తెనాలి రూరల్ (గుంటూరు) : పట్టణంలో మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడుత్ను ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసి అమ్మేందుకు దాచిన మూడు మోటారు సైకిళ్లను స్వాధీన పరచుకున్నారు. దీనికి సంబంధించి శనివారం స్థానిక త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సీహెచ్ సౌజన్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన ధర్మాపురం కృష్ణ పట్టణంలోని చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన పాలపర్తి శ్రీనివాసరావుతో పరిచయం పెంచుకున్నాడు.
వీరిద్దరూ జల్సాల కోసం డబ్బులు సంపాదించేందుకు మోటారు సైకిళ్లను చోరీ చేసి, వాటిని అమ్ముకుందామన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 8వ తేదీన తెనాలి రైల్వేస్టేషను ఎదురు, 15వ తేదీన ఎరువుల కొట్ల సమీపంలో, పినపాడులో మూడు మోటారు సైకిళ్లను అపహరించుకెళ్లారు. వాటిని అమ్మేందుకు తెనాలి జిల్లా వైద్యశాల వెనుక ఖాళీ స్థలంలోని పొదల్లో దాచిపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులను నమోదు చేసి దర్యాప్తు చేసిన త్రీ టౌన్ పోలీసులు నిందితులను గుర్తించి, వాహనాలను స్వాధీనపర్చుకున్నారు.
ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్
Published Sat, Oct 24 2015 5:57 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement