తనువు చాలించిన భావిఇంజినీర్
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. ఉన్నత చదువులు చదివి వృద్ధిలోకి వస్తాడన్న కుమారుడు ఇక లేడని తలుచుకుని కన్నవారు కుళ్లి కుళ్లి ఏడ్చడం అక్కడివారిని కలిచివేసింది. ఆదివారం రాత్రి రైలు కింద పడి భావి ఇంజినీర్ ఆత్మహత్య పాల్పడిన సంఘటన మండలంలోని తొండుపల్లి శివారులో చోటు చేసుకుంది.
శంషాబాద్ రూరల్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన జీ శ్రీనివాస్ స్థానికంగా హార్డ్‌వేర్ దుకాణం నడుపుతూ ఇద్దరు కుమారుల ను చదివిస్తున్నాడు. పెద్ద కుమారుడు రణధీర్ నగరంలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుం డగా.. రెండో కుమారుడు రిశ్వంత్ (18) కాచారంలో ఉన్న వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాల లో బీటెక్ (ఈసీఈ) మొదటి సంవత్సరం చ దువుతున్నాడు. కాగా.. కళాశాల హాస్టల్ ఉంటున్న రిశ్వంత్ ఏప్రిల్ 27న సొంతూరికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం తండ్రి శ్రీని వాస్ కుమారుడిని కళాశాలకు వెళ్లేందుకు రైలు ఎక్కించాడు. గంటన్నర తర్వాత కుటుంబ సభ్యులు రిశ్వంత్ సెల్‌కు ఫోన్ చేయగా రాత్రి 8 గంటల వరకు రింగ్ అయి తర్వాత స్విచ్‌ఆఫ్ అయింది. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు.
రైలు పట్టాలపై శవమై..
ఉందానగర్ (శంషాబాద్) - తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య తొండుపల్లి శివారులో ఔటర్ రింగు రోడ్డు వంతెన కింద రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం పడి ఉన్నట్లు శంషాబాద్ పోలీసులకు ఆదివారం అర్ధరాత్రి సమాచారం అందింది. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే సంఘటన జరిగిన ప్రాంతం రైల్వే పోలీసుల పరిధి కావడంతో వారు కాచిగూడ రైల్వే పోలీసులకు స మాచారం అందించారు. అయితే కొడుకు కనపడలేదంటూ పోలీస్‌స్టేషన్ కు వచ్చిన శ్రీనివాస్‌కు.. శంషాబాద్ పోలీసులు విషయాన్ని చెప్పి అక్కడికి తీసుకెళ్లడంతో మృతదేహం తన కుమారుడిదేనని గుర్తించాడు. కాగా.. రిశ్వంత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి కుటుం బ సభ్యులు, తోటి విద్యార్థులు వచ్చి అతడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. కళాశాల డెరైక్టర్ ప్రభాకర్‌రెడ్డి మృతుడి తల్లిదండ్రులను ఓదార్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.