టీడీపీ నేతల అరాచకం.. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక మళ్లీ వాయిదా | TDP Leaders And Supporters Over Action In Muncipal Elections | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల అరాచకం.. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక మళ్లీ వాయిదా

Published Mon, Feb 17 2025 9:22 AM | Last Updated on Mon, Feb 17 2025 1:03 PM

TDP Leaders And Supporters Over Action In Muncipal Elections

Municipal Elections Updates..
👉ఏపీలో కూటమి నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఎన్నికల్లో బలం లేకపోయినా అధికారంలో ఉన్నారనే అహంకారంతో టీడీపీ నేతలు పోటీకి దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు.

👉పాలకొండలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా. ఎన్నిక జరగకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు. 

👉తుని వైఎస్‌ చైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దీంతో, మూడోసారి వాయిదా పడినట్టు అయ్యింది. శాంతి భద్రతల సమస్య కారణంగా ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. 

👉కాకినాడ..
తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా టీడీపీ గుండాల దౌర్జన్యం. మున్సిపల్ చైర్మన్ సుధా బాలు ఇంటి వద్ద వేలాదిగా మోహరించిన పచ్చ గుండాలు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన పది మంది కౌన్సిలర్లు కౌన్సిల్‌ హాల్‌లోకి వెళ్లారు. కోరం లేకపోవడంతో ఎన్నిక జరగకుండా పచ్చనేతలు అడ్డుకుంటున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలని హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న టీడీపీ నేతలు. ఇక.. టీడీపీ నేతలకు పోలీసులు వంతపాడుతున్నారు. దీంతో, వైఎ‍స్సార్‌సీపీ కౌన్సిలర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించనున్నారు. టీడీపీ నాయకులు యనమల డైరెక్షన్‌లోనే వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను పచ్చ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. 

పల్నాడులో ప్రజాస్వామ్యం ఖూనీ.. 
👉పిడుగురాళ్లలో పట్ట పగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. అరాచకానికి ఐకాన్‌గా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మారారు. పిడుగురాళ్లలో మొత్తం 33 వార్డులు ఉండగా.. గతంలో 33 వార్డులను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవని తెలుగుదేశం. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ను తన వైపునకు తిప్పుకున్న యరపతినేని. బలం, అర్హత లేకపోయినా వైస్ చైర్మన్ పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన శ్రీనివాసరావు.

👉పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయించారు. బెదిరించి, భయపెట్టి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీ వైపునకు తిప్పుకున్నారు. 29వ వార్డు కౌన్సిలర్ మునీరా రెండు ఇళ్లను కూల్చే చేయించిన యరపతినేని. కౌన్సిలర్లు అందరినీ ఒక లాడ్జిలో బంధించి బస్సులో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చిన తెలుగుదేశం నేతలు. వైఎస్‌ చైర్మన్‌ పదవి కైవసం చేసుకున్నట్టు యరపతినేని ప్రకటన. 

👉తునిలో మున్సిపల్‌ ఎన్నికల వేళ టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నాయకులు దాడిశెట్టి రాజాపై దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడే ఉన్నా.. వారిని అడ్డుకోకపోవడం గమనార్హం. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ సుధా బాలు భర్త ఏలూరి బాలు, తొండంగి వైఎస్సార్‌సీపీ నేత గంగబాబు, తుని ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతా శ్రీనుతో పాటుగా మరో ముగ్గురు కౌన్సిలర్ల భర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. అనంతరం, తుని టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

👉దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై కచ్చితంగా కోర్టుకు వెళ్తాం. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. తునిలో 30 స్థానాల్లో 30 కౌన్సిలర్లను వైఎస్సార్‌సీపీ గెలిచింది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీకి ఒక్క కౌన్సిలర్‌ కూడా లేడు. తొమ్మిది మందిని మభ్యపెట్టి లాక్కున్నారు. చైర్‌పర్సన్‌ ఇంటి చుట్టూ వేలాది మంది మోహరించారు. కోర్టులు, వ్యవస్థలు అంటే టీడీపీకి లెక్కలేదు అంటూ మండిపడ్డారు. 
 

 

 

కాకినాడ..
👉తుని మున్సిపల్ ఎన్నిక సందర్భంగా సెక్షన్ 163(2) అమలు చేసిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఈ నేపథ్యంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమ్మికూడరాదని ఆదేశాలు జారీ. కానీ, టీడీపీ గుండాలకు వర్తించని సెక్షన్ 163(2).

👉మున్సిపల్ చైర్మన్ సుధా బాలు ఇంటి వద్ద వందలాదిగా గుమిగూడిన పచ్చ మూకలు. మున్సిపల్ కౌన్సిలర్లు బయటకు రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ గుండాలు. సుధా బాలు నివాసం వద్దకు వెళ్ళిన జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా. ఈ క్రమంలో రాజాను కూడా అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు. రంగంలోకి దిగిన పోలీసులు.. టీడీపీ వారికే వత్తాసు. వైఎస్సార్‌సీపీ నేతలను అక్కడి నుంచి పంపిచేస్తున్న పోలీసులు.  

కాకినాడ..
👉తునిలో మరోసారి టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. మున్సిపల్‌ వైఎస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ సుధాబాబు, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను పచ్చమూకలు అడ్డుకున్నాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు.. వారిని అడ్డుకోలేదు. టీడీపీ నేతలకు పోలీసుల సహకారం అందిస్తూ.. తొండగి మండలం వైఎస్సార్‌సీపీ నేత గంగబాబుతో పాటుగా పలువరి నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు. 

కూటమి అరాచకం..
👉ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో పలుచోట్ల జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పచ్చ నేతలు యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను, కార్యకర్తలను టార్గెట్‌ చేసి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. బలం లేకపోయినా అధికార మదంతో పోటీకి దిగుతున్నారు టీడీపీ నేతలు. కాగా, నేడు తుని, పాలకొండ, పిడుగురాళ్లలో డిప్యూటీ చైర్మన్‌, చైర్మన్ల ఎన్నికల జరగనుంది. ఇప్పటికే ఇక్కడ రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ స్థానాల్లో టీడీపీకి బలం లేకపోయినా పచ్చ నేతలు అధికార మదంతో పోటీలో నిలబడ్డారు. కూటమి నేతలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నా పోలీసులు మాత్రం తమకు ఏదీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

👉ఇక, పిడుగురాళ్లలో కూటమి ప్రభుత్వానికి కోరం లేకున్నా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలతో, దౌర్జన్యాలతో లోబరుచుకుని వైస్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి మద్దతి­చ్చేది లేదని 29వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ మున్నీరా సైదావలి తేల్చి చెప్పడంతో ఆదివారం టీడీపీ నేత­లు బరితెగింపునకు పాల్పడ్డారు. కౌన్సిలర్‌ ఇంటితో పాటు, ఆయన బంధువుకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్‌ అధికారులను అడ్డుపెట్టు­కుని పొక్లెయిన్‌తో కూల్చివేయించారు. టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌ అధికారులు, శానిటేషన్‌ సిబ్బందితో పాటు టీడీపీకి చెందిన రాయపాటి సాంబశివరావు, షేక్‌ ఇంతియాజ్‌ తదితరులు, ఆ పార్టీ కార్యకర్తలు అ­క్కడకు చేరుకుని దగ్గరుండి మరీ రెండు ఇళ్లను కూల్చి­వేయించారు.

ఇప్పటికే రెండు సార్లు అరాచకాలు 
👉పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33 వార్డులకు గాను వైఎస్సార్‌సీపీ 33 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్‌గా కొత్త వెంకటసుబ్బారావు, వైస్‌ చైర్మన్‌లుగా కొమ్ము ముక్కంటి, షేక్‌ నసీమా జైలాబ్దిన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ముక్కంటి మృతితో ఈ నెల 3న వైఎస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించేందుకు  ఎన్ని­కల కమిషన్‌ జీవో ఇచ్చింది. అయితే, వైఎస్సార్‌­సీపీ కౌన్సిలర్లను మున్సిపల్‌ కార్యాలయంలోకి రానివ్వకుండా పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు అడ్డుపడటంతో ఎన్నిక 4వ తేదీకి వాయిదా పడింది. 4వ తేదీ కూ­డా టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో వైఎస్సార్‌­సీపీ కౌన్సిలర్ల ఇళ్ల వద్ద ఉండి ఇళ్లల్లోంచి వారిని బయటకు రానివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో మళ్లీ సోమవారానికి వాయిదా పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement