నలుగురు బైక్‌ దొంగలు అరెస్ట్‌.. 12 బైక్‌లు స్వాధీనం! | AP Police Arrests 4 Bike Thieves And Recovered 12 Stolen Bikes | Sakshi
Sakshi News home page

Guntur: నలుగురు బైక్‌ దొంగలు అరెస్ట్‌.. 12 బైక్‌లు స్వాధీనం!

Published Sat, Dec 11 2021 9:55 AM | Last Updated on Sat, Dec 11 2021 9:56 AM

AP Police Arrests 4 Bike Thieves And Recovered 12 Stolen Bikes - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పిడుగురాళ్ల: నలుగురు బైక్‌ దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ కె.ప్రభాకరరావు తెలిపారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని న్యూ ఖలీల్‌ దాబా సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు యువకులు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 12 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. పట్టణ పరిసరాల్లో 10 బైక్‌లు, నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామంలో ఒక్క బైక్, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మట్టపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక బైక్‌ దొంగిలించారు. నిందితులైన మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన ఇస్లావత్‌ శ్రీనివాస నాయక్, మేఘవత్‌ నాగరాజునాయక్, పిడుగురాళ్ల పట్టణానికి చెందిన మురుగు బాలు, దాసరి భవానీప్రసాద్‌ను కోర్టుకు పంపినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌ల విలువ సుమారు రూ.4.85 లక్షలు ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సమీర్‌బాషా, సిబ్బంది డి.వెంకటేశ్వర్లు, ఇమాంవలి పాల్గొన్నారు.   

చదవండి: అక్రమ మద్యంపై పోలీసుల ఉక్కు పాదం.. రూ.30 కోట్ల విలువ చేసే మద్యం సీజ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement