Bike thieves
-
సినిమా రేంజ్లో బైక్ చోరీ.. హీరో అనిపించుకున్న సెక్యూరిటీ గార్డ్!
ఇద్దరు దొంగలు సినిమా రేంజ్‌కు బైక్ దొంగతనానికి పాల్పడ్డారు. కానీ, ఇంతలో గేట్ వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ సమయస్పూర్తితో వారికి ఊహించిన షాక్ తగిలింది. దెబ్బకు పట్టపగలే దొంగలకు చుక్కలు కనిపించాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. సౌత్‌ఢిల్లీలోని ఎవరెస్ట్ అపార్ట్మెంట్లోకి తాము మున్సిపల్ అధికారులమని చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. తర్వాత వారి కదలికలు అనుమానంగా ఉండటంతో సెక్యూరిటీ గార్డ్ గమనిస్తూనే ఉన్నాడు. కాగా, మధ్యాహ్నం సమయంలో అపార్ట్‌మెంట్‌లోపలికి బైక్‌పై ఓ కొరియర్ డెలివరీ బాయ్ వచ్చాడు. అయితే, ఓ డెలివరీ ఏజెంట్ తన బైక్ తాళాలను ఆ వాహనానికే ఉంచి వెళ్లాడు. బైక్‌ను గమనించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌ను తీసుకొని పారిపోయేందుకు యత్నించారు. బైక్‌ను స్టార్ట్ చేయడం గమనించిన డెలివరీ బాయ్.. గట్టిగా కేకలు వేయడంతో గేట్ వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ అలర్ట్ అయ్యాడు. ఫాస్ట్‌గా దూసుకొస్తున్న బైక్‌ను ఆపేందుకు సూపర్ ప్లాన్ చేశాడు. ఒక్కసారిగా గేటు మూసివేయడంతో బైక్ ఆ గేటు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో, వారిద్దరూ గేటు వద్దే పడిపోయారు. అనంతరం, స్థానికులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా ఒకరు పారిపోయారు. మరొకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Caught On CCTV: Bike Thieves Try To Speed Through Colony Gate In Delhi https://t.co/0k6GJ1LTbU pic.twitter.com/rC6rQKmn1U — NDTV (@ndtv) September 27, 2022 -
నలుగురు బైక్ దొంగలు అరెస్ట్.. 12 బైక్‌లు స్వాధీనం!
పిడుగురాళ్ల: నలుగురు బైక్ దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ కె.ప్రభాకరరావు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని న్యూ ఖలీల్ దాబా సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు యువకులు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 12 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. పట్టణ పరిసరాల్లో 10 బైక్‌లు, నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామంలో ఒక్క బైక్, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మట్టపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక బైక్ దొంగిలించారు. నిందితులైన మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన ఇస్లావత్ శ్రీనివాస నాయక్, మేఘవత్ నాగరాజునాయక్, పిడుగురాళ్ల పట్టణానికి చెందిన మురుగు బాలు, దాసరి భవానీప్రసాద్‌ను కోర్టుకు పంపినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌ల విలువ సుమారు రూ.4.85 లక్షలు ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ సమీర్‌బాషా, సిబ్బంది డి.వెంకటేశ్వర్లు, ఇమాంవలి పాల్గొన్నారు. చదవండి: అక్రమ మద్యంపై పోలీసుల ఉక్కు పాదం.. రూ.30 కోట్ల విలువ చేసే మద్యం సీజ్! -
స్కూటీ ఎలా కొట్టేశారో చూడండి..
సాక్షి, హైదరాబాద్ : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. పార్కింగ్ చేసి పక్కకు వెళ్లి వచ్చే లోపు బండిని అదృశ్యం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చందానగర్‌లోని ఫాస్ట్స్టెప్ షాపు ముందు జరిగింది. వివరాలు.. శుక్రవారం సాయంత్రం షాపింగ్ కోసం వచ్చిన మహిళ తన ద్విచక్ర వాహనాన్ని చందానగర్ లోని ఫాస్ట్స్టెప్ షాపు ముందు నిలిపి లోపలి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి స్కూటీ కనపడలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. తన స్కూటీ కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని తీసుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. అనంతరం పుటేజీ ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నారు. -
జల్సాలకు అలవాటు పడి.. చోరీల బాట
మల్లాపూర్: చిన్న వయసులోనే జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం రాచకొండ క్రైం డీసీపీ నాగరాజు వివరాలు వెల్లడించారు. బాలానగర్ ఫిష్ మార్కెట్ ప్రాంతానికి చెందిన షేక్ జునీత్గౌస్,, సంతోష్‌నగర్ ప్రాంతానికి మహ్మద్ ఫరాఆహ్మద్ తరచూ పార్కు చేసిన బైక్‌లను దొంగిలించేవారు. వచ్చిన డబ్బుతో బైక్ రేసింగ్‌లకు పాల్పడుతూ జల్సా చేసేవారు. గురువారం నాచారం పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు. వీరి నుంచి ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్ దొంగలు అరెస్టు హయత్‌నగర్‌కు చెందిన వేముల గోపీ, భాగ్యనగర్ కాలనీకి చెందిన గణేష్ బస్టాప్, మార్కెట్లలో ఒంటరిగా ఫోన్ మాట్లాడుతున్న వారి వద్ద నుండి సెల్ఫోన్లు లాక్కెళ్లేవారు. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 20 స్మార్ట్ ఫోన్లను దొంగిలించారు. మరో ఇద్దరితో కలిసి బైక్‌ల చోరీలకు కూడా పాల్పడేవారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని 20 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ఎస్కే.సలీమా, సీసీఎస్ మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
జల్సాలతో పెడదోవ
నూజివీడులో ముగ్గురు బైక్ దొంగల పట్టివేత నూజివీడు : సినిమాలు, షికార్లు జల్సాలకు అలవాటుపడిన యువకులు ఈజీ మనీ కోసం బైక్ దొంగతనాలకు దిగారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. బైక్‌చోరీలకు సంబంధించి నూజివీడు సీఐ ఎం.రామ్‌కుమార్ గురువారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మల్కీపురం మండలం రామరాజులంక కు చెందిన మత్తేప్రవీణ్ నూజివీడులో పాలిటెక్నిక్ సెకెండియర్, పట్టణంలోని కొప్పుల వెలమపేటకు చెందిన సబ్బవరపు సూర్యతేజ ఇంటర్, కోనేరుపేటకు చెందిన గండి దుర్గాకళ్యాణ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. వీరు వ్యసనాలకు లోనై నాలుగు నెలలుగా నూజివీడు, విజయవాడ ప్రాంతంలో ద్విచక్రవాహనాలను దొంగిలించి, వాటి నెంబరు ప్లేట్లను తీసేసి నూజివీడు ప్రాంతంలో తాకట్టుపెట్టడం, రోజువారీ అద్దెకు ఇవ్వడం చేస్తున్నారు. గొడుగువారిగూడెం రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో గుట్టు రట్టయింది. ఎనిమిది బైక్‌లను పోలీసులు రికవరీ చేశారు. అందులో 2 బుల్లెట్లు, 4 పల్సర్లు, 1 అపాచి, 1 యమహా స్పోర్ట్స్‌బైక్ ఉన్నాయి. వీటిలో మూడు విజయవాడ నగరంలోని పటమట, గవర్నర్‌పేట, మాచవరం ప్రాంతాలలో దొంగిలించినవి కాగా, నూజివీడు పట్టణంలో 3, మండలంలో 2 బైక్‌లను ఎత్తుకెళ్లారు. ఈ కేసులో కృషిచేసిన పట్టణ ఎస్ఐ ఎన్ చలపతిరావు, రూరల్ ఎస్ఐ చిన్ని నాగప్రసాద్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్
తెనాలి రూరల్ (గుంటూరు) : పట్టణంలో మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడుత్ను ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసి అమ్మేందుకు దాచిన మూడు మోటారు సైకిళ్లను స్వాధీన పరచుకున్నారు. దీనికి సంబంధించి శనివారం స్థానిక త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సీహెచ్ సౌజన్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన ధర్మాపురం కృష్ణ పట్టణంలోని చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన పాలపర్తి శ్రీనివాసరావుతో పరిచయం పెంచుకున్నాడు. వీరిద్దరూ జల్సాల కోసం డబ్బులు సంపాదించేందుకు మోటారు సైకిళ్లను చోరీ చేసి, వాటిని అమ్ముకుందామన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 8వ తేదీన తెనాలి రైల్వేస్టేషను ఎదురు, 15వ తేదీన ఎరువుల కొట్ల సమీపంలో, పినపాడులో మూడు మోటారు సైకిళ్లను అపహరించుకెళ్లారు. వాటిని అమ్మేందుకు తెనాలి జిల్లా వైద్యశాల వెనుక ఖాళీ స్థలంలోని పొదల్లో దాచిపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులను నమోదు చేసి దర్యాప్తు చేసిన త్రీ టౌన్ పోలీసులు నిందితులను గుర్తించి, వాహనాలను స్వాధీనపర్చుకున్నారు. -
బైక్ దొంగల గ్యాంగ్ అరెస్ట్
ఉప్పల్ (హైదరాబాద్) : జల్సాలకు అలవాటుపడి.. ఈజీ మనీ కోసం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను శుక్రవారం ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5.15 లక్షల విలువైన 15 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. నగరంలోని రామాంతపురానికి చెందిన అశోక్(32), శ్రీకాంత్(19), రాములు(35) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తాగుడుకు బానిసలు కావడంతోపాటు కష్టపడకుండా డబ్బు సంపాదించడానికి చోరీలకు పాల్పడటం ప్రారంభించారు. అప్పటి నుంచి నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 15 బైకులను అపహరించారు. శుక్రవారం పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో.. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం బయటపడింది. -
ద్విచక్రవాహనాల ముఠా అరెస్టు
హైదరాబాద్ (కాచిగూడ) : మత్తుకు బానిసై బైక్‌లను దొంగతనం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు బైక్ దొంగలను శుక్రవారం కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బైక్ దొంగల నుంచి దాదాపు రూ.3 లక్షల విలువ చేసే 7 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. ఈ సందర్భంగా కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాచిగూడ ఏసీపి చేబ్రోలు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ముంబాయికి చెందిన కల్పత్రో ఆకాష్ (23), మోసిన్ మహ్మద్ షఫి షేక్ (20)లు క్యాటరింగ్ చేస్తూ ముషీరాబాద్ జెమినికాలనీ ఫిష్ మార్కెట్ ప్రాంతంలో ఉంటున్నారు. యాకుత్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ తోఫిక్ (21) ఆటో డ్రైవర్. వీరు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నారు. కాచిగూడ లింగంపల్లి చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో భాగంగా వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా బైక్‌లను దొంగిలించినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, ఓయు పోలీస్‌స్టేషన్ పరిధిలో 1, ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరధిలో 1, కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో 3 బైక్‌లను దొంగిలించారు. హోండా షైన్ వాహనాలు 2, హీరో హోండా వాహనాలు 2, టీవీఎస్, బజాజ్ పల్సర్, హీరో ఫ్యాషన్ ప్రో ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు బైక్ దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బైక్‌దొంగలను పట్టుకున్నందులకు డిఎస్ఐ కౌశిక్‌తో పాటు టీమ్‌ను ఏసీపీ అభినందించారు. -
బైక్ దొంగల అరెస్ట్
నిజామాబాద్ : బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. వివరాలు...కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంటకు చెందిన దుండగులు నరేష్, బెల్లుల్ల రాజులు రెండు బైక్‌లను దొంగలించారు. మంగళవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుచి రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీపులు దర్యాప్తు ప్రారంభించారు. (కామారెడ్డి) -
బైక్ దొంగల ముఠా అరెస్టు
మాచవరం: నలుగురు ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేసినట్లు పిడుగురాళ్ళ పట్టణ సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లుట్ల జంక్షన్లో వాహనాల తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న మోర్జంపాడు గ్రామానికి చెందిన గుణపాటి చంద్రశేఖరరెడ్డి, కోర్ని సీతారామయ్య, మేకల గోవిందు, పిడుగురాళ్ళమండలం పందిటివారిపాలెంకు చెందిన బైలడుగుల పిచ్చయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా 15 ద్విచక్రవాహనాలను దొంగిలించినట్లు చెప్పారని పేర్కొన్నారు. రూ.9 లక్షల విలువైన 15 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. మాచవరం, పిడుగురాళ్ళ, రాజుపాలెం, బెల్లంకొండ, మేళ్లచెరువు, దుర్గి, గురజాల, కారంపూడి గ్రామాల్లో ఇళ్ల ముందు రోడ్లపై ఉంచిన ద్విచక్రవాహనాలను నిందితులు దొంగిలించారని, వాటిలో నాలుగు వాహనాలను విక్రయించడానికి వెళుతుండగా పట్టుకున్నామని చెప్పారు. వీటితోపాటు చంద్రశేఖరరెడ్డి గృహంలో ఐదు, పిచ్చయ్య గృహంలో ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మాచవరం ఎస్ఐ ఆవుల హరిబాబు మాట్లాడుతూ చెడు అలవాట్లకు బానిసై సులభమైన మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. విలేకరుల సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
హడలెత్తిస్తున్న ‘బైకు’ దొంగలు
కామారెడ్డి: పట్టణంలో బైకులను ఎత్తుకెళ్లడంతో బాటు ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను వదలడం లేదు. దొంగతనాల విషయంలో పట్టణ పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో దొంగలకు అడ్డూ లేకుండాపోతోంది. సోమ, మంగళవారాల్లో పట్టణంలో మూడు బైకుల ను దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే పట్టణంలోని విద్యానగర్‌కాలనీలో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును తెంపి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా మహిళ గొలుసును గట్టిగా పట్టుకుని అరవడంతో దొంగలు పరారయ్యారు. హైదరాబాద్ రోడ్డు లో ఉన్న రుద్ర ఆస్పత్రిలో పనిచేసే కే.రాము అనే యువకుడు మంగళవారం ఉదయం తన ఏపీ 28 ఏహెచ్ 5782 నంబరు గల స్ప్లెండర్ బైకును ఆస్పత్రి వద్ద పార్కు చేసి లోనికి వెళ్లాడు. అయితే ఉద యం 11.30 గంటల ప్రాంతంలో బైకును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు ఆస్పత్రి నిఘా కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సోమవారం రెండు బైకులను దొంగలు ఎత్తుకెళ్లడం, మహి ళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీకి యత్నిం చిన సంఘటనలతో అప్రమత్తంగా ఉండాల్సిన పట్టణ పోలీసులు పెద్దగా పట్టించుకున్న పాపానపోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. తనిఖీల పేరుతో అమాయకులను ఇబ్బందులు పెట్టడమే తప్ప నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించ డం లేదని పలువురు పేర్కొన్నారు. అలాగే పట్టణంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను కూడా దొంగలు వదలడం లేదు. కాకతీయనగర్ కాలనీలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణంలో మహిళలు ఆభరణాలు ధరించి ఒంటరిగా తిరిగే పరిస్థితులు లేకుండాపోయాయి. రెండు మూడు రోజుల్లో శుభ ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్లు జోరుగా సాగనున్నాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం ఆభరణాలు ధరించి వెళ్లే మహిళలు దొంగతనాల నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు. -
ముగ్గురు దొంగలు అరెస్ట్: భారీ నగదు స్వాధీనం
వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను కడప నగర పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. చోరీల వద్ద నుంచి రూ. 7 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలతోపాటు రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలపై పోలీసులు కేసు నమోదు చేసి, తమదైన శైలీలో దొంగలను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే వరంగల్ జిల్లా ములుగు మండల కేంద్రంలో వాహనదారుల కళ్లు కప్పి బైక్‌లు దొంగలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 24 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే హైదరాబాద్ నగరంలోని హస్తినాపురంలోని ఓ ఇంటిలో దొంగలు బీభత్సం సృష్టించారు. 25 తులాల బంగారంతోపాటు కిలో వెండి, రూ. లక్ష నగదు అపహరించారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్బుక్లో చూసి చోరీ
లంగర్‌హౌస్,న్యూస్‌లైన్: ఫేస్బుక్లో ఉన్న ఫుటేజీని చూసి ఆకర్షితుడై ఓ ఇంజనీరింగ్ విద్యార్థితోపాటు అతడి స్నేహితుడి బైక్ చోరీచేసి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ ప్రియదర్శిని కాలనీలో నివాసముండే అరుణ్(22) అక్కడే బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఇతడి అన్న నరేష్ లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లో ఉంటూ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అరుణ్..అన్న నరేష్‌ను కలిసేందుకు ఇటీవల నగరానికొచ్చాడు. బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లో నివాసముండే అతని చిన్ననాటి స్నేహితుడు పి.హేమంత్(23)ను సోమవారం ఉదయం కలిశాడు. ఇద్దరూ కలిసి లంగర్‌హౌస్‌కొచ్చి నరేష్‌ను కలిశారు. అనంతరం బాగ్‌లింగంపల్లికి తిరిగి వెళ్తూ పెన్షన్‌పురా మార్గంలో ఉన్న ఓ సెల్‌ఫోన్ దుకాణం వద్ద ఆగారు. అక్కడే పార్కు చేసివున్న పల్సర్‌బైక్‌ను రెప్పపాటులో దొంగిలించారు. దీనిపై వాహనదారుడు మహ్మద్‌అహ్మద్ లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా మంగళవారం తెల్లవారుజామున దొంగిలించిన బైక్‌పై అరుణ్, హేమంత్లు వెళ్తుండగా అహ్మద్ స్నేహితులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చేరుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫేస్బుక్లో ద్విచక్రవాహనాల దొంగతనాల సీసీ పుటేజీలను చూసి ఈ పని చేశామని నిందితులు ఒప్పుకున్నారు. -
బైక్‌ల చోరీ ముఠా అరెస్ట్
తడికలపూడి(కామవరపుకోట), న్యూస్‌లైన్ : అంతర్ జిల్లాల బైక్‌ల దొంగతోపాటు వాటిని విక్రయించటానికి సహకరిస్తున్న మరో ముగ్గురిని తడికలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ. 30 లక్షల విలువైన 62 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ ఎం.రమేష్ తడికలపూడి పోలీస్ స్టేషన్లో విలేకరులకు చెప్పారు. ఏలూరు తూర్పు లాకులకు చెందిన పువ్వుల ఆదినారాయణ విజయవాడలో 25, రాజమండ్రిలో 13, పశ్చిమ గోదావరి జిల్లాలో 11, ఖమ్మం జిల్లాలో ఒక బైక్‌ను దొంగిలించాడు. ఇతను ప్రధానంగా షాపులు, మార్కెట్ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన బైక్‌లను దొంగిలించేవాడు. ఆ బైక్‌లను అతను ఏలూరులో బైక్ మెకానిక్‌లు షేక్ మహ్మద్ అలీ, అదే నగరం పోణంగికి చెందిన బంకురు అప్పారావు, సత్యనారాయణపురానికి చెందిన నగరపు నరేష్‌కు అప్పగించేవాడు. వారు బైక్ ఇంజిన్, ఛాసిస్ నంబర్లను మార్చి విక్రయించేవారు. వచ్చిన డబ్బును జూదం, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగులు, పేకాట, మద్యం వంటి దుర్వసనాలకు ఖర్చు చేసేవారు. బైక్‌లు అమ్మేందుకు వచ్చి పట్టుబడ్డారు దొంగిలించిన బైక్‌లు అమ్మేందుకు మండలంలోని కళ్ళచెరువు గ్రామం వచ్చిన పువ్వుల ఆదినారాయణ, బంకురు వెంకటేశ్వరరావును పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు నగరపు నరేష్, షేక్ మహ్మద్ అలీని ఏలూరులో అరెస్ట్ చేశారు. సిబ్బందికి అభినందనలు నిందితులను పట్టుకోవటంలో చింతలపూడి సీఐ ఎం.వెంకటేశ్వరరావు కృషిని ఎస్పీ అభినందించారు. పెద్ద సంఖ్యలో బైక్‌ల రికవరీకి తోడ్పడిన ఎస్సె సీహెచ్ రామారావు, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, కానిస్టేబుళ్ళు ప్రసాద్, రవి, రాజు, దుర్గారావులను కూడా ఆయన అభినందించారు. జంగారెడ్డిగూడెం డిఎస్పీ సి.రాఘవ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో దొంగతనాలు పెరిగాయ్ జిల్లాలో దొంగతనాలు పెరిగాయని ఎస్పీ ఎం.రమే ష్ పేర్కొన్నారు. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తడికలపూడి పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించిన ఆయన ’న్యూస్ లైన్’తో మాట్లాడారు. జిల్లాలో క్రైమ్ రేటులో మా ర్పు లేదని, గత ఏడాది మాదిరిగానే ఉందన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు తదితరాలకు సంబంధించిన కేసులు తగ్గాయని తెలిపారు. బైక్ చోరీల్లో ఇది పెద్ద కేసు బైక్‌ల చోరీకి సంబంధించి జిల్లాలో పట్టుకున్న పెద్ద కేసు ఇదే అని ఎస్పీ రమేష్ చెప్పారు. దొంగిలించిన బైక్‌లలో స్ల్పెండర్ ప్లస్‌లు 46 ఉన్నాయన్నారు. స్వాధీనం చేసుకున్న మ్తొతం బైక్‌లలో 25 మాత్రమే ఎఫ్ఐఆర్ చూపించామని చెప్పారు. మిగిలిన బళ్లకు ఇంజన్ నంబర్లు, ఛాసిస్ నంబర్లు సరిపోలడంలేదన్నారు. బైక్‌ల చోరీలకు సంబంధించి జిల్లాలో చాలా కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. ఈ బైక్‌లను ఏలూరు పోలీస్ హెడ్ క్వార్టర్సులో ప్రదర్శనకు ఉంచుతామని, బళ్ళు పోగొట్టుకున్నవారు ఏలూరు వచ్చి సరైన ఆధారాలు చూపించి తీసుకెళ్ళవచ్చని ఆయన పేర్కొన్నారు. -
అంతర్జిల్లా బైక్‌ల దొంగల అరెస్టు
ముదినేపల్లి, న్యూస్‌లైన్ : వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్లు దొంగిలించిన ఇద్దరు యువకులను ముదినేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరి చోరీ చేసిన 26 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై కె.ఈశ్వరరావు ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం సఖినేటిపల్లికి చెందిన ఏడిద సత్యనారాయణ(25), అనంతపురం పట్టణానికి చెందిన తోట సతీష్‌కుమార్ రెడ్డి(22) కలిసి మోటారు సైకిళ్లు దొంగిలిస్తుంటారు. సత్యనారాయణ ముదినేపల్లిలోనూ, సతీష్‌కుమార్‌రెడ్డి గుడివాడలో నివాసముంటున్నారు. వీరిద్దరూ కలిసి గుడివాడ, ముదినేపల్లి, విజయవాడ, నరసాపురం, భీమవరం తదితర ప్రాంతాల్లో మోటారు సైకిళ్లు దొంగిలిస్తూ పట్టుబడ్డారు. వాటిని మండలంలోని వివిధ గ్రామాల్లో అమ్మారు. విచారణ సందర్భంగా వీరు అందించిన సమాచారం ప్రకారం.. చోరీకి గురైన బైక్‌లు కొన్న 26 మంది నుంచి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. వీటి విలువ రూ.13 లక్షలు. సత్యనారాయణ హైదరాబాద్‌లో గతంలో జరిగిన ఓ హత్యకేసు లో నిందితుడని తేలింది. మండలంలోని పెదగొన్నూరు సర్పంచ్ లలితకుమారి స్థానికంగా నివా సం ఉంటున్నారు. ఈ నెల మూడో తేదీన ఆమె ఇంట్లో నగలు, నగదును సత్యనారాయణ దొం గిలించాడని పోలీసుల విచారణలో తేలింది. నిం దితులిద్దరూ వారం రోజుల క్రితమే పట్టుబడగా, గుడివాడ సీసీఎస్ పోలీసులు విచారణ జరిపి దొంగతనాల వివరాలు రాబట్టినట్లు తెలిసింది. సతీష్‌కుమార్‌రెడ్డి స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో చదివాడని ఎస్సై పేర్కొన్నారు.