉన్న తెలంగాణను తప్పు పడుతోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. నిజానికి కృష్ణా జలాల వినియోగం విషయంలో బచావత్ అవార్డు మేరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయని, అందులో కేవలం 100 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్నామని గవర్నర్‌కు వివరించారు. మరిన్ని నీటి కేటాయింపుల కోసం ట్రిబ్యునల్తోపాటు న్యాయస్థానాలను ఆశ్రయించామని చెప్పారు. అనుమతులకు బోర్డుకు సంబంధం లేదు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చట్టంలోని క్లాస్ 84(8) ఏ ప్రకారం బోర్డు కేవలం నీటి సరఫరాను నియంత్రిస్తుందే తప్ప ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి దానికి ఎలాంటి అధికారం లేదని అధికారులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లాలో 80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా అక్రమమని, రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఈ ప్రాజెక్టును చేపట్టిందని గవర్నర్‌కు చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ కానీ, బోర్డు అనుమతి కానీ లేకుండానే తెలంగాణ హక్కులకు భంగం కలిగేలా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని వివరించారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84(3), 85(8)కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. 1978లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య జరిగిన ఒప్పందం మేరకు పోలవరం ప్రాజెక్టు నుంచి మాత్రమే 80 టీఎంసీల నీటిని మళ్లించాలని, అంతకుమించి మళ్లిస్తే, ఆ నీటిని మూడు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. -
'పోలవరం' ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉంది?
విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందా ? లేక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో్ ఉందో ? అర్థం కాని పరిస్థితి నెలకొందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సందేహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ... 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం అసాధ్యమనిపిస్తోందని తెలిపారు. పట్టిసీమ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నదుల అసుసంధానం అంటే రెండు, మూడు లిఫ్ట్‌లు పెట్టి నీళ్లు తోడటం కాదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. -
పట్టిసీమ పేరుతో మోసం
పుంగనూరు: పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని, రాయలసీమకు పట్టిసీమ నీరు వచ్చే అవకాశాలు లేవని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మె ల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సోమల మండలం నంజంపేటలో పల్లెబాట కార్యక్రమంలో మాట్లాడుతూ పట్టిసీమ పేరుతో రూ.1,300 కోట్లు ఖర్చు చూపి అందులో రూ.500 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. హంద్రీనీవా, గాలేరు ప్రాజెక్టులలో రూ.6 వేల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించా రు. ఎన్నికల సమయంలో చం ద్రబాబు ప్రజలను ఆకట్టుకునేందుకు అమలు సాధ్యంకాని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాగ్దానాలను మరచిపోయారని మండిపడ్డారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. రైతుల నుంచి 30 వేల ఎకరాలు లాక్కుని టీడీపీ నేతలు పంచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు అమరావతి మినహా మరేమీ కనిపిం చడం లేదని, రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం నేర్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్ప, నియోజకవర్గ కన్వీనర్ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర పాల్గొన్నారు. -
రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు
36 గంటల ధర్నాలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ అనంతపురం రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆర్డీవో కార్యాలయం ఎదుట 36 గంటల ధర్నాను చేపట్టింది. శుక్రవారం ఎమ్మెల్యే ఈ శిబిర ాన్ని సందర్శించి మద్దతు ప్రకటిం చారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులపట్ల చిత్తశుద్ధి లేదన్నారు. రైతు ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి, రాష్ట్ర ప్రభుత్వానికి అక్షిం తలు వేసినా మార్పు లేదన్నారు. జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టి సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించకుండా కమీషన్ల కోసం పాలకులు పాకులాడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమకు ఇప్పటి వరకు రూ.12వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. అయినా సీమకు చుక్కనీరు రాలేదన్నారు. అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి రాయలసీమ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందించి రైతు ఆత్మహత్యలను అరికట్టాలన్నారు. ఎ మ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలను ప్రభుత్వమే రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్నారు. అనంతరం ఆర్డీవో మలోలకు డి మాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాం భూపాల్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, కార్యదర్శి పెద్దిరెడ్డి, రిడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజా, నాయకులు రామాంజినేయులు, రా యుడు, నగేష్, దిల్షాద్ పాల్గొన్నారు. -
పట్టిసీమ, పోలవరంలో అంతర్భాగం కాదు: కేంద్రం
న్యూ ఢిల్లీ: పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. తాము ఆమోదించిన డీపీఆర్‌లో పట్టిసీమ లేదని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు పోలవరంలో అంతర్భాగమే పట్టిసీమ అంటూ చంద్రబాబు సర్కారు చెబుతోంది. -
ఎవరికి చెప్పాలి పాఠం?
ప్రతిపక్ష నేత లేవనెత్తే ప్రశ్నలకు ముఖ్యమంత్రి వద్ద సమాధానమే లేదు. పైగా మొండిగా వాదిస్తూ, వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేస్తూ ప్రతిపక్షనేతకే పాఠాలు చెబుతాననడం చూసి రాష్ర్ట ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చిలోనే భగభగలాడిన భానుడి ప్రతాపాన్ని ప్రతిబింబించాయి. సమావేశాలను ఆసాంతం పరిశీలించిన వారికి అవి జరిగిన తీరు చాలా ఆశ్చర్యం కలిగించింది. జీవోలు, గణాంకాలు, రిపోర్టులను ఆధారాలుగా చూపిస్తూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నలు సంధిస్తుంటే వాటికి సమాధానాలు చెప్పకపోగా అడుగడుగునా ఆటంకం కలిగిస్తూ ఎదురుదాడి చేయడం... అందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే నాయకత్వం వహించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ముగింపు ముందురోజు ముఖ్యమైన రెండు అంశాలపై చర్చ జరిగిన తీరు పరిశీలిస్తే చాలు ఈ సమావేశాలు ఎలా జరిగాయో తెలుసుకోవడానికి. పట్టిసీమపై చర్చ సందర్భంగా ప్రతిపక్షనేత ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా ఇరిగేషన్ చాలా క్లిష్టమైన సబ్జెక్టని, తెలియకపోతే తాను పాఠాలు చెబుతానని చంద్రబాబు వాఖ్యానించడం విస్మయపరిచింది. అలాగే ఉపాధి హామీ పథకం అమలు విషయంలో మానవీయకోణాన్ని విస్మరిస్తూ ముఖ్యమంత్రి చేసిన వాదన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చట్టాన్ని, నిబంధనలను ససాక్ష్యంగా ఏకరువు పెడుతున్నా మొండిగా వాదిస్తూ తనకు తెలిసిందే నిజమని, తాను చెప్పిందే అందరూ నమ్మాలన్నట్లు ముఖ్యమంత్రి వాదించడం చూసి అందరూ విస్తుపోయారు. ఈ రెండు ఉదంతాలలోనూ ముఖ్యమంత్రికి - ప్రతిపక్షనేతకు మధ్య జరి గిన సంవాదాన్ని చూస్తే చాలు ఎవరు ఎవరికి పాఠాలు నేర్పాల్సి ఉంది..? ఎవరు ఎవరి వద్ద పాఠాలు నేర్వాల్సి ఉందనేది తేలిగ్గానే అర్థమైపోతుంది. పట్టిసీమపై జవాబు లేని ప్రశ్నలు... ముందుగా పట్టిసీమనే తీసుకుందాం. ఏడాది వ్యవధిలో పట్టిసీమను పరమాద్భుతంగా పూర్తిచేసేశామని ముఖ్యమంత్రి ‘సగర్వం’గా సభకు వివరించారు. నిజమే.. పట్టిసీమను పూర్తిచేశారు కానీ అదొక నిరుపయోగమైన, నిష్ఫలమైన, రాష్ర్ట రైతాంగానికి నష్టదాయకమైన ఎత్తిపోతల పథకమని ప్రతిపక్షనేత ఆధారసహితంగా వివరిస్తుంటే ముఖ్యమంత్రి సహించలేకపోయారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా.. ఒక పార్టీ అధినేతగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షనేతగా అన్ని అంశాలనూ కూలంకషంగా అధ్యయనం చేస్తూ.. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ (పత్రాల ఆధారాలు)తోనే జగన్మోహన్రెడ్డి సభలో మాట్లాడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏ అంశం తీసుకున్నా ఎలాంటి ఆధారమూ లేకుండా ఆయన మాట్లాడడం లేదు. ప్రభుత్వం జారీ చేసిన జీవోనో, నిబంధనలనో, గతంలో అమలు చేసిన వివరాలను తెలిపే పత్రాలనో సభకు చూపిస్తూనే ఆయన వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పట్టిసీమ పథకంలో రూ. 1600 కోట్లను నీళ్లపాలు చేశారని అంటూనే అది ఎందువల్ల నిరుపయోగమో జగన్ వివరించారు. ఆయన లేవనెత్తిన ప్రశ్నలను, వివరించిన అంశాలనూ పరిశీలిస్తే... 1. పట్టిసీమలో అస్సలు స్టోరేజీ సామర్థ్యం లేదు. కేవలం గోదావరిలో నీరున్నపుడు ఆ నీటిని పంపులతో ఎత్తిపోసే పథకమిది. అంటే పంటల సమయం, వాటి అవసరాలతో నిమిత్తం లేకుండా గోదావరిలో నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు అన్నమాట. గోదావరిలో వరదలు వచ్చే సమయానికి కృష్ణాలోనూ వరదలు ఉంటాయి. కృష్ణాడెల్టాలో పంటల కాలానికి కూడా పొత్తు కుదరదు. అందుకే 190 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజెక్టును కట్టుకుంటేనే గోదావరి వరదనీటిని ఉపయోగించుకునే వీలుంటుంది. స్టోరేజీ సామర్థ్యం లేని పట్టిసీమ వల్ల ఉపయోగమేమిటి? ఈ 1,600 కోట్ల రూపాయలు పెడితే పోలవరం ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చేది. ఇవే రూ.1,600 కోట్లతో గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తయ్యేది. ఈ రూ. 1,600 కోట్లు పెడితే హంద్రీ నీవా కూడా దాదాపు పూర్తయ్యేది. ఎలాంటి ఉపయోగమూ లేని పట్టిసీమకు రూ. 1,600 కోట్లు ఖర్చుపెట్టడం దేనికి? 2. పట్టిసీమ ద్వారా నీటిని సరఫరా చేసి కృష్ణాడెల్టా అవసరాలను తీర్చేసి తద్వారా కృష్ణానదిలో మిగిలే జలాలను రాయలసీమకు తరలించి సీమను సశ్యశ్యామలం చేసేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు. పట్టిసీమ పథకంతో కేవలం 4 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోయడం సాధ్యం. 180 టీఎంసీలు అవసరమయ్యే కృష్ణా డెల్టా అవసరాలను 4 టీఎంసీలు ఎలా తీరుస్తాయి? రాయలసీమకు నీళ్లెలా మిగులుతాయి? 3. రాయలసీమకు నీళ్లు తరలించాలంటే శ్రీశైలం వద్ద 854అడుగుల మేర కనీస నీటి మట్టం ఉండాలి. అలా కనీస నీటిమట్టాన్ని ఉంచుతున్నారా అంటే సమాధానం లేదు. పాలమూరు, రంగారెడ్డి వంటి కొత్త పథకాలకు తెలంగాణ టెండర్లు పిలుస్తూ ముందుకెళ్తున్నా అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబు ఎందుకు చేయడం లేదు? అసలు గోదావరి ప్రాజెక్టులపై తెలంగాణ, మహారాష్ర్ట ఒప్పందాలు చేసుకుంటున్నా దిగువ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు పిలవడం లేదు? పిలవకపోయినా ఆంధ్రకు నష్టం కలిగించేలా అనేక ఒప్పందాలు జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఎందుకు ధైర్యం చేయడం లేదు? ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఆ కేసును బయటకు తీస్తారని భయపడడం నిజం కాదా? 4. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం.. బేసిన్ మారితే ఎగువరాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు 35 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలకు కోల్పోవాల్సి ఉంటుందని 7(ఇ), 7 (ఎఫ్) క్లాజులు చెబుతున్నాయి. 190 టీఎంసీలని నిల్వచేసుకునే సామర్థ్యంతో కృష్ణా డెల్టా అవసరాలతో పాటు రాష్ర్టంలోని 13 జిల్లాలకూ ఉపకరించే వరప్రదాయిని వంటి పోలవరం కోసం ఎగువరాష్ట్రాలకు 35 టీఎంసీలను కోల్పోయినా నష్టం లేదు కానీ కేవలం 4 టీఎంసీల పట్టిసీమ కోసం 35 టీఎంసీలను ఎందుకు ఫణంగా పెట్టారు? 5. నదుల అనుసంధానం చేసేశానని చంద్రబాబు గొప్పగా చెబుతున్నారు. నిజానికి ఆయన చేసిందేమిటి? పోలవరం అనుమతులు రాగానే ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టే శరవేగంగా తగినన్ని నిధులు కేటాయించి పోలవరం పనులు ప్రారంభించడంతో పాటు కుడి, ఎడమ కాల్వలను అంతే వేగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తిచేశారు. ఆయన కాలంలోనే పోలవరం కుడికాల్వ 70శాతం పూర్తయింది. మిగిలిన కొద్ది భాగంలో వెడల్పు తక్కువ పిల్లకాల్వలను తవ్వించి లిఫ్టు మోటార్లు బిగించి అదే పెద్ద ఘనకార్యమైనట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఈ కాస్త పనులకు రూ.1600 కోట్లు ఎందుకు బాబూ? ముడుపులు మింగేయడానికి తప్ప ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి ఏ కాస్త ప్రయోజనమన్నా ఉందా? ప్రతిపక్ష నేత లేవనెత్తే ప్రశ్నలకు ముఖ్యమంత్రి వద్ద సమాధానమే లేదు. పైగా మొండిగా వాదిస్తూ, వ్యం గ్యంగా వ్యాఖ్యానాలు చేస్తూ ప్రతిపక్షనేతకే పాఠాలు చెబుతాననడం చూసి రాష్ర్ట ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఉపాధిహామీ చట్టానికీ వక్రభాష్యాలు.. ఇక ఉపాధి హామీ చట్టం అమలుపై జరిగిన చర్చలోనూ ముఖ్యమంత్రి ఇదే తరహా మొండివాదన చేయడం ప్రజలంతా గమనించారు. తనకు తెలిసిందే చట్టమన్నట్లు మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేంద్రం ఇచ్చే ఉపాధి హామీ నిధులలో దేనికి ఎంత ఖర్చు చేయాలనేదానిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. 60శాతం కూలీల వేతనాలకు, 40శాతం మెటీరియల్‌కు ఖర్చు పెట్టాలని చట్టంలో ఉందని, తాము అదే చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అయితే మెటీరియల్ కాంపొనెంట్ 40శాతం నిధులను పొక్లెయిన్లతో పనులు చేస్తూ నిర్మించే సీసీరోడ్లకు ఎందుకు మళ్లిస్తున్నారని ప్రతిపక్షనేత నిలదీశారు. దీనిపై జగన్మోహన్రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు ఆలోచించదగినవే. వాటికి ముఖ్యమంత్రి వద్ద సమాధానమే లేదు. చట్టంలోని అంశాలను, గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను జగన్ సాక్ష్యాలతో సహా వివరించారు. వాటిని సూక్ష్మంగా పరిశీలిస్తే... 1. ఉపాధి హామీ చట్టం - 2005 లేబర్ బడ్జెట్ చాప్టర్ 8.4.4 నిబంధన ఏం చెబుతోందంటే ఉపాధి నిధులలో కనీసం 60శాతాన్ని కూలీల వేతనాలకు ఖర్చుపెట్టాలి. గరిష్ట పరిమితి లేదు. దానర్థం పూర్తిగా 100 శాతం కూడా ఖర్చుపెట్టవచ్చు. అలాగే మెటీరియల్ కాంపొనెంట్ గరిష్టంగా 40శాతం ఖర్చుచేయవచ్చు. దానర్థం 1 శాతం నుంచి 40శాతం లోపు ఉండాలని... అంతేకానీ కచ్చితంగా 40శాతం మెటీరియల్ ఖర్చులకు వినియోగించాలని కాదు. రాష్ర్టంలో పరిస్థితులను బట్టి రాష్ర్టప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూలీలకు ఆసరాగా ఉండేలా ఎక్కువ పనులు కూలీలతో చేయించి నిధులలో అధికభాగాన్ని వారి వేతనాలకు వెచ్చించడం మానవత్వం ఉన్న పాలకుడు చేయాల్సిన పని. కానీ చంద్రబాబు ఆ దిశగా ఆలోచించలేదు. పైగా చట్టానికి వక్రభాష్యం చెప్పేందుకు ప్రయత్నించారు. 2. పొక్లెయిన్లతో పనులు చేయించి సీసీరోడ్లు నిర్మిస్తే కాంట్రాక్టర్లు బాగుపడతారు. కానీ కూలీలకు పనులు కల్పిస్తే వారికి మూడుపూటలా పట్టెడన్నం దొరుకుతుంది. ఇంత చిన్న లాజిక్ ప్రజలు గ్రహించలేరనా చంద్రబాబు అభిప్రాయం? 3. కూలీలకు మరిన్ని పనులు కల్పించి మరిన్ని వేతనాలివ్వాలనే ఉద్దేశంతోనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఉపాధి నిధులలో 97. 54శాతాన్ని వేతనాలకు ఖర్చుచేశారు. మెటీరియల్ ఖర్చులకు కేవలం 2.46శాతం మాత్రమే వెచ్చించారు. తమిళనాడులో పూర్తిగా 100శాతం నిధులను కూలీల వేతనాలకే ఖర్చు చేస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం మొండిగా వాదించడానికి ప్రయత్నించారు. ఇది కేంద్రం తెచ్చిన చట్టమని, ప్రతిపక్షనాయకుడికి ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అంటూ పిడివాదం వినిపించారు. అన్ని విషయాలలోనూ పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్న జగన్మోహన్రెడ్డి వెంటనే ఉపాధి హామీ చట్టంలోని నిబంధనలను సభలో చదివి వినిపించారు. వైఎస్ హయాంలో కూలీల వేతనాలకు ఎంతశాతం ఖర్చు చేశారో ఆధారాలతో సహా చూపించారు. దాంతో అధికారపక్షం ఇరుకున పడిపోయింది. యథాప్రకారం స్పీకర్ మైక్ కట్ చేసి సభను వాయిదా వేశారు. తెలియదనుకోవాలా? ట్యూషన్ చెప్పించాలా? సహజంగానే ఉండే సంఖ్యాబలం, అధికార బలానికి సభాపతి సహకారం కూడా తోడుకావడంతో అధికారపక్షం ఈ సమావేశాల్లో ఆకాశమే హద్దుగా ‘ఏకపక్షం’గా చెలరేగిపోయింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంలోనూ, బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగానూ, ప్రభుత్వంపైనా - స్పీకర్‌పైనా ప్రతిపక్షం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ సందర్భంగానూ ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ప్రతిపక్షనేత ఒక అంశంపై ఒక వాక్యం కూడా పూర్తి చేయకుండానే మైక్ కట్ కావడం, వెంటనే అధికారపక్షం నుంచి మంత్రులు, విప్‌లు, సభ్యులలో ఎవరో ఒకరు లేచి ఆ అంశంపై సుదీర్ఘమైన ప్రసంగం చేయడమే కాక వ్యక్తిగతదాడికి దిగడం ఈ సమావేశాల్లో కనిపించిన ప్రత్యేకమైన అంశం. శాసనసభలో మున్నెన్నడూ కనిపించని ఓ కొత్త దుస్సంప్రదాయమిది. వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించడం, న్యాయస్థానాల పరిధిలో ఉన్న కేసుల గురించి కూడా వ్యాఖ్యానాలు చేయడం యథేచ్చగా సాగిపోయాయి. 40 ఏళ్ల ‘సుదీర్ఘరాజకీయ అనుభవం’ ఉన్న చంద్రబాబుకు ఇవి తప్పు అని తెలియదనుకోవాలా? లేక సభా సాంప్రదాయాల గురించి ఈ ‘చరమాంకం’లో ఆయనకు ట్యూషన్ చెప్పించాలా? - పోతుకూరు శ్రీనివాసరావు -
ఏడాదిలోనే పట్టిసీమ పూర్తి
శాసనసభలో సీఎం ప్రకటన సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోనే పూర్తిచేసి కృష్ణా డెల్టాకు నీళ్ళిచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. 2019 కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై మంగళవారం ఆయన శాసనసభలో ఒక ప్రకటన చేశారు. గతంలో తాను పునాది వేసిన సాగునీటి ప్రాజెక్టులను తిరిగి తన హయాంలోనే పూర్తి చేస్తున్నానని సీఎం చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి నీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నానని, నదుల అనుసంధానానికి కృషి జరుగుతోందని చెప్పారు. రాయలసీమ జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామన్నారు. చంద్రబాబు సుదీర్ఘోపన్యాసంలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ► కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు కట్టడం వల్ల రాష్ట్రంలోని జలాశయాలకు సరిపడా నీరు రావడం లేదు. ఇంకోవైపు గోదావరి నీరు వృథా అవుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి నీటిని కృష్ణాకు మళ్ళించే ఉద్దేశంతోనే పట్టిసీమను చేపట్టాం. ► ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్లు, డ్రాయింగులు ఏమాత్రం ఆలస్యం లేకుండా అధికారులు పూర్తిచేశారు. ప్రతిరోజు వెయ్యిమంది ప్రాజెక్టు వద్ద పనిచేశారు. ► 24 పంపులు, మోటార్లను ఉపయోగించి 8,500 క్యూసెక్కుల గోదావరి జలాలను తోడే విధంగా పథకాన్ని రూపొందించాం. ► రాష్ట్రంలోనే తొలిసారిగా 354 క్యూసెక్కుల సామర్థ్యం గల వర్టికల్ టర్బయిన్ పంపులను నీళ్ళను లిఫ్ట్ చేయడానికి ఉపయోగించాం. ► పట్టిసీమ వల్ల 80 నుంచి 100 టీఎంసీల గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదికి మళ్ళించడానికి వీల వుతుంది. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు దీనివల్ల ప్రయోజనం జరుగుతుంది. ► గత వ్యవసాయ సీజన్లో సుమారు 4.20 టీఎంసీల నీటిని పట్టిసీమ వద్ద లిఫ్ట్ చేయడం జరిగింది. మరో 4.6 టీఎంసీలను ఆడిపూడి వద్ద లిఫ్ట్ చేశాం. పట్టిసీమ నీటి వల్ల కృష్ణాడెల్టాలో రూ.2,500 కోట్ల విలువైన వరిపంటను కాపాడాం. -
రూ.1,600 కోట్లు నీటిపాలు!
పట్టిసీమపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ♦ 180 టీఎంసీల కృష్ణా డెల్టాను 4 టీఎంసీలతో కాపాడారట ♦ బాబు చెప్పడం.. మేం చెవిలో పూలు పెట్టుకుని వినడం.. ♦ 190 టీఎంసీల నిల్వసామర్థ్యం ఉండబట్టే పోల‘వరం’ అయ్యింది.. ♦ పట్టిసీమకు స్టోరేజీ కెపాసిటీ ఏది? ♦ పోలవరం కుడికాల్వ 70 శాతం పూర్తి చేసింది వైఎస్ కాదా? ♦ అది ఉండబట్టే ఆ కాసిన్ని నీళ్లయినా సరఫరా.. ♦ నిబంధనలకు విరుద్ధమైన పట్టిసీమ వల్లే బాబు నోరెత్తడం లేదు.. ♦ మహారాష్ర్టతో తెలంగాణ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నా గప్‌చుప్.. ♦ పైగా ఓటుకు కోట్లు కేసు వల్ల కేసీఆర్ అంటే బాబుకు భయం ♦ బాబు ఔట్‌డేటెడ్ అని ఆయన ప్రసంగమే చెబుతోంది.. సాక్షి, హైదరాబాద్ : ‘పట్టిసీమ ద్వారా నీళ్ళిచ్చి కృష్ణాడెల్టాను కాపాడానని చంద్రబాబు నాయుడు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. 180 టీఎంసీలు అవసరం ఉండే కృష్ణా డెల్టాను పట్టిసీమ ద్వారా 4 టీఎంసీల నీళ్ళిచ్చి ఎలా కాపాడతారు? నాకు అర్థం కావడం లేదు. ఇది చంద్రబాబు చెబుతా ఉన్నారు... చెవుల్లో పూలు పెట్టుకుని మేం వింటా ఉన్నాం. నిజంగా ఇంతకన్నా దారుణమేదీ ఉండదు’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శాసనసభలో పట్టిసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ప్రకటన చేశారు. ఏడాదిలో పట్టిసీమను పూర్తి చేసిన ఘనత తనదేనని, పట్టిసీమ నీటిని లిఫ్ట్ చేసి కృష్ణా డెల్టాను కాపాడామని సీఎం చెప్పారు. సీఎం ప్రసంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి వాస్తవాలను సభ దృష్టికి తెచ్చారు. ‘పట్టిసీమ కోసం రూ. 1,600 కోట్లు ఖర్చు పెట్టారు. అవే రూ. 1,600 కోట్లు పోలవరం ప్రాజెక్టుపై పెట్టి ఉంటే ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చేది. వాటిని గాలేరు-నగరిపై పెడితే ప్రాజెక్టు పూర్తయిపోయి ఉండేది. వాటిని హంద్రీ నీవాపై పెట్టి ఉంటే ఆ ప్రాజెక్టుకు ఒక రూపు వచ్చేది. పట్టిసీమ పేరుతో చంద్రబాబు 1,600 కోట్ల రూపాయలు నీళ్లపాలు చేశారు’ అని జగన్ విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... పోలవరం కుడికాల్వ వైఎస్ పుణ్యమే ‘‘చంద్రబాబు ఈ రోజు పట్టిసీమ గురించి పదేపదే చెబుతున్నాడు. అసలా నీళ్లు కిందకు వెళ్తున్నాయంటే దానికి కారణం పోలవరం కుడికాల్వ. పోలవరం కుడికాల్వ పనులు 70 శాతం చేసిందెవరు అంటే... దివంగత నేత రాజశేఖర రెడ్డి అనేది సుస్పష్టం. ఆ రోజున ఆ మహానేత కుడికాల్వపై దృష్టి పెట్టడం వల్లే ఈ రోజు చంద్రబాబు ఆ నీళ్లను లిఫ్ట్ చేశానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాడు. పోలవరం ప్రాజెక్టుకు జూలై, నవంబర్ వరకూ నీళ్ళు ఎక్కువగా వస్తాయి. కృష్ణాలో కూడా సెప్టెంబర్, అక్టోబర్‌లో ఇదే మాదిరిగా నీళ్ళు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల నీటిని నిల్వచేస్తేనే మనం ఉపయోగించుకోగలుగుతామని దశాబ్దాల క్రితమే ప్రణాళికలు రూపొందించారు. పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. 2015-16లో 2 వేల టీఎంసీల గోదావరి నీళ్ళు సముద్రం పాలైనట్టు రికార్డులే చెబుతున్నాయి. అసలు పట్టిసీమకు స్టోరేజీ కెపాసిటీ ఎక్కడుంది? నిల్వ చేసే సదుపాయమే లేనపుడు పట్టిసీమ వల్ల ఉపయోగమేమిటి? పోలవరంలో 190 టీఎంసీల స్టోరేజీ సామర్థ్యం ఉంది. అందుకే పోలవరం వరమైంది. స్టోరేజీ కెపాసిటీని దృష్టిలో ఉంచుకునే పోలవరాన్ని ప్రతిపాదించారు. 7ఈ, 7ఎఫ్ క్లాజులతో ఇక్కట్లే.. చంద్రబాబు పట్టిసీమ కట్టడం వల్ల మరో ప్రమాదం పొంచి ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌లోని క్లాజ్ నంబర్ 7ఈ, 7ఎఫ్ ప్రకారం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు దీన్ని వివాదం చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రకు రావాల్సిన నీళ్ళను పాలమూరు నుంచి రంగారెడ్డి వరకూ లిఫ్ట్ పెట్టి టెండర్లు పిలిస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు అడ్డుకోవడం లేదు? పట్టిసీమ ప్రాజెక్టు కట్టడంతో క్లాజ్ 7ఈ, 7ఎఫ్ వల్ల ఇబ్బందులున్నాయి కాబట్టే చంద్రబాబు అడగలేకపోతున్నారు. కేసీఆర్ అంటే బాబుకు భయం గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రితో మంతనాలు నడుపుతున్నారు. మరి చంద్రబాబును వాళ్ళు ఎందుకు పిలవడం లేదని అడుగుతున్నా. కారణమేమిటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబు నాయుడుకు లేదు. ఓటుకు కోట్లు కేసును బయటకు తీస్తాడేమోనని భయపడుతున్నాడు’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అజ్ఞానితో మాట్లాడలేం ‘తెలియని వ్యక్తికైతే చెప్పవచ్చు. తెలిసిన వ్యక్తితో అయితే మాట్లాడొచ్చు. కానీ అన్నీ తెలుసు అనే అజ్ఞానితో మాత్రం మాట్లాడటం ఎవరికీ చేత కాదు. చంద్రబాబు నాయుడుగారి పరిస్థితి ఇదే’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై జగన్ ప్రసంగిస్తుండగా సీఎం పలుమార్లు జోక్యం చేసుకున్నారు. విపక్ష సభ్యులకు సాగునీటి ప్రాజెక్టులపై సబ్జెక్ట్ లేదని, వాళ్ళకు ఎన్నిసార్లయినా క్లాస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పదేపదే అన్నారు. ఈ నేపథ్యంలో విపక్ష నేత పై విధంగా వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నంగా సీఎం చంద్రబాబు ‘జగన్మోహన్రెడ్డి గారు మీకు ఇంకా ఎంతో భవిష్యత్ ఉంది...’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్ష నేత స్పందిస్తూ, ‘చంద్రబాబు నాయుడు దాదాపు గంటన్నర అనర్గళంగా మాట్లాడిన మాటల్లో నాకు ఒక విషయమైతే అర్థమైంది... తాను ఔట్‌డేటెడ్ అయిపోయానని తన గురించి ఆయన చెప్పకనే బాగా చెప్పుకున్నారు’ అని వ్యంగ్యోక్తి విసిరారు. -
'వారి అక్రమార్జనకే పట్టిసీమ నిర్మాణం'
చిత్తూరు: అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పేరంటేనే ఉలిక్కిపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు రాజకీయంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేదని పెద్దిరెడ్డి విమర్శించారు. ప్రతిపక్షం లేకుండా శాసనసభ సమావేశాలు నిర్వహించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారని ఆయన చెప్పారు. ప్రజాసమస్యలపై ప్రతిపక్షం అడిగే.. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎం, మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం వారి దిగ జారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మళ్లించడం కోసం బాబు మైండ్‌గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చంద్రబాబుకు ప్రజలు సరైన సమయంలో బుద్దిచెబుతారని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచిన శాసనసభ్యులను నిస్సిగ్గుగా టీడీపీలో చేర్చుకోవడం బాబు అవకాశవాద రాజకీయాలకు నిరద్శనమన్నారు. అధికాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా దోచుకున్న కోట్లాది రూపాయలు ఎమ్మెల్యేలకు ఎరచూపి టీడీపీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి అడుగడుగునా ప్రతిపక్షం అడ్డుతగులుతోందన్న భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనడం కోసం అడ్డదారులు వెతుకుతున్నారని ఆరోపించారు. బాబు చేతనైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రోజుకో ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప చంద్రబాబు ప్రజలకు చేసిందేమీలేదని ఆరోపించారు. -
'పట్టిసీమను ఆ నిధులతోనే పూర్తిచేశాం'
హైదరాబాద్: పోలవరం కోసం కేంద్రం ఇచ్చే నిధుల్ని పట్టిసీమకు మళ్లించలేదని.. రాష్ట్రప్రభుత్వ నిధులతోనే పూర్తిచేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నదుల అనుసంధానం వల్ల రాయలసీమకు నీళ్లిచ్చే అవకాశం దక్కిందని అన్నారు. తాను త్వరలో ఢిల్లీ వెళుతున్నాననీ, పోలవరం పనులు కేంద్రం చేస్తామని చెబితే సంతోషంగా వాళ్లకు అప్పగిస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు రూ.50 కోట్లు చొప్పున కేంద్రం ఇచ్చిందని చెప్పారు. ఇంకా కేంద్రం నుంచి రూ. 13, 500 కోట్లు రెవిన్యూ లోటు భర్తీ జరగాల్సి ఉందని అన్నారు. రాజధాని అమరావతికి పెద్ద ఎత్తునా పెట్టుబడులు రావాలని చెప్పారు. అలాగే పెట్టుబడుల సమీకరణకు తాను ఇంగ్లండ్ వెళుతున్నానని చంద్రబాబు తెలిపారు. రాజధాని మౌలిక సదుపాయల కల్పనకు నిధులు రాబట్టే విషయంలో రకరకాల ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని, ప్రతిపక్ష నేతల్ని చూశాను అని చంద్రబాబు అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు పరిహారం ఇచ్చి భూములు అభివృద్ధి చేసి అందించే బాధ్యత ప్రభుత్వానికి వుందని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. దేశంలో ఇవాళ మనం గ్రోత్ రేటులో అగ్రస్థానంలో వున్నామని చంద్రబాబు అన్నారు. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరైతు సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మార్కండేయ కల్యాణ మండపంలో మూడు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 17వ మహాసభలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా 75 మంది కౌన్సిల్ సభ్యులు, 25 మంది కమిటీ సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సి.రామచంద్రయ్య( కర్నూలు), ప్రధాన కార్యదర్శిగా కేవీవీ ప్రసాద్ (ప్రకాశం), ఉపాధ్యక్షులుగా నారిశెట్టి గురవయ్య (గుంటూరు), కె.కాటమయ్య (అనంతపురం), రావు జగ్గారావు (విశాఖ), కార్యదర్శులుగా జగన్నాథరావు (కర్నూలు), గంగాభవానీ (విశాఖ), యల్లమందరావు (కృష్ణా), కోశాధికారిగా చెల్లుబోయిన కేసవశెట్టి(తూర్పుగోదావరి)లను ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్యవర్గానికి రైతు సంఘం ప్రతినిధులు, సీపీఐ నాయకులు అభినందనలు తెలిపారు. తీర్మానాల ఆమోదం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 17వ మహాసభల సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయాలని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కొబ్బరి పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కొబ్బరి బోర్డు ద్వారా వచ్చే అన్ని రాయితీలను రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని, పట్టిసీమ పేరుతో రూ.1300 కోట్లు దుర్వినియోగం చేసిన ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేయకుండా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదనలు చేశారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించడంతో పాటు మార్కాపురం, కందుకూరు, ఒంగోలు డివిజన్లను కలిపి ప్రత్యేక ఒంగోలు జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పోలవరం ముంపు మండలాల నిర్వాసితుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని తీర్మానం ప్రవేశపెట్టారు. పై తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
ప్రజల సమస్యలు పట్టని కలెక్టర్
ఉయ్యూరు (కంకిపాడు) : ‘జిల్లా ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్మినా డబ్బులు రైతులు రాక అవస్థపడుతున్నారు. అర్హత ఉన్నా పింఛన్లు రాక, రేషన్ అందక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కలెక్టరుకు ఇవేమీ పట్టడం లేదు. ఎంత వరకూ ముఖ్యమంత్రి వద్ద పేరు తెచ్చుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు ముడుపులు తెచ్చిపెట్టే పనులపైనే శ్రద్ధ చూపుతున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శించారు. ఆయన శనివారం కంకిపాడులో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొందని, మచిలీపట్నం, తరకటూరు, పెడన పరిసర ప్రాం తాల్లో చెరువులు పూర్తిగా ఎండిపోయి తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అర్హత ఉన్నా పింఛన్లు రాక, ఈ పోస్ యంత్రాల ద్వారా రేషన్ సజావుగా అందక లబ్ధిదారులు, విక్రయించిన ధాన్యం సొమ్ము అందక రైతులు ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నా, జిల్లాలో సమస్యలు పేరుకుపోయినా ఏ ఒక్క రోజూ కలెక్టరు ఈ అంశాలను సమీక్షించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలకు ముడుపులు తెచ్చిపెట్టే పట్టిసీమ ప్రాజెక్టు, కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు, పుష్కరాల నిర్మాణాల కాంట్రాక్టులపై పదేపదే సమీక్షలు చేస్తూ ముఖ్యమంత్రి వద్ద మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. పట్టిసీమ కాలువలకు జిల్లాలోని లారీలను, మట్టి తవ్వే యంత్రాలను బలవంతంగా తీసుకెళ్లి పనులు చేయించిన కలెక్టరు, జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యపై ఒక్క ట్యాంకరైనా తీసుకెళ్లి తాగునీటిని సరఫరా చేశారా అని ప్రశ్నించారు. జిల్లా మంత్రులు కూడా సమస్యలపై స్పందిండం లేదని దుయ్యబట్టారు. తక్షణమే జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యపై సమీక్ష జరిపి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాపులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బీసీలకు అన్యాయం జరగదనే భరోసా ఇవ్వాలని సూచించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి వంగవీటి శ్రీనివాసప్రసాద్, పట్టణ అధ్యక్షుడు జంపాన కొండలరావు, నాయకులు అల్లాం పాల్గొన్నారు. -
ఎవరి ‘పట్టు’ వారిదే
-
ఎవరి ‘పట్టు’ వారిదే
పట్టిసీమపై గోదావరి బోర్డు ముందు ఏపీ, తెలంగాణ భిన్నవాదనలు పోలవరంలో అంతర్భాగం కాదు ఆ ప్రాజెక్టు పూర్తిగా అక్రమం గోదావరి నీటిని ఏకపక్షంగా మళ్లించే హక్కు ఏపీకి లేదు: తెలంగాణ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమేనన్న ఏపీ ఎటూ తేల్చని బోర్డు.. కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ముందు భిన్నవాదనలు వినిపించాయి. ప్రాజెక్టు పూర్తిగా అక్రమమని తెలంగాణ స్పష్టం చేయగా, పోలవరంలో అంతర్భాగంగానే ప్రాజెక్టును చేపట్టామని ఏపీ పేర్కొంది. తమ హక్కులకు భంగం కలిగేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బాధ్యత బోర్డుపై ఉందని తెలంగాణ గట్టిగా వాదించింది. దాన్ని చేపట్టే పూర్తి హక్కు తమకు ఉందని ఏపీ కూడా అంతే గట్టిగా చెప్పడంతో బోర్డు ఎటూ తేల్చలేకపోయింది. గురువారమిక్కడి జలసౌధలో చైర్మన్ రాం శరాణ్ అధ్యక్షతన గోదావరి బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, సభ్యుడు(విద్యుత్ ) ఎస్కే పట్నాయక్, కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సీఈ ఎన్.కె.మాథుర్, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ చీఫ్ ఇంజనీర్(అంతర్రాష్ట్ర వ్యవహారాలు) రామకృష్ణ హాజరయ్యారు. ఏడాది తర్వాత జరిగిన ఈ సమావేశంలో బోర్డు నిర్వహణ, బడ్జెట్ అంశాలను వదిలిస్తే ప్రధాన వాదన పట్టిసీమ చుట్టే తిరిగింది. తెలంగాణ వాదన ఇదీ.. పట్టిసీమపై ఏపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలంగాణ వాదించింది. ‘‘పోలవరం ప్రాజెక్టులో భాగం కాని పట్టిసీమతో కొత్తగా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ఏపీ చూస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 84(3), 85(8)కు వ్యతిరేకంగా ఏకపక్షంగా దీనిపై నిర్ణయం చేసింది. బోర్డు కానీ అపెక్స్ కౌన్సిల్ నుంచి కానీ అనుమతి తీసుకోలేదు. 1978నాటి ఒప్పందం గోదావరి నీటి వినియోగంలో ఏపీకి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. వివిధ బేసిన్ల నుంచి వచ్చే నీటిపై ఏపీకి హక్కులు ఉండేలా ఆ ఒప్పందంలో ఉంది. ఆ హక్కులు ఇప్పుడు విభజన తర్వాత తెలంగాణకు వర్తిస్తాయి. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే అయితే తెలంగాణకు ఆ నీటిలో వాటా ఉంటుంది. తెలంగాణను కాదని ఏకపక్షంగా గోదావరి నీటిని మళ్లించడానికి ఏపీకి హక్కు లేదు’’ అని తెలిపింది. ఏపీ ఏమందంటే..? తెలంగాణ వాదనపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగానే పట్టిసీమ చేపట్టామని తెలిపింది. పోలవరం నుంచి 80 టీఎంసీల నీటిని కుడి కాల్వ ద్వారా కృష్ణాకు మళ్లించడానికి అనుమతి ఉందని, అదే నీటిని పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా మళ్లిస్తున్నందున.. ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేద ని పేర్కొంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరంలో అంతర్భాగం అని పార్లమెంట్లో కేంద్రమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ సందర్భంగా తెలంగాణ చేపడుతున్న పలు కొత్త ప్రాజెక్టులు, రీ ఇంజనీరింగ్ చేస్తున్న ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం తెలిపింది. అయితే అవన్నీ ప్రాథమిక దశలో ఉన్నాయని, ఇంకా డీపీఆర్‌లు కూడా తయారు కాలేదని తెలంగాణ పేర్కొంది. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులపైనా సందిగ్ధత బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టుల అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, కంతనపల్లి, దుమ్ముగూడెం వంటి ప్రాజెక్టులతోపాటు, ఎస్సారెస్పీ, నిజాంసాగర్, కడెం, అలీసాగర్, సింగూర్, సదర్‌మఠ్ బ్యారేజీలను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ వాదించింది. దీన్ని తెలంగాణ వ్యతిరేకించింది. ప్రధాన ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ కొనసాగుతోందని, ఏ ప్రాజెక్టుకు ఎంత నీటి వాటా అన్న అంశం తేలనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం సరికాదని పేర్కొంది. అందుకు ఏపీ.. నీటి వినియోగానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి ఉన్న అన్ని ప్రాజెక్టులు బోర్డు పరిధిలో ఉండాలని కోరింది. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును కూడా బోర్డు పరిధిలో చేర్చడానికి అంగీకరించకుండా.. తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చాలని అడగడం, సీలేరు విద్యుత్‌ను షెడ్యూలింగ్‌లో పేర్కొనాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదని ఏపీ వాదించింది. బోర్డు పరిధిపై స్పష్టత రాకుండా సీలేరు విద్యుత్‌పై చర్చించాల్సిన అవసరం లేదంటూ ఏపీ చేసిన వాదనతో బోర్డు ఏకీభవించింది. సీలేరు విద్యుత్‌పై కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంటుందని, బోర్డులో చర్చించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బోర్డు వ్యయం రూ.8 కోట్లు: చైర్మన్ శరాణ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో బోర్డు నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు రూ.8 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని, ఈ మొత్తాన్ని రెండు రాష్ట్రాలు చెరిసగం భరించడానికి అంగీకరించాయని సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ రాం శరాణ్ ‘సాక్షి’కి చెప్పారు. బోర్డు ముసాయిదా నియమావళికి ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని, దీన్ని కేంద్ర జల వనరుల శాఖకు పంపిస్తామని తెలిపారు. ప్రాజెక్టుల డేటా ఇవ్వడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని వెల్లడించారు. -
వట్టిపోయిన పట్టిసీమ ఆవిరి
పులిచింతలలోనూ నీరు లేదు కృష్ణాడెల్టాలో తాగునీటికి కటకటే రబీ అంటేనే భయపడుతున్న రైతాంగం విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టు పడకేసింది. ప్రస్తుతం గోదావరి జలాలు పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణానదిలో కలవడం పూర్తిగా నిలిచిపోయింది. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పడిపోవడంతో గోదావరి నదులపై ఉన్న ఎత్తిపోతల పథకాలను ఆపివేయాలంటూ అక్కడి చీఫ్ ఇంజినీర్ ఆదేశించడంతో తాడిపత్రి, పట్టిసీమ వద్ద ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకాలను ఇటీవల నిలుపుదల చేశారు. ప్రస్తుతం గోదావరి నీరు కేవలం గోదావరి డెల్టాకు మాత్రమే సరిపోతుందని, కృష్ణాడెల్టాకు పట్టిసీమ ద్వారా చుక్క నీరు రావడం కష్టమేనని మన ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ సీజన్‌కు పట్టిసీమ ద్వారా వచ్చిన నీరు ఇక ఆగిపోయినట్లేనని అంటున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఒక్కరోజు కూడా 1500 క్యూసెక్కులకు మించి నీరు కృష్ణానదికి రాలేదనేది నిష్టుర సత్యం. రబీ ఆశలూ గల్లంతేనా! ఖరీఫ్‌లో ప్రభుత్వం నీరివ్వకుండా చేతులెత్తేయడంతో కృష్ణాడెల్టా రైతులు రబీపై ఆశలు వదులుకున్నారు. బందరు, పెనమలూరు, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో వ్యవసాయాధికారులు మినుము, పెసర విత్తనాలను సరఫరా చేస్తూ రైతుల్ని రబీవైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వానలు కూడా లేనందున మినుము, పెసర విత్తనాలు ఏమేరకు మొలుస్తాయనే అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని, ఇప్పుడు అపరాల వల్ల నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కనీసం ఐదు టీఎంసీల నీరును వదిలిపెట్టాలంటూ కృష్ణా నీటి యాజమాన్య బోర్డును అధికారులు కోరుతున్నారు. ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ నీరు వచ్చి జిల్లాలోని చెరువులు నింపితే రాబోయే మూడు, నాలుగు నెలల్లో కొంతమేరకు నీటి ఎద్దడి తగ్గుతుందని, లేకపోతే గ్రామాల్లో రైతులు, పశువులు నీటి కోసం కూడా విలవిల్లాడాల్సి వస్తుందని ఇంజినీర్లే అంగీకరిస్తున్నారు. కాల్వల మరమతులపై దృష్టి.. ప్రస్తుతం నీరు అందుబాటులో లేకపోవడంతో కాల్వల మరమతులపై ఇరిగేషన్ అధికారులు దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది ఆపివేసిన కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. బోర్డు నీరిస్తే ఒక విడత చెరువులు నింపి ఆ తర్వాత పనులు ప్రారంభిస్తే ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. పులిచింతల సంగతి సరేసరి.. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీరు అడుగంటింది. పులిచింతల జలాశయంలో కేవలం 0.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎనిమిది అడుగుల నీరు మాత్రమే ఉండడంతో ఎన్టీటీపీఎస్కు అవసరమయ్యే నీరు కూడా అందడం లేదు. దీంతో అధికారులు మోటార్లతో నీటిని తోడుకుని ప్లాంట్‌ను నడుపుతున్నారు. ఈ దశలో ప్రకాశం బ్యారేజీ దిగువకు నీరు వదలడం కష్టమని ఇరిగేషన్ ఇంజినీర్లు చెబుతున్నారు. -
బాబు కుటుంబానికి రూ.500 కోట్ల ముడుపులు
అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై కోర్టుకు వెళతామని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా మడకశిరలో మట్టి సత్యాగ్రహం నిర్వహించిన అనంతరం రాయలసీమ వెనుకబాటుతనంపై విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆ ముగ్గురూ స్పందించాలన్నారు. లేకపోతే కోర్టులో కేసు వేస్తామన్నారు. పట్టి సీమ ప్రాజెక్టు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి రూ.500 కోట్ల ముడుపులు అందాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో నిర్వహిస్తున్న మట్టి సత్యాగ్రహానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని, కన్నతల్లి, సొంత ఊరును విస్మరించే నైజం ఆయనదని రఘువీరా విరుచుకుపడ్డారు. సీఎంకు అమరావతి తప్ప ఇతర ప్రాంతాలు కనిపించడం లేదని ఆయన విమర్శించారు. 2015కి పూర్తి కావల్సిన ప్రాజెక్టులకు అతీగతీ లేదన్నారు. ఏపీకి ప్యాకేజీ విభజన చట్టంలోనే ఉందన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పోటీలు పడి మరీ ప్రత్యేక విమానాలు వేసుకుని తిరుగుతున్నారని రఘువీరా ధ్వజమెత్తారు. తమ పర్యటనలకు వందల కోట్లు తగలేస్తున్నారని, దేశాలు తిరిగితే పరిశ్రమలు రావని, రాయితీలు ప్రకటిస్తే పరిశ్రమలు వస్తాయని ఆయన అన్నారు. -
పంటలు లేకనే రైతుల ఆత్మహత్యలు: చంద్రబాబు
అనంతపురం: పంటలు పండకనే రాష్ట్ర రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తలుపురులో నిర్వహించిన 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్టాడెల్టాకు నీరందంచి, శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తరలిస్తామని చెప్పారు. ఏపీలో 24 వేల కోట్ల రుణాలు మాఫీ చేసి చరిత్ర సృష్టించామన్నారు. త్వరలో పోలీస్, ఆరోగ్యశాఖలను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. -
అమరావతి చంద్రబాబు కట్టుకుంటున్న కోట: ఉండవల్లి
రాజమండ్రి : పట్టిసీమ ప్రాజెక్ట్ జీవో, అగ్రిమెంట్ కాపీలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం పరిశీలించారు. ఇవాళ ఉదయం ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లిన ఆయన ప్రాజెక్ట్ రికార్డులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడమే ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు అని, రిజర్వాయర్ లేకుండానే 80 టీఎంసీలు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఉండవల్లి విమర్శించారు. పట్టిసీమలో రూ.490 కోట్లు మేరకు అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. అయినా ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదని... రూ.830 కోట్లు ఖర్చుపెట్టి 53 శాతం పని చేసినట్లు చూపించారని ఉండవల్లి అన్నారు. అమరావతి చంద్రబాబు నాయుడు కట్టుకుంటున్న కోట అని, అందులో ప్రజలకు భాగస్వామ్యం లేదని ఆయన ధ్వజమెత్తారు. -
'కృష్ణా, సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి'
గుంటూరు: గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను గురువారం వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), డాక్టర్ గోపిరెడ్డి, కోనా రఘుపతి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని వారు జిల్లా జాయింట్ కలెక్టర్ ను డిమాండ్ చేశారు. పట్టిసీమ నిర్మాణంతో కృష్ణాడెల్టాకు నీరు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడేమి చేస్తోందని వారు ప్రశ్నించారు. కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు వెంటనే నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని వైఎస్ఆర్ సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. -
'ఒక్క చుక్క నీరు తేలేకపోయారు'
గుంటూరు: పట్టిసీమతో కృష్టాడెల్టాను సస్యశ్యామలం చేస్తామని చెప్పి, డెల్టా మొత్తం ఎండిపోతున్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీరు తెస్తామన్న చంద్రబాబు ఒక్క చుక్కనీరు తేలేకపోయారన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు వందకోట్లు ఖర్చు చేసి ఉంటే 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతలను నిర్మించారనే కారణంతోనే చంద్రబాబు దానిని పట్టించుకోవడం లేదని అంబటి తెలిపారు. -
పట్టిసీమ నీరు కృష్ణాకు చేరకముందే లీకేజీలు
-
ఏపీ సర్కార్‌పై సోమువీర్రాజు ఫైర్
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు విషయమై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని తెలిపారు. ఏపీ బీజేపీ నేతలు గురువారం ఢిల్లీ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాను కలిశారు. అనంతరం సోమువీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఇచ్చినమాటను నిలబెట్టుకుంటామని తెలిపారు. ప్రత్యేక హోదాపై నిర్ణయం ఆలస్యంతో ఏపీకి నష్టమేమీ జరుగదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తున్నా ఏపీ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని చెప్పారు. కేంద్ర నిధులను బ్యాంకుల్లో పెట్టుకొని వడ్డీలు తింటున్నారని విమర్శించారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు ఒక్క చుక్కనీరు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజలందర్నీ ఏపీ సర్కార్ గందరగోళంలో పడేస్తోందని అన్నారు. -
పట్టిసీమ, భోగాపురంపై ఎన్నో సందేహాలు: పురందేశ్వరి
అద్దంకి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ, భోగాపురం ప్రాజెక్టులపై తమకు అనుమానాలున్నాయని బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకికి మంగళవారం వచ్చిన పురందేశ్వరి విలేకరులతో మాట్లాడారు. ఆయా ప్రాజెక్టులపై మిత్రపక్షమైన తమకు కలిగిన అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోయినా.. దానికి సమానమైన అవకాశాలు కల్పించడానికి కేంద్రం చూస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నూతన రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వనుందా.. అనే దానికి రాజధాని మాస్టర్ ప్లాన్, డిస్ట్రిబ్యూటరీ ప్రాజెక్టు రిపోర్టు ఇంత వరకూ పంపకపోతే ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు. -
రికార్డు సృష్టించాం: చంద్రబాబు
-
రికార్డు సృష్టించాం: చంద్రబాబు
అనంతపురం: కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సహకరించకపోయినా రైతులకు రుణమాఫీ చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. 5 నెలల 20 రోజుల్లో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు సృష్టించామని చెప్పారు. పట్టి సీమ నుంచి 100 టీఎంసీలు హంద్రీనీవా, గాలేరు-నగరి, పోతిరెడ్డిపాడులకు తరలిస్తామన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలి, ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రాజధానిపూజకు అక్టోబర్22న ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారన్నారు. అనంతపురంలో రూ. 500 కోట్లతో బీఈఎల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
సాగర్‌ను సిద్దేశ్వరం దగ్గర కట్టి ఉంటే..
కర్నూలు సిటీ: పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చకు రావాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. సాగర్‌ను సిద్దేశ్వరం దగ్గర కట్టి ఉంటే.. ఈ రోజు రాయలసీమ పచ్చటి పొలాలతో కళకళలాడేదన్నారు. మంగళవారం ఆయన కర్నూలులోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల గురించి పట్టించుకోని బాబు.. రైతు యాత్రల పేరిట ఏసీ బస్సుల్లో తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. బాబుకి రైతులంటే అలర్జీ అని, అన్నదాతల వాసనంటే గిట్టదన్నారు. ఈ నెల 23న జెడ్పీ సమావేశంలో శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటి మట్టంపై తీర్మానం చేసేందుకు ప్రతి పక్షాలు పట్టుబడితే.. డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి వాకౌట్ చేసుకోండి అని చెప్పడం ఆ పార్టీ నేతల అహంకారానికి నిదర్శనమన్నారు. నాగార్జునసాగర్ నిర్మించేటప్పుడు కూడా నాటి ప్రభుత్వ పెద్దలు సాగర్ నీటితో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ఇచ్చిన మాటను ఇక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. హంద్రీనీవా కాంట్రాక్టర్లందరూ బాబు చూట్టే ఉన్నారని, వారి అక్రమాల వల్లే కాలువకు గండ్లు పడుతున్నాయన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పరిధిలో రైతులకు తెలియకుండా రిలయన్స్‌కు 5,500 ఎకరాల భూములను కట్ట బెట్టారని, ఈ వ్యవహారంపై వచ్చే నెల 14, 15, 16 తేదీల్లో రైతుల బతుకుదెరువు యాత్ర చేపడతానన్నారు. -
దమ్ముంటే పట్టిసీమపై చర్చకు రావాలి
దమ్ముంటే టీడీపీ నేతలు పట్టిసీమపై చర్చకు రావాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి సవాలు విసిరారు. కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ.. పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటున్న చంద్రబాబు, ఆయన మంత్రులు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చను ఏర్పాటు చేసి ఆ విషయం చెప్పాలన్నారు. టీడీపీ నేతలు అబ్బసొత్తులా భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కర్నూలు ప్రజలకు తెలియకుండా కర్నూలులో 5500 ఎకరాలను రిలయన్స్ సంస్థకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. -
ఇంకా పట్టిసీమలోనే..
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన హంద్రీనీవా పాత మోటారు ఇంకా పట్టిసీమలోనే ఉంది. ఈనెల 18న హడావుడిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ఈ మోటారును హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన 24 గంటల్లోనే జానంపేట వద్ద అక్విడెక్ట్‌కు గండి పడటంతో గోదావరి నుంచి నీటి తోడకాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 6వ నంబర్ వెల్‌కు బిగించిన హంద్రీనీవా పాత మోటారును తొలగించారు. దీని స్థానంలో చైనానుంచి తెచ్చిన మోటారును చైనా ఇంజినీర్లు బిగిస్తున్నారు. పాత మోటారును హంద్రీనీవాకు తరలిస్తామని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించినా.. దానిని అక్కడికి తీసుకెళ్లలేదు. -
పట్టిసీమతో ఒరిగేది ఏమీలేదు
చిత్తూరు (అగ్రికల్చర్) : పట్టిసీమ వల్ల ఒరిగేది ఏమీ లేదని బీజేపీ కేంద్ర మహిళామోర్చా అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. శుక్రవారం చిత్తూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ పట్టిసీమ పథకం ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తానని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు ఎంతవరకు నిజమని ఆమె ప్రశ్నించారు. గోదావరి నీటిని కృష్ణా నదికి మల్లిస్తున్నామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారని, అయితే ఇప్పటికే ప్రకాశం బ్యారేజికి 1,200 క్యూసెక్కుల నీరు చేరిందని, ఈ బ్యారేజిలోకి గోదావరి నీటిని తీసుకొచ్చి ఎక్కడ పోస్తారని ఆమె ప్రశ్నించారు. పట్టిసీమను మూడేళ్లు మాత్రమే కొనసాగిస్తామని ఇదివరలోనే చంద్రబాబు ప్రకటించారని, ఈ మేరకు ప్రభుత్వం జీవోలో కూడా తెలియజేసిందని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే పట్టిసీమ వల్ల రాయలసీమకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో అర్థమవుతుందన్నారు. పోలవరం నిర్మాణం పూర్తయితే రాయలసీమకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పోలవరం నిర్మాణానికి గతంలో కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ఈ నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఖర్చులను చూపెట్టకపోయినా, మరో మారు రూ. 350 కోట్లను కేటాయించిందని చెప్పారు. అయినా ఇప్పటి వరకు 2 శాతం పనులను కూడా పూర్తి చేయలేదన్నారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోందన్నారు. ఇప్పటివరకు అధికార లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1.26 కోట్ల ఘనపు మీటర్ల ఇసుకను తరలించినట్లు చూపెడుతున్నారన్నారు. అయితే వాస్తవానికి దాదాపు 4 కోట్ల ఘనపు మీటర్ల మేరకు రాష్ట్ర అధికార పార్టీ నాయకులు దోచుకున్నట్లు తెలుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రాభివృద్ధికి రూ. 1,500 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు ఎంత నిధులు ఖర్చుపెట్టారనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రమాణాలు చూపడంలేదన్నారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తోందో అర్థమవుతుందని తెలిపారు. -
'రాయలసీమకు పట్టిసీమ నీళ్లు సందేహమే'
చిత్తూరు: రాయలసీమకు పట్టిసీమ నీళ్లు ఇవ్వడం సందేహమేనని కేంద్ర మాజీమంత్రి దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రాయలసీమకు దాహార్తిని తీర్చేవి హంద్రీనీవా, నగరి, గాలేరు మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రం చేపట్టిన పథకాలు పార్టీకి పేరు తేవడం లేదని అన్నారు. -
మరో 10 మోటార్ల తరలింపు?
హంద్రీనీవా నుంచి పట్టిసీమకు పంపేందుకు యత్నాలు కర్నూలు సిటీ/నందికొట్కూరు: హంద్రీనీవా ప్రాజెక్ట్ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మరో పది మోటార్లను తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఒక మోటారును తరలించిన ప్రభుత్వం.. తాజాగా మరో పది మోటార్లను తరలించాలని అధికారులకు అనధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అధికారులు మాత్రం కేవలం ట్రయల్ రన్ కోసమే తరలిస్తున్నామని చెబుతుండడం గమనార్హం. వాస్తవానికి హంద్రీనీవా పంపుల పనులు చేసిన సంస్థ.. పట్టిసీమ పనులు చేపట్టిన సంస్థ ఒకటే కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టిసీమ కోసం ఆర్డర్ చేసిన పంపులు వచ్చేందుకు మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో లిఫ్టు నుంచి రెండు మోటార్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని తరలించేందుకు అవసరమైన మోటార్లు సిద్ధం కాలేదు. దీంతో సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ హంద్రీనీవా సుజల స్రవంతి పథకం-1 మల్యాల లిఫ్ట్ నుంచి 6వ మోటారును రాత్రికి రాత్రే తరలించి అమర్చింది. రాష్ర్ట జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్విచ్ ఆన్ చేసి ఈ పంపు ద్వారానే నీటిని విడుదల చేశారు. పట్టిసీమకు అమర్చాల్సిన 24 మోటార్లు ఇంకా సిద్ధం కాలేదు. వీటి తయారీ ఆర్డర్‌ను బ్రెజిల్‌కు చెందిన ఓ కంపెనీకి ఇచ్చారు. అనుకున్న సమయానికి ఆ మోటార్లు రాలేదు. హంద్రీనీవాలో మొత్తం 8 లిఫ్టులు ఉండగా.. ఒక్కో లిఫ్టులో 12 మోటార్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో లిఫ్టు నుంచి 2 మోటార్ల చొప్పున మొత్తం 5 లిఫ్టుల్లోని 10 మోటార్లను పట్టిసీమకు తరలించే యోచనలో అధికారులు ఉన్నారు. అయితే, హంద్రీనీవా నుంచి మోటార్లను తరలిస్తే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సీమకు నీటి కష్టాలు తప్పవు శ్రీశైలం జలాశయంలో 834 అడుగుల నీటిమట్టం ఉంటే హంద్రీనీవా ద్వారా నీటిని తరలించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. తాగునీటి అవసరాలకూ దీని ద్వారానే నీటిని పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 841.4 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హంద్రీనీవాలో నీటి లిఫ్టింగ్ ప్రారంభమైంది. తాగునీటి అవసరాలకు 1,350 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి పంపులను తరలిస్తే సీమ జిల్లాల్లో తాగునీరు, సాగునీటికి ఇబ్బం దులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రయల్ రన్ కోసమే పట్టిసీమలో ట్రయల్ రన్ కోసమే మోటార్‌ను తరలించినట్లు హంద్రీనీవా పర్యవేక్షక ఇంజనీర్ చెప్పారు. 2 ప్రాజెక్ట్‌లకు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఒకటే కావడంతోనే తీసుకుపోయి ఉంటారని అన్నారు. ట్రయల్ రన్ పూర్తయ్యాక తిరిగి తీసుకొస్తారని తెలిపారు. సీమ ప్రజల నోట్లో మట్టికొట్టొద్దు పట్టిసీమ పథకంతో రాయలసీమకు సాగు, తాగునీరు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం... ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పలు రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. సీమకు ప్రాణప్రదమైన హంద్రీనీవా మోటార్లను పట్టిసీమకు తరలించాలన్న యోచనను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పట్టిసీమ వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనం దక్కకపోగా.. ప్రభుత్వం హంద్రీనీవా మోటార్ల తరలింపుతో సీమ ప్రజల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. తక్షణమే ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టిసీమ పథకానికి హంద్రీనీవా మోటారును రాత్రికి రాత్రే తరలించడాన్ని చూస్తే ప్రభుత్వం ఏ తరహాలో ప్రజలను మోసగిస్తోందో వెల్లడైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా నుంచి నీటిని విడుదల చేస్తే ఆ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు తెలపాల్సిన అవసరం లేదా? అని డీఈ శ్రీనివాస్‌నాయక్‌ను ప్రశ్నించారు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని ఐజయ్య పరిశీలించారు. -
పోలవరంపై దృష్టి పెట్టాలి
ప్రభుత్వానికి పేర్నినాని సూచన సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిరర్థకమైన పట్టిసీమ పథకాన్ని పక్కన పెట్టి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై తక్షణమే దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) డిమాండ్ చేశారు. చరిత్రాత్మకమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్న పట్టిసీమ పథక నిర్మాణం అపహా స్యం పాలైందని విమర్శించారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ నిరర్థకమైనదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు రైతు సంఘాల నాయకులు ఘోషించినా చంద్రబాబు పట్టించుకోలేదని, ఇప్పుడు అదే నిజమైందని చెప్పారు. రాయలసీమలోని హంద్రీనీవా ప్రాజెక్ట్ పంపులను తీసుకొచ్చి పట్టిసీమ వద్ద బిగించారని ఎద్దేవా చేశారు. గోదావరి నీటిని రాయలసీమకు తీసుకెళతామని, జగన్ దొడ్లోకి కూడా నీళ్లిస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారని, తీరా చూస్తే అది విఫలమైందని తెలిపారు. నదుల అనుసంధానం జరిగిందంటూ ప్రచార ఆర్భా టం చేశారని, వాస్తవానికి జరిగింది నిధుల అనుసంధానమేనని ధ్వజ మెత్తారు. ఏపీ నుంచి సింగపూర్‌కు, సింగపూర్ నుంచి ఏపీకి నిధుల అనుసంధానం జరిగిందని నాని దుయ్యబట్టారు. కృష్ణా డెల్టాకు నీటిని తీసుకువెళ్లడానికి 12 వేల క్యూసెక్కుల అక్విడెక్టు అవసరమైతే, కేవలం 2500 క్యూసెక్కుల సామర్థ్యం గల అక్విడెక్టును హడావుడిగా నిర్మించారని విమర్శించారు. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వెళ్లే గోదావరి నీటిని పట్టిసీమ పేరు చెప్పి పంపులతో తోడి పక్కదారిన సముద్రం లో కలిపినట్లుగా ఉందని ఆయన ఆశ్యర్యం వ్యక్తం చేశారు. పంపులకు సంబంధించిన అవి నీతిపై విచారణ జరిపి ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని జల వనరుల శాఖ మంత్రి ప్రకటించడం విడ్డూరమన్నారు. అవినీతితో వారు జేబులు నింపుకొని, సిబ్బంది ని బలిపశువులను చేస్తున్నారన్నారు. -
'మోసం చేసిన బాబు రాజీనామా చేయాలి'
పశ్చిమగోదావరి: జామం పేట వద్ద పట్టిసీమ కుడికాలువ గండిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, పలువురు నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యతాలోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబునాయుడు, దేవినేని ఉమ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ మేకా శేషు బాబు డిమాండ్ చేశారు. పట్టి సీమ పేరుతో ఇసుక, మట్టిని దోచుకుని వేలాది కోట్లు సంపాధించారని గంటా మురళి ఆరోపించారు. గండి ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బయటపడుతోన్న పట్టిసీమ అవినీతి కథ
-
'టీడీపీ నేతల జేబుల్లోకి పట్టిసీమ నిధులు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం పేరుతో పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వైఎస్ఆర్ సీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించి 48 గంటలు కూడా గడవక ముందే ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. చంద్రబాబు చేసింది నదుల అనుసంధానం కాదని, దీని పేరుతో నిధుల అనుసంధానం చేశారని, గోదావరి నీటిని వృథాగా సముద్రం పాలు చేశారని పేర్ని నాని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిధులు టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని చెప్పారు. ఉద్యోగుల్ని బలిపశువులను చేసే ప్రయత్నం చేస్తున్నారని, పట్టిసీమను పక్కనబెట్టి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని పేర్నినాని అన్నారు. -
నీళ్లు నిధులూ వృధా...
-
ఉమా రాజీనామా చేయాల్సిందే
పోలవరం కుడికాల్వకు గండిపడిన వైనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. ఈ ఘటనకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావే బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క పంపుతోనే గండిపడితే.. ఇక 12 పంపులు పూర్తిగా నిర్మించిన తర్వాత పరిస్థితి ఏంటని సుబ్బారాయుడు ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి జరిగిందనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని ఆయన చెప్పారు. -
నిధుల అనుసంధానం
-
అనుసంధానం ముసుగు జారి.. కొల్లేటికి చేరిన అవినీతి కథ!
‘అనుసంధానం’ పేరుతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రదర్శించిన నాటకం రక్తి కట్టలేదు. పుష్కరాల్లో చేసిన పబ్లిసిటీ వేట లాగే ఇదీ వికటించింది. పట్టిసీమ పేరుతో లేచిన అవినీతి ‘కురుపు’ కనిపించకుండా ‘అనుసంధానం’ అనే ముసుగును కప్పేశారు. ఎవరి కంటా పడకుండా హంద్రీనీవా ప్రాజెక్టు మోటారును రహస్యంగా ఎత్తుకొచ్చారు. మూడురోజులు తంటాలు పడి కాసిన్ని గోదావరి నీళ్లు తోడి పోశారు. తోడుగా కొన్ని తాడిపూడి ఎత్తి పోతల నీళ్లను కలిపారు. వీటికి కొద్దిపాటి వర్షం నీరు తోడైంది. వైఎస్సార్ హయాంలో 80% పూర్తయిన పోలవరం కుడి కాల్వను ఉపయోగించుకొని కీర్తి కిరీటం పెట్టుకునే ప్రయత్నం చేశారు. మిగిలిన కొద్దిపాటి కాల్వ పనులను నాసిరకంగా ముగించడంతో కృష్ణాకు వెళ్లాల్సిన నీళ్లు తమ్మిలేరులోకి జారిపోయి కొల్లేరు బాట పట్టాయి. ఒక్క మోటారు ఆన్ చేస్తేనే బద్దలైన కుడికాల్వ అక్విడెక్ట్ * పట్టిసీమను హడావుడిగా పూర్తి చేసేందుకు నాణ్యత పట్టించుకోని ప్రభుత్వం * ప్రచార ఆర్భాటం కోసం హడావుడిగా ఏర్పాట్లు * మోటార్లు లేకుండానే నదుల అనుసంధానమంటూ సీఎం ఆర్భాటం * దివంగత వైఎస్ చేసిన పనులను తానే చేసినట్టుగా * చెప్పుకోవాలనే తాపత్రయం సాక్షి, హైదరాబాద్/ఏలూరు/కర్నూలు: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో మోసం మరోసారి బట్టబయలయింది. హంద్రీనీవా నుంచి మోటారు తీసుకొచ్చి పట్టిసీమలో బిగించడానికి ప్రభుత్వం అనుమతించడం.. సర్కారు మోసపూరిత వైఖరికి నిదర్శనం. హడావుడిగా చేస్తున్న పోలవరం కుడికాల్వ పనుల్లో నాణ్యత లేదంటూ సంబంధిత ఇంజినీర్లు నెత్తీనోరూ కొట్టుకున్నా.. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోని ఫలితం ఇప్పుడు బయటపడింది. రికార్డు సమయంలోనే పట్టిసీమలో మోటారు నడిపించామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల తాగునీటికి ఆధారమైన హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) నుంచి మోటారు తీసుకురావడానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రే అనుమతివ్వడం గమనార్హం. ఈనెల 11వ తేదీనే హంద్రీనీవా నుంచి మోటారు తీసుకురావడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయంపై రెండు, మూడు రోజుల ముందే సీఎం నుంచి మౌఖికంగా అనుమతి తీసుకున్నామని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. పోలవరానికి ఉరి.. పట్టిసీమకు ఊపిరి పట్టిసీమ టెండర్ల దశలోనే దోపిడీకి ప్రభుత్వ పెద్దలు తెరతీశారు. జాతీయ హోదా దక్కిన పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి, కాసులపై కక్కుర్తితో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఊపిరి పోశారు. ఏడాదిలో పూర్తి చేయాలని టెండర్లు పిలిచి.. గడువులోగా పూర్తి చేస్తే 16.9 శాతం బోనస్‌గా చెల్లిస్తామంటూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టర్‌తో ముందుగా అవగాహన ఉండటం వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటూ వెల్లువెత్తిన విమర్శలనూ ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలవరం కుడికాల్వ పనుల్లోనూ అంతా హడావుడి, అవినీతి నిర్ణయాలే తీసుకున్నారు. నాణ్యతను పరిశీలించి అధికారులు ధ్రువీకరించిన తర్వాతే బిల్లులు చెల్లించడం సాధారణంగా జరిగేది. కానీ కుడికాల్వ పనుల విషయంలో ఈ నిబంధనలకు స్వయంగా ప్రభుత్వ పెద్దలే తూట్లు పొడిచారు. నాణ్యత ధ్రువీకరణ లేకుండానే బిల్లులు చెల్లించడం వెనుక.. అధికారపార్టీ నేతల చేతివాటం ఉందని నీటిపారుదల శాఖ అధికారులే చెబుతున్నారు. గోదావరి-కృష్ణా అనుసంధానం.. జరిగిందంటూ ముఖ్యమంత్రి అబద్దాల హోరులో వాస్తవం కనబడకుండా ప్రచార ఆర్భాటం కప్పేసే ప్రయత్నం చేసింది. అంతటా హడావుడే..: ఈనెల 16 ఉదయం పట్టిసీమలో మోటారును ప్రారంభించాలని పట్టుబట్టి హంద్రీనీవా నుంచి మోటారును అప్పటికప్పుడు ఆగమేఘాల మీద తీసుకు వచ్చి అదే రోజు మధ్యాహ్నం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద నదుల అనుసంధాన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. అప్పటికే హంద్రీనీవా నుంచి వచ్చిన మోటారు అక్కడికి చేరింది. కానీ పంపు అలైన్మెంట్ సరిగా కుదరక పోవడంతో మోటారు ఏర్పాటు చేయలేక కాంట్రాక్టర్, అధికారులు చేతులెత్తేశారు. పట్టిసీమలో మోటారు పెట్టకుండానే.. నదుల అనుసంధానం చేశామని సీఎం ప్రకటించారు. తర్వాత పట్టిసీమ వెళ్లి కొబ్బరికాయ కొట్టారు. అప్పటికీ అక్కడ మోటారు బిగించలేకపోయారు. హంద్రీనీవా నుంచి తెచ్చిన మోటారును 17న బిగించారు. 18న మోటారు ఏర్పాటు చేసి సాగునీటి మంత్రి దేవినేని ఉమ ఆన్ చేశారు. 19న కుడికాల్వకు గండి పడింది. పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మించిన అక్విడెక్టు బద్ధలైంది. ఒక్క మోటారుకే తెగిపోయింది.. అన్నీ ఆన్ చేస్తే?: ఒక్క మోటారు ఆన్ చేస్తేనే కుడికాల్వ తెగిపోయింది. మరి అన్ని మోటార్లు ఆన్ చేస్తే పరిస్థితి ఏమిటి? ఇదే ప్రశ్నకు నీటిపారుదల శాఖ అధికారులు సమాధానం వెతుక్కుంటున్నారు. నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారని తాము తొలి నుంచీ ప్రభుత్వానికి చెబుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని కుడికాల్వ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ ఒకరు ‘సాక్షి’తో వాపోయారు. అన్ని మోటార్లు నడిస్తే.. గండి ఒక్కచోటకే పరిమితం కాదని, చాలా చోట్ల కాల్వకు గండ్లు పడే ప్రమాదం ఉందని చెప్పారు. మరోవైపు కాల్వ తెగడం వల్ల తమ్మిలేరులో చేరిన నీరంతా ఏలూరు నగరాన్ని ముంచెత్తేది. పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. ఎందుకంటే.. తమ్మిలేరు ఏలూరు మీదుగా ప్రవహిస్తోంది. నిజస్వరూపం బయటపడుతుందనే.... పట్టిసీమ డొల్లతనాన్ని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎప్పుడో బయటపెట్టింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని నమ్ముకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎత్తిపోతల పథకంతో నదుల అనుసంధానం అని చెప్పుకోవడమే సిగ్గుచేటని, అది కూడా కనీసం ఒక్క మోటారు పెట్టకుండానే నదులు అనుసంధానం చేశామని ఘనంగా ప్రకటించుకోవడాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు. కనీసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసే వరకు కూడా ఆగలేకపోవడాన్ని చూస్తుంటే.. తమ నిజస్వరూపం బయటపడుతుందనే భయం ప్రభుత్వ పెద్దల్లో ఉందని స్పష్టమవుతోందని చెబుతున్నారు. గతంలో వైఎస్ మార్కు..ప్రస్తుతం ‘మమ’ 175 కిలోమీటర్ల కుడికాల్వ పనుల్లో 130 కి.మీ.కు పైగా కాల్వను దివంగత వైఎస్ హయాంలోనే పూర్తి చేశారు. కాల్వ పనులు పూర్తి చేయడమంటే.. తాత్కాలికంగా కొద్దిపాటి నీటి ప్రవాహానికి వీలుగా అరకొర పనులు చేయడం కాదు. 80 మీటర్ల వెడల్పుతో కాల్వ తవ్వి లైనింగ్ సహ పనులు పూర్తి చేయిం చారు.కుడికాల్వ పనులపై అప్పట్లో రాద్ధాంతం చేసిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పనులనే ఆసరాగా చేసుకొని, తామే ఆ పనులన్నీ చేశామనే చెప్పుకోవడానికిప్రయత్నించింది. కుడికాల్వను ఉపయోగించుకొని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడానికి ప్రయత్నించి అభాసుపాలయింది. కాల్వలో మిగిలిన 30 శాతం పనులను హడావుడిగా చేసింది. నాణ్యతను పట్టించుకోకుండా మమ అనిపించింది. కాంక్రీట్ నిర్మాణాల్లోనూ నాణ్యత లేకపోవడంతో కాల్వకు గండిపడటానికి ప్రభుత్వం కారణమయింది. ఇక పట్టిసీమ పంపు మూత పట్టీసీమ ప్రాజెక్టులో ఒకే ఒక్క పంపును ప్రారంభించి హడావుడి చేసిన ప్రభుత్వం 24 గంటలు తిరక్కముందే ఆ పంపునూ నిరవధికంగా మూసివేసింది. భారీ గండి పడి కుడికాల్వలో ప్రవహించే నీరు తమ్మిలేరులో కలిసిపోతున్న దృష్ట్యా అక్విడెక్టు ఎగువన ఆదివారం యుద్ధ ప్రాతిపదికన మరో అడ్డుకట్ట నిర్మించారు. పోలవరం కుడికాల్వ 114వ కి.మీ. వద్ద దీనిని నిర్మించారు. ఆదివారం ఉదయం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు ఈ నిర్మాణ పనులను పరిశీలించారు. సాయంత్రానికి అడ్డుకట్ట నిర్మాణం పూర్తి చేసి పోలవరం కుడి కాల్వ నీటి ప్రవాహాన్ని నిలుపుదల చేశారు. తాడిపూడి ఎత్తిపోతల నుంచి వచ్చే నీరు, వర్షపు నీరు కుడికాల్వలోకి రాకుండా ఎక్కడిక్కడ నిలిపివేస్తున్నారు. పాత మోటారుతో పక్కా మోసం పట్టిసీమ ఎత్తిపోతలకు..హంద్రీనీవా పథకానికి చెందిన పాత మోటారు బిగించి ప్రభుత్వం నయవంచనకు పాల్పడింది. హంద్రీనీవా లిఫ్ట్‌కు ఆరేళ్లపాటు ఉపయోగించిన మోటారును తొలగించి పట్టిసీమ మొదటి పంపునకు బిగించింది. ఇది బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచింది. పైగా భోపాల్ నుంచి తీసుకువచ్చామని నమ్మబలికింది. అయితే, తెచ్చిన మోటారు పరిమాణం తక్కువగా ఉండటం. కాంక్రీటు దిమ్మలో అమర్చే సమయంలో అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలోనే హంద్రీనీవా లిఫ్ట్ వద్ద ఆరో మోటారు హఠాత్తుగా కనిపించకపోవడంతో దానినే ఇక్కడకు తీసుకువచ్చి బిగించారన్న సంగతి బట్టబయలైంది. ఆ మోటారు కూడా తొలిరోజే మొరాయించింది. మరమ్మతులు చేసి ఆన్ చేశారు. విచారణ జరిపి చర్యలు పట్టిసీమ పనుల్లో ఏర్పడిన సమస్య ఎందుకు జరిగింది? ఎవరి వల్ల జరిగిందో.. విచారణకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఆదివారం అక్విడెక్ట్‌కు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. - మంత్రి దేవినేని ఉమా -
చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్
-
పట్టిసీమకు గుట్టుగా 'పంప్' చేశారు
కర్నూలు: పట్టిసీమ సాక్షిగా చంద్రబాబు సర్కారు బండారం బయటపడింది. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయడానికి టీడీపీ ప్రభుత్వం చాటుగా సాగించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హంద్రీనీవా ప్రాజెక్టు పంప్ పీక్కెళ్లి పట్టిసీమకు అమర్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని మల్యాల దగ్గర ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టు ఆరో పంప్ ను ఈనెల 12న పట్టిసీమకు తరలించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి గోప్యత పాటించింది. ఆరేళ్లుగా వాడిన పంప్ ను పట్టిసీమకు అమర్చి హడావుడిగా నీళ్లు విడుదల చేశారు. ఈనెల 18న పట్టిసీమ ఎత్తిపోతల పథకం హెడ్ వర్క్స్ వద్ద 6వ నంబర్ వెల్ కు అమర్చిన మోటార్ పంప్ స్విచ్ ను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆన్ చేసి ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ నెల 16న సాయంత్రం సీఎం చంద్రబాబు పంప్‌ల వద్ద ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ రెండురోజుల తర్వాత కేవలం ఒక పంప్‌ను ప్రారంభించగలిగారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వడం సంగతి అటుంచితే హంద్రీనీవా ప్రాజెక్టు పంప్ ను గుట్టుగా తరలించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. -
పట్టిసీమకు గుట్టుగా 'పంప్' చేశారు
-
ఫెయిలైన పట్టిసీమ పనులు.. కాలువకు గండి
ఏలూరు మెట్రో (పగో జిల్లా): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హడావుడిగా పట్టిసీమ నుంచి కృష్ణాకు నీరు తరలించేందుకు ప్రమాణాలు లేని నాసిరకం నిర్మాణాలు చేయడంతో జానంపేట అక్విడెట్ వద్ద గండి పడింది. పట్టిసీమ నుంచి పోలవరం కాలువ ద్వారా నీటిని విడుదల చేసేందుకు జానంపేట వద్ద అక్విడెట్ను నిర్మించారు. అక్విడెట్ వద్ద శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో గండి పడింది. దాంతో కృష్ణా డెల్టాకు నీరు చేరకపోగా గోదావరి నీరు వృధాగా తమ్మిలేరులోకి చేరుతోంది. దాంతో లోతట్టు ప్రాంతమైన ఏలూరు సంతోష్‌నగర్ వాసులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు అధికారికంగా హెచ్చరిక జారీ చేశారు. రెవెన్యూ అధికారులు సంతోష్‌నగర్ ప్రాంతానికి చేరుకుని ముంపునకు గురయ్యే ప్రమాదముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గోదావరి నీటిని కృష్ణాకు తరలింపు పనులు హడావుడిగా చేయడమే ఇందుకు ప్రధాన కారణమని, నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సంతోష్‌నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాణాలు పాటించకుండా పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కాంట్రాక్టర్ల నుంచి పాలక పెద్దలకు ముడుపులు ముట్టాయనే ఆరోపణలు నిజమని భావించాల్సివస్తుందని సంతోష్‌నగర్ వాసులు అంటున్నారు. -
పట్టిసీమలో అడ్డగోలుగా అవినీతి...
-
చెంబులతో నీళ్లు పోసి జరిగిపోయిందంటే ...
రాజమండ్రి : పట్టిసీమ ప్రాజెక్ట్‌లో రూ. 490 కోట్లు మేర అక్రమాలు జరిగాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. పట్టిసీమ అక్రమాలపై ఆరోపిస్తే ఎందుకు సమాధానం చెప్పడంలేదని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. శనివారం రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్‌కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ... కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం జరగలేదని ఆయన అన్నారు. చెంబులతో నీళ్లు పోసి జరిగిపోయిందంటే కుదరదన్నారు. ఒకింగ్హాం కాల్వ సమయంలోనే కాల్వల అనుసంధానం ఉండేదని ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వెలగలేరు వద్ద 350 ఎకరాల చెరువును పూడ్చి పెట్టి ఆగమేఘాలపై కాల్వ తవ్వేశారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య రహస్య అగ్రిమెంట్ ఏమైనా అయ్యిందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఒడిశాను మంచి చేసుకోవడానికి పోలవరం ప్రాజెక్ట్‌ను ఆపారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. -
ఎట్టకేలకు పట్టిసీమ పంప్ ప్రారంభం
సాక్షి, పోలవరం: పట్టిసీమ ఎత్తిపోతల పథకం హెడ్‌వర్క్స్ వద్ద 6వ నంబర్ వెల్‌కు అమర్చిన మోటార్ పంప్ స్విచ్‌ను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం మధ్యాహ్నం ఆన్ చేశారు. కేవలం ఒక మోటార్, ఒక పంప్‌తో మాత్రమే నీటిని విడుదల చేశారు. దీనిద్వారా కేవలం 354 క్యూసెక్కుల నీరు మాత్రమే పోలవరం కుడికాల్వలోకి వెళుతోంది. ఈ నెల 16న సాయంత్రం సీఎం చంద్రబాబు పంప్‌ల వద్ద ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ రెండురోజుల తర్వాత కేవలం ఒక పంప్‌ను ప్రారంభించగలిగారు. ముందుగా హెడ్‌వర్క్స్ వద్ద డయాఫ్రమ్ వాల్‌ను కట్‌చేసి గోదావరి నది నుంచి నీటిని వెల్‌లోకి మళ్లించారు. కొద్దిపాటి నీరు చేరగానే మంత్రి స్విచ్ ఆన్ చేయడంతో మోటార్‌లోకి గాలి చొరబడి కొద్దిసేపటికే ఆగిపోయింది. దీంతో అధికారులు డయాఫ్రమ్ వాల్ రంధ్రాన్ని వెడల్పు చేసి ఎక్కువ నీటిని వెల్‌లోకి మళ్లించారు. మళ్లీ మోటార్ వేశారు. గాలి పట్టేయడం, గేట్వాల్ వద్ద నీరు లీకవడం, హెడ్‌వర్క్స్ వద్ద పైప్ లీకవ్వడాన్ని గుర్తించారు.మరమ్మతుల అనంతరం తిరిగి ప్రారంభించారు. మొత్తం మూడుసార్లు మోటార్ ఆన్ చేసిన తర్వాత పైపులైన్ నుంచి పోలవరం కుడి కాల్వ 1.50 కి.మీ. వద్ద డెలివరీ పాయింట్లోకి నీరు చేరింది. దీన్ని మంత్రితో పాటు అంతా ఉత్కంఠతో చూశారు. -
పట్టిసీమలో పంపుల పూజ
చెప్పిన సమయానికి ఒక్క పంపూ పూర్తికాని వైనం * విజయవాడ సమీపంలో కృష్ణా నది ఒడ్డున ప్రత్యేక పూజలు.. * తాడిపూడి నీరు.. వర్షాలవల్ల కలసిన నీరు కుడికాలువ ద్వారా కృష్ణానదికి చేరిన వైనం.. * దాంతోనే కృష్ణా-గోదావరి నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసినట్టు ఘనంగా ప్రకటన సాక్షి ప్రతినిధి, ఏలూరు, పోలవరం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభం అపహాస్యంగా మారింది. పనులు పూర్తి చేయకుండానే గత నెలలో ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రీతిలోనే.. ఈ పట్టిసీమ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించేశారు. బుధవారం పట్టిసీమ పథకానికి సంబంధించిన ఒక మోటార్‌ను సీఎం స్విచాన్ చేసి ప్రారంభించాల్సి ఉంది. పంపు బిగించే పని కొలిక్కిరాకపోవడం.. మోటార్ అమర్పూ పూర్తి కాకపోవడంతో పట్టిసీమ నుంచి చుక్కనీటినీ పోలవరం కుడికాలువలోకి ఎత్తిపోసే పరిస్థితి లేకపోయింది. దీంతో మొదటి పంపు వద్ద పూజలతో సీఎం సరిపెట్టారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు పట్టిసీమకు చేరుకున్న ముఖ్యమంత్రి 4.05 గంటలకు మొదటి పంపు వద్ద పూజలు నిర్వహించి వెనుదిరిగారు. మరోవైపు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నది ఒడ్డున కృష్ణా-గోదావరి నదుల అనుసంధానాన్ని బుధవారం ఆర్భాటంగా నిర్వహించారు. తాడిపూడి నుంచి వదిలిన గోదావరి నీరు.. వర్షాల కారణంగా వాగులు పొంగి కలసిన నీరు కుడికాలువ ద్వారా కృష్ణా నదికి చేరగా.. దాంతోనే రెండు నదుల అనుసంధానం చేసినట్టు ఘనంగా ప్రకటించుకున్నారు. వరుస మారిన ప్రారంభాలు.. నిజానికి సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 9.45 గంటలకు పట్టిసీమను ప్రారంభించాల్సి ఉంది. అనంతరం విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానది ఒడ్డున నదుల అనుసంధాన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. పట్టిసీమ పనులు కొలిక్కి రాకపోవడం.. సాయంత్రం వరకు మోటారు బిగించే పరిస్థితి లేదని అధికారులు చెప్పడంతో సీఎం కార్యక్రమంలో మార్పులు జరిగాయి. దీంతో తొలుత కృష్ణా జిల్లాలో నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ముగించుకుని సాయంత్రం సీఎం పట్టిసీమకు చేరుకున్నారు. అప్పటికీ.. పనులు కొలిక్కి రాలేదు. దీంతో మొదటి పంపు వద్ద పూజలతో సరిపెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పైపులైను పనులను పూర్తి చేసి రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.12 ఏళ్లక్రితం తిరుపతి బ్రహ్మోత్సవాల సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని, అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే బ్రహ్మోత్సవాల ప్రారంభానికి వెళ్లే ముందు పట్టిసీమతో ఓ మహత్కార్యానికి శ్రీకారం చుట్టానని చెప్పారు. ఐదునెలల 19 రోజుల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం తొలివిడత నిర్మాణం పూర్తి చేయడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. దేశంలోనే నదుల అనుసంధానానికి ఇది చరిత్రగా నిలుస్తుందని చెప్పారు. పట్టిసీమ వేగంతో పోలవరం పనులు.. సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘ఇకపై ఫోకస్సంతా పోలవరంపైనే. పట్టిసీమ పనుల్ని ఎంత స్పీడ్‌గా చేయించామో, అంతే వేగంతో పోలవరం పనులనూ చేపడతాం. 2018 ఖరీఫ్ నాటికి పొలాలకు ప్రాజెక్టు నీళ్లొచ్చేలా చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం మన కల అని, దాన్ని సాధించి తీరుతామని, నిధుల విషయంలో కేంద్రం నుంచి పూర్తి సహకారముందని చెప్పారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం సెంటర్లో నిర్మించిన కృష్ణా-గోదావరి నదుల అనుసంధాన పైలాన్‌ను సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. అనంతరం అక్కడకు సమీపంలోని కృష్ణానది ఒడ్డున కృష్ణా-గోదావరి సంగమ ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి అక్కడ ఏర్పాటు చేసిన కృష్ణా-గోదావరి అనుసంధాన సభలో మాట్లాడారు. పట్టిసీమ ద్వారా కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సం గమం జరిగిందని చెప్పారు. వారానికో పంప్ చొప్పున పట్టిసీమను సిద్ధం చేసి అనుకున్న లక్ష్యం మేరకు గోదావరి జలాల్ని కృష్ణాకు తరలిస్తామని పేర్కొన్నారు. కరువు రహిత రాష్ట్రంగా మార్చేదాకా విశ్రమించను.. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేవరకూ విశ్రమించరాదని తాను సంకల్పం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీటి సమస్య తొలగుతుందని, వచ్చే ఏడాది జూలై నెలాఖరుకల్లా వరినాట్లు వే సుకునేలా చేస్తామన్నారు. హంద్రీ-నీవా పనులు పూర్తి చేసి ఈ ఏడాదే కుప్పం నియోజకవర్గానికి నీళ్లిచ్చేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. రాజధాని కడతామంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయంటూ.. మంచి చెబితే వింటానని, అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఖబడ్దార్ అని హెచ్చరించారు.