Engineering student
-
AP: అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ.. ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్
సాక్షి, గుంటూరు: గుంటూరులో మత్తుమందు సేవిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 10 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి గుంటూరుకు తీసుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.గుంటూరులో సాయిక్రిష్టనగర్‌లోని ఒక అపార్ట్మెంట్లో మత్తుమందు సేవిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో ఎండీఎంఏ మత్తు మందును సేవిస్తూ, విక్రయిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులతో సహా డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేసి 10.67 గ్రాముల ఎండీఎంను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బెంగుళూరు నుంచి గుంటూరుకు ఇంజనీరింగ్ విద్యార్థి సాయిక్రిష్ణ డ్రగ్స్ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.దాడుల సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎండీఎం మత్తుమందును ఒక గ్రామును 1400 రూపాయలకు కొనుగోలు చేసి సాయిక్రిష్ట్ర దాన్ని ఐదు వేలకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం 11 మంది నిందితులు ఉండగా.. వారిలో ఇద్దరు తప్పించుకున్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
పోటీ పరీక్ష రాసేందుకు వెళుతూ..
మర్రిపాలెం: రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై బుధవారం అర్ధరాత్రి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తాపడిన ఘటనలో నగరంలోని 53వ వార్డు మర్రిపాలెం పార్వతీనగర్‌కు చెందిన హోమిని కల్యాణి (21) మృతి చెందింది. దువ్వాడలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న కల్యాణి కాంపిటేటివ్ పరీక్ష రాయడానికి హైదరాబాద్ బయలుదేరింది. బుధవారం రాత్రి ఎన్ఏడీ కొత్తరోడ్డులో బస్సు ఎక్కగా..అర్ధరాత్రి రాజమండ్రి గామన్ వంతెన వద్ద బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలు శరీరం నుజ్జునుజ్జవ్వడం అందర్నీ కలచి వేసింది. గురువారం సాయంత్రం కల్యాణి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందివచ్చిన కుమార్తె ఇలా విగతజీవిగా ఉండడాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కల్యాణి తండ్రి రాఘవదాస్ రైల్వే ఉద్యోగి కాగా.. తల్లి లక్ష్మి(లత) గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తెలు, కాగా పెద్ద కుమార్తె మేఘన ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువులకు సిద్ధమవుతోంది. కల్యాణి ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో కాంపిటేటివ్ పరీక్ష రాసేందుకు వెళుతూ మృతిచెందడంతో పార్వతినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గోదావరిలో ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతు
తాళ్లరేవు: ఇంజినీరింగ్ విద్యార్థుల విహారయాత్ర విషాదాంతమైంది. యానాం సందర్శనకు వచ్చిన విద్యార్థుల్లో ఒక యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. శశి వేలివెన్ను ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఎల్లిన శివరామ్, మల్లిపూడి నిఖిల్ లక్ష్మణ్, మండా వంశీ, వెంపటి సంతోష్, కుతాని సాయిచంద్ర, కార్తిక్, మిజోన్స్ అనే యువకులు కారులో బుధవారం విహారయాత్రకు బయలుదేరారు. ఉదయమే రాజమహేంద్రవరం వచ్చి అక్కడ అన్నీ ప్రదేశాలను చూశారు. మధ్యాహ్నం కేంద్రపాలిత ప్రాంతమైన యానానికి వచ్చారు. యానాంలోని పలు ప్రదేశాలు సందర్శించిన అనంతరం తిరిగి వెళుతూ గౌతమి గోదావరి చెంతన గల గోపులంక పుష్కరఘాట్ వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఆగారు. వీరిలో కుతాని సాయిచంద్ర ఫొటోలు తీసుకుంటూ అదుపు తప్పి గోదావరిలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన శివరామ్ కూడా గోదావరిలో కొట్టుకుపోసాగాడు. మిగిలిన విద్యార్థులు వెంటనే స్పందించి వారిని రక్షించడానికి ప్రయత్నించారు. శివరామ్‌ను కాపాడారు గానీ గోదావరి ప్రవాహానికి సాయిచంద్ర (21) కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. రాజమహేంద్రవరానికి చెందిన సాయిచంద్ర శశి వేలివెన్ను కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. శివరామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.గతేడాది ఇదే నెలలో..ఇదే ప్రదేశంలో గతేడాది అక్టోబరు 21న ఇలాంటి ఘటనే జరిగింది. తణుకు పట్టణంలోని సజ్జాపురానికి చెందిన ఏడుగురు యువకులు పుట్టినరోజు వేడుకల కోసం యానాం వచ్చి తిరిగి వెళుతూ గోపులంక వద్ద స్నానానికి దిగారు. వారిలో నలుగురు యువకులు గల్లంతై మృతి చెందారు. -
రూ.83 లక్షల ప్యాకేజీ.. బీటెక్ పాపకు గోల్డెన్ ఆఫర్
జీవితంలో ఏదైనా గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుని, దానివైపే అడుగులు వేస్తే తప్పకుండా అనుకున్న గమ్యం చేరుతారని ఎంతోమంది నిరూపించారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు బీహార్‌లోని భాగల్పూర్కు చెందిన 'ఇషికా ఝా'. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సాధించిన సక్సెస్ ఏంటనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. భాగల్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో బీటెక్ మూడవ సంవత్సరం చదివే విద్యార్థిని 'ఇషికా ఝా' క్యాంపస్ ప్లేస్మెంట్ నుంచి ఏకంగా 83 లక్షల వేతనంతో జాబ్ ఆఫర్ పొందింది. చిన్నప్పటి నుంచి కంప్యూటర్లు, కోడింగ్ పట్ల మక్కువతోనే.. కోడింగ్ రాయడం ప్రారంభించింది. ఆ తరువాత కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో మెలుకువలు నేర్చుకుంటూ అనుకున్న విధంగానే జాబ్ కొట్టేసింది. 2020-24 సెషన్‌లోని బీటెక్ బ్యాచ్ చివరి సంవత్సరం కంటే.. కూడా ఈమె ఎక్కువ ప్యాకేజ్ పొంది రికార్డ్ బద్దలుకొట్టింది. గూగుల్ హ్యాకథాన్ చివరి రౌండ్లో.. ప్రాజెక్ట్ చేయడానికి 'ఎన్విరాన్మెంట్' టాపిక్ వచ్చిందని, ఆ సమయంలో ఇషికా ఝా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించి ఫారెస్ట్ ఫైర్ ప్రిడిక్షన్‌పై చేసిన ప్రాజెక్ట్ విజయ శిఖరాలను తాకేలా చేసింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఫైనల్ ఇయర్ క్యాంపస్ సెలక్షన్‌కి ప్రిపేర్ కావడం ప్రారంభించినట్లు ఇషికా ఝా వెల్లడించింది. గూగుల్ హ్యాకథాన్‌లో విజయం సాధించినందుకు తన సీనియర్లకు క్రెడిట్ ఇస్తూ, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా కూడా తాను ఎక్కువ నేర్చుకున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: అనంత్ అంబానీ మనసు బంగారమే.. వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు ప్రస్తుతం ఈమె టెక్నికల్ డొమైన్ నేయిపుణ్యాలను మెరుగుపరచుకోవడంలో, వెబ్ డెవలప్మెంట్ వంటి వాటిని నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతను ఉపయోగించాలనే తన అభిరుచి తనను ఇతరులకు భిన్నంగా చేస్తుందని ఝా చెబుతోంది. -
Hyderabad: గుండెపోటుతో డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు మృతి
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్ (20) మృతి చెందాడు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని వారి స్వగ్రామం నల్లగొండ జిల్లాకు తరలించారు. కాగా చంద్రతేజ్ ఓ ప్రైవేటు కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. స్వతహాగా వ్యాపరంలో రానిస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి తండ్రి వెంకటేశ్వర్లుకు కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ లోపే చిన్న కుమారుడు మృతితో చంద్రతేజ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
అమెరికాలో మృతి చెందిన తెలుగు విద్యార్థి.. స్వగ్రామం చేరిన మృతదేహం
పార్వతీపురం మన్యం: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన పాలకొండకు చెందిన ఓ విద్యార్థి విగతజీవిగా సొంతూరుకు శనివారం చేరాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో పాలకొండ శోకసంద్రమైంది. చదువే లోకంగా జీవించిన ఆ విద్యార్థి కలలు కల్లలయ్యాయి. తమ బిడ్డపై ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... పాలకొండలోని బట్టి మఠం కాలనీలో రాకోటి వెంకటరమణ, ఆదిలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు రాకోటి సాయినికేష్(21), కుమార్తె లేఖ ఉన్నారు. సాయినికేష్ ఇటీవల ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ కోసం గత నెల డిసెంబర్ ఆఖరులో అమెరికా వెళ్లాడు. హర్ట్‌పోర్టు సిటీలో సీక్రెడ్ యూనివర్సిటీలో సీటు రావడంతో అక్కడ ఎంఎస్‌లో చేరాడు. అమెరికా వెళ్లిన 15 రోజుల్లోనే ఈ నెల 12న శుక్రవారం తాను ఉంటున్న గదిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. సాయినికేష్‌తో పాటు అదే గదిలో ఉంటున్న తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన మరో తెలుగు విద్యార్థి కూడా మృతి చెందాడు. విష వాయువు పీల్చడంతోనే వీరిద్దరు మృతి చెందినట్టు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. శనివారం సాయినికేష్ మృతదేహం ఇక్కడకు రాగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తమ బిడ్డ మృతికి పూర్తి కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయినికేష్ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన సహచర విద్యార్థులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనతో పాలకొండ పట్టణంలో విషాదం అలముకుంది. -
ఇంజినీరింగ్ విద్యార్థిని హత్య
కర్ణాటక: ప్రియుడి చేతిలో ఇంజినీరింగ్ విద్యార్థిని హతమైంది. ఈఘటన హాసన తాలూకా కుంతిగుడ్డ గ్రామంలో జరిగింది. ఆలూరు తాలూకా కవళగెరె గ్రామానికి చెందిన సుచిత్ర(20), హాసన తాలూకా శంకరనహళ్లి గ్రామానికి చెందిన తేజస్‌లు హాసన మొసళెహోసళ్లి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ మెకానికల్ కోర్సు చదువుతున్నారు. ఇద్దరూ కొంతకాలంగా పరస్పరం ప్రేమించుకున్నారు. ఇటీవల సుచిత్ర తేజస్‌ను దూరం పెట్టింది. తనవైపు నుంచి ఏవైనా తప్పులు ఉంటే చెప్పాలని, ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుందామని నమ్మించి సుచిత్రను కుంతిగుడ్డ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ గొంతు నులిమి సుచిత్రను హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. -
గుండెపోటుతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
బళ్లారి అర్బన్: గుండెపోటుతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు...బళ్లారి తాలూకా మోకా సమీపంలో గల బైరదేవనహళ్లి గ్రామానికి చెందిన రుక్మణ్రెడ్డి రెండో కుమారుడు ప్రతాప్ రెడ్డి (20) మైసూరులోని ఎన్ఐఈ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ప్రతాప్ రెడ్డి ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. -
బీటెక్ పరీక్ష.. ఇదేం పని రా అయ్యా, నిజం తెలిసి ఇన్విజిలేటర్ మైండ్‌బ్లాక్!
తాడిపత్రి అర్బన్: ఒకరికి బదులుగా మరొకరిని పరీక్ష హాలులోకి పంపించారు. ఇందుకోసం విద్యార్థుల హాల్‌టికెట్లు, ఐడీ కార్డులను మార్ఫింగ్ చేశారు. ఇలా ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఏకంగా 16 మంది నకిలీ విద్యార్థులను పరీక్షకు పంపించారు. అయితే ఇన్విజిలేటర్ క్షుణంగా తనిఖీ చేయడంతో ఈ నకిలీ విద్యార్థుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జేఎన్టీయూ(ఏ) పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో గత నెల 25 నుంచి బీటెక్ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రిలోని సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల (సీవీఆర్టీ)కు చెందిన 16 మంది విద్యార్థులకు తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాల(టెక్)లో పరీక్ష కేంద్రం కేటాయించారు. గురువారం ఉదయం పది గంటలకు డ్రాయింగ్, బీఈఈఈ పరీక్ష ప్రారంభం కాగా, ఇన్విజిలేటర్ విద్యార్థుల హాల్‌టికెట్లను పరిశీలించారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లుగా గుర్తించారు. మరింత క్షుణంగా తనిఖీ చేయగా, ఒకే కాలేజీకి చెందిన 16 మంది స్థానంలో వేరేవారు పరీక్ష రాస్తున్నట్లు గుర్తించి కళాశాల ప్రిన్సిపాల్ ఈవీ సుబ్బారెడ్డి, జేఎన్టీయూ(ఏ) అబ్జర్వర్‌కు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆయా విద్యార్థుల ఐడీ కార్డులు పరిశీలించగా, అవి కూడా నకిలీవని తేలింది. తమ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేరని భావింన సీవీఆర్టీ కళాశాల యాజమాన్యం... అసలు విద్యార్థుల ఫొటోలతోపాటు ఐడీ కార్డులను మార్ఫింగ్ చేసి పరీక్షలు రాసేందుకు వేరేవారిని పంపినట్లు గుర్తించారు. అనంతరం నకిలీ విద్యార్థుల నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేసిన జేఎన్టీయూ(ఏ) అధికారులు రూల్–3 కింద చర్యలు కేసు నవెదు చేశారు. కాగా, గతంలోనూ సర్ సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం అనేక మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులను డిగ్రీ చదువుతున్నట్లు చూపి ఫీజు రీయింబర్స్మెంట్ దందాకు పాల్పడింది. దీంతోపాటు నిబంధనల మేరకు ఇంటర్ కళాశాల ఏర్పాటు చేసేటప్పుడు ఇంటర్ బోర్డుకు సీవీ రామన్ యాజమాన్యం అందజేసిన పత్రాలు నకిలీవని బయటపడింది. కళాశాల యాజమాన్యం ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ల కోసం ఓ బ్యాంకు మేనేజర్ సంతకం కూడా ఫోర్జరీ చేసినట్లు సమాచారం. చదవండి కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి.. -
ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
ఎమ్మిగనూరు రూరల్ (కర్నూలు): రోడ్డు ప్రమాదంలో గాయపడిన లింగారెడ్డి (21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు లింగారెడ్డి (21).. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట సెయింట్ జాన్స్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. భాస్కర్‌రెడ్డి సోదరుడు వినోద్ ఆదోనిలో ఉండటంతో లింగారెడ్డి అక్కడే ఉంచాడు. రోజూ బస్సులో కాలేజీకి వెళ్లివస్తున్నాడు. శుక్రవారం ఆదోని నుంచి తన స్నేహితుడి బైక్ తీసుకుని కాలేజీకి వెళ్లాడు. ఎమ్మిగనూరు సమీపంలోని షాదీఖానా దగ్గర ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో బైక్‌పై ఉన్న లింగారెడ్డితో పాటు మరో విద్యార్థికి గాయాలయ్యాయి. లింగారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో రెండు రోజులు ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స అందించారు. బతకడం కష్టమని వైద్యులు తెలపడంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లింగారెడ్డి మృతిచెందాదు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆకవీడు తరలించినట్లు ట్రాఫిక్ ఏఎస్ఐ నటరాజ్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఒంగోలు – కర్నూలు రోడ్డుపై సంతనూతలపాడు – పేర్నమిట్ట మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒంగోలు క్విస్ కాలేజీలో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి గొట్టిముక్కల నితిన్ శ్రీవర్మ (21) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి కళ్లగుంట సుధీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులైన నితిన్ శ్రీవర్మ, సుధీర్ ఇద్దరూ క్విస్ కాలేజీలో ఫైనలియర్ బీటెక్ చదువుతున్నారు. స్వగ్రామం సంతనూతలపాడు మండలం మన్నంవారిపాలెం నుంచి బైకుపై కాలేజీకి వచ్చి వెళ్తుంటారు. రోజూలాగే శుక్రవారం కూడా ఇద్దరూ సుధీర్ బైకుపై కాలేజీకి వెళ్తున్నారు. నితిన్ వెనుక కూర్చుని ఉండగా, పేర్నమిట్ట ఈనాడు ఆఫీస్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా రోడ్డు పక్కన గ్రానైట్ రాళ్లను ఒంగోలు వైపు తీసుకెళ్తున్న టిప్పర్ నిలిపి ఉంది. టిప్పర్ వెనుక టైర్లకు సుధీర్ కాళ్లు తగిలి రోడ్డుకు కుడివైపు పడ్డారు. అదే సమయంలో పొద్దుటూరు నుంచి హద్దురాళ్లను ఒంగోలు వైపు తీసుకెళ్తున్న ట్రాక్టర్ రోడ్డుపై పడిన నితిన్ శ్రీవర్మ తలపైకి ఎక్కడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. సుధీర్‌కు కూడా తీవ్ర గాయాలవడంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. నితిన్ శ్రీ వర్మ తండ్రి క్విస్ కాలేజీ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు మృతి చెందాడనే సమాచారం తెలియగానే నితిన్ తాత కోటమురాజు, తండ్రి సీతారామరాజు, తల్లి లక్ష్మి, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి రోదించిన తీరు అక్కడివాళ్లను సైతం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. క్విస్ కాలేజీ కరస్పాండెంట్ నిడమానూరి నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఒంగోలు తాలూకా ఏఎస్సైలు షేక్ జిలాని, దయానందరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన సుధీర్ ఫిర్యాదు మేరకు ఏఎస్సై జిలాని కేసు నమోదు చేశారు. ప్రమాదాన్ని చూసి చలించిపోయిన మంత్రి సురేష్... ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు గెస్ట్‌హౌస్ ప్రారంభోత్సవానికి ఒంగోలు వెళ్తున్న పురపాలక శాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్నమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి కాన్వాయ్ ఆపి పరిశీలించారు. నడిరోడ్డుపై నెత్తుటి మడుగులో నిర్జీవంగా పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసి చలించిపోయారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. పోలీసు అధికారులతో మాట్లాడి త్వరితగతిన మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అందజేయాలని ఆదేశించారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు రోడ్డు ప్రమాదంలో అర్ధంతరంగా తనువు చాలించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
కాళ్లు చేతులు కట్టేసి.. ప్రేమిస్తే.. అగ్గి పెట్టేస్తారు
యశవంతపుర: తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఆమె తరఫు వ్యక్తులు ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి నిప్పుపెట్టారు. ఈ సంఘటన సిలికాన్ సిటీలోనే చోటుచేసుకుంది. వివరాలు.. బెంగళూరు ఆర్ఆర్ నగరకు చెందిన రంగనాథ, సత్యప్రేమ దంపతుల కుమారుడు శశాంక్ (18) బాధితుడు. అతడు నగరంలోని ఒక కాలేజీలో ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సమీప బంధువు కూతురిని ప్రేమిస్తున్నాడు. యువతి తల్లిదండ్రులు ఈ ప్రేమను వ్యతిరేకిస్తున్నారు. ఇన్నోవాలో వచ్చి, కాళ్లు చేతులు కట్టేసి శనివారం ఉదయం ఏసీఎస్ కాలేజీకి వచ్చాడు, తరగతులు లేవని చెప్పడంతో బయట నడిచి వెళుతుండగా శశాంక్‌ను ఇన్నోవా కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు. ఆరుమంది దుండగులు అతనిని నోరు, కాళ్లు చేతులను బట్టతో కట్టేశారు. బెంగళూరు– మైసూరు రహదారిలో కణమిణికె టోల్ గేట్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. అతికష్టంపై అగ్గిని ఆర్పుకొని శశాంక్ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇటీవలే గొడవ యువతిది చామరాజనగర జిల్లా హరదనహళ్లి. యువతి బెంగళూరుకు రాగా శశాంక్ ఇంటికి తీసుకెళ్లి మర్యాదలు చేశాడు. ఇది తెలిసి యువతి తల్లిదండ్రులు శశాంక్ ఇంటికి వచ్చి గలాటా చేయగా, మీ అమ్మాయికి దూరంగా ఉంటానని శశాంక్ హామీనిచ్చాడు. ఇంతలోనే కిడ్నాప్ చేసి హత్యాయత్నం జరిగింది. కుంబళగోడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హరదనహళ్లిలో యువతి కుటుంబం తాళం వేసుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి పరమేశ్వర్ ఆదేశించారు. -
‘సారీ అమ్మానాన్నా.. నావల్ల కావట్లేదు!’
క్రైమ్: స్నేహితుని కోసం ఆన్లైన్లో రుణం తీసుకుంటే.. వాడు నట్టేట ముంచాడు. రికవరీ యాప్స్ ఏజెంట్లు రాబంధువుల్లా అతనిపై పడి పీక్కుతినే యత్నం చేశారు. ఎటూ పాలుపోని స్థితిలో ఆ స్టూడెంట్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. భయంతో తల్లిదండ్రుల్ని క్షమాపణ కోరుతూ లేఖ రాసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కర్ణాటక జాలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో హెచ్ఎంటీ కాలనీలో మంగళవారం జరిగింది. యెలహంకలోని ఒక ప్రైవేటు కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఆరో సెమిస్టర్ చదువుతున్న తేజస్ (22) కాలేజీ టాపర్. మహేష్ అనే స్నేహితుడికి డబ్బు అత్యవరం పడడం.. అతని బలవంతం మేరకు మూడు లోన్ యాప్స్ ద్వారా మనీ తీసుకున్నాడు. అయితే.. మహేష్ హ్యాండిచ్చాడు. ఏడాది నుంచి స్నేహితుడు EMI వాయిదాలు కట్టడం లేదు. రుణం తేజస్ పేరుమీద ఉండటంతో అప్పు ఇచ్చిన కంపెనీల రికవరీ ఏజెంట్లు తేజస్‌ను వేధించసాగారు. చివరకు.. జీవితం మీద విరక్తి చెందిన తేజస్ మంగళవారం సాయంత్రం 6 గంటలకు డెత్‌నోట్ రాసి ఇంట్లో తల్లి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మనాన్న నేను చేస్తున్న దానికి నన్ను క్షమించండి, నాకు మరో దారి కనిపించడం లేదు. నా పేరు మీద ఉన్న అప్పు తీర్చడం నా వల్ల కాదు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా, థాంక్యూ, గుడ్ బై ‘‘మా కుటుంబ సభ్యుల నగ్నఫోటోల్ని వైరల్ చేస్తామంటూ వాళ్లు బెదిరించారు. కొందరు స్నేహితులకు మా ఎడిటింగ్ ఫొటోల్ని షేర్ చేశారు. మా ఇంటి ద్గగర ఓ కెమెరాను ఉంచారు. ఆ విషయం మా దృష్టికి రావడంతో.. వేధింపుల గురించి తెలిసింది. 4,00,000 లోన్ నేను చెల్లిస్తానని.. చక్కగా చదువుకోమని నా కొడుక్కి ధైర్యం చెప్పా. అయితే చెల్లిస్తామని చెప్పినా.. రికవరీ ఏజెంట్ల వేధింపులు ఆగలేదు. ఇవాళ ఉదయం నా కొడుకు శవం ఇంటి దగ్గర ఉన్నప్పుడూ కూడా ఓ ఏజెంట్ వచ్చాడు. జరిగింది తెలుసుకుని ఇక్కడి నుంచి గప్‌చుప్‌గా వెళ్లిపోయాడు. ఇది లోన్ యాప్స్ చేసిన హత్యే. సమస్యలేమైనా ఉంటే తల్లిదండ్రులకు చెప్పండి. మీలో మీరే మదనపడి తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి అంటూ యువతకు కన్నీళ్లతో రిక్వెస్ట్ చేస్తున్నాడు తేజస్ తండ్రి గోపీనాథ్. ఘటనకు సంబంధించి సదరు లోన్ యాప్స్ మీద ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
ఘట్కేసర్: బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిన సంఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థిఽ మతి చెందిన సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...ఆర్కే పురం, కొత్తపేట్‌కు చెందిన సి.హెచ్ విగ్నేశ్ (22) అవుషాపూర్ వీబీఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. శనివారం ఎదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువు వద్ద స్నేహితులు హరీశ్, శశాంక్, సాయిరాంతో కలిసి విందు చేసుకున్నారు. విందు అనంతరం సింగపూర్ టౌన్‌షిప్‌లోని ఇంటికి వెళుతుండగా హెచ్ఎండీఏ నర్సరీ సమీపంలో ఓఆర్ఆర్ వద్ద విగ్నేశ్ ప్రయాణిస్తున్న కేటీఎం బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి, తర్వాత ఉప్పల్ ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన అక్కడి వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విధిని ఎదిరించాడు.. విజయం సాధించాడు.. దివ్యాంగుడికి ఐఐఎం సీటు
సాక్షి, అనకాపల్లి జిల్లా: విధి వక్రించినా పట్టుదలతో నిలబడ్డాడు. ధైర్యం కూడదీసుకుని ముందడుగు వేశాడు. మధ్యలో ఆగిపోయిన ఇంజనీరింగ్‌తోపాటు న్యాయవిద్యను సైతం పూర్తి చేసి అమెజాన్ సంస్థలో డేటా ఆపరేషన్ అసోసియేట్ ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఏకంగా క్యాట్‌లో ఉత్తీర్ణుడై ఐఐఎం సీటు సాధించాడు. ఈ నెల 21న అహ్మదాబాద్ ఐఐఎంలో చేరనున్నాడు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన ఈ విజేత పేరు ద్వారపురెడ్డి చంద్రమౌళి. తండ్రి వెంకటరమణ చిరు వ్యాపారి. తల్లి సత్యవతి ప్రైవేట్ స్కూల్ టీచర్. చంద్రమౌళి కాకినాడ కైట్‌లో బీటెక్ చేస్తూ సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. 2018 మే 26న మేడపై ఉండగా ప్రమాదవశాత్తూ జారిపోయిన ఉంగరాన్ని తీసేందుకు యత్నించగా.. విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై కాళ్లు, చేతులు కోల్పోవడంతో డీలా పడిపోయాడు. కొత్త శక్తిని కూడదీసుకుని.. కొన్ని నెలలు గడిచాక చంద్రమౌళి నిరాశను వదిలిపెట్టాడు. శక్తిని కూడదీసుకుని కొత్త జీవితం ప్రారంభించాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మధ్యలో ఆగిపోయిన ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అంతలోనే కరోనా చంద్రమౌళికి మరో పరీక్ష పెట్టింది. తండ్రి వెంకటరమణ కుమారుడి పక్కనే రక్షణ సూట్ ధరించి నెల రోజుల పాటు సేవలందించారు. వారి మొండి ధైర్యానికి విధి తలవంచింది. నెల తర్వాత ఇంటికి వచ్చిన చంద్రమౌళి తేరుకుని తన గమ్యం వైపు అడుగులు వేశాడు. ఆప్తుడైన న్యాయవాది ప్రభాకర్, స్నేహితుడు ప్రసాద్ అండగా నిలిచి మానసిక స్థైర్యం అందించారు. దీంతో చంద్రమౌళి మొండి చేతులతోనే పనులు చేయడం ప్రారంభించాడు. ల్యాప్‌టాప్‌ను ఆపరేట్ చేయడం సాధన చేశాడు. విశాఖలో కృత్రిమ కాళ్లు తీసుకుని నడవడం కూడా కొద్దికొద్దిగా అలవాటు చేసుకున్నాడు. మూడు నెలల్లో అన్ని పనులూ చేయడం ప్రారంభించాడు. కరోనా తర్వాత ఇంజనీరింగ్‌లో ఉద్యోగాలు కష్టతరమవుతున్నాయని భావించి అనకాపల్లిలో బీఎల్ పూర్తి చేశాడు. జీవనోపాధికి అమెజాన్‌లో డేటా ఆపరేషన్ అసోసియేట్ ఉద్యోగం సంపాదించాడు. కొన్నాళ్ల నుంచి ఇంటినుంచే ఆ ఉద్యోగం చేస్తున్నాడు. పట్టుదలతో చదివి కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్క్రైబ్ సహాయంతో రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దేశంలోనే అత్యున్నత బిజినెస్ స్కూల్‌గా ప్రసిద్ధి చెందిన అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో సీటు సాధించాడు. ఈ నెల 21న జాయిన్ అయ్యేందుకు సిద్ధపడుతున్నాడు. ఎంత కష్టం ఎదురైనా కలత చెందవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని చంద్రమౌళి సూచిస్తున్నాడు. చదవండి: అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి.. -
ఇంజనీరింగ్ విద్యార్థిని బంధించి.. బలాత్కరించి.. చంపబోయాడు
ఏలూరు టౌన్:ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో ఇంజనీరింగ్ విద్యార్థినిని నిర్బంధించి.. ఆమె వంటిపై వేడి నూనె పోసి గాయపర్చి.. ఆపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఎస్పీ డీ.మేరీప్రశాంతి ఆదేశాలతో 24 గంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బాధితురాలికి సత్వర న్యాయం అందించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సోమవారం సాయంత్రం స్థానిక త్రీటౌన్ స్టేషన్లో ఏలూరు దిశ డీఎస్పీ కేవీ సత్యనారాయణ మీడియాతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 12 రోజులు నిర్బంధించి లైంగిక దాడి దుగ్గిరాల గ్రామానికి చెందిన బాధితురాలు కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. నిందితుడు సదర్ల అనుదీప్ అదే గ్రా మానికి చెందిన వ్యక్తి. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5న అనుదీప్ కాకినాడ వెళ్లి బాధితురాలిని కలుసుకున్నాడు. ఇద్దరూ చెన్నై వెళ్లి వేలంగిణి మాత చర్చికి వెళ్లారు. నిందితుడు అనుదీప్ తాను వేసుకున్న క్రీస్తు మాలను ఈస్టర్ రోజున తీశాడు. కాగా, బాధితురాలిని 10వ తేదీ రాత్రి ఏలూరులోని దుగ్గిరాల జోసఫ్ నగర్లో గల నాన్నమ్మ ఇంటికి తీసుకువెళ్లాడు. అదేరోజు రాత్రి తన కోరిక తీర్చాలని బాధితురాలిపై ఒత్తిడి చేయగా ఆమె ఒప్పుకోలేదు. మరుసటి రోజు మరోసారి కోరిక తీర్చాలంటూ బలవంతం చేసేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అనుదీప్ వేడిగా మరిగించిన నూనెను ఆమె వంటిపై పోయటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత 12 రోజుల పాటు ఆమెను ఇంట్లోనే బంధించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు చంపేందుకు ప్రయత్నించటంతో బాధితురాలు అతని నుంచి తప్పించుకుని అతని ఫోన్ లాక్కొని తండ్రికి ఫోన్ చేయగా.. వారు వచ్చి ఆమెను ఏలూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలో చేర్పించారు. నిందితుడిపై హిస్టరీ షీట్ బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా అనుదీప్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని దిశ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. సోమవారం నిందితుడు అనుదీప్‌ను ఏలూరు కొత్త బస్టాండ్ సమీ పంలో అరెస్ట్ చేశామని చెప్పారు. నేరం జరిగిన ప్రాంతంలో దర్యాప్తు చేయటంతో పాటు, ఆధారాలను సేకరించి ల్యాబ్‌కు పంపామని తెలిపారు. బాధితురాలికి సత్వర న్యాయం చేసే దిశగా త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఎస్పీ మేరీప్రశాంతి ఆదేశాల మేరకు నిందితుడు అనుదీప్ పై హిస్టరీ షీట్ తెరుస్తున్నట్టు చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవని, మైనర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక దాడులకు పాల్ప డినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తిరువొత్తియూరు: స్నేహితురాలి సహోదరి వివాహ రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్యసాయిరెడ్డి (21) చైన్నె తురైపాక్కంలో ఉన్న హాస్టల్లో ఉంటూ శ్రీపెరంబుదూరులోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి కోయంబేడు నూరడుగుల రోడ్డులో ఉన్న వివాహ మండపంలో జరిగిన స్నేహితురాలి సహోదరి వివాహ రిసెప్షన్లో స్నేహితులతో కలిసి సత్యసాయి రెడ్డి పాల్గొన్నాడు. లైట్ మ్యూజిక్కు డ్యాన్స్ వేస్తున్న సమయంలో చెవి నుంచి రక్తం వచ్చింది. కొద్ది సేపటికే స్ఫృహ తప్పి కింద పడిపోయాడు. స్నేహితులు అతన్ని హుటాహుటిన అన్నానగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. స్నేహితుడి మృతదేహాన్ని చూసి స్నేహితులు బోరున విలపించారు. కోయంబేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. విచారనలో సాయికి ఫిట్స్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. సీసీ కెమెరాల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
రాజమహేంద్రవరం రూరల్: బైక్‌ను లారీ ఢీకొన్న సంఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థి తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా పైడిచింతపాడు గ్రామానికి చెందిన ముంగర జాన్‌బాబు (21) గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. దివాన్ చెరువులోని ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. గురువారం రాత్రి సమయంలో స్నేహితుని బైక్ తీసుకుని, మరో స్నేహితుడితో కలిసి రాజమహేంద్రవరం వచ్చాడు. తిరిగి వెళ్తుండగా దివాన్‌చెరువు జీరోపాయింట్ వద్ద బైక్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జాన్‌బాబును రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బైక్ వెనుక స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ జాన్‌బాబు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. అతడి చిన్నాన్న నాగరాజు ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై జగన్మోహనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: సడన్ హార్ట్ ఎటాక్.. కాలేజీలోనే కుప్పకూలిన ఇంజనీరింగ్ విద్యార్థి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో యువకుడు గుండెపోటుకు బలయ్యాడు. మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఈ విషాద ఘటన జరిగింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విశాల్ అనే విద్యార్థి గుండెపోటుతో కాలేజీ ఆవరణలోనే కుప్పకూలాడు. కారిడార్‌లో నడుస్తూ ఛాతీలో నొప్పితో సడన్‌గా కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు అతడ్ని సీఎంఆర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశాల్‌ది రాజస్థాన్ అని తెలుస్తోంది. కాగా.. ఇటీవల యువకుల్లో గుండెపోటు ఘటనలు బాగా పెరిగిపోయాయి. కొద్దిరోజుల క్రితమే యువ కానిస్టేబుల్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. మరో ఘటనలో స్నేహితుడి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ యువకుడు సడన్‌గా కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.. గుండె.. ఉండేది మనిషి గుప్పెడంత. కానీ, నిలువెత్తు మనిషి ప్రాణం దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మారుతున్న లైఫ్‌స్టైల్.. ఆహారపు అలవాట్లు మనిషిని నిలబెట్టే ఆ బలాన్ని.. బలహీనపరుస్తోంది. అందుకే గుండె సమస్యలతోపాటు కార్డియాక్ అరెస్ట్ సమస్యలతో.. వయసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. అప్పటికప్పుడే ప్రాణం విడుస్తున్నారు. చదవండి: దోస్తు పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. 19 ఏళ్లకే గుండెపోటుతో.. -
వరంగల్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
-
IIT Bombay: ఏడో అంతస్తు నుంచి దూకిన ఐఐటీ విద్యార్థి..
ముంబై: ఐఐటీ బాంబేలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఇతడు హాస్టల్ ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ ఘటన జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన ఈ విద్యార్థి వయసు 18 ఏళ్లు. కాలేజీలో జాయిన్ అయి మూడు నెలలే అయింది. ఫస్ట్ ఎండ్ సెమిస్టర్ పరీక్షలు కూడా శనివారమే ముగిశాయి. ఆ మరునాడే ఇతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ విద్యార్థి ఎప్పుడూ ఒంటిరిగా ఉంటాడని, హాస్టల్ రూమ్మేట్తో కూడా సరిగా మాట్లాడట్లేదని పోలీసులు తెలిపారు. ఒంటరితనం వల్లే అతనికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే పరీక్షల ఒత్తిడి కూడా ఓ కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు.. -
ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంజనీరింగ్ విద్యార్థినిని దారుణంగా కత్తితో..
తరచూ ఎక్కడో ఒక చోట ప్రేమోన్మాదుల దాష్టీకానికి అమ్మాయిలు బలవుతున్నారు. చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాల్సినవారు ప్రేమపాశానికి బలవుతూ కన్నవారికి శోకాన్ని మిగులుస్తున్నారు. మరోవైపు దాడులకు పాల్పడినవారు కటకటాల పాలై బతుకును బుగ్గి చేసుకుంటున్నారు. యశవంతపుర: ప్రేమించలేదనే కోపంతో విద్యారి్థనిని మరో విద్యార్థి చాకుతో పొడిచి హత్య చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. యలహంక రాజనకుంట పోలీసుస్టేషన్ పరిధిలో దిబ్బూరులోని ప్రెసిడెన్సీ ఇంజనీరింగ్ కాలేజీ ఈ దారుణానికి వేదికైంది. కోలారుకు చెందిన లయస్మిత (19) హతురాలు. వివరాలు.. లయస్మిత ఈ కాలేజీలో ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యారి్థని కాగా, ఆమె స్నేహితుడు పవన్ నృపతుంగ రోడ్డులో విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. లయస్మితను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. ఆమె ఇష్టం లేదని చెప్పినా పవన్ తీరు మారలేదు. 10 సార్లు కత్తితో పొడిచి హత్య కాలేజీకీ వచ్చి ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి లయస్మితను క్లాసు నుంచి పిలిపించాడు. నన్ను ప్రేమిస్తావా, లేదా అని పవన్ డిమాండ్ చేయగా లయస్మిత నిరాకరించింది. దీంతో ఉన్మాదిగా మారిన పవన్ కత్తి తీసుకుని 10 సార్లు ఆమెను పొడిచాడు. లయస్మిత రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు వదిలింది. ఈ ఘోరాన్ని చూసిన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. తరువాత ప్రేమోన్మాది చాకుతో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గాయపడిన పవన్‌ను విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. పవన్ తరచూ కాలేజీకి వచ్చి ప్రేమ పేరుతో లయస్మితను వేధించినట్లు తెలిసింది. రాజనుకుంట పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమోన్మాది మారణకాండ తీవ్ర సంచలనం సృష్టించింది. చదవండి: బెంగళూరులో వ్యాపారి ఆత్మహత్య.. సుసైడ్ నోట్లో బీజేపీ ఎమ్మెల్యే పేరు -
Hyderabad: నిప్పంటించుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, జగద్గిరిగుట్ట: ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ «ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన శిరీష (22) గుంటూరులో బీటెక్ పూర్తి చేసింది. ఇటీవల కూకట్పల్లి జేఎన్టీయూలో జావా లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఆల్వీన్ కాలనీలోని తన బంధువుల (పెద్దమ్మ కూతురు) ఇంట్లో ఉంటోంది. నాలుగు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో శిరీష బంధువులు ఉంటుండగా మిగతా ఫ్లోర్లు అద్దెకు ఇచ్చారు. పెంట్‌హౌజ్ ఖాళీగా ఉంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తను తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌తో నేరుగా భవనం టాప్ ఫ్లోర్‌కు వెళ్లింది. అక్కడ బాటిల్లోని పెట్రోల్‌ను పోసుకుని నిప్పంటించుకుంది. మంటల వేడిమి భరించలేక అరవడంతో యువతి బంధువులు, స్థానికులు టెర్రస్‌పైకి వెళ్లి మంటలు ఆరి్పవేశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.. శిరీష మృతికి కారణాలు తెలియరాలేదు. తల్లిదండ్రుల ఆర్థికక పరిస్థితి బాగానే ఉందని, కుటుంబ సభ్యులు, బంధువులతో ఎంతో ఆప్యాయంగా ఉంటుందని తెలిసింది. దీంతో జగద్గిరిగుట్ట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘అమ్మానాన్న సారీ.. అందుకే వెళ్లిపోతున్నా..’
తాటిచెట్లపాలెం/కూర్మన్నపాలెం(విశాఖపట్నం): నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న చట్టి పవన్‌కుమార్(20) అనుమానాస్పదంగా మృతి చెందాడు. మర్రిపాలెం రైల్వేస్టేషన్‌కు సమీపంలో పట్టాల పక్కన అతని మృతదేహం లభ్యమైంది. గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివీ.. వడ్లపూడి నిర్వాసితకాలనీ అప్పికొండ ప్రాంతానికి చెందిన చట్టి రామునాయుడు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అతని చిన్న కుమారుడు పవన్‌ను కళాశాలకు పంపించేందుకు మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో కూర్మన్నపాలెం బస్టాండ్‌లో దించాడు. మధ్యాహ్నం సమయంలో కుమారుడికి తండ్రి ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. కాగా.. మంగళవారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ మర్రిపాలెం సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించి.. విశాఖపట్నం రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన జీఆర్పీ సీఐ కోటేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఎస్ఐ కామేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పవన్ మృతదేహాంగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఉన్నత చదువులు చదివి.. గొప్పస్థాయికి ఎదుగుతాడన్న కుమారుడు ఇక రాడనే వార్త ఆ తల్లిదండ్రులను కలచి వేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు జీఆర్పీ సిబ్బంది తెలిపారు. కాగా.. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు తల్లిదండ్రులకు పవన్ మేసేజ్ పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ‘అమ్మానాన్న సారీ.. నా వల్ల మీకెప్పుడైనా బాధలు తప్పవు.. అందుకే వెళ్లిపోతున్నా..’అంటూ అందులో పేర్కొన్నాడు. అనుమానాస్పదంగా మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ కామేష్ తెలిపారు. చదవండి: క్లాస్మేట్ అని జాబ్ ఇప్పించి.. లవ్యూ అంటూ సహజీవనం.. తర్వాత.. -
దువ్వాడ: రైలు-పుట్‌పాత్ మధ్య ఇరుక్కున్న విద్యార్థి.. నొప్పి భరించలేక..
సాక్షి, విశాఖపట్నం: రైలు ఎక్కుతున్నప్పుడు లేదా దిగి క్రమంలో జాగ్రత్తలు వహించాలని రైల్వే అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ, వారి హెచ్చరికలు పట్టించుకోకుండా కొందరు అజాగ్రత్తతో ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఇలాంటి వీడియోలు ఇప్పటికి చాలానే చూశాము. తాజాగా ఇలాంటి ఘటనే గాజువాకలోని దువ్వాడ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. గుంటూరు-రాయగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు దువ్వాడకు వచ్చింది. ఈ సందర్భంగా ప్లాట్‌ఫామ్ మీద నుంచి రైలు ఎక్కుతున్న క్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థిని శశికళ కిందపడిపోయింది. ఈ క్రమంలో ఫుట్‌పాత్, రైలులో మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో, బయటకు వచ్చేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంది. కాగా, విద్యార్ధిని రైలు మధ్యలో పడిపోవడంతో ఆమెను బయటకు తీసెందుకు రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం, హుటాహుటిన ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. -
దువ్వాడ రైల్వే స్టేషన్ లో రైలు క్రింద ఇరుక్కుపోయిన ఇంజినీరింగ్ విద్యార్థిని
-
గుడ్ న్యూస్: ప్రముఖ కంపెనీలో భారీగా ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 మంది పైచిలుకు ఇంజినీరింగ్ ట్రెయినీలను తీసుకున్నట్లు ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) వెల్లడించింది. వీరిలో తాజా గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రిక్రూట్ చేసుకున్న 1,067 మందితో పోలిస్తే ఈసారి ట్రెయినీల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు వివరించింది. మహిళా ఇంజినీర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగి 248 నుండి 1,009కి చేరినట్లు ఎల్అండ్టీ తెలిపింది. మొత్తం సిబ్బందిలో ప్రస్తుతం మహిళా ఉద్యోగుల వాటా 7.6 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
గురునానక్ కాలేజీలో విద్యార్ధి ఆత్మహత్యా యత్నం
-
బాపట్ల : సముద్ర తీరంలో విషాదం..
-
షాకింగ్ ఘటన.. స్నేహితురాలితో కలిసి స్కూటీపై వెళ్తుండగా..
తొండంగి(కాకినాడ జిల్లా): హాస్టల్లో చదువుతున్న ఆ ఇంజినీరింగ్ విద్యార్థిని తల్లిదండ్రులను పలకరించేందుకు స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన ఘటన ఆదివారం బెండపూడి జతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఒక్కగానొక్క కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: ఏడు పేజీల సూసైడ్ నోట్.. కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్య మృతురాలి బంధువులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామానికి చెందిన కట్టా కాశీవిశ్వనాథం కుమార్తె కట్టా నందిని(21) కాకినాడ సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. తన స్నేహితురాలు వసంతతో కలిసి ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ నుంచి స్కూటీపై బయలుదేరి కోటనందూరు మండలం కాకరాపల్లి వెళ్లింది. తల్లిదండ్రులను పలకరించిన అనంతరం భోజనం చేసి స్కూటీపై మళ్లీ సూరంపాలెం హాస్టల్‌కు బయలుదేరారు. అన్నవరం బైపాస్ నమూనా టెంపుల్ సమీపంలో బెండపూడి శివారు జాతీయ రహదారిపై వీరి స్కూటీ అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో నందిని అక్కడికక్కడే మృతిచెందగా వసంతకు స్వల్పగాయాలయ్యాయి. దీనిపై తొండంగి ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
తొలివిడత వదిలేస్తే మలివిడతలో చాన్స్
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ సైన్స్ కోర్సులో పెరగబోయే సీట్లు తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై ప్రభావం చూపాయి. చాలా మంది విద్యార్థులు తొలివిడత కౌన్సెలింగ్‌లో ఆయా కోర్సుల్లో సీటు వదిలేస్తే, మలివిడతలో నచ్చిన సీటు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కాలేజీల విషయంలోనూ ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు కన్పిస్తోంది. సీట్లు పెరగడంతో మరో కాలేజీలో ఈసారి సీటు వస్తుందనే ఆశ వారిలో కన్పిస్తోంది. అదీకాక ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందినవారు ఎంసెట్ కౌన్సెలింగ్ నుంచి తప్పుకునే వీలుంది. ఈ రకంగానూ కొంత సానుకూల వాతావరణం ఉంటుందని విద్యార్థులు ఆలోచిస్తున్నారు. ఈసారి అదృష్టం పరీక్షిద్దాం రాష్ట్రంలో తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అన్ని రకాల కోర్సులకు కలిపి మొత్తం 71,286 సీట్లు కన్వీనర్ కోటా కింద సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో 60,208 సీట్లు కేటాయించారు. ఈ నెల 13 నాటికి కేవలం 43 వేలమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. 17 వేల మందికి సీట్లు వచ్చినా అది తమకు నచ్చలేదని భావించి రిపోర్టింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇలాంటివారిలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, ఆఖరుకు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్లు ఆశపడుతున్నవారే. తొలి దశలో పెంచిన కంప్యూటర్ సైన్స్ కోర్సు సీట్లు 9,240 అందుబాటులోకి రాలేదు. 25 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా మెరుగైన కాలేజీ, సీటు కోసం తొలి దశలో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టారు. కొంతమంది కంప్యూటర్ సైన్స్(సీఎస్సీ)లో సీటు వచ్చినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి కోర్సుల కోసం ఎదురుచూస్తూ మొదటి విడతలో చేరలేదు. ఆప్షన్ల ఎంపికలో సానుకూలత రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 28న మొదలవుతుంది. కొత్తగా 12 వేలకుపైగా సీట్లు పెర గడం, జేఈఈ ర్యాంకర్లు ఈసారి ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పెద్దగా పోటీ పడకపోవడం వల్ల రా ష్ట్రస్థాయి విద్యార్థులకు అవకాశాలు కలిసి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 40 వేలలోపు ర్యాంకు విద్యార్థులు ఆచితూచి ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచిదని అంటున్నారు. 5 వేలలోపు ర్యాంకుల్లో ఉన్న విద్యార్థులు ఎక్కువమంది ఈసారి పోటీలో ఉండరని, 10 వేల లోపు ర్యాంకు విద్యార్థుల్లో 50 శాతం మాత్రమే పోటీ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టి 40 వేల లోపు ర్యాంకు విద్యార్థులు కోరిన కాలేజీ, సీటు కోసం పోటీపడేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఆ పై ర్యాంకు విద్యార్థులు కాలేజీ విషయం పక్కన పెట్టినా, కోరుకున్న సీటును ఎక్కడైనా పొందేందుకు ప్రయత్నించి సఫలం కావచ్చని చెబుతున్నారు. -
టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్!
సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఆ యువకుడికి మహా ఇష్టం. ఆసక్తికి ఆలోచనలు తోడయ్యాయి. ఆవిష్కరణలు ఆరంభమయ్యాయి. డ్రైవర్‌లేని కార్లు, డబుల్ మైలేజీ ఇచ్చే బైక్‌లు, ఇ–బైక్‌లను తక్కువ ఖర్చుతో తయారుచేస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డేటా సైన్స్ విద్యను పూర్తిచేసిన గెంబలి గౌతమ్‌కు చిన్నప్పటి నుంచి సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడం మహా సరదా. ఆదే అలవాటుగా మారింది. మైక్రో ఆర్ట్ నుంచి వినూత్న వాహనాల తయారీ వరకు వినూత్నంగా సాగిపోతున్నాడు. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ.. పెట్రోల్ లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాలను సొంతంగా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయన ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఏ ఆవిష్కరణ అయినా ఔరా అనాల్సిందే. అతి తక్కువ ఖర్చుతో నడిచే స్కూటర్‌ను చూస్తే వావ్ అంటాం. తనకు నచ్చిన రంగులతో విభిన్నమైన ఆలోచనలతో దూసుకెళ్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. డబుల్ మైలేజ్.. డబుల్ ధమాకా.. ► పెట్రోల్ భారం తగ్గేలా గౌతమ్ సరికొత్త డివైజ్‌ను రూపొందించాడు. చైనాకు చెందిన హజ్ మోటారు వినియోగించి, బైక్‌లో కొన్ని మార్పులు చేశాడు. ఇప్పుడు లీటరు పెట్రోల్‌తో గతంలో నడిచిన దానికంటే డబుల్ మైలేజ్ వస్తోంది. ► ఇంట్లో ఉండే పాత ఇనుప సామగ్రిని వినియోగించి కేవలం రూ.13వేల ఖర్చుతో రెయిన్ బో స్కూటర్‌ను రూపొందించాడు. లిథియం బ్యాటరీ, మూలకు చేరిన కొన్ని వాహనాల పరికరాలను వినియోగించి దీనిని తయారు చేశాడు. తన మామయ్య కోరిక మేరకు దీనిని తీర్చిదిద్దానని, ఎంతోమందికి నచ్చడంతో ఈ తరహా బైక్స్ తయారు చేయాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని గౌతమ్ చెబుతున్నాడు. ► దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి స్టీరింగ్ లెస్ కారును తయారుచేసి దాన్ని రోడ్లపై నడుపుతూ గౌతమ్ అబ్బుర పరిచాడు. ఆయన రూపొందించిన కారుకు స్టీరింగ్ ఉండదు. కేవలం రూ.32 వేల ఖర్చుతో డిజైన్ చేసిన కారులో 350 వోల్టుల సామర్థ్యం కలిగిన 2 మోటార్లు, లిథియం బ్యాటరీ, కొంత ఐరన్ వినియోగించాడు. సోలార్‌తో పాటు బ్యాటరీతో నడిచేలా కారును తయారు చేశాడు. కాళ్ల వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా ఆపరేట్ అవుతుంటుంది. చేతులు లేని విభిన్న ప్రతిభావంతులను దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ రూపొందించినట్టు గౌతమ్ చెబుతున్నాడు. జీపీఆర్ఎస్ సిస్టమ్, బ్లూ టూత్ వంటి సదుపాయాలు ఈ కారు సొంతం. దీనికి లైసెన్స్‌తో పనిలేదు. గతంలో అంతర్జాతీయ సైన్స్దినోత్సవం సందర్భంగా ఈ కారుని చూసిన జపాన్ బృందం యువకుడి ప్రతిభను మెచ్చుకుంది. ప్రశంసల వర్షం కురిపించింది. విశాఖపట్నంలోని ఇద్దరు దివ్యాంగులకు రెండు కార్లు ప్రత్యేకంగా తయారు చేసి అందజేశాడు. పంటలకు పురుగుమందులు పిచికారీ చేసే స్ప్రేలను వినూత్నంగా తయారుచేసి రైతులకు అందజేస్తున్నాడు. 15 గంటల్లోనే ఈ బైక్ తయారీ తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటల పాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని రుజువు చేశాడు. వాహనం తయారీకి పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టం, హ్యాండ్‌బ్రేక్ ఉపయోగించాడు. రాత్రి కూడా సునాయసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్ లైట్ అమర్చాడు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జల్దు వినయ్ ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా పూర్తిచేసినట్టు యువకుడు తెలిపాడు. ఏ ఆలోచన వచ్చినా .. ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకూ స్టీరింగ్ లెస్ కారుతోపాటు రెయిన్ బో స్కూటర్, రెండింతలు మైలేజీ వచ్చేలా బైక్ డిజైన్‌లో మార్పులు చేశాను. సరికొత్త బైక్ తయారీకి ప్రయత్నిస్తున్నాను. రెయిన్ బో స్కూటర్ చాలా మందికి నచ్చడంతో ఇప్పటికే కొంత మంది డిజైన్ చేసి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి సరికొత్తగా ఆలోచించడం, ఏదో ఒకటి చేయాలన్న తపనతో అనేక విషయాలను నేర్చుకోవడం మొదలు పెట్టాను. చిన్నప్పుడు పిల్లలకు కరెంట్ వైర్లతో వెరైటీ ఐటెమ్స్ చేసి ఇవ్వడం, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులకు సహకారాన్ని అందించడం వంటివి చేశాను. అప్పుడే కొత్త ఆవిష్కరణల దిశగా నా అడుగులు పడ్డాయి. – జి.గౌతమ్, పార్వతీపురం చదవండి: ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా.. ఈ గ్యాడ్జెట్ మీకోసమే! -
అడ్డంగా ‘బుక్’ చేసేశారు.. క్షణాల వ్యవధిలో..
కోటబొమ్మళి(శ్రీకాకుళం): ఆన్లైన్లో పుస్తకం బుక్ చేసి డబ్బులు చెల్లించిన తర్వాత నిమిషాల వ్యవధిలో అకౌంట్లోని డబ్బులు మాయం కావడంతో బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. గత నెలలో జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కోటబొమ్మాళి ఎస్ఐ షేక్ ఖాదర్ బాషా తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నబమ్మిడి పంచాయతీ సుబ్బారావుపేటకు చెందిన ఆరవెల్లి ప్రదీప్ ఆగస్టు 7న ఓ ఆన్లైన్ వెబ్సైట్లో రూ.200 చెల్లించి ఇంజినీరింగ్‌కు సంబంధించిన మైక్రో కంట్రోలర్ కోర్సు పుస్తకాన్ని బుక్ చేశాడు. అనంతరం 30 నిమిషాల వ్యవధిలో దఫదఫాలుగా తన బ్యాంకు ఖాతా నుంచి రూ.1,04,320 సైబర్ నేరగాళ్లు దోచేశారు. నగదు డెబిట్ అయిన విషయం సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో బాధితుడు సైబర్ క్రైం(విజయవాడ) పోలీసులకు 1930 నంబర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. వారు వెంటనే స్పందించి బ్యాంకు ఖాతాను బ్లాక్ చేయించారు. ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పంపాలని కోట»ొమ్మాళి పోలీసులకు గురువారం సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బాధితుడికి న్యాయం జరుగుతుందని, ఆన్లైన్లో వస్తువులు బుక్ చేసేముందు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదవండి: ఎస్సై వివాహేతర సంబంధం.. ప్రియురాలి కుమార్తెపై కన్నుపడటంతో.. -
Engineering Student: ఇంజినీరింగ్ మధ్యలో హిజ్రాగా మారి
సాక్షి, చెన్నై: ఇంజినీరింగ్ చదువుతూ హిజ్రాగా మారిన ఓ యువకుడిని చదువు కొనసాగించేందుకు కళాశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో బాధితుడు కలెక్టర్‌ను ఆశ్రయించాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పొన్నేరికి చెందిన కూలీ తెన్నరసు, శశికళ కుమారుడు లోకేష్. రెడ్‌హిల్స్ సమీపంలోని ఆర్వీఎస్ పద్మావతి ఇంజినీరింగ్ కళాశాలలో 2018లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సులో చేరాడు. రెండో సెమిస్టర్ పూర్తయిన తరువాత లోకేష్ హిజ్రాగా మారి గెజిట్‌లో ఓవియాగా పేరును మార్చుకున్నాడు. అంత వరకు సాఫిగా సాగిన లోకష్ కళాశాల జీవితం పూర్తిగా మారిపోయింది. హిజ్రాగా మారిన లోకేష్ అలియాస్ ఓవియాకు కళాశాల అనుమతి నిరాకరించింది. దీంతో మద్యలోనే ఇంజినీరింగ్ విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చదువుపై మక్కువతో 2022–23వ సంవత్సరంగానూ డిగ్రీ చేయాలని పచ్చప్ప కళాశాలలో హిజ్రా కోటాలో సీటు ఆశించింది. అయితే హిజ్రా కోటాకు సంబందించి ప్రభుత్వం ఉత్తర్వులు లేకపోవడం, వయస్సు దాటడంతో సీటును నిరాకరించారు. దీంతో ఓవియా గత 18న కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్‌ను కలిసి పరిస్థితిని వివరించి కళాశాలలో సీటు ఇప్పించాలని కోరింది. ఈ సంఘటనపై స్పందించిన కలెక్టర్ పొన్నేరిలో ప్రభుత్వ కళాశాలలలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ సీటు కేటాయిస్తూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం సాయంత్రం ఓవియాకు అందజేశారు. ఈ సందర్భంగా ఓవియా మాట్లాడుతూ.. బాగా చదువుకుని టీచర్‌గా రాణిస్తానని మీడియాకు వివరించింది. చదవండి: (సీఎం స్టాలిన్ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..) -
రైల్వే ట్రాక్‌పై ఇంజినీరింగ్ విద్యార్థి.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి..
శిరివెళ్ల(నంద్యాల జిల్లా): మండల పరిధిలోని గోవిందపల్లె గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఎం.ఫణేశ్వరరెడ్డి(23) రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నంద్యాల రైల్వే ఎస్ఐ జలీల్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి కుమారుడు ఫణేశ్వరరెడ్డి నంద్యాల ఆర్జీఎం కాలేజీలో తృతీయ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. రెండు ఏడాదిలో కొన్ని సబెక్టులు ఫెయిల్ అయ్యాడు. చదవండి: కొడుకును చూసి షాక్ తిన్న తండ్రి.. సినిమా స్టోరీని తలపించింది.. కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈక్రమంలో సోమవారం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బైక్‌పై నంద్యాలకు బయల్దేరాడు. సాయంత్రం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. బైక్ నంబర్ ఆధారంగా అక్కడి రైల్వే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాన్ని నంద్యాలకు తరలించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్
బెంగళూరు: వివాహమై ఇద్దరు పిల్లలున్న తల్లి... ఇంజనీరింగ్ చదివిన యువకుడు. ఇద్దరికి బాల్యం నుంచి పరిచయం, ఈ నేపథ్యంలో ఇద్దరు పారిపోయి కారవార్ వచ్చారు. భార్య అదృశ్యంపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కథ అంతా బయట పడింది. దీంతో పోలీసులు యువకుడితో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు... బీర్ మోహిద్దీన్ చెన్నైకి చెందినవాడు. ఇటీవల ఇంజినీరింగ్‌ను పూర్తి చేశారు. దూరపు బంధువైన అబ్దుల్ ఖాదర్ యువకుడికి పెళ్లి సంబంధాలను చూడటాన్ని ప్రారంభించారు. దీంతో బీర్ మోహద్దీన్ అప్పుడప్పుడు ఖాదర్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. అయన కోడలు అయిషాతో బాల్యం నుండి పరిచయం. దీంతో అయిషాను తీసుకుని బీర్ మోహద్దీన్‌లు కారవారకు పారిపోయాడు. ఎవరికి తెలియకుండా ఆరు నెలల నుండి అక్కడే కలిసి నివాసం ఉంటున్నారు. దీంతో తమిళనాడు పోలీసులు అదృశ్యమైన అయిషాను కోసం వెతుకుతూ కారవారకు రావటంతో స్థానిక పోలీసుల సాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గత ఫిబ్రవరి నుండి ఇద్దరు అద్దె ఇంటిలో కారవారలో ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చదవండి: (గుజరాత్‌పై కుట్రలు) -
ఎన్నో ఉద్యోగాలు వదులుకున్నాడు.. చివరికి అరకోటి ప్యాకేజీతో షాకిచ్చాడు!
ప్రస్తుత రోజుల్లో నాలుగంకెల ఉద్యోగం వస్తే చాలు ఈ పోటీ ప్రపంచంలో అలాంటి జాబ్ దొరకడం కూడా కష్టం అని కొందరు అనుకుంటారు. జీతం ఎంతైనా ఐ డోంట్ కేర్ మనల్ని కంపెనీలు సెలక్ట్ చేసుకోవడం కాదు మనమే కంపెనీలని ఎంచుకోవాలని కొందరు అనుకుంటారు .ఇలానే అనుకున్నాడు ఓ బీటెక్ విద్యార్థి. కాగ్నిజెంట్, అమెజాన్ లాంటి ప్రముఖ కంపెనీల్లో వచ్చిన ఉద్యోగాలను సైతం పక్కన పెట్టాడు. కొడితే కుంభస్థలాన్ని కొట్దాలిరా అనుకున్నాడో ఏమో మైక్రోసాఫ్ట్ లో 50 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ కొట్టి అందరి చేత ఆహా అనిపించాడు. అతడే మధుర్ రఖేజా. దుకాణదారుడి కొడుకు నుంచి మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా ఎదిగాడు ఓ దుకాణదారుడి కొడుకు తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలల కన్నాడు. వాటి కోసం అంతే శ్రమించాడు. పట్టు వదలక క్యాంపస్ ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ లాంటి ప్రఖ్యాత కంపెనీలో రూ.50 లక్షల జాబ్ కొట్టి అనుకున్నది సాధించడమే గాక తన తల్లిదండ్రులను గర్వించేలా చేశాడు మధుర్ రఖేజా. అతను యూపీఈఎస్ (UPES) స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్లో స్పెషలైజేషన్‌తో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో (బీటెక్) పూర్తి చేశాడు. యూనివర్శిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (UPES) డెహ్రాడూన్‌లోని ఓ మల్టీడిసిప్లినరీ విశ్వవిద్యాలయం. టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం తన పయనం గురించి మధుర్ మాట్లాడుతూ.. టెక్నాలజీ అంటే నాకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే ప్రజల జీవితాలను మార్చగల సామర్థ్యం దానికి ఉంది. అంతటి ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంది కనుకే అలాంటి ప్రత్యేకమైన కోర్సును ఎంచుకున్నాను. అప్ స్ట్రీమ్ పెట్రోలియానికి సంబంధించి నాకు ఒకతను చెప్పాడు. కంప్యూటర్ సైన్స్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్లో స్పెషలైజేషన్ ఉందని నాకు అప్పుడే తెలిసింది. అందుకే.. దాన్ని ఎంచుకున్నానని చెప్పాడు. వచ్చింది కాదు నచ్చింది చేయాలి మొదట తాను కొన్ని కంపెనీల జాబితాను తయారు చేసుకున్నాడు. అందులో మైక్రోసాఫ్ట్ కూడా ఉంది. మొదటగా ఇతరుల ఇంటర్వ్యూ అనుభవాలను చదవడంతో పాటు ఇంటర్య్వూకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఎంపిక ప్రక్రియకు సిద్ధమైనట్లు వివరించాడు. మైక్రోసాఫ్ట్‌తో పాటు, అమెజాన్, ఆప్టమ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌తో పాటు మరిన్ని వాటికి దరఖాస్తు చేసుకుని తాను తలపెట్టిన మహాయజం చివరికి మైక్రోసాఫ్ట్ ద్గగర ఆగిందని చెప్పుకొచ్చాడు. మధుర్ అనేక కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నారు. -
ముంబైలో ప్రత్యక్షమైన మేడ్చల్ బీటెక్ విద్యార్థిని.. ఇన్‌స్టా అధారంగా...
సాక్షి, హైదరాబాద్: కండ్లకోయ సీఎంఆర్ కళాశాలలో బీటెక్ చదవుతున్న విద్యార్థి అదృశ్యం ఘటన సుఖాంతంగా ముగిసింది. మేడ్చల్‌లో నివసమున్న సకిరెడ్డి వర్షిణి కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 7న కళాశాలకు తమ బంధువు వంశీమోహన్‌రెడ్డి వెంట ద్విచక్రవాహనంపై వెళ్లింది. అయితే వర్షిణి ఇంట్లోనే ఐడి కార్డు, ఫోన్ మరిచిపోవడంతో వాటిని తీసుకోవడానికి ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటికి రావడానికి కళాశాల బయటకు వచ్చింది. ఆ తరువాత ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె కళాశాల నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు కండ్లకోయలో రోడ్డుపై ఉన్న బేకరి సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. కుమార్తె కోసం ఆమె తండ్రి శివాజీ వెతికినా లభ్యం కాకపోవడంతో మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం వర్షిణి ముంబయ్‌లోని కళ్యాణ దుర్గ రైల్వెస్టేషన్లో ఉందని మేడ్చల్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఆమెను మేడ్చల్ కు రప్పించడానికి ప్రత్యేక బృందం ముంబయ్‌కు వెళ్ళింది. ఇన్‌స్టా గ్రామ్ అధారంగా... వర్షిణి ఇన్‌స్ట్రాగాం ఆధారంగా ఆమె ఆచూకీని పోలీసులు కనుగొన్నట్లు సమాచారం. వర్షిణి వద్ద సెల్ ఫోన్ లేకపోయినప్పటికీ ముంబయ్‌లో తన ఇన్‌స్ట్రాగాంను ఓపెన్ చేసినట్లు పోలీసులు గుర్తించి అక్కడి పోలీసుల సహయంతో అమెను గుర్తించారని సమాచారం. చదవండి: తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ -
ఎలాంటి బాధా లేకుండా చనిపోవడం ఎలా అని చర్చ..?.. అంతలోనే
సాక్షి, తాడేపల్లిగూడెం: మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య పశ్చిమగోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో గల ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో గత నెల 18న అల్లంశెట్టి రవితేజ (19) మెకానికల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరాడు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలేనికి చెందిన రవితేజ టెక్కలిలో డిప్లొమా పూర్తి చేశాడు. ఇటీవల సంక్రాంతి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లిన రవితేజ వారం రోజుల క్రితం కళాశాలకు వచ్చాడు. అప్పటి నుంచి ఎలాంటి బాధా లేకుండా చనిపోవడం ఎలా అంటూ సహచర విద్యార్థులతో చర్చించాడు. సోమవారం ఉదయం నలతగా ఉండటంతో తల్లి అనుమతి మేరకు కళాశాల హాస్టల్లోనే ఉండిపోయాడు. అదే రూమ్‌లో ఉంటున్న నితిన్, వీరాస్వామి తమ రోజువారీ తరగతులకు హాజరయ్యారు. మధ్యాహ్నం 11.50 గంటల ప్రాంతంలో సహచర మిత్రుడు వీరాస్వామితో పాటు మరో నలుగురి సెల్ఫోన్లకు ‘మీకు సర్ప్రైజ్ ఇస్తున్నా.. నేను చనిపోవాలనుకుంటున్నా..’ అంటూ టెక్ట్స్ మెసేజ్‌ను రవితేజ పోస్టు చేశాడు. దీంతో వీరాస్వామి అతని తల్లికి ఫోన్‌చేసి మాట్లాడగా, సెలవు పెట్టి రూమ్‌లోనే ఉన్నాడని చెప్పారు. అనంతరం సహచర విద్యార్థులు, సీనియర్లతో కలిసి రవితేజ ఉన్న రూమ్ వద్దకు వెళ్లి చూశారు. చదవండి: (‘నాన్న, చెల్లి శ్రావణి నన్ను క్షమించండి.. భరించడం నా వల్ల అవ్వట్లేదు’) రెండు వైపులా తలుపులు వేసి ఉండటంతో విద్యార్థులు రూమ్ బద్దలుకొట్టి లోనికి ప్రవేశించారు. అప్పటికే ఫ్యాన్‌కు నైలాన్ తాడుతో ఉరివేసుకుని వేలాడుతున్న రవితేజను సహచర విద్యార్థులు, సిబ్బంది సహకారంతో తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రూరల్ సీఐ వి.రవికుమార్, ఎస్సై ఎన్.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సహచర విద్యార్థులు స్పందిస్తూ బాధ లేకుండా చనిపోవడం ఎలా అనే విషయమై చర్చిస్తే తాము సాధారణంగా తీసుకున్నామని, ఇలా ప్రాణాలు తీసుకుంటాడనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేశవరాయునిపాలెంలో విషాదం ►గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు లావేరు: కేశవరాయునిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి అల్లంశెట్టి రవితేజ (19) పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు అక్కడ నుంచి సమాచారం రావడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. చదవండి: (ఒకరు బీటెక్, మరొకరు బీఎస్సీ.. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. ఏ కష్టమొచ్చిందో.!) కుటుంబ నేపథ్యం.. రేషన్ డిపో డీలరైన అల్లంశెట్టి సూరిబాబు, రాణిప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయితేజ రాజాంలోని జీఎంఆర్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతుండగా.. చిన్న కుమారుడైన రవితేజ తాడేపల్లిగూడేంలోని ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ద్వితీయ సంవత్సరం చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటున్నాడు. సంక్రాంతి పండగకు స్వగ్రామానికి వచ్చిన రవితేజ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులుతో సరదాగా గడిపి.. తిరిగి జనవరి 18వ తేదీన తాడేపల్లిగూడేం వెళ్లిపోయాడు. రోజూ రెండుసార్లు తమకు ఫోన్ చేసి సరదాగా మాట్లాడేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. సోమవారం ఉదయం తల్లి రాణిప్రమీలకు ఫోన్ చేసి ఒంట్లో నీరసంగా ఉందని కాలేజీకి వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోతున్నానని రవితేజ చెప్పాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కాలేజీ యాజమాన్యం నుంచి రవితేజ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి రాణిప్రమీలాకు ఫోన్ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. కొద్దిసేపటి తరువాత కోలుకున్న తల్లిదండ్రులు సూరిబాబు, రాణీప్రమీల, కుటుంబ సభ్యులు, కొందరు గ్రామస్తులు బయలుదేరి తాడేపల్లిగూడేం వెళ్లారు. చిన్నతనం నుంచి రవితేజ బాగా చదివేవాడని స్థానికులు చెబుతున్నారు. అందరితో ఎంతో సన్నిహితంగా ఉండేవాడంటున్నారు. లావేరు మండల వైస్ ఎంపీపీ అలుపున రమణమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు నాయని మోహనరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలుపున గోవిందరెడ్డి, సర్పంచ్ యాగాటి ఆదినారాయణ, మాజీ సర్పంచ్ నాయని వెంకటేష్ తదితరులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
వాట్సాప్ మెసేజ్: తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, నన్ను క్షమించమ్మా..
తాళ్లరేవు (తూర్పుగోదావరి): చదువు తనకు భారంగా మారిందని, ఇక తాను చదవలేనని, చచ్చిపోతానంటూ ఒక విద్యార్థి తల్లిదండ్రులకు పంపిన వాట్సాప్ ఆడియో మెసేజ్ తోటి విద్యార్థులను తీవ్ర కలవరానికి గురిచేసింది. కోరంగి పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కావటి మండలం, గొనపకుత్తిక గ్రామానికి చెందిన లొల్ల సాయిచరణ్ కోరంగి కైట్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల హాస్టల్లో ఉంటున్న సాయిచరణ్ ఆదివారం ఉదయం ఎన్సీసీ కటింగ్ చేయించుకునేందుకు బార్బర్ షాపునకు వెళ్లి వస్తానని చెప్పి అనుమతి తీసుకుని బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కొద్దిసేపటి అనంతరం సాయిచరణ్ తల్లిదండ్రులు కళాశాల ప్రతినిధులకు ఫోన్ చేశారు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని, ఇప్పటివరకు ఎలాగో చదివానని ఇకపై తాను చదవలేకపోతున్నానని, తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, నన్ను క్షమించమ్మా అంటూ విలపిస్తూ వాట్సాప్‌లో ఆడియో మెసేజ్ చేశాడని చాలా ఆందోళనగా ఉందని తెలిపారు. తక్షణమే స్పందించిన కళాశాల ప్రతినిధులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. చదవండి: ('ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు') పలువురు విద్యార్థులు కోరంగి, తాళ్లరేవు, యానాం పరిసర ప్రాంతాల్లో సాయిచరణ్ ఆచూకీ కోసం గాలించారు. ఫలితం లేదు. కళాశాల హాస్టల్ వార్డెన్ కృష్ణ, సాయిచరణ్ తండ్రి షణ్ముఖరావు కోరంగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కోరంగి హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయిచరణ్‌కు బ్యాక్‌ల్యాగ్స్ కేవలం రెండే ఉన్నాయని, క్రీడలతోపాటు ఎన్సీసీ వంటి వాటిలో చాలా చురుకుగా ఉండేవాడని కళాశాల ప్రతినిధులు, తోటి విద్యార్థులు తెలిపారు. -
బీటెక్, బీఈడీ ఉంటే టీచర్ పోస్టులకు అర్హులే
సాక్షి, హైదరాబాద్: నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) మార్గదర్శకాల మేరకు బీటెక్, బీఈడీ విద్యార్హత కలిగిన అభ్యర్థులూ పీజీటీ/టీజీటీ పోస్టులకు అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు బీటెక్ అభ్యర్థులనూ ఈ పోస్టులకు అనుమతించాలంటూ 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ‘ఎన్సీటీఈ 2010, 2014 మార్గదర్శకాల ప్రకారం బీటెక్, బీఈడీ చదివిన అభ్యర్థులూ పీజీటీ, టీజీటీ పోస్టులకు అర్హులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్లో బీఏ, బీఎస్సీ, బీకాంతోపాటు బీఈడీ చదివిన అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొంది. ఎన్సీటీఈ మార్గదర్శకాల మేరకు బీటెక్ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పు సరైనదే’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. -
అగ్రదేశాల్లో.. మనం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘భారతీయులు ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోరు. యుద్ధాలు జరగకుండా చూడటానికే ప్రయత్నిస్తాం. అదే సమయంలో మన రక్షణ రంగ సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూనే ఉంటాం. శత్రు దుర్బేధ్య దేశంగా నిర్మించుకోవడం కోసం ఆధునిక సాంకేతికతతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రస్తుతం శాస్త్రసాంకేతిక, రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అగ్రగామిగా వెలుగొందుతోంది’ అని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. జేఎన్టీయూ–అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సతీష్‌రెడ్డి ఇదే కళాశాలలో విద్యనభ్యసించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడిన వివరాలివీ.. అన్నింటా స్వదేశీ పరిజ్ఞానమే.. అంతరిక్ష, రక్షణ రంగ పరిశోధనల్లో టాప్–5 దేశాల్లో భారత్‌కు స్థానం దక్కింది. ఇస్రో ప్రయోగాలకు సొంత సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగిస్తున్నాం. అటామిక్ ఎనర్జీ, రక్షణ రంగంలోనూ ఆధునిక దేశీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. ఇప్పుడు మన దేశం ‘మేకిన్ ఇండియా నుంచి మేడ్ ఫర్ ద వరల్డ్’ స్థాయికి ఎదుగుతోంది. ఉపగ్రహాల కాల వ్యవధి ముగిసిన వెంటనే.. వాటిని కూల్చివేయడానికి వీలుగా ఏ–శాట్‌ను అభివృద్ధి చేశాం. తద్వారా భారత్ టాప్–4(అమెరికా, రష్యా, చైనా సరసన)లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రాంతాల్లో ఉండే లక్ష్యాన్ని చేరుకునే గన్ 155 ఎం.ఎం ఆవిష్కరణ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కు చైనా, పాకిస్తాన్ వంటి దేశాలతో తరచూ సరిహద్దుల్లో సమస్యలు వస్తున్నాయి. మనం ఎప్పటికప్పుడు అత్యాధునిక సర్వైలెన్సు వ్యవస్థ ఏర్పాటు చేసి, దీనిని సరిహద్దు భద్రతకు ఉపయోగిస్తున్నాం. పరిశోధన రంగాల వైపు వచ్చే ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది శుభపరిణామం. విద్యార్థులు గొప్ప ఆవిష్కరణలతో వస్తే.. ఆ ప్రాజెక్టుకు రూ.10 కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. ‘అనంత’లో ఉండగానే.. అగ్ని ప్రైమ్ శుభవార్త అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప్రయోగం శనివారం విజయవంతమైంది. కళాశాలలో పైలాన్ ఆవిష్కరించిన వెంటనే ఈ శుభవార్త నాకు తెలిసింది. ఆ వెంటనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు అభినందనలు తెలిపారు. నేను విద్యనభ్యసించిన కళాశాలలో ఉండగా ఇలాంటి ఘనత దక్కడం సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజల ఆప్యాయత చాలా గొప్పది. యువ ఇంజనీర్లకు డీఆర్డీవో చేయూత అనంతపురం విద్య: యువ ఇంజనీర్లకు డీఆర్డీవో తగిన చేయూతనిస్తోందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. శనివారం అనంతపురంలో జరిగిన జేఎన్టీయూ(ఏ) ఇంజనీరింగ్ కళాశాల వజ్రోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రోత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్టీయూ(ఏ)విద్యార్థులు ఎంటెక్ (డిఫెన్స్ టెక్నాలజీ) కోర్సు చదవడానికయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. ఎంటెక్(డిఫెన్స్ టెక్నాలజీ) రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తామన్నారు. జేఎన్టీయూ(ఏ)లో డీఆర్డీవో ఎక్స్‌లెన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, వీసీ జింకా రంగ జనార్దన, రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, ప్రిన్సిపాల్ పి.సుజాత పాల్గొన్నారు. -
విహారయాత్రలో విషాదం: అంతవరకు ఆనందంగా గడిపిన క్షణాలు.. ఒక్క అల రాకతో..
సాక్షి, సంతబొమ్మాళి(శ్రీకాకుళం): మండలంలోని భావనపాడు సముద్ర తీరంలో ఆదివారం స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో శేఖర్ కుమార్ బెహరా (21) మృతి చెందగా.. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతున్న 50 మంది విద్యార్థులు బస్సులో ఆదివారం బీచ్‌కు వచ్చారు. భోజనాల అనంతరం విద్యార్థులు సముద్రంలో స్నానాలకు దిగారు. ఇంతలో ఓ రాకాసి అల తాకిడికి శేఖర్‌కుమార్, ముక్తా ప్రధాన్‌తో పాటు మరికొందరు విద్యార్థులు చెల్లాచెదురైపోయారు. కాసేపటికే అంతా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే శేఖర్ మునిగిపోతున్నాడని గ్రహించిన ముక్తా ప్రధాన్ అతడిని కాపాడే ప్రయత్నంలో తాను కూడా అలల మధ్య చిక్కుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న స్నేహితులు ఎలాగోలా కష్టపడి ముక్తాను రక్షించగలిగారు. కానీ శేఖర్‌ను మాత్రం ఒడ్డుకు తీసుకురాలేకపోయారు. సాయంత్రం సమయంలో మృతదేహం ఒడ్డుకు చేరడంతో అంతా బోరుమన్నారు. శేఖర్‌కుమార్ స్వస్థలం బరంపురం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేశామని, మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించామని నౌపడ ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. చదవండి: ప్రేమవివాహం సాఫీగా సాగిన జీవనం.. ఇటీవల కష్టంగా ఉందని లెటర్ రాసి.. -
ఇంజనీరింగ్ కోర్సుల్లో రామాయణ, మహాభారతాలు....!
న్యూఢిల్లీ: తులసీదాస్ రచించన రామాయణాన్ని గ్రాడ్యుయేషన్ విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని మధ్య ప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాశ్ సారంగ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భవిష్యత్తరాలలో వైద్య విద్యను హిందీ మాధ్యమంలో చదువుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. దీని కోసం ఒక కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిలబస్ కమిటీ ఉన్నత విద్యా విధానంలో భాగంగా 2021-22 విద్యా సంవత్సారానికి గానూ రామచరిత మానస్ కీ వ్యవహార దర్శన్ (అప్లైడ్ ఫిలాసఫీ ఆఫ్ రామచరిత మానస్)ని ప్రవేశ పెట్టేలా చేశానని చెప్పారు. (చదవండి: మహిళల రక్షణకై నిర్భయ స్క్వాడ్: ముంబై ) ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్సులో మహాభారతం లాంటి పురాణాలను ప్రవేశపెడితే.. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాశానికి, నాయకత్వ లక్షణాల అభివృద్ధి తోపాటు మానవతా దృక్పథాన్ని పెంపొందించేలా దోహదపడుతుందన్నారు. ఈ మేరకు భారతదేశ సంస్కృతి ఆధ్యాత్మికతకు సంబంధించి 100 మార్కుల ప్రశ్నా పత్రం ఒకటి ఉంటుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ నాయకుల బయోగ్రఫి కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలనే ప్రతిపాదన ఉందన్నారు. దీంతో విద్యార్థులు సామాజికంగా, వైద్య పరంగానూ నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించగలిగే అవకాశం ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధ్య ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ...." విద్యా వ్యవస్థను కాషాయికరణం చేస్తున్నాంటు వస్తోన్న ప్రతి పక్షాల విమర్శలను ఖండించారు. ఈ క్రమంలో నాసా సైతం 'రామసేతు' నిర్మాణాన్ని ప్రాచీన మానవ నిర్మిత నిర్మాణంగా అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యావ్యవస్థలో కాలనుగుణంగా మార్పులు చోటు చేసుకుంటాయి." అని అన్నారు. దీంతో ప్రతిపక్షాలు గురుగ్రంథ సాహెబ్, ఖురాన్, బైబిల్ కూడా చేరిస్తే విద్యార్థులు మరిన్ని నేర్చుకునే అవకాశంతో పాటు రాజ్యంగ స్ఫూర్తి కూడా నెరవేరుతుందంటూ వ్యంగ్యాస్తాలు కురిపించారు. (చదవండి: పర్యాటకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఇక అంతే !: రాజస్తాన్) -
రమ్య సోదరికి ఉద్యోగం.. ఇంటి స్థలం, ఐదెకరాల పంట భూమి
సాక్షి, అమరావతి: గుంటూరు నగరానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రమ్య తల్లిదండ్రులు గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఏపీ హోం మంత్రి సుచరిత రమ్య తల్లిదండ్రులను సీఎం వద్దకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో రమ్య సంఘటనను ఆమె తల్లిదండ్రులు సీఎం జగన్‌కి వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం తమకు 10 లక్షల పరిహారం అందించిందని తెలిపారు. రమ్య కుటుంబానికి పూర్తిగా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు. (చదవండి: గుంటూరులో పట్టపగలు దారుణం.. ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య) అనంతరం హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ‘‘గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని సీఎం జగన్ నేడు పరామర్శించారు. దారుణం జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి.. 7 రోజుల్లో ఛార్జ్ షీట్ వేశాం. రమ్య కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చాం. అంతేకాక రమ్య సోదరికి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలని సీఎం జగన్ నేడు ఆదేశించారు. దానితో పాటు వారి కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పంట భూమి అందించాలని తెలిపారు. మరో 10 రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్‌తో వాళ్ళు తనతో టీ తాగాలని సీఎం జగన్ అన్నారు’ అని సుచరిత తెలిపారు. ‘‘అనేక మందికి దిశా యాప్ ద్వారా భద్రత కలుగుతోంది. ఇంకా ప్రతి ఒక్కరికి యాప్, చట్టాలపై అవగాహన కల్పించాల్సి ఉంది. గ్రామంలో ఒకరిద్దరు దీన్ని వినియోగించుకున్నా సఫలం అయినట్లే’’ అన్నారు సుచరిత. చదవండి: హాస్టల్ పైనుంచి దూకి బీటెక్ స్టూడెంట్ మృతి, వీడియో వైరల్ -
గుంటూరులో పట్టపగలు దారుణం.. ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య
సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు ఈస్ట్: గుంటూరు నగరంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే యువకుడు కత్తితో పొడిచి యువతి ప్రాణాలు బలితీసుకున్నాడు. ఆపై అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు వివరాలు.. గుంటూరు నగరం కాకాని రోడ్డు పరమాయకుంటకు చెందిన నల్లపు వెంకట్రావు, జ్యోతి దంపతులకు మౌనిక, రమ్య(20) ఇద్దరు కుమార్తెలు. చేబ్రోలు సమీపంలోని సెయింట్ మేరీ‹స్ గ్రూప్ విద్యా సంస్థల్లో మౌనిక బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతుండగా, రమ్య కూడా అదే విద్యా సంస్థలో ఇంజనీరింగ్(బీటెక్) మూడో సంవత్సరం చదువుతోంది. వెంకట్రావు, జ్యోతి దంపతులు ఏడాది కిందట కొల్లూరు మండలం చిలుమూరులో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. మౌనిక, రమ్య ఇద్దరూ పరమాయకుంటలోని తమ నివాసంలో నాయనమ్మ పుష్పలీలతో కలిసి ఉంటున్నారు. వాగ్వాదం.. ఆ తర్వాత హత్య లాక్డౌన్ కారణంగా కళాశాలలు లేకపోవడంతో రమ్య గత కొన్ని నెలలుగా తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. అయితే పది రోజుల కిందట నాయనమ్మ వద్దకొచ్చింది. ఆదివారం చర్చికి వెళ్లే క్రమంలో బయటకు వెళ్లి టిఫిన్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఫోన్ రావడంతో నాయనమ్మతో.. ఇప్పుడే వస్తానంటూ సుమారు ఉదయం 10.20 గంటల సమయంలో రోడ్డు పైకొచ్చింది. మెయిన్ రోడ్‌పై బైక్‌పై ఉన్న కుంచాల శశికృష్ణతో కొంతసేపు మాట్లాడి అతడి బైక్ ఎక్కింది. ఇద్దరూ రోడ్డు అవతలి వైపునకు వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ రమ్య బలవంతంగా బైక్ దిగి రోడ్డుకు ఇవతలి వైపునకు వచ్చేసింది. ఆ యువకుడు కూడా బైక్‌పై రమ్య వద్దకు చేరుకున్నాడు. రమ్యతో వాదులాడుతూ కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత కత్తితో రమ్య మెడపై, పొత్తి కడుపులో ఆరు సార్లు పొడిచాడు. సమీపంలోని వ్యక్తి కేకలు వేయడంతో శశికృష్ణ బైక్‌పై ఆర్టీసీ బస్టాండ్ వైపు పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మౌనిక ఘటనా స్థలానికి చేరుకుని రమ్యను జీజీహెచ్‌కు తరలించింది. వైద్యులు రమ్యను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ జీజీహెచ్‌కు వచ్చి రమ్య మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. ఎవరూ అడ్డుకోలేదు.. రమ్య తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున జీజీహెచ్‌కు తరలివచ్చారు. బిడ్డ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు.. విగత జీవిగా ఉన్న రమ్యను చూసి తల్లడిల్లిపోయారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. తన చెల్లిపై దాడి చేసే సమయంలో చుట్టుపక్కల వారంతా కేకలు వేయడంతో సరిపెట్టుకున్నారని, అడ్డుపడి ఉంటే తన చెల్లి బతికేదని మౌనిక కన్నీళ్లపర్యంతమైంది. శశికృష్ణ పోలీసుల అదుపులో శశికృష్ణ రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. శశికృష్ణ తండ్రి గురవయ్య గుంటూరులో చేపల వ్యాపారం చేస్తుంటాడు. తండ్రిని బైక్‌పై దించేందుకే ఆదివారం శశికృష్ణ గుంటూరు వచ్చాడు. ఆ తర్వాత తల్లి భూలక్ష్మి వద్దకు వెళతానని తండ్రితో చెప్పాడు. శశికృష్ణ తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి ముప్పాళ్ల మండలంలోని గోళ్లపాడులో ఉంటోంది. నిందితుడు తల్లి దగ్గరకు వెళ్లి ఉంటాడన్న అనుమానంతో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ముప్పాళ్లలోని ఓ హెడ్ కానిస్టేబుల్ సాయంతో నిందితుడి కదలికలను తెలుసుకున్నారు. గోళ్లపాడుకు సమీపంలో.. నరసరావుపేట మండలం పమిడిపాడు పొలాల్లో తిరుగుతుండగా పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే పక్కనే ఉన్న కాల్వలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులతో కలిసి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు శశికృష్ణ తన దగ్గర ఉన్న చిన్నపాటి కత్తితో గొంతుకు ఓ వైపు కోసుకుని పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే నరసరావుపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి.. చికిత్స అందించి, తర్వాత గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం శశికృష్ణకు రమ్య ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైనట్టు తెలుస్తోంది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో మూడు నెలలుగా గొడవపడుతున్నారు. అర్బన్ పోలీస్ ఉన్నతాధికారులు నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. హత్య ఘటనపై సీఎం జగన్ ఆరా బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ప్రకటన సాక్షి, అమరావతి: గుంటూరులో యువతి రమ్య హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘దిశ’ కింద వేగంగా చర్యలు తీసుకుని దోషికి కఠిన శిక్ష పడేలా చేయాలన్నారు. ఘటన వివరాలు తెలియగానే హోం మంత్రి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని.. పరిహారంగా రూ.10 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఘటన దురదృష్టకరం గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఘటన దురదృష్టకరమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘గుంటూరు జిల్లా కాకానిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరం. విద్యార్థిని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది.’ అని ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. హత్య చేసిన వాడికి ఉరే సరైన శిక్ష హోం శాఖ మంత్రి సుచరిత గుంటూరు ఈస్ట్ : బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేసిన వ్యక్తికి ఉరే సరైన శిక్షని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ఆమె ఆదివారం జీజీహెచ్‌కు వచ్చి రమ్య మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులు వెంకట్రావు, జ్యోతిలను పరామర్శించి ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఘటన పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్టు చెప్పారు. హత్యకు ముందు యువతి నిందితుడితో ఘర్షణ పడినట్టు తెలుస్తోందన్నారు. ఏదైనా సమస్యలుంటే తల్లిదండ్రులతో మాట్లాడి పరిష్కరించుకోవాలేగానీ హత్య చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళను చంపే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రమ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న హోం మంత్రి సుచరిత, మేయర్ మనోహరనాయుడు, ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఎన్ని చట్టాలొచ్చినా, వాటిని కఠినంగా మార్చినా ఉన్మాదులు దారుణాలకు తెగబడుతూనే ఉన్నారని, ఇలాంటి వారిని ఏ విధంగా శిక్షించాలో.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారని, ఇప్పటికే ఆధారాలు సేకరించినట్టు హోం మంత్రి స్పష్టం చేశారు. రమ్య సెల్‌ఫోన్‌ను అన్‌లాక్ చేస్తే మరింత సమాచారం తెలుస్తుందన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రమ్య మృతదేహాన్ని జీజీహెచ్‌లో రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సందర్శించారు. రమ్య తల్లిదండ్రులను ఓదార్చారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు యువతి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామన్నారు. దోషికి కఠిన శిక్ష పడేలా చేస్తాం : డీజీపీ రమ్య హత్య కేసులో నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని, అతని నేరాన్ని నిరూపించి కఠిన శిక్ష పడేలా చేస్తామని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. ఈ హత్య అత్యంత దురదృష్టకరమని అన్నారు. స్థానికులు ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని అందించారని ఓ ప్రకటనలో తెలిపారు. -
విజయవాడలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, విజయవాడ: నగరంలో ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తరుణ్ అనే యువకుడు కొట్టడం వల్లే చనిపోయిందని బంధువులు అంటున్నారు. ప్రేమ పేరుతో తరుణ్ మోసం చేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. యువతిని కొన్ని రోజులుగా తరుణ్ తన గదిలోనే ఉంచాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈనెల 23న యువతిని ఆస్పత్రిలో చేర్చి తరుణ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో తరుణ్ పనిచేస్తున్నాడు. విద్యార్థిని స్వస్థలం పశ్చిమ గోదావరిజిల్లా టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామం. -
Campus Interview: క్యాంపస్‌లోనే కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇంజనీరింగ్ చేసిన వారికి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పెద్దసంఖ్యలో లభించాయి. ముఖ్యంగా ప్రముఖ విద్యా సంస్థల్లో చదివినవారికి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. దేశంలో ఏఐసీటీఈ అనుబంధ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2018–19 సంవత్సరంలో 1.03 లక్షల మంది చదవగా, అందులో 46.09 శాతం మంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు పొందినట్లు కేంద్రం తెలిపింది. అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అదే ఏడాది 7.01 లక్షల మంది చదవగా, 53.52 శాతం మంది ఉద్యోగాలు పొంది నట్లు పేర్కొంది. క్యాంపస్ ఇంటర్వ్యూలు కాకుండా ఇతర పద్ధతుల్లోనూ ఉద్యోగావకాశాలు వస్తున్నాయని వివరించింది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే ఉద్యోగాలు పొందినవారి శాతం గణనీయంగా పెరగడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. వడబోత తర్వాతే నియామకాలు స్వదేశీ, విదేశీ కంపెనీలు నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను వెతికి పట్టుకొని ఉద్యోగాలు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చే ర్యాంకుల ఆధారంగా కంపెనీలు కాలేజీలను ఎంపిక చేసుకుని క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇంటర్వ్యూలు నిర్వహించేప్పుడు కంపెనీలు వివిధ దశలుగా వడబోత కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఆ తర్వాతే ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిభ కనబర్చే వారికే అవకాశాలు దక్కుతున్నాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. ఏ దశలో వెనుకబడినా అభ్యర్థులకు అవకాశాలు కల్పించడం లేదని ఆయన తెలిపారు. క్యాంపస్ ఇంటర్వ్యూలతోపాటు తమ కంపెనీల వద్దకే కాలేజీ విద్యార్థులను పిలిపించుకొని, ఉద్యోగాల కోసం వారిని వివిధ పద్ధతుల్లో పరీక్షిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో చదువులపై శ్రద్ధ పెట్టకుండా కేవలం ఫీజులు, రీయింబర్స్మెంట్ సొమ్ము కోసమే పనిచేసే కొన్ని కాలేజీల్లో చదివిన విద్యార్థుల పరిస్థితి మాత్రం నిరాశాజనకంగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కరోనా కాలంలో ఉద్యోగావకాశాలు తగ్గినట్లు వారు తెలిపారు. కరోనా సమయంలో చివరి రెండేళ్లు చదివిన విద్యార్థులు క్లాసులు లేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోలేకపోయారని అంటున్నారు. ఈ పరిస్థితి వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బ తీసిందని వివరిస్తున్నారు. -
బైక్‌తో బీటెక్ విద్యార్థి బీభత్సం.. 8 నెలల నిండు గర్భిణిని
హైదరాబాద్: మియాపూర్‌లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బైక్‌తో బీభత్సం సృష్టించాడు. అతి వేగంతో 8 నెలల గర్భిణి అయిన భానోత్ అచ్చిబాయిని బైక్‌తో డీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అచ్చిబాయికి ప్రమాదం తప్పినా.. గర్భం శోకం తప్పలేదు. ఆమెకు అబార్షణ అయినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు మియాపూర్ పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే విద్యార్థి బైక్ నడిపినట్టు పోలీసులు గుర్తించారు. చదవండి:అమెరికాలో మియాపూర్ వాసి మృతి -
‘బిడ్డా... లే నాన్న... నువ్వు తప్ప మాకు దిక్కెవరే..’
అనంతపురం విద్య: ఒక్కగానొక్క కొడుకు.. తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కూలి పనులతో పొట్ట పోసుకుంటున్నా.. ఏనాడూ తమ బిడ్డకు తక్కువ చేయలేదు. తమ కష్టం బిడ్డకు రాకూడదనుకున్నారు. ఈ క్రమంలోనే తమ స్థాయికి మించి ఉన్నత విద్యాబద్ధులు చెప్పించసాగారు. మరో ఏడాదిలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడతాడనుకుంటున్న తరుణంలో విధి వక్రీకరించింది. తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. రెండు రోజుల క్రితం తమతో కలిసి ఎంతో ఉత్సాహంగా గడిపిన బిడ్డ కంటికి కానరాని లోకాలకు వెళ్లిపోయాడనే విషయం తెలియగానే ఈ నిరుపేద దంపతుల గుండె చెరువైంది. ‘అమ్మా.. ఇంకొక్క సంవత్సరం.. ఇంజినీరింగ్ పూర్తవుతుంది. తర్వాత ఉద్యోగం చేసి మీ ఇబ్బందులన్నీ తీరుస్తా..’ అన్న కుమారుడి చివరి మాటలు చెవుల్లో మారుమోగుతుండగా.. ‘బిడ్డా... లే నాన్న... నీవు తప్ప మాకు దిక్కెవరే.. ఉద్యోగం చేస్తానంటివి కదయ్యా... లే అయ్యా.. మా కంటి ముందు నీవుంటే చాలయ్యా’ అన్న తల్లిదండ్రులు రోదనలు విన్న విద్యార్థి లోకం కన్నీటి పర్యంతమైంది. ఏం జరిగిందంటే.. అనంతపురం రూరల్ మండలం నరసనాయకుంట గ్రామానికి చెందిన మల్లికార్జున, సత్యమ్మ దంపతులు. వీరి ఒక్కగానొక్క కుమారుడు బి.అబ్రçహాం. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్న మల్లికార్జున దంపతులు... ఈ కష్టాలు తమ బిడ్డకు రాకూడదని భావించారు. ఈ క్రమంలోనే తమ శక్తికి మించి విద్యాబుద్ధులు చెప్పిస్తూ వచ్చారు. ప్రస్తుతం అబ్రçహాం... ఎస్కేయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉగాది పండుగకు ఊరికి వెళ్లి తల్లిదండ్రులతో సంతోషంగా గడిపి బుధవారం రాత్రి తిరిగి వర్సిటీకి అబ్రహాం చేరుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్న బి. అబ్రహాం (20) గురువారం ఉదయం జిమ్‌లో వర్క్అవుట్ ముగించుకుని హాస్టల్‌కు చేరుకున్నాడు. టిఫెన్ చేసిన తర్వాత ఛాతిలో నొప్పిగా ఉందంటూ ఎస్కేయూ హెల్త్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఈసీజీ తీస్తుండగానే భరించలేని నొప్పితో విలవిల్లాడుతూ కన్నుమూశాడు. తీవ్రమైన గుండెపోటుతో అతను మరణించినట్లు హెల్త్ సెంటర్ వైద్యులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న నిరుపేద తల్లిదండ్రులు ఆగమేఘాలపై హెల్త్ సెంటర్ వద్దకు చేరుకుని బోరున విలపించారు. తమ బిడ్డ జ్ఞాపకాలను, అతని చివరి మాటలను గుర్తు చేసుకుంటూ వారు రోదించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది. చదవండి: చిన్నారి వైద్యం కోసం వెళ్తూ.. -
పేట్ బషీరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యార్ధి అనుమానాస్పద మృతి
-
హాస్టల్ పైనుంచి దూకి బీటెక్ స్టూడెంట్ మృతి, వీడియో వైరల్
సాక్షి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్‌లోచంద్రిక అనే ఇంజనీరింగ్ విద్యార్ధి అనుమానాస్పదంగా మృతి చెందింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో యువతి నాలుగో సంవత్సరం చదువుతోంది. చంద్రిక స్వస్థలం మిర్యాలగూడ. కాగా ప్రస్తుతం మైసమ్మగూడలోని కృప వసతి గృహంలో ఉంటోంది. హాస్టల్ భవనం పైనుంచి దూకి చంద్రిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా యువతి చంద్రిక ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై డీసీపీ పద్మజ మాట్లాడుతూ..'కృప హాస్టల్ పక్కన యువతి మృతదేహాం ఉందని మంగళవారం ఉదయం 8.15 కి స్థానిక కౌన్సిలర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. యువతిని మిర్యాలగూడకు చెందని చంద్రికగా గుర్తించాం. ఆమెకు బాక్‌ల్యాగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా తర్వాత ఇటీవల సీటీకి వచ్చిన చంద్రిక ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతుంది. చదువులో వెనకబడి ఉన్నానన్న మసస్తాపంతో యువతి బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. అనుమానస్పద మృతి కేసు నమోదు చేసుకున్నాం. సీసీ కెమెరాలు, చంద్రిక ఫోన్ డేటా పరిశీలిస్తున్నాం'అని ఆమె పేర్కొన్నారు. చదవండి : పెద్దలకు ఇష్టం లేకపోయినా ప్రేమ పెళ్లి.. నాలుగు నెలల్లోనే... వయసు 26.. కేసులు 20 -
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
హుజూరాబాద్: పుట్టిన రోజే ఆ యువకుడికి ఆఖరి రోజైంది. బర్త్ డే సందర్భంగా స్నేహితులతో కలిసి డిన్నర్ చేసి వస్తానని చెప్పి, ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో మృత్యు ఒడికి చేరిన విషాద ఘటన హుజూరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హుజూరాబాద్ పట్టణంలోని ఆరెవాడకు చెందిన రాజూరి రాజు–అనిత దంపతుల కుమారుడు మణిదీప్ (22) మండలంలోని సింగాపూర్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం తన పుట్టినరోజు కావడంతో మణిదీప్‌తోపాటు పట్టణానికి చెందిన అతని స్నేహితులు శివనాథుని సంకీర్త్, కటకం గోపీచంద్, గర్రెపల్లి సాయిచరణ్, మేరుగు రోహిత్‌లు కారులో ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్‌పేట సమీపంలో గల ఓ దాబాకు బయలుదేరారు. పర్కాల్ క్రాస్ రోడ్ సమీపంలో హుజూరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేశారు. ఈ క్రమంలో ఎదురుగా వేగంగా వస్తున్న మరో లారీని ఢీకొట్టడంతో కారు ముందు సీట్లో కూర్చున్న మణిదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంకీర్త్, గోపిచంద్, సాయిచరణ్‌లకు తీవ్ర, రోహిత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వారి కుటుంబీకులు వరంగల్ తీసుకెళ్లారు. అయితే ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మణిదీప్ తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ మాధవి తెలిపారు. చదవండి : (పాకిస్తాన్లో హిందూ కుటుంబం దారుణ హత్య!) (నగ్న వీడియోలు: వ్యాపారవేత్తను ఇంటికి పిలిచి..) -
ఈ సైకిల్.. స్పీడ్ 80 మైలేజీ 90
సాక్షి, చిత్తూరు: కాలుష్య నివారణకు ఉపయోగపడే ఈ (ఎలక్ట్రిక్ ) బైసైకిల్‌ను సొంతంగా రూపొందించారు చిత్తూరు జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అమర్నాథ్. దామలచెరువు మండలానికి చెందిన కృష్ణమూర్తి, షకీల దంపతుల కుమారుడు అమర్నాథ్ సిక్కిం నీట్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన తను ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. రూ.80 వేలు వెచ్చించి పర్యావరణహిత ఈ–బైసైకిల్‌ను తయారు చేశారు. దీని వివరాలను అమర్నాథ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. మొదట గేర్ సైకిల్‌ను కొనుగోలు చేసి, గేర్లు తొలగించానన్నారు. ఆన్లైన్లో పలు వెబ్సైట్లు, కంపెనీల నుంచి విడిభాగాలు, బ్యాటరీ కోనుగోలు చేశానన్నారు. మొదటిసారి ప్రయోగం కాబట్టి ఖర్చు ఎక్కువ అయిందని, కంపెనీలు సహకారం అందిస్తే మరింత తక్కువ ధరకే వినియోగదారులకు వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. ఈ బైసైకిల్ ప్రత్యేకతలు.. ►మోటార్‌కు 72 వాట్స్ డీసీ పవర్ చార్జింగ్ కనెక్షన్ ►గంటకు 80 కిలోమీటర్ల వేగం ►రెండు గంటలు చార్జింగ్ చేస్తే 90 కిలోమీటర్లు నడుస్తుంది ►బ్యాటరీ చార్జింగ్ అయిపోతే ఫెడల్ సాయంతో తొక్కే సౌలభ్యం -
దారుణం: ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై అత్యాచారం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్ధినిని పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడో ఆటో డ్రైవర్. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. సీఎమ్ఆర్ కాలేజీకి చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధిని సాయంత్రం కాలేజీనుంచి ఇంటికి తిరిగొస్తోంది. జీడిమెట్ల వద్దకు రాగానే కాపు కాసిన ఓ ఆటోడ్రైవర్ ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బట్టలు లేకుండా ఉన్న ఆమెను రోడ్డుపైన వదిలేసి వెళ్లాడు. నగ్నంగా ఉన్న ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని మేడపల్లిలోని క్యూర్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. చదవండి : అప్పు.. అక్రమ సంబంధం.. ఓ హత్య -
పేడ ఎత్తేందుకూ ఓ మెషీన్!
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ శ్రమ, ఖర్చును తగ్గిస్తూ అనేక ఆవిష్కరణలు పురుడు పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాడి రైతులు, డెయిరీ ఫారాల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారంగా ‘ఆటోమేటెడ్ డంగ్ క్లీనర్’రూపుదిద్దుకుంటోంది. టైమ్ సెట్ చేసి వదిలేస్తే... నిర్ధారిత సమయానికి పేడను ఎత్తివేసి పశువుల షెడ్డును శుభ్రం చేసేస్తుంది. ప్రయోగస్థాయిలోనే పలువురి ప్రశంసలు పొందిన ఈ నూతన ఆవిష్కరణ త్వరలో పూర్తిస్థాయిలో పాడి రైతులు, డెయిరీ ఫారాల నిర్వాహకులకు అందుబాటులోకి రానున్నది. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ, కృషికి ఫలితమిది. పాడి పరిశ్రమను చేపట్టిన రైతులు, వ్యాపారవేత్తలు డెయిరీ రంగంలో కూలీల కొరతను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా బిహార్, ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తోంది. షెడ్ల నుంచి పేడను ఎత్తి శుభ్రం చేయడం ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ‘డంగ్ క్లీనర్’యంత్రాన్ని రూపొందించారు. డంగ్ క్లీనర్ ప్రోటోటైప్ యంత్రానికి ఇప్పటికే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, స్థానిక జిల్లా అధికారుల ప్రశంసలు దక్కాయి. పని చేస్తుందిలా... ►ఇది చక్రాలతో పశువుల కొట్టం అంతటా తిరుగుతూ రోబోటిక్ చేతుల సాయంతో పేడను ఎత్తుతుంది. ►ఎత్తిన పేడను ఓ కంటెయినర్లో నింపుకుని నిర్ణీత పరిమాణంకు చేరుకున్న తర్వాత సమీపంలోని కంపోస్ట్ పిట్‌కు చేరవేస్తుంది. ►మీథేన్ గ్యాస్ ఆధారంగా పేడను గుర్తించేలా ఇందులో సెన్సర్లను అమర్చారు. ►యంత్రంలోని రియల్ టైమ్ క్లాక్ ఆధారంగా ఏ సమయంలో షెడ్‌ను క్లీన్ చేయాలో ముందుగానే టైమ్‌ను సెట్ చేయొచ్చు. ►విద్యుత్ చార్జింగ్‌తో పనిచేస్తుంది.రూ.100 నుంచి 150 పశువులున్న డెయిరీని దాదాపు నాలుగు గంటల్లో శుభ్రం చేయగలదు. -
ఇంజనీరింగ్ విద్యార్థులకు విప్రో గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో 2021లో ఇంజనీరింగ్ పూర్తి చేయనున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2021 ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా మంచి టాలెంట్ ఉన్న ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇవ్వబోతోంది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి స్ట్రీమ్స్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్లైన్ పరీక్ష, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వార్షిక వేతనం రూ.3.50 లక్షలుగా ఉంటుందని విప్రో తెలిపింది. ఈ మేరకు విప్రో ట్విటర్ ద్వారా వివరాలను షేర్ చేసింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలు manager.campus@wipro.com లో లభ్యం. .@Wipro's Elite National Talent Hunt 2021 #NTH is a #FresherHiring program to attract the best #engineering talent in India. If you are a student graduating in 2021, this is an opportunity for you to kickstart your #career: https://t.co/Gw1oljWlaS#IndiaJobs #WiproJobs pic.twitter.com/RlCtOxmtth — Wipro Limited (@Wipro) December 10, 2020 -
నా పరిస్థితి ఏమిటి?
సాక్షి, హైదరాబాద్ : క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా కొలువులకు ఎంపిౖకైన 14 వేల మంది ఇంజనీరింగ్ కాలేజీల ఫైనలియర్ విద్యార్థులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీరుతో ఉసూరు మంటున్నారు. కరోనా మహ మ్మారి విజృంభణతో ఓవైపు లక్ష లాది మంది ఉపాధి కోల్పోతున్న వేళ అందివచ్చిన ఉద్యోగాల్లో చేరేందుకు డిగ్రీ పట్టా లేకపోవ డం అడ్డంకిగా మారడంతో ఆవే దన చెందుతున్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, బిట్స్ పిలానీ, డీమ్డ్ వర్సిటీల్లో చదివి క్యాంపస్ కొలువులకు ఎంపికైన బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు ఇప్పటికే ఉద్యోగాల్లో చేరి పోగా యూజీసీ పరిధిలోని ఇంజ నీరింగ్ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు మాత్రం క్యాంపస్ ప్లేస్మెంట్లు పొందినా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. డిగ్రీ సర్టిఫికెట్లు సమర్పించా లంటూ ఉద్యోగాలిచ్చిన కంపెనీలు పంపుతున్న లేఖలకు బదులివ్వలేక తలపట్టుకుంటున్నారు. యూజీసీకి ఎందుకీ మొండిపట్టు.. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, డీమ్డ్ వర్సిటీలు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థులకు సర్టిఫి కెట్లు ఇచ్చేశాయి. కొన్ని కాలేజీలు అయితే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చి విద్యా ర్థులను ప్రమోట్ చేసి పాస్ సర్టిఫికెట్లు ఇచ్చేశాయి. మరోవైపు కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధి లోని ఇంజనీరింగ్ కాలేజీల ఫైనలియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందేనని యూజీసీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే యూజీసీ వైఖరిని తప్పుపడుతూ పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభు త్వానికి లేఖలు రాశాయి. యూజీసీ నిర్ణయం అసం బద్ధమంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఏపీ, తెలంగాణ ప్రభు త్వాలు మాత్రం వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వ హిస్తామని ప్రకటిం చాయి. కానీ కరోనా ఉధృతమైతే పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని, తమకు వచ్చిన ఉద్యోగాలు పోతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. స్పష్టత కరువు... రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజీలు ఇంటర్నల్ మార్కులు లేదా ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తే వారు ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిపోయేవారని, యూజీసీ మొండి పట్టుదల కారణంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఓ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ వ్యాఖ్యానించారు. ‘ఎన్ఐటీలు నామమాత్రంగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాయి. డీమ్డ్ వర్సిటీలు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేశాయి. వాళ్లకు లేని నిబంధన ఇంజనీరింగ్ కాలేజీలకు ఎందుకు? ఒకవేళ పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై స్పష్టత లేదు. కరోనా తగ్గుముఖం పడితే గానీ సాధ్యం కాదు. పరీక్షలు నిర్వహించాక వ్యాల్యుయేషన్, ట్యాబులేషన్ వంటి వాటికి చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా విద్యార్థుల ఉద్యోగాలకు యూజీసీ గ్యారంటీ ఇస్తుందా? అని ఆ ప్రిన్సిపల్ ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణ, విద్యా సంవత్సరం కేలండర్ విషయంలో యూజీసీ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ‘ఫైనలియర్ విద్యార్థులకు మూడు సబ్జెక్టులే ఉంటాయి. అప్పటికే వారు ఏడు సెమిస్టర్లలో 35–40 సబ్జెకుŠట్లు చదివి పాసైన వారే. నా ఉద్దేశంలో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా వారిని పాస్ చేయవచ్చు’ అని మాజీ వైస్ చాన్స్‌లర్ అభిప్రాయపడ్డారు. నా పరిస్థితి ఏమిటి? ‘నన్ను ఓ కార్పొరేట్ కంపెనీ రూ. 28 లక్షల వార్షిక వేతనానికి నియమించుకుంది. డిగ్రీ సర్టిఫికెట్ కాపీలు పంపాలని ఇప్పటికే పలుమార్లు మెయిల్ పంపింది. తాజాగా అక్టోబర్ 31 వరకు డెడ్‌లైన్ పెట్టింది. అప్పటికీ నా చేతికి సర్టిఫికెట్ రాకపోతే నేను మళ్లీ ఆ ఉద్యోగం సాధిస్తానా? కరోనా నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకు నిద్రపట్టట్లేదు’ అని ఓ ప్రతిష్టాత్మక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఫైనలియర్ ఇంజనీరింగ్ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. యీజీసీ ఇప్పటికైనా పరీక్షల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలివేయాలని లేకుంటే పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యమై విద్యార్థులు నస్టపోతారని ఓ ప్రైవేట్ కాలేజీ ప్లేస్మెంట్ డైరెక్టర్ పేర్కొన్నారు. -
అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాలి
-
‘దిశ పీఎస్‌లో ఎలాంటి ఒత్తిళ్లు లేవు’
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకు వచ్చిన దిశ పోలీస్ స్టేషన్ల వల్ల మెరుగైన ఫలితాలు కన్పిస్తున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. దిశ పీఎస్‌లో ఎలాంటి ఒత్తిళ్లు లేదని పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం చేయడం, దోషులకు శిక్ష వేయించటమే పని అని తెలిపారు. గుంటూరు ఇంజనీరింగ్ విద్యార్థి కేసులో పోలీసులు వెనువెంటనే స్పందిచారని ఆమె తెలిపారు. కానీ స్టూడెంట్స్ స్థాయిలో ఇలా జరగటం దారుణమన్నారు. కాగా ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం గుంటూరు పట్టణంలో శనివారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. తోటి విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ వీడియోలు చిత్రీకరించిన ఇద్దరు యువకులు.. వాటిని అడ్డుపెట్టుకుని కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టు వినకుంటే ఆ వీడియోలను వెబ్సైట్లో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. ఈక్రమంలో బాధితురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. (మరో ఇద్దరు యువతుల ప్రమేయం!) ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఈ ఘటనపై పోక్సో చట్టంతో పాటుగా ఇతర కేసులు కూడా పెట్టినట్లు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు ఉంటాయన్నారు ఏఐపీ అడ్రస్ ద్వారా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుని తల్లిదండ్రులు పోలీసుశాఖకు చెందిన వారే అయినప్పటికీ నిందితుడిని అరెస్టు చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఎవరి ఒత్తిళ్లు తమపై లేవని స్పష్టం చేశారు, త్వరలో మరికొందరిని అరెస్టు చేస్తామని వెల్లడించారు. -
మర్డర్ కేసు.. మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు
-
మర్డర్ కేసు.. మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు
లక్నో: గోమతి నగర్లో బీటెక్ విద్యార్థిని దారుణంగా హతమార్చిన ఘటనలో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే షంషేర్ బహదూర్ కుమారుడి ప్రమేయం ఉన్నట్టు తెలిసింది. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు అమన్ బహదూర్ సహా మిగతా నిందితుల్ని అరెస్టు చేశారు. వివరాలు.. స్నేహితుడిని కలవడానికి ప్రశాంత్ సింగ్ (23) అనే ఇంజనీరింగ్ విద్యార్థి కారులో గురువారం సాయంత్రం గోమతి నగర్‌కు వెళ్లాడు. అక్కడ అలకనంద అపార్ట్మెంట్ వద్దకు చేరుకోగానే మాటు వేసిన 20- 25 మంది దుండగులు తొలుత కారు అద్దాలను ధ్వసం చేశారు. అనంతరం ప్రశాంత్ ఛాతీలో పలుమార్లు కత్తితో పొడిచి పరార్ అయ్యారు. (చదవండి : బీటెక్ విద్యార్థి దారుణ హత్య) ఈ క్రమంలో కారు దిగిన బాధితుడు అక్కడినుంచి స్నేహితుడి అపార్టుమెంటులోకి పరుగెత్తుకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు అపార్టుమెంటు వద్దకు వెళ్లి పరిశీలించగా... ప్రశాంత్ సింగ్ రక్తపు మడుగులో కనిపించాడు. హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. హత్యోందంతం దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీ కెమెరాలో నమోదవడంతో వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. శుక్రవారం ఉదయం నిందితుల్ని అరెస్టు చేశారు. ఇక బుధవారం రాత్రి జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓ బర్త్‌డే పార్టీకి హాజరైన ప్రశాంత్.. అక్కడ తన జూనియర్‌తో గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. -
కోర్సు వారమే.. ఇంజనీరింగ్ విద్యార్థుల ఆసక్తి
సాక్షి, సోమాజిగూడ: సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఎన్నివచ్చినా..హ్యామ్ రేడియోకి ఆదరణ తగ్గలేదని చెప్పొచ్చు. ఇప్పటి తరం వారిలో చాలా మందికి హ్యామ్ రేడియో గురించి అంతగా తెలియక పోయినా..తుపాను..వరదల సమయంలో హ్యామ్ రేడియో పాత్రను మనం మరవలేము. సెల్‌ఫోన్ సిగ్నల్ లేని చోట సైతం హ్యామ్ రేడియో ప్రతినిధులు సమాచారాన్ని చేరవేస్తారు. విద్యార్హతతో సంబంధం లేకుండా 12 ఏళ్లు పైబడిన వారు ఈ కోర్సు నేర్చుకోవచ్చు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ప్రొసీజర్‌పై వారం పాటు నిర్వహించే కోర్సుకు పరీక్ష అనంతరం ఉత్తీర్ణత సాధించిన వారికి భారత్ ప్రభుత్వం(డీఓటీ) లైసెన్స్ మంజూరు చేస్తుంది. నామమాత్రపు ఫీజు.. ఈ కోర్సు చేయాలను కున్న వారికి వయస్సుతో సంబంధం లేదు. 12 ఏళ్లు పైబడిన వారు కోర్సును పూర్తి చేసి అమెచ్యూర్ రేడియో ఆపరేటర్ కావచ్చు. ఒకప్పుడు వీఐపీలు మాత్రమే అమెచ్యూర్ రేడియోను వినియోగించేవారు. సెల్పోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు లేని కాలంలో అత్యాధునిక వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థగా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతమున్న కమ్యూనికేషన్ రంగానికి హ్యామ్ రేడియో మూలమని చెప్పవచ్చు. పుస్తకం విడుదల.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ అమెచ్యూర్ రేడియో వ్యవస్థాపకుడు ఎస్.సూరి దీనిపై ఆల్ ఎబౌట్ అమెచ్యూర్ రేడియో అనే పుస్తకాన్ని రచించారు. అమెచ్యూర్ రేడియో కోర్సు పట్ల ఉన్న ఉపయోగాన్ని ఆయన తన రచన ద్వారా వివరించారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో భారత్ ఉప రాష్ట్ర పతి దానిని ఆవిష్కరించినట్లు సంస్థ నిర్వాహకులు చెప్పారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్గా... ♦ ఇంజినీరింగ్ ఈసీఈ విద్యార్థులు హ్యామ్ రేడియో కోర్సును ప్రాజెక్టు వర్కుగా చేస్తున్నారు. ఆయా కళాశాలలు ఇంటర్నషిప్ కోసం నగరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెచ్చూర్ రేడియో కార్యాలయంలో శిక్షణ ఇపిస్తున్నారు. రాజ్‌భవన్ రోడ్డులోని ఈ కార్యాలయంలో ఎంతో మంది శిక్షణ పొంది లైసెన్సులు పొందినట్లు సంస్థ వ్యవస్థాపకుడు ఎస్.సూరి తెలిపారు. ♦ కూర్చున్న చోటనుంచే ఏదేశంవారితోనైనా మాట్లాడొచ్చు ♦ అమెచ్యూర్ ఆపరేటర్ ఏదేశంలోనున్నా కూర్చున్న చోటనుంచే వారితో మాట్లాడొచ్చు. ఎటువంటి విద్యుత్, కమ్యూనికేషన్ నెట్వర్క్ లేని ప్రాంతం నుంచి కూడా సమాచారం పంపొచ్చు. ♦ వరదలు, తుపాన్, భూకంపం వంటివి వచ్చినప్పుడు హ్యామ్ రేడియో ఎంతో ఉపయోగ పడుతోంది. ♦ అమెచ్యూర్ రేడియో అడ్వాన్స్ డిజిటల్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ ద్వారా ఇంటర్నెట్ వినియోగించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 3.5 మిలియన్లకు పైగా ఉన్న హ్యామర్స్‌తో మాట్లాడుతోవచ్చు. ♦ కోర్సుపై ఆసక్తి చూపుతున్న యువత ♦ అమెచ్యూర్ (హ్యామ్) రేడియో కోర్సు పట్ల యువత ఆసక్తి చూపుతోంది. కోర్సుతో వారికి అంతగా పనిలేకున్నా. హాబీగా చేసుకుంటున్నారు. వైర్లెస్ హ్యాండ్ సెట్లు చేతపట్టి అటుఇటుగా తిరగడం అదోఫ్యాషన్గా మారింది.పోలీసు స్టేషన్లో ఉండే వైర్లెస్ సెట్ల కంటే దీని ఫ్రీక్వెన్సీ అధికమని చెప్పవచ్చు. ఉత్తి రోజుల్లో అమెచ్యూర్ ఆమరేటర్లతో మాటాత్రమే మాట్లాడుకునే వారు.. ప్రకృతి విలయ తాండవం చేసినపుడు..సమాచార వ్యవస్థ చిన్నా భిన్నమైన సమయంలో తామున్నామంటూ అమెచ్యూర్ ఆపరేటర్లు ముందుకు వచ్చి దేశ సేవలో నిమగ్నమవుతున్నారు. -
విద్యార్థిని ఆత్మహత్య.. 3 పేజీల సూసైడ్ నోట్
చెన్నై, సేలం: ఓమలూరులో ఇంజినీరింగ్ విద్యార్థిని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది. సేలం జిల్లా ఓమలూరు సమీపంలో పెరియార్ యూనివర్సిటీ ఉంది. ఓమలూరులో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం విషయం తెలిసి కళాశాల నిర్వాహకులు కరుప్పూర్ పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న సూర మంగళం ఇన్స్పెక్టర్, సేలం డిప్యూటీ కమిషనర్ తంగదురై, అసిస్టెంట్ కమిషనర్ సెల్వరాజ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. విచారణలో విద్యార్థిని ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టికి చెందిన తిరుమలై కుమార్తె నివేద అని, ఆమె ఆ కళాశాలలో పీహెచ్డీ రెండో సంవత్సరం చదువుతున్నట్టు తెలిసింది. ఆమె మృత దేహం వద్ద మూడు పేజీల సూసైడ్ నోట్ చిక్కినట్లు సమాచారం. అనంతరం పోలీసులు నివేద మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ విభాగం హెచ్ఓడీ ఒక విద్యార్థినితో రాసలీలలు సాగించినట్లు ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసినట్టు తెలిసింది. దీంతో సూరమంగళం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
కేపీహెచ్‌బీకాలనీ: కూకట్పల్లి జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో మెటలర్జికల్ ఇంజనీరింగ్ (బీటెక్)లో పి.సందీప్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతీయేడు సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో 75శాతం అటెండెన్స్ ఉన్న విద్యార్థులను మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఇందులో భాగంగా అటెండెన్స్ తక్కువగా ఉన్న విద్యార్థులను డిటెండ్ లిస్టులో చేర్చారు. సందీప్ 55శాతం అటెండెన్స్ తో డిటెండ్ అయ్యాడు. తన అటెండెన్స్ ను పెంచాలని ప్రిన్సిపాల్, అధ్యాపకులపై అతను ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు వారు అంగీకరించకపోవడంతో బుధవారం మరికొందరు విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులతో కలసి ప్రిన్సిపల్ సాయిబాబారెడ్డి చాంబర్‌కు వెళ్లి అటెండెన్స్్స పెంచి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కోరాడు. అందుకు ప్రిన్సిపాల్ నిరాకరించడంతో విద్యార్థులతో ఆందోళనకు దిగాడు. ఆందోళనకు దిగిన సందీప్ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకోవడంతో తోటి విద్యార్థులు అడ్డుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకొని క్యాంపస్ హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్లి పరీక్షల అనంతరం పోలీస్‌స్టేష కు తరలించారు. సెమిస్టర్ పరీక్షలకు ముందు డిటెండైన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తామని, వెబ్సైట్లోనూ పెడతామని దీంట్లో మార్పుచేర్పులకు తావులేదని ప్రిన్సిపాల్ సాయిబాబారెడ్డి తెలిపారు. గత నెలలో కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేయడంతో ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశానని, ఆ సంఘటనను మనసులో పెట్టుకొని తనపై కావాలనే కుట్రచేసి డిటెండ్ చేశారని సందీప్ ఆరోపించాడు. -
ఇంజినీరింగ్ విద్యార్థి గదిలో గంజాయి
సాక్షి, రాజాం : నగర పంచాయతీ పరిధి డోలపేటలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఉంటున్న గదిలో బుధవారం గంజాయి లభ్యమైంది. విద్యార్థుల ప్రవర్తనలో వస్తున్న మార్పులను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పట్టణ సీఐ జి.సోమశేఖర్ తన సిబ్బందితో దాడి చేశారు. విద్యార్థి తన బ్యాగ్‌లో దాచుకున్న కిలో 25 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. డోలపేటలో నివాసం ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థి మత్తుకు బానిసై డోలపేటలో ఉంటున్న మరో వ్యక్తి మండల శ్రీనుని ఆశ్రయించాడు. దీంతో వారిరువురు కిలో 25 గ్రాముల గంజాయిని తెచ్చుకుని వారు సేవించడంతోపాటు మరికొంత విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో స్థానికులు అందించిన సమాచారం మేరకు వారి రూమ్‌ను సోదా చేశామని సీఐ తెలిపారు. గంజాయితోపాటు వారిరువురిని అదుపులోకి తీసుకుని తహశీల్దార్ ఎదుట ప్రవేశపెట్టామని చెప్పారు. తహశీల్దార్ ఆదేశాల మేరకు రిమాం డ్ పంపిస్తున్నట్లు తెలిపారు. అన్ని తరగతుల్లో మెరిట్ స్టూడెంట్‌గా ఉన్న విద్యార్థి ఇలా గంజా యి వ్యవహారంలో పట్టుబడడంతో తోటి విద్యార్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజాంకు పాకిన గంజాయి వ్యాపారం నిన్న మొన్నటి వరకు పీడించిన క్రికెట్ బెట్టింగ్‌లు, కబడ్డీ బెట్టింగ్‌లతోపాటు ప్రస్తుతం గంజాయి మత్తు కూడా యువతను ఆవరించింది. మత్తుకు అలవాటు పడిన విద్యార్థులు ఎలాగైనా గంజాయిని తెప్పించుకుని వాడుతున్నారు. గతంలో గంజాయి విక్రేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని మందలించారు. అయినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు రాకపోగా విద్యార్థులపై వారి కన్నుపడింది.దీంతో విద్యార్థులే టార్గెట్‌గా చేసుకొని గంజాయి విక్రయాలు జరుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. దీనిపై పోలీసులు నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు. నిఘా పెంచాం: సీఐ సోమశేఖర్ డోలపేటలోనే ఎక్కువగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఎప్పుటికప్పుడు సమాచారం అందుతుండడంతో నిఘా మరింత పెంచామని పట్టణ సీఐ సోమశేఖర్ తెలిపారు. మండల శ్రీను గతంలో కూడా పట్టుబడడంతో మందలించామని, అయినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని, బుధవారం జరిపిన దాడిలో విద్యార్థితో కలసి మరోసారి పట్టుబడ్డాడని చెప్పారు. -
థ్యాంక్స్ టు జగనన్న
సాక్షి, తాళ్లరేవు (ముమ్మిడివరం): పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ కైట్ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థినులు శుక్రవారం అభినందన ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోగల కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సుమారు 1,500 మందికిపైగా విద్యార్థినులు ‘థాంక్యూ సీఎం, థాంక్యూ జగన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ పోతుల వెంకట విశ్వం మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కల్పించారన్నారు. ప్రస్తుతం ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద విద్యార్థుల చదువుకయ్యే ఖర్చును పూర్తిగా భరించడంతోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఇరవై వేలు ప్రకటించడం అభినందనీయమన్నారు. -
కెరీర్.. ఆకాంక్ష
రాయదుర్గం: ‘ఇంజినీరింగ్ చేసిన అమ్మాయిల్లో గ్లోబల్ టెక్ కెరీర్‌పై ఆకాంక్ష’ అనే అంశంపై ఓ నివేదికను గచ్చిబౌలిలోని టాలెంట్ స్ప్రింట్ బుధవారం విడుదల చేసింది. టాలెంట్ స్ప్రింట్ కంపెనీ చేపట్టిన విమెన్ ఇంజినీర్ (డబ్ల్యూఈ) ప్రోగ్రామ్‌కు దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 83 విశ్వవిద్యాలయాలకు చెందిన 7,276 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటి నుంచి తీసుకున్న గణాంకాలు, విశ్లేషణల ఆధారంగా సమాచారాన్ని క్రోడీకరించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను వడపోయడానికి డబ్ల్యూఈ ప్రోగ్రామ్‌లోకి 100 మందిని ఆహ్వానించడానికి బహుళ దశల్లో విస్తృతంగా చేపట్టిన ఎంపిక ప్రక్రియ ఉపయోగపడింది. దేశం నలుమూలల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి సమానమైన స్పందన రావడం విశేషం. అమ్మాయిల్లో గ్లోబల్ టెక్ కెరీర్‌పై ఉన్న ఆకాంక్షకు వారి తల్లిదండ్రుల విద్యా నేపథ్యానికి ఎటువంటి సంబంధం లేదని తేలింది. దరఖాస్తుదారుల్లో అధిక శాతం మంది స్వల్ప ఆదాయ కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చినవారు ఉండటం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ల నుంచి అధికంగా దరఖాస్తులు వచ్చాయి. నివేదిక వివరాలివీ.. ♦ దరఖాస్తుదారుల్లో 50 శాతం మంది నగరాలు, 28 శాతం పట్టణాలు, 22 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు ♦ 33 శాతం మంది తమ కుటుంబాల నుంచి పట్టభద్రులు మొదటి తరంగా నిలిచారు ♦ దరఖాస్తుదారుల్లో 83 శాతం మంది సంవత్సర ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారు ♦ 47 శాతం మంది సొంతంగా> నేర్చుకుంటున్నా వారికి ప్రపంచ సాంకేతిక పోకడలపై అవగాహన లేదు ♦ టెస్ట్ రాసిన దరఖాస్తుదారుల్లో 50 శాతం మంది క్వాంటిటేటివ్, లాజికల్ రీజనింగ్ పాసైనవారు ♦ టెస్ట్ రాసిన దరఖాస్తుదారుల్లో 34 శాతం మంది రైటింగ్ స్కిల్స్ అసెస్మెంట్లో పాసైనవారు ♦ టెస్ట్ రాసిన దరఖాస్తుదారుల్లో 40 శాతం మంది చాలెంజింగ్ కోడ్ రీడింగ్ అసెస్మెంట్ పాసైనవారు ♦ 31 శాతం మంది అడ్వాన్స్డ్ క్వాలిటీవ్ స్కిల్స్ అసెస్మెంట్ పాసైనవారు ♦ 20 శాతం మంది అన్ని అసెస్మెంట్లలో పాసైనవారు ♦ టెస్ట్ రాసిన ప్రతి అయిదుగురిలో ఒకరు అగ్రశ్రేణి గ్లోబల్ కెరీర్‌ను చేరుకోగలిగే శక్తిసామర్థ్యాలను కలిగి ఉన్నవారు ఈ సందర్భంగా టాలెంట్ స్ప్రింట్ సంస్థ సీఈఓ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ శంతన్‌పాల్ మాట్లాడుతూ.. టాలెంట్ స్ప్రింట్ అందిస్తున్న డబ్ల్యూఈ ప్రోగ్రామ్ ద్వారా రాబోయే మూడేళ్లలో గ్లోబల్ హైటెక్ కెరీర్ 600 మంది పట్టభద్రులైన ఇంజినీరింగ్ అమ్మాయిలను సిద్ధం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. -
అతివేగమే నలుగురిని బలి తీసుకుంది
-
అతి వేగం...దానికి తోడు మూల మలుపు..
సాక్షి, యాదాద్రి : బొమ్మలరామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులో గత రాత్రి జరిగిన ఘోర ప్రమాదానికి అతి వేగమే కారణమని స్పష్టమవుతోంది. దానికి తోడు మూల మలుపు. దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన మలుపు వద్ద బోల్తా పడినట్టు ఘటనా స్థలంలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రమాదంలో కారు తుక్కుతుక్కయింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి పరిస్థితి విషమంగా వుంది. వారంతా ఇబ్రహీంపట్నం శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా భావిస్తున్నారు. చదవండి...(రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థుల దుర్మరణం) బొమ్మలరామారంలోని ఓ పెట్రోల్ బంక్ ఆవరణలో వున్న ఓ ప్రైవేటు గెస్ట్‌హౌజ్‌లో అందరూ కలిసి పార్టీ చేసుకున్నారని తెలుస్తోంది. అనంతరం అందరూ కలిసి హోండా కారులో హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా రాత్రి 10.30-10.45 గంటల మధ్య నాగినేనిపల్లి వెళ్లే మార్గంలో మూల మలుపు వద్ద ఘోరం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నల్లగొండకు చెందిన స్ఫూర్తి, చాదర్‌ఘాట్‌కు చెందిన ప్రణీత, చంపాపేట ప్రగతినగర్‌కు చెందిన చైతన్యలు అక్కడికక్కడే చనిపోయారు. ఇదే ఘటనలో కుంట్లూరుకు చెందిన మనీష్ రెడ్డి, చంపాపేట్‌కు చెందిన వినీత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా వినీత్ రెడ్డి తుది శ్వాస విడవగా మనీష్ రెడ్డి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఇక మృతి చెందినవారిలో ప్రణీత వాళ్ళ అమ్మ, నాన్న అమెరికాలో ఉంటున్నట్లు తెలిసింది. చాదర్‌ఘాట్‌లోని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకుంటుంది. స్ఫూర్తిరెడ్డి స్వస్థలం నల్గొండ. చైతన్య స్వస్థలం అవంగపట్నం, నారాయణ పేట్ మండలం, మహబూబ్ నగర్, ప్రస్తుతం వీరు హైదరాబాద్ జిల్లలగూడా గాయత్రి నగర్లో ఉంటున్నారు. వినీత్ రెడ్డి స్వస్థలం కోహెడ, అబ్దుల్లా పూర్ మెట్. ఈ ఘటనలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనీష్ రెడ్డి స్వస్థలం హయత్ నగర్, కుంట్లూరు. మృతి చెందిన చైతన్య, స్ఫూర్తి, వినీత్, ప్రణీత మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం ఉదయం భువనగిరి ఏరియా ఆస్పత్రికిని విద్యార్థుల మృతదేహాలను సందర్శించి, సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. -
నలుగురు విద్యార్థుల దుర్మరణం
-
నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం
బొమ్మలరామారం(ఆలేరు): కారు అదుపుతప్పి బోల్తాకొట్టడంతో నలుగురు ఇంజనీరింగ్ విద్యా ర్థులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీ హిం దూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 16మంది విద్యార్థులు మండల కేంద్రంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో రాత్రి పొద్దుపోయే వరకు వేడుక నిర్వహించుకున్నాడు. అక్కడే మద్యం కూడా సేవించారు. అనంతరం వారిలో ఐదుగురు విద్యార్థులు (సుమారు 22, 23 సంవత్సరాల వయసు కలిగిన) హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌కు చెందిన ప్రణీత, కొత్తపేటకు చెందిన స్ఫూర్తి, మీర్‌పేటకు చెందిన చైతన్య, కుంట్లూరుకు చెందిన మనీష్‌రెడ్డి, వినీత్రెడ్డిలు కలిసి కారులో మండలంలోని నాగినేనిపల్లి వైపు వస్తున్నారు. ఈ క్రమంలో మితిమీరిన వేగం, ఆపై మద్యం సేవించి ఉండడం, మూలమలుపు ఉండడంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణీత, స్ఫూర్తి, చైతన్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా వినీత్ రెడ్డి మరణించాడు. తీవ్రంగా గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలాన్ని భువనగిరి సీఐ సురేందర్‌రెడ్డి సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక క్షతగాత్రుడిని హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. -
మధు మృతిపై ముమ్మర విచారణ
రాయచూరు రూరల్: ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ (23) అనుమానస్పద మృతి కేసు దర్యాప్తునకు సీఐడీ అధికారుల బృందంతో పాటు ఫోరెన్సిక్ బృందం రాయచూరులో పర్యటించింది. సోమవారం సాయంత్రం సీఐడీ ఎస్పీ శరణప్ప, డీఎస్పీ రవి శంకర్, సీఐ దిలీప్ కుమార్, నలుగురు అధికారులతో కూడిన బృందం రాయచూరుకు వచ్చింది. మంగళవారం ఎఫ్ఎస్ఎల్ బృందం విచ్చేసింది. నగరంలో మాణిక్ ప్రభు దేవాలయం వెనుక ఉన్న సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. మధును హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పూర్తి విచారణ చేస్తున్నారు. ఆమె సూసైడ్ నోట్‌గా చెబుతున్న లేఖను పోలీసుల నుంచి తీసుకున్నారు. తమ కూతురిని హత్యేనని తల్లిదండ్రులు రేçణుక, నాగరాజ్‌లు అధికారులకు తెలిపారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకొనే వ్యక్తి కాదని అన్నారు. అంతటా సంతాపాలు మధు మృతి పట్ల రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా మధుకు న్యాయం చేయాలని కోరుతూ సంతాప సూచనలు, ప్లకార్డుల ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాగల్‌కోట, మస్కి, బెంగళూరు, మలేషియాలో ఉంటున్న పలువురు మధు మద్దతుదారులు కొవ్వొత్తులు వెలిగించి సంతాపం ప్రకటించారు. -
రాయచూరులో మరో నిర్భయ ఘటన?
సాక్షి, రాయచూరు: ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవితను అందుకుంటుందని ఆశించిన ముద్దుల కూతురు అనాథ శవమవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ప్రేమపేరుతో వెంటాడి వేధించిన ఓ యువకుడే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మధుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. నగరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యార్థిని మధు పత్తార్ (23) అనుమానాస్పద మృతి కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మరో నిర్భయ ఘోరాన్ని తలపించే ఈ విషాదంపై సినీ, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తుండడం, తల్లిదండ్రులు తమ బిడ్డది ముమ్మాటికి హత్యేనని చెబుతుండడంతో చర్చనీయాంశమైంది. ఏం జరిగింది వివరాలు.. మధు పత్తార్ రాయచూరు నగరంలో ఐడీఎస్ఎంపీ లేఔట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె తండ్రి నాగరాజు పత్తార్ స్వర్ణకారుడు, తల్లి రేణుక గృహిణి. నగరంలోని నవోదయ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. నిత్యం కాలేజీకి వచ్చి వెళ్లేది. ఈ నెల 13న ఇంటర్నల్ పరీక్షలకు వెళ్లిన అమ్మాయి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. మొబైల్‌కు ఫోన్ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అదేరోజు సాయంత్రం మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లి బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఎక్కడికీ పోదు, వస్తుందిలే అని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు తప్ప కేసు నమోదు చేసుకుని గాలించలేదు. మూడురోజులు గడిచిపోయాయి. 16వ తేదీన నగరంలోని మాణిక్ ప్రభు దేవాలయం వెనుకభాగంలో నిర్మానుష్యంగా వున్న గుట్టలపై యువతి శవం కనిపించింది. పోలీసులు ఆరా తీయగా అది మధు పత్తార్దేనని తల్లిదండ్రులు, స్నేహితులు గుర్తించారు. పలు అనుమానాలు ‘నేను ఇంజనీరింగ్ కోర్సులో పలు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. నా మరణానికి నేనే బాధ్యురాలిని’ అని ఉత్తరం మృతదేహం దగ్గర దొరికిందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఎండిపోయిన చెట్టుకు ఉరి వేసుకోవడానికి ఆస్కారం లేదు. ఆమె కూర్చున్న స్థితిలో ఉరివేసుకుని ఉంది. ఇది ఎలా సాధ్యమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సూసైడ్ నోట్ కన్నడలో రాసి ఉంది. తమ కూతురికి కన్నడ రాయడం అంతగా రాదని, హంతకుడే ఆ లేఖను రాసి ఆమెతో సంతకం చేయించి ఉంటాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆత్మహత్య కాదు హత్యే.. న్యాయం చేయాలి: మధు తల్లి మొర అనుమానాస్పద రీతిలో మరణించిన తమ కూతురు, విద్యార్థిని మధు పత్తార్ విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలని తల్లి రేణుక కోరారు. శనివారం ఇక్కడ పాత్రికేయల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన కూతురుని చిత్రహింసలకు గురిచేసి, హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన హంతకులకు కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ నెల 25వ తేదీన నగరంలో విద్యార్థులు, ప్రజలు, సంఘ సంస్థల సహకారంతో భారీ ఆందోళన నిర్వహిస్తామని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు. మధు తండ్రి నాగరాజు, విశ్వకర్మ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అతనిపైనే సందేహాలు సుదర్శన్ యాదవ్ అనే యువకుడు ఐదు నెలల నుంచి ప్రేమపేరుతో మధు పత్తార్‌ను వెంబడిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడని ఒత్తిడి చేసేవాడు. మధు అంగీకరించకపోవడంతో తనకు దక్కని ఆమె ఇంకొకరికి దక్కరాదని కక్ష పెంచుకున్నాడు. అర్జంటుగా మాట్లాడాలనే నెపంతో గుట్టలపైకి పిలుచుకెళ్లి చంపి చెట్టుకు వేలాడ దీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రలు, సంఘ సంస్థల నాయకులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక రావాలి 13వ తేదీనే మధు విగతజీవిగా మారింది. 16న మృతదేహం బయటపడింది. ఎండలకు మృతదేహం కమిలిపోయి గుర్తుపట్టలేనంతగా మాడిపోయింది. నేతాజి నగర్ పోలీసులు కేసు నమెదు చేసుకున్నారు. ఇది హత్యేనని, హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, నిందితుడు సుదర్శన్ యాదవ్ ఇప్పటికే పోలీసులకు లొంగిపోయాడని, అతన్ని విచారిస్తున్నారని తెలిసింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే హత్య, ఆత్మహత్యనా? అనేది చెప్పగలమని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. -
ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యం
దూద్‌బౌలి: ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై రాము నాయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పురానాపూల్ మూసా ఖాద్రీ దర్గా ప్రాంతానికి చెందిన లింగం గౌడ్ కుమార్తె సాయి మేఘన (19) నగరంలోని కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 16న లింగంగౌడ్ కుమార్తెను బైక్‌పై అఫ్జల్‌గంజ్ బస్టాండ్ వదిలి వచ్చాడు. అయితే సాయంత్రం ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది.దీంతో తన కూతురు కనిపించడం లేదని హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
దరఖాస్తు చేయకుండానే ముంబైకర్‌కు రూ.1.2 కోట్ల వేతనం
ముంబై: ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ల్లో చదివి ప్రఖ్యాత సంస్థల్లో రూ.కోట్ల వేతనాల కొలువులు పొందడం చూశాం. కానీ, అబ్దుల్లా ఖాన్(21) విషయం వేరు. ముంబైకి చెందిన ఈ ఇంజినీరింగ్ విద్యార్థి ఏడాదికి రూ.1.2 కోట్ల వేతనంతో గూగుల్ సంస్థలో ఉద్యోగంలో చేరబోతున్నాడు..! ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయకుండానే ఈ ఘనత సాధించాడు. అదెలా? సౌదీ అరేబియాలో పాఠశాల విద్య పూర్తి చేసుకున్న అబ్దుల్లా ఖాన్ ముంబైకి వచ్చి ఐఐటీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ముంబై మీరా రోడ్డులో ఉన్న శ్రీ ఎల్ఆర్ తివారీ ఇంజినీరింగ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. కంప్యూటర్ కోడింగ్ అంటే ఇష్టపడే అబ్దుల్లా.. ఉద్యోగం కోసమని కాకుండా, యథాలాపంగా గూగుల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పోటీల్లో పాల్గొనేందుకు తన ప్రొఫైల్ ఉంచాడు. దీనిని చూసి ఇంప్రెస్ అయిన గూగుల్ అధికారులు ఇంటర్వ్యూకు రమ్మంటూ మెయిల్ పంపారు. మొదట్లో దీనిని అబ్దుల్లా నమ్మలేదు. ఇలాంటి మెయిల్ తన స్నేహితుడి పరిచయస్తునికి కూడా రావడంతో వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం పలు విడతలుగా జరిగిన ఇంటర్వ్యూల్లో అబ్దుల్లా విజేతగా నిలిచాడు. దీంతోపాటు మార్చి మొదటి వారంలో లండన్‌లో జరిగిన ఫైనల్ స్క్రీనింగ్ టెస్ట్‌లోనూ పాసయ్యాడు. దీంతో, సెప్టెంబర్‌లో లండన్‌లోని గూగుల్ కార్యాలయంలో ‘రిలయబిలిటీ ఇంజినీరింగ్ టీం’ సభ్యునిగా ఉద్యోగంలో జాయిన్ కావాలంటూ గూగుల్ నుంచి అబ్దుల్లాకు పిలుపొచ్చింది. ఏడాది వేతనం రూ.54.5 లక్షలు కాగా కంపెనీ బోనస్‌లో 15 శాతం, నాలుగేళ్లకు కలిపి రూ.58.9 లక్షల విలువైన కంపెనీ షేర్లు అతడికి అందుతాయి. ఇవన్నీ కలిపితే ఏడాదికి అతడికి అందే మొత్తం సుమారు రూ.1.2 కోట్లు అవుతుంది. రూ.2 కోట్ల స్కాలర్షిప్ అమెరికాలోని ప్రఖ్యాత బోస్టన్ యూనివర్సిటీలో చదివేందుకు నోయిడాకు చెందిన ఆర్నవ్ మిశ్రా అనే విద్యార్థి ఎంపికయ్యాడు. బోస్టన్ వర్సిటీ ట్రస్టీ స్కాలర్‌షిప్‌పై చదివేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 20 మందిలో భారత్‌కు చెందిన ఏకైక విద్యార్థి మిశ్రా కావడం గమనార్హం. ట్రస్టీ స్కాలర్ షిప్ ఎంపిక పరీక్షలో 1,600 మార్కులకు గాను 1,500 మార్కులు, యూనివర్సిటీ స్కాలర్ షిప్ ఎంపిక పరీక్షలో 99 శాతం మార్కులు మిశ్రా సాధించాడు. దీంతో అతడు నాలుగేళ్లకు కలిపి దాదాపు రూ.2 కోట్ల మేర ఉపకార వేతనానికి ఎంపికయ్యాడు. -
ఇంటర్వ్యూకు వెళుతుండగా..
వారు ఇంజినీరింగ్‌విద్యార్థులు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు. వాటిని సాకారం చేసుకునే పనిలో పడ్డారు. కాకినాడలో జరుగుతున్న ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు పయనమయ్యారు. అయితే గమ్యం చేరకుండానే మృత్యువు వారి ఆశలను చిదిమేసింది. లారీ రూపంలో వారిని కబళించింది. తూర్పుగోదావరి, సామర్లకోట (పెద్దాపురం): సామర్లకోట కెనాల్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీబీఏ చదువుతున్న విద్యార్థులు కాకినాడ వెళుతుండగా.. స్థానిక సుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ సమీపంలో సామర్లకోట నుంచి బిక్కవోలు వైపు వెళుతున్న ఎరువుల లోడ్ లారీ ఎదురుగా వీరి మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో బీబీఏ చదువుతున్న ఎస్కే రభానీ(22) షేక్ అనీఫ్(22) అక్కడికక్కడే మృతి చెందారు. మోటారు సైకిల్‌ను ఢీ కొన్న లారీ అదుపు తప్పి గోదావరి కాలువలో బోల్తా పడింది. లారీలో ఉన్న డ్రైవరు, క్లీనర్లు పరారయ్యారు. కాకినాడలో ఇంటర్వ్యూకు హాజరు కావడానికి వెళుతూ ఈ ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. మృతి చెందిన విద్యార్థుల వద్ద ఉన్న బ్యాగులలోని ఐడీ కార్డుల ద్వారా వారు ఏలేరు ఆదిత్య కళాశాలలో చదువుతున్నట్టు గుర్తించారు. కెనాల్ రోడ్డు ఇరుకుగా ఉండడంతో పాటు చెరకు క్రషింగ్ కోసం వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎస్సై ఎల్. శ్రీనివాసు నాయక్ సంఘటన ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించి, కళాశాల యాజమాన్యం, మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులకు హెల్మెట్ లేకపోవడం వల్లే తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు. మృతుల తల్లిదండ్రులు, బందువులు, స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని పోలీసుల నుంచి వివరాలు తెలుసుకొని వారివారి కుమారుల మృతదేహాలను చూసి బోరున విలపించారు. మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం
ఇబ్రహీంపట్నం: ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై నేపాల్ దేశానికి చెందిన సహచర విద్యార్థి అత్యాచారం చేశాడు. అనంతరం అసభ్యకరమైన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈమేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో జరిగింది. గురువారం సీఐ గురుశారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. నిజమాబాద్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని ఇబ్రహీంపట్నంలోని ఎస్టీ హాస్టల్లో ఉంటూ స్థానిక గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. సహచ విద్యార్థి అయిన నేపాల్ దేశానికి చెందిన ఆరిఫ్‌అన్సారీ(22) ఆమెతో స్నేహిం చేశాడు. విద్యార్థినిని నమ్మించి ఇబ్రహీంపట్నంలోని తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం విద్యార్థికి సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు ఈనెల 10 ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు నిందితుడిపై ఎస్సీఎస్టీ అట్రాసిటి, ఆత్యాచారం కేసులను నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించారు. -
ఇంజనీరింగ్ విద్యార్థినిపై వికృత చేష్ట..
సాక్షి, చెన్నై : ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్లో దారుణం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్ధినిపై జరిగిన లైంగిక వేధింపుల పట్ల వర్సిటీ అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని పేర్కొంటూ గురువారం రాత్రి విద్యార్ధులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. బాధిత విద్యార్ధిని ఫిర్యాదుపై అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై విద్యార్ధులు భగ్గుమన్నారు. వర్సిటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని గురువారం మధ్యాహ్నం హాస్టల్ లిఫ్ట్‌లో వెళుతుండగా, లిఫ్ట్‌లోనే ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు జననాంగం చూపుతూ ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా హాస్టల్ వార్డెన్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించేందుకు మూడు గంటలు జాప్యం చేశారన్నారు. నిందితుడిని గుర్తించినా పోలీసులకు ఫిర్యాదు చేయడంలో తాత్సారం చేశారని మండిపడ్డారు. బాధిత విద్యార్థిని జరిగన ఘటనపై మౌనంగా ఉండాలని వర్సిటీ అధికారులు ఒత్తిడి తెచ్చారని విద్యార్ధులు చెబుతున్నారు. విద్యార్థిని ఫిర్యాదుపై వర్సిటీ యంత్రాంగం చర్యలు చేపడుతుందని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీసీ సందీప్ సంచేటి తెలిపారు. మరోవైపు వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొనడం గమనార్హం. -
‘సైకిల్’తో అమెరికాకు!
కలలు కనండి..వాటిని సాకారం చేసుకోండి అన్న ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూక్తిని అందిపుచ్చుకున్నాడు ఓ ఇంజినీరింగ్ విద్యార్థి. సామాన్యుల కోసం ఏదైనా చేయాలనే అతడి ఆలోచన విద్యుత్, పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా నడిచే ఆటోమేటిక్ చార్జి సైకిల్ రూపకల్పనకు దోహదం చేసింది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడిచే సైకిల్ తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. బోస్టన్ యూనివర్శిటీ ఆహ్వానం మేరకు తన ప్రతిభను ప్రదర్శించేందుకు అమెరికా పయనమయ్యాడు. అతడే తోట్లవల్లూరు గ్రామానికి చెందిన కంభంపాటి నాగశ్రీపవన్. కృష్ణా జిల్లా/ తోట్లవల్లూరు: తోట్లవల్లూరు గ్రామానికి చెందిన కంభంపాటి రమేష్‌బాబు, నాగవెంకట హనుమలత దంపతుల కుమారుడు కంభంపాటి నాగశ్రీపవన్. కంచికచర్ల సమీపంలోని దేవినేని వెంకటరమణ, హిమశేఖర్ మిక్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మెకానికల్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఏపీ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తున్నాడు. తనకు వచ్చిన వినూత్న ఆలోచనతో పేదలు, సామాన్యుల కోసం ఖర్చు లేకుండా ప్రయాణించే ఆటోమేటిక్ చార్జి సైకిల్‌ను రూపొందించాడు. కళాశాల మెకానికల్ యాజమాన్యం, అధ్యాపక బృందం, ఏపీ స్కిల్ డవలప్మెంట్ సహకారంతో సైకిల్‌ను రూపొందించినట్లు నాగశ్రీపవన్ తెలియజేశాడు. అమెరికా పయనం.. ఏపీ స్కిల్ డవలప్మెంట్ ద్వారా నాగశ్రీపవన్‌కు అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. అతను రూపొందించిన ఆటోమేటిక్ చార్జి సైకిల్ గురించి వివరించటానికి ఈ నెల 4 నుంచి 16వ తేదీ మధ్యలో సైకిల్‌తో సహా రావాలని యూనివర్సిటీ కోరింది. దీంతో పవన్ శనివారం సాయంత్రం కుటుంబసభ్యులు, బంధువుల వీడ్కోలు నడుమ అమెరికా పయనమయ్యాడు. తమ గ్రామానికి చెందిన యువకుడు ఓ ప్రత్యేక పరికరం తయారు చేయటం, దానిని ప్రదర్శించేందుకు అమెరికా వెళుతుండటంపై గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల సైకిల్ రైతులు, పేదల కోసం ఏదో ఒకటి రూపొందించాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఆటోమేటిక్ చార్జి సైకిల్. దీని తయారీకి రూ.20 వేల వరకు వ్యయమవుతుంది. గంటకు 25 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. పెట్రోల్, డీజిల్, విద్యుత్ అవసరం లేదు. సైకిల్ నడుస్తుండగానే చార్జి అవుతూ ప్రయాణిస్తుంది. 150 కేజీల వరకు బరువు మోయగలిగే సామర్థ్యంతో దీనిని మరింత అధునాతంగా రూపకల్పన చేసేందుకు కృషి చేస్తున్నాను. సైకిల్ రూపకల్పనకు సహకరించిన మిక్ కళాశాల ప్రిన్సిపాల్ సుధీర్‌బాబు, మెకానికల్ హెచ్‌వోడీ, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు. –కంభంపాటి నాగశ్రీపవన్, ఇంజినీరింగ్ విద్యార్థి, తోట్లవల్లూరు