కామారెడ్డి: పట్టణంలో బైకులను ఎత్తుకెళ్లడంతో బాటు ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను వదలడం లేదు. దొంగతనాల విషయంలో పట్టణ పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో దొంగలకు అడ్డూ లేకుండాపోతోంది. సోమ, మంగళవారాల్లో పట్టణంలో మూడు బైకుల ను దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే పట్టణంలోని విద్యానగర్‌కాలనీలో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును తెంపి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా మహిళ గొలుసును గట్టిగా పట్టుకుని అరవడంతో దొంగలు పరారయ్యారు. హైదరాబాద్ రోడ్డు లో ఉన్న రుద్ర ఆస్పత్రిలో పనిచేసే కే.రాము అనే యువకుడు మంగళవారం ఉదయం తన ఏపీ 28 ఏహెచ్ 5782 నంబరు గల స్ప్లెండర్ బైకును ఆస్పత్రి వద్ద పార్కు చేసి లోనికి వెళ్లాడు.
అయితే ఉద యం 11.30 గంటల ప్రాంతంలో బైకును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు ఆస్పత్రి నిఘా కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సోమవారం రెండు బైకులను దొంగలు ఎత్తుకెళ్లడం, మహి ళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీకి యత్నిం చిన సంఘటనలతో అప్రమత్తంగా ఉండాల్సిన పట్టణ పోలీసులు పెద్దగా పట్టించుకున్న పాపానపోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. తనిఖీల పేరుతో అమాయకులను ఇబ్బందులు పెట్టడమే తప్ప నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించ డం లేదని పలువురు పేర్కొన్నారు.
అలాగే పట్టణంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను కూడా దొంగలు వదలడం లేదు. కాకతీయనగర్ కాలనీలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణంలో మహిళలు ఆభరణాలు ధరించి ఒంటరిగా తిరిగే పరిస్థితులు లేకుండాపోయాయి. రెండు మూడు రోజుల్లో శుభ ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్లు జోరుగా సాగనున్నాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం ఆభరణాలు ధరించి వెళ్లే మహిళలు దొంగతనాల నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు.
హడలెత్తిస్తున్న ‘బైకు’ దొంగలు
Published Wed, Dec 3 2014 2:27 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement