
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి నేతల అరాచకం కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రేపు చలో తునికి పిలుపునిచ్చారు వైఎస్సార్‌సీపీ నాయకులు దాడిశెట్టి రాజా. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రేపు తుని రావాలని కోరారు.
తుని మున్సిపాలిటీ వైఎస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈరోజు టీడీపీ నేతలు రెచ్చిపోయారు. తునిలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరింపులకు గురిచేశారు. అలాగే, ఎన్నిక సందర్భంగా అక్కడికి వెళ్లిన దాడిశెట్టి రాజాపై టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డారు. అనంతరం, ఎన్నికల్లో కోరం లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ..‘మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను టీడీపీ దౌర్జన్యంగా అడ్డుకుంటోంది. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు కౌన్సిలర్లను బెదిరిస్తున్నాడు. కలెకక్టర్, ఎస్పీ వచ్చి మా కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్‌కు తీసుకువెళ్ళాలి. గతంలో నాపై కేసు నమోదు చేశానని సీఐ చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోవడం లేదు. రేపు చలో తునికి పిలుపునిస్తున్నాం. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రేపు తునికి రావాలని కోరుతున్నట్టు’ తెలిపారు.
మరోవైపు.. తునిలో టీడీపీ గుండాల దౌర్జన్యాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ కురసాల కన్నబాబు ఖండించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘తునిలో టీడీపీ దుర్మార్గంగా ప్రవర్తించి వైస్ చైర్మన్ ఎన్నికను అడ్డుకుంది. పోలీసుల సహకారంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయాలనుకున్నారు. యనమల రామకృష్ణుడు ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారో లేదో చెప్పాలి. టీడీపీకి సహకారం అందిస్తున్న పోలీసులపై అధికారులు, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. తునిలో శాంతియుత వాతావరణం కల్పించి..హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా జరిపించాలి. రేపు మేమంతా తుని వెళ్తాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment