'మరో ప్రాజెక్టు కడితే గోదావరి డెల్టా ఎడారే' | Godavari delta to be made desert with pattiseema project | Sakshi
Sakshi News home page

'మరో ప్రాజెక్టు కడితే గోదావరి డెల్టా ఎడారే'

Published Wed, Jul 27 2016 9:05 PM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

'మరో ప్రాజెక్టు కడితే గోదావరి డెల్టా ఎడారే' - Sakshi

'మరో ప్రాజెక్టు కడితే గోదావరి డెల్టా ఎడారే'

కాకినాడ: గోదావరి డెల్టాను ఎడారి చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. పట్టిసీమ మాదిరిగానే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వద్ద గోదావరి నదిపై మరో ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని విమర్శించారు. బుధవారం కాకినాడలో మీడియాతో మాట్లాడిన కురసాల.. ఇప్పటికే పట్టిసీమ వల్ల గోదావరి డెల్టా అన్యాయమయ్యే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇక గోదావరి నదిపై మరో ప్రాజెక్టు కడితే డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు.

2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామన్న టీడీపీ మళ్లీ ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు నిర్మిస్తున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. గోదావరి డెల్టాను ఎడారిగా చేసే కార్యక్రమాన్ని వైఎస్‌ఆర్‌సీపీ వ్యతిరేకిస్తుందని కురసాల కన్నబాబు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement