
సాక్షి, కాకినాడ జిల్లా: నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ దౌర్జన్యాలు, అరాచకాలతో తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. తునిలో టీడీపీ గూండాల దౌర్జన్యకాండకు దిగారు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సాస్‌పీ వారే. ప్రలోభపెట్టి, భయపెట్టి 10 మంది టీడీపీ లాక్కుంది. వైఎస్సార్‌సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై టీడీపీ గూండాలు దాడి చేసి.. మున్సిపల్ ఆఫీస్‌లో వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు.
దీంతో ప్రాణభయంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద కర్రలతో టీడీపీ గూండాలు మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నాటీడీపీ గూండాలు పట్టించుకోలేదు. తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికను అడ్డుకున్న టీడీపీ గుండాలు.. నాలుగోసారి అడ్డుకున్నారు.
తునిలో పోలీస్ బందోబస్తు లేదంటూ వైఎస్సార్‌సీపీ నేత దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ‘‘తునిలో టీడీపీ గూండాలే కనిపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రాణభయంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు’’ అని దాడిశెట్టి పేర్కొన్నారు. తుని వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలను పిఠాపురం టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment