బీటెక్ విద్యార్థిని బలవన్మరణం | btech student commit to sucide | Sakshi
Sakshi News home page

బీటెక్ విద్యార్థిని బలవన్మరణం

Published Sat, Jul 9 2016 4:17 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM

బీటెక్ విద్యార్థిని బలవన్మరణం

బీటెక్ విద్యార్థిని బలవన్మరణం

నిజామాబాద్ క్రైం : ఇంజినీరింగ్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి దారి తీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. పేట్‌బషీరాబాద్ ఎస్సై కోటేశ్వరరావు కథనం ప్రకారం... నిజామాబాద్ టౌన్‌కు చెందిన సత్యనారాయణగౌడ్, కవిత దంపతులు సుచిత్ర సమీపంలోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. చిన్న కుమార్తె భార్గవి (21) ఇంజినీరింగ్ చదువుతోంది. అమెరికా వెళ్లేందుకు వీసా కూడా తీసుకుంది. రెండవ కుమార్తె అమెరికాలో ఉండటంతో సత్యనారాయణ దంపతులు ఇటీవలే అక్కడికి వెళ్లారు.

దీంతో భార్గవికి, ఆమె చిన్నాన్న కుమారుడు జ్ఞానేశ్వర్ తోడుగా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం జ్ఞానేశ్వర్ బయటకు వెళ్లి కొద్దిసేపటికి తిరిగి వచ్చి తలుపు తట్టాడు. ఎంతకూ తెరవకపోవడంతో చుట్టు పక్కల వారి సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. త లుపులు పగులగొట్టి చూడగా భార్గవి ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందికి దించి స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా... వారు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైనట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement