Piduguralla
-
ఎమ్మెల్యే యరపతినేని హింస రాజకీయం
-
టీడీపీ నేతల అరాచకం.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా
Municipal Elections Updates..👉ఏపీలో కూటమి నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఎన్నికల్లో బలం లేకపోయినా అధికారంలో ఉన్నారనే అహంకారంతో టీడీపీ నేతలు పోటీకి దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు.👉పాలకొండలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా. ఎన్నిక జరగకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు. 👉తుని వైఎస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దీంతో, మూడోసారి వాయిదా పడినట్టు అయ్యింది. శాంతి భద్రతల సమస్య కారణంగా ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. 👉కాకినాడ..తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా టీడీపీ గుండాల దౌర్జన్యం. మున్సిపల్ చైర్మన్ సుధా బాలు ఇంటి వద్ద వేలాదిగా మోహరించిన పచ్చ గుండాలు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన పది మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లోకి వెళ్లారు. కోరం లేకపోవడంతో ఎన్నిక జరగకుండా పచ్చనేతలు అడ్డుకుంటున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలని హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న టీడీపీ నేతలు. ఇక.. టీడీపీ నేతలకు పోలీసులు వంతపాడుతున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించనున్నారు. టీడీపీ నాయకులు యనమల డైరెక్షన్లోనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పచ్చ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. పల్నాడులో ప్రజాస్వామ్యం ఖూనీ.. 👉పిడుగురాళ్లలో పట్ట పగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. అరాచకానికి ఐకాన్‌గా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మారారు. పిడుగురాళ్లలో మొత్తం 33 వార్డులు ఉండగా.. గతంలో 33 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవని తెలుగుదేశం. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ను తన వైపునకు తిప్పుకున్న యరపతినేని. బలం, అర్హత లేకపోయినా వైస్ చైర్మన్ పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన శ్రీనివాసరావు.👉పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయించారు. బెదిరించి, భయపెట్టి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ వైపునకు తిప్పుకున్నారు. 29వ వార్డు కౌన్సిలర్ మునీరా రెండు ఇళ్లను కూల్చే చేయించిన యరపతినేని. కౌన్సిలర్లు అందరినీ ఒక లాడ్జిలో బంధించి బస్సులో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చిన తెలుగుదేశం నేతలు. వైఎస్ చైర్మన్ పదవి కైవసం చేసుకున్నట్టు యరపతినేని ప్రకటన. 👉తునిలో మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు దాడిశెట్టి రాజాపై దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడే ఉన్నా.. వారిని అడ్డుకోకపోవడం గమనార్హం. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ సుధా బాలు భర్త ఏలూరి బాలు, తొండంగి వైఎస్సార్సీపీ నేత గంగబాబు, తుని ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతా శ్రీనుతో పాటుగా మరో ముగ్గురు కౌన్సిలర్ల భర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. అనంతరం, తుని టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 👉దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై కచ్చితంగా కోర్టుకు వెళ్తాం. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తునిలో 30 స్థానాల్లో 30 కౌన్సిలర్లను వైఎస్సార్సీపీ గెలిచింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేడు. తొమ్మిది మందిని మభ్యపెట్టి లాక్కున్నారు. చైర్పర్సన్ ఇంటి చుట్టూ వేలాది మంది మోహరించారు. కోర్టులు, వ్యవస్థలు అంటే టీడీపీకి లెక్కలేదు అంటూ మండిపడ్డారు. కాకినాడ..👉తుని మున్సిపల్ ఎన్నిక సందర్భంగా సెక్షన్ 163(2) అమలు చేసిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఈ నేపథ్యంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమ్మికూడరాదని ఆదేశాలు జారీ. కానీ, టీడీపీ గుండాలకు వర్తించని సెక్షన్ 163(2).👉మున్సిపల్ చైర్మన్ సుధా బాలు ఇంటి వద్ద వందలాదిగా గుమిగూడిన పచ్చ మూకలు. మున్సిపల్ కౌన్సిలర్లు బయటకు రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ గుండాలు. సుధా బాలు నివాసం వద్దకు వెళ్ళిన జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా. ఈ క్రమంలో రాజాను కూడా అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు. రంగంలోకి దిగిన పోలీసులు.. టీడీపీ వారికే వత్తాసు. వైఎస్సార్సీపీ నేతలను అక్కడి నుంచి పంపిచేస్తున్న పోలీసులు. కాకినాడ..👉తునిలో మరోసారి టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మున్సిపల్ చైర్మన్ సుధాబాబు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పచ్చమూకలు అడ్డుకున్నాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు.. వారిని అడ్డుకోలేదు. టీడీపీ నేతలకు పోలీసుల సహకారం అందిస్తూ.. తొండగి మండలం వైఎస్సార్సీపీ నేత గంగబాబుతో పాటుగా పలువరి నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి అరాచకం..👉ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో పలుచోట్ల జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పచ్చ నేతలు యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. బలం లేకపోయినా అధికార మదంతో పోటీకి దిగుతున్నారు టీడీపీ నేతలు. కాగా, నేడు తుని, పాలకొండ, పిడుగురాళ్లలో డిప్యూటీ చైర్మన్, చైర్మన్ల ఎన్నికల జరగనుంది. ఇప్పటికే ఇక్కడ రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ స్థానాల్లో టీడీపీకి బలం లేకపోయినా పచ్చ నేతలు అధికార మదంతో పోటీలో నిలబడ్డారు. కూటమి నేతలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నా పోలీసులు మాత్రం తమకు ఏదీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.👉ఇక, పిడుగురాళ్లలో కూటమి ప్రభుత్వానికి కోరం లేకున్నా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలతో, దౌర్జన్యాలతో లోబరుచుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి మద్దతిచ్చేది లేదని 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మున్నీరా సైదావలి తేల్చి చెప్పడంతో ఆదివారం టీడీపీ నేతలు బరితెగింపునకు పాల్పడ్డారు. కౌన్సిలర్ ఇంటితో పాటు, ఆయన బంధువుకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులను అడ్డుపెట్టుకుని పొక్లెయిన్‌తో కూల్చివేయించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు, శానిటేషన్ సిబ్బందితో పాటు టీడీపీకి చెందిన రాయపాటి సాంబశివరావు, షేక్ ఇంతియాజ్ తదితరులు, ఆ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని దగ్గరుండి మరీ రెండు ఇళ్లను కూల్చివేయించారు.ఇప్పటికే రెండు సార్లు అరాచకాలు 👉పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 33 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్‌గా కొత్త వెంకటసుబ్బారావు, వైస్ చైర్మన్లుగా కొమ్ము ముక్కంటి, షేక్ నసీమా జైలాబ్దిన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ముక్కంటి మృతితో ఈ నెల 3న వైఎస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ జీవో ఇచ్చింది. అయితే, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకుండా పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు అడ్డుపడటంతో ఎన్నిక 4వ తేదీకి వాయిదా పడింది. 4వ తేదీ కూడా టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్ల వద్ద ఉండి ఇళ్లల్లోంచి వారిని బయటకు రానివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో మళ్లీ సోమవారానికి వాయిదా పడింది. -
ఇవాళ మూడు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ ఎన్నిక
-
పిడుగురాళ్లలో పరాకాష్టకు టీడీపీ నేతల అరాచకం
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్లలో టీడీపీ నేతల అరాచకం పరాకాష్టకు చేరింది. బరితెగించిన ఆ పార్టీ నేతలతో మున్సిపల్ అధికారులు కుమ్మక్కయ్యారు. రేపు(సోమవారం) మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పది రోజులుగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు, పోలీసులు బెదిరిస్తున్నారు. 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునిరా దంపతులను బెదిరించడంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మునీరా దంపతుల ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. దగ్గరుండి మరి.. మునీరా దంపతుల ఇళ్లను టీడీపీ నాయకులు కూల్చివేయించారు.కాగా, ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్ లేకపోయినా కూడా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ వారే ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ పదవికి ఎన్నిక నిర్వహించనుంది.తొలుత ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా కౌన్సిలర్లను లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో మరుసటి రోజు అంటే 4కి వాయిదా పడింది. అయితే ఆ రోజు కూడా ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. తిరిగి ఈనెల 17న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. 30 వార్డు కౌన్సిలర్ ఉన్నం ఆంజనేయులును టీడీపీ నేతలు లోబరుచుకుని మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. మిగతా వారిలో 20 మందిని టార్గెట్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. -
పిడుగురాళ్లలో టీడీపీ అరాచకం
పిడుగురాళ్ల/నరసరావుపేట: ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్ లేకపోయినా కూడా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ వారే ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ పదవికి ఎన్నిక నిర్వహించనుంది. తొలుత ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా కౌన్సిలర్లను లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో మరుసటి రోజు అంటే 4కి వాయిదా పడింది. అయితే ఆ రోజు కూడా ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. తిరిగి ఈనెల 17న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. 30 వార్డు కౌన్సిలర్ ఉన్నం ఆంజనేయులును టీడీపీ నేతలు లోబరుచుకుని మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. మిగతా వారిలో 20 మందిని టార్గెట్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ 20 మందిని శనివారం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలోకి చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 14వ వార్డు కౌన్సిలర్ పులి బాలకాశిని గురువారం రాత్రి పోలీసులు తీసుకు వెళ్లారని ఆయన భార్య రమణ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను కాపాడాలని సెల్ఫీ వీడియో విడుదల చేశారు. టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులను తట్టుకోలేక 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మున్నీరా ఆమె భర్త షేక్ సైదావలి అజ్ఞాతంలో వెళ్లారు. వీరిని బయటకు రప్పించడం కోసం పోలీసులు సైదావలి సోదరుడు సుభానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సైదావలి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం 23వ వార్డు కౌన్సిలర్ జూలకంటి శ్రీరంగ రజని భర్త జూలకంటి శ్రీనివాసరావును పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెళ్లి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి మారాలని వేధించినట్లు వారు తెలిపారు. 13వ వార్డు కౌన్సిలర్ షేక్ సమీరా ఆమె భర్త షేక్ కరిముల్లాను కూడా బెదిరించారు. టీడీపీ నాయకులు, పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక తాను కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసి, ఇంత వరకు అందుబాటులోకి రాలేదు. టీడీపీ నేతలు ఇంతగా బరితెగించడం దారుణమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పోలీసుల దన్నుతో బరితెగింపుపల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసుల దన్నుతో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం, బెదిరించడం ద్వారా ఈ నెల 17న జరగబోయే ఎన్నికను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోలీసుల దన్నుతో ‘టీడీపీ’ అరాచకాలు: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోలీసుల దన్నుతో అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం, బెదిరించడం ద్వారా ఈనెల 17న జరగబోయే ఉప ఎన్నికను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే ఈ దౌర్జన్యకాండకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి నాలుగేళ్ళ కిందట జరిగిన ఎన్నికల్లో ఉన్న మొత్తం 33 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వైఎస్ జగన్ చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ప్రజలు ఏకగ్రీవంగా గెలుపును అందించారు. మున్సిపల్ చైర్మన్ గా వైశ్య సామాజికవర్గానికి చెందిన సుబ్బారావు, వైస్ చైర్మన్‌గా దళిత సామాజిక వర్గానికి చెందిన ముక్కంటి, మైనార్టీల నుంచి జిలానీకి వైస్ చైర్మన్ పదవులను ఇచ్చాం.గత ఏడాది జనరల్ ఎలక్షన్స్ తరువాత వైస్ చైర్మన్ ముక్కంటి చనిపోవడంతో దానికి గానూ ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతోంది. మొత్తం 33 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలకు గానూ అన్నింటినీ వైఎస్సార్సీపీ గెలుచుకోగా, తాజాగా ఒకరు మాత్రం పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం 32 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి ఉన్నారు. సంఖ్యబలం చాలా స్పష్టంగా ఉండటంతో ఏకపక్షంగా ఉప ఎన్నికను తెలుగుదేశం కుట్రపూరితంగా అడ్డుకుంటోంది.గతంలో వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులను బెదిరించి వాయిదా వేయించారు. బీఫారం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వాయిదా వేస్తున్నామంటూ అధికారులు కుంటిసాకులు చెప్పారు. మరుసటి రోజు వాయిదా వేయడంతో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వెడుతున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పోలీసుల సహకారంతోనే కిడ్నాప్ చేసేందుకు తెగబడ్డారు. అన్యాయాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అన్యాయంగా వ్యవహరించే పరిస్థితి కనిపించింది. ఆరోజు జరిగిన దారుణాన్ని అన్ని ఆధారాలతో బయటపెట్టడంతో మళ్లీ వాయిదా వేశారు.ఉప ఎన్నిక కోసం ఇంతగా దిగజారుతారా?ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ పోలీస్ యంత్రాంగంను ఉపయోగించుకుని చేస్తున్న దౌర్జన్యాలతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు భయాందోళనకు గురవుతున్నారు. సాక్షాత్తు పోలీసులే మమ్మల్ని బెదిరిస్తున్నారు, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు, ఇక మాకు రక్షణ ఎక్కడ ఉందని ఆందోళన చెందుతున్నారు. దీనిని భరించలేక కొందరు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈలోగానే మళ్లీ తెలుగుదేశం నేతలు, పోలీసులు కలిసి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై దాడులకు, కిడ్నాప్‌లకు తెగబడ్డారు.తాజాగా తెలుగుదేశం నేతల బెదిరింపులకు భయపడి పక్కనే ఉన్న మాచవరం గ్రామంలో తన తల్లి ఇంట్లో తలదాచుకున్న కౌన్సిలర్ ను టీడీపీ నాయకులు, పోలీసులు కిడ్నాప్ చేశారని ఒక కౌన్సిలర్ భార్య సోషల్ మీడియాలో వీడియో ద్వారా బయటపెట్టారు. తన భర్తకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అలాగే మరో కౌన్సిలర్ ఈ బాధ పడలేక హైదరాబాద్ లో తలదాచుకుంటే, అయన సోదరులను పోలీస్ స్టేషన్ లో కూర్చోబోట్టి మర్యాదగా పిడుగురాళ్ళకు వచ్చి, తాము చెప్పినట్లు నడుచుకోవాలంటూ బెదిరించారు.ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరపాల్సిన ప్రభుత్వం చిన్న ఎన్నికలో కూడా ఇలా దౌర్జన్యాలతో బెదిరింపులకు గురి చేయడం దారుణం. గతంలో దర్శి, తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది. ఆరోజు అధికారం ఉందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా దౌర్జన్యాలకు పాల్పడితే ఆ రెండింటిలో కూడా వైఎస్సార్సీపీకే అధికారం దక్కేది కాదా? కానీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ అటువంటి విధానాలకు మనం వ్యతిరేకం, ప్రజాతీర్పుకు గౌరవం ఇవ్వాలని స్పష్టంగా తన విధానాన్ని ప్రకటించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి దానిని స్వయంగా అంగీకరించారు. వైఎస్ జగన్ తలుచుకుంటే తాను మున్సిపల్ చైర్మన్ అయి ఉండేవాడిని కాదు అని ఒప్పుకున్నారు.పార్టీ మారకపోతే అంతుచూస్తామని బెదిరిస్తున్నారుపిడుగురాళ్ళ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావుకు చెందిన ఫ్యాక్టరీకి తెలుగుదేశం నేతలు తాళాలు వేశారు. నీ వ్యాపారాలు అడ్డుకుంటాం, పార్టీ మారాలంటూ బెదిరిస్తున్నారు. లేకపోతే అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల పిడుగురాళ్ళ మున్సిపల్ కౌన్సిలర్‌ను టీడీపీ నేతలు కిడ్నాప్ చేసిన నేపథ్యంలో కోర్టులో హెబియస్ కార్ఫస్ పిటీషన్ దాఖలు చేశాం. వెంటనే సదరు కౌన్సిలర్‌ను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా తానను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పాలని లేకుండా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా బెదిరించారు.దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపైనా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంకు పాల్పడ్డారు. తిరిగి అబ్బయ్య చౌదరిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం చూస్తే ఇంత దుర్మార్గమైన పాలన మరెవరూ చేయలేరని అనిపిస్తోంది. తెలుగుదేశం చేస్తున్న ఈ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు -
పోలీసుల తీరుపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
పిడుగురాళ్లలో పోలీసులు -టీడీపీ నేతలు కుమ్మక్కు: కాసు
-
పోలీసులు, కూటమి నేతలు కుమ్మక్కు: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీ నేతలు మండిపడుతున్నారు. పిడుగురాళ్ల పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు కాగా, గతంలో 33 వార్డులను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఒక కౌన్సిలర్‌ను టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు.మున్సిపల్ వైస్ చైర్మన్ చనిపోవడంతో ఆ స్థానానికి ఎన్నికల నిర్వహించడానికి నోటిఫికేషన్ వెలువడింది. నిన్న(సోమవారం) వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళనివ్వకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నామినేషన్ కూడా దాఖలు చేయనివ్వకుండా టీడీపీ రౌడీలు అడ్డుకున్నారు. దీంతో ఈరోజుకు వైఎస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు టీడీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ, పోలీసులు, కూటమి నాయకులు కుమ్మక్కైపోయారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన పదిమంది కౌన్సిలర్లను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులకు పోలీసులు అండగా ఉన్నారు. పిడుగురాళ్లలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. కిడ్నాప్ పైన కొంతమంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఇంటి నుంచి పోలీసులే తీసుకువెళ్లారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పోలీసులు తీసుకువెళ్లి టీడీపీ నేతలకు అప్పగించారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకం నడుస్తోంది’’ అని కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వివాహితకు టీడీపీ నేతలతో కలిసి సీఐ వేధింపులు..
-
Piduguralla: ప్లాన్ చేసి ఎటాక్ చేశారు
-
పల్నాడు జిల్లాలో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ మూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: టీడీపీ మూకలు మరోసారి రెచ్చిపోయారు. పిడుగురాళ్లలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ శివపై దాడి చేశారు. మా ప్రభుత్వ హయాంలో మీరు బయట తిరగడమేంటి అంటూ ఈర్ల శివపై టీడీపీ నేత ఇంతియాజ్ అనుచరులు చెలరేగిపోయారు. టీడీపీ శ్రేణుల దాడిలో శివ తీవ్రంగా గాయపడ్డారు.ఎంపీటీసీపై టీడీపీ నేత దాడిశ్రీకాకుళం జిల్లా: గ్రామ సభలో ఎంపీటీసీపై టీడీపీ నేత దాడి చేశారు. సంత బొమ్మాలి మండలం నౌపాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామ సభలో మాట్లాడుతున్న ఎంపీటీసీ సుధాకర్‌పై టిడిపి నేత వాడపల్లి కృష్ణారావు దాడికి దిగారు.బాధితుడు ఎంపీటీసీ సుధాకర్ మాట్లాడుతూ, పంచాయతీ సెక్రటరీ గ్రామసభకు ఆహ్వానించడంతోనే తాను అక్కడికి వెళ్లానని.. సభలో సమస్యలపై మాట్లాడుతుండగా కృష్ణారావు దాడి చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీవి కనుక తనకు సభలోకి వచ్చే అర్హత లేదంటూ టీడీపీ నేత హెచ్చరించారని.. నా చొక్కా చింపేసి... ఇక్కడ కూర్చునేందుకు కూడా అర్హత లేదంటూ దుర్భాషలాడారని సుధాకర్ తెలిపారు. -
AP: చెట్టును ఢీకొన్న కారు.. అక్కడికక్కడే నలుగురు మృతి
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంలో ఉన్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలోని గీతిక స్కూల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంలో ఉన్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో, వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే, వీరంతా హైదరాబాద్ నుంచి కావలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. -
ఇదీ మా ప్రోగ్రెస్ రిపోర్ట్: సీఎం వైఎస్ జగన్
ఊసరవెల్లి ఎన్నిసార్లు రంగు మారుస్తుందో నాకు తెలియదు గానీ, చంద్రబాబు మాత్రం ఊసరవెల్లిని దాటిపోయాడు. నీ మోసాలు అందరికీ తెలిసినవే. మొట్ట మొదటిగా ఈ వలంటీర్లను పీకేస్తావు. మళ్లీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందర్నీ వలంటీర్లుగా తెచ్చుకుంటావు. వాళ్లు దోచుకునే దాని కోసం రూ.10 వేలు అదనంగా వాళ్లకు ఇస్తావు. ఇదీ నువ్వు చేయబోయే మోసపూరిత రాజకీయం అనేది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. చంద్రబాబు బతుకంతా అబద్ధాలే పునాదులు, మోసాలే. వెన్నుపోట్లే చరిత్ర. సినిమాల్లో విలన్ క్యారెక్టర్ చూస్తే అది చంద్రబాబు క్యారెక్టర్ కిందనే గుర్తుకొస్తుంది. సిద్ధం.. సిద్ధం.. అంటూ మీ నినాదాలు మన జైత్ర యాత్రకు శంఖారావంలా వినిపిస్తుంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఏ పేదకు ఏ మంచి చేయని పెత్తందార్ల గుండెల్లో యుద్ధం.. యుద్ధం అని ప్రతిధ్వనిస్తోంది. వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. పేద వాడి భవిష్యత్తును, ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ జిత్తుల మారి మోసాల పార్టీలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను మనమంతా ఒక్కటై తిప్పికొడదాం. జగన్‌కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతున్న మంచి కొనసాగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. ప్రజలందరూ మోసపోతారన్నది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబు గుణగణాలు ఎలా ఉంటాయంటే.. ఎన్నికలకు ముందు గంగ. అధికారం దక్కిన తర్వాత లక లకా.. అంటూ పేదల రక్తం తాగే చంద్రముఖి. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. గత 58 నెలలుగా మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్, అక్కచెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతులకు అందుతున్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం.. ఇవన్నీ కూడా కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా.. లేక మోసపోయి అంధకారంలోకి వెళ్లాలా అన్నది నిర్ణయించే ఎన్నికలని కూడా గుర్తుంచుకోవాలి. దీనిపై మీ కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని చర్చించాలి. మనం వేసే ఓటుతో మన తలరాతలు మారతాయని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవి జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్‌ది పేదల పక్షం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉద్యోగాలివ్వడంలో.. రైతులు, మహిళల అభ్యున్నతికి కృషి చేయడంలో, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబు ఇస్తున్నది బోగస్ రిపోర్టు అయితే, వైఎస్ జగన్ ఇస్తున్నది కళ్లెదుటే కనిపిస్తున్న ప్రోగ్రెస్ రిపోర్టు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మనందరి ప్రభుత్వ హయాంలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహించామని చెప్పారు. మొట్ట మొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు చేయూతనిచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. వాహన మిత్ర, నేతన్న నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ.. ఇలా అన్ని విధాలా ప్రోత్సహించబట్టే స్వయం ఉపాధి రంగం ఈరోజు తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతోందన్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక చక్రం పరుగులు పెడుతోందని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఆయన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన సభలో మాట్లాడారు. ఈ జన సంద్రాన్ని చూస్తుంటే నెల రోజుల్లోనే పట్టపగలు కోటప్పకొండ తిరునాళ్లు కనిపిస్తోందని అన్నారు. ఐదేళ్ల మన ప్రభుత్వంలో ఇంటింటికీ వచ్చిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, లంచాలు, వివక్ష లేని పాలనను.. ఆ దుష్ట కూటమి, ఎల్లో మీడియా కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు పలనాటి సీమ పౌరుషంతో జన సముద్రంగా మారిన దృశ్యం కనిపిస్తోందని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. ఏది నిజం, ఏది అబద్ధం.. మీరే తేల్చండి ► బాబుగారి గురించి ఈరోజు ఈ సిద్ధం సభకు వచ్చిన లక్షల మందితో నేను కొన్ని నిజానిజాలు తేల్చదల్చుకున్నా. ఈ రోజు ఇక్కడ మీరు, నేను జాయింట్ గా ఓ ఫ్యాక్ట్ చెక్ (నిజ నిర్ధారణ) చేద్దాం. ఈ చంద్రబాబు గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. ఈ చెత్త మీడియా చేస్తున్న ప్రచారంలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది మీ ముందు పెడుతున్నా. ► చంద్రబాబు, ఈ ఎల్లో మీడియా కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వస్తారు. తర్వాత వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొస్తారు. దాన్ని గుర్రం, గుర్రం అంటూ పదే పదే ఊదరగొడతారు. ఇలా 30 ఏళ్లుగా చేస్తూ వస్తున్నారు. 2014లో జాబు రావాలి అంటే బాబు రావాలి అని సభల్లో, టీవీ చానళ్లలో, ఊరూరా ఊదరగొట్టారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీ వాళ్లకు, మీ ఇంటి చుట్టు పక్కల వాళ్లకు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? ► మీ బిడ్డ జగన్ వచ్చాక ప్రతి గ్రామంలో ఒక సచివాలయం తీసుకొచ్చారు. ఆ సచివాలయాల్లో ఏకంగా 1.35 లక్షల మంది మన పిల్లలు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో నేను నా.. నా.. నా.. నా.. అని పిలుచుకునే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకంగా 80 శాతం మంది ఉన్నారు. ► ఈరోజు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలో మాత్రమే ఈ 58 నెలల కాలంలో 54 వేల పోస్టులు భర్తీ చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళితే గతంలో మాదిరి డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ లేరన్న పరిస్థితి లేదు. మొత్తంగా 58 నెలల్లో 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. మీ బిడ్డ పాలన రాక ముందు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే.. ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ మరో 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఈ పెద్దమనిషి చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య కేవలం 32 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఈ లెక్కన జాబు రావాలి అంటే ఫ్యాను రావాలా? లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా? నిర్మాణంలో 4 సీ పోర్టులు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 నోడ్స్ ► మరోవైపు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా కొత్తగా మరో నాలుగు సీ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ కూడా వేగంగా పరుగులెత్తుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం దేశంలోనే వరుసగా ప్రతి సంవత్సరం నంబర్ వన్‌గా నిలుస్తోంది. ► రైతు అంటే బాబుకు ప్రేమట. నమ్ముతారా? (నమ్మం.. నమ్మం.. అని నినాదాలు) గతంలో ఏమీ చేయని బాబు.. ఇప్పుడు రైతుకు ఎక్కువ మేలు చేస్తాడట. ఇదీ వాళ్ల ఎల్లో మీడియా, చంద్రబాబు కొత్తగా చెబుతున్న మాటలు. వ్యవసాయం దండగ అన్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఈ చంద్రబాబే. రైతులకు కరెంటు ఉచితంగా ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలి అన్నాడు. రైతులను విచారించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పిన వ్యక్తి. ప్రత్యేక కోర్టులు నెలకొల్పిన వ్యక్తి. బాబువన్నీ విఫల హామీలే ► 2014లో రూ.87,612 కోట్లు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. చేశాడా? రైతులకు పగటిపూటే 12 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు. ఇచ్చాడా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు. విడిపించాడా? రైతులకు సున్నా వడ్డీ కూడా ఎగరగొట్టేశాడు. ఇన్పుట్ సబ్సిడీ సైతం 2017 నుంచి ఎగ్గొట్టేశాడు. కరెంటు విషయంలోనూ బకాయిలే. ధాన్యం సేకరణలోనూ బకాయిలే, రైతుల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలకు సైతం డబ్బులివ్వకుండా బకాయిలే. ► మీ బిడ్డ జగన్ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 ప్రతి రైతన్న చేతిలో పెడుతున్నాడు. ఈ ఐదేళ్లలో ప్రతి రైతన్నకూ రూ.67,500 ఇచ్చాం. మేనిఫెస్టోలో రూ.50 వేలు ఇస్తామని చెప్పి, అంతకంటే మిన్నగా రూ.67,500 ఇచ్చామా? లేదా? అని అడుగుతున్నా. పగటిపూటే నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఇందు కోసం రూ.1,700 కోట్లు ఫీడర్లపై ఖర్చు చేశాం. ► రైతన్నను చేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్బీకే) తీసుకొచ్చి దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచాం. ఇ–క్రాప్ ద్వారా, ఉచిత పంటల బీమా ద్వారా ప్రతి రైతన్నకూ, ప్రతి ఎకరాకూ, ప్రతి పంటకూ ఇన్సూరెన్స్ అందుతోంది. సీజన్ ముగిసేలోపు పంట నష్టపరిహారం, విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు తోడుగా ఉన్నాం. రూ.64 వేల కోట్లు ధాన్యం సేకరణకు ఇచ్చాం. మద్దతు ధర దక్కేలా చూస్తున్నాం. గన్నీబ్యాక్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కింద రైతన్నకు ఎకరాకు కనీసం రూ.8 వేల నుంచి రూ.10 వేలు అదనంగా వచ్చేలా చూశాం. ► సున్నా వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు ఎత్తేస్తే.. మీ బిడ్డ జగన్, బాబు బకాయిలను సైతం కట్టి, మళ్లీ సున్నా వడ్డీకే పంట రుణాలు ఇప్పిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు కల్పించాం. ఈ పరిస్థితిలో రైతు కోసం ఈ రాష్ట్రానికి ఎవరు అవసరం? రుణ మాఫీ అని మోసం చేసిన చంద్రబాబా? లేక వ్యవసాయానికి అండగా నిలబడిన మీ బిడ్డనా? వాళ్లు ఇచ్చేది బోగస్ రిపోర్ట్. మీ జగన్ ఇస్తున్నది ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రతి గ్రామంలో విప్లవం ► ఈ రోజు ప్రతి గ్రామంలో విప్లవం కనిపిస్తోంది. వలంటీర్ల వ్యవస్థ, 15 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలు, నాడు–నేడుతో బాగుపడ్డ స్కూళ్లు, హాస్పిటళ్లు కనిపిస్తున్నాయి. 15 వేలకుపైగా విలేజ్, వార్డు క్లినిక్‌లు.. 11 వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. లంచాలు, వివక్ష లేకుండా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ పంపించాడు. అమ్మ ఒడి పథకాన్ని మీరెప్పుడైనా చూశారా? పూర్తి ఫీజులు కడుతూ విద్యాదీవెన, వసతి దీవెనకు ఇంతగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా? ► ఆసరా, సున్నా వడ్డీ ద్వారా పొదుపు అక్కచెల్లెమ్మలను ఆదుకున్నాం. చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో అండగా నిలిచాం. క్వాలిటీ చదువులే లక్ష్యంగా పేద పిల్లల తలరాతలు మార్చేలా మేనమామగా శ్రద్ధ పెట్టాను. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్, 6వ తరగతి నుంచే ఆ ప్రతి క్లాస్ రూములో డిజిటల్ బోధన, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ దాకా ప్రయాణం కనిపిస్తోంది. ఆ బడుల్లో నాడు–నేడు, గోరుముద్ద, విద్యా కానుక గతంలో ఎప్పుడైనా చూశారా? విశ్వవిద్యాలయాలతో ఒప్పందం ద్వారా డిగ్రీలోనే సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్, ప్రఖ్యాత యూనివర్సిటీ సర్టిఫికెట్స్ డిగ్రీలకు అనుసంధానం చేశాం. మ్యాండేటరీ ఇంటర్న్ షిప్ తీసుకొచ్చాం. ► లీడర్ అంటే ఇలా ఉండాలి అని గర్వంగా కాలర్ ఎగరేసేలా ప్రజల ప్రేమానురాగాలు పొందుతున్నాం. అదే చంద్రబాబు నాయుడు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా? ఇంతకన్నా ఇంకేం సర్టిఫికెట్ కావాలి? ► ఎప్పుడూ మోసాలు చేసే చంద్రబాబు.. నిన్ననే అనుకుంటా.. కొత్తగా ఒక మాట మాట్లాడాడు. వలంటీర్లకు రూ.10 వేలిస్తాడట. పోనీ ఇట్లన్నా జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నాడు. సంతోషం. జగన్ పాలన చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. దాన్నన్నా ఒప్పుకున్నాడు. మొన్నటి దాకా మన వలంటీర్ల వ్యవస్థ పట్ల భయంకరమైన ద్వేషం వెళ్లగక్కారు. మూటలు మోసే వాళ్లు అన్నాడు. వారి కథ తేలుస్తా అన్నాడు. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు. మగవాళ్లు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారని కూడా అన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి.. వలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తున్నారని అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు.. మాయమైపోతున్నారని కూడా అన్నాడు. వలంటీర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్‌కు అధికార పెగసస్ అని కూడా ట్వీట్ చేశాడు ఈ దత్తపుత్రుడు. ఇలా అన్న వాళ్లు వలంటీర్ వ్యవస్థను గుర్తించినందుకు సంతోషం. మన ప్రభుత్వానికి ఇంతకన్నా ఏం సర్టిఫికెట్ కావాలి? ► అయ్యా చంద్రబాబూ.. నీ హయాంలో జన్మభూమి కమిటీల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. వాళ్లు, మీరు ఇద్దరూ కలిసి మరుగుదొడ్లకూ, రేషన్‌కు, పెన్షన్‌కూ లంచాలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని దోచేశారు. చంద్రబాబు మనస్తత్వం రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండాలన్నది జగన్ మనస్తత్వం. ఇదీ.. నీకు నాకు మధ్య ఉన్న తేడా. ► ఇదే చంద్రబాబు మొన్నటికి మొన్న నిమ్మగడ్డ రమేష్ అనే తన మనిషితో ఎలక్షన్ కమిషన్ కు కంప్లయింట్ చేయించి, అవ్వాతాతలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్‌ను ఆపించారు. ఆ అవ్వాతాతలు ఇబ్బందులు పడేట్టుగా చేసి, చివరికి అనేక మంది అవ్వాతాతలు మరణానికి కూడా కారణమయ్యారు. ఒక్కసారిగా గాలి ఎదురు తిరిగే సరికే చంద్రబాబులో ఉన్న మోసం మళ్లీ చంద్రముఖిలా పైకి లేచింది. ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? ► ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలతో రాష్ట్ర పేదల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? (సిద్ధమేనని జనం నినాదాలు) మీరు సిద్ధంగా ఉంటే మోసగాళ్ల సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులోంచి సెల్ ఫోన్న్ బయటకు తీసి, అందులోని టార్చ్ లైట్ వెలిగించండి. (అందరూ సెల్లో టార్చ్ వెలిగించి పైకెత్తి చూపారు). 175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. ► మన పార్లమెంట్, దాని పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులందరికీ మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అందించాలని కోరుతున్నాను. మనది ఫ్యాన్ గుర్తు అని మరచిపోవద్దు. పేదల భవిష్యత్తు కోసం ఫ్యాను ఎప్పుడూ మన ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి. మన బతుకులు బాగుపడాలి అంటే ఫ్యాను మీద రెండు ఓట్లు కచ్చితంగా వేయాలి. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. ► 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఇంటింటికీ పంపించిన పాంప్లెట్ ఇది. (చేత్తో చూపిస్తూ..) గుర్తుందా ఈ పాంప్లెట్? ఇందులో మోడీగారి ఫొటో ఉంది. దత్తపుత్రుడి ఫొటో, చంద్రబాబు నాయుడు ఫొటో ఉంది. కింద చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది. ప్రతి టెలివిజన్ చాన్‌ల్‌లో వాళ్ల ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, టీవీ–5లో ఊదరగొడుతూ దీని గురించి అడ్వటైజ్ మెంట్లు కూడా ఇచ్చారు. ► రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? మీ ఇంట్లో.. మీ పక్కిళ్లలో 2014–2019 మధ్య ఆడ బిడ్డలు పుట్టారు కదా.. వాళ్లలో ఒక్కరికైనా రూ.25 వేలు ఇచ్చారా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా? ► మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన పిడుగురాళ్లలో కనిపించిందా? పోనీ మన గురుజాలలో అయినా కనిపిస్తోందా?ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్న్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. అవ్వాతాతలకు పెన్షన్ రూ.4 వేలు ఇస్తాడట. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? నేనున్నాననీ.. మీకేం కాదనీ.. ఫిట్స్‌తో స్పృహ తప్పిన మహిళ శావల్యాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయట పడింది. పల్నాడు జిల్లా గంటావారిపాలెం గ్రామ సమీపాన జాతీయ రహదారిపై బుధవారం ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర సాగుతుండగా ఓ మహిళ ఫిట్స్‌తో స్పృహ తప్పి పడిపోయింది. బొల్లాపల్లి మండలం సరికొండాయపాలెం గ్రామానికి చెందిన మల్లవరపు మౌనిక ఫిట్స్‌తో గత కొన్ని సంవత్సరాలుగా బాధ పడుతోంది. ఈ క్రమంలో తనకున్న వ్యాధి గురించి సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డికి విన్నవించిన అనంతరం అభిమానులు, కార్యకర్తల తోపులాటలో ఆమె ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయింది. విషయాన్ని గమనించిన సీఎం సత్వరమే వైద్యసేవలు అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో హుటాహుటిన 108 వాహనం ద్వారా వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయట పడింది. అరుదైన వ్యాధిగ్రస్తునికి ఆపన్నహస్తం మా 16 ఏళ్ల కొడుకు హుస్సేన్ బాషా అరుదైన మల్టిపుల్ అటెన్యూయేషన్ అసిఫైయింగ్ ఫైబ్రామా వ్యాధితో బాధపడుతున్నాడు. ముఖం ఎడమ సగభాగం కన్నుతో సహా ముందుకు వచ్చింది. ఏడాది క్రితం గుంటూరు జిల్లా వడ్లమూడిలోని ఓ ఆస్పత్రిలో హుస్సేన్‌కు రెండు సార్లు సర్జరీలు జరిగాయి. దీనికి అవసరమైన రూ.10 లక్షలు అప్పు చేసి తెచ్చి పెట్టాం. అంత అప్పు తీర్చే పరిస్థితి లేదు. మళ్లీ మా అబ్బాయికి వైద్యం చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరి్థక ఇబ్బందుల నేపథ్యంలో ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టాం. మా గోడును సీఎం వైఎస్ జగన్‌కు చెబుదామని వచ్చాం. మా సమస్య విని సీఎం చలించిపోయారు. తక్షణం వైద్యం అందించేందుకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆరోగ్య శ్రీ అధికారులను ఆదేశించారు. ఆయనకు జీవితాంతం రుణ పడి ఉంటాం. – ఖాదర్ అలీ, మౌలాబీ, బాషా తల్లిదండ్రులు కొమ్మాలపాడు, సంతమాగులూరు మండలం -
అభిమాన ప్రభం‘జనం’.. సీఎం జగన్ వెంటే మేమంటూ.. (ఫొటోలు)
-
‘జగన్ పాలన బావుందని చంద్రబాబు ఒప్పుకున్నాడు’
సాక్షి, పల్నాడు జిల్లా: ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్న చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయన్నారు. ‘‘వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని చంద్రబాబు అంటున్నాడు. ఇలాగైనా జగన్ పాలన బావుందని బాబు ఒప్పుకున్నాడు. ఇన్నాళ్లూ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు విషం చిమ్మారు. ఇప్పుడు వాలంటీర్లకు రూ. 10వేలు ఇస్తామంటున్నారు.. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏం ఉంటుంది?. ప్రజలు తిరగబడే సరికి చంద్రబాబు మారిపోయాడు. ఇప్పుడు వాలంటీర్లను మెచ్చుకుంటున్నారు. మంచి చేశాం కాబట్టే ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘ఊసరవెల్లి కంటే చంద్రబాబు ఎక్కువ రంగులుమారుస్తాడు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారు. చంద్రబాబు బతుకంతా అబద్ధాలు, వెన్నుపోట్లే. చంద్రబాబు ఊసరవెల్లిని దాటిపోయారు. చంద్రబాబు మోసాలు అందరికి తెలుసు. రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది దాచుకోవడం బాబు మనస్తత్వం. అవ్వాతాలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్ ఆపారు. నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించారు. అవ్వాతాతలను ఇబ్బంది పడేలా చేశారు’’ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ‘‘పిడుగురాళ్లలో జనసముద్రం చూస్తున్నాం. 5 ఏళ్లుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి అభివృద్ధి, సంక్షేమం అందించాం. సిద్ధం, సిద్ధం అంటూ నినాదాలు మన జైత్రయాత్రకు శంఖారావాలు. చంద్రబాబు మోసాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమా?. జిత్తులమారి చంద్రబాబు కుట్రలను తిప్పి కొట్టాలి. మేం ఎప్పుడూ పేదల పక్షమే.ఇవి పేదల తలరాతను మార్చే ఎన్నికలు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పేదలవాళ్లు మోసపోతారు చంద్రబాబు అంటే ఎన్నికల ముందు గంగా, అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు ముఖాముఖి. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగన్‌కు ఓటేయాలి’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. ‘‘పచ్చ మీడియా గాడిదను తీసుకొచ్చి గుర్రం అని ప్రచారం చేస్తాయి. చంద్రబాబు హయాంలో ఒక్కరికైనా మంచి జరిగిందా?. 14 ఏళ్ల బాబు పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?. చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా?. మనం వచ్చాక సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. మనం వచ్చాక లక్షా 35 వేల మందికి ఉద్యోగాలిచ్చాం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వైద్యరంగంలోనే 54 వేల నియామకాలు చేపట్టాం. పేదలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చాం. 58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రామ సచివాలయాల్లో లక్షా 35 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. జాబు రావాలంటే ఫ్యాన్ రావాలి’’ సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: బాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రొగ్రెస్ రిపోర్ట్: సీఎం జగన్ -
బాబు, ఎల్లో మీడియాపై మీరు..నేను ఒక ఫ్యాక్ట్ చెక్ చేదామా.. ?
-
అయ్యా.. చంద్రబాబు రైతులకు నువ్వు ఏం చేశావ్ ? సీఎం జగన్ ఫైర్
-
చంద్రబాబుది బోగస్ రిపోర్టు.. సీఎం జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు
-
ఇక్కడ జనసముద్రాన్ని చూస్తుంటే కోటప్పకొండ తిరునాళ్ల ముందే వచ్చినట్టుంది
-
చంద్రబాబు వాళ్లకు దోచుకున్న సొమ్మిచాడు.. సీఎం జగన్ మాకు దమ్మిచాడు
-
బాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రొగ్రెస్ రిపోర్ట్: సీఎం జగన్
సాక్షి, పల్నాడు జిల్లా: జిత్తులమారి పార్టీలు మోసాలు, కుట్రలు చేస్తున్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 12వ రోజు బుధవారం సాయంత్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మనం సిద్దం సిద్ధం.. అంటే.. వారికి యుద్ధంగా ప్రతిధ్వనిస్తోందన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పేదవాళ్లు మోసపోతారు ‘‘ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే.. ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబు అంటే ఎన్నికల ముందు గంగా.. అధికారం దక్కిన తర్వాత చంద్రముఖి. చంద్రబాబుకు ఓటేస్తే పేదవాళ్లు మోసపోతారు. ఇవి పేదల తలరాతను మార్చే ఎన్నికలు. మేం ఎప్పుడూ పేదల పక్షమే. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగన్‌కు ఓటేయాలి. బాబుకు ఓటేస్తే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయి.. పచ్చమీడియా గాడిదను తీసుకొచ్చి గుర్రం అని ప్రచారం చేస్తాయి’’ అని సీఎం జగన్ మండిపడ్డారు. జాబు రావాలంటే ఫ్యాను రావాలా.. లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా? ‘‘చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారా?. చంద్రబాబు హయాంలో ఒకరికైనా మంచి జరిగిందా?. జాబు రావాలంటే ఎవరు కావాలి?. జాబు రావాలంటే ఫ్యాను రావాలా.. లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా?. అధికారంలోకి రాగానే 2 లక్షల 31 ఉద్యోగాలు భర్తీ చేశాం. పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. గతంలో రైతుకు ఏమీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు మేలు చేస్తాడట. చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రొగ్రెస్ రిపోర్ట్. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబే. ‘కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు’’ అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. రైతన్నకు చంద్రబాబు చేసిందేమీ లేదు ‘‘రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు.. విడిపించాడా? రైతులకు సున్నా వడ్డీ, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టేశాడు.. మనం వచ్చాక రైతన్నకు తోడుగా ఉన్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతున్నకు తోడుగా ఉన్నాం. రైతన్నకు చంద్రబాబు చేసిందేమీ లేదు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘ప్రతి ఏడాది రైతు భరోసా ద్వారా రూ. 13,500 ఇచ్చాం. పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పాం రూ.64 వేల కోట్లతో ధాన్యం సేకరణ చేపట్టాం. ఏ సీజన్‌లోని ఇన్‌ఫుట్ సబ్సిడీని ఆ సీజన్లోనే ఇస్తున్నాం. సున్నా వడ్డీకే రుణాలిచ్చాం. 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం’’ అని సీఎం జగన్ వివరించారు. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏం ఉంటుంది ‘‘వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని చంద్రబాబు అంటున్నాడు. ఇలాగైనా జగన్ పాలన బావుందని చంద్రబాబు ఒప్పుకున్నాడు. ఇన్నాళ్లూ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు విషం చిమ్మారు. ఇప్పుడు వాలంటీర్లకు రూ. 10వేలు ఇస్తామంటున్నారు.. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏం ఉంటుంది. తిరగబడే సరికి చంద్రబాబు మారిపోయాడు. ఇప్పుడు వాలంటీర్లను మెచ్చుకుంటున్నారు. మంచి చేశాం కాబట్టే ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
పిడుగురాళ్ల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
-
పిడుగురాళ్ల సభకు చేరుకున్న సీఎం జగన్
-
ఇన్నాళ్లు ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క
-
స్కూలు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు జననేత కోసం ఆరాటం
-
Watch Live: అయ్యప్పనగర్ మేమంతా సిద్ధం సభ
-
ఇంటర్నేషనల్ ఫెసిలిటీ తో ఆస్పత్రి నిర్మాణం
-
AP: విషాదం.. గుండెపోటుతో ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి
పిడుగురాళ్ల: పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌కు చెందిన ఓ విద్యార్థి గుండెపోటుతో శనివారం రాత్రి మృతిచెందాడు. పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ గ్రామానికి చెందిన మందా కోటేశ్వరరావు కుమారుడు కోటి స్వాములు పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో ఉంటూ ఇక్కడే జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం రాత్రి భోజనం అనంతరం స్టడీ అవర్ సమయంలో కోటిస్వాములు తనకు ఊపిరి ఆడటం లేదని స్నేహితులకు చెప్పటంతో గాలి వీచే ప్రదేశంలో కూర్చోవాలని సూచించారు. వెంటనే గదిలోని ఫ్యాన్ కింద కూర్చునేందుకు వెళ్లి కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న నలుగురు స్నేహితులు కోటిస్వాములను లేపేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో వాచ్‌మన్‌కు సమాచారం అందించారు. వాచ్‌మన్ వచ్చి హాస్టల్ వార్డెన్‌కు తెలియజేయడంతో హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రాథమిక పరీక్షలు చేసి కోటిస్వాములు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుత్తికొండలో ఉంటున్న బాలుడు తల్లిదండ్రులకు వార్డెన్ గోపీనాయక్ సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి హాస్పిటల్ వద్ద బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. -
15 రోజుల క్రితమే పెళ్లి.. గోడపై అలా రాసి జంట ఆత్మహత్యాయత్నం
పిడుగురాళ్ల: పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుని 15 రోజులైనా గడవక ముందే ఆత్మహత్యకు యత్నించింది ఓ నవ జంట. భార్య మరణించగా.. భర్త ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల రజక కాలనీలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కాలనీకి చెందిన చంపాల నాగేశ్వరరావు మరణించడంతో ఆయన భార్య నాగమ్మ కూలిపనులు చేసుకుంటూ కుమార్తె అఖిల(17)తో కలిసి ఉంటుంది. అఖిల ఇంటర్ పూర్తిచేసింది. అదే కానీలకి చెందిన తాడువాయి వెంకట శివ కొడుకు వినయ్ ఇంటర్ పూర్తి చేసి ప్రైవేటు కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వినయ్, అఖిల ఒకరినొకరు ఇష్టపడ్డారు. తల్లిదండ్రులను ఒప్పించి గతనెల 31న గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నాగమ్మ నవ దంపతులను భోజనానికి పిలిచేందుకు వారి గది వద్దకు వెళ్లింది. ఎంతసేపు పిలిచినా తలుపు తీయకపోవడంతో తలుపు సందులో నుంచి చూసింది. గదిలో ఇనుప కడ్డీకి ఇద్దరూ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. దీంతో ఆమె కేకలు పెడుతూ బయటకు వచ్చింది. స్థానికులు తలుపులు పగలగొట్టి ఇద్దరినీ కిందికి దింపారు. అఖిల అప్పటికే మరణించింది. కొన ఊపిరితో ఉన్న వినయ్‌ను ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కట్నం విషయంలో గొడవే కారణమా? కట్నం విషయంలో ఇరు కుటుంబాల మధ్య సమస్య తలెత్తడంతో ఈనెల 12న పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడం వల్లే మనస్తాపం చెంది నవ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసి ఉంటారని భావిస్తున్నారు. గదిలో గోడపై ‘‘న్యాయం జరగాలి. పెద్ద మనుషులు న్యాయం చేయలేదు. ఇన్నిరోజులు ఆగి ఇప్పుడు చనిపోవడానికి కారణం న్యాయం జరుగుతుందని ఆశ’’ అని నల్లటి అక్షరాలతో రాసి ఉండడం దీనికి బలం చేకూరుస్తోంది. -
పత్తి సాగుపై పల్నాడు రైతుల ఆసక్తి
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఖరీఫ్ కోలాహలం నెలకొంది. రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2,87,954 హెక్టార్లు ఉండగా, ఇప్పటి వరకు 55,281 హెక్టార్లలో వివిధ పంటల విత్తనాలు వేశారు. గతేడాది ఇదే సమయంలో 19,164 హెక్టార్లలో మాత్రమే సాగు ఆరంభమైంది. సకాలంలో వర్షాలు కురవడంతో రైతులు సాగుకు ఉత్సాహంగా కదులుతున్నారు. ఈ ఏడాది రైతులు పత్తి సాగుపై అమితాసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటివరకు మొదలైన పంటల సాగులో పత్తి విస్తీర్ణమే అధికం కావడం గమనార్హం. రెంటచింతల, పిడుగురాళ్ల, క్రోసూరు, పెదకూరపాడు, అమరావతి ప్రాంతాల్లో ఓపెన్ నర్సరీలు, షేడ్‌నెట్‌లో మిరప నారు పోస్తున్నారు. తగ్గనున్న మిర్చి సాగు గత ఏడాది మిర్చి పంటకు విపరీతమైన తెగుళ్లు సోకాయి. ఫలితంగా ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం కన్నా నాలుగు నుంచి ఆరు వేల హెక్టార్లలో సాగు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి పంటకు గతేడాది ధర ఎక్కువ పలకడంతో సాధారణ విస్తీర్ణం కంటే 10 నుంచి 15 వేల హెక్టార్లు అధికంగా సాగు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో దాదాపు 1.45 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రబీ అనంతరం రెండునెలల ముందే కొన్నిప్రాంతాల్లో పత్తి, నువ్వులు 5,276 హెక్టార్లలో సాగవడం గమనార్హం. రైతులకు అండగా ప్రభుత్వం కృష్ణానది ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో భారీ వర్షాలు పడటంతో శ్రీశైలానికి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఇదే స్థాయిలో నీరు వస్తే మరో నాలుగైదు రోజుల్లో సాగర్‌కి నీరు పెద్ద మొత్తంలో విడుదలయ్యే అవకాశం ఉంది. జూలై చివర్లో కాలువలకు సాగర్ నీరు విడుదల చేసే ఆస్కారం ఉండడంతో జిల్లాలోని రైతులు సాగుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తోంది. అన్నివిధాలా అండగా ఉంటుంది. ఇప్పటికే రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందజేసిన విషయం తెలిసిందే. జిల్లాలో ఈ ఏడాది 2,43,492 మంది రైతులకు రూ.134.24 కోట్ల లబ్ధి రైతు భరోసా ద్వారా చేకూరింది. అలాగే పంటల బీమా పరిహారం ద్వారా మరో 54,997 మందికి రూ.49.89 కోట్ల లబ్ధి కలిగింది. పుష్కలంగా ఎరువులు జిల్లాలో ఖరీఫ్ సాగుకు ఎరువులు, విత్తనాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. 3,14,635 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేయగా, దీనిలో జూలై నెలకు 40,161 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని తేల్చారు. దీంతో ఇప్పటికే 64,302 మెట్రిక్ టన్నులను సిద్ధం చేశారు. విత్తనాలూ అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 6 వేల కింటాళ్ల పిల్లిపెసర, జీలుగ, జనుము విత్తనాలను ఇప్పటికే ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయడం గమనార్హం. విత్తనాలు సరఫరా చేశాం జిల్లాలో ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరతా లేదు. ఇప్పటికే రైతులకు పత్తి, వరి, మిరప విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేశాం. – ఐ.మురళీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, పల్నాడు జిల్లా వ్యవసాయం కలిసి వచ్చింది.. మాకు 7.5 ఎకరాల పొలం ఉంది. ఇందులో పత్తి, మిర్చి సాగు చేస్తాను. ప్రస్తుతానికి పత్తి పంట బాగా ఉంది. మిరప నారు పోయడానికి సిద్ధపడుతున్నాను. రెండేళ్లుగా వ్యవసాయం బాగా కలసి వచ్చింది. ఈ సారి కూడా ఖరీఫ్ సీజన్‌కు ఢోకా ఉండదనే నమ్మకంతో ఉన్నాం. రైతు భరోసా డబ్బులు జమ చేయడంతోపాటు ఆర్బీకేలలో విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. – అడపా సుబ్బారెడ్డి, వెల్దుర్తి, మాచర్ల నియోజకవర్గం -
రహస్యంగా భర్త రెండో పెళ్లి.. మళ్లీవచ్చి తీసుకెళ్తానని చెప్పి..
పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా): తనను మోసం చేసి, తన భర్త వేరే వివాహం చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్ ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేసింది. బాధితురాలి కథనం మేరకు.. పిడుగురాళ్ల పిల్లలగడ్డకు చెందిన ముజావర్ షాహీనాకు సత్తెనపల్లి మండలం తొండపి గ్రామానికి చెందిన ముజావర్ సైదాతో 2000 సంవత్సరం జూలై 23వ తేదీ వివాహం జరిగింది. చదవండి: దుస్తులు సరిగా కుట్టలేదని హత్య కొంతకాలం తొండపిలో వీరి కాపురం సాఫీగా సాగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. భర్త సైదా తన వద్ద డబ్బులు లేవని చెప్పి భార్య షాహీనా పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మి వ్యాపారం ప్రారంభిస్తానని నమ్మబలికాడు. దీంతో షాహీనా 20 సవర్ల బంగారం, తన పేరు మీద ఉన్న ఎకరం పొలం, ఇల్లు మొత్తం భర్త సైదాకు రాసి ఇచ్చింది. కొంతకాలం తర్వాత భార్యాపిల్లలను ఆమె పుట్టింట్లో వదిలి వ్యాపారం నిమిత్తం వెళ్తున్నానని, మళ్లీవచ్చి తీసుకెళ్తానని చెప్పి సైదా వెళ్లిపోయాడు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. చివరకు భర్త ఎక్కడున్నాడో తెలుసుకుందామని తొండపి వెళ్లగా సైదా వేరే పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి 2021 అక్టోబర్ 17వ తేదీ ఆ వివాహం ఆపివేయించానని భార్య షాహీనా తెలిపింది. అయితే గత నెలలో హైదరాబాద్‌లో మళ్లీ రహస్యంగా వేరే మహిళతో వివాహం చేసుకున్నాడని తెలిసింది. దీంతో తన బంధువులతో కలిసి హైదరాబాద్‌లో తన భర్త, వేరే మహిళ ఉన్నచోటుకు వెళ్లి ఇద్దరిని పట్టుకోవడం జరిగిందని తెలిపింది. శుక్రవారం తన భర్త రెండో పెళ్లి ఆధారాలతో పట్టణ పోలీస్‌స్టేషన్ వద్ద న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. సైదాను షాహీనా బంధువులు పోలీసులకు అప్పగించారు. సీఐ మధుసూదన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నలుగురు బైక్ దొంగలు అరెస్ట్.. 12 బైక్‌లు స్వాధీనం!
పిడుగురాళ్ల: నలుగురు బైక్ దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ కె.ప్రభాకరరావు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని న్యూ ఖలీల్ దాబా సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు యువకులు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 12 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. పట్టణ పరిసరాల్లో 10 బైక్‌లు, నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామంలో ఒక్క బైక్, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మట్టపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక బైక్ దొంగిలించారు. నిందితులైన మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన ఇస్లావత్ శ్రీనివాస నాయక్, మేఘవత్ నాగరాజునాయక్, పిడుగురాళ్ల పట్టణానికి చెందిన మురుగు బాలు, దాసరి భవానీప్రసాద్‌ను కోర్టుకు పంపినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌ల విలువ సుమారు రూ.4.85 లక్షలు ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ సమీర్‌బాషా, సిబ్బంది డి.వెంకటేశ్వర్లు, ఇమాంవలి పాల్గొన్నారు. చదవండి: అక్రమ మద్యంపై పోలీసుల ఉక్కు పాదం.. రూ.30 కోట్ల విలువ చేసే మద్యం సీజ్! -
ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డెలివరీ స్టేషన్, ఎక్కడంటే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ పూర్తిగా మహిళల నిర్వహణలో డెలివరీ కేంద్రాల సంఖ్యను పెంచుతోంది. 5వ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇటువంటి డెలివరీ పార్ట్నర్ స్టేషన్స్ చెన్నై, గుజరాత్, కేరళలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంస్థకు 750కిపైగా నగరాలు, పట్టణాల్లో మొత్తం 1,650 డెలివరీ సర్వీస్ పార్ట్నర్ స్టేషన్స్ ఉన్నాయి. నాలుగు ప్రభుత్వ సంస్థలతో అమెజాన్ భాగస్వామ్యం మరోవైపు మహిళా వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించే దిశగా అమెజాన్ సహేలీ ప్రోగ్రాం కింద నాలుగు సంస్థలతో చేతులు కలిపినట్లు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తెలిపింది. జార్ఖండ్ స్టేట్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సొసైటీ (జెఎస్ఎల్పీఎస్), ఉత్తర్‌ప్రదేశ్ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (యూపీఎస్ఆర్ఎల్ఎం), ఛత్తీస్‌గఢ్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ (సీజీ ఫారెస్ట్) అస్సామ్ రూరల్ ఇన్ఫ్రా అండ్ అగ్రి సర్వీసెస్ (ఏఆర్‌ఐఏఎస్) వీటిలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో సదరు సంస్థల పరిధిలోని మహిళా వ్యాపారవేత్తలు తమ తమ వ్యాపారాలను అమెజాన్ ఇండియాలో నమోదు చేసుకునేందుకు, మరింత విస్తృతంగా మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా చేసేందుకు ఈ ఒప్పందాలు తోడ్పడతాయని అమెజాన్ తెలిపింది. ఉత్పత్తుల లిస్టింగ్, ప్యాకేజింగ్, షిప్పింగ్ తదితర అంశాలకు సంబంధించి మహిళలు అమెజాన్ సహేలీ ప్రోగ్రాం కింద శిక్షణ కల్పిస్తామని పేర్కొంది. ఉమెన్స్ ఎంట్రప్రెన్యూర్షిప్ డే సందర్భంగా మహిళా వ్యాపారవేత్తలు రూపొందించిన ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక స్టోర్ ఆవిష్కరించినట్లు అమెజాన్ వివరించింది. చదవండి: అమెజాన్, 10 లక్షల మంది ఏ రేంజ్ ఫోన్లు కొన్నారో తెలుసా..! -
మద్యం షాపులో రూ.50 లక్షల గోల్మాల్
పిడుగురాళ్ల: మద్యం దుకాణంలో సుమారు రూ.50 లక్షలు గోల్మాల్ అయిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని చెక్‌పోస్టు ఎదురుగా గల ప్రభుత్వ మద్యం దుకాణంలో వారం రోజులుగా లెక్కలు సక్రమంగా లేకపోవడాన్ని ఎస్ఈబీ కానిస్టేబుల్ ఎస్.వెంకటేశ్వర్లు పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. సోమవారం తెల్లవారుజామున ఎస్ఈబీ సీఐ బాషా ఆధ్వర్యంలో ఆ మద్యం దుకాణాన్ని పరిశీలించి స్టాక్‌ను తనిఖీ చేసి రూ.49,63,737 విలువ గల మద్యం సీసాలు మాయమైనట్టు నిర్ధారించారు. సీఐ బాషా మాట్లాడుతూ.. ఈ మద్యం షాపులో పని చేస్తున్న సూపర్వైజర్, ఓ సేల్స్‌మేన్ కనిపించలేదని చెప్పారు. మిగిలిన ఇద్దరు సేల్స్మెన్లను విచారించామని చెప్పారు. 20 రోజుల నుంచి ఈ తంతు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. షాపు సూపర్వైజర్ విజయ్ అందుబాటులో లేడని, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. అతన్నీ అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరమే గోల్‌మాల్‌కు సంబంధించిన వివరాలు తెలుస్తాయన్నారు. ఈ అవినీతిలో కొందరు ఎస్ఈబీ సిబ్బంది హస్తం కూడా ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో విచారణ పూర్తి చేసి నిందితులపై క్రిమినల్ కేసులు, ఆర్ఆర్ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. -
తిరుపతికి రానన్న భర్త.. భార్య క్షణికావేశం.. మూడు ప్రాణాలు బలి
పిడుగురాళ్ల(గురజాల): క్షణికావేశం.. ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఓ తల్లి తన కన్నబిడ్డలిద్దర్నీ కడతేర్చిన హృదయ విదారక ఘటన పిడుగురాళ్ల పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలోని మిలటరీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన మానస (27), బండారు శ్రావణ్‌కుమార్‌కు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. ఇటీవల మానస తిరుపతి పుణ్యక్షేత్రం వెళ్లాలని కోరడంతో కుటుంబ సభ్యులంతా సిద్ధమయ్యారు. అయితే మానస భర్త శ్రావణ్‌కుమార్ పని వత్తిడి వల్ల తిరుపతికి రాలేనని అత్తమామలతో కలసి పిల్లలను తీసుకెళ్లాలని సూచించాడు. ఈ విషయమై ఇద్దరు గొడవ పడ్డారు. అయితే రోజు మాదిరిగానే శనివారం రాత్రి శ్రావణ్ కుమార్ ఇంటి పైపోర్షన్లో పడుకున్నాడు. కింద పోర్షన్లో మానస, పిల్లలిద్దరూ పడుకున్నారు. అయితే ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రావణ్‌కుమార్ నిద్రలేచి కిందకు వచ్చి ఎంతసేపు తలుపు కొట్టినా తలుపు తీయకపోవడంతో, భార్యకు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తలుపులు పగలగొట్టారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు షర్మిల (3), జ్యోతి (2), మానస విగత జీవులయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ ఎస్ఐ సమీర్ బాషా వివరాలను సేకరించారు. ఇద్దరు చిన్నారుల మెడకు కాటన్ క్లాత్ గట్టిగా బిగించి దివాన్‌కాట్‌కు కట్టేసి చంపేసిన అనంతరం మానస కూడా ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మానస తండ్రి గుంజా శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ సమీర్ బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన కుమార్తెకు కోపం ఎక్కువని, గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిందని మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ తెలిపారు. ఈ కోణంలోనే మానస క్షణికావేశంతో ఇద్దరు చిన్నారులను చంపి తానూ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కూడా ఫిర్యాదులో మృతురాలి తండ్రి పేర్కొన్నారని ఎస్ఐ వివరించారు. -
అనుమతులు గోరంత.. దోచేది కొండంత !
పిడుగురాళ్ల రూరల్: ప్రభుత్వం పేదల కోసం నిర్మించే ఇళ్ల స్థలాల చదును కోసం మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకొని ప్రైవేటు పనులకు అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతూ అక్రమార్కులు కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లను పెట్టి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ అక్రమార్జనకు తెరలేçపుతున్నారు. అధికారులు సైతం జరుగుతున్న అక్రమంలో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ మేము ఉన్న సమయంలో ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, ఆ తవ్వకాలకు మాకు ఎటువంటి సంబంధం లేదని చర్యలు తీసుకోవటంలో జాప్యం వహిస్తూ నిర్లక్ష్య సమాధానాలు చెబుతున్నారు. అనుమతి తీసుకున్న సదరు కాంట్రాక్టర్ పిడుగురాళ్ల మండల పరిధిలోని కామేపల్లి గ్రామ బైపాస్ వద్ద ఉన్న టీడీపీ నేతకు చెందిన స్థలంలోకి, స్థానిక సిమెంట్ ఫ్యాక్టరీకి పెద్ద మొత్తంలో మట్టి తరలిస్తూ ప్రభుత్వం ఆదాయానికి చిల్లు పెడుతున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు పిడుగురాళ్ల, మాచవరం మండలం సరిహద్దుల్లో ఉన్న గాంధీనగర్ గ్రామం పొల్లాల్లో సర్వే నంబర్ 976/2 పట్టా భూమి నందు పిన్నెల్లి గ్రామంలోని ఇళ్ల స్థలాలు చదును చేయటానికి అనుమతులు తీసుకున్నారు. గ్రావెల్ రోడ్డుకు మట్టి తవ్వకాలు నిర్వహించుకోనేందుకు కాంట్రాక్టర్ 1,660 క్యూబిక్ మీటర్లకు ఆగస్టు నెల 19న అనుమతులు పొందాడు. భారీ ప్రొక్లెయిన్లు, పదుల సంఖ్యలో లారీలతో అర్ధరాత్రి సమయంలో అదే అనుమతిని అడ్డం పెట్టుకొని పిడుగురాళ్ల మండలం కామేపల్లి బైపాస్ పక్కనే ఉన్న ఓ టీడీపీ నేత పెట్రోల్ బంకు నిర్మాణానికి, తుమ్మలచెరువు గ్రామ శివారులో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి వేల టన్నుల్లో మట్టిని సరఫరా చేస్తున్నారు. 1,660 క్యూబిక్ మీటర్లకు 93 టిప్పర్లు మాత్రమే మట్టిని సరఫరా చేసుకోవాలి. అంటే 18 క్యూబిక్ మీటరుŠల్ ఒక టిప్పర్‌కు సమానం. రోజుకు సుమారు 120 టిప్పర్లతో మట్టిని తవ్వకాలు చేపడుతున్నారు. ఒక్కో టిప్పర్‌కు వచ్చి రూ.6 వేలు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్క రోజుకే సుమారు రూ.9 లక్షలకుపైగా ఆదాయం గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఇటువైపు కన్నెతి కూడా చూడటం లేదు. అనుమతులు పొందిన సర్వే నంబర్ ఒకటి, తవ్వకాలు జరిపేది ఒక చోట అని వదంతులు వినిపిస్తున్నాయి. స్థానిక వీఆర్వో అడిగినా తనకు ఎలాంటి సమాచారం తెలియదని, ఉన్నతాధికారులను సంప్రదించాలని మాట దాటవేశారు. దీనిపై మాచవరం మండలం తహసీల్దార్ సి.చెంచులక్ష్మిని సాక్షి ఫోన్లో వివరణ కోరగా తనకు తెలియదని తాను కొత్తగా వచ్చానని, గత తహసీల్దార్ అనుమతులు ఇచ్చారని, దీనిపై తనకు తెలియదని సమాధానం చెప్పి ఫోన్ కట్ చేశారు. చర్యలు తీసుకుంటాం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పిన్నెల్లి గ్రామ శివార్లలో 1,660 క్యూబిక్ మీటర్లకు గ్రావెల్ రోడ్డు నిర్మాణం కోసం అనుమతి తీసుకున్నారు. అయితే స్థానికంగా ఉన్న తహసీల్దార్ ఎంత వరకు తవ్వకాలు జరిపారో, ఎక్కడికి తరలిస్తున్నారో అని సమాచారం తెలుసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి. అధికంగా తవ్వకాలు జరిపితే మేం చర్యలు తీసుకుంటాం. – వెంకట్రావు, మైనింగ్ ఏడీ, నడికుడి -
గాయపడ్డ వ్యక్తికి ఎమ్మెల్యే ప్రాథమిక చికిత్స
-
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి
సాక్షి, గుంటూరు: ప్రాణాపాయంలో ఉన్న యువకుడికి ప్రాథమిక చికిత్స చేసి తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి మానవత్వం చాటుకున్నారు. ఆమె గురువారం హైదరాబాద్ వెళ్తుండగా పిడుగురాళ్ల దగ్గర ఓ లారీ బైకును ఢీ కొట్టిన దృశ్యం కనిపించింది. బైకు పై ఉన్న వ్యక్తి తీవ్రగాయాలతో రోడ్డుపై పడిపోయి కనిపించాడు. కరోనా భయంతో అక్కడున్న స్థానికులు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో అటుగా వచ్చిన ఎమ్మెల్యే శ్రీదేవి వెంటనే బాధితుడి చెంతకు చేరారు. గాయాలపాలైన యువకుడికి ముందుగా ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ఆమె పోలీసులు, 108కు సమాచారమిచ్చారు. వారు వచ్చేంతవరకు అక్కడే ఉండి, ఆ తర్వాత ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు (రెండు రోజులే కస్టడీకి అనుమతి) చదవండి: నిర్భయ కేసులో జేడీఏ హబీబ్‌బాషా అరెస్టు -
ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య
సాక్షి, పిడుగురాళ్ల : ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. మండలంలోని తుమ్మలచెరువు గ్రా మానికి చెందిన గన్నారపు రంగారెడ్డి కుమార్తె రాధికకు వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన జూలకంటి వెంకటరెడ్డి, నాగమ్మల రెండో కుమారుడు లచ్చిరెడ్డితో 2013లో వివాహమైంది. వ్యాపారం కోసం లచ్చిరెడ్డి, ఆయన సోదరుడు నారాయణరెడ్డి కుటుంబాలు కలిసి హైదరాబాద్‌లోని కేబీసీ కాలనీలో జీవనం సాగిస్తున్నాయి. అయితే ఏప్రిల్ 14న నారాయణరెడ్డి, హర్షితల కుమార్తె లిసిక (3) మరుగుదొడ్లు శుభ్రం చేసే ద్రావణం తాగి మరణించింది. కానీ లిసిక మరణానికి రాధిక కారణం అంటూ కుటుంబంలో కలహాలు మొదలయ్యా యి. గురువా రం ఉదయం 11 గంటలకు రాధికను తుమ్మలచెరువు గ్రామంలో ఆమె తల్లి ఇంటి వద్ద విడిచి భర్త లచ్చిరెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయాడు. రాధిక (27) ఆ అపనిందను భరించలేక ఆదివారం తన ఇద్దరు పిల్లలు కృషిదీప్‌రెడ్డి (4), రిషిక (13 నెలలు)లను దిండుతో అదిమిపెట్టి చంపి తాను ఉరివేసుకొని మృతి చెందింది. రేషన్ తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆమె తల్లి ఇంటికొచ్చి చూసేసరికి కుమార్తె ఉరివేసుకొని కనిపించింది. హర్షితకు చెప్పండి... నేను ఎలాంటి తప్పూ చేయలేదు నాన్నా.. అంటూ తన మరణానికి కారణం తెలియజేస్తూ రాసిన లేఖ ఆమె మృతదేహం వద్ద గుర్తించారు. సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, సీఐ కె. ప్రభాకర్, ఎస్ఐ సుధీర్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్వాలిటీ వాల్ కోటింగ్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేస్తున్నారు. మంటల్లో వాల్ పుట్టి ముడిసరుకు, పెయింట్స్ దగ్ధం అయ్యాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సుమారు రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యరపతినేనిపై సీబీఐ విచారణకు ఆదేశం
సాక్షి, అమరావతి : మైనింగ్ కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యరపతినేనిపై ఉన్న 18 కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ మంగళవారం రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలోని కోణంకి, కేసనుపల్లి, నదికుడి గ్రామాల్లో అక్రమ మైనింగ్ పై విచారణ జరపాలని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. కాగా, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో యరపతినేని అక్రమంగా మైనింగ్ చేపట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. (గ్రానైట్ అక్రమ రవాణా సూత్రధారి యరపతినేని!) 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారంటూ విమర్శలు ఎదురర్కొన్నారు. దీంతోనే గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హోం మంత్రిత్వ శాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. దీంతో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి వ్యవహారాలపై ఏ క్షణంలోనైనా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. -
‘కోడెలను బాబు ఎందుకు పరామర్శించలేదు?’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా రేపు గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో టీడీపీ బాధితులు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరితతో సహా పల్నాడు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. రౌడీ షీటర్లను కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగే విధంగా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం దారుణమన్నారు. మాజీ స్పీకర్ కోడెల్ శివప్రసాద్‌కు గుండెపోటు వస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు పరామర్శించలేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలను పరామర్శించలేని చంద్రబాబు తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లిచ్చి ప్రజలు ఓట్లతో దాడి చేసినా చాల్లేదా? అని ఎద్దేవా చేశారు. కోడెల శివప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు అక్రమాలపై చంద్రబాబు నాయుడు నోరెందుకు మెదపడంలేదని ఎమ్మెల్యే కాసు మహేష్ ప్రశ్నించారు. తనపై దాడిచేయాలని చంద్రబాబు ప్రణాళిలకు రచించడం హాస్యాస్పదమన్నారు. -
పల్నాడు ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే మైనింగ్ దందా
సాక్షి, గుంటూరు: ఒకప్పుడు అప్పులు తప్ప ఆస్తులు లేవు.. ఆంధ్రా సీడ్స్‌కు అప్పులు ఎగ్గొట్టిన చరిత్ర అతనిది.. 2014 సంవత్సరానికి ముందు ఎన్నికల నిర్వహణ ఖర్చులు పెట్టుకోవడానికి ఇబ్బందులు పడ్డ వ్యక్తి ఆయన.. చివరకు కార్యకర్తల చందాలతో గెలుపొందాడు. అనంతరం ఐదేళ్ల టీడీపీ పాలనలో పల్నాడులో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడు. రూ.వేల కోట్ల ఖనిజ సంపదను దోచేశాడు. ఇలా దందాకు పాల్పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాపం పండింది. అక్రమ మైనింగ్ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహజ వనరులను దోచుకున్న యరపతినేని, ఆయన అనుచరుల అస్తులను జప్తు చేస్తారని ప్రచారం సాగుతోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలంలో కోనంకి, దాచేపల్లి మండలంలోని నడికుడి, కేశానుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతూ సుమారు కోటి మెట్రిక్ టన్నుల తెల్లరాయి (లైమ్ స్టోన్)ని దోచేశారు. యరపతినేని కనుసన్నల్లో సాగిన అక్రమ మైనింగ్‌పై గత ఏడాది ఆగస్టులో సీబీసీఐడీ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకూ అక్రమ మైనింగ్‌పై జరిపిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికను షీల్డ్ కవర్లో గత సోమవారం అధికారులు హైకోర్టు ముందుంచారు. మనీ ల్యాండరింగ్ కోణంలో కేసు దర్యాప్తు జరపాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పగించకూడదో తెలపాలంటూ ధర్మాసనం యరపతినేనని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈ కేసు విచారణను కోరే వ్యవహారంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గుండెల్లో రైళ్లు.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు బదలాయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏడాదిపాటు అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీలు అక్రమ మైనింగ్ కారణంగా రూ. వేల కోట్లు గడించినట్టు గుర్తించారు. మైనింగ్ మాఫియాలో కీలక సభ్యులైన బుల్లెబ్బాయి, ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు మొదలైన వ్యక్తులు యరపతినేని బినామీలుగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే. గత ఐదేళ్లలో వీరందరూ అక్రమ మైనింగ్ కారణంగా రూ. కోట్లు సంపాదించినట్టు దర్యాప్తులో వెలువడినట్టు పోలీస్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు బదలాయిస్తున్నట్టు తెలుస్తుండటంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీల్లో ఆందోళన మొదలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తును అప్పగిస్తే ఆయా సంస్థలు అక్రమంగా సంపాదించిన ఆస్తులను అటాచ్ చేస్తాయని మైనింగ్ మాఫియా సభ్యులు భయపడుతున్నారు. -
పేదలతో కాల్‌మనీ చెలగాటం
సాక్షి, పిడుగురాళ్ల(గుంటూరు) : రోజు వారీ కూలీలు, చిరు ఉద్యోగులు, రోజు వారీ వ్యాపారులు, తోపుడు బండ్ల వారు ఇలా పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఓ రూపాయి సంపాదించాలని పెట్టుబడి కోసం, లేదంటే వారి కుటుంబాల అవసరాల కోసం వారాల లెక్క వడ్డీకి డబ్బులు తీసుకుని అసలు, వడ్డీ చెల్లించలేక నానా అవస్థలు పడుతున్న వైనం పిడుగురాళ్ల పట్టణంలో జరుగుతుంది. పట్టణంలోని మాచర్ల బస్టాండ్ సెంటర్ వద్ద ఓ దివ్యాంగురాలు ప్రైవేటు పాఠశాలలో ఆయాగా, వంట మనిషిగా పని చేస్తుంది. కుమార్తెకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారాల లెక్కన రూ.10 వేలు తీసుకుంది. సగం డబ్బులు చెల్లించింది. మధ్యలో తనకు ఆరోగ్యం బాగోలేక రెండు నెలలు ఆలస్యం కావడంతో వారాల లెక్క వడ్డీకి డబ్బులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు ఇంటిపైకి వచ్చి గతంలో చెల్లించిన డబ్బులు వడ్డీకే సరిపోయాయని, తిరిగి మళ్లీ నోటు రాసి మొదటి నుంచి చెల్లించాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అదే విధంగా పట్టణంలోని ఆదర్శ కాలనీకి చెందిన షేక్ ఖాశిం అనే వ్యక్తి సున్నం బట్టీల్లో కూలి పనులు చేస్తుంటాడు. కుటుంబ అవసరాల కోసం రూ.10 వేలు వారాల లెక్క వడ్డీకి తీసుకున్నాడు. ఇతను కూడా సగానికి పైగానే అప్పు చెల్లించాడు. మధ్యలో ఇతనికి అనారోగ్యం కారణంగా ఓ నెల చెల్లించలేకపోవడంతో సదరు వడ్డీ రాయుళ్లు అతని ఇంటిపైకి వెళ్లి అతని పట్ల అసభ్య పదజాలంతో దూషించి అతన్ని భయబ్రాంతులకు గురి చేయడంతో అతను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బిక్కుబిక్కు మంటూ ఉన్నాడు. ఇలా పట్టణంలో వందల సంఖ్యలో పేద, నిరుపేద, చిరువ్యాపారులు వడ్డీకి డబ్బులు తీసుకుని అధిక వడ్డీలు చెల్లించలేక నరకయాతన పడుతున్నారు. వారాల లెక్క ఇలా... పట్టణంలోనే కాకుండా రాజమండ్రి, అనపర్తి, మండపేట ప్రాంతాల నుంచి కొంతమంది వడ్డీ వ్యాపారులు పిడుగురాళ్ల పట్టణంలో వారాల లెక్క వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరు ఒక్కొక్కరు 1000 మందికి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు వారాల లెక్క వడ్డీలకు తిప్పుతున్నారు. వీరు రూ.5 వేలు తీసుకున్న వారికి రూ.4900 ఇస్తారు. కాని వారు 12 వారాల్లో రూ.6 వేలు చెల్లించాలి. రూ.10 వేలు తీసుకున్న వారికి రూ.9800 ఇస్తారు. 12 వారాల్లో రూ.12 వేలు చెల్లించాలి. సుమారు నూటికి రూ.8 వడ్డీ వసూలు చేస్తున్నారు. మధ్యలో ఎవరైనా రెండు, మూడు వారాలు చెల్లించకుంటే అదనంగా మరో రూ.4 వడ్డీ వేసి రూ.12 వడ్డీ వసూలు చేస్తున్నారు. ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు, వేలిముద్రలు తీసుకుని వీరు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అన్నీ అనధికారమే... ఈ వడ్డీ వ్యాపారం చేసే వారు అన్నీ అనధికారికంగానే చేస్తున్నారు. ఎటువంటి లైసెన్సులు ఉండవు. ఓ చిన్న పుస్తకాన్ని వారి పేరుతో ప్రింట్ చేసి వారాల వివరాలు, వారానికి ఎంత కట్టాలి రాసి ఇస్తారు. అయితే వసూలు చేసే వ్యక్తులు చదువు రాని వారికి రాయకుండానే రాశామని చెప్పి మాయ చేస్తూ వారు పూర్తిగా చెల్లించినప్పటికీ ఇంకా చెల్లించాలంటూ వారి వద్ద నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీనిపై పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాల్‌మనీ వ్యాపారులపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి బడుగు, బలహీన, చిరు వ్యాపారులను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ విషయమై పిడుగురాళ్ల పట్టణ సీఐ ఎ.సురేంద్రబాబును ‘సాక్షి’ వివరణ కోరగా కాల్‌మనీకి సంబంధించిన ఫిర్యాదులు తన దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీ నోటుపై సంతకాలు పెట్టమంటున్నారు కుటుంబ అవసరాల కోసం వారాల వారి దగ్గర రూ.10 వేలు అప్పు తీసుకుంటే సగానికి పైగానే చెల్లించాను. మధ్యలో ఓ నెల ఆరోగ్యం బాగోలేక చెల్లించలేకపోయాను. దానికే చెల్లించిన నగదు వడ్డీకి సరిపోయిందని, మళ్లీ రూ.10 వేలు చెల్లించాలని, దానికి గాను ఖాళీ నోటుపై సంతకాలు పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు. వై.కుమారి, పిడుగురాళ్ల, కాల్‌మనీ బాధితురాలు -
జానపాడుకు చేరిన నరసింహారావు
సాక్షి, పిడుగురాళ్ల/గురజాల: తండ్రి కష్టాలు చూసి తట్టుకోలేక కుటుంబాన్ని అప్పుల బాధ నుంచి విడిపించాలనే తపనతో మలేషియా వెళ్లి చిన్నతనంలోనే నరకం చూసిన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన బత్తుల నరసింహారావు కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. మలేషియా నుంచి తెలుగు అసోసియేషన్ సభ్యులు టిక్కెట్ బుక్ చేయడంతో నరసింహారావు గురువారం జానపాడులోని తన స్వగృహానికి క్షేమంగా చేరుకున్నాడు. ఐదు నెలల కిందట నరసింహారావు తన స్నేహితుడు సైదారావు, భీమవరానికి చెందిన ఏజెంట్ అయ్యప్పకు మలేషియా వెళ్లేందుకు రూ.లక్ష అప్పు చేసి ఇచ్చాడు. ఆ ఏజెంటు వర్కింగ్ వీసా బదులు విజిటింగ్ వీసాపై నరసింహారావును మలేషియాకు పంపించాడు. మలేషియాలో ఓ కొరియర్ కంపెనీలో పనిచేస్తున్న అతన్ని పోలీసులు విజిటింగ్ వీసాపై వచ్చినట్లు గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపించారు. మలేషియాలో తను పడుతున్న బాధలను నరసింహారావు తండ్రికి ఉత్తరం ద్వారా తెలిపాడు. కొడుకును జైల్లో వేశారని, చిత్ర హింసలు పెడుతున్నారని నరసింహరావు తండ్రి బత్తుల గురూజీకి తెలిసి తల్లడిల్లాడు. ‘నేను చచ్చి పోతున్నా. ఇక బతకను’ అంటూ కొడుకు రాసిన లేఖను మీడియా దృష్టికి తీసుకెళ్లడంతో పాటు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి తెలిపాడు. స్పందించిన ఎమ్మెల్యే మలేషియాలో తెలుగు అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదించి నరసింహరావు ఇండియా వచ్చేందుకు కృషి చేశారు. వారందరి కృషితో గురువారానికి స్వగ్రామమైన జానపాడుకు వచ్చాడు. తల్లిదండ్రులు గురూజీ, పద్మ కుమారుడిని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. పోలీసులు తనను అరెస్టు చేశాక నరకం చూపించారని, జ్వరంతో బాధపడుతున్నా కనీసం ఒక్క మాత్ర కూడా ఇవ్వలేదని నరసింహారావు వాపోయాడు. తన తండ్రి ,అధికారుల చేసిన ప్రయత్నాల వల్లే స్వదేశం చేరుకోగలిగానని హర్షం వ్యక్తం చేశాడు. మొదలైన మరో మలేషియా బాధితుడి కథ బత్తుల నరసింహారావు మలేషియా పోలీసుల నుంచి విడుదలై ఇండియాకు వస్తుండటంతో.. పోలీసులకు చిక్కిన మరో మలేషియా బాధితుడు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన లావేటి రమేష్ తనకు టిక్కెట్ వేయమని తల్లిదండ్రులకు లెటర్ ఇచ్చి పంపించాడు. రమేష్ గత ఏడు నెలల నుంచి మలేషియా జైల్లో మగ్గుతున్నాడు. ఒక బాధితుడి కథ సుఖాంతమయ్యే సరికి మరో బాధితుడి కథ వెలుగు చూసింది. -
కారం కొట్టి రూ.లక్ష చోరీ
సాక్షి, గుంటూరు(పిడుగురాళ్ల) : కళ్లల్లో కారం కొట్టి రూ.లక్ష నగదు గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ వైన్ షాపులో కోనంకి గ్రామానికి చెందిన అన్నదమ్ములు దుర్గారావు, సైదారావు పని చేస్తుంటారు. బుధవారం అర్ధరాత్రి విధులు ముగించుకుని కోనంకి గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు వారి కళ్లల్లో కారం కొట్టి బ్యాగులో ఉన్న రూ.లక్ష నగదును అపహరించుకు వెళ్లిపోయారు. దీంతో సైదారావు పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. సైదారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం సత్తెనపల్లి డీఎస్పీ జగదీశ్వరరెడ్డి, పట్టణ సీఐ సురేంద్రబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
సజీవ దహనానికి యత్నం
పిడుగురాళ్ల రూరల్: ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్తను సజీవంగా దహనం చేసేందుకు యత్నించిన ఘటన గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త నాదెండ్ల లింగారావు ఎన్నికల సమయంలో చురుగ్గా వ్యవహరించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న టీడీపీ నేతలు సమయం కోసం ఎదురుచూడసాగారు.ఆదివారం సాయంత్రం లింగారావు తన పొలంలో చెత్త కుప్పలను దహనం చేసేందుకు ఒంటరిగా వెళ్లాడు. దీన్ని గమనించిన టీడీపీ నాయకులు షేక్ సైదా, షేక్ గండేలు, ముళ్లపూడి వెంకటేశ్వర్లు.. పొలంలోకి వెళ్లి లింగారావు చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను లాక్కుని అతనిపై పోసి నిప్పు అంటించారు. నువ్వు బతికి ఉంటే గ్రామంలోకి రారా అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయారు. పక్క పొలాల్లో పనిచేస్తున్న కొందరు వెంటనే వచ్చి మంటలు ఆర్పి లింగారావును కాపాడారు. అనంతరం నిందితులు వెంకటేశ్వర్లు, సైదాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గండేలు పరారీలో ఉన్నాడు. లింగారావు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
‘ఆంధ్రజ్యోతి’పై కచ్చితంగా చర్యలు తీసుకుంటా’
పిడుగురాళ్ల: తాను ప్రెస్‌మీట్, ఇంటర్వ్యూ ఇవ్వకుండానే ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో తన పేరుతో తప్పుడు కథనాలు రాయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉగ్గు నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనను అడ్డుపెట్టుకుని ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా గురజాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి వద్ద తనను అప్రదిష్ట పాలు చేసే విధంగా తప్పుడు కథనాలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసు కుటుంబం ఆర్యవైశ్యులకు ఎప్పుడూ దూరంగా ఉంటారని, ఆ సామాజికవర్గం వారి పట్ల శ్రద్ధ చూపరంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 11న తప్పుడు రాతలు ప్రచురించారన్నారు. గతంలో కూడా తనను అడ్డుపెట్టుకుని తప్పుడు రాతలు, కథనాలు రాశారని, అప్పుడు కూడా మందలించినట్లు గుర్తు చేశారు. అయినా వారి పంథా మార్చుకోకుండా, తన ప్రమేయం లేకుండా తాను కాసు కుటుంబంపై అసంతృప్తిగా ఉన్నట్లు తప్పుడు కథనాలు రాయడం సరికాదని మండిపడ్డారు. తమ లాంటి ఆర్యవైశ్యుల పరువును బజారున పెట్టడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. తప్పుడు రాతలు రాసే ఆంధ్రజ్యోతి పత్రికపై, సంబంధిత వ్యక్తిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తాను ఎన్నో పూజలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు -
వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై టీడీపీ దాడులు
-
పిడుగురాళ్ల ప్రచార సభలో వైఎస్ జగన్
-
గత చరిత్రను గుర్తుతెచ్చుకోండి..
-
రౌడీయిజం రాజ్యమేలుతోంది: వైఎస్ జగన్
సాక్షి, పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా) : గురజాల నియోజకవర్గంలో రౌడీయిజం రాజ్యమేలుతోందని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు మైనింగ్ మాఫియా సృష్టించారని, ఈ దోపిడీని అరికట్టాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు నారా లోకేష్ యరపతినేనితో బాగాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా, గురజాల నియోజవకవర్గం పిడుగురాళ్లలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్నికల ముందు చంద్రబాబు తమ పథకాలను కాపీ కొట్టి మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యారన్నారు. పసుపు కుంకుమ పథకానికి మోసపోవద్దని, అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. గురజాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసు మహేష్‌రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. తాగు నీటి సమస్యను పట్టించుకోలేదు.. ‘పక్కనే నాగర్జునసాగర్ ఉంటుంది.. కానీ తాగడానికి మంచి నీళ్లు ఉండవ్. ఐదేళ్ల పాలనలో ఎన్నడు ఈ సమస్యను పట్టించుకోలేదు. ఎన్నికలు ముందు చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్ వచ్చి బుగ్గవాగు నుంచి కృష్ణ నీళ్లు తెస్తామని టెంకాయ కొడుతాడు. ఐదేళ్లు గుర్తుకురాని నీటి సమస్య ఎన్నికల ముందే గుర్తుకు వస్తుంది. రైతన్నలకు సాగు నీరు లేదు. పత్తికి గిట్టుబాటు ధరలేదు. మిర్చి పంటకు క్వింటాల్ రూ.6వేలు కూడా రావడం లేదు. 70 గ్రామాలు పూర్తిగా తాగు నీరులేక ఇబ్బందులు పడుతున్నాయి. లక్ష మంది పైచిలుకు నివాసం ఉంటున్న పిడుగురాళ్లలో కనీసం 100 పడకల ఆసుపత్రి లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే గుంటూరుకు వెళ్లే పరిస్థితి. గురజాలలో యరపతినేని అనే దిక్కుమాలిన ఎమ్మెల్యే ఉన్నారు. మైనింగ్ వ్యాపారంతో గనులను దోపిడీ చేస్తున్నారు. కోర్టులు సైతం ఇక్కడ మైనింగ్, మాఫియా జరిగిందని రూ.కోట్లు జరిమాన వేసే పరిస్థితి ఏర్పడింది. మైనింగ్ దోపిడీని అరికట్టాల్సిన సీఎం ఆయన కొడుకు యరపతినేనితో బాగాలను పంచుకుంటున్నారు. రూ.100 కోట్లు జప్తు చేయమని కోర్టు ఆదేశిస్తే.. చంద్రబాబు జేబులోని సీఐడీతో విచారణ చేయించి.. ఆ సొమ్మును యరపతినేని నుంచి వసూలు చేయకుండా చిన్నిచిన్న మైనింగ్ కంపెనీలను బెదరిస్తూ నోటీసులు పంపిస్తున్నారు. థియేటర్ల యజమానులు డబ్బులు ఇవ్వకుంటే సినిమా థియేటర్లు మూసే పరిస్థితి ఉంది. పేకట క్లబ్బులు, మైనింగ్ మాఫియాతో ఇక్కడ రౌడీయిజం రాజ్యమేలుతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ఆలోచన చేయమని కోరుతున్నా. ఆయన పాలన మోసం, అబద్దాలు, అవినీతి, అన్యాయం అనే పదాలతో నిండిపోయింది. ఒక్కసారి ఆలోచించండి.. 21 నెలల కిందట మన పార్టీ ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించాం. పాదయాత్రతో ప్రతి పేదవాడి, రైతన్న దగ్గరకు తీసుకు వెళ్లాం. వారి సూచనలు, విన్నపాలతో కొన్ని మార్పులు కూడా చేశాం. మన వాగ్ధానాలు మంచి మనసు నుంచి పుడితే.. చంద్రబాబుకు వాగ్ధానాలు మాత్రం ఓటమి భయంతో పుట్టాయి. రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రూ.50 వేలు ఉచితంగా చేతికి అందిస్తామని 21 నెలల కింద మనం వాగ్ధానం చేశాం. కానీ చంద్రబాబు మాత్రం ఐదేళ్లు రైతన్నలను పూర్తిగా మోసం చేసి.. ఎన్నికలకు ముందు మన పథకాన్ని కాపీ కొడుతూ అన్నదాత సుఖీభవ అంటూ మోసం చేసేందుకు మరోసారి సిద్దమయ్యారు. చంద్రబాబు మాట నమ్మి పూర్తిగా మోసపోయిన డ్వాక్రా మహిళల బాధలను చూసి.. ఎన్నికల తేదివరకు ఎంత రుణం ఉంటుందో అంత మొత్తాన్ని వారి చేతికే అందిస్తామని నవరత్నాల్లో ప్రకటించాం. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అక్కకు ఈ విషయం చెబుతూ భరోసా కల్పించాం. కానీ చంద్రబాబు మాత్రం డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేసి.. సున్నా వడ్డీ రుణాలను ఎగరగొట్టి.. ఇప్పుడు పసుపు-కుంకుమ అని కొత్త సినిమా చూపిస్తున్నారు. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు ఉన్న 28 వేల కోట్ల రుణాలు నేరుగా చేతికే ఇస్తామని చెప్పిన మనమెక్కడా.. పసుపు కుంకుమతో ముష్టివేసినట్లు ఇస్తానన్న రూ.6 వేల కోట్లు ఎక్కడా? ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తామని.. జాబు రావాలంటే బాబు రావాలని చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకోమని కోరుతున్నా. ఉద్యోగం రాకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. ఎన్నికల ముందు ముష్టి వేసినట్లు కొంత మందికి ఇస్తూ.. ప్రకటనలు ఇచ్చుకుంటున్న ఈ అన్యాయపు పాలనను చూడమని కోరుతున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకహోదాను తీసుకొస్తామని చెప్పి.. ఆ తరువాత ఆ అంశాన్ని అటకెక్కించిన తీరు.. రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయని ఈ ప్రభుత్వంపై ఆలోచన చేయమని కోరుతున్నా. లక్షా 20వేల నిరుద్యోగ భృతి ఎగరగొట్టిన ఈయన పాలనను గమనించమని కోరుతున్నా. గత చరిత్రను గుర్తుతెచ్చుకోండి.. ఎన్నికలకు వచ్చేసరికి అన్ని రకాల స్కీంలతో మోసం చేయడానికి చంద్రబాబు సిద్దంగా ఉంటారు. ఈయన మోసాలకు అండగా అమ్ముడుపోయిన మీడియా ఉంది. వీరంతా కలిసికట్టుగా చేస్తున్న మోసాలు చూడమని కోరుతున్నా. 1994 సంవత్సరంలో చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం.. రూ.2లకే బియ్యం, సంపూర్ణ మధ్యపాన నిషేదం వంటి వాగ్ధానాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది 1995లో బియ్యాన్ని రూ.5.25 చేసి.. సంపూర్ణ మధ్య నిషేదాన్ని ఎత్తేసారు. ఈ విషయాలను గుర్తు తెచ్చుకోని చంద్రబాబు నైజాన్ని చూడమని కోరుతున్నా. అవే అన్యాయాలు.. మోసాలను చూడమని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిరోజు చంద్రబాబునాయుడు పాలనపై చర్చ జరగకూడదని, ఆయన పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు రావని, ఆయన పచ్చమీడియాతో రోజుకో పుకారు పుట్టిస్తున్నారు. దీనిపై చర్చపెట్టి.. పత్రికల్లో పతాక శీర్షీకలతో ప్రచురిస్తున్నారు. ఇలా చంద్రబాబు మోసపూరిత పాలన ప్రజలకు గుర్తురాకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగనన్నతోనే సాధ్యమని తెలపండి.. ఎన్నికలు వచ్చే సరికి ఈ కుట్రలు మరింత పెరుగుతాయి. చంద్రబాబు చేయని మోసం ఉండదు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపించి. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తాడని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో మన పిల్లల చదువుకు ఎంత ఖర్చైనా అన్న భరిస్తాడని చెప్పండి. డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తాడని తెలుపండి. లక్షాధికారులను చేస్తాడని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తాడని చెప్పండి. ప్రతి ఏడాది మే నెలలో రూ.12500 చేతుల పెడతాడని ప్రతి రైతన్నకు చెప్పండి. సున్నా వడ్డీ రుణాలు జగనన్న రాజ్యంలోనే సాధ్యమని తెలపండి. గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇస్తాడని తెలపండి. అవ్వా, తాతలకు మూడు వేల ఫించన్ మీ మనవడు ఇస్తాడని చెప్పండి. ఇళ్లు లేవని ప్రతి నిరుపేదను కలవండి. ప్రతి పేదవాడికి ఇళ్లు రావాలంటే జగనన్నతోనే సాధ్యమని తెలపండి. రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
-
వైఎస్సార్సీపీలోకి ఏపీ టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్/పిడుగురాళ్లటౌన్ : ఏపీవ్యాప్తంగా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నంతో పాటు.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వున్నం హాస్పిటల్ అధినేత వున్నం నర్సింహారావు, ఆయన కుమారుడు వున్నం నాగమల్లికార్జునరావు బుధవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి వైఎస్ జగన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వారితో పాటు టీడీపీకి చెందిన పలువురు నేతలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ కాసు మహేశ్‌రెడ్డి, నరసరావుపేట పార్లమెంటు ఇన్చార్జి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పార్టీ నేతలు జంగా వెంకటకోటయ్య, రేపాల శ్రీనివాసులు తదితరులున్నారు -
పిడుగురాళ్లలో భూకంపం
పిడుగురాళ్ల (గురజాల): గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శనివారం భూమి కంపించింది. ఉన్నట్టుండి పెద్ద శబ్దం రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. గంటన్నర వ్యవధిలో మొత్తం నాలుగుసార్లు శబ్దం రావడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒకసారి, 3.45 గంటలకు రెండోసారి, 4.30 గంటలకు మూడోసారి, 4.58 గంటలకు నాలుగోసారి భూమి కంపించింది. పిడుగురాళ్ల చుట్టూ సున్నపురాళ్ల క్వారీలు ఉండటంతో క్వారీల్లో బ్లాస్టింగ్ జరిగినపుడు పెద్ద శబ్దాలు వస్తుంటాయి. అయితే అవి క్వారీకి సమీపంలో ఉన్న వారికి మాత్రమే వినిపిస్తాయి. కానీ పట్టణంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. ముఖ్యంగా పిల్లలగడ్డ, పాటిగుంతల, రైల్వేస్టేషన్ రోడ్డు, శ్రీనివాసకాలనీ, తహసీల్దార్ కార్యాలయం వెనుక వైపు, పోలీస్‌స్టేషన్ సెంటర్, జానపాడు రోడ్డుతో పాటు ఆక్స్‌ఫర్డ్‌లోని అపార్ట్మెంట్స్, చెరువుకట్ట బజారు, ఐలాండ్ సెంటర్‌తో పాటు ప్రధాన రహదారుల్లో ఉన్న ఇళ్లల్లో కూడా ఒక్కసారిగా శబ్దాలు రావడంతో భూకంపం వచ్చిందంటూ ప్రజలు పరుగులు తీశారు. అధికారులు సైతం ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అర్థంకాక సతమతమయ్యారు. తహసీల్దార్ కె.రవిబాబు, మున్సిపల్ కమిషనర్ కాసు శివరామిరెడ్డి, సీఐ వీరేంద్రబాబు, రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు భూకంపం వచ్చిన పలు ప్రాంతాలను పరిశీలించి ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడ్డగోలుగా క్వారీలు తవ్వడం వలనే.. అడ్డగోలుగా భూగర్భ ఖనిజాలు తీయడం వల్లే ఇటువంటి భూకంప విపత్తు సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పిడుగురాళ్ల చుట్టూ సున్నపు క్వారీల గనులు, తెల్లరాయి గనులున్నాయి. నిబంధనలు వదిలి ఎంతలోతు రాయి ఉంటే అంతలోతు తవ్వకాలు చేస్తున్నారు. రాళ్లు తీసేటపుడు కూడా మోతాదుకు మించి పేలుడు పదార్థాలు వాడుతున్నారు. అధికార యంత్రాంగం క్వారీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటే ఇలాంటి విపత్తులు జరగకుండా ఉంటాయని ప్రజలు చెబుతున్నారు. పెద్ద శబ్దం రావడంతో భయమేసింది మధ్యాహ్నం ఇంటికి వచ్చాను. తినేందుకు ప్లేటులో అన్నం పెట్టుకున్నాను. ఒక్కసారిగా ఢాం అని శబ్దం రావడంతో భయపడి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాను. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే సమయంలో మరోసారి శబ్దం రావడంతో మరింత భయమేసింది. – మద్దిగుంట సైదులు, పిడుగురాళ్ల కాళ్లు, చేతులు వణికిపోయాయి వరుసగా భూకంప శబ్దాలు రావడంతో కాళ్లు, చేతులు వణికిపోయాయి. ఇంట్లో ఉండాలంటే భయమేసింది. శబ్దం విని బయటకు పరుగులు తీసి అరుగు మీద కూర్చున్నాను. మా బజారులో వారంతా బయటకు వచ్చి ఏమిటీ శబ్దాలంటూ ఆందోళన చెందారు. – విజయలక్ష్మి, పిడుగురాళ్ల -
పిడుగురాళ్లలో భూప్రకంపనలు..
సాక్షి, గుంటూరు: జిల్లాలోని పిడుగురాళ్లలో శనివారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండు సెకన్లపాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఒక్కసారిగా భూప్రకంపనలు సంభవించడంతో బెంబేలెత్తిపోయిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు ఏం జరుగుతుందో స్థానికులకు అర్థం కాలేదు. స్వల్పంగా భూమి కంపించిన విషయాన్ని తెలుసుకున్న ప్రజలు కాసేపు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
చినబాబు టూర్..ప్రజలు బేజార్!
సాక్షి, గుంటూరు / పిడుగురాళ్ల రూరల్: కంచే చేను మేస్తే .. కాపేమి చేయగలడన్న సామెతకు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన నారా లోకేష్ పర్యటన నిదర్శనంగా నిలిచింది. అధికార పార్టీ నేతలు, పోలీసుల నిర్లక్ష్యానికి వేలాది మంది ప్రయాణికులు, వాహనదారులు కొన్ని గంటలపాటు రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకయాతన అనుభవించారు. అంబులెన్సులకు సైతం దారి వదలక పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో శుక్రవారం రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నియోజకవర్గంలోని గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ప్రతి మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించారు. గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణాల్లో నడిరోడ్లపై బహిరంగ సభలు ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపి వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణాల్లో బహిరంగ సభలు ముగిసే వరకు సుమారు ఐదు గంటలపాటు అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో సుమారు 10 కిలోమీటర్లకుపైగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్సులకు సైతం దారి ఇవ్వని పరిస్థితి. మాచవరం మండలానికి చెందిన ఓ గర్భిణీ కాన్పు కోసం అంబులెన్సులో నరసరావుపేటకు వెళుతుండగా, పిడుగురాళ్ళకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్‌లో చిక్కుకు పోయింది. దీంతో సుమారు రెండు గంటలపాటు అంబులెన్సులోనే పురిటినొప్పులతో గర్భిణీ అల్లాడిపోయింది. ఆమె పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు దారి కోసం ఎంత ప్రయత్నించినా లోకేష్ సభముగిసే వరకు ట్రాఫిక్ దిగ్బంధంలోనే ఉండాల్సి వచ్చింది. నడిరోడ్డుపై నరకయాతన పడ్డాం: మాచర్ల నుంచి విజయవాడకు కుటుంబంతో కారులో బయల్దేరాం. పిడుగురాళ్ళకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉండగానే ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాం. వెనక్కు వెళ్లలేక, ముందుకు పోలేక సుమారు ఐదు గంటలపాటు కుటుంబంతో నడిరోడ్డుపై నరకయాతన పడ్డాం. – రాజు, వాహనదారుడు, మాచర్ల -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం; కదులుతున్న టీడీపీ డొంక
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణలో టీడీపీ డొంక కదులుతోంది. జననేతను అంతమొందించేందుకు అధికార పార్టీ కుట్ర పన్నారన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆధారాలు బయట పడుతున్నాయి. నిందితుడు శ్రీనివాస్ ఫోన్ కాల్స్ డేటా విశ్లేషణలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. (శ్రీనివాస్ ఫోన్ నుంచి 10 వేల కాల్స్) శ్రీనివాస్ కాల్ డేటా ఆధారంగా మంగళవారం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పాత గణేశునిపాడుకు చెందిన నాగూర్ వలి కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నాగూర్ వలి సోదరి సైదాబి, ఆమె మరదలు అమీజా ఉన్నారు. వీరిని మంగళవారం రాత్రి 10.15 గంటలకు సిట్ అధికారులు విచారణ కోసం వైజాగ్ ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. శ్రీనివాస్‌తో ఎంతకాలంగా పరిచయం ఉంది? పదే పదే ఎందుకు ఫోన్ చేశాడు? ఏయే విషయాలు మాట్లాడాడు? అనే దానిపై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. టీడీపీ సానుభూతిపరులైన వీరిని ఆదివారం రాత్రే పిడుగురాళ్ల పోలీసులు అదుపులోకి విచారించారు. అయితే టీడీపీ నాయకుల నుంచి ఒత్తిళ్లు రావడంతో వీరిని పోలీసులు విడిచిపెట్టారు. ఈ ముగ్గురిని సిట్ అధికారులు విచారణ చేస్తుండటంతో టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే కుట్ర కోణాన్ని వెలికితీసే విధంగా విచారణ జరగడం లేదని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెర వెనుక సూత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులోని ప్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేసిన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన మరో వ్యక్తిని కూడా సిట్ అధికారులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. సంబంధిత కథనాలు: ఆ 4 వాక్యాల కోసం.. పెద్దల ‘షో’ శ్రీను.. కొత్త సీను విచారణ తూతూమంత్రం నిజాలు దాస్తున్నాడు చెప్పాల్సింది లేదు.. నాకేం తెలియదు! -
యరపతినేనిని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నం
-
రైతులకు ఇవ్వాల్సిన పరిహారంలో అవకతవకలు
-
బస్సును ఢీకొన్న లారీ: నలుగురికి గాయాలు
గుంటూరు : పిడుగురాళ్ల శివారులో ఆర్టీసీ బస్సును బుధవారం తెల్లవారుజామున లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు మీరే రాసుకోవాలంటూ బస్సు ప్రయాణికులపై హల్చల్ చేశారు. బస్సుతోపాటు ప్రయాణికులకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దాదాపు నాలుగు గంటల పాటు ప్రయాణికులు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. పోలీసుల తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. -
నీళ్లలో చేలు.. కళ్లలో నీళ్లు
ఇంతకుముందు ఎటు చూసినా పచ్చటి పంటపొలాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కురిసన భారీ వర్షాలకు పల్నాడు ప్రాంతం మునిగిపోయింది. చేల నిండా నీళ్లు నిండిపోవడంతో.. రైతుల కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆపదలో ఉన్న అన్నదాతకు కనీసం భరోసా కల్పించే దిక్కు కూడా లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాళ్లకు అండగా తానుంటానంటూ వెళ్లారు. వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన గుంటూరు జిల్లా రైతులను పలకరించేందుకు రెండు రోజులు పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం ఉదయం పిడుగురాళ్ల అంజిరెడ్డి ఆస్పత్రి సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరికాసేపట్లో పాయన అనుపాలెం చేరుకోనున్నారు. అక్కడ నీట మునిగిన పంటపొలాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిశీలిస్తారు. రైతులను పలకరిస్తారు. -
పిడుగురాళ్లలో భారీ చోరీ
పిడుగురాళ్ల (గుంటూరు) : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు, రూ. 40 వేల విలువైన ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సాయంతో వివరాలు సేకరిస్తున్నారు. -
గుంటూరు టీడీపీలో ఘర్షణ.. ఐదుగురికి గాయాలు
పిడుగురాళ్ల : గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్నాయి. పిడుగురాళ్లలో రెండు వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్న సంఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పిడుగురాళ్ల మండలం అగ్రహారంలో శనివారం చోటుచేసుకుంది. స్థానిక ఎంపీటీసీ రాంరెడ్డి సైదమ్మ(టీడీపీ) వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే నెపంతో కొందరు టీడీపీ కార్యకర్తలు ఆమె పై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎంపీటీసీ వర్గీయులు కూడా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
పిడుగురాళ్లలో ఘోర రోడ్డుప్రమాదం
-
పిడుగురాళ్లలో వైఎస్సార్సీపీ నాయకుల ధర్నా
పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు ధర్నాకు దిగారు. వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుందుర్తి గురవాచారిపై అక్రమ కేసులు బనాయించి కోర్టులో హాజరుపరచకుండా తిప్పుతున్నారని, అదుపులోకి తీసుకుని రెండు రోజులైనా అతని జాడ ఇంకా తెలియలేదని ఆందోళనకు దిగారు. గురజాలలో అక్రమ మైనింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యే యరపతినేనిపై గురువాచారి కోర్టులో పిల్ వేసిన సంగతి తెల్సిందే. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధంతో వ్యక్తి హత్య!
పిడుగురాళ్ల: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన గురైన ఘటన శనివారం ఉదయం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పిడుగురాళ్ల పట్టణం ఆదర్శనగర్‌కు చెందిన డేగల యోహాను(40) అనే వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో వేమనరపు జార్జి ఇనుపరాడ్‌తో కొట్టి చంపాడు. దీంతో యోహాను అక్కడిక్కడే మరణించాడు. అనంతరం జార్జి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ జగదీష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పిడుగురాళ్లలో స్వల్ప భూ ప్రకంపనలు
పిడుగురాళ్ల (గుంటూరు) : గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో స్వల్పంగా భూమి కంపించింది. శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలో రెండు నిముషాలపాటు భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఫైర్ ఆఫీసర్
పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా) : పిడుగురాళ్ల ఫైర్ ఆఫీసులో ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫైర్ ఆఫీసర్ శివశంకర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పిడుగురాళ్లలో ఇటీవల ఓ అగ్ని ప్రమాదంలో నరేంద్ర అనే వ్యక్తికి చెందిన దుకాణం తగలబడిపోయింది. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ కోసం ఫైర్ ఆఫీసర్ దగ్గరకు వెళితే ఆయన రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో నరేంద్ర ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫైర్ ఆఫీసర్ శివశంకర్ బాధితుడి నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా పథకం ప్రకారం గురువారం పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్రెండ్స్ తో కలిసి ప్రియురాలిపై అత్యాచారం
- పెళ్లికి అడ్డు పడుతుందేమోనని ప్రియుడి ఘాతుకం - గుంటూరు జిల్లాలో ఘటన వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఒక్కటిగా జీవించాలనుకున్నారు. అయితే మతాలు వేరుకావడంతో ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పారు. దీంతో ప్రేమికులు 'బలవంతంగా' విడిపోయారు. కొంతకాలానికి ఆ ఇద్దరి మధ్య మళ్లీ ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. ఇంతలోనే ప్రియుడికి మరో యువతితో వివాహం నిశ్చయమైంది. అటు ప్రియురాలి నుంచి ఫోన్ కాల్స్ ఉదృతీ పెరిగింది. దీంతో పెళ్లికి అడ్డువస్తుందేమోనని ప్రియురాలిపై ఘాతుకానికి ఒడిగట్టాడా ప్రియుడు. స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన ఓ యువతి గోతాల కంపెనీలో కూలీగా పనిచేస్తోంది. ఏడునెలల కిందట పట్టణానికే చెందిన ఆటోడ్రైవర్ రహీమ్‌తో ఫోన్ ద్వారా ఆమెకు పరిచయమైంది. వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దలకు తెలియడం, పెళ్లికి అంగీకరించకపోవడంతో రెండు నెలల నుంచి వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవలే రహీమ్‌కు మరో యువతితో వివాహం నిశ్చయమైంది. మాజీ ప్రేమికురాలు మళ్లీ ఫోన్ కాల్స్ చేస్తే తన పెళ్లికి అటంకం కలుగుతందనుకున్న రహీమ్.. సోమవారం సాయంత్రం స్నేహితులు రషీద్, వెంకటేశ్వర్లు, వెంకటేష్ లతో కలిసి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. పథకం ప్రకారం వారు ముందుగా రెస్టారెంట్లో మద్యం సేవించి, పని ముగించుకుని 7గంటల సమయంలో ఇంటికి వెళుతున్న యువతిని మార్గమధ్యంలో అడ్డగించి, ఆటోలో ఎక్కించుకుని దేవరంపాడు పొలాల వైపు తీసుకువెళ్లారు. అక్కడ యువకులు ఆమెను దుర్భాషలాడి అత్యాచారం జరిపి కొట్టారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా ఇంటికి వెళ్లి విషయాన్ని పెద్దలకు చెప్పింది. బాధిత యువతి మంగళవారం పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి పట్టణ ఇన్చార్జి సీఐ శ్రీధర్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు పంపిస్తే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గుంటూరుకు పంపించినట్లు సీఐ తెలిపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
పిడుగురాళ్లలో దొంగల బీభత్సం
పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని అయ్యప్ప ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో ఉన్న ఆరు చిన్న హుండీలు, ఒక పెద్ద హుండీని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అపహరించుపోయారు. శనివారం ఉదయం గమనించిన నిర్వాహకులు చుట్టుపక్కల వెదకగా పక్కనే ఉన్న పత్తి చేనులో పగుల గొట్టిన హుండీలు కనిపించాయి. ఎంత సొత్తు పోయిందనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు -
వృద్ధ దంపతుల దారుణహత్య
పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా): పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో వృద్ధ దంపతులు దారుణహత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన వెంకటప్పయ్య(75), వెంకట రామమ్మ(65) అనే దంపతులను ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి చంపారు. ఘటన అనంతరం వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఆలస్యంగా మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్ఆర్ సీపీ నేతపై వేటకొడవళ్లతో దాడి
గుంటూరు:గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో గురువారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. స్థానిక మహాలక్ష్మీ బార్లో వైఎస్ఆర్ సీపీ సొసైటీ ప్రెసిడెంట్ సీతారామిరెడ్డిపై ఆయన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. గాయపడిన ఆయనను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సీతారామిరెడ్డికి అదే గ్రామానికి చెందిన పందిటి రామిరెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సీతారామిరెడ్డిపై రామిరెడ్డి వేటకొడవలితో దాడి చేశాడు. అక్కడున్న వారు అడ్డుకోవటంతో సీతారామిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన అనంతరం రామిరెడ్డి పరారయ్యాడు. సీఐ సుబ్బారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు లారీ ఢీ.. ఐదుగురి మృతి
పిడుగురాళ్ల: గుంటూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పిడుగురాళ్ల మండలం జాన్పాడ్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. కారంపూడి నుంచి పిడుగురాళ్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు, పిడుగురాళ్ల వైపు పెళ్లి బృందంతో వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా.. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఓ పదేళ్ల చిన్నారితో పాటు, నలుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల్లో కొంతమందిని పిడుగురాళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించే పనిలో అధికారులు ఉన్నారు. -
కారు,లారీ ఢీ : మహిళ మృతి
పిడుగురాళ్ల (గుంటూరు): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పంతులుగారి మిల్లు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌కు చెందిన దంపతులు కారులో గుంటూరు వెళ్తున్న క్రమంలో గుంటూరు నుంచి పిడుగురాళ్లకు వెళ్తున్న వీఆర్ఎల పార్శిల్ లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న అనురాధ(48) అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కారును ఢీకొన్న లారీ
పిడుగురాళ్ల రూరల్ (గుంటూరు) : సిమెంట్ లారీ, కారు ఢీకొన్న ఘటనలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తున్న కారు..పిడుగురాళ్ల వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో వేగం తగ్గింది. అదే సమయంలో నల్లగొండ జిల్లా హుజూర్నగర్ నుంచి సిమెంట్ లోడుతో వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. కారులో వెనుక సీట్లో కూర్చున్న నలుగురు పిల్లలకు గాయాలయ్యాయి. -
రెండు బైకులు ఢీ: ఒకరి పరిస్థితి విషమం
గుంటూరు : గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పిడుగురాళ్ల మండలం అయప్పనగర్ జాతీయ రహదారిపై ఓ బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. -
రుణమాఫీ కాలేదని..రైతు బలవన్మరణం
గుంటూరు : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం సందిటివారిపాలెంలో బుచ్చిరెడ్డి(40) అనే రైతు రుణమాఫీ కాలేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో దిగుబడి రాక అప్పుల పాలైనట్లు, రుణమాఫీ కూడా కాకపోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రైతు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (పిడుగురాళ్ల) -
గుంటూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి స్వల్ప భూకంపం వచ్చింది. పిడుగురాళ్ల, మాచవరంలలో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.