ఫేస్‌బుక్‌లో చూసి చోరీ | hitech theif used technology to stole | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో చూసి చోరీ

Published Wed, Jan 1 2014 8:22 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్‌బుక్‌లో చూసి చోరీ - Sakshi

ఫేస్‌బుక్‌లో చూసి చోరీ

 లంగర్‌హౌస్,న్యూస్‌లైన్: ఫేస్‌బుక్‌లో ఉన్న ఫుటేజీని చూసి ఆకర్షితుడై ఓ ఇంజనీరింగ్ విద్యార్థితోపాటు అతడి స్నేహితుడి బైక్ చోరీచేసి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ ప్రియదర్శిని కాలనీలో నివాసముండే అరుణ్(22) అక్కడే బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఇతడి అన్న నరేష్ లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లో ఉంటూ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అరుణ్..అన్న నరేష్‌ను కలిసేందుకు ఇటీవల నగరానికొచ్చాడు. బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లో నివాసముండే అతని చిన్ననాటి స్నేహితుడు పి.హేమంత్(23)ను సోమవారం ఉదయం కలిశాడు. ఇద్దరూ కలిసి లంగర్‌హౌస్‌కొచ్చి నరేష్‌ను కలిశారు.
 
  అనంతరం బాగ్‌లింగంపల్లికి తిరిగి వెళ్తూ పెన్షన్‌పురా మార్గంలో ఉన్న ఓ సెల్‌ఫోన్ దుకాణం వద్ద ఆగారు. అక్కడే పార్కు చేసివున్న పల్సర్‌బైక్‌ను రెప్పపాటులో దొంగిలించారు. దీనిపై వాహనదారుడు మహ్మద్‌అహ్మద్ లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా మంగళవారం తెల్లవారుజామున దొంగిలించిన బైక్‌పై అరుణ్, హేమంత్‌లు వెళ్తుండగా అహ్మద్ స్నేహితులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చేరుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫేస్‌బుక్‌లో ద్విచక్రవాహనాల దొంగతనాల సీసీ పుటేజీలను చూసి ఈ పని చేశామని నిందితులు ఒప్పుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement